నేడు ఉరుములతో భారీ వర్షం | Today is heavy rain with thunder | Sakshi
Sakshi News home page

నేడు ఉరుములతో భారీ వర్షం

Published Thu, Oct 12 2017 3:51 AM | Last Updated on Tue, Sep 4 2018 5:02 PM

Today is heavy rain with thunder - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గురువారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గత 24 గంటల్లో మాగ్నూరులో అధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

భీమదేవరపల్లిలో 8 సెంటీమీటర్లు, లక్సెట్టిపేటలో 7, మక్తల్, సంగారెడ్డిలలో 5, ధర్మపురి, నారాయణఖేడ్, పెద్దేముల్, ధర్‌పల్లి, హుజూరా బాద్‌లలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement