నేపాల్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నారాయణఘాట్-ముగ్‌లింగ్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రెండు బస్సులు పక్కనే ఉన్న నదిలో పడ్డాయి. దీంతో దాదాపు 65 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు.
వారిలో ఏడుగురు భారతీయులు ఉండగా.. తాజాగా ఆ ఏడుగురు భారతీయులు మరణించినట్లు తేలింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చిట్వాన్ జిల్లాలోని నారాయణ్‌ఘాట్-ముగ్లింగ్ రహదారి వెంబడి సిమల్తాల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో రెండు బస్సులు పక్కనే ఉన్న త్రిశూలి నదిలో పడిపోయాయి. 24 మంది ప్రయాణికులతో ఓ బస్సు కాఠ్మాండూ వెళుతోంది. మరో బస్సులో 41 మంది ఉన్నట్లు గుర్తించారు.
రెండు బస్సుల్లో దాదాపు 65 మంది ప్రయాణికులు ఉండగా.. వారందరూ గల్లంతయ్యారు. వారిలో ఏడుగురు భారతీయులు కూడా ఉన్నారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. అదే మార్గంలో మరోచోట కూడా బస్సుపై కొండచరియ విరిగిపడటంతో దాని డ్రైవర్ తీవ్రంగా గాయపడి మృతి చెందారు.
బస్సు ప్రమాదం, భారతీయులు మృతి, కొండచరియలు, భారీ వర్షాలు
ఈ ఘటనపై నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ విచారం వ్యక్తంచేశారు. అధికారులు వెంటనే బాధితుల గాలింపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ దేశ సాయుధ దళాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment