sonali bendre
-
సోనాలి బింద్రే మెరిసే చర్మం రహస్యం ఇదే..!
ప్రముఖ మోడల్, నటి సోనాలి బింద్రే(Sonali Bendre) తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించి వేలాది అభిమానులను సొంతం చేసుకుంది. ఆమెకు బాలీవుడ్ నటిగానే ఎక్కువగా గుర్తింపు లభించింది. ఎందుకంటే ఎక్కువ సినిమాలు హిందీలోనే చేసింది. ఇక మన తెలుగులో అగ్ర హీరోల సరసన నటించి మంచి హిట్లతో ప్రేక్షకుల మన్ననలను అందుకుంది. అంతేగాదు సోనాలి అత్యంత అందమైన నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అదీగాక చూడటానికి కుందనపు బొమ్మల ఆకర్షణీయంగా ఉంటుంది. ఓ ఇంటర్వ్వూలో ఆమె గ్లామర్ రహస్యం(beauty secret) గురించి షేర్ చేసుకంది. తన మెరిసే చర్మం రహస్యం ఆ మొక్కేనని అంటోంది.. మన భారతీయ సంప్రదాయంలో పూజలందుకునే ఈ మొక్క ఔషధ గుణాలను అందరూ ఉపయోగించుకోవాలని చెబుతోంది. అదేంటో చూద్దామా..!.ఐదు పదుల వయసులో అంతే గ్లామర్‌తో అభిమానులను ఫిదా చేస్తుంటారామె. ఆమె ముఖంలో ఉట్టిపడే కాంతి ఎవ్వరినైనా కట్టిపడేస్తుంది. అంతలా చర్మం ప్రకాశవంతంగా కనిపించేందుకు స్కిన్ కేర్ తీసుకుంటానని అన్నారు. మన భారతీయ సంప్రదాయంలో పూజలందుకునే వేప మొక్క తన మెరిసే చర్మానికి కారణమంటుంది. తాను రోజకి రెండసార్లు వేప ఉత్పత్తుల(Neem products)తో చర్మాన్ని శుభ్రపరుస్తానని అంటున్నారు. దీంతోపాటు తాను చేసే వ్యాయమం కూడా చర్మాన్ని ప్రకాశవంతంగా కనిపించేలా చేయడంలో ఉపకరిస్తుందని చెబుతున్నారు. "మనం భారతీయులం కచ్చితంగా ఈ వేప మొక్క గుణాలను పిల్లలకు తెలియజేయాలి. ఈ మొక్కచేసే మాయాజాలం గురించి సవివరంగా చెప్పాలి. వేప చర్మానికే కాదు ఆరోగ్యానికి కూడా మంచిదే. తేమ వాతావరణంలో ఉండే వాళ్లకు వేప చాలా బాగా పనిచేస్తుంది. అయితే నేను బ్యూటీ ప్రొడక్ట్(Beauty Products)లను ఎక్కవగా ఉపయోగించను తరచుగా మాత్రం ముఖాన్ని శుభ్రపరుచుకోవడానికి బద్దకించను. అలాగే వీటి తోపాటు ఆర్యోగకరమైన ఆహారం తప్పనిసరిగా తీసుకుంటాను." అని చెబుతున్నారు సోనాలి. వేపతో కలిగే లాభాల..వేపని 'వండర్ హెర్బ్'గా చెబుతుంటారు. ఇది చర్మం, జుట్టు, రక్తం తదితర శరీర భాగాలన్నింటి శ్రేయస్సుకి సమర్థవంతమైనది. జీవశాస్త్రపరంగా దాదాపు 130 రకాలుగా ఉపయోగపడుతుందట. 2018లో ది హిమాలయ డ్రగ్ కంపెనీ వేప చర్మానికి ఒనగూర్చే ప్రయోజనాలు గురించి సవివరంగా వెల్లడించింది.ఆయుర్వేదంలో వేప చాలా ప్రభావవంతమైన మొటిమల నివారిణి.చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో కీలకంగా ఉంటుందటఅలాగే బ్లాక్/వైట్ హెడ్స్‌ని నివారిస్తుంది.దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియా, హానికరమైన ప్రభావాలను తగ్గిస్తుందట. దద్దుర్లు, కాలిన గాయాల తాలుకా ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ముఖ్యంగా తేలికపాటి చర్మ సమస్యలను సమూలంగా నివారిస్తుందని చెబుతున్నారు చర్మ సంరక్షణ నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివారాలను వ్యక్తిగత వైద్య నిపుణలను సంప్రదించి అనుసరించడం ఉత్తమం. -
డిజైనర్ సారీలో సోనాలీ ఎలిగెంట్ లుక్ (ఫోటోలు)
-
సరయూ నదీ తీరాన శ్రీరాముని సేవలో నటి సోనాలి బింద్రే (ఫోటోలు)
-
ప్రముఖ డిజైనర్ మృతి.. ఇంద్ర హీరోయిన్ ఎమోషనల్!
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ మృతిపట్ల సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే సంతాపం తెలిపారు. అతనితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనలయ్యారు. మీరు అద్భుతమైన డిజైనర్ అని అందరికీ తెలుసని అన్నారు. అంతే కాకుండా మీతో ల యూ హమేషా అనే చిత్రంలో నటించిన రోజులు గుర్తుకు వచ్చాయని పేర్కొన్నారు. అతన్ని సోనాలి కేవలం డిజైనర్‌గానే కాకుండా సహ నటుడిగా గుర్తు చేసుకున్నారు. వీరిద్దరు కలిసి నటించిన లవ్ యు హుమేషా మూవీ థియేటర్లలో విడుదల కాలేదు.కాగా.. రోహిత్ బాల్‌ను నవంబర్ 1న కన్నుమూశారు. ఆయన 63 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించారు. దీంతో హీరోయిన్ సోనాలి బింద్రే.. రోహిత్ బాల్‌కు నివాళులర్పించారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాక్షించారు. ఆమెతో పాటు నటుడు అర్జున్ రాంపాల్ కూడా దివంగత ఫ్యాషన్ డిజైనర్‌కు నివాళులర్పించారు. రోహిత్ బాల్‌తో దిగిన ఫోటోలను షేర్ చేశాడు. కాగా.. ఆయన జ్ఞాపకార్థం సోమవారం సాయంత్రం 4 గంటలకు న్యూఢిల్లీలోని సాయి ఇంటర్నేషనల్ సెంటర్లో ప్రార్థనా సమావేశం నిర్వహించారు.కశ్మీర్‌కు చెందిన రోహిత్ బాల్ తన గొప్ప డిజైన్లతో బాలీవుడ్లో ప్రసిద్ధి చెందాడు. చాలామంది బాలీవుడ్ ప్రముఖులకు ఆయన పనిచేశారు. అతని డిజైన్లను పమేలా ఆండర్సన్, ఉమా థుర్మాన్, సిండి క్రాఫోర్డ్, నవోమి కాంప్‌బెల్ లాంటి అంతర్జాతీయ స్టార్స్ సైతం ధరించారు. కాగా.. సోనాలి బింద్రే తెలుగువారికి కూడా సుపరిచితమే. టాలీవుడ్లో ఇంద్ర సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జంటగా నటించింది. -
కేన్సర్‌ను జయించా.. సినీనటి సోనాలి బింద్రే
సాక్షి, హైదరాబాద్: కేన్సర్ పేషంట్లకు వైద్య చికిత్సతో పాటు మానసిక స్థైర్యం అందించాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రముఖ సినీతార సోనాలి బింద్రే తెలిపారు. స్వయంగా తనకే కేన్సర్ ఉందని తెలిసిన సమయంలో ఇక తన జీవితం ముగిసిపోయిందని, ఆవేదనతో కృంగిపోయానని, కానీ తన భర్త అందించిన మానసిక స్థైర్యం, తక్షణ ఆరోగ్య సంరక్షణతో కేన్సర్ నుంచి బయటపడ్డానని ఆమె అన్నారు. అక్టోబర్.. బ్రెస్ట్ కేన్సర్ అవేర్నెస్ మంత్ నేపథ్యంలో జీవీకే హెల్త్‌హబ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్యానెల్ చర్చ నిర్వహించగా, ఇందులో సోనాలితో పాటు ప్రముఖ సామాజికవేత్త పింకీరెడ్డి, జీవీకే హెల్త్‌హబ్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్నేహసాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనాలి బింద్రే మాట్లాడుతూ.. రొమ్ము కేన్సర్‌ను మొదటి దశలోనే స్క్రీనింగ్ టెస్టులతో గుర్తించి చికిత్స అందించగలిగితే మళ్లీ సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చని, దీనికి తానే ఒక నిదర్శనమని అన్నారు. కానీ ఈ ప్రయాణం ఎంతో వేధనతో కూడుకున్నది, ఆ సమయంలోనే జీవితమంటే ఏంటో తెలిసేలా చేసిందని చెప్పారు. ముందస్తుగా కేన్సర్‌ను గుర్తించే స్క్రీనింగ్ టెస్టులతో డబ్బులు వృథా అని చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు.. చిన్న మొత్తాలకు చూసుకుంటే, ప్రమాదవశాత్తు కేన్సర్ భారిన పడితే అంతకు మించిన డబ్బులను కోల్పోవడమే కాకుండా విలువైన జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టినవారవుతారని ఆమె సూచించింది. వంశపారపర్యంగా 5 నుంచి 10 శాతమే.. మహిళల్లో రొమ్ము కేన్సర్ కేసుల సంఖ్య అధికంగా పెరుగుతుంది. 40 ఏళ్లు దాటిన మహిళలు ఖచి్చతంగా కేన్సర్‌కు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులు చేసుకోవాలని పింకీరెడ్డి సూచించారు. ఒక మహిళ దీర్ఘకాలిక రోగాలబారిన పడితే ఆ కుటుంబమంతా అస్తవ్యస్తంగా మారుతుందని అన్నారు. ఈ సందర్భంగా ముందస్తుగా రొమ్ము కేన్సర్‌ను గుర్తించగలిగే కొన్ని చిట్కాలను, సంరక్షణ పద్దతులను గురించి మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్నేహ సాగర్ వివరించారు. రొమ్ము కేన్సర్ మహిళలకే కాదు కొంత మంది పురుషులకు కూడా వచ్చే అవకాశముందని ఆమె తెలిపారు. ప్రముఖ సినీతార నమ్రతా శిరోద్కర్, శిల్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మెగాస్టార్‌తో డ్యాన్స్ చేసేందుకు భయపడ్డా: ఇంద్ర హీరోయిన్
తనదైన నటనతో అభిమానుల గుండెల్లో ప్రత్యేకస్థానం దక్కించుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈనెల 22న ఆయన పుట్టిన రోజును జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ఇంద్ర రీ రిలీజ్ చేయనున్నారు. 2002లో విడుదలైన ఈ చిత్రంలో సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఈ మూవీని మరోసారి థియేటర్లలో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ సోనాలి బింద్రే.. ఇంద్ర రీ రిలీజ్ కావడంపై స్పందించింది. చిరంజీవి పక్కన నటించడం తనకు దక్కిన అతిపెద్ద గౌరవమని అన్నారు. ఆయనతో కలిసి స్టెప్పులు వేయడం ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు. ఇంద్ర షూటింగ్ సమయంలో చిరుతో డ్యాన్స్ వేసేందుకు భయపడేదాన్ని అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో షూటింగ్ జరిగిన సమయంలో చాలా ఎంజాయ్ చేశానని.. చిరంజీవి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారని వెల్లడించారు. మరోసారి ఇంద్ర మూవీని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నందుకు ఆనందంగా ఉందని.. బిగ్స్క్రీన్పై చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు సోనాలి బింద్రే తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను వైజయంతి మూవీస్ తన ట్విటర్లో షేర్ చేశారు. Relive the magic of #INDRA with @iamsonalibendre as she takes us down memory lane and shares her excitement for the August 22nd re-release. 🎬https://t.co/RBGJ5iBcYq#Indra4K Megastar @KChiruTweets @AshwiniDuttCh #BGopal #AarthiAgarwal @tejasajja123 #ManiSharma @GkParuchuri… pic.twitter.com/KFFkCHHlze— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 21, 2024 -
మురారి రీ రిలీజ్.. హీరోయిన్ రియాక్ట్ అయిందిగా!
టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ మూవీ మురారి రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద మహేశ్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అభిమాన హీరో సినిమా 23 ఏళ్ల తర్వాత రావడంతో అభిమానులు సందడి చేశారు. కొందరైతే ఏకంగా థియేటర్లోనే పెళ్లి కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున వైరలయ్యాయి.అయితే తాజాగా మురారి రీ రిలీజ్‌పై హీరోయిన్ సోనాలి బింద్రే స్పందించింది. ఈ చిత్రంలో హీరోయిన్గా మెప్పించిన బాలీవుడ్ భామ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. మహేశ్‌తో మురారి సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. 23 ఏళ్ల తర్వాత కూడా మురారి సినిమాపై అదే ప్రేమ చూపించడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని వెల్లడించింది. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.. ఈ చిత్రాన్ని మాకు ఇంత ప్రత్యేకంగా మార్చిన డైరెక్టర్ కృష్ణ వంశీకి అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. Shooting Murari with Mahesh was such a joy, and finding Nandini during that time was a wonderful surprise. It’s incredible to see the same love for the movie even after 23 years! Thank you for all the love ❤️A special mention to VamsiGaru for making this film so special for us pic.twitter.com/UqW75w8cUz— Sonali Bendre Behl (@iamsonalibendre) August 9, 2024 -
బ్లాక్‌బస్టర్ హిట్ 'మురారి' రీ రిలీజ్.. అస్సలు పట్టించుకోని హీరోయిన్!
టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేశ్ బాబు ఫ్యాన్స్ తెలుగు రాష్ట్రాల్లో హంగామా చేస్తున్నారు. తమ అభిమాన హీరో బర్త్ డే కావడం.. సూపర్ హిట్ మూవీ మురారి రీ రిలీజ్ చేయడం అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. 2001లో కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇందులో బాలీవుడ్ భామ సోనాలి బింద్రే హీరోయిన్గా నటించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పెళ్లి సీన్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇవాళ రీ రిలీజ్ కావడంతో కొందరైతే ఏకంగా థియేటర్లనే పెళ్లి చేసుకోవడం చూస్తే ప్రిన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో అర్థమవుతోంది.రీ రిలీజ్‌పై స్పందించని హీరోయిన్..అయితే మురారిలో హీరోయిన్గా మెప్పించిన ముంబయి ముద్దుగుమ్మ సోనాలి బింద్రే. ఆ తర్వాత ఇంద్ర, మన్మధుడు లాంటి హిట్ సినిమాల్లోనూ కనిపించింది. ఆమె మురారి సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాతే చిరంజీవి, నాగార్జున సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఇవాళ మురారి రీ రిలీజ్ అయినప్పటికీ ఎక్కడా కూడా ఈ సినిమా గురించి పోస్ట్ చేయలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నప్పటికీ రెస్పాండ్ అవ్వలేదు. తనకు సూపర్ హిట్ అందించిన మురారి చిత్రంపై కనీసం ఇన్‌స్టా వేదికగా స్పందించకపోవడంపై ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. ఏది ఏమైనా సోనాలి తొలి టాలీవుడ్ గురించి రియాక్ట్ అయి ఉంటే బాగుండేదని అభిమానులు భావిస్తున్నారు. అయితే 2002లో నిర్మాత,వ్యాపార వేత్త అయినా గోల్డీ బెల్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా ఉన్నారు. గతంలో క్యాన్సర్ బారిన పడిన భామ.. ఆ తర్వాత కోలుకుంది. చివరిసారిగా 2022లో లవ్ యూ హమేశా చిత్రంలో కనిపించింది. 90ల్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ ఇటీవలే ది బ్రోకెన్ న్యూస్ సీజన్-2తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) -
నేను, మహేశ్‌బాబు హీరోయిన్ను ఏడిపించాం: సుధ
రెండు దశాబ్దాల క్రితం వచ్చిన క్లాసిక్ హిట్స్‌లో మురారి ఒకటి. మహేశ్‌బాబు, సోనాలి బింద్రె జంటగా నటించిన ఈ సినిమాను కృష్ణ వంశీ తెరకెక్కించాడు. మణిశర్మ సంగీతం సినిమా విజయానికి ఎంతగానో తోడ్పడింది. ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు బర్త్‌డే సందర్భంగా ఆగస్టు 9న రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నటి సుధ ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంది. హీరోయిన్ను ఏడిపించే సాంగ్ఆమె మాట్లాడుతూ.. అందరూ ఇష్టపడే హీరో ప్రిన్స్ మహేశ్‌బాబు. మీ నాన్న గారితో, మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వంశీ, దూకుడు, అతడు.. ఇలా మంచి చిత్రాల్లో నటించాను. మురారి రీరిలీజ్ అవుతున్న సందర్భంగా ఓ సంఘటన మీతో చెప్పాలనుకుంటున్నాను. హీరోయిన్ సోనాలి బింద్రెను ఏడిపించే పాట(బంగారు కళ్ల బుచ్చమ్మో..)లో మహేశ్, నేను ఆమెను మామూలుగా ఏడిపించలేదు. కావాలనే ఏడిపిస్తున్నారు కదాఆ షాట్ పూర్తయ్యాక తనొచ్చి.. మీరిద్దరూ కలిసి కావాలనే ఏడిపిస్తున్నారు కదా.. నాకు అర్థమవుతోంది. దర్శకుడు చెప్పకపోయినా కావాలని ఏడిపిస్తున్నారంది. ఆ పాటలో.. తనతో గేదెకు స్నానం చేయిస్తున్నప్పుడైతే ఎంత నవ్వుకున్నామో.. అయితే డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల కొన్ని సీన్స్‌లో నేను కనిపించను. అయినా ఉన్నంతవరకు షూటింగ్ ఆనందంగా చేశాం అని చెప్పుకొచ్చింది. Veteran artist #Sudha garu’s special video byte for #Murari4K 💥❤️🔥@urstrulyMahesh #SSMB29 pic.twitter.com/vnkM7Po5Zx— 𓆩MB_RAJ𓆪 (@Raj_6208) July 27, 2024 చదవండి: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 'ప్రేమలు' నటుడు -
స్టార్ హీరోయిన్ కోసం చెరువులో దూకిన అభిమాని.. ఆ తర్వాత!
హీరోహీరోయిన్లకు అభిమానులు చాలా మంది ఉంటారు. కానీ కొందరు మాత్రం అభిమానం పేరుతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. తెలుగులో చాలామంది స్టార్ హీరోలకు ఇలాంటి ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్లు చేసే అతి మామూలుగా ఉండదు. రీసెంట్గా అలాంటి ఓ వీరాభిమాని, తన అభిమాన హీరో దర్శన్ చేతిలో హత్యకు గురయ్యాడు. దీని గురించి అలా వదిలేస్తే.. హీరోయిన్ సోనాలి బింద్రే కోసం ఓ అభిమాని ఏకంగా చెరువులు దూకి చనిపోయాడు. అప్పుడెప్పుడో జరిగిన ఈ సంఘటన తాజాగా మరోసారి చర్చనీయాంశమైంది.1999,2000ల కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్గా స్టార్డమ్ అనుభవించిన సోనాలి బింద్రే.. కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే పెళ్లి చేసుకుంది. కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడి.. దాన్నుంచి బయటపడింది కూడా. ఇప్పటికీ అడపాదడపా యాక్టింగ్ చేస్తున్న సోనాలి బింద్రే.. తాజాగా ఓ పాడ్ కాస్ట్ షోలో పాల్గొంది. తన గురించిన ఒకప్పటి విషయాల్ని బయటపెట్టింది.(ఇదీ చదవండి: హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో)అప్పట్లో షూటింగ్ కోసమని సోనాలి.. భోపాల్ వెళ్లింది. అయితే ఈమెని చూసేందుకు ఓ అభిమాని చెరువులో దిగి మృత్యువాత పడ్డాడు. దీని గురించి ఏమైనా తెలుసా? అని సోనాలిని యాంకర్ అడగ్గా.. 'ఆ సంఘటనని నిజంగా నమ్మలేకపోతున్నాను. ఈ క్రేజీ ఫ్యాన్ కల్చర్ నాకు అస్సలు అర్థం కాదు. ఇప్పటికీ ఆ సంఘటన గురించి తెలిదు. ఇంతకీ నిజంగానే అలా జరిగిందా? అసలు అభిమాన హీరోయిన్ చూడటం కోసం ప్రాణాలు కోల్పోవడం చాలా బాధకరమైన విషయం. నమ్మలేకపోతున్నా' అని విచారం వ్యక్తం చేసింది.'అప్పట్లో మెయిల్స్, ఉత్తరాలు నాకు చాలా వచ్చేవి. కొందరు రక్తంతో ఉత్తరాలు రాసేవారు. అది నిజంగా వాళ్ల రక్తమేనా? అది రక్తమేనా అనే సందేహం వచ్చేసింది. ఎందుకు మనుష్యులు.. తమలాంటి మరో మనిషి కోసం ఇంతలా తాపత్రయపడతారో అర్థమయ్యే కాదు. బాలీవుడ్‌లోని ఫ్యాన్ కల్చర్, హీరోహీరోయిన్ పట్ల అతిప్రేమ నాకు అస్సలు ఇష్టముండదు' అని సోనాలి బింద్రే చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!) -
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
టాలీవుడ్లో మురారి, ఇంద్ర లాంటి సూపర్ హిట్ సినిమాలతో మెప్పించిన భామ సోనాలి బింద్రే. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై మెరిసింది. ఇటీవల ది బ్రోకెన్ న్యూస్ సీజన్-2 తో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం తన వెబ్ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా సోనాలికి ఓ ఊహించని ప్రశ్న ఎదురైంది. గతంలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ మీపై విపరీతంగా ప్రేమించాడని వార్తలొచ్చాయి.. అంతేకాదు పెళ్లికి ఒప్పుకోకపోతే కిడ్నాప్ చేస్తానని అన్నట్లు తెగ వైరలయ్యాయి.అయితే తాజా ఇంటర్వ్యూలో వీటిపై సోనాలి బింద్రే స్పందించింది. ఆ ప్రశ్న వినగానే సోనాలి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీని గురించి మాట్లాడుతూ.. 'అతను నిజంగా చెప్పాడో లేదో నాకు తెలియదు.. అయితే ఇది ఎంతవరకు నిజమో కూడా నాకు తెలియదు.. ఇప్పటికీ ఆ ఫేక్ న్యూస్ ఉందని ఆమె కొట్టిపారేశారు. అయితే అతను తన అభిమాని కావడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు.అయితే 2019లో సోనాలికి సంబంధించి తాను ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదని షోయబ్ స్పష్టం చేశాడు. షోయబ్ తన సొంత యూట్యూబ్ ఛానెల్లో దీనిపై వీడియో పోస్ట్ చేశారు. ఇంతటితో ఈ రూమర్స్‌కు స్వస్తి చెప్పాలనుకుంటున్నట్లు తెలిపారు. నేను ఆమెను సినిమాల్లో చూశాను.. తన అందమైన నటి కూడా అని అన్నారు. అయితే ఆమె క్యాన్సర్‌తో పోరాడిన తీరు చూసి అభిమానించడం మొదలుపెట్టానని షోయబ్ వెల్లడించారు. -
బతకడానికి కేవలం 30 శాతమే ఛాన్స్: స్టార్ హీరోయిన్
మురారి, ఇంద్ర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ సోనాలి బింద్రే. టాలీవుడ్లో హిట్ చిత్రాలు చేసిన బాలీవుడ్ భామ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే 2018లో క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవల ది బ్రోకెన్ న్యూస్ సీజన్-2 వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సోనాలి క్యాన్సర్ నిర్ధారణ తర్వాత తన కుటుంబం తీవ్రమైన ఒత్తిడికి గురైందని తెలిపింది.సోనాలి మాట్లాడుతూ.. 'ముఖ్యంగా 2018లో క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఆ వార్త నా కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. మాకు షాకింగ్‌గా అనిపించింది. ఇది జరిగినప్పుడు నేను రియాల్టీ షో చేస్తున్నా. ఆ సమయంలో నాకు ఆరోగ్యం సరిగ్గా లేదని తెలుసు. డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లమ్ మాత్రమే ఉంటుందని అనుకున్నా. కానీ పరీక్షలు చేశాక అసలు విషయం తెలిసింది. ఆ సమయంలో డాక్టర్, నా భర్త గోల్డీ బెహ్ల్ మొహాలు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటికే స్టేజ్ -4 క్యాన్సర్‌తో ఉన్నట్లు తెలిసింది. కేవలం 30 శాతం బతికే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు. దీంతో డాక్టర్‌పై నా భర్త కోపం ప్రదర్శించాడు. కానీ ఆ తర్వాత కీమోథెరపీ చేయించుకున్నా. అది చాలా కఠినమైన చికిత్స. నా జుట్టు రాలడం లాంటి తీవ్రమైన సమస్య ఎదుర్కొన్నా' అని తెలిపింది. -
క్యాన్సర్‌తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
సోనాలి బింద్రె.. స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ 2018లో క్యాన్సర్ బారిన పడింది. న్యూయార్క్‌లో చికిత్స అనంతరం కోలుకున్న ఆమె అప్పటినుంచి క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆ మధ్య లవ్ యూ హమేశా అనే సినిమాలో నటించింది. అలాగే ద బ్రోకెన్ న్యూస్ అనే వెబ్ సిరీస్‌లోనూ కనిపించింది. అయితే పెద్దగా అవకాశాలు మాత్రం రావడంలేదనే చెప్పాలి.నటి కావాలనుకోలేదుతాజాగా ఓ ఇంటర్వ్యూలో సోనాలి బింద్రె మాట్లాడుతూ.. నేను నటి కావాలని ఎప్పుడూ అనుకోలేదు. అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చాను. ఇక్కడ సక్సెస్ చూసిన తర్వాత నటనపై ఆసక్తి పెంచుకున్నాను. కెరీర్ తొలినాళ్లలో కంటే ఇప్పుడు లైన్స్ గుర్తుపెట్టుకోవడమే కష్టంగా ఉంది. స్క్రిప్ట్ కూడా సరిగా గుర్తుండటం లేదు. 90'స్లో సన్నగా ఉండేవాళ్లకంటే బొద్దుగా ఉండేవాళ్లకే ప్రాధాన్యత ఇచ్చేవారు' అని హీరోయిన్ చెప్పుకొచ్చింది.చదవండి: వేధిస్తున్న నిర్మాత.. నిజాలు బయటపెట్టిన సీరియల్ నటి -
వాళ్లే కావాలని ఎఫైర్స్ అంటగట్టేవారు: స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
బాలీవుడ్ భామ సోనాలి బింద్రే తెలుగువారికి సైతం సుపరిచితమే. మహేశ్ బాబు సరసన మురారి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత మెగాస్టార్ మూవీ ఇంద్ర, నాగార్జునతో మన్మధుడు చిత్రాలతో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అయిత 2002లోనే నిర్మాత,వ్యాపార వేత్త అయినా గోల్డీబెల్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సినిమాలు చేయడం పూర్తిగా తగ్గించేసింది. చివరిసారిగా 2022లో లవ్ యూ హమేశా చిత్రంలో కనిపించింది. 90ల్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ ఇటీవల ది బ్రోకెన్ న్యూస్ సీజన్-2తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా అప్పటి నిర్మాతలపై సంచలన కామెంట్స్ చేశారు.సోనాలి బింద్రే మాట్లాడుతూ.. '1994లో నేను ఇండస్ట్రీలోకి వచ్చా. ఇప్పటికంటే అప్పటి పరిస్థితులు చాలా డిఫరెంట్‌గా ఉండేవి. అప్పట్లో సహనటులతో నాపై ఎన్నో రూమర్స్ సృష్టించారు. కానీ వాటిల్లో ఒక్కటంటే ఒక్కటి నిజం లేదు. ఇప్పటికీ ఈ చెత్త ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. 1990ల్లో సినిమా నిర్మాతలే కావాలనే హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ క్రియేట్ చేసేవారు. వాటిని మీడియాకు చెప్పేవాళ్లు. సినిమా ప్రమోషన్స్ కోసం ఈ విధంగా చేసేవారని తెలిసి ఆశ్చర్యపోయా' అని తెలిపారు.అయితే సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో సన్నగా ఉన్నందుకు అవహేళన చేసేవారని సోనాలి బింద్రే తెలిపారు. ఆ రోజుల్లో హీరోయిన్లు కాస్తా బొద్దుగా ఉండేవారని పేర్కొన్నారు. నేను సన్నాగా విషయాన్ని కొందరు నిర్మాతలు మొహం మీదే చెప్పేవారని వెల్లడించింది. నేను అలాంటివాటిని పట్టించుకునే దాన్ని కాదని వివరించింది. అంతేకాదు.. ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడూ అనుకోలేదని.. నటనలోనూ ఎలాంటి శిక్షణ తీసుకోలేదని.. అసలు స్టార్ హీరోయిన్గా అవుతానని ఊహించలేదని సోనాలి ఆ రోజులను మరోసారి గుర్తుకు తెచ్చుకుంది. -
ఆ సాంగ్ హిట్ కాకుంటే.. ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేద్దామనుకున్నా: టాప్ హీరోయిన్
మురారి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సోనాలి బింద్రే. ఆ తర్వాత మన్మధుడు, ఇంద్ర, ఖడ్గం, శంకర్ దాదా వంటి సినిమాలతో దాదాపు తెలుగు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. సుమారు పదేళ్ల తర్వాత ఆమె మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. చివరగా 2013లో ఒక బాలీవుడ్ సినిమాలో కనిపించి ఇండస్ట్రీకి దూరమయింది.జీ5 వేదికగా మే3 నుంచి 'ది బ్రోకెన్ న్యూస్ 2' స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఆమె పలు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఈ క్రమంలో తన పాత రోజులను మరొసారి గుర్తుచేసుకుంది. హీరోయిన్‌కు డ్యాన్స్ రాకపోతే ఇండస్ట్రీలో కొనసాగలేరనే అభిప్రాయం గతంలో చాలామందికి అభిప్రాయం ఉండేదని ఆమె పేర్కొంది. సినిమా రంగంలో అడుగుపెట్టే రోజుల్లో తనకు పెద్దగా డ్యాన్స్ రాదని తెలిపింది. దీంతో కొందరు కొరియోగ్రాఫర్స్ తిట్టేవారని ఆమె గుర్తుచేసుకుంది. వారి తిట్లు భరించలేక డ్యాన్స్‌లో ఎక్కువగా శిక్షణ తీసుకునేదానినని ఆమె తెలిపింది. మణిరత్నం గారి డైరెక్షన్లో వచ్చన 'బొంబాయి' సినిమాలో 'హమ్మా.. హమ్మా' సాంగ్‌లో అవకాశం వచ్చింది. కానీ, ఆ సమయంలో తనకు కేవలం ఐదు సినిమాల్లో మాత్రమే నటించిన అనుభవం ఉన్నట్లు పేర్కొంది. కొంతమేరకు శిక్షణలో ఉన్న సొనాలి.. ఆ పాటకు డ్యాన్స్ మాస్టర్ రాజు సుందరంతో కలిసి ఆ పాటకు అదరిపోయే స్టెప్పులు వేసి మెప్పించాలని కోరుకున్నట్లు సొనాలి చెప్పింది. ఒకవేళ ఈ పాటలో తన డ్యాన్స్ నచ్చలేదంటే ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసి వెళ్లాలని కూడా ఫిక్స్ అయినట్లు తెలిపింది. ఫైనల్‌గా 'హమ్మా.. హమ్మా' సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఆ పాటతో తన పేరు ట్రెండ్ అయినట్లు సోనాలి చెప్పుకొచ్చింది. -
‘మురారీ’బ్యూటీ సోనాలి బింద్రె ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుంది?
-
Birthday Special: అందాల ముద్దుగుమ్మ సోనాలి బింద్రే బర్త్ డే స్పెషల్.. రేర్ పిక్స్ (ఫొటోలు)
-
జిమ్‌లో అన్వేషి.. వర్షంలో కృతి శెట్టి ఫోజులు
► నీతోనే డ్యాన్స్ అంటూ పొట్టి గౌన్‌లో రచ్చ చేస్తున్న శ్రీముఖి ► డిస్నీ ల్యాండ్‌లో ఎంజాయ్ చేస్తున్న హన్సిక మోత్వానీ ► ఫుల్ వర్షంలో సూపర్బ్ ఫోటోలను షేర్ చేసిన కృతి శెట్టి ► జిమ్‌లో వర్కౌట్స్ సెల్ఫీలతో అన్వేషి జైన్ ► కలర్‌ఫుల్ డ్రెస్ మెరిసిపోతున్న జాన్వీ కపూర్ ► అదిరిపోయే ఫోజులతో అందరి మనసుదోచే ఫోటోలు షేర్ చేసిన సోనాలి బింద్రే View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by sitara 🍓 (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Sanjay Dutt (@duttsanjay) View this post on Instagram A post shared by Dimple Hayathi (@dimplehayathi) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Nikita Dutta 🦄 (@nikifying) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
Fashion: సోనాలీ బింద్రే ధరించిన ఈ త్రీ పీస్ డ్రెస్ ధర 78 వేల పైమాటే! స్పెషాలిటీ?
‘అలనాటి రామచంద్రుడి’ అంటూ సీతలా సిగ్గుల మొగ్గ అయిన సోనాలీ బింద్రే ‘మురారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇన్నేళ్లయినా ఇప్పటికీ అదే గ్రేస్‌ను మెయిన్టైన్ చేస్తోంది. ఆ క్రెడిట్ అంతా ఈ ఫ్యాషన్ బ్రాండ్స్‌దే! చంద్రిమా.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ.. ముంబైలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది చంద్రిమా అగ్నిహోత్రి. అబూ జానీ, సందీప్ ఖోస్లా, రోహిత్ బాల్ వంటి ప్రముఖ డిజైనర్ల దగ్గర పనిచేసిన తర్వాత, 2019లో సొంత లేబుల్ ‘చంద్రిమా’ను ప్రారంభించింది. చేనేత, హస్తకళల సమ్మేళనంతో వైవిధ్యమైన, ఆధునిక డిజైన్స్‌ను క్రియేట్ చేస్తోంది. ష్యాషన్ డిజైనింగ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంటోంది. అందుకే వీటి ధరలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఆన్లైన్లో లభ్యం. లారా మొరాఖియా... మలబార్ ప్రాంతంలో పుట్టి పెరిగిన లారాకి చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ రంగంపై ఆసక్తి. 2018లో తన పేరుతోనే ‘లారా మొరాఖియా’ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈ దేశ పురాతన కళాకళాఖండాల డిజైన్స్‌నే ప్రేరణగా.. స్ఫూర్తిగా తీసుకుని వెండి , బంగారు లోహాల్లో ముత్యాలు, వజ్రాలను పొదుగుతూ అందమైన ఆభరణాలను అందిస్తోంది. ఈ నగలకు దేశంలోనే కాదు విదేశాల్లోనూ డిమాండ్ ఎక్కువే. ఈ బ్రాండ్‌కు ప్రస్తుతం న్యూయార్క్, ముంబైలో మాత్రమే స్టోర్స్ ఉన్నాయి. ఆన్లైన్లో కొనుగోలు చేసే వీలుంది. హానికారకం కాదుకదా! ‘నచ్చి చేసే తప్పుల్లో నాకు నచ్చేది అందంగా కనిపించాలనే ఆలోచన’ అని హాలీవుడ్ స్టార్ అల్పచీనో అన్న మాటతో నేను ఏకీభవిస్తాను. అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు? అందంగా కనిపించాలనుకోవడమేమీ హానికారకం కాదుకదా! కాకపోతే మనకేది నప్పుతుందో చూసుకోవడం కూడా ముఖ్యమే. – సోనాలీ బింద్రే బ్రాండ్ వాల్యూ జ్యూయెలరీ బ్రాండ్: లారా మొరాఖియా ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. డ్రెస్: త్రీ పీస్ సెట్ బ్రాండ్: చంద్రిమా ధర: లెహంగా: రూ. 39,990 టాప్: రూ. 6,990 జాకెట్: రూ. 31,990 -దీపిక కొండి -
రీమేక్‌గా వస్తున్న వెబ్ సిరీస్‌లు..
ఒక భాషలో హిట్టయిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ కావడం చూస్తూనే ఉంటాం. ఈ ధోరణి ఇప్పుడు వెబ్ సిరీస్‌ల విషయంలోనూ కనిపిస్తోంది. హిట్ వెబ్ సిరీస్‌లు ఇతర భాషల్లోకి రీమేక్ అవుతున్నాయి. వెబ్ తెరపై వ్యూయర్స్‌ను ఎట్రాక్ట్ చేసేందుకు ఇంగ్లిష్ కథలను మన భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఈ ఇంగ్లిష్ కథల్లో నటిస్తున్న ఇండియన్ తారలెవరో చూద్దాం. వెంకటేశ్ కెరీర్లో దాదాపు పాతిక రీమేక్ సినిమాలు ఉంటాయనడంలో సందేహం లేదు. ఇప్పుడు వెంకీ వెబ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తొలిసారి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ చేశారు. అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రే డోనోవన్’ అనే వెబ్ సిరీస్‌కి అడాప్షన్ ఈ ‘రానా నాయుడు’. అంటే.. రీమేక్. ఈ వెబ్ సిరీస్‌లో వెంకటేశ్‌తో పాటు రానా, ప్రియా బెనర్జీ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ ద్వయం దర్శకత్వం వహించారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఏడాదే స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ‘రే డోనోవన్’ కథ విషయానికి వస్తే... బడా వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, స్పోర్ట్స్ పర్సన్స్ వంటి వారికి ఎదురైన సమస్యలను పరిష్కరిస్తుంటాడో వ్యక్తి. కానీ తన కుటుంబ సభ్యులు ఎవరైనా సెలబ్రిటీలకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే వాటి జోలికి మాత్రం వెళ్లడు. కుటుంబసభ్యులతో అతనికి ఎటువంటి భేదాభిప్రాయాలు వచ్చాయి? అతని కుటుంబ సభ్యుల్లో ఎవరైనా జైలుకు వెళ్లారా? అనే అంశాల నేపథ్యంలో సాగుతుందీ వెబ్ సిరీస్. ఈ సిరీస్‌కి రీమేక్‌గా వస్తున్న ‘రానా నాయుడు’ ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. మరోవైపు బ్రిటిష్ వెబ్ సిరీస్ ‘ప్రెస్’ అడాప్షన్ ‘ది బ్రోకెన్ న్యూస్’లో నటించారు సోనాలీ బెంద్రే. క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన తర్వాత సోనాలీ మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చింది ఈ వెబ్ సిరీస్ కోసమే. వినయ్ వైకుల్ డైరెక్ట్ చేసిన ‘ది బ్రోకెన్ న్యూస్’లో సోనాలీతో పాటు జైదీప్ అహ్లావత్, శ్రియా పిల్గొన్కర్ ప్రధాన పాత్రధారులు. ఈ సిరీస్‌లో అమీనా ఖురేషీ పాత్రలో కనిపిస్తారు సోనాలి. స్క్రిప్ట్ ప్రకారం.. ముంబైలో ‘ఆవాజ్ భారత్’, ‘జోష్ 24/7’ అనే రెండు న్యూస్ చానల్స్ ఉంటాయి. ‘ఆవాజ్ భారత్’ చానెల్ హెడ్‌గా ఉంటారు అమీనా. ఈ రెండు న్యూస్ చానెల్స్ టీఆర్పీ రేటింగ్ కోసం ఎలా పోటీ పడ్డాయి? టీఆర్పీని పెంచే క్రమంలో ఈ న్యూస్ చానెల్స్‌లోని సీనియర్ ఉద్యోగులు ఎలాంటి ఒత్తిడికి లోనయ్యారు? వాటి పరిణామాలు, పరిస్థితుల సమాహారంగా ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. ‘ది బ్రోకెన్ న్యూస్’ ఈ నెల 10 నుంచి జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే బ్రిటిష్ సిరీస్ ‘ది నైట్ మేనేజర్’ హిందీ అడాప్షన్‌లో నటిస్తున్నారు బాలీవుడ్ హీరో ఆదిత్యారాయ్ కపూర్. సందీప్ మోడి దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో శోభితా ధూళిపాళ్ల, అనిల్ కపూర్ ఇతర ప్రధాన పాత్రధారులు. ఆర్మీలో పని చేసిన అనుభవం ఉన్న ఓ వ్యక్తి ఒక ప్రముఖ హోటల్లో నైట్ మేనేజర్ డ్యూటీ చేస్తుంటాడు. ఇదే సమయంలో వ్యాపారవేత్త ముసుగులో చట్టవిరుద్ధంగా ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తుంటాడు మరో వ్యక్తి. ఈ వ్యాపారవేత్తను గమనించేందుకు ప్రభుత్వం కూడా అతని కదలికలపై ఓ స్పై టీమ్‌ను నియమిస్తుంది. ఇదే సమయంలో నైట్ మేనేజర్‌తో పరిచయం ఉన్న ఓ యువతి హత్యకు గురవుతుంది? ఈ హత్యకు కారకులు ఎవరు? ఆమెను ఎందుకు హత్య చేశారు. స్పై టీమ్‌కు, నైట్ మేనేజర్‌కు ఏమైనా సంబంధం ఉందా? అనే అంశాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. నిజానికి ఇందులో హృతిక్ రోషన్ చేయాల్సింది కానీ ఫైనల్‌గా ఆదిత్యా రాయ్ చేతికి వచ్చి చేరింది. పైన పేర్కొన్న వెబ్ సిరీస్‌లే కాదు.. మరికొన్ని హాలీవుడ్ సిరీస్‌లు రీమేక్ కానున్నాయి. -
డబ్బు కోసం అలాంటివి చేయక తప్పలేదు: సోనాలి బింద్రె
‘మురారి’, ‘ఖడ్గం’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’, ‘శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్’ వంటి పలు తెలుగు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది సోనాలి బింద్రె. 2013లో హిందీలో వచ్చిన వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దొబార చిత్రంలో అతిథిగా కనిపించిన ఆమె ఆ తర్వాత క్యాన్సర్‌తో పోరాడి గెలిచింది. ఇటీవలే ది బ్రోకెన్ న్యూస్ అనే వెబ్‌సిరీస్‌లో నటించగా ఇది జూన్ 10 నుంచి జీ5లో ప్రసారం కానుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'ఒకానొక సమయంలో నాకు చాలా డబ్బులు అవసరమయ్యాయి. ఇంటి అద్దె కట్టాలి, బిల్లులు చెల్లించాలి. అప్పుడు నా కుటుంబం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అందుకే నాకు ఎలాంటి పాత్రలు వచ్చినా చేసుకుంటూ పోయాను. అలా ఓ సినిమా చేసి ఇంకో సినిమాకు రెడీ అయ్యే సమయానికి అసలు ఎందుకా ప్రాజెక్ట్ ఒప్పుకున్నాను? అని ఆలోచించేదాన్ని. కానీ ఆ వెంటనే నెక్స్ట్ ప్రాజెక్ట్ డబ్బులు ఎప్పుడిస్తారో అని ఎదురుచూసేదాన్ని. అందుకే అతిగా ఆలోచించకుండా కొన్ని పాత్రలు చేసుకుంటూ పోయాను. ఆ సినిమాలు మీరే కాదు నేను కూడా చూడలేదు' అని చెప్పుకొచ్చింది సోనాలి బింద్రె. చదవండి: డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే? జవాన్ మూవీ.. మాస్ లుక్‌లో షారుక్ ఖాన్, టీజర్ చూశారా -
ఎన్టీఆర్ చిత్రంలో సోనాలి బింద్రే.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
Sonali Bendre Reacts On Acting In NTR 30 Movie With koratala Siva: ‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ జూలైలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇదివరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఇందులో ఎన్టీఆర్ సరికొత్తగా కనిపించనున్నారని టాక్. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? అన్నది ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే నటిస్తోందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సోనాలిని ఈ విషయం గురించి అడగ్గా స్పందించారు. ఏంటి ? నేనా ? అసలు దాని గురించే నాకు తెలియదు. దయ చేసి దాని గురించి మీరే చెప్పండి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు కొంచెం కూడా తెలియదు. నిజంగా అది నేను కాదేమో. ఇవన్ని తప్పుడు వార్తలు. ఒకవేళ అది నిజమైతే నన్ను ఎవరు సంప్రదించలేదు. ఇదంతా ఏదో థ్రిల్లర్‌లా ఉంది. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు సోనాలి బింద్రే. ప్రస్తుతం సోనాలి బింద్రే ది బ్రోకెన్ న్యూస్ అనే వెబ్ సిరీస్‌లో జర్నలిస్ట్ అమీనా ఖురేషీ పాత్రలో నటిస్తోంది. వినయ్ వైకుల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జీ5లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. చదవండి:👇 నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్ రావిపూడి ఇంటర్వ్యూలో యాంకర్ గొడవ.. ఏడ్చేసిన కృతి శెట్టి అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్ అలీ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_811248975.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
జీవితాన్ని.. క్యాన్సర్‌కి ముందు క్యాన్సర్ తర్వాత అని చెప్పాలి: నటి
Sonali Bendre Open Up On How She Struggled With Cancer: మురారి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సోనాలి బింద్రే. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఆమె పెళ్లి అనంతరం సినిమాలకు దూరమయ్యారు. అంతేకాదు 2018లో ఆమె క్యాన్సర్ బారిన పడిన ఆమె న్యూయార్క్‌లో చికిత్స అనంతరం కోలుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి క్యాన్సర్‌పై అవగాహాన కల్పించేందుకు స్వీయఅనుభవాలను షేర్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె క్యాన్సర్‌తో తను చేసిన పోరాటాన్ని, ఈ మహమ్మారి తన జీవితాన్ని ఎలా మార్చేసిందో గుర్తు చేసుకున్నారు. చదవండి: ముంబైలో కరణ్ బర్త్‌డే పార్టీ.. విజయ్, రష్మికలకు మాత్రమే ఆహ్వానం! క్యాన్సర్ వ్యాధి పోతూ తనకు 23 ఇంచుల సర్జరీ మచ్చను వదలేసిందని తెలిపింది. ‘క్యాన్సర్ బారి పడి కోలుకున్న వారి జీవితాలు.. క్యాన్సర్‌కు ముందు.. క్యాన్సర్‌కి తర్వాత అన్నట్టుగా ఉంటుంది. మనిషి తన జీవితంలో ఎదురైన సమస్యల నుంచి ఎదోక గుణపాఠం నేర్చుకుంటాడు. ఈ క్యాన్సర్ వ్యాధి తనకు ఎన్నో పాఠాలు నేర్పింది. అయితే దీని నుంచి నువ్వు ఏం నేర్చుకోలేదు అంటే నిజంగా అది బాధకరమైనది అవుతుంది. ఈ క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్న ఆ రోజులు నా జీవితంలో అత్యంత కఠినమైనవి. దీని వల్ల మన శరీరంలో వచ్చే మార్పులను స్వీకరించడం చాలా కష్టం. చదవండి: లండన్‌లో ‘పుష్ప’ సింగర్ వెడ్డింగ్ రిసెప్షన్, స్టార్ హీరో కూతురు సందడి ఇక క్యాన్సర్ వ్యాధితో చికిత్స తీసుకున్న నాకు నా శరీరంపై 23-24 ఇంచుల గాయం గుర్తు మిగిలిపోయింది. అందరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక గోల్ కాదు. కానీ ఈ సమయంలో జరిగే ప్రక్రియ, ప్రయాణం అనేది చాలా ముఖ్యం’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. కాగా ప్రస్తుతం క్యాన్సర్ నుంచి కోలుకున్న ఆమె త్వరలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని టాక్. ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో సోనాలీ బింద్రె కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. -
18ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న 'మురారి' హీరోయిన్
మురారి సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ సోనాలీ బింద్రే. తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత‘ఖడ్గం, మన్మధుడు, ఇంద్ర వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తొంభైలలో వెండితెరపై అగ్రనటిగా రాణిస్తూ.. తన గ్లామర్‌తో కుర్రకారును ఆకట్టుకున్న ఆమె వివాహం అనంతరం సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత టీవీ రంగంలోకి వెళ్లింది. కొన్నాళ్ల క్రితం ఆమె క్యాన్సర్ బారిన పడింది. అమెరికాలోని న్యూయార్క్‌లో చికిత్స తీసుకొని కోలుకుంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆమె మళ్లీ సినిమాల్లో నటించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో సోనాలీ బింద్రె కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా సినిమా కావడంతో ఆమె కూడా ఈ ప్రాజెక్టుకు వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. -
సోనాలీ బింద్రే ఆసక్తికర పోస్ట్
ముంబై: ఇంద్ర మూవీ ఫేమ్ సోనాలీ బింద్రే లాక్ డౌన్లో ఇంటికే పరిమితమైంది. అయితే సినిమాల పట్ల సోనాలీకి మాత్రం ఏ మాత్రం ఆసక్తి తగ్గలేదు. ఇటీవలే క్యాన్సర్‌ను జయించి, సమాజానికి ప్రేరణగా సోనాలీ నిలిచారు. ప్రస్తుతం సోనాలి బింద్రే షూటింగ్లో పాల్గొంటున్నారు. కరోనా నేపథ్యంలో సినిమా లొకేషన్లోకి వెళ్లే ముందు శానిటైజ్ చేసుకొని, శరీర ఉష్ణోగ్రతలను చెక్ చేసుకొని, పీపీఈ కిట్లను ధరించి మేకప్ వేయించుకుంది. కాగా సోనాలీ షూట్‌కు వెళ్లిన దృశ్యాల వీడియోను సోనాలీ షేర్ చేసింది. బ్యాక్ టు వర్క్ షూట్ డే(షూటింగ్లో పాల్గొంటు పనిలో నిమగ్నమయ్యాను) అంటూ సోనాలీ షేర్ చేసిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చదవండి: లాక్డౌన్ నాకు కొత్త కాదు! -
‘నా కలల రాకుమారి సోనాలి బింద్రే’
క్రికెట్-సినిమా ఈ రెండు రంగాల మధ్య రిలేషన్షిప్, మంచి బాండింగ్ ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక మంది టీమిండియా క్రికెటర్లు సినిమా హీరోయిన్లతో ప్రేమాయణం నడిపించారు. కొన్ని ప్రేమ జంటలు పెళ్లి పీటలు ఎక్కగా మరికొన్ని జంటలు ప్రేమికులుగానే విడిపోయారు. పటౌడీ, అజహరుద్దీన్, సౌరవ్ గంగూలీ వంటి క్రికెటర్లు కూడా హీరోయిన్లతో ప్రేమాయణం నడిపించినట్టు అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. ఇక విరాట్ కోహ్లి, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్‌లు బాలీవుడ్ హీరోయిన్లతో ప్రేమలో పడి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా బాలీవుడ్ నటి నటాశాతో నిఖా ఫిక్స్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ ఓ హీరోయిన్‌తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తనకు కూడా సెలబ్రెటీ క్రష్ ఉందని టీమిండియా సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా తాజాగా తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రైనా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రేపై తనకున్న ప్రేమని వివరించాడు రైనా. కాలేజీ రోజుల నుంచి సోనాలితో డేటింగ్‌కు వెళ్లాలనే ఆశ ఉండేదని తెలిపాడు. అయితే తన కోరిక నెరవేరలేదన్నాడు. కానీ.. ఓ రోజు సోనాలి నుంచి స్పెషల్ మెసేజ్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు. అమె ఎప్పటికీ తనతో పాటు ఎంతో మందికి కలల రాకుమారేనని అన్నాడు. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో పోరాడి గెలిచిన సమయంలో ఆమె యువ తరానికి ఓ రోల్ మాడల్‌గా నిలిచారని రైనా పేర్కొన్నాడు. ఇక గత కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న రైనా రానున్న ఐపీఎల్లో రాణించి టీమిండియాలో చోటు దక్కించుకోవాలిన ఉవ్విళ్లూరుతున్నాడు. చదవండి: పాక్ పౌరసత్వం కోసం సామీ దరఖాస్తు! మాకు కోహ్లి కావాలి: బంగ్లాదేశ్ ‘జడేజానే నా ఫేవరెట్ ప్లేయర్’ -
ఆమె గురించి చెప్పాలంటే; క్యాన్సర్ తర్వాత..
ఇండస్ట్రీలో టాప్ ప్లేస్‌లో ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో హీరోయిన్ సొనాలి బింద్రేను క్యాన్సర్ మహమ్మారి కుదిపేసింది. కానీ పడి లేచిక కెరటంలా ఆమె మామూలు స్థితికి రావడమే కాకుండా తనలాంటి వాళ్లలో పోరాడగలమన్న ధైర్యాన్ని నింపింది. క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న రోజుల్లో ఒంటరిగా కూర్చొని ఏడ్చిన ఆమె ఆ తర్వాత తన లాంటి వాళ్లకు మాటలతో ఉపశమనాన్ని కలిగించే ప్రయత్నం చేసింది. క్యాన్సర్ గురించి ఎంతో మందికి అవగాహన కల్పించింది. ఇక తన గురించి చెప్పాలంటే క్యాన్సర్‌కు ముందు, క్యాన్సర్ తర్వాత అని చెప్పాల్సి ఉంటుంది. నేడు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె క్యాన్సర్ సమయంలో పోరాడిన క్షణాలను, క్యాన్సర్ బాధితుల్లో ఉత్తేజం నింపిన పోస్టుల గురించి తెలుసుకుందాం.. సొనాలి బింద్రే గత పుట్టిన రోజు కన్నా ముందు ఓ ఫొటో పోస్ట్ చేసింది. ఇందులో సొనాలి దీనంగా చూస్తున్న కళ్లతో బాధాతప్త హృదయంతో కనిపిస్తుంది. ‘నేను పోరాడటానికి, నాకు వచ్చిన క్యాన్సర్‌ను నయం చేయడానికి నాతో పాటు ఎందరో నిలబడ్డారు. వారికి కృతజ్ఞతలు. ఇక జీవితంలో ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి.. అందులో నా జుట్టు ఒకటి అని తను జుట్టు కత్తిరించుకుంటున్న ఫొటోను పోస్ట్ చేసింది. క్యాన్సర్ తర్వాత ఆమె కుంగిపోయిన మాట వాస్తవమే కానీ కుంగుబాటు నుంచి బయటకు వచ్చాక ఎంతోమంది తనలా బాధపడుతూ ఉన్నారని గ్రహించింది. వారితో ‘వాస్తవాన్ని అంగీకరించాలని, దాన్ని ఎదుర్కోవాలి’ అని పదేపదే చెబుతుండేది. ఇక క్యాన్సర్ ట్రీట్మెంట్ అనంతరం గుండుతో, మేకప్ లేకుండా ఇండియాకు తిరిగొచ్చిన సొనాలీ సరికొత్త ఫొటో షూట్లతో అభిమానులను పలకరించింది. ‘నేను మీకు నేను శాంతిని ఇస్తున్నాను. దీంతో మీరు మీ స్వేచ్ఛను కనుగొంటారు’ అని హామీ ఇస్తున్నట్టుగా ప్రసన్న వదనంతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ‘పారాచ్యూట్ ఆయిల్ యాడ్ తర్వాతే నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. జీవితంలో ఎన్నో కోల్పోతామని అందులో జుట్టు కూడా ఒకటి. దానికోసం ఆలోచించడం బుద్ధి తక్కువ పని’ అంటూ తనకు తానే ధైర్యం చెప్పుకుంది. ఫిబ్రవరిలో జరిగే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నాడు సోనాలి తన మనసులో ఉన్న భావాలను సోషల్ మీడియాలో పంచుకుంది. క్యాన్సర్ గురించి బాధపడటం, దానితో పోరాడుతున్నాం అని పిలిపించుకోవడం క్యాన్సర్ కన్నా దారుణం. ముందు దాన్ని ఎలా తగ్గించుకోవాలని ఆలోచించండి. ఇవాళ కాకపోతే రేపైనా మంచి జరుగుతుందన్న ఆశాభావంతో గడపండి. ఇది ప్రతికూల ఆలోచనలతో యుద్ధం కాదు, మీకు మీరే వాటిని దరిచేరనీయకుండా చేసుకునే ప్రయత్నం’ అంటూ ఇన్స్పిరేషనల్ పోస్ట్ పెట్టింది. వినాయక చతుర్థి సమయంలోనూ ‘నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోకండి’ అని క్యాన్సర్ బాధితుల్లో విశ్వాసాన్ని నింపింది. 2018 అక్టోబర్‌లో సొనాలి క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న సమయంలో ఎంత బాధను భరించిందో చెప్పుకొచ్చింది. ‘కనీసం చేతి వేలును ఎత్తాలన్నా నొప్పి కలిగేది. నేను ఓ చట్రంలో బంధీ అయిపోయాననిపస్తోంది. శారీరక బాధ కాస్తా మానసిక బాధకు దారి తీస్తోంది. కనీసం నవ్వినా కూడా నొప్పి పుడుతోంది. కానీ నేను చేస్తున్న యుద్ధానికి ఇవన్నీ తప్పవు. పోరాటం ఆపకూడదు’ అంటూ మానసిక ధైర్యాన్ని కూడదీసుకుంది. ‘క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న సమయంలో నొప్పిని అనుభవించాను, భరించలేక ఏడ్చాను. కానీ అవి మనం స్వీకరించాలి. భావోద్వేగాలు తప్పు కావు. కానీ కొంత కాలానికి వాటిని గుర్తించి దాన్నుంచి బయటపడటానికి ప్రయత్నించాలి’ అని చెప్పుకొచ్చింది సొనాలి బింద్రే. -
జుహూ బీచ్‌ను చూడండి.. ఎలా ఉందో : నటి
ముంబై : గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా లక్షల సంఖ్యలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన గణేష్ విగ్రహాలను సముద్రాలు, నదులలో నిమజ్జనం చేస్తుండటం వల్ల పర్యావరణానికి తీరని హాని కలుగుతోందని ప్రకృతి ప్రేమికులు ఆందోళన చెందుతుండటం తెలిసిందే. ఈ విషయంలో చైతన్యం తీసుకురావడానికి ఎంత ప్రచారం చేస్తున్నా.. ప్రజల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాల వల్ల సముద్ర జలాలు కలుషితం అవుతుండటంపై తాజాగా ప్రముఖ నటి సోనాలి బింద్రె ఆవేదన వ్యక్తం చేశారు. జుహూ బీచ్‌లో వినాయకుని విగ్రహాలు నిమజ్జనం చేయగా అక్కడ ఏర్పడిన విగ్రహా వ్యర్థాలు, ఇతర పూజా సామాగ్రిని ఓ చోట కుప్పగా పోసిన ఆ ఫోటోను ఆమె ట్విటర్లో పోస్టు చేశారు. ‘నిన్న జహూ బీచ్‌లో గణేష్ నిమజ్జనం తర్వాత తీసిన ఫోటో ఇది. ఇవి మనకు నష్టం కలిగించే సంకేతాలు కాకపోతే మరేంటో నాకు తెలియదు. ఇలా జరగకూడదు. ఇంతకన్నా మనం బాగా చేయాల్సిన అవసరం ఉంది’ అని ట్వీట్ చేశారు. దీంతో పర్యావరణహితంగా గణేష్ చతుర్థిని తాము ఎలా జరుపుకున్నామో చెబుతూ కొందరు ఆమెకు రిప్లై ఇచ్చారు. వారి రిప్లైలకు సంతోషం వ్యక్తం చేసిన సోనాలి బింద్రే సంప్రదాయ దుస్తులు ధరించి గణేష్ వేడుకల్లో పాల్గొన్న మరొక ఫోటోను షేర్ చేశారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల గత సంవత్సరం గణేష్ ఉత్సవాలలో పాల్గొనలేదని, ఈ సంవత్సరం తన కుటుంబసభ్యులతో కలసి ఉత్సాహంగా పోల్గొన్నానని ఆమె తెలిపారు. పర్యావరణహితంగా గణేష్ పండుగను జరుపుకోవాలని, అదే నిజమైన పండుగ స్ఫూర్తి అని ఆమె పేర్కొన్నారు. ఇక, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారుచేసిన విగ్రహాల వల్ల ఏర్పడే కాలుష్యంపై ప్రధాని మోదీ కూడా ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పర్యావరణానికి హానీ కల్గించే విగ్రహాలను నదుల్లో, చెరువుల్లో నిమజ్జనం చేయరాదని ఆయన ప్రజలను కోరారు. గణేష్ విగ్రహాలు, ఇతర పూజా సామాగ్రి వల్ల నదులు, సముద్రాలు కలుషితం అవుతున్నాయని, కాలుష్యాన్ని తగ్గించే సమయం ఆసన్నమైందని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇది చదవండి : శోభాయాత్ర సాగే మార్గాలివే..! -
‘సోనాలీ బింద్రేను కిడ్నాప్ చేద్దామనుకున్నా’
ముంబై: పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌కు అప్పట్లో బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని గతంలోనే చాలాసార్లు బహిరంగంగా వెల్లడించాడు కూడా. అప్పట్లో దీనిపై పెద్ద దుమారమే రేగింది. తను అంటే చాలా ఇష్టమని అక్తర్ పదే పదే చెప్పడం కూడా సోనాలీకి ఆగ్రహం తెప్పించిన సందర్భాల్లో కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే అసలు అక్తర్ ఎవరో తనకు తెలియదని సోనాలీ బింద్రే ఒకానొక సందర్భంలో వ్యాఖ్యానించి ఆ ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’కు గట్టి కౌంటరే ఇచ్చారు. అయితే తాజాగా ఓ చాట్‌షోలో మరోసారి సోనాలీ బింద్రే ప్రస్తావన తీసుకొచ్చాడు అక్తర్. తన ప్రేమకోసం ఏకంగా ఆమెను కిడ్నాప్ చేద్దామనుకున్నాడట. సోనాలీ నటించిన ‘ఇంగ్లీష్ బాబు దేసీ మేమ్’ అనే బాలీవుడ్ మూవీతో ఆమెపై ఇష్టాన్ని పెంచుకున్నాననీ.. అప్పట్నుంచి సోనాలీ ఫొటోను తన జేబులోనే పెట్టుకొని తిరిగేవాడినని చెప్పుకొచ్చాడు. ఒకవేళ తన ప్రేమను ఒప్పుకోకపోతే.. సోనాలీని కిడ్నాప్ కూడా చేయాలనుకున్నానని ఆ షోలో తెలిపాడు. -
‘ఆరోజంతా ఏడుస్తూనే ఉన్నాను’
తాను క్యాన్సర్‌తో బాధ పడుతున్నానంటూ బాలీవుడ్ హీరోయిన్ సొనాలీ బింద్రే.. చేదు నిజాన్ని వెల్లడించిన నాటి నుంచి ఆమె కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో వేదనకు గురయ్యారు. సాఫీగా సాగుతున్న సోనాలీ బింద్రే జీవితంలో క్యాన్సర్ రూపంలో పెద్ద కుదుపు. గతేడాది బాలీవుడ్ షాకింగ్ మూమెంట్స్‌లో ఇదొకటి. అయితే న్యూయార్క్‌లో చికిత్స తీసుకున్న అనంతరం సొనాలీ ఆరోగ్యం కాస్త కుదుట పడింది. ఆమె తిరిగి ముంబైకి రావడంతో పాటు కొన్ని యాడ్ షూటింగ్లలో కూడా పాల్గొంటూ మళ్లీ సాధారణ జీవితంలో పడిపోయారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అయితే తనకు క్యాన్సర్ అని తెలియగానే షాక్ గురైన సొనాలీ ఆరోజు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారట. ‘ ఈ విషయం గురించి తెలిసిన రోజంతా ఏడుస్తూనే ఉన్నాను. కానీ మరుసటి రోజే నిజాన్ని అంగీకరించాను. ఇకపై ఏడ్వకూడదని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి నా జీవితంలో మళ్లీ సంతోషం మొదలైంది. నా జీవితంలో సూర్యుడు మళ్లీ ప్రకాశించడం మొదలుపెట్టాడు. ఇందుకు నిదర్శనంగా నా కుటుంబం, నా గర్ల్స్(తన స్నేహితురాళ్లను ఉద్దేశించి)తో దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసినపుడు స్విచ్ ఆన్ సన్‌షైన్ అని పెడతాను’ అంటూ బీఎఫ్ఎఫ్(బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్) విత్ వోగ్ సీజన్ 3లో తన భర్త, స్నేహితులతో ఉన్న అనుబంధం గురించి మరోసారి చెప్పుకొచ్చారు. అదీ ఓ కారణం.. ‘ గోల్డీని పెళ్లి చేసుకుని 16 ఏళ్లు అయ్యింది. నాకు క్యాన్సర్ అని తెలియగానే మొదట నాకు గుర్తొచ్చిన వ్యక్తి తనే. నాకేమైనా అయితే తను ఎలా ఉండగలుగుతాడనే ఆలోచన నన్ను వెంటాడేది’ అని పేర్కొన్నారు. అదే విధంగా న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న సమయంలో తన ప్రాణ స్నేహితులు సుసానే ఖాన్(హృతిక్ మాజీ భార్య), గాయత్రి జోషి అక్కడికి వచ్చి తనతో సమయం గడిపేవారని తెలిపారు. పిల్లలను స్కూళ్లో డ్రాప్ చేయడం, మళ్లీ నా దగ్గరికి వచ్చి కబుర్లు చెప్పడం, ఇలా నా కోసం ఎంతో సమయం కేటాయించేవారు. కీమో, సర్జరీ జరుగుతున్న సమయంలోనూ నేను ధైర్యంగా ఉండటానికి కుటుంబ సభ్యులతో పాటు వాళ్ల సాన్నిహిత్యం కూడా ఓ కారణం అని సొనాలీ చెప్పుకొచ్చారు. -
‘నాకు క్యాన్సర్ ఉందని తెలిసి షాకయ్యారు’
ముంబాయి: బాలీవుడ్ నటి సోనాలి బింద్రే గత ఏడాది నుంచి హైగ్రేడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెల్సిందే. క్యాన్సర్‌ను త్వరగా గుర్తించడం, వ్యాధి గురించి ప్రజలను చైతన్యం చేయడమనేది తప్పనిసరి బాధ్యతని సోనాలి బెంద్రే గుర్తు చేశారు. గత ఏడాది జూలైలో సోనాలి బింద్రేకు క్యాన్సర్ సోకిందని నిర్ధారణ కావడంతో ఆమె చికిత్స నిమిత్తం న్యూయార్క్‌కు వెళ్లారు. సుమారు 6 నెలల చికిత్స తర్వాత డిసెంబర్లో ముంబాయికి తిరిగి వచ్చారు. కన్సార్టియం ఆఫ్ అక్రిడేటెడ్ హెల్త్‌కేర్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఐదో అంతర్జాతీయ కాన్పరెన్స్ కార్యక్రమంలో ఆమెపాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనాలి మాట్లాడుతూ.. వ్యాధి భయంకరమైనది అయినప్పటికీ ముందుగా గుర్తించడం వల్ల చికిత్స సమయంలో బాధ తక్కువగా ఉండేలా చేసుకోవచ్చన్నారు. ముందుగా గుర్తించడమనేది చాలా ముఖ్యమైన విషయమన్నారు. ప్రస్తుతం వ్యాధి అంత భయానకమైనది కాకపోయినప్పటికీ చికిత్స సమమంలో ఎక్కువ భయపడటంతో పాటు బాధపడాల్సి వస్తోందని తెలిపారు. తనకు క్యాన్సర్ వ్యాధి ఉందని నిర్ధారణ అయినపుడు, తన కుటుంబంలోని సభ్యులకు కూడా గతంలో క్యాన్సర్‌తో చనిపోయారనే విషయం తెలిసిందని చెప్పారు. తనకు క్యాన్సర్ వ్యాధి ఉందని తెలిసి చాలా మంది షాక్ అయ్యారని గుర్తు చేశారు. క్యాన్సర్‌పై విస్తృత స్థాయిలో అవగాహన పెంపొందించడం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. వ్యాధుల గురించి అవగాహన పెంచడంపై ఆసుపత్రులు కీలక పాత్ర పోషించాలని కోరారు. -
బాలీవుడ్ స్టార్స్‌కు షాకిచ్చిన కోర్టు
జైపూర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణజింక వేట కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ కేసులో గతంలో కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన బాలీవుడ్ నటులు టబు, సోనాలి బింద్రే, సైఫ్ అలీ ఖాన్, దుష్యంత్ సింగ్, నీలమ్ కొఠారిలకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 1998 అక్టోబర్‌లో 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రీకరణ సమయంలో సల్మాన్ ఖాన్‌తో కలిసి వీరంతా కృష్ణ జింకలను వేటాడారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. జోధ్‌పూర్ కోర్టు గతేడాది ఈ కేసుకు సంబంధించిన తీర్పును వెలువరిస్తూ సల్మాన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. మిగతావారిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే.. ఈ కేసులో సల్మాన్‌ది ఎంత తప్పు ఉందో అతనితో పాటు ఉన్న వారిది కూడా అంతే తప్పు ఉందని భావిస్తూ జోధ్‌పూర్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రేలకు నోటీసులు జారీ చేసింది. 1998 నాటి ఈ కేసులో జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు సల్మాన్‌ని దోషిగా నిర్ధారిస్తూ ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే. శిక్షపడిన తర్వాత సల్మాన్ జోధ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. (చదవండి : టబు, సోనాలీలు తప్పించుకోవడానికి కారణమిదే!) -
భయానికి ఇక చోటు లేదు
సాఫీగా సాగుతున్న సోనాలీ బింద్రే జీవితంలో క్యాన్సర్ రూపంలో పెద్ద కుదుపు. గతేడాది షాకింగ్ మూమెంట్స్‌లో ఇదొకటి. క్యాన్సర్ అని తెలియగానే సోనాలీ ఎంత షాకయ్యారో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు అంతే షాక్‌కి గురయ్యారు. ఎంత గొప్ప సమస్యను దాటగలిగితే అంత గొప్ప హీరో అయినట్టు, హీరోయిన్ సోనాలి క్యాన్సర్‌ను ధైర్యంగా ఎదుర్కొని.. పోరాడి గెలిచి సూపర్ హీరోయిన్గా నిలిచారు. ఎంతోమందికి స్ఫూర్తిగా మారారు. క్యాన్సర్ చికిత్స జరుగుతున్నంత కాలం సోషల్ మీడియా ద్వారా విషయాలను షేర్ చేశారు. తాజాగా ‘ఇండియా టుడే కాంక్లేవ్ 2019’ కార్య క్రమంలో సోనాలి మనసు విప్పి, చాలా విషయాలు చెప్పారు. అవి ఆమె పోరాట పటిమను తెలియజేశాయి. సోనాలి మాటల్లో ఆ విశేషాలు.. క్యాన్సర్‌ను దాచదలచుకోలేదు క్యాన్సర్ ఉందని తెలియగానే నా చుట్టూ వినిపించింది ఒక్కటే.. ‘నీ లైఫ్‌స్టైల్ చాలా బాగుంటుంది. నీకెందుకు ఇలా జరిగింది?’ అని. న్యూయార్క్‌లో సైకియాట్రిస్ట్‌తో మాట్లాడేంత వరకూ నా వల్లే క్యాన్సర్ వచ్చిందేమో అనే భ్రమలో నేను కూడా ఉండిపోయా. ‘‘నాకేం జరుగుతుందో నాకు అర్థం కావడంలేదు. నేను నెగటివ్ పర్సన్‌ని కాదు. నాది చాలా పాజిటివ్ లైఫ్ స్టైల్. ఒకవేళ నెగటివ్ ఆలోచనలు ఉన్నా కూడా వాటిని లోలోపలే దాచేసి బయటకు ఏం జరగనట్టు నటించేదాన్నా? నాకు అర్థం కావడంలేదు’’ అని సైకియాట్రిస్ట్‌తో చెప్పా. ఆ రోజు ఆయనిచ్చిన సమాధానమే నాకు స్ఫూర్తి మంత్రాలయ్యాయి. క్యాన్సర్‌ను ఎదుర్కోగలన నే ఆశను పెంచాయి. ‘‘సోనాలీ.. క్యాన్సర్ అనేది జీన్స్ వల్ల కానీ వైరస్ వల్ల కానీ వస్తుంది. ఆలోచనల వల్ల కాదు. ఒకవేళ ఆలోచనలే క్యాన్సర్ బారినపడేట్టు చేసి లేదా క్యాన్సర్ నయం అయేట్టు చేస్తాయంటే, మాకంటే (సైకియాట్రిస్ట్) ధనవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే మేం ఆలోచనలతో వ్యవహరించేవాళ్లం కదా’’ అని చెప్పారాయన. అప్పుడు క్యాన్సర్‌కి కారణం నేను కాదనే భ్రమలో నుంచి బయటపడ్డా. అ నిమిషం నా మీద నుంచి కొన్ని వందల కేజీల బరువును మాటలతో తుడిచేసినట్టు అనిపించింది. క్యాన్సర్‌ను ఎదుర్కోగలను అనే నమ్మకం ఏర్పడింది. మనమేం తప్పు చేశామని ఆలోచించడం ఆపేశాను. అన్ని క్యాన్సర్లు ఒకలా ఉండవు. దాన్ని నయం చేసే ఫార్ములా ఒక్కో శరీరానికి ఒక్కోలా ఉంటుంది. చాలా మంది క్యాన్సర్ వచ్చిన విషయాన్ని ఎందుకు దాచిపెట్టాలని అనుకుంటారో అర్థం అయ్యేది కాదు. నేను దాచిపెట్టదలచుకోలేదు. నాకు ఇలా జరిగింది అని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే వచ్చిన స్పందన ఎంతో ఆనందాన్ని, భరోసాని కలిగించాయి ఆ కారణమేంటో కనుక్కుంటా! ‘లైఫ్‌లో మళ్లీ పని చేస్తానో లేదో’ అని ఆలోచించిన రోజులు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని చెప్పడానికి ఇప్పుడు ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వను. నెక్ట్స్ ఏం చేయబోతున్నానో నాకు కచ్చితంగా తెలియదు. సినిమాల్లో నటిస్తానా? తెలియదు. కానీ నేను చేయాల్సిన పని మాత్రం కచ్చితంగా ఉందని నాకు అనిపిస్తోంది. లేకపోతే ఇంత దూరం వచ్చేదాన్ని కాదు కదా. నేను మళ్లీ మామూలు మనిషి కావడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏంటో కనుక్కుంటా. ఏడవకూడదని ప్రామిస్ చేసుకున్నా ఎన్నో హెయిర్ ఆయిల్స్‌ని ప్రమోట్ చేశాను. కానీ నా హెయిర్‌ని నేను కోల్పోయాను. ఇంటి నుంచి బయటికు అడుగుపెట్టిన ప్రతిసారీ మన ఆ పాత హెయిర్ మనకు లేదు అనే ఫీలింగ్ వస్తుంది. ఆ భావన కాసేపే. జుత్తు సంగతి ఎలా ఉన్నా నా కనుబొమ్మలు మళ్లీ మామూలుగా అయినందుకు ఆ దేవుడికి కృజ్ఞతలు తెలపాలి. కళ్లకు పెట్టుకున్న ‘మస్కరా’ కరిగిపోతుంది కాబట్టి మనం ఏడవకూడదని నాకు నేను ప్రామిస్ చేసుకున్నా. ఇప్పుడు నేను చెబుతున్నవి చిన్న విషయాలే కావొచ్చు కానీ వాటి ప్రభావం చాలా ఉంటుంది. నిజానికి నేను మస్కరా పెట్టుకుని చాన్నాళ్లయింది. ఇప్పుడు మళ్లీ పెట్టుకున్నందుకు ఆనందంగా ఉంది. నా బ్రాండ్ అయిపోయింది నటిగా నా కెరీర్లో ఎన్నో బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించాను. గ్లామర్ ఫీల్డ్‌లో లుక్సే ప్రధానం. సొసైటీలో కూడా కదా? నా కెరీర్ అంతా దాని చుట్టూనే తిరుగుతుంది. నాకు క్యాన్సర్ అని తెలుసుకున్నాక నా ప్రపంచం తల్లకిందులైంది. నా టీమ్‌ను పిలిచాను. నేను క్యాన్సర్‌తో బాధపడుతున్నాను అనే విషయాన్ని పంచుకున్నాను. ‘ఆరోగ్యకరమైన ఉత్పత్తులకు ఇన్ని రోజులు అంబాసిడర్‌గా చేశాను. ఇప్పుడు నా బ్రాండ్ అయిపోయింది. నేను చికిత్స కోసం విదేశాలు వెళ్తున్నాను. చికిత్స తాలూకు పరిణామాలేంటో కూడా సరిగ్గా తెలియదు’ అని చెప్పా. వాళ్లంతా నాతో ఉంటానన్నారు, ఉన్నారు కూడా. జాలి, దయ నాకెట్టి పరిస్థితుల్లోనూ వద్దని వాళ్లతో స్ట్రిక్ట్‌గా చెప్పాను. వాటిని నేనస్సలు నమ్మను. ఫ్యామిలీయే సపోర్ట్ నాకున్న పెద్ద సపోర్ట్ సిస్టమ్ నా ఫ్యామిలీయే. నా భర్త గోల్డీ బెహల్, సోదరి రూప నాకు చాలా సపోర్ట్‌గా నిలిచారు. ధైర్యం పంచారు. నాకు క్యాన్సర్ అని నిర్ధారణ అయినప్పుడు మా అబ్బాయి రణ్వీర్ స్కూల్ ట్రిప్‌లో ఉన్నాడు. వాడిని ఇంటికి పంపించకుండా నా దగ్గర (హాస్పటల్) కొన్ని రోజులు ఉంచాం. వాడి దగ్గర విషయం దాచలేదు. వాణ్ని మేమలా పెంచలేదు. నా వ్యాధి విషయం చెప్పగానే ‘ఇది కొంచెం టఫ్ టైమ్. కానీ మేం నీతో కలిసే ఉంటాం’ అని చెప్పాడు. నాకు కీమోథెరపీ చేసినప్పుడు ‘‘నీ శరీరం మొత్తం బ్లడ్, ట్యూబ్స్ ఉంటాయి అనుకున్నాను, మామూలుగానే ఉందే’’ అన్నాడు రణ్వీర్. భర్త గోల్డీ బెహల్‌తో... మానసిక బాధే కష్టం చికిత్స జరిగినంత కాలం సాఫీగా సాగిపోయిందంటే నేను అబద్ధం చెబుతున్నట్టే. ఈ ప్రయాణంలో చాలా నొప్పి కూడా దాగుంది. సర్జరీ జరిగిన తర్వాత లైఫ్ చాలా టఫ్‌గా గడిచింది. నా శరీరం మీద ఆపరే షన్ తాలూకా 20 అంగుళాల మచ్చ ఉండిపోయింది. ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లే ముందు మా సిస్టర్ నన్ను కౌగిలించుకుంది. ‘మరీ అంత డ్రామా వద్దు. మళ్లీ తిరిగొస్తాను’ అని చెప్పా. కానీ ఎక్కడో ‘నా అబ్బాయికి, మా ఫ్యామిలీకి నేను ఉండనేమో?’ అనే ఆలోచనే చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపించింది. ఆపరేషన్ జరిగి బయటకు రాగానే ‘నేను బతికే ఉన్నాను. శారీరక బాధ బాధే. ఆ బాధ సుదీర్ఘం కాదు. కానీ శారీరక బాధ కన్నా మానసిక బాధ మరింత బాధాకరం. అది మనిషిని కుంగదీస్తుంది’ అనిపించింది. సోదరి రూపాతో... కుమారుడు రణ్వీర్తో... ప్రయాణాన్ని ఇలానే కొనసాగిస్తా ఇంతకు మునుపు ఏదైనా పని చేస్తున్నప్పుడు భయంగా అనిపిస్తే అసలు ఈ పని ఎందుకు చేస్తున్నాను? అని నన్ను నేను ప్రశ్నించుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఆ భయం పోయింది. ఇంక నా జీవితంలో భయానికి చోటు లేదు. భయపడటమే మరిచానని నా ప్రయాణాన్ని చూసి తెలుసుకున్నాను. నటిగా నాకు తెలియని, ఎటువంటి పరిచయాలు లేని ఒక ఇండస్ట్రీకు వచ్చాను. సాధారణ మహారాష్ట్ర మిడిల్ క్లాస్ అమ్మాయి బాలీవుడ్లో హీరోయిన్ అవ్వాలనుకోవడం చాలా పెద్ద కల. చాలా కష్టంతో కూడుకున్న కల. నా కల గురించి తెలుసుకొని మా ఇంట్లోవాళ్లు షాక్ అయ్యారు. కానీ అలాంటి పెద్ద కల కనడానికి నేను భయపడలేదు, నా సామర్థ్యాన్ని సందేహించలేదు. కానీ వాళ్లెందుకు భయపడ్డారో అన్న విషయం మేం తల్లిదండ్రులం అయ్యాక తెలుసుకున్నాను. బిడ్డల భవిష్యత్తు పట్ల ఏ తల్లిదండ్రికైనా కొన్ని భయాలు ఉంటాయి. అయితే నేను, నా భర్త గోల్డీ ఎలాంటి భయాలు లేకుండా జీవించాలనుకుంటున్నాం. సంతోషమైన విషయమేంటంటే నేనింకా బతికే ఉన్నాను, ఇలా మాట్లాడగలుగుతున్నాను. ఈ ప్రపంచానికి థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను. -
నమ్మలేనట్టుగా అనిపిస్తోంది!
క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం సోనాలీ బింద్రే లండన్‌లో కొంత కాలం గడిపిన సంగతి తెలిసిందే. ఇటీవలే ముంబై వచ్చిన సోనాలి మళ్లీ షూటింగ్ లొకేషన్లో అడుగుపెట్టారు. అయితే ఇది సినిమా షూటింగ్ కాదు.. యాడ్ షూటింగ్ కోసం. చాలా కాలం తర్వాత సెట్లో అడుగుపెడుతుంటే నమ్మలేనట్టుగా అనిపిస్తోంది అని పేర్కొన్నారామె. ‘‘మళ్లీ పనిలో పడటం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను. మరింత బాధ్యతగా, అర్థవంతంగా సెట్లోకి అడుగుపెట్టాను. మళ్లీ కెమెరాను ఎదుర్కోవడం, ఎమోషన్స్‌ను పలికించడం హ్యాపీగా ఉంది’’ అంటూ పేర్కొన్నారు సోనాలి. యాడ్స్‌లో నటిస్తున్న ఆమె మళ్లీ సినిమాల్లోనూ నటిస్తారా? వేచి చూద్దాం. -
ఈ ఏడాది నీకంతా సంతోషమే
క్యాన్సర్ వ్యాధి చికిత్సలో భాగంగా కీమోథెరపీ కోసం న్యూ యార్క్ వెళ్లిన సోనాలి బింద్రే ఇటీవల ముంబై చేరుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం న్యూ ఇయర్ మాత్రమే కాదు సోనాలి పుట్టినరోజు కూడా. ఆమె బర్త్‌డే వేడుకలు బంధుమిత్రుల మధ్య జరిగాయి. సునైనా ఖాన్, మలైకా అరోరాఖాన్, అర్జున్ కపూర్, సంజయ్ కపూర్, కునాల్ కపూర్, గాయత్రి ఒబెరాయ్ తదితర సినీ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనాలి భర్త గోల్డీ బెహల్ ఓ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశారు. ‘‘జీవితంలో మీ జీవిత భాగస్వామి మీకు మంచి ఫ్రెండ్‌గా, ప్రతిబింబంగా, సపోర్ట్‌గా, స్ఫూర్తిగా ఉండాలంటారు. వాటన్నింటికంటే ఎక్కువే నువ్వు నాకు ఇచ్చావ్. 2018కి నీకు చాలా కష్టంగా గడిచిన ఏడాది. కానీ కష్టాన్ని నువ్వు ఎదుర్కొన్న తీరు నన్ను గర్వపడేలా చేస్తోంది. నన్ను నాకు మరింత పరిచయం చేశావ్. నీ సానుకూల దృక్పథమైన ఆలోచన ధోరణి ఇంకా పెరగాలి. నువ్వు నీలా ఉన్నందుకు థ్యాంక్స్. ఈ ఏడాది నీ జీవితంలో అద్భుతమైన సంతోషాలను తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే సోనాలి’’ అని పేర్కొన్నారు గోల్డీ. -
ముంబైకి తిరిగొచ్చిన సోనాలీ బింద్రే
ముంబై: క్యాన్సర్‌తో బాధపడుతూ న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న హీరోయిన్ సోనాలీ బింద్రే ముంబైకు తిరిగొచ్చారు. సోమవారం తెల్లవారుజామున ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆమెకు స్నేహితులు, బంధువులు స్వాగతం పలికారు. సోనాలీతో పాటు ఆమె భర్త గోల్డీ బెహల్ కూడా ఉన్నారు. ఈ సమయంలో సోనాలీ తనను చూడటానికి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చినవారికి అభివాదం తెలుపుతూ.. నవ్వుతూ కనిపించారు. గత కొంత కాలంగా హై గ్రేడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న సోనాలీ న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అంతకుముందు తను భారత్‌కు వస్తున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన సోనాలీ.. తనకు క్యాన్సర్ ఇంకా నయం కాలేదని పేర్కొన్నారు. భారత్‌లో సాధారణ జీవితం గడిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ‘నా హృదయం ఎక్కడైతే ఉందో(భారత్) అక్కడికి బయలుదేరుతున్నాను. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. కానీ నేను ప్రయత్నిస్తాను.. చాలా రోజుల తరువాత నా కుటుంబాన్ని, మిత్రులను కలుసుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించే అంశం. కాన్సర్‌తో నా పోరాటం ఇంకా ముగియలేదు. కానీ ఈ సమయాన్ని నేను ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాన’ని సోనాలీ ఆ సందేశంలో పేర్కొన్నారు. సోనాలీ ఆరోగ్య పరిస్థితిపై గోల్డీ మాట్లాడుతూ.. సోనాలీ ప్రస్తుతం బాగానే ఉందని తెలిపారు. తను వేగంగా కోలుకుంటుందని.. ప్రస్తుతానికి చికిత్స ముగిసిందని పేర్కొన్నారు. కానీ ఈ వ్యాధి మళ్లీ తిరిగి రావచ్చు.. అందుకే రెగ్యూలర్‌గా చెకప్‌లు చెయించుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. -
గోల్డీ... నువ్వు నా ధైర్యానివి
సోనాలీ బింద్రే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చికిత్స నిమిత్తం న్యూయార్క్‌లో ఉంటున్నారామె. నవంబర్ 12న సోనాలీ బింద్రే, గోల్డీ బెహల్ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా భర్తతో ఉన్న అనుబంధం గురించి సోనాలీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంతో నిండిన లేఖను రాశారు. అందులోని సారాంశం ఏంటంటే... ‘‘ఈ లేఖ రాయడం మొదలు పెట్టగానే నా ఆలోచనలు, అనుభవాలకు అక్షర రూపం ఇవ్వలేనని నాకు అర్థం అయిపోయింది. కానీ ప్రయత్నిస్తాను. గోల్డీ.. నువ్వు నాకు భర్త మాత్రమే కాదు. నా ఆప్తమిత్రుడివి. నా సహచరుడివి. నా ధైర్యానివి. కష్టసుఖాల్లో, గెలుపోటముల్లో, ఆరోగ్య, అనారోగ్యాల్లో ఒకరికొకరు తోడుగా నిలబడటమే కదా పెళ్లి అంటే. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే క్యాన్సర్ ఒక్కళ్లు మాత్రమే చేసే యుద్ధం కాదు. ఒక కుటుంబం మొత్తం పడే బాధ. వేదన. నువ్వు అన్ని బాధ్యతలు తీసుకోగలవని, ఇంకొన్ని కూడా తీసుకొని ఇంట్లో ఉండగలవని నాకు తెలుసు. అందుకే ఈ జర్నీని కొనసాగిస్తున్నాను. ఇన్ని రోజులుగా రెండు ఖండాల చుట్టూ తిరుగుతూ ఉన్నావు. థ్యాంక్స్ గోల్డీ... నాకు ధైర్యంగా నిలబడినందుకు. నాకు ప్రేమను పంచుతున్నందుకు. ప్రతి అడుగులో తోడుగా ఉన్నందుకు. థ్యాంక్యూ.. అనేది చాలా చిన్న పదం అవుతుందని నాకు తెలుసు. ఎప్పటికీ నీలో ఒక భాగాన్ని, నీదాన్ని. హ్యాపీ యానివర్శరీ గోల్డీ’’ అంటూ తమ పెళ్లి నాటి ఫొటోను కూడా షేర్ చేశారు సోనాలి. -
కొంచెం ఆలస్యంగా...
క్యాన్సర్ వ్యాధికి భయపడకుండా, బాధపడకుండా.. ధైర్యంగా చికిత్స చేయించుకుంటూ, ప్రతి క్షణాన్నీ మిస్ కాకుండా ఆనందంగా గడుపుతున్నారు సోనాలి బింద్రే. గురువారం కుటుంబంతో కలసి న్యూయార్క్‌లో దీపావళి పండగను జరుపుకున్నారు. క్యాన్సర్ వ్యాధి చికిత్స నిమిత్తం సోనాలి న్యూయార్క్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆ సెలబ్రేషన్స్ ఫొటోలను ట్వీటర్లో షేర్ చేశారు. ‘‘ముంబైలో సంబరాల కంటే కొంచెం లేట్‌గా న్యూయార్క్‌లో మొదలుపెట్టాం. మనలాగా సంప్రదాయ బట్టలు వేసుకుందాం అంటే ఇక్కడ లేవు. పూజ కూడా సింపు ల్గా చేశాం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు సోనాలి. -
నాతో పాటు మీరూ చదువుతారు కదూ?
క్యాన్సర్ వ్యాధికి న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్నారు నటి సోనాలీ బింద్రే. తన ఆరోగ్య విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారామె. ప్రస్తుతం ఎక్కువ సమయాన్ని పుస్తకాలు చదవడానికే కేటాయిస్తున్నారు. అయితే, ఈ మధ్య పుస్తకాలు చదవడానికి చాలా కష్టంగా ఉంటోంది అంటున్నారామె. ‘‘ఇంతకు ముందు చదివిన పుస్తకాన్ని పూర్తిచేయడానికి చాలా సమయం పట్టింది. కీమో థెరపీ వల్ల కంటి చూపు సరిగ్గా సహకరించడం లేదు. అందుకే పుస్తకాలు చదవడానికి కొంచెం విరామం ఇచ్చాను. ఇప్పుడు మళ్లీ మామూలుగానే ఉంది. ‘ఎ లిటిల్ లైఫ్’ అనే కొత్త పుస్తకం చదవడం మొదలెట్టాను. నాతో పాటు మీరూ చదువుతారు కదూ’’ అంటూ ఈ ఫొటో పోస్ట్ చేశారు. -
సోనాలీని కలిసిన నమ్రత, గౌతమ్
క్యాన్సర్‌తో బాధపడుతోన్న హీరోయిన్ సోనాలీ బింద్రే ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు సోనాలిని సందర్శిస్తూ ఆమెకు ధైర్యం చెబుతున్నారు. సోనాలీ కూడా ఎప్పటికప్పుడు తన క్షేమ సమాచారన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ప్రియాంక చోప్రా, అనుపమ్ ఖేర్, నీతూ కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు సోనాలీని సందర్శించారు. ఇప్పుడు వీరి వరుసలోకి నమ్రత కూడా చేరారు. ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి మూవీ షూటింగ్ నిమిత్తం న్యూయార్క్ వెళ్ళిన నమ్రత సోనాలీని కలిశారు. ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్రత ఈ విషయం గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ‘నేను, నా కుమారుడు గౌతమ్ సోనాలీ కుటుంబాన్ని కలిశాము. తను చాలా ధైర్యం గల మహిళ. ఆమె చాలా ఫిట్‌గా ఉన్నారు. త్వరలోనే మామూలు జీవితం గడపనున్నారు. నేను తనతో చాలా సేపు మాట్లాడాను. ఆమె తన అనారోగ్యం గురించి.. చికిత్స గురించి.. ఈ ప్రయాణంలో తనకు బలాన్నిచ్చిన అంశాల గురించి నాతో చర్చించారు. నేను తన కోసం ప్రార్ధిస్తానని తెలిపాను’ అంటూ నమ్రత చెప్పుకొచ్చారు. -
వైద్య పరీక్షలు.. ప్రేమ పలకరింపులు
‘‘సాధారణ వైద్య పరీక్షల కోసం న్యూయార్క్ వెళుతున్నా. పని నుంచి చిన్న విరామం తీసుకుంటున్నాను. నా స్నేహితులను, ఫ్యాన్స్‌ను అనవసరంగా ఏ వార్తనూ ప్రచారం చేయొద్దని కోరుకుంటున్నా’’ అని ట్వీట్ చేసి న్యూయార్క్ వెళ్లారు ప్రముఖ నటుడు రిషీ కపూర్. అక్కడ కొందరు బాలీవుడ్ నటీనటులు ఆయన్ను పలకరిస్తూ సర్ప్రైజ్ చేస్తున్నారు. ఓ టీవీ సిరీస్ షూట్లో భాగంగా న్యూయార్క్‌లో ఉన్న అనుపమ్ ఖేర్ ముందుగా రిషీని కలిశారు. ఆ తర్వాత ప్రియాంకా చోప్రా, సోనాలీ బింద్రే కూడా పలకరించారు. ‘‘ఎప్పటిలానే నవ్వుతూ ఉన్న మీ ఇద్దర్నీ (రిషి, ఆయన భార్య నీతూ) చూస్తుంటే ఆనందంగా ఉంది’’ అని ప్రియాంకా చోప్రా పేర్కొన్నారు. కీమో థెరపీ చేయించుకుంటున్న సోనాలీ తన భర్త గోల్డీ బెహల్‌తో కలసి రిషీని కలిశారు. ఈ విషయం పక్కన పెడితే రిషీ కపూర్‌కు క్యాన్సర్ ఫైనల్ స్టేజ్‌లో ఉందని, చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లారంటూ వచ్చిన వార్తలను రిషీ కపూర్ సోదరుడు రణ్‌ధీర్ కపూర్ కొట్టిపారేశారు. ‘‘తను ఏ వ్యాధితో బాధపడుతున్నాడో తనకే సరిగ్గా తెలియదు. మామూలు చెకప్ కోసం వెళ్లాడు. వైద్య పరీక్షలను మనశ్శాంతిగా చేసుకోనివ్వండి. ఆ టెస్ట్‌ల ఫలితం ఏదైనా మీకు తప్పకుండా తెలియజేస్తాం’’ అని రణ్‌ధీర్ పేర్కొన్నారు. -
నేనే ముందు ఇంటికెళ్తా
ప్రస్తుతం కేన్సర్ చికిత్స పొందుతూ సోనాలీ బింద్రే లండన్‌లో ఉన్నారు. అప్పుడుడప్పుడు ఆమె ఫ్రెండ్స్ ఆమెను చూడటానికి వెళ్తూనే ఉన్నారు. రీసెంట్గా సోనాలీకి అనుపమ్ ఖేర్ వీకెండ్స్‌లో కంపెనీ ఇస్తున్నారట. అమెరికన్ టీవీ సిరీస్‌లో యాక్ట్ చేస్తున్నారు అనుపమ్. ఆ షూటింగ్ నిమిత్తం అక్కడున్నారాయన. ఈ విషయాన్ని తెలియజేస్తూ – ‘‘ఈ షో వల్ల ఇక్కడ నాకో స్నేహితుడు దొరికాడు. మనలో ఎవ్వరు ఫస్ట్ ఇంటికి వెళ్లిపోతామో అని మాట్లాడుకుంటూ ఉంటాం. అతని కంటే నేనే ముందు వెళ్లిపోవాలని కోరుకుంటున్నాను. అనుపమ్ షోకి ఎక్కువ సీజన్స్ ఉండి తను ఇక్కడే ఉండిపోవాలి’’ అని పేర్కొన్నారు సోనాలి. -
‘సెలబ్రేషన్స్ మిస్సవుతున్నా...అయినా పర్లేదు’
‘నా హృదయానికి ఎంతో దగ్గరైన పండుగ గణేశ్ చతుర్థి. ప్రతీ ఏడాదిలానే ఈరోజు కూడా మా ఇంట్లో గణనాథుని వేడుకలు జరిగాయి. అయితే ప్రస్తుతం నేను అక్కడ లేనుగా. అందుకే సెలబ్రేషన్స్ మిస్సవుతున్నా. అయినా ఫర్వాలేదు.. ఆ దేవుడి ఆశీస్సులు నాకు తోడుగా ఉంటాయి. మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు. ప్రేమ, సంతోషాలతో మీ జీవితాలు నిండుగా ఉండాలంటూ’ సొనాలీ బింద్రే తన అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. గణేశ్ చతుర్థి వేడుకులు జరుపుకొంటున్న తన కుటుంబ సభ్యుల ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కాగా హైగ్రేడ్ క్యాన్సర్ బారిన పడిన సొనాలీ ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఎప్పటికపుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. చికిత్సలో భాగంగా జుట్టు కత్తిరించుకున్న సమయంలో భావోద్వేగానికి గురైన సొనాలి.. తన కొడుకు రణ్వీర్, ఇతర కుటుంబ సభ్యులు ఇచ్చిన ధైర్యంతో క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్నానని పేర్కొన్నారు. అయితే ఇటీవల సొనాలీ మరణించిందంటూ నకిలీ వార్తలు ప్రచారమయ్యాయి. దీంతో ఆవేదన చెందిన ఆమె భర్త గోల్డీ బెల్.. ‘సొనాలీ ఎంతో ధైర్యంగా పోరాడుతున్నారని, ఆమె ఆరోగ్యం గురించి వదంతులు ప్రచారం చేయడం మానుకోవాలని’ విఙ్ఞప్తి చేశారు. View this post on Instagram #GaneshChaturthi has always been very very close to my heart. Missing the celebrations back home, but still feeling blessed. Have a happy one, filled with blessings, love and joy! A post shared by Sonali Bendre (@iamsonalibendre) on Sep 13, 2018 at 6:52am PDT -
వదంతులను నమ్మొద్దు
అభిమాన తార గురించి ఏ వార్త అయితే వినకూడదని అభిమానులు కోరుకుంటారే సోనాలి బింద్రే గురించి శనివారం అలాంటిదే విన్నారు. ‘సోనాలి ఇక లేరు’ అనే ఆ వార్త విని షాక్ అయ్యారు. ఈ ఏడాది జూలై 4న కేన్సర్ సోకిన విషయాన్ని ప్రకటించిన సోనాలి చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. ఆమె ఆరోగ్యం గురించి సోనాలి భర్త గోల్డీ బెహల్ ట్వీటర్ ద్వారా వెల్లడిస్తున్నారు. సోనాలి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి, తన గురించి చెబుతున్నారు. ‘ఏం ఫర్వాలేదు. చికిత్స సజావుగా సాగుతోంది. సోనాలి సంపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి వచ్చేస్తారు’ అని అందరూ నమ్మిన సమయంలో ఓ ఎమ్మెల్యే ‘ఆమె ఇక లేరు’ అని చేసిన ట్వీట్ కలవరపరచింది. అయితే గోల్డీ బెహల్ అలాంటిదేమీ లేదని స్పష్టం చేయడంతో రిలీఫ్ అయ్యారు. ‘‘సోషల్ మీడియాని బాధ్యతాయుతంగా ఉపయోగించాలని విన్నవించుకుంటున్నాను. వదంతులను నమ్మొద్దు. ప్రచారం చేయొద్దు. ఒకవేళ చేస్తే సంబంధిత వ్యక్తులను బాధపెట్టినవారు అవుతారు’’ అని గోల్డీ బెహల్ ట్వీట్ చేశారు. కాగా, సోనాలి తాను చదువుతున్న పుస్తకాన్ని పట్టుకుని దిగిన ఫొటోను రీసెంట్గా ట్వీటర్లో షేర్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న ఫొటో అదే. సోనాలీకి బుక్స్ చదవడం అంటే ఆసక్తి. స్వయంగా ఆమె తన లైఫ్ జర్నీ గురించి ‘ది మోడ్రన్ గురుకుల్’ పేరుతో ఓ పుస్తకం రాశారు కూడా. ఇప్పుడు ఆమె రష్యన్ రచయిత అమోర్ తౌలీస్ రాసిన ‘ఎ జెంటిల్మెన్ ఇన్ మాస్కో’ బుక్ చదువుతున్నారు. ఈ నెల 6న ‘బుక్ రీడింగ్ డే’. స్వతహాగా పుస్తకాలు చదివే అలవాటు ఉన్న సోనాలి ఆ రోజున ఈ బుక్‌ని సెలెక్ట్ చేసుకుని, చదవడం మొదలుపెట్టారు. -
సొనాలికి శ్రద్ధాంజలి.. బుక్కైన బీజేపీ ఎమ్మెల్యే
ప్రేమను తిరస్కరించిన అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ మరోసారి వార్తల్లోకెక్కారు. బాలీవుడ్ హీరోయిన్ సొనాలీ బింద్రే మరణించారంటూ ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కయ్యారు. ‘ హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమను ఏలిన తార.. తన నటనతో ప్రేక్షకులను రంజింపచేసిన అభినేత్రి ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. ఆమెకు శ్రద్ధాంజలి’ అంటూ రామ్ కదమ్ ట్వీట్ చేశారు. అయితే ఇది ఫేక్ న్యూస్ అని తెలుసుకున్న రామ్ కదమ్.. ‘గత రెండు రోజులుగా సొనాలి బింద్రే గురించి నకిలీ వార్తలు ప్రచారమవుతున్నాయి. ఆమె త్వరగా కోలుకొని సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’ అంటూ మరో ట్వీట్‌తో తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే రామ్ కదమ్ నెటిజన్ల చేతిలో బుక్కయ్యారు. ‘ఆ నకిలీ వార్తలు ప్రచారం చేసింది మీరే కదా.. మళ్లీ ఇదేంటి’ అంటూ రామ్ కదమ్ పాత ట్వీట్ స్క్రీన్షాట్లతో ఆయనను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కాగా హైగ్రేడ్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న సొనాలీ బింద్రే ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. About Sonali Bendre ji It was rumour . Since last two days .. I pray to God for her good health & speedy recovery — Ram Kadam (@ramkadam) September 7, 2018 U spread the rumour @ramkadam pic.twitter.com/DTSFb8A3Ra — NAVEEN DHAWAN (@NAVEENDHWAN) September 7, 2018 -
‘నిన్ను చాలా మిస్సవుతున్నా.. కానీ ఏం చేయను’
పిల్లలకు సంబంధించిన ప్రతీ వేడుక తమ సమక్షంలోనే జరగాలని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. మిగతా రోజుల్లో బిజీగా ఉన్నా పుట్టిన రోజు వంటి ప్రత్యేకమైన రోజున పిల్లలతో గడిపేందుకు సమయాన్ని కేటాయిస్తారు. సొనాలీ బింద్రే కూడా తన ఒక్కగానొక్క కొడుకు రణ్వీర్ విషయంలో ఇలాగే ఆలోచించారు. కానీ ప్రస్తుతం చికిత్స నిమిత్తం న్యూయార్క్‌లో ఉన్న కారణంగా.. పుట్టిన రోజున అతడి దగ్గర ఉండలేకపోయినందుకు భావోద్వేగానికి గురయ్యారు. హైగ్రేడ్ క్యాన్సర్‌తో బాధ పడుతోన్న సొనాలి.. కొడుకు పట్ల తన మనసులో ఉన్న భావాలని వెల్లడిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో నెటిజన్ల హృదయాల్ని కదిలిస్తోంది. హ్యాపీ బర్త్‌డే రణ్వీర్... ‘రణ్వీర్ నువ్వే నా సూర్యుడు, చంద్రుడు... ఇంకా నీ నవ్వులే నక్షత్రాలు. సరే... నేను కాస్త మెలోడ్రామా చేస్తున్నట్లు అనిపిస్తోంది కదా. కానీ ఇది నీ 13వ పుట్టిన రోజు. ఈ మాత్రం ప్రేమకు నువ్వు అర్హుడివి. వావ్.. నువ్వు చాలా పెద్దవాడివయ్యావు. నిన్ను చూసి నేనెంత గర్వపడుతున్నానో మాటల్లో చెప్పలేను. నీ హాస్య చతురత, దయాగుణం, అన్నింటినీ అర్థం చేసుకోగల పరిపక్వత ఒక్కటేమిటి అన్నింటిలో నువ్వు పర్ఫెక్ట్. హ్యాపీ బర్త్‌డే కన్నా.. నేను పక్కన లేకుండా నువ్వు చేసుకుంటున్న మొదటి పుట్టినరోజు ఇదే కదా. నిన్ను చాలా మిస్సవుతున్నా. కానీ ఏం చేయను. దూరంగా ఉంటూనే నీ మీద ప్రేమ కురిపించడం తప్ప’ అంటూ కొడుకు రణ్వీర్ పుట్టిన రోజు సందర్భంగా భావోద్వేగమైన సందేశాన్ని పోస్ట్ చేశారు. Ranveeeeer! My sun, my moon, my stars, my sky... Okay, maybe I'm being a bit melodramatic, but your 13th birthday deserves this. Wow, you're a teenager now... Will need some time to wrap my head around that fact. I can't tell you enough how proud I am of you... Your wit, your humour, your strength, your kindness, and even your mischief. Happy happy birthday, my not-so-little one. It's the first one that we're not together... I miss you terribly. Lots and lots of love always and forever.... biiiiig hug! @rockbehl A post shared by Sonali Bendre (@iamsonalibendre) on Aug 10, 2018 at 9:29pm PDT -
సంతోషంగా ఉన్నా
సమస్య వచ్చినప్పుడు బాధపడిపోకుండా దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో, అందులో కూడా పాజిటివ్‌నెస్‌ని ఎలా వెతుక్కోవాలో సోనాలీ బింద్రేని చూసి నేర్చుకోవచ్చు అనిపిస్తోంది. కేన్సర్ వ్యాధి సోకినా భయపడకుండా ధైర్యంగా, ముఖం మీద నవ్వు చెదరకుండా పోరాడటానికి సిద్ధపడ్డారు సోనాలీ. ఆ మధ్య జుత్తుని సగానికి కత్తిరించుకున్న ఆమె తాజాగా గుండు చేయించుకున్నారు. తన ఆరోగ్యం గురించి చెప్పడంతో పాటు తన స్నేహితులందరికీ ఫ్రెండ్షిప్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ లేఖ రాశారు. దాని సారాంశం ఈ విధంగా... ‘‘ఈ నిమిషం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ మాట చెబితే మీరందరూ నా వంక అదోలా చూడొచ్చు. కానీ అది నిజం. ఎందుకు చెబుతున్నానో వినండి. ప్రస్తుతం నేను ప్రతి చిన్న విషయాన్ని కూడా శ్రద్ధగా తీసుకుంటున్నాను. ఆనందం దొరికే ఏ అవకాశాన్ని వదులుకోవడంలేదు. నిజమే.. కొన్నిసార్లు బాధగా అనిపిస్తుంది. నిరాశ, నిస్పృహ నన్ను ముంచేస్తాయి. కానీ, నాకు నచ్చింది మాత్రమే నేను చేస్తున్నాను. నాకు నచ్చిన వాళ్లతోనే టైమ్ స్పెండ్ చేస్తున్నాను. దాంతో చాలా హ్యాపీగా ఉంటున్నాను. నా ఫ్రెండ్స్.. నా ధైర్యానికి వాళ్లే కారణం. వాళ్ల బిజీ షెడ్యూల్స్‌లో కూడా నా కోసం మెసేజ్, ఫోన్ కాల్, వీడియో కాల్ ఏదోటి చేసి నాతో టచ్‌లోనే ఉంటున్నారు. ఒక్క క్షణం కూడా నన్ను ఒంటరిగా ఫీల్ అయ్యేలా చేయడం లేదు. నిజమైన ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలియజేస్తున్నారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ అందరూ నా లైఫ్‌లో ఉండటం నా అదృష్టం. ఇంకో విషయం ఏంటంటే.. ఈ మధ్య రెడీ అవ్వడానికి ఎక్కువ టైమ్ కూడా పట్టడంలేదు. ఊరికే జుత్తు దువ్వుకునే పని లేదు కదా (నవ్వుతున్న ఎమోజీ). అన్నింట్లో పాజిటివిటీ వెతుక్కుందాం’’ అంటూ ఈ నోట్‌ను, ఫొటోను షేర్ చేశారు. సోనాలీ పట్టుదల చూస్తే అభినందించకుండా ఉండలేం కదూ. -
‘నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి’
ప్రముఖ నటి సొనాలి బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఎప్పటికపుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. చికిత్సలో భాగంగా జుట్టు కత్తిరించుకున్న సమయంలో భావోద్వేగానికి గురైన సొనాలి.. తన కొడుకు రణ్వీర్, ఇతర కుటుంబ సభ్యులు ఇచ్చిన ధైర్యంతో క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్నానని పేర్కొన్నారు. తాజాగా సొనాలి ఆడపడుచు సృష్టి ఆర్య మీడియాతో మాట్లాడుతూ..‘సొనాలి చాలా ధైర్యంగా ఉన్నారు. త్వరలోనే ఆమె పూర్తిగా కోలుకుంటారంటూ’ తెలిపారు. ఈ మాటలు నిజం కావాలంటూ సొనాలి భర్త గోల్డీ బేల్.. రణ్వీర్ నవ్వుతూ ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోను చూసిన సొనాలి అభిమానులు.. రణ్వీర్.. నువ్వు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలని, మీ అమ్మకు ఆ దేవుడి దీవెనలు కూడా ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయని బెస్ట్ విషెస్ చెబుతున్నారు. IDK A post shared by rockbehl (@rockbehl) on Jul 30, 2018 at 7:27am PDT -
స్క్రీన్ టెస్ట్
1. నితిన్ హీరోగా రాశీఖన్నా హీరోయిన్గా ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1987లోనే ఇదే పేరుతో సినిమా విడుదలైంది. ఆ సినిమాలో హీరో ఎవరో తెలుసా? ఎ) నాగార్జున బి) వెంకటేశ్ సి) బాలకృష్ణ డి) అర్జున్ 2. ‘భాస్కీ’ అనే స్టైలిస్ట్ ఈ ప్రముఖ హీరోకి చిన్ననాటి స్నేహితుడు. ఆయన అసలు పేరు భాస్కర్. ఆ హీరోకి ఇతను డిజైనర్‌గా పనిచేస్తాడు. ఆ ప్రముఖ హీరో ఎవరో తెలుసా? ఎ) రామ్‌చరణ్ బి) ఎన్టీఆర్ సి) ప్రభాస్ డి) మహేశ్‌బాబు 3. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘పెళ్లి సందడి’ సినిమాలో ఓ హీరోయిన్గా తెలుగమ్మాయి రవళి నటించారు. మరో హీరోయిన్గా నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా? ఎ) దీప్తీ భట్నాగర్ బి) సోనాలీ బింద్రే సి) శిల్పా శెట్టి డి) రవీనా టాండన్ 4. ‘ప్రతిధ్వని’ దర్శకునిగా బి.గోపాల్‌కు మొదటి చిత్రం. ఆ చిత్రంలోని అతి ముఖ్యమైన ‘ఇన్స్పెక్టర్ ఝాన్సీ’ పాత్రను పోషించిన నటి ఎవరో తెలుసా? ఎ) వాణిశ్రీ బి) శారద సి) విజయశాంతి డి) జయప్రద 5. ‘దాన వీర శూర కర్ణ’ చిత్రం లోని ‘చిత్రం భళారే విచిత్రం...’అనే పాటలో ఎన్టీఆర్‌తో కలిసి ఆడిపాడిన ప్రముఖ నటి ఎవరో తెలుసా? ఎ) కె.ఆర్.విజయ బి) ప్రభ సి) జయసుధ డి) ఎల్.విజయలక్ష్మీ 6. నటుడిగా తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైందని జగపతిబాబు చెప్పుకునే సినిమా ఏది? (ఆ సినిమాలో ఆయన ప్రతినాయకుడిగా నటించారు) ఎ) సింహా బి) శ్రీమన్నారాయణ సి) నాన్నకు ప్రేమతో డి) లెజెండ్ 7. అక్కినేని, సావిత్రిలది హిట్ కాంబినేషన్ అని తెలిసిందే. వారిద్దరూ కలిసి ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా? ఎ) 36 బి) 30 సి) 29 డి) 32 8. మహేశ్‌బాబు కూతురు పేరు ‘సితార’. ఈ చిన్నారి బర్త్‌డే జూలై 22న. ఈ సంవత్సరం ఆ పాప ఎన్నో ఏట కాలు పెట్టిందో తెలుసా? ఎ) 5 బి) 6 సి) 4 డి) 7 9. ‘ఆర్ ఎక్స్100’ సినిమా మంచి కమర్షియల్ హిట్ సాధించింది. ఈ సినిమాతో దర్శకునిగా మంచి పేరు తెచ్చుకున్నదెవరో తెలుసా? ఎ) రాకేశ్ శశి బి) అజయ్ భూపతి సి) వెంకీ కుడుముల డి) మహి.వి.రాఘవ్ 10. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా’. ఆ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న కన్నడ నటుడు ఎవరో కనుక్కోండి? ఎ) ఉపేంద్ర బి) సుదీప్ సి) శివ రాజ్‌కుమార్ డి) రవిశంకర్ 11. మోస్ట్ పాపులర్ డాన్సర్‌గా పేరు తెచ్చుకున్న ‘సిల్క్ స్మిత’ ఏ సంవత్స రంలో తనువు చాలిం చారో తెలుసా? ఎ) 1990 బి) 1998 సి) 1996 డి) 1992 12. 1983లో వచ్చిన ‘ఖైదీ’ చిత్రం ద్వారా కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న దర్శకుడెవరో తెలుసా? ఎ) ఎ. కోదండ రామిరెడ్డి బి) కె. రాఘవేంద్రరావు సి) కోడి రామకృష్ణ డి) దాసరి నారాయణరావు 13. ‘గుండెల్లో గోదారి’ చిత్రంలో లక్ష్మీ మంచు లీyŠ రోల్ చేశారు. మరో హీరోయిన్ కూడా ఈ చిత్రంలో ఉన్నారు. ఆమె ఎవరో తెలుసా? ఎ) తాప్సీ బి) శ్రద్ధాదాస్ సి) హన్సిక డి) స్నేహ 14. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో హీరో విజయ్ దేవరకొండ నానమ్మగా కనిపించిన ప్రముఖ నటి ఎవరో తెలుసా? ఎ) లక్ష్మీ బి) కాంచన సి) షావుకారు జానకి డి) జమున 15. ‘విలేజ్‌లో వినాయకుడు’ చిత్రంలో హీరోయిన్గా నటించిన బ్యూటీ ఎవరో తెలుసా? ఎ) ఈషా రెబ్బా బి) శరణ్యా మోహన్ సి) సోనియా డి) పూనమ్ కౌర్ 16. ‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది...’అనే పాట రచయిత ఎవరో తెలుసా? ఎ) సిరిÐð న్నెల బి) చంద్రబోస్ సి) రామజోగయ్య శాస్త్రి డి) అనంత శ్రీరామ్ 17. మిస్ యూనివర్స్ 2010లో రన్నరప్‌గా నిలిచిన ఈ బ్యూటీ మోడలింగ్ టు యాక్టింగ్‌కి వచ్చారు. ఎవరామె? ఎ) ప్రియాంకా చోప్రా బి) కృతీ సనన్ సి) పూజా హెగ్డే డి) ఆలియా భట్ 18. 1974లో విడుదలైన ‘దేవదాసు’ చిత్రానికి దర్శకత్వం వహించింది ఎవరో తెలుసా? ఎ) కృష్ణ బి) విజయనిర్మల సి) పి.సి. రెడ్డి డి) కె.యస్.ఆర్. దాస్ 19. ఈ ఫొటోలోని నటి పేరేంటో తెలుసా? ఎ) ఫటాఫట్ జయలక్ష్మీ బి) జయంతి సి) గీతాంజలి డి) రమాప్రభ 20. ఈ కింది ఫొటోలో ఉన్న పాప ఇప్పుడు బాలీవుడ్లో బిజీ నటి ఎవరో గుర్తించండి. ఎ) దీపికా పదుకోన్ బి) కత్రినా కైఫ్ సి) దిశా పటానీ డి) సోనాలీ బింద్రే మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) సి 3) ఎ 4) బి 5) బి 6) డి 7) ఎ 8) బి 9) బి 10) బి 11) సి 12) ఎ 13) ఎ 14) బి 15) బి 16) ఎ 17) సి 18) బి 19) ఎ 20) బి నిర్వహణ: శివ మల్లాల -
మా అబ్బాయి నాకు అమ్మలా మారాడు
ఇటీవలే తనకు క్యాన్సర్ ఉందనే వార్తను తెలిపి అందర్నీ షాక్‌కి గురి చేశారు సోనాలీ బింద్రే. అయితే క్యాన్సర్‌కు కుంగిపోకుండా ధైర్యంగా పోరాడటానికి సిద్ధపడ్డారామె. ఈ పోరాటంలో సోనాలీకి ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు, ఫ్యాన్స్ అందరూ ధైర్యం చెప్పారు. ‘‘ఆ ప్రేమాభిమానాలు నాకు కొండంత ధైర్యం’ అని సోనాలి సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ఇటీవల కీమోథెరపీ కోసం తన కురులను కూడా కట్ చేసుకున్నప్పుడు ట్వీటర్ ద్వారా ఆ విషయాన్ని పంచుకున్నారు. ఇప్పుడు మరో విషయం గురించి పేర్కొన్నారు. ఈసారి సోనాలి తన కుమారుడు రణ్వీర్ గురించి చెప్పారు. రణ్వీర్ వయసు 12 ఏళ్లు. తల్లి అనారోగ్యం గురించి తెలిసి, తను ఎలా రియాక్ట్ అయ్యుంటాడు? ఇదే విషయాన్ని సోనాలి గురువారం తెలుపుతూ – ‘‘రణ్వీర్ పుట్టిన 12 సంవత్సరాల, 11 నెలల, 8 రోజుల నుంచి మా హార్ట్‌ని వాడే ఆక్రమించేసుకున్నాడు. అప్పటి నుంచి వాడి ఆనందం, సంతోషమే మాకు ముఖ్యమయ్యాయి. నాకు క్యాన్సర్ అని తెలిసినపుడు వాడికి ఈ విషయం ఎలా తెలియజేయాలో అని గోల్డీ (సోనాలి భర్త), నేను చాలా ఆలోచించాం. వాడిని ప్రొటెక్ట్ చేయడం ఎంత ముఖ్యమో, వాడికి నిజాన్ని చెప్పడం కూడా అంతే ముఖ్యమని భావించాం. ఇప్పటివరకు మేం ప్రతీ విషయంలో వాడితో ఓపెన్‌గా, నిజాయితీగా ఉన్నాం. ఈసారి కొంచెం డిఫరెంట్. కానీ వాడు ఈ విషయాన్ని చాలా మెచ్యూర్డ్‌గా తీసుకున్నాడు. నాకు సపోర్ట్‌గా, పాజిటీవ్‌గా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మా పాత్రలు మారుతున్నాయి. నేను ఏ మందులేసుకోవాలో ఓ అమ్మలా గుర్తు చేస్తున్నాడు. అప్పుడు నాకు అనిపించింది.. పిల్లల్ని ఇలాంటి అత్యవసర సమయాల్లో ఇన్వాల్వ్ చేయడం మంచిదని. మనం అనుకున్నదాని కంటే వాళ్లు చాలా స్ట్రాంగ్‌గా నిలబడగలుగుతారు. వాళ్లను ఇన్వాల్వ్ చేయడం, వాళ్లతో టైమ్ స్పెండ్ చేయడం లాంటివి చేయాలి. వాళ్ల దగ్గర నిజాలు దాచి, జీవితం యొక్క కఠినత్వం చెప్పకుండా వాళ్లను కాపాడుకోవాలనుకుంటాం కానీ, అది పొరపాటు. ప్రస్తుతం రణ్వీర్ సమ్మర్ హాలిడేస్‌ని నాతోనే గడుపుతున్నాడు. వాడి అల్లరి, విన్యాసాలే నాకు ఎనర్జీ ఇస్తున్నాయి. ఒకరి నుంచి ఒకరం ధైర్యాన్ని తెచ్చుకుంటున్నాం’’ అని సోషల్ మీడియాలో పేర్కొని తనయుడితో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు సోనాలీ బింద్రే. -
‘తనకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు’
ప్రముఖ నటి సొనాలి బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఎప్పటికపుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా.. కుమారుడు రణ్వీర్తో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సొనాలి... తాను క్యాన్సర్ బారిన పడిన విషయాన్ని అతడితో ఎలా పంచుకున్నది చెబుతూ రాసిన లేఖ నెటిజన్ల హృదయాల్ని కదిలిస్తోంది. తను నా తల్లిగా మారాడు.. ‘పన్నెండేళ్ల క్రితం జన్మించిన రణ్వీర్.. నా హృదయాన్ని పూర్తిగా ఆక్రమించేశాడు. అప్పటి నుంచి తన సంతోషం కోసమే అనుక్షణం తాపత్రయపడ్డాను. క్యాన్సర్ మహమ్మారి నాలో ప్రవేశించిన విషయం తెలియగానే.. ఈ విషయాన్ని తనకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. నాకు సంబంధించిన ప్రతీ విషయాన్ని వాడితో షేర్ చేసుకోవడం అలవాటు. కానీ ఈ విషయాన్ని దాచి వాడిని బాధను మరింతగా పెంచడం సరైంది అనిపించలేదు. అందుకే ధైర్యం చేసి ఈ చేదు నిజాన్ని చెప్పేశాను. కానీ నేను ఊహించిన దానికి భిన్నంగా రణ్వీర్ ఎంతో పరిపక్వంగా ఆలోచించాడు. చెప్పాలంటే తనే నాకు ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. ఒక్కోసారి తనే తల్లిలా నన్ను లాలిస్తున్నాడు. ట్రీట్మెంట్కు సంబంధించిన అపాయింట్మెంట్ల గురించి గుర్తు చేస్తున్నాడు. మన ఆరోగ్యానికి సంబంధించిన విషయాల గురించి పిల్లలతో తప్పకుండా పంచుకోవాలి. అపుడే జీవితంలో సంభవించే కఠిన పరిస్థితులను ఎదుర్కోవడానికి వారు సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం నా కొడుకు నాతోనే ఉన్నాడు. నాకు ఇక ఏ బెంగా లేదంటూ’ సొనాలి బింద్రే భావోద్వేగానికి గురయ్యారు. From the moment he was born 12 years, 11 months and 8 days ago, my amazing @rockbehl took ownership of my heart. From then on, his happiness and wellbeing have been the centre of anything @goldiebehl and I ever did. And so, when the Big C reared its ugly head, our biggest dilemma was what and how we were going to tell him. As much as we wanted to protect him, we knew it was important to tell him the full facts. We’ve always been open and honest with him and this time it wasn’t going to be different. He took the news so maturely… and instantly became a source of strength and positivity for me. In some situations now, he even reverses roles and takes on being the parent, reminding me of things I need to do! I believe that it’s imperative to keep kids involved in a situation like this. They are a lot more resilient than we give them credit for. It’s important to spend time with them and include them, rather than make them wait on the side-lines, not being told yet instinctively knowing everything. In our effort to protect them from the pain and realities of life, we might end up doing the opposite. I’m spending time with Ranveer right now, while he’s on summer vacation. His madness and shenanigans help me #SwitchOnTheSunshine. And today, we derive strength from each other #OneDayAtATime A post shared by Sonali Bendre (@iamsonalibendre) on Jul 18, 2018 at 11:29pm PDT -
సొనాలీ భావోద్వేగానికి లోనయ్యారు
-
సొనాలీ బింద్రే భావోద్వేగం
క్యాన్సర్‌తో బాధపడుతున్న హీరోయిన్ సొనాలీ బింద్రే ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే. చికిత్సలో భాగంగా జుట్టు కత్తిరించుకున్న సొనాలీ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సొనాలి.. కష్ట సమయంలో తోడుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ‘నా అభిమాన రచయిత్రి ఇసాబెల్ అలెండే మాటలు ఎప్పుడూ నాకు గుర్తుంటాయి. కష్టం వచ్చినపుడే మనలో దాగున్న ధైర్య సాహసాలు వెలుగులోకి వస్తాయి. విషాదకరమైన సమయాల్లోనే కొన్ని అద్భుతాలు చోటు చేసుకుంటాయి. నాపై ఇంతగా ప్రేమాభిమానాలు కురిపిస్తున్న అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా తమ స్ఫూర్తివంతమైన కథలతో నాలో ధైర్యం నింపుతున్న వారికి రుణపడి ఉంటాను. క్యాన్సర్‌ను జయించిన మీ వంటి వారి గురించి తెలుసుకున్నపుడు నేను ఒంటరిని కాననే భావన నాలో కొత్త ఆశల్ని చిగురింపజేస్తుంది. ప్రస్తుతం నా జీవితంలో ప్రతిరోజూ ఒక సవాలుతో కూడుకున్నదే. సూర్యోదయం కోసం సానుకూల దృక్పథంతో ఎదురుచూస్తున్నానంటూ’ ఆమె చేసిన పోస్ట్ చేసిన సందేశం అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది. ఆమె ఓ స్ఫూర్తి ప్రధాత.. ఇసాబెల్ అలెండే చిలీకి చెందిన ప్రఖ్యాత రచయిత్రి. పెరూలోని లీమాలో జన్మించిన ఆమె రెండేళ్ల వయసులో తండ్రి వృత్తి రీత్యా చిలీకి వచ్చారు. ఆ తర్వాతి కాలంలో ఇసాబెల్ తండ్రి సాల్వెడార్ అలండే 1970లో చిలీ దేశానికి తొలి సామ్యవాద అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇసాబెల్ జర్నలిస్టుగా తన కెరీర్‌ను ఆరంభించారు. 1973లో మిలటరీ కుట్ర కారణంగా ఇసాబెల్ తండ్రి సాల్వెడార్ ఆత్మహత్య చేసుకున్నారు. జీవితంలో ఎన్నో కష్టానష్టాలను అనుభవించిన అలండే వాటికి అక్షరరూపం ఇచ్చారు. అవే పలువురికి స్పూర్తిగా నిలిచాయి. ఆమె చెప్పిన నాలుగు మాటలను తలుచుకున్న మన బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే మనోధైర్యంతో క్యాన్సర్‌పై పోరాడుతున్నారు. ఇసాబెల్ రచనల్లో ది హౌజ్ ఆఫ్ స్పిరిట్స్, సిటీ ఆఫ్ బీస్ట్స్లు ప్రముఖమైనవి. అమెరికా అత్యున్నత పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను కూడా ఇసాబెల్ అందుకున్నారు. In the words of my favourite author Isabel Allende, “We don't even know how strong we are until we are forced to bring that hidden strength forward. In times of tragedy, of war, of necessity, people do amazing things. The human capacity for survival and renewal is awesome.” The outpouring of love I’ve received in the last few days has been so overwhelming… and I’m especially grateful to those of you who shared stories of your experiences in dealing with cancer, whether it was your own or of loved ones. Your stories have given me an extra dosage of strength and courage, and more importantly, the knowledge that I’m not alone. Each day comes with its own challenges and victories and so for now, I’m taking this #OneDayAtATime. The only thing I’m trying to be consistent about is maintaining a positive outlook... literally #SwitchOnTheSunshine - it’s my way of dealing with this. Sharing my journey is also part of this process... I can only hope it reminds you that all is not lost and that someone, somewhere understands what you’re going through. 🤞🌞 A post shared by Sonali Bendre (@iamsonalibendre) on Jul 10, 2018 at 12:20am PDT -
త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా..
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి స్టార్స్‌తో ఆడిపాడిన సోనాలి బింద్రే అప్పట్లో టాప్ హీరోయిన్గా కొనసాగారు. సొనాలి బింద్రే వివాహనాంతరం సినిమాలకు దూరమైయ్యారు. సినిమాల్లో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు సొనాలి బింద్రే. మన్మథుడు, ఇంద్ర, శంకర్‌దాదా ఎంబీబీఎస్, మురారి, ఖడ్గం లాంటి హిట్ సినిమాల్లో నటించారు. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానం సంపాదించుకున్న ఈ బ్యూటీ బుధవారం ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. తాను క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సోనాలి సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్టు సొనాలి బింద్రే ప్రకటించారు. దీంతో సొనాలి బింద్రే అభిమానులు షాక్‌కు గురయ్యారు. సొనాలి బింద్రే క్యాన్సర్ బారిన పడటంపై నాగార్జున స్పందించారు. ‘ నువ్వు త్వరగా కోలుకోవాలని, నీ ఆత్మస్థైర్యానికి ఇంకా బలం చేకూరాలని ఆశిస్తున్నా’నంటూ ట్వీట్ చేశారు. వీరిద్దరు కలిసి మన్మథుడు సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. Wishing you a speedy recovery and all the strength to your great spirit dear @iamsonalibendre 💐 https://t.co/d0fcseSEGb — Nagarjuna Akkineni (@iamnagarjuna) July 5, 2018 -
చివరి స్టెప్ వరకూ పోరాడతా
‘చెప్పమ్మ.. చెప్పమ్మ.. చెప్పేసెయంటుంది ఓ ఆరాటం’, ‘దాయి దాయి దామ్మా..’ ‘నువ్వు నువ్వు.. నువ్వూ.. నువ్వూ’.. ఈ పాటలు వింటున్నప్పుడు కళ్ల ముందు సోనాలి బింద్రే ముగ్ధ మనోహర రూపం కనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానం సంపాదించుకున్న ఈ బ్యూటీ బుధవారం ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. తాను క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సోనాలి సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ఇది చదివిన ఆమె అభిమానులు తల్లడిల్లిపోయారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె తన మనోభావాలను ఈ విధంగా వ్యక్తపరిచారు. ‘‘కొన్ని సార్లు జీవితం మనం ఊహించని మలుపులతో మన ముందుకొస్తుంది. రీసెంట్గా క్యాన్సర్ ఉన్నట్టు తెలుసుకున్నాను. ఏదో చిన్న నొప్పి అని హాస్పిటల్‌కి వెళ్తే టెస్ట్‌లు చేశారు. రిపోర్ట్స్‌లో క్యాన్సర్ అని తెలిసింది. ఇలాంటిది ఒకటి జరుగుతుందని అసలు ఊహించలేదు. నా ఫ్యామిలీ, బంధువులు, స్నేహితులు నాకు కావాల్సినంత ప్రేమను, సపోర్ట్‌ను అందిస్తున్నారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ప్రతి స్టెప్‌లోనూ ఫైట్ చేయగలను అనే నమ్మకాన్ని నా ఆప్తులు క్రియేట్ చేశారు. నాకున్న ధైర్యం (ఫ్యామిలీ, ఫ్రెండ్స్)ని చూసుకొని ఈ యుద్ధాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాను’’ అని ట్వీటర్లో పేర్కొన్నారు సోనాలి. 2002లో హిందీ దర్శక–నిర్మాత గోల్డీ బెహల్ని పెళ్లి చేసుకున్నారు సోనాలి. ఆ తర్వాత చిరంజీవి ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ (2004)లో నటించారు. హీరోయిన్గా సోనాలి చేసిన చివరి సినిమా ఇదే. ఆ తర్వాత మరాఠీలో ‘అగ్ బాయీ అరేచ్చా’, హిందీలో ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దొబారా’ (2013) చిత్రాల్లో అతిథి పాత్రలు చేశారామె. ప్రస్తుతం ‘ఇండియాస్ బెస్ట్ డ్రేమ్బాజ్’ అనే హిందీ టీవీ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అనుకోని ఈ సంఘటన వల్ల ఈ షోని ఆమె డిస్కంటిన్యూ చేయాల్సి వస్తుంది. క్యాన్సర్ మహమ్మారి నుండి సోనాలి పూర్తిగా బయటపడి, ఆరోగ్యంగా ఇండియా తిరిగి రావాలని ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. -
స్త్రీలోక సంచారం
జీటీవీలో ప్రసారం అవుతున్న రియాల్టీ షో ‘ఇండియాస్ బెస్ట్ డ్రామేబాజ్’ జడ్జీలలో ఒకరైన సోనాలీ బెంద్రే.. వ్యక్తిగత కారణాల వల్ల షో నుంచి తప్పుకుంటున్నందున ఆమె స్థానంలోకి హ్యూమా ఖురేషీని తీసుకుంటున్నట్లు జీనెట్‌వర్క్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే సోనాలీ బెంద్రే న్యూయార్క్‌లో క్యాన్సర్‌కు చికిత్స చేయించుకుంటున్నారన్న వార్త బాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. స్వయంగా బెంద్రేనే తన హైగ్రేడ్ క్యాన్సర్ గురించి బహిర్గతం చేస్తూ, ఎంతో ఎమోషనల్‌గా ట్విట్టర్లో పెట్టిన పోస్టింగ్ ఆమె అభిమానుల్ని కలవరపరిచింది ::: ఒకప్పుడు ఫోర్బ్స్ మ్యాగజీన్ ‘హయ్యస్ట్ పెయిడ్ మోడల్స్’ జాబితాలో స్థానం సంపాదించుకున్న పోర్టోరికో మోడల్ జోన్ స్మాల్ ప్రస్తుతం వర్ణ వివక్షకు గురవుతున్నారు! తన ఒంటి చాయ మరీ అంత ‘మిల్కీ’గా లేకపోవడంతో హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ మీడియా తనకు అవకాశాలను నిరాకరిస్తోందని, అయితే తన చుట్టూ ఉన్న కొంతమంది సంస్కారవంతులైన సృజనశీలురకు నిజమైన అందం అంటే ఏమిటో తెలుసు కనుక, ఒంటి రంగు గురించి తను అసలేమీ బాధపడటం లేదని జోన్ తాజా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. లైంగిక దాడికి గురయిన చిన్నారుల నుంచి వివరాలను రాబట్టడం అతి సున్నితమైన, క్లిష్టమైన బాధ్యత అని ‘షీటీమ్స్’ ఏసీపీ డి. కవిత అన్నారు. ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్’ (పోక్సో) కింద చిన్నారి బాధితుల నుంచి స్టేట్మెంట్ తీసుకోడానికి వారికి ఏ విధంగానూ మానసిక ఒత్తిడి కలగని విధంగా బొమ్మను చూపించి.. ఏం జరిగిందీ, ఎలా జరిగిందీ.. వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తామని చెబుతూ, షీటీమ్స్‌కు ఇంతవరకు అందిన వాటిలో 24 నెలల అతి చిన్న వయస్కురాలైన బాధితురాలి తరఫున నమోదైన ఫిర్యాదు కూడా ఉందని తెలిపారు ::: హైదరాబాద్‌లోని నిజామ్ కాలేజీలో ఐదు కోట్ల రూపాయల వ్యయంతో కొత్త గర్ల్స్ హాస్టల్‌ను నిర్మించడానికి పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు. గతంలో ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు నిజాం కాలేజీకి వచ్చినప్పుడు గర్ల్స్ హాస్టల్ నిర్మిస్తామని తను మాట ఇచ్చినట్లు గుర్తుచేస్తూ, ఇప్పుడా మాటకు కట్టుబడి నిర్మాణాన్ని ప్రారంభించడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని కె.టి.ఆర్. ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు ::: కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేదిపై, ఆమె పదేళ్ల కూతుర్ని ఉద్దేశించి ట్విట్టర్లో కామెంట్ పెట్టిన వారిని వెంటనే గుర్తించి ‘పోక్సో’ చట్టం కింద చర్య తీసుకోవాలని కేంద్ర హోంశాఖ నుంచి ఢిల్లీ, ముంబై పోలీసులకు ఆదేశాలు అందాయి. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని మంద్సార్లో ఏడేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారంపై అనుచితంగా స్పందించినట్లుగా ప్రియాంక పేరిట సోషల్ మీడియాలో వచ్చిన ఒక అబద్ధపు వ్యాఖ్యపై తిరుగుదాడిగా ట్విట్టర్లో ఆమె కూతురిపై అలా కామెంట్ వచ్చింది ::: ఒక అడ్వరై్టజ్‌మెంట్ కంపెనీకి చెల్లించవలసిన ఆరు కోట్ల రూపాయలకు పైగా బకాయిల ఎగవేతల విషయంలో తమిళనటుడు రజనీకాంత్ భార్య లతను సుప్రీంకోర్టు సుదీర్ఘంగా ప్రశ్నించింది. ‘కొచ్చాడియన్’ (2014) పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చుల కోసం తమ వద్ద అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వలేదని ‘యాడ్ బ్యూరో’ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు 12 వారాల లోపు ఆ డబ్బును తిరిగి ఇచ్చేయాలని గత ఫిబ్రవరిలోనే ఆదేశాలు జారీ చేసినప్పటికీ చెల్లింపులు జరగకపోవడంతో రుణదాతలు తిరిగి కోర్టును ఆశ్రయించారు ::: యాక్సిస్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో శిఖా శర్మ స్థూల వేతనంలో 7.8 శాతం పెరుగుదల ద్వారా ఆమె వేతనం 2.91 కోట్ల రూపాయలు అయిందని 2017–18 బ్యాంకు వార్షిక నివేదిక వెల్లడించింది. గత ఏడాది ఈ మొత్తం 2.70 కోట్ల రూపాయలుగా ఉండేది ::: సంజయ్‌దత్ జీవిత కథ ఆధారంగా వచ్చి, అనూహ్యమైన ప్రేక్షకాదరణ పొందుతున్న ‘సంజూ’ చిత్రంలో తన ప్రస్తావన లేకపోవడం çపట్ల సంజయ్‌దత్ భార్య రియా పిళ్లై విస్మయం వ్యక్తం చేశారు. రెండో భార్య అయిన రియాతో పాటు, మొదటిభార్య రిచా ఊసు కూడా లేకుండా మూడో భార్య మాన్యతకు (దియామీర్జా) మాత్రమే దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ ‘సంజూ’లో స్థానం కల్పించారు. -
చేదు నిజాన్ని వెల్లడించిన ప్రముఖ నటి
ప్రముఖ నటి సోనాలి బింద్రే తన అభిమానులకు షాక్ ఇచ్చారు. ఈ రోజు (బుధవారం) తన అభిమానులతో ఓ చేదు వార్తను పంచుకున్నారు. తాను హై గ్రేడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు, ప్రస్తుతం చికిత్స కోసం న్యూయార్క్ వెళ్తున్నట్లు తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో బుధవారం తన స్నేహితులు, అభిమానులతో ఈ వార్తను పంచుకున్నారు. తాను ఓ యుద్దానికి సిద్ధమవుతున్నానని, తన కుటుంబం, స్నేహితులే తనకు బలమని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించిన సొనాలి బింద్రే, మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మురారి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి స్టార్‌హీరోల సరసన నటించి మెప్పించారు. తమిళంలోనూ పలు హిట్ చిత్రాల్లో నటించిన సోనాలి 2004 తరువాత సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం సొనాలి పలు హిందీ రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. pic.twitter.com/KK2blEEz6L — Sonali Bendre Behl (@iamsonalibendre) 4 July 2018 -
టబు, సోనాలీలు తప్పించుకోవడానికి కారణమిదే!
సాక్షి, జైపూర్ : రాజస్థాన్ అడవుల్లో కృష్ణజింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ జోధ్‌పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సల్మాన్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలీ బ్రిందే, టబు, నీలంలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కానీ ఆ రోజు సల్మాన్‌తో పాటు జీపులో సైఫ్, టబు, సోనాలీ, నీలంలు కూడా వున్నారని, వారే సల్మాన్‌ను తుపాకీతో కాల్చమని ప్రోత్సహించారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. అయితే వారికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకలేదు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన పూనమ్ బిష్ణోయ్.. జీపులో ఉన్నది వారేనా? అన్నది కచ్చితంగా చెప్పలేకపోయారు. దీంతో సైఫ్ అలీ ఖాన్, నీలమ్, టబు, సొనాలీ బింద్రేలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వారితో పాటు ఈ క్రైమ్‌లో కీలక పాత్ర పోషించిన దుష్యంత్ సింగ్‌ను కూడా నిర్దోషిగానే కోర్టు ప్రకటించింది. క్రాస్ ఎగ్జామినేషన్ కోసం టబు, సోనాలీలను ఒక రోజు కోర్టు ముందుకు తీసుకొచ్చినప్పటికీ, పూనమ్ బిష్ణోయ్ వారిని గుర్తుపట్టలేకపోయారు. ఫిర్యాదులో వారి పేర్లను పేర్కొని, ఎందుకు అతను గుర్తుపట్టలేకపోతున్నారని కోర్టు ప్రశ్నించింది. అయితే ఘటన జరిగిన రోజు అందరూ తెలుపు రంగ సల్వార్ సూట్స్ ధరించారని, ఆ కారణంతో వారిని గుర్తించలేపోతున్నానని బిష్ణోయ్ తెలిపారు. దీంతో ఇక వారిని ధ్రువీకరించే ఆధారాలు లేనందున.. నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. వారు సల్మాన్ వెంట ఉన్నారే తప్పితే కృష్ణ జింకలను చంపడంలో పాత్ర ఏమీ లేదని వారి తరఫు న్యాయవాది వాదించడం కూడా టబు, సోనమ్, నీలమ్, సైఫ్ అలీ ఖాన్లకు కలిసి వచ్చింది. -
ఓ కేసు... మరో న్యూసెన్సు
సెలబ్రిటీ మూడ్‌తో కామన్ పీపుల్‌కి సంబంధం ఉండదు. వాళ్లని ఆటపట్టించాలనుకునే ఆకతాయిలకు అయితే అస్సలు ఉండదు. వాళ్ల పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా తాము అనుకున్నది చేస్తారు. టబు పట్ల ఓ ఆకతాయి అలానే వ్యవహరించాడు. సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన సమయంలో అతని పక్కనే ఉన్న సోనాలి బింద్రే, సైఫ్ అలీఖాన్, టబు కూడా బుధవారం కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. అసలే ఏం జరుగుతోందనే టెన్షన్. ఆ టెన్షన్ బయటికి కనిపించనివ్వకుండా హడావిడిగా వెళుతున్న టబూని ఎయిర్‌పోర్ట్‌లో ఓ ఆకతాయి తాకడానికి ప్రయత్నించాడు. ఊహించని ఈ చర్యకు టబు ఖంగు తిన్నారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అప్రమత్తమై అతన్ని వెనక్కు లాగారు. మామూలుగా అయితే టబు అతని మీద కేసు పెట్టేవారేమో. ఇప్పుడు వెళుతున్నదే ఓ కేసు గురించి కదా. ఇలాంటి సమయంలో వేరే విషయాలను పట్టించుకునే ఆలోచన ఎందుకుంటుంది? ఆ సంగతలా ఉంచితే.. సెలబ్రిటీలు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకుని కూడా వాళ్లను ఇబ్బందులపాలు చేయడం పద్ధతి కాదేమో. ఇదిలా ఉంటే కోర్టు నుంచి బయటకు వచ్చిన సైఫ్ అలీఖాన్ మీడియా అడిగిన ప్రశ్నలకు ఇరిటేట్ అయ్యారు. ఆ కోపాన్ని కార్ డ్రైవర్ మీద చూపించారు. ‘‘భయ్యా, కార్ అద్దాలైనా పైకి ఎత్తు లేదా కారుని అయినా రివర్స్ చేయి. లేదంటే చెంప చెళ్లుమనిపిస్తా’’ అంటూ డ్రైవర్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
‘సోనాలీ అంటే నాకిష్టం.. ఆమెను ప్రేమించా’
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తెలియని వారు బహుషా ఉండరేమో.. రావల్పిండి ఎక్స్‌ప్రెస్ అని పేరున్న ఆయనను గుర్తుచేసుకుంటే వేగంగా దూసుకొచ్చే బంతి గొర్తొస్తుంది. ఆ స్టార్ క్రికెటర్ ఓ మీడియాతో మాట్లాడుతూ చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. ఆయన ఓ బాలీవుడ్ భామపై మనసు పారేసుకున్నాడట. ఈ విషయం చెప్పగానే వెంటనే ఎవరు ఆమె అని ప్రశ్నించగా సోనాలీ బింద్రే అంటూ కాస్త సిగ్గుపడినట్లుగా నవ్వుతూ సమాధానం ఇచ్చారు. తనకు సోనాలి అంటే ఎంతో ఇష్టమని, ఓసారి ఆమెను కలిసేందుకు తమ జట్టు మేనేజర్ అనుమతి కూడా తీసుకున్నానని తెలిపాడు. ఆమెను కలిశాక తన ప్రేమ విషయం చెప్పాలనుకున్నానని, ఒక వేళ ఆమె తన ప్రేమను కాదంటే కిడ్నాప్ కూడా చేసేద్దామనుకున్నట్లు వివరించాడు. ఎప్పుడూ తన పర్స్‌లో సోనాలి ఫొటో ఉండేదని, ఆ విషయం తెలిసి తన సహచర ఆటగాళ్లు ఏడిపించేవారని, కానీ, చివరకు తాను మాత్రం ఆమెను కలవకుండానే దూరమయ్యానని అన్నాడు. అలాగే తన ప్రేమను కూడా వ్యక్తం చేయలేకపోయినట్లు వివరించాడు. -
పోయిన హీరోయిన్ కారు దొరికింది
ముంబయి: ప్రముఖ నటి సోనాలీ బింద్రే కారు దొరికింది. ముంబయిలో మాయమైన ఆమె కారు రాజస్థాన్‌లో ప్రత్యక్షమైంది. మంగళవారం పోలీసులు ఆమె కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సోనాలీకి చెందిన ఇన్నోవా కారును గత ఏడాది ఎవరో గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత ఆమె ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఆమె కారు జాడ తెలియలేదు. గత ఏడాది నవంబర్ నెలలో రాజస్థాన్‌లోని బార్మర్ ప్రాంతంలో పోలీసులు ఎంఎస్ 02 సీపీ 2030 అనే కారును స్వాధీనం చేసుకున్నారు. మత్తుమందులను పంపిణీ చేసే స్మగ్లర్ల నుంచి ఈ కారును సీజ్ చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టగా తాజాగా ఆ కారు సోనాలీ బింద్రే పేరిట నమోదు అయ్యి ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు ఈ విషయం తెలియజేయగా బింద్రేకు సంబంధించిన వ్యక్తిగత న్యాయవాది కోర్టుకు హాజరై ఆమె కారును తీసుకెళ్లారు. గత ఏడాది అక్టోబర్ 1న సోనాలీ కారు పోయింది. ఆ సమయంలో ఆమె భర్త గోల్డీ బెహల్ మరుసటి రోజే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఆ యాడ్స్ ఇక చేయను : హీరోయిన్
టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా వెండితెర మీద వెలిగిపోతున్న తారలందరూ తమ స్టార్ ఇమేజ్ను క్యాష్ చేసుకోవాలనుకుంటారు. అందుకే ఎడాపెడా బ్రాండ్ ఎండార్స్మెంట్లను ఒప్పేసుకొని వీలైనంత వెనకేసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఒకప్పుడు అలాగే అన్ని రకాల బ్రాండ్లను ప్రమోట్ చేసిన సోనాలి బింద్రే, ఇక పై ఫెయిర్‌నెస్ క్రీం యాడ్లను ఎండార్స్ చేయనంటూ ప్రకటించింది. ఓ టివి కామెడీ షోలో హీరోయిన్ తనీషా చటర్జీ స్కిన్ టోన్‌పై చేసిన కామెంట్స్, వివాదాస్పదమైన నేపథ్యంలో... ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సోనాలి తన నిర్ణయాన్ని ప్రకటించింది. చిన్నవయసులో తనకు డబ్బు అవసరమైనప్పుడు అలాంటి యాడ్స్ చేశాను, కానీ ఇక మీదట ఎవరైనా తనకు అలాంటి ఆఫర్ ఇచ్చినా అంగీకరించనని తెలిపింది. ఒక వ్యక్తి స్కిన్ టోన్ గురించి జోక్స్ వేయటం చాలా పెద్ద తప్పన్న సోనాలి, ప్రస్తుత సమాజంలో ఇలాంటి విషయాలపై స్పందన బాగుందని తెలిపింది. -
బుల్లితెరపై బెంద్రే తొలి సంతకం!
టీవీక్షణం: మన్మథుడికి తగిన జోడీగా, శంకర్‌దాదాలో ప్రేమ పుట్టించిన పడతిగా, ఇంద్ర మనసును గెలిచిన మగువగా అలరించింది సోనాలీ బెంద్రే. పెళ్లి తర్వాత వెండితెరకు దూరమైన ఆమె... ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తెరమీద కనిపించడానికి సిద్ధమైంది. అది కూడా ఒక సీరియల్‌తో. లైఫ్ ఓకే చానెల్లో ‘అజీబ్ దాస్తా హై యే’తో బుల్లితెర మీద తన తొలి సంతకం చేసింది సోనాలీ. భర్త, అత్తగారు, ఆడపడుచులు, ఇద్దరు పిల్లలు... వీళ్లు తప్ప వేరే ప్రపంచమే ఉండదు శోభకు. అయితే ఉన్నట్టుండి ఆమె జీవితంలో తుఫాను రేగుతుంది. రాజకీయ నాయకుడైన శోభ భర్త ఓ సెక్స్ స్కాండల్‌లో ఇరుక్కుని జైలు పాలవుతాడు. అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొంటాడు. అతడిని కాపాడాలనుకున్న శోభకి నమ్మలేని నిజాలు తెలుస్తాయి. తనను మోసగించి భర్త ఎందరు అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నాడో తెలిసి తట్టుకోలేకపోతుంది. ఓ పక్క ఆ బాధ, మరోపక్క భర్త చేసిన పనికి ఎదుర్కొంటోన్న అవమానాలు, ఇంకోపక్క బ్యాంకులు తమ అకౌంట్లన్నీ సీజ్ చేసేయడంతో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. దాంతో కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంటుంది. వ్యాపారవేత్త అయిన హీరో దగ్గర పీఏగా చేరుతుంది. అయితే మితిమీరిన ప్రాక్టికల్ పర్సన్ అయిన అతడిని డీల్ చేయడం ఆమెకు కష్టమవుతుంది. అతడి వల్ల ఆమెకెలాంటి ఇబ్బందులొచ్చాయి, వాటినెలా అధిగమించింది, అతడితో ఆమెకెలాంటి బంధం ఏర్పడింది అనేది కథ! మొదట సాధారణ ఇల్లాలిగా అమాయకంగా కనిపించిన సోనాలీ... తర్వాత ఆత్మవిశ్వాసం ఉట్టిపడే మగువగా అద్భుతంగా నటిస్తోంది. తన హుందాతనంతో శోభ పాత్రకు ప్రాణం పోస్తోందామె. అలాగే మూర్ఖత్వం, మొండితనం, కాస్త మంచితనం కలగలసిన వ్యక్తిగా అపూర్వ అగ్నిహోత్రి అభినయానికి కూడా ఫుల్ మార్కులు వేయవచ్చు. ప్రతి హిట్ సీరియల్ తెలుగులోకి డబ్ అవుతున్నట్టు ఇది కూడా అయితే, తెలుగువారికి మరో మంచి సీరియల్ చూసే అవకాశం దొరుకుతుంది! -
తండ్రులు ‘బాధ్యత’ తీసుకుంటున్నారు
న్యూఢిల్లీ: ఇప్పుడు పిల్లల పెంపకంలో తండ్రులూ బాధ్యత తీసుకుంటున్నారని..ఇది శుభ పరిణామమని బాలీవుడ్ నటి సొనాలీ బింద్రే వ్యాఖ్యానించింది. ఇటీవల ఆమె తన కుమారుడి బాధ్యతల వల్ల ఫిక్షన్ టీవీ షోను చేయడానికి మొదట వెనుకడుగు వేసింది. అయితే తన భర్త సహకారంతో షోను పూర్తిచేయగలిగానని చెప్పింది. ఈమె భర్త అయిన గోల్డీ బెల్ నిర్మాత కూడా. అలాగే కొడుకు రణవీర్‌కు తొమ్మిదేళ్లు. పిల్లల పెంపకంలో తల్లితో సమానంగా తండ్రి బాధ్యత తీసుకుంటే వారికి మంచి భవిష్యత్తు నిచ్చినట్లవుతుందని ఆమె అభిప్రాయపడింది. ‘ఇంతకుముందు పిల్లలు పుట్టినప్పటినుంచి వారి పెంపకం, ఇతర బాధ్యతలు ప్రధానంగా తల్లిపైనే పడే వి. తండ్రి ఎక్కువ బాధ్యత తీసుకునేవాడు కాదు. కాని నేడు పరిస్థితుల కనుగుణంగా తండ్రులు కూడా పిల్లల బాధ్యతలను తీసుకుంటున్నారు. ఇది ఆహ్వానించదగ్గ విషయం..’అని అంది. త్వరలో ప్రసారం కానున్న ‘అజీబ్ దాస్తాన్ హై యే’కోసం కనీసం ఆరు నెలల పాటు ఆమె సమ యం కేటాయించాల్సి వచ్చింది. దీంతో ఈ సమయంలో కుమారుడి ఆలనా పాలనా చూసుకోవడం కష్టమవుతుందని భావించిన ఆమె మొదట ఈ షోను చేయడానికి వెనుకడుగు వేసింది. అయితే ఆమె భర్త ఇచ్చిన ప్రోత్సాహం, భరోసాతో తను ఈ ప్రాజెక్టుకు అంగీకరించానని ఆమె తెలిపింది. ‘నువ్వు వెళ్లు.. నేనున్నాగా.. రణవీర్ గురించి నా మీటింగ్‌లు, ఇతర పనులు సర్దుబాటు చేసుకుంటా..అని నా భర్త హామీ ఇచ్చాడు. అతడు చెప్పినట్లుగానే రణవీర్ స్కూల్ కు వెళ్లి తీసుకు వస్తున్నాడు.. అలాగే టెన్నిస్ క్లాస్‌లకు వెళ్లి పికప్ చేసుకుంటున్నాడు..’ అని ఆమె వివరించింది. ‘చిన్నప్పటినుంచి నాకు జంక్‌ఫుడ్‌లు, బయట చేసే తినుబండారాలు తినడం అలవాటు లేదు. వారానికి మూడు రోజులు జిమ్కువెళుతుంటా. ప్రతి రెండు గంటలకొకసారి ఆకలయ్యేది. ఏమైనా ఉంటే పెట్టమని మా అమ్మని సతాయించేదాన్ని. దాంతో ఆమె నాపై అప్పుడప్పుడూ కోప్పడేది కూడా.. అయితే ఇప్పుడు ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చుపెట్టుకుని మరీ ఏ డైటీషియన్ దగ్గరికెళ్లినా రెండు గంటలకొకసారి తిండి తినమని చెబుతున్నారు..’అని ఆమె నవ్వుతూ చెప్పింది. -
‘నువ్వు వెళ్లు.. నేనున్నాగా
న్యూఢిల్లీ: ఇప్పుడు పిల్లల పెంపకంలో తండ్రులూ బాధ్యత తీసుకుంటున్నారని..ఇది శుభ పరిణామమని బాలీవుడ్ నటి సోనాలి బింద్రే వ్యాఖ్యానించింది. ఇటీవల ఆమె తన కుమారుడి బాధ్యతల వల్ల ఫిక్షన్ టీవీ షోను చేయడానికి మొదట వెనుకడుగు వేసింది. అయితే తన భర్త సహకారంతో షోను పూర్తిచేయగలిగానని చెప్పింది. ఈమె భర్త అయిన గోల్డీ బెల్ నిర్మాత కూడా. అలాగే కొడుకు రణవీర్‌కు తొమ్మిదేళ్లు. పిల్లల పెంపకంలో తల్లితో సమానంగా తండ్రి బాధ్యత తీసుకుంటే వారికి మంచి భవిష్యత్తు నిచ్చినట్లవుతుందని ఆమె అభిప్రాయపడింది. ‘ఇంతకుముందు పిల్లలు పుట్టినప్పటినుంచి వారి పెంపకం, ఇతర బాధ్యతలు ప్రధానంగా తల్లిపైనే పడేవి. తండ్రి ఎక్కువ బాధ్యత తీసుకునేవాడు కాదు. కాని నేడు పరిస్థితుల కనుగుణంగా తండ్రులు కూడా పిల్లల బాధ్యతలను తీసుకుంటున్నారు. ఇది ఆహ్వానించదగ్గ విషయం..’అని అంది. త్వరలో ప్రసారం కానున్న ‘అజీబ్ దాస్తాన్ హై యే’కోసం కనీసం ఆరు నెలల పాటు ఆమె సమయం కేటాయించాల్సి వచ్చింది. దీంతో ఈ సమయంలో కుమారుడి ఆలనా పాలనా చూసుకోవడం కష్టమవుతుందని భావించిన ఆమె మొదట ఈ షోను చేయడానికి వెనుకడుగు వేసింది. అయితే ఆమె భర్త ఇచ్చిన ప్రోత్సాహం, భరోసాతో తను ఈ ప్రాజెక్టుకు అంగీకరించానని ఆమె తెలిపింది. ‘నువ్వు వెళ్లు.. నేనున్నాగా.. రణవీర్ గురించి నా మీటింగ్‌లు, ఇతర పనులు సర్దుబాటు చేసుకుంటా..అని నా భర్త హామీ ఇచ్చాడు. అతడు చెప్పినట్లుగానే రణవీర్ స్కూల్‌కు వెళ్లి తీసుకు వస్తున్నాడు.. అలాగే టెన్నిస్ క్లాస్‌లకు వెళ్లి పికప్ చేసుకుంటున్నాడు..’ అని ఆమె వివరించింది. ‘చిన్నప్పటినుంచి నాకు జంక్‌ఫుడ్‌లు, బయట చేసే తినుబండారాలు తినడం అలవాటు లేదు. వారానికి మూడు రోజులు జిమ్కువెళుతుంటా. ప్రతి రెండు గంటలకొకసారి ఆకలయ్యేది. ఏమైనా ఉంటే పెట్టమని మా అమ్మని సతాయించేదాన్ని. దాంతో ఆమె నాపై అప్పుడప్పుడూ కోప్పడేది కూడా.. అయితే ఇప్పుడు ఆరోగ్యం కోసం రూ.లక్షలు ఖర్చుపెట్టి ఏ డైటీషియన్ దగ్గరికెళ్లినా రెండు గంటలకొకసారి తింటే తినమని చెబుతున్నారు..’అని ఆమె నవ్వుతూ చెప్పింది. -
ఆమెతో కలిసి నటించడం అదృష్టం
అటు బాలీవుడ్లో ఇటు టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన నటి సోనాలీ బింద్రే త్వరలో బుల్లితెరపై ఓ సీరియల్ ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెండితెర నుంచి నిష్ర్కమించిన తరువాత అప్పుడప్పుడూ టీవీ రియాలిటీ షోలలో జడ్జీగా కనిపించినప్పటికీ డెయిలీ సీరియల్లో నటించడం ఇదే మొదటిసారి. ఏక్తా కపూర్ రూపొందిస్తున్న ‘అజీబ్ దాస్తాన్ హై యే’ సీరియల్లో సోనాలీ అపూర్వ అగ్నిహోత్రితో కలిసి జంటగా నటిస్తున్నారు. సోనాలీకి తాను పెద్ద అభిమానినని అపూర్వ అంటున్నాడు. ఆమె అద్భుతమైన నటి అని, నటనలో ఎంతో అనుభవమున్నప్పటికీ సెట్స్‌లో ఆమె చిన్న పిల్లలాగానే వ్యవహరిస్తుందని అన్నాడు. ఆమెతో కలిసి నటించడం తన అదృష్టమని చెప్పాడు. లైఫ్ ఓకే చానెల్లో త్వరలో ప్రసారం కానున్న ‘అజీబ్ దాస్తాన్ హై యే’ సీరియల్ ఇద్దరు అపరిచితుల మధ్య కథ అని అపూర్వ చెప్పాడు. అదృష్టం కొద్దీ కలిసిన వీరిద్దరు ఆ తరువాత ఒక్కటవుతారని అన్నాడు. ఇదివరకు జస్సీ జైసీ కోయీ నహీ సీరియల్ నటించిన అపూర్వ అగ్నిహోత్రి ఈ సీరియల్లో తన పాత్ర ఎంతో సవాలుతో కూడుకున్నదని అన్నాడు. ఏక్తాకపూర్కు చెందిన బాలాజీ సంస్థలో పని చేయడం ఇదే మొదటిసారి అన్నాడు. తొలుత వెండితెరపై కనిపించిన అపూర్వ అక్కడ తనకు అదృష్టం కలిసి రాకపోవడంతో బుల్లితెరపైకి వచ్చాడు. సినిమాల్లోకి మళ్లీ వస్తారా అన్న ప్రశ్నకు నటునిగానైతే రానని, దర్శకునిగా ప్రయత్నిస్తానని చెప్పాడు. ఒకరకంగా బిగ్‌బాస్ షో అపూర్వ జీవితాన్ని మార్చివేసిందని చెప్పవచ్చు. ఆ షోలో అపూర్వ తన భార్యతో కలిసి పాల్గొన్నాడు. బిగ్‌బాస్ షోలో పాల్గొనే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందని అపూర్వ చెప్పాడు. ఆ అవకాశం తొమ్మిదేళ్ల పాటు నిర్మితమైన ప్రతిష్టను 90 రోజుల్లో దిగజార్చవచ్చని అన్నాడు. తాను, తన భార్య మంచి పేరుతో ఆ షో నుంచి బయటపడటం తమ అదృష్టమని అపూర్వ పేర్కొన్నాడు. -
డెయిలీ సీరియల్లో సోనాలీ బింద్రే
న్యూఢిల్లీ: అటు బాలీవుడ్లో ఇటు టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన నటి సోనాలీ బింద్రే త్వరలో బుల్లితెరపై ఓ సీరియల్ ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెండితెర నుంచి నిష్ర్కమించిన తరువాత అప్పుడప్పుడూ టీవీ రియాలిటీ షోలలో జడ్జీగా కనిపించినప్పటికీ డెయిలీ సీరియల్లో నటించడం ఇదే మొదటిసారి. ఏక్తా కపూర్ రూపొందిస్తున్న ‘అజీబ్ దాస్తాన్ హై యే’ సీరియల్లో సోనాలీ అపూర్వ అగ్నిహోత్రితో కలిసి జంటగా నటిస్తున్నారు. సోనాలీకి తాను పెద్ద అభిమానినని అపూర్వ అంటున్నాడు. ఆమె అద్భుతమైన నటి అని, నటనలో ఎంతో అనుభవమున్నప్పటికీ సెట్స్‌లో ఆమె చిన్న పిల్లలాగానే వ్యవహరిస్తుందని అన్నాడు. ఆమెతో కలిసి నటించడం తన అదృష్టమని చెప్పాడు. లైఫ్ ఓకే చానెల్లో త్వరలో ప్రసారం కానున్న ‘అజీబ్ దాస్తాన్ హై యే’ సీరియల్ ఇద్దరు అపరిచితుల మధ్య కథ అని అపూర్వ చెప్పాడు. అదృష్టం కొద్దీ కలిసిన వీరిద్దరు ఆ తరువాత ఒక్కటవుతారని అన్నాడు. ఇదివరకు జస్సీ జైసీ కోయీ నహీ సీరియల్ లో నటించిన అపూర్వ అగ్నిహోత్రి ఈ సీరియల్లో తన పాత్ర ఎంతో సవాలుతో కూడుకున్నదని అన్నాడు. ఏక్తాకపూర్కు చెందిన బాలాజీ సంస్థలో పని చేయడం ఇదే మొదటిసారి అన్నాడు. తొలుత వెండితెరపై కనిపించిన అపూర్వ అక్కడ తనకు అదృష్టం కలిసి రాకపోవడంతో బుల్లితెరపైకి వచ్చాడు. సినిమాల్లోకి మళ్లీ వస్తారా అన్న ప్రశ్నకు నటునిగానైతే రానని, దర్శకునిగా ప్రయత్నిస్తానని చెప్పాడు. ఒకరకంగా బిగ్‌బాస్ షో అపూర్వ జీవితాన్ని మార్చివేసిందని చెప్పవచ్చు. ఆ షోలో అపూర్వ తన భార్యతో కలిసి పాల్గొన్నాడు. బిగ్‌బాస్ షోలో పాల్గొనే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందని అపూర్వ చెప్పాడు. ఆ అవకాశం తొమ్మిదేళ్ల పాటు నిర్మితమైన ప్రతిష్టను 90 రోజుల్లో దిగజార్చవచ్చని అన్నాడు. తాను, తన భార్య మంచి పేరుతో ఆ షో నుంచి బయటపడటం తమ అదృష్టమని అపూర్వ పేర్కొన్నాడు. -
కుటుంబంతోనే హాయిగా ఉంది
మరోసారి వెండితెరపై కనిపించే ఆలోచనేదీ ప్రస్తుతానికి లేదని బాలీవుడ్, టాలీవుడ్ నటి సోనాలీ బింద్రే పేర్కొన్నారు. ప్రస్తుతానికి అంగీకరించిన టీవీ కార్యక్రమాలతోనే సంతోషంగా ఉన్నానని, తద్వారా కుటుంబానికి అధిక సమయమివ్వగలుగుతున్నానని తెలిపారు. తన ఎనిమిదేళ్ల కొడుకు రణవీర్ ఎదుగుదలే తనకు ముఖ్యమని చెప్పారు. సినిమాల్లో నటించేందుకు అనేక అవకాశాలు వస్తున్నాయని, అయితే ప్రస్తుతానికి కుటుంబమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. జీవితంలోని ప్రతి దశతో మనమూ మార్పు చెందాలని ఈ 39 ఏళ్ల నటి వేదాంత ధోరణిలో అభిప్రాయపడ్డారు. అమ్మతనం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని చెప్పారు. కలర్స్ టీవీలో ప్రసారమవుతున్న ‘మిషన్ సప్నే’ కార్యక్రమానికి సోనాలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన పది మంది సెలబ్రిటీలు సామాన్యులుగా అవతారమెత్తి, వారి వృత్తులను చేపట్టి దినసరి వేతనాన్ని ఆర్జించడమే ఈ కార్యక్రమం ఇతివృత్తమని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని ఇంతకుముందెన్నడూ చేయలేదని, అందువల్ల ప్రేక్షకుల స్పందన కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. మిషన్ సప్నే కార్యక్రమం ఈ నెల 27 నుంచి ప్రసారం కానుంది. సల్మాన్‌ఖాన్, రణబీర్ కపూర్, కరణ్‌జోహార్, సిద్ధార్థ్ మల్హోత్రా వంటి సెలబ్రిటీలు తమ నిజ జీవితంలో క్షురకునిగా, వడాపావ్ విక్రేతగా, ఫొటోగ్రాఫర్‌గా, కూరగాయల విక్రేతగా కనిపించనున్నారు. దినసరి వేతనాన్ని ఆర్జించే వారిగా సెలబ్రిటీలు ఒకరోజు కష్టపడటం ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటుందని సోనాలీ చెప్పారు. -
ముంబై విమానాశ్రయంలో మెరిసిన సోనాలి బింద్రే
నువ్వు .. నువ్వు .. నువ్వే .. నువ్వు.. నా చెక్కిలి పైనా నువ్వు. చెలి గుండెలపైనా నువ్వు.. అంటూ సాగే ఆ బాణి విన్నప్పుడల్లా బాలీవుడ్ భామ సోనాలి బింద్రే గుర్తు రాక మానదు. పెళ్లైన తర్వాత నటనకు దూరమైనా ఆమె గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. భర్తతో కలిసి ముంబై ఎయిర్ పోర్టులో కనిపించిన సోనాలి బింద్రేను కెమెరాలు క్లిక్కుమనిపించిన చిత్రాలివి.