ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నేపాల్ అతలాకుతలమయ్యింది. గడచిన 24 గంటల్లో పశ్చిమ నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు మృతిచెందారు.
నేపాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బంగల్ మునిసిపాలిటీలో కొండచరియలు విరిగిపడటంతో ఒక ఇల్లు కొట్టుకుపోయింది. ఆ ఇంటిలో ఉంటున్న నలుగురు జల సమాధి అయ్యారు. జాజర్‌కోట్ జిల్లాలోని నల్‌గఢ్ మునిసిపాలిటీ-2లోని మజగావ్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.
ఈ హిమాలయ దేశంలో ఒక దశాబ్ద కాలంలో రుతుపవన సంబంధిత విపత్తుల కారణంగా 1,800 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయాయి. వివిధ విపత్తులలో సుమారు 400 మంది గల్లంతయ్యారు. 1,500 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment