నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర చేసింది. గడచిన 24 గంటల్లో నేపాల్‌లోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, వరదలు, పిడుగుపాటు ఘటనల కారణంగా 14 మంది మృతిచెందారు.
నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఆర్‌ఎంఏ) తెలిపిన వివరాల ప్రకారం కొండచరియలు విరిగిపడటం వల్ల ఎనిమిది మంది, పిడుగుపాటు కారణంగా ఐదుగురు, వరదల కారణంగా ఒకరు మృతిచెందారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారని, వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదని ఎన్‌డీఆర్‌ఎంఎ అధికార ప్రతినిధి దిజన్ భట్టారాయ్ తెలిపారు.
నేపాల్ హోం మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో రుతుపవనాలు చురుకుగా మారినప్పటి నుండి అంటే గత 17 రోజుల్లో సంభవించిన పలు విపత్తుల కారణంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదలకు 33 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర చేసింది. గడచిన 24 గంటల్లో నేపాల్‌లోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, వరదలు, పిడుగుపాటు ఘటనల కారణంగా 14 మంది మృతిచెందారు.
నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఆర్‌ఎంఏ) తెలిపిన వివరాల ప్రకారం కొండచరియలు విరిగిపడటం వల్ల ఎనిమిది మంది, పిడుగుపాటు కారణంగా ఐదుగురు, వరదల కారణంగా ఒకరు మృతిచెందారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారని, వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదని ఎన్‌డీఆర్‌ఎంఎ అధికార ప్రతినిధి దిజన్ భట్టారాయ్ తెలిపారు.
నేపాల్ హోం మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో రుతుపవనాలు చురుకుగా మారినప్పటి నుండి అంటే గత 17 రోజుల్లో సంభవించిన పలు విపత్తుల కారణంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదలకు 33 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.