Wreaking havoc
-
యూపీ, బీహార్లలో భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న నదులు
లక్నో/పట్నా: దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండగా, ఉత్తరప్రదేశ్, బీహార్లను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు.వాతావరణ శాఖ తాజాగా అందించిన సూచనల ప్రకారం తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, కేరళ, దక్షిణ కర్ణాటక, కోస్తా కర్ణాటకలో ఈరోజు(ఆదివారం) భారీ వర్షాలు కురియనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో సగటు కంటే అధిక వర్షపాతం నమోదైన కారణంగా, పలు నదుల నీటిమట్టం పెరిగింది. ఫలితంగా పలు జిల్లాలకు వరద ముప్పు పొంచివుంది. ఐఎండీ వెల్లడించిన గణాంకాల ప్రకారం గడచిన 24 గంటల్లో ఉత్తరప్రదేశ్‌లో 27.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏడుగురు వర్ష సంబంధిత దుర్ఘటనల్లో మృతిచెందారు. Rainfall Warning : 29th September 2024 वर्षा की चेतावनी : 29th सितंबर 2024 #rainfallwarning #IMDWeatherUpdate #stayalert #staysafe #TamilNadu #puducherry #Kerala #karnataka @moesgoi @ndmaindia @airnewsalerts @DDNewslive@KeralaSDMA @tnsdma @KarnatakaSNDMC pic.twitter.com/R5HnYKbhru— India Meteorological Department (@Indiametdept) September 28, 2024బీహార్‌లోని వాల్మీకినగర్, బీర్పూర్ బ్యారేజీల నుంచి నీటి విడుదల, కొనసాగుతున్న వర్షాల దృష్ట్యా కోసి, గండక్, గంగ నదులు ఉప్పొంగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం వరద హెచ్చరికలు జారీ చేసింది. నేపాల్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 66 మంది మృతిచెందారు. 60 మంది గాయపడ్డారు. నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దేశ విపత్తు అధికారులు ఆకస్మిక వరద హెచ్చరికలు జారీ చేశారు.ఇది కూడా చదవండి: నేడు ‘మూసీ’ పర్యటనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు -
Nepal: కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నేపాల్ అతలాకుతలమయ్యింది. గడచిన 24 గంటల్లో పశ్చిమ నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు మృతిచెందారు.నేపాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బంగల్ మునిసిపాలిటీలో కొండచరియలు విరిగిపడటంతో ఒక ఇల్లు కొట్టుకుపోయింది. ఆ ఇంటిలో ఉంటున్న నలుగురు జల సమాధి అయ్యారు. జాజర్కోట్ జిల్లాలోని నల్‌గఢ్ మునిసిపాలిటీ-2లోని మజగావ్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.ఈ హిమాలయ దేశంలో ఒక దశాబ్ద కాలంలో రుతుపవన సంబంధిత విపత్తుల కారణంగా 1,800 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయాయి. వివిధ విపత్తులలో సుమారు 400 మంది గల్లంతయ్యారు. 1,500 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. -
భారీ వర్షాలకు శ్రీలంక అతలాకుతలం.. 10 మంది మృతి
శ్రీలంకలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ వివరాలను ప్రభుత్వ అధికారులు మీడియాకు తెలియజేశారు. వరదలు, ఇతర విపత్కర ఘటనలలో 10 మంది మృతిచెందారు. మరో ఆరుగురు గల్లంతయ్యారు.భారీ వర్షాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలకూలాయి. పొలాలు నీట మునిగాయి. పలుచోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. అధికారులు ముందుజాగ్రత్త చర్యగా పలుచోట్ల విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రాజధాని కొలంబోతో పాటు రతన్‌పురా జిల్లాలో వరదల కారణంగా ఆరుగురు మృతిచెందారు. కొండచరియలు విరిడిపడటంతో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చెట్టు కూలడంతో ఒకరు మృతి చెందారు. పలు ఘటనల్లో ఆరుగురు అదృశ్యమయ్యారు.ముంపు ప్రాంతాల నుంచి ఐదువేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వివిధ ఘటనల్లో 400కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నావికాదళంతో పాటు ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలను చేపడుతున్నారు. మే మధ్య నుంచి శ్రీలంకలో వాతావరణం ప్రతికూలంగా మారింది. -
ఎండలకు చచ్చిపోతున్న చేపలు.. వ్యాపిస్తున్న దుర్వాసన!
మండుతున్న ఎండలు మన దేశాన్నే కాదు ప్రపంచంలోని పలు దేశాలను భయపెడుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు అటు జనాలను, ఇటు జీవాలను మలమలమాడిపోయేలా చేస్తున్నాయి. కరువు బారిన పడిన దక్షిణ వియత్నాంను ఈ ఎండలు మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దక్షిణ వియత్నాంలో అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు చేపలను బలి తీసుకుంటున్నాయి. 300 హెక్టార్లలో విస్తరించి ఉన్న ‘సాంగ్ మే’ చెరువులోని వేలాది చేపలు ఎండ వేడికి తాళలేక చనిపోయాయి. డాంగ్ నైలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలను దాటింది. 1998లో ఈ ప్రాంతంలో ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు రిజర్వాయర్ నిర్వహణ సంస్థ నిర్లక్ష్యం కూడా చేపలు చనిపోవడానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుత వేసవి కాలంటో 200 టన్నులకు పైగా చేపలు చనిపోయాయి. అత్యధిక ఉష్ణోగ్రత, నీటి కొరత కారణంగా ఈ చేపలు చనిపోయాయని స్థానికులు చెబుతున్నారు. చనిపోయిన చేపల వాసన గత కొన్నిరోజులుగా ఈ ప్రాంతంలో విపరీతంగా వ్యాపించడంతో ఇక్కడి జనం నానా అవస్థలు పడుతున్నారు. ఈ చనిపోయిన చేపలను చెరువులో నుంచి తొలగించే పనిలో మత్స్యకారులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక యంత్రాంగం విచారణ ప్రారంభించింది. -
బ్రెజిల్లో తుపాను బీభత్సం
రియోడిజెనెరియో: బ్రెజిల్లో తుపాను బీభత్సం సృష్టించింది. రియోడిజెనెరియో రాష్ట్రంలోని పర్వత ప్రాంతాల్లో తుపాను సృష్టించిన అల్లకల్లోలానికి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పెట్రోపోలిస్ పట్టణంలో ఓ ఇళ్లు కూలిన ఘటనలో నలుగురు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన ఒక బాలికను రెస్క్యూ సిబ్బంది కాపాడారు. అదే ప్రాంతంలో బాలిక తండ్రి మృతదేహాన్ని కనుగొన్నారు. సాంటా క్రుజ్ ద సెర్రాలో జరిగిన ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు. పెట్రోపోలిస్ నగరంలో పరిస్థితి దారుణంగా ఉందని, క్విటాదిన్హా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పాటు భారీ వర్షాలు ఆగకుండా కురుస్తున్నాయని రియోడిజెనెరియో గవర్నర్ క్యాస్టట్రో తెలిపారు. వాతావరణ మార్పుల వల్లే బబ్రెజిల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి.. పపువా న్యూ గినియాలో భూకంపం -
ఆస్ట్రేలియాలో కారు బీభత్సం
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై వేగంగా పాదచారులపైకి దూసుకెళ్లింది. ఘటనలో 19 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో కశ్మీర్‌కు చెందిన రాహుల్కౌల్ అనే భారతీయుడు గాయపడ్డారు. కారు నడిపిన వ్యక్తితో పాటు పక్కనున్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పనేనని, ఉగ్రదాడి కాదని వారు పేర్కొన్నారు. ఓ తెలుపు రంగు సుజుకీ ఎస్యూవీ కారు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిందని, అయితే రెడ్ సిగ్నల్ ఉండగానే ముందుకు దూసుకెళ్లిందని, దీంతో రోడ్డు దాటుతున్న పాదచారులు గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పాదచారులపైకి కారు దూసుకురావడంతో ఒక్కసారిగా భయానక పరిస్థితి నెలకొందని, ప్రజలు కేకలు వేస్తూ అటూఇటూ పరుగులు పెట్టారన్నారు. ప్రమాదంలో ఓ చిన్నారి తలకు తీవ్రంగా గాయమైందని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తనకు అందిస్తున్నారని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో మెల్బోర్న్లోని రద్దీగా ఉండే ఓ షాపింగ్ మాల్ వద్ద పాదచారులపైకి కారు దూసుకెళ్లి ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
ప్రకృతి ప్రకోపం
♦ జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం ♦ విరిగిన చెట్లు, కూలిన స్తంభాలు, ధ్వంసమైన ఇళ్లు గాలి వాన.. పెను బీభత్సం సృష్టించింది. జిల్లాలో పొద్దంతా పొడిపొడిగా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మేఘావృతమై భారీ గాలులతో వర్షం కురిసింది. నారాయణఖేడ్, జహీరాబాద్, జోగిపేట తదితర ప్రాంతాల్లో భారీనష్టం వాటిల్లింది. వృక్షాలు.. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఒక్క కల్హేర్ మండలంలోనే వందకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. నల్లవాగులో ఏర్పాటు చేసిన పశువుల పునరావాస షెడ్డు నేలమట్టమయ్యింది. న్యాల్కల్: మండలంలో గురువారం సాయంత్రం వీచిన భారీ గాలులకు పలు ఇళ్ల పైకప్పులు ఎరిగిపోయాయి. చెట్లు నేలకూలాయి. విద్యుత్తు స్తంభాలు విరిగిపోయాయి. తీగలు తెగిపడడంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. న్యాల్కల్, ముంగి, టేకూర్ తదితర గ్రామాల్లో భారీ గాలులు బీభత్సం సృష్టించాయి. విద్యుత్తు సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి స్తంభాలను, తీగలను సరిచేసి గ్రామాల్లో కరెంటు పునరుద్దరించారు. కంగ్టి మండలంలో భీతావాహం కంగ్టి: మండలంలోని వర్షం భీభత్సం సృష్టిం చింది. చీమల్పాడ్, వంజు తండా, గర్డేగాం, గాజుల్పాడ్ తదితర గ్రామాల్లో ఎల్టీ విద్యుత్ తీగలు, స్తంభాలు విరిగిపడ్డాయి. తడ్కల్‌లో రేకులు ఎగిరి 11 కేవీ విద్యుత్ తీగలపై పడ్డాయి. పిడుగుపాటుకు ఎద్దు మృతి కంగ్టి: తడ్కల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఘన్పూర్ చెరువులో పిడుగుపాటుకు ఎద్దు మృతి చెందింది. గురువారం సాయంత్రం ఈదురు గాలులు, వర్షంతో పాటు పిడుగు పడింది. అదే సమయంలో చెరువులో నీళ్లు తాగేందుకు వెళ్లిన ఎద్దు మృతిచెందిందని యాజమానురాలు దమ్మని నాగమ్మ తెలిపింది. ఎద్దు విలువ రూ.50 వేలు ఉంటుందని, ఆదుకోవాలని విజ్తప్తి చేసింది. విరిగిన విద్యుత్తు స్తంభాలు రేగోడ్: రేగోడ్, సిందోల్, తాటిపల్లి, కొత్వాన్‌పల్లి, ప్యారారం, చౌదర్పల్లి, కొండాపురం, జగిర్యాల, ఆర్.ఇటిక్యాల, దుద్యాల, పలు తండాలు, గ్రామాల్లో పలు ఇళ్ల పైరేకులు ఎగిరిపోయాయి. చెట్లు విరిగి నేలపై పడ్డాయి. మామిడి తోటలకు తీవ్రనష్టం జహీరాబాద్ టౌన్: ఈదురు గాలులకు జహీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లోని మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి కాయలు నేలరాలాయి. ఈ సంవత్సరం తక్కువగా ఉన్న మామిడి కాపు రాలిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. రాంనగర్, భరత్‌నగర్, పస్తాపూర్, దిడ్గి, కోత్తూర్. బూచినెల్లి, రంజోల్ గ్రామాల్లోని ఇంటి పైకప్పులు ఎగిరిపడ్డాయి. 100 పైగా ఇళ్లు ధ్వంసం కల్హేర్: కల్హేర్ మండలం సిర్గాపూర్, నల్లవాగు, అంతర్గాం, బోక్కస్‌గాం, గోసాయిపల్లి తదితర చోట్ల గురువారం సాయంత్రం గాలివాన భీభత్సం సృష్టించింది. బలమైన గాలులు వీయడంతో దాదాపు 100కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. సిర్గాపూర్‌లో సోలార్ విద్యుత్ ప్లాంట్ కు సంబందించిన ప్లేట్లు ఎగిరిపోయాయి. నల్లవాగులో ఏర్పాటు చేసిన పశువుల పునరావస కేంద్రం షెడ్లు కూలిపోయాయి. -
కుక్కల బీభత్సం
గాఢనిద్రలో ఉండగా దాడి పలువురికి తీవ్ర గాయాలు గండేపల్లి : గాఢ నిద్రలో ఉండగా వీధి కుక్కలు పలువురిపై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచాయి. కుక్కల బీభత్సం సృష్టించడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యా రు. మండలంలోని రామయ్యపాలెం, ఎన్టీ రాజాపురం, సింగరమ్మపాలెం, ఉప్పలపా డు గ్రామాల్లో ఆదివారంరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జనంపై కుక్కలు విరుచుకుపడ్డాయి. గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. గాదరాడకు చెందిన అల్లంకి రమేష్ రామయ్యపాలెం బంధువుల ఇంటికి వచ్చాడు. సోమవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లి, తిరిగొస్తుండగా వీధి కుక్క దాడి చేసింది. పిక్కను పట్టుకోవడంతో రమేష్ పెట్టిన కేకలకు స్థానికులు అక్కడకు చేరుకుని, కుక్కను తరిమారు. అర్థరాత్రి సమయంలో ఇదే గ్రామానికి చెందిన కర్రి శివరామకృష్ణ గాఢ నిద్రలో ఉండగా, అతడి కాలిని కుక్క పట్టుకుంది. విదిలించుకునేందుకు ప్రయత్నించగా.. కుడిచేతి మండపై తీవ్రంగా గాయపరిచింది. తెల్లవారుజామున ఇంటి వాకలి తుడుస్తున్న దాసరి నూకాలమ్మ కుడిచేతిపై కుక్క గట్టిగా కరిచింది. చిన్నారులపైనా.. ఎనిమిదేళ్ల ముక్కా దేవిశ్రీప్రసాద్ ఎడమ కాలితొడ భాగంలోను కుక్క గాయపరిచింది. అయ్యప్ప మాల ధరించిన తొమ్మిదేళ్ల కాపుశెట్టి అశోక్‌కుమార్ సోమవారం తెల్లవారుజామున స్నానానికి వెళుతుండగా కుక్కలు దాడికి తెగబడ్డాయి. అతడిపై విరుచుకుపడిన కుక్కలను గ్రా మస్తులు తరిమివేయడంతో బాలుడి ప్రా ణాలు దక్కాయని తండ్రి శ్రీను తెలి పాడు. అలాగే ఎన్టీ రాజాపురం గ్రామం లో ఇంటిలోంచి బయటకు వస్తున్న బక్కా లక్ష్మిని గుమ్మం వద్దే కూర్చొని ఉన్న కుక్క గాయపరిచింది. దుప్పటి లాగి మరీ దాడి అదే గ్రామానికి చెందిన సప్పిడి వీరాస్వామిని నిద్రలో ఉండగా, కుక్క దుప్పటిలాగి మరీ దాడి చేసిందని బాధితుడు పేర్కొన్నా డు. తణుకు పెదవీర్రాజును జగ్గంపేటలో ప్రైవేటు ఆస్పత్రి వద్ద వీధి కుక్క దాడి చే సింది. సింరంపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో నాలుగేళ్ల శంకుమల్ల శ్యామ్‌కుమార్, నగిరిపాటి శివాజీని పెంపుడు కుక్కలు కరవడంతో గాయపడ్డారు. వీరు చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. వీరికి ప్రాథమికచికిత్స చేసి, రాజమండ్రి జీజీహెచ్‌కు పంపించారు. -
బీహార్‌లో బీభత్సం