యూపీ, బీహార్‌లలో భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న నదులు | Rain Wreaks Havoc in UP Bihar | Sakshi
Sakshi News home page

యూపీ, బీహార్‌లలో భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న నదులు

Published Sun, Sep 29 2024 6:54 AM | Last Updated on Sun, Sep 29 2024 6:54 AM

Rain Wreaks Havoc in UP Bihar

లక్నో/పట్నా: దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండగా, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రజలు  పలు ఇబ్బందులకు  గురవుతున్నారు.

వాతావరణ శాఖ తాజాగా అందించిన సూచనల ప్రకారం తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, కేరళ, దక్షిణ కర్ణాటక, కోస్తా కర్ణాటకలో ఈరోజు(ఆదివారం) భారీ వర్షాలు కురియనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో సగటు కంటే  అధిక వర్షపాతం నమోదైన కారణంగా, పలు నదుల నీటిమట్టం పెరిగింది. ఫలితంగా పలు జిల్లాలకు వరద ముప్పు పొంచివుంది.  ఐఎండీ వెల్లడించిన గణాంకాల ప్రకారం గడచిన 24 గంటల్లో ఉత్తరప్రదేశ్‌లో 27.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏడుగురు వర్ష సంబంధిత దుర్ఘటనల్లో మృతిచెందారు.
 

బీహార్‌లోని వాల్మీకినగర్, బీర్‌పూర్ బ్యారేజీల నుంచి నీటి విడుదల, కొనసాగుతున్న వర్షాల దృష్ట్యా కోసి, గండక్, గంగ నదులు ఉప్పొంగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం వరద హెచ్చరికలు జారీ చేసింది. నేపాల్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 66 మంది మృతిచెందారు. 60 మంది గాయపడ్డారు. నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దేశ విపత్తు అధికారులు ఆకస్మిక వరద హెచ్చరికలు జారీ చేశారు.

ఇది కూడా చదవండి: నేడు ‘మూసీ’ పర్యటనకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement