సైఫ్ అలీఖాన్, టబు
సెలబ్రిటీ మూడ్‌తో కామన్ పీపుల్‌కి సంబంధం ఉండదు. వాళ్లని ఆటపట్టించాలనుకునే ఆకతాయిలకు అయితే అస్సలు ఉండదు. వాళ్ల పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా తాము అనుకున్నది చేస్తారు. టబు పట్ల ఓ ఆకతాయి అలానే వ్యవహరించాడు. సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన సమయంలో అతని పక్కనే ఉన్న సోనాలి బింద్రే, సైఫ్ అలీఖాన్, టబు కూడా బుధవారం కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. అసలే ఏం జరుగుతోందనే టెన్షన్. ఆ టెన్షన్ బయటికి కనిపించనివ్వకుండా హడావిడిగా వెళుతున్న టబూని ఎయిర్‌పోర్ట్‌లో ఓ ఆకతాయి తాకడానికి ప్రయత్నించాడు. ఊహించని ఈ చర్యకు టబు ఖంగు తిన్నారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అప్రమత్తమై అతన్ని వెనక్కు లాగారు.
మామూలుగా అయితే టబు అతని మీద కేసు పెట్టేవారేమో. ఇప్పుడు వెళుతున్నదే ఓ కేసు గురించి కదా. ఇలాంటి సమయంలో వేరే విషయాలను పట్టించుకునే ఆలోచన ఎందుకుంటుంది? ఆ సంగతలా ఉంచితే.. సెలబ్రిటీలు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకుని కూడా వాళ్లను ఇబ్బందులపాలు చేయడం పద్ధతి కాదేమో. ఇదిలా ఉంటే కోర్టు నుంచి బయటకు వచ్చిన సైఫ్ అలీఖాన్ మీడియా అడిగిన ప్రశ్నలకు ఇరిటేట్ అయ్యారు. ఆ కోపాన్ని కార్ డ్రైవర్ మీద చూపించారు. ‘‘భయ్యా, కార్ అద్దాలైనా పైకి ఎత్తు లేదా కారుని అయినా రివర్స్ చేయి. లేదంటే చెంప చెళ్లుమనిపిస్తా’’ అంటూ డ్రైవర్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment