ప్రముఖ డిజైనర్‌ మృతి.. ఇంద్ర హీరోయిన్‌ ఎమోషనల్! | Sonali Bendre pays tribute to remembers their unreleased film with Rohit Bal | Sakshi
Sakshi News home page

Sonali Bendre: ప్రముఖ డిజైనర్‌ మృతి.. ఇంద్ర హీరోయిన్‌ ఎమోషనల్!

Published Tue, Nov 5 2024 3:04 PM | Last Updated on Tue, Nov 5 2024 3:20 PM

Sonali Bendre pays tribute to remembers their unreleased film with Rohit Bal

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ మృతిపట్ల సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే సంతాపం తెలిపారు. అతనితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనలయ్యారు. మీరు అద్భుతమైన డిజైనర్ అని అందరికీ తెలుసని అన్నారు. అంతే కాకుండా మీతో ల యూ హమేషా అనే చిత్రంలో నటించిన రోజులు గుర్తుకు వచ్చాయని పేర్కొన్నారు. అతన్ని సోనాలి కేవలం డిజైనర్‌గానే కాకుండా సహ నటుడిగా గుర్తు చేసుకున్నారు. వీరిద్దరు కలిసి నటించిన లవ్ యు హుమేషా మూవీ థియేటర్లలో విడుదల కాలేదు.

కాగా..  రోహిత్ బాల్‌ను నవంబర్ 1న కన్నుమూశారు. ఆయన 63 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించారు. దీంతో హీరోయిన్ సోనాలి బింద్రే.. రోహిత్ బాల్‌కు నివాళులర్పించారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాక్షించారు. ఆమెతో పాటు నటుడు అర్జున్ రాంపాల్ కూడా దివంగత ఫ్యాషన్ డిజైనర్‌కు నివాళులర్పించారు. రోహిత్ బాల్‌తో దిగిన ఫోటోలను షేర్ చేశాడు. కాగా.. ఆయన జ్ఞాపకార్థం సోమవారం సాయంత్రం 4 గంటలకు న్యూఢిల్లీలోని సాయి ఇంటర్నేషనల్ సెంటర్‌లో  ప్రార్థనా సమావేశం నిర్వహించారు.

కశ్మీర్‌కు చెందిన రోహిత్ బాల్ తన గొప్ప డిజైన్లతో బాలీవుడ్‌లో ప్రసిద్ధి చెందాడు. చాలామంది బాలీవుడ్ ప్రముఖులకు ఆయన పనిచేశారు. అతని డిజైన్లను పమేలా ఆండర్సన్, ఉమా థుర్మాన్, సిండి క్రాఫోర్డ్, నవోమి కాంప్‌బెల్ లాంటి అంతర్జాతీయ స్టార్స్ సైతం ధరించారు. కాగా.. సోనాలి బింద్రే తెలుగువారికి కూడా సుపరిచితమే. టాలీవుడ్‌లో ఇంద్ర సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో  మెగాస్టార్ చిరంజీవికి జంటగా నటించింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement