
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నివాసంలో విషాదం అలుముకుంది. అంబానీ చిన్న కుమారుడు, అనంత్ అంబానీ (Anant Ambani)కి ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్క, హ్యాపీ ఇక లేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది. అనంత్ అంబానీ తోపాటు కుటుంబ సభ్యులు తమ కుక్కకు భావోద్వేగ నివాళులర్పించారు.
ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లోని పోస్టు ప్రకారం అనంత్ అంబానీ పెంపుడు కుక్క ‘హ్యాపీ’ ఏప్రిల్ 30, బుధవారం కన్నుమూసింది. ‘హ్యాపీ’ మృతితో అంబానీ కుటుంబ సభ్యులు భావోద్వేగంతో నివాళులర్పించారు. అంబానీ అప్‌డేట్ పేజ్ కూడా ‘ఆర్‌ఐపీ హ్యాపీ’ అంటూ ఒక వీడియోను పోస్ట్ చేసింది.
ప్రియమైన హ్యాపీ జ్ఞాపకార్థం, మా ప్రియమైన డాగ్ హ్యాపీ మరణించిన విషాదాన్ని బరువైన హృదయంతో ఈ వార్తను పంచుకుంటున్నాం. పెట్ కంటే ఎక్కువగా, కుటుంబంలో మనిషి. చాలా విశ్వాసమైన నమ్మకమైన సహచరుడు, హ్యాపీ మా జీవితాల్లోకి తెచ్చిన ఆనందాన్ని ఎప్పటికీ మరచిపోలేము. హ్యాపీ జ్ఞాపకాలు ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచి ఉంటాయి. మిస్‌యూ’’ అంటూ అంబానీ కుటుంబం తమ ప్రియమైన నేస్తానికి వీడ్కోలు పలికింది.
హ్యాపీ మరణంపై నటుడు వీర్ పహారియా కూడా విచారం ప్రకటించారు. హ్యాపీ జ్ఞాపకార్థం అంబానీ కుటుంబం ఒక స్మారక ఫోటోను పోస్ట్ చేశాడు. కుటుంబంలో అత్యంత ప్రియమైన సభ్యులలో ఒకరిగా పరిగణించబడే ఆ కుక్కకు తమ హృదయ పూర్వక నివాళి అర్పించారన్నాడు. అనంత్ అంబానీకి ఈ పెంపుడు కుక్క అంటే ఎంతో ఇష్టం. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం వేడుకల్లో హ్యాపీ ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది. ఫోటోలకు ఫోజులిస్తూ హ్యాపీ చేసిన సందడికి సంబంధించిన ఫోటోలు నెట్టింట బాగా ఆకట్టు కున్నాయి.