
వైరల్
వానలో తడవాలని పిల్లలకు ఉంటుంది. జల్లుల్లో వాళ్లు కేరింతలు కొడితే ముద్దొస్తారు. మరి పిడుగుకు ముద్దొస్తే? తృటిలో ప్రాణాలు తప్పిపోయాయి. వానలో పిల్లలు జాగ్రత్త.
బిహార్‌లోని సీతామర్హిలో ఒకమ్మాయి వానలో టెర్రస్ మీద సరదాగా కేరింతలు కొడుకుతుంటే తల్లి అది ఫోన్‌లో వీడియో తీయసాగింది. మనం అనుకుంటాం వాతావరణం ఆహ్లాదంగా ఉందని. కాని మెరుపులు, పిడుగులు ఎలా మెరిసి ఉరుముతాయో తెలియదు కదా. ఇక్కడ ఆ అమ్మాయికి కొద్ది దూరంలోనే పిడుగు పడింది. క్షణాల్లో ఆ అమ్మాయి లోపలికి పరిగెత్తింది. అమ్మాయి, తల్లి క్షేమమేగాని గురి సూటిగా ఉండి ఉంటే? అందుకే జాగ్రత్త. ఇకపై వానలు... ఉరుములు... పిడుగులు..
Comments
Please login to add a commentAdd a comment