blackbuck case
-
సల్మాన్ ఖాన్‌ను మా వర్గం ఎప్పటికి క్షమించదు: గ్యాంగ్‌స్టర్ లారెన్స్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను తమ వర్గం ఎప్పటికి క్షమించదని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. పంజాబి సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యా కేసులో లారెన్స్ బిష్ణోయ్ జైలు శిక్ష ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింగర్ హత్యా కేసులో పోలీసులు ప్రస్తుతం అతడిన విచారిస్తున్నారు. ఈ సందర్భంగా లారెన్స్ పలు సంచలన విషయాలు వెల్లడించాడు. చదవండి: ఆస్పత్రి నుంచి హీరో విక్రమ్ డిశ్చార్జి.. పాత వీడియో వైరల్ చేస్తున్న ఫ్యాన్స్ ‘కృష్ణజింక హత్యకు సంబంధించి మా వర్గం ఎప్పటికీ సల్మాన్‌ను క్షమించదు. అతడు ఈ విషయంలో బహిరంగ క్షమాపణ చెబితేనే క్షమిస్తాం’ అని లారెన్స్ పేర్కొన్నట్లు ఢిల్లీ పోలీసలు చెప్పారు. కాగా జోధ్‌పూర్ అడవి సమీపంలో కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ దోషిగా తేలిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సల్మాన్‌కు కోర్టు జైలు శిక్ష విధించగా బెయిలుపై బయటకు వచ్చాడు. ఇప్పటికే ఈ కేసులో విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ కేసులో సల్మాన్‌ను చంపేందుకు లారెన్స్ గ్యాంగ్ 2018లో ప్రయత్నించింది. చదవండి: ది వారియర్ షూటింగ్లో దర్శకుడితో కాస్త ఇబ్బంది పడ్డా: కృతిశెట్టి అంతేకాదు ఇటీవల సల్మాన్ ఖాన్ తండ్రితో పాటు ఆయన తరపు లాయర్‌కు కూడా లారెన్స్ గ్యాంగ్ నుంచి హత్యా బెదిరింపు లేఖలు వచ్చాయి. ఇద్దరికీ సిద్ధూ మూసేవాలా గతే పడుతుందని హెచ్చరిక లేఖల్లో పేర్కొన్నారు. ఈ బెదిరింపులపై ఢిల్లీ పోలీసులు లారెన్స్‌ను ప్రశ్నించగా, అతడు ఈ విషయాలు వెల్లడించినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా లారెన్స్ బిష్ణోయ్ కమ్మునిటీలో కృష్ణ జింకను దైవంగా భావిస్తారట. ఈ నేపథ్యంలో బిష్ణోయ్, సల్మాన్‌ను టార్గెట్ చేశాడు. -
సల్మాన్ ఖాన్‌కు కోర్టు స్ట్రాంగ్ వార్నింగ్
జోథ్‌పూర్: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు జోథ్‌కోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కృష్ణజింకను వేటాడిన కేసులో తదుపరి కోర్టు విచారణకు హాజరుకాకపోతే.. ఆయన బెయిల్‌ను రద్దు చేస్తామని తేల్చి చెప్పింది. కృష్ణజింకను వేటాడిన కేసులో సల్మాన్‌కు జోథ్‌పూర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు. జోథ్‌పూర్ కోర్టు గురువారం ఈ కేసు విచారణను చేపట్టింది. ఈ విచారణకు సల్మాన్ హాజరు కావాల్సి ఉండగా.. ఆయన కోర్టుకు రాలేదు. దీంతో కోర్టు సల్మాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 1998లో హమ్ సాథ్ సాథ్ హై చిత్ర షూటింగ్ సందర్భంగా రాజస్థాన్ జోథ్‌పూర్‌లో కృష్ణజింకలను వేటాడి చంపినట్టు సల్మాన్ ఖాన్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో గత ఏడాది సల్మాన్‌ను దోషిగా నిర్ధారిస్తూ.. జోథ్‌పూర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. -
బాలీవుడ్ స్టార్స్‌కు షాకిచ్చిన కోర్టు
జైపూర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణజింక వేట కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ కేసులో గతంలో కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన బాలీవుడ్ నటులు టబు, సోనాలి బింద్రే, సైఫ్ అలీ ఖాన్, దుష్యంత్ సింగ్, నీలమ్ కొఠారిలకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 1998 అక్టోబర్‌లో 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రీకరణ సమయంలో సల్మాన్ ఖాన్‌తో కలిసి వీరంతా కృష్ణ జింకలను వేటాడారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. జోధ్‌పూర్ కోర్టు గతేడాది ఈ కేసుకు సంబంధించిన తీర్పును వెలువరిస్తూ సల్మాన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. మిగతావారిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే.. ఈ కేసులో సల్మాన్‌ది ఎంత తప్పు ఉందో అతనితో పాటు ఉన్న వారిది కూడా అంతే తప్పు ఉందని భావిస్తూ జోధ్‌పూర్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రేలకు నోటీసులు జారీ చేసింది. 1998 నాటి ఈ కేసులో జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు సల్మాన్‌ని దోషిగా నిర్ధారిస్తూ ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే. శిక్షపడిన తర్వాత సల్మాన్ జోధ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. (చదవండి : టబు, సోనాలీలు తప్పించుకోవడానికి కారణమిదే!) -
జైల్లో సల్మాన్‌ను కలిసిన ప్రీతీ జింతా
-
జైల్లో సల్మాన్‌ను కలిసిన హీరోయిన్..
జోధ్‌పూర్: కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ కండల నటుడు సల్మాన్ ఖాన్ ఐదేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. సల్మాన్‌ను కలిసేందుకు నటి ప్రీతీ జింతా శుక్రవారం జైలుకు వెళ్లారు. ఆ సమయంలో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అభిమానులు మాత్రం సల్మాన్‌కు సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలుపుతున్నారు. సినీ ప్రముఖులు కూడా ఆయనకు మద్దతుగా ట్వీట్లు చేశారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా తన ట్విటర్ ద్వారా స్పందించారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా సోషల్‌మీడియాలో స్పందించారు. గతంలో కూడా ఇండియాలో వేల సంఖ్యలో కృష్ణ జింకలను చంపేశారు. మీకు అది ఏ మాత్రం పెద్ద విషయం కాదు. రోజూ మనం ఆవుల్ని, మేకల్ని, పందుల్ని చంపేస్తున్నాం. ఆ ప్రాణాలు మనకు లెక్క లేవా. అని ఆయన ట్వీట్ చేశారు. ఈ కేసులో సల్మాన్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలీ బ్రిందే, టబు, నీలంలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 1998లో వచ్చిన ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రీకరణ సమయంలో రాజస్థాన్ అడవుల్లో సల్మాన్ కృష్ణ జింకలను వేటాడినట్లు కేసు నమోదైంది. మూగజీవుల ప్రాణాలను బలిగొన్నందుకు వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 లోని 9/51 ప్రకారం సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధించారు. -
ఖాన్ కాబట్టే ఈ శిక్ష : మంత్రి వ్యాఖ్యలు
ఇస్లామాబాద్ : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు కోర్టు విధించిన ఐదు సంవత్సరాల జైలు శిక్షపై పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఖవాజా అసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు సల్మాన్‌ను దోషిగా తేల్చి ఈ శిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. గురువారం మీడియా సమావేశంలో కోర్టు తీర్పుపై పాక్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో మైనార్టీలపై వివక్ష ఉంటుందని, వారికి ఆ దేశంలో రక్షణ ఉండదని మరోసారి రుజువైందని ఆసిఫ్ అన్నారు. సల్మాన్ పేరు చివర ఖాన్ లేకుంటే తీర్పు వేరేలా వచ్చి ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్‌లోని అధికార పార్టీ మతాన్ని సల్మాన్ కలిగి ఉంటే ఈ శిక్షకు అనర్హుడై ఉండేవాడని ఆరోపించారు. పాక్ మంత్రి వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా నెటిజన్లు మండిపడ్డారు. సల్మాన్ ఖాన్, అతని మతంపై మీకు అంతలా ప్రేమ ఉంటే ఆ హీరో సినిమాలు (ఏక్తా టైగర్, టైగర్ జిందాహై) పాక్‌లోని థియేటర్లలో ఎందుకు ఆడనివ్వలేదని ప్రశ్నించారు. ఇదే కేసులో నిర్ధోషిగా బయటపడ్డ సైఫ్ అలీఖాన్‌ది ఏ మతమో మంత్రి చెప్పాలంటూ మరొకరు ప్రశ్నించారు. భారత్‌లో అందరూ సమానమే అని అక్రమ ఆయుధాల కేసులో బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌ను శిక్షించిన విషయం గుర్తుంచుకోవాలని వివరించారు. ఓ నీచ దేశానికి మంత్రిగా పనిచేస్తున్నావ్, పిచ్చి వాడిలా మాట్లాడుతున్నావ్, ముందు పాక్‌లో ఉన్న సమస్యలను తీర్చు, ఆ తర్వాతే పక్క దేశాల గురించు ఆలోచించు అని మరికొంత మంది సలహాలు ఇచ్చారు. -
సల్మాన్‌కు ఐదేళ్ల జైలు
జోధ్‌పూర్: కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్(52)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 1998 నాటి ఈ కేసులో జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు అతనిని దోషిగా నిర్ధారిస్తూ ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కోర్టు తీర్పు అనంతరం సల్మాన్ ఖాన్‌ను పోలీసులు జోధ్‌పూర్ కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న సహ నటులు సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సొనాలీ బెంద్రెలతో పాటు స్థానిక వ్యక్తి దుష్యంత్ సింగ్‌ను ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. జైలు శిక్ష మూడేళ్లకు మించి ఉండడంతో బెయిల్ కోసం సల్మాన్ పైకోర్టులో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు నిలుపుదల/బెయిల్ కోసం సెషన్స్ కోర్టులో అప్పీలు చేస్తామని సల్మాన్ తరఫు న్యాయవాది ఆనంద్ దేశాయ్ తెలిపారు. దేశమంతా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి జోధ్‌పూర్ కోర్టు వద్ద హడావుడి వాతావరణం కొనసాగింది. మీడియా ఎప్పటికప్పుడు కోర్టు వద్ద పరిణామాల్ని ప్రసారం చేసింది. సల్మాన్ అభిమానులతో పాటు సామాన్య ప్రజలు కూడా కోర్టు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ కేసులో మార్చి 28నే తుది వాదనలు ముగియగా.. చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ దేవ్ కుమార్ ఖత్రి తీర్పును రిజర్వ్ చేశారు. గురువారం ఉదయం సల్మాన్‌తో పాటు, సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సొనాలీ బెంద్రెలు కోర్టు హాజరైన అనంతరం జడ్జి తీర్పు కాపీని చదువుతూ ‘వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని 9/51 సెక్షన్ కింద సల్మాన్‌ను దోషిగా తేలుస్తూ ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తున్నా’ అని పేర్కొన్నారు. ‘నిందితుడు ప్రముఖ నటుడు కావడం వల్ల అతడి చర్యల్ని ప్రజలు అనుసరిస్తారు’ అని జడ్జి చెప్పారు. సల్మాన్‌కు ‘బెనిఫిట్ ఆఫ్ ద ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్’ను వర్తింప చేయాలని అతని తరఫు న్యాయవాదులు వాదించారు. ‘కేసులోని వాస్తవాల్ని, నేర తీవ్రతను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆ యాక్ట్‌ను వర్తింపచేయడం న్యాయసమ్మతం కాదు’ అని జడ్జి పేర్కొన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సల్మాన్ సోదరీమణులు అల్విరా, అర్పితలు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కేసులో 9/51 సెక్షన్ కింద గరిష్టంగా ఆరేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. తీర్పు అనంతరం పలువురు బాలీవుడ్ ప్రముఖులు సల్మాన్ పట్ల సానుభూతి ప్రకటించగా.. తీర్పును జంతు హక్కుల కార్యకర్తలు స్వాగతించారు. గతంలోనూ ఇదే జైల్లో..: కోర్టు తీర్పు అనంతరం పోలీసులు సల్మాన్‌ను బొలెరో వాహనంలో జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా రెండు కిలోమీటర్ల మేర.. మీడియా సిబ్బంది కవరేజ్, భద్రతా సిబ్బంది పహారాతో హంగామా నెలకొంది. జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో సల్మాన్ శిక్ష అనుభవించడం ఇది నాలుగోసారి.. వన్యప్రాణుల్ని వేటాడిన కేసుల్లో గతంలో 1998, 2006, 2007ల్లో మొత్తం 18 రోజులు జోధ్‌పూర్ జైల్లో సల్మాన్ గడిపారు. కృష్ణ జింక కేసు సాగిందిలా.. 1998, అక్టోబర్ 2: సల్మాన్‌తో పాటు సైఫ్ అలీఖాన్, సోనాలీ బెంద్రె, టబు, నీలంపై రాజస్తాన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2006, ఏప్రిల్ 10: ట్రయల్ కోర్టు సల్మాన్‌ను దోషిగా ప్రకటించి అయిదేళ్లు జైలు శిక్ష, 25 వేల రూపాయల జరిమానా విధించింది. వారం పాటు జైల్లో ఉన్న సల్మాన్ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. 2006, ఆగస్టు 31: ట్రయల్ కోర్టు తీర్పుపై రాజస్తాన్ హైకోర్టు స్టే. 2016, జులై 25: సల్మాన్‌ను నిర్దోషిగా విడుదల చేసిన హైకోర్టు. 2016, నవంబర్ 11: హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన రాజస్తాన్ ప్రభుత్వం.. కేసును మళ్లీ విచారించాలని జోధ్‌పూర్ ట్రయల్ కోర్టును ఆదేశించిన సుప్రీం కోర్టు. ఖైదీ నెంబర్ 106 లక్షలాది మందికి సల్మాన్ అభిమాన హీరో కావచ్చు.. అయితే జోధ్‌పూర్ జైల్లో మాత్రం అతను ఖైదీ నెంబర్ 106. రేప్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు గదికి పక్కనే ఉన్న బ్యారక్‌ను సల్మాన్‌కు కేటాయించారు. తొలి రోజు జైల్లో సల్మాన్‌కు పప్పు, చపాతీ ఇవ్వగా తినేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. సల్మాన్‌ను సాధారణ ఖైదీగానే చూస్తామని, అతని గదిలో చెక్క మంచం, రగ్గు, కూలర్ మాత్రమే ఉన్నాయని జైలు సూపరింటెండెంట్ విక్రమ్ సింగ్ చెప్పారు. కేసుల వీరుడు సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో మంచిపేరు సంపాదించుకున్న సల్మాన్ జీవితం ఆ తర్వాత పూర్తిగా వివాదాలమయమే. కేసులు, కోర్టుల చుట్టూ తిరగడం, కటకటాల జీవితం అలవాటుగా మారిపోయింది. సల్మాన్ కేసుల చిట్టాలను ఒకసారి పరిశీలిస్తే.. జోధ్‌పూర్ జైల్లోని జైలర్ కార్యాలయంలో సల్మాన్‌ఖాన్ కృష్ణ జింకల కేసు (1998) హమ్ సాథ్ సాథ్ హై షూటింగ్ సమయంలో రాజస్తాన్‌లోని కంకణి గ్రామంలో రెండు కృష్ణ జింకల్ని సల్మాన్ కాల్చి చంపారని కేసు నమోదైంది. 20 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం సల్మాన్‌ను జో«««ద్‌పూర్ ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అక్రమ ఆయుధాల కేసు (1998) కృష్ణ జింకల్ని చంపే సమయంలో సల్మాన్ వద్ద అక్రమ ఆయుధాలు ఉన్నాయంటూ కేసు నమోదైంది. కృష్ణ జింకల్ని వేటాడడానికి అమెరికాలో తయారైన .22 రైఫిల్, .32 రైఫిల్ వాడారని అభియోగాలు నమోదయ్యాయి. 2017, జనవరి 18న కోర్టు ఈ కేసును కొట్టేసింది. సల్మాన్ అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు పేర్కొంది. చింకారా కేసు (1998) హమ్ సాథ్ సాథ్ హై షూటింగ్ సమయంలోనే సల్మాన్ మూడు చింకారా (లేళ్లు)లను వేటాడారని మరో కేసు నమోదైంది. సల్మాన్ ఖాన్ భావాడ్ గ్రామంలో రెండు లేళ్లు, మాంథానియా గ్రామంలో మరో లేడిని వేటాడారని వేర్వేరుగా రెండు కేసులు నమోదయ్యాయి. 2006లో ట్రయల్ కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించినా, 2017లో రాజస్థాన్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. హిట్ అండ్ రన్ కేసు (2002) ముంబైలోని బాంద్రా వీ«ధుల్లో ఫుట్‌పాత్‌పైకి కారు నడిపి ఒకరి మృతికి కారణమయ్యాడని సల్మాన్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో ట్రయల్ కోర్టు సల్మాన్‌ను దోషిగా నిర్ధారించినా..2015లో ముంబై హైకోర్టు సల్మాన్‌ను నిర్దోషిగా తేల్చింది. కృష్ణ జింకల ప్రేమికులు..బిష్ణోయి ప్రజలు వన్యప్రాణుల పరిరక్షణ చట్టం కింద ఎన్ని కఠిన శిక్షలున్నా.. మూగజీవాల్ని పొట్టనబెట్టుకుంటున్న వేటగాళ్లను శిక్షించడం మనదేశంలో అంత సులువుకాదు. ఇక సరదా కోసం వన్యప్రాణుల్ని చంపే ప్రముఖుల్ని పట్టుకోవడం దాదాపు అసాధ్యమే. బిష్ణోయ్ ప్రజలు పోరాడకుండా ఉంటే సల్మాన్ విషయంలోను అదే జరిగేదేమో.. ఎంతో ఇష్టంగా చూసుకునే కృష్ణ జింకల్ని సల్మాన్ పొట్టన పెట్టుకోవడం కళ్లారా చూసిన రాజస్తాన్‌లోని బిష్ణోయ్ తెగ ప్రజలు.. అతను జైలుకెళ్లే వరకూ పోరాటాన్ని కొనసాగించారు. కృష్ణ జింకల కేసులో సల్మాన్‌కు జైలు శిక్ష నేపథ్యంలో కేసు పూర్వాపరాల్ని ఒకసారి పరిశీలిస్తే.. సల్మాన్‌ను వెంటాడిన కంకణి గ్రామస్తులు 1998, అక్టోబర్ 1.. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్లో ఉన్న సల్మాన్ ఇతర బాలీవుడ్ తారలతో కలిసి సమీపంలోని కంకణి గ్రామంలో రెండు కృష్ణ జింకల్ని వేటాడారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. స్థానికంగా నివసించే బిష్ణోయి తెగ ప్రజలకు తుపాకీ చప్పుళ్లతో పాటు జింకల అరుపులు వినిపించాయి. కృష్ణ జింకల పరిరక్షణను యజ్ఞంలా నిర్వహిస్తున్న ఈ తెగవారు హుటాహుటిన వచ్చి చూడగా రక్తపు మడుగులో జింకలు, వాహనంలో పరారైపోతూ సల్మాన్ కనిపించారు. గ్రామస్తులు వారిని వెంటాడినా ఫలితం లేకుండా పోయింది. సల్మాన్ ప్రయాణించిన జీపు నెంబర్‌ను గుర్తు పెట్టుకున్న వాళ్లు అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు సల్మాన్‌తో పాటు మిగతావారిపై కేసు నమోదైంది. జింక ఇరుక్కుంటే రక్షించానంతే: సల్మాన్ అయితే ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారనేది సల్మాన్ ఖాన్ వాదన. గతంలో మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ.. ‘ఆ రోజు షూటింగ్ ముగించుకొని మేమందరం వెళుతుండగా ఒక పొదల్లో చిక్కుకుపోయిన జింక పిల్లని చూశాం. పొదల్లోంచి దాన్ని బయటకు తీసి నేనే నీళ్లు పట్టాను. బిస్కెట్లు కూడా తినిపించాను. కాసేపటికి తేరుకున్న ఆ జింక అక్కడ్నుంచి వెళ్లిపోయింది‘ అని చెప్పుకొచ్చారు. జింకకి దగ్గరగా ఉండడం చూసిన గ్రామస్తులు తనను తప్పుగా అర్థం చేసుకొని కేసులు పెట్టారని సల్మాన్ పేర్కొన్నారు. -
ఓ కేసు... మరో న్యూసెన్సు
సెలబ్రిటీ మూడ్‌తో కామన్ పీపుల్‌కి సంబంధం ఉండదు. వాళ్లని ఆటపట్టించాలనుకునే ఆకతాయిలకు అయితే అస్సలు ఉండదు. వాళ్ల పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా తాము అనుకున్నది చేస్తారు. టబు పట్ల ఓ ఆకతాయి అలానే వ్యవహరించాడు. సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన సమయంలో అతని పక్కనే ఉన్న సోనాలి బింద్రే, సైఫ్ అలీఖాన్, టబు కూడా బుధవారం కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. అసలే ఏం జరుగుతోందనే టెన్షన్. ఆ టెన్షన్ బయటికి కనిపించనివ్వకుండా హడావిడిగా వెళుతున్న టబూని ఎయిర్‌పోర్ట్‌లో ఓ ఆకతాయి తాకడానికి ప్రయత్నించాడు. ఊహించని ఈ చర్యకు టబు ఖంగు తిన్నారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అప్రమత్తమై అతన్ని వెనక్కు లాగారు. మామూలుగా అయితే టబు అతని మీద కేసు పెట్టేవారేమో. ఇప్పుడు వెళుతున్నదే ఓ కేసు గురించి కదా. ఇలాంటి సమయంలో వేరే విషయాలను పట్టించుకునే ఆలోచన ఎందుకుంటుంది? ఆ సంగతలా ఉంచితే.. సెలబ్రిటీలు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకుని కూడా వాళ్లను ఇబ్బందులపాలు చేయడం పద్ధతి కాదేమో. ఇదిలా ఉంటే కోర్టు నుంచి బయటకు వచ్చిన సైఫ్ అలీఖాన్ మీడియా అడిగిన ప్రశ్నలకు ఇరిటేట్ అయ్యారు. ఆ కోపాన్ని కార్ డ్రైవర్ మీద చూపించారు. ‘‘భయ్యా, కార్ అద్దాలైనా పైకి ఎత్తు లేదా కారుని అయినా రివర్స్ చేయి. లేదంటే చెంప చెళ్లుమనిపిస్తా’’ అంటూ డ్రైవర్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
జైలుకు సల్మాన్
వన్యప్రాణులను వేటాడిన ఉదంతంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు రాజస్తాన్ లోని జో«ద్‌పూర్ కోర్టు గురువారం అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ సమయంలో సల్మాన్‌తో పాటున్న సహ నటీనటులందరినీ నిర్దోషులుగా భావించి కోర్టు విడుదల చేసింది. ఆయనపై దాఖలైన కేసుల పరంపరలో ఇది చివరిది. ఇరవైయ్యేళ్ల క్రితం... అంటే 1998 అక్టోబర్‌లో చిత్రం షూటింగ్ కోసం జోద్పూర్ అడవులకొచ్చిన ఈ నటీనటులంతా అర్ధరాత్రి సమయంలో వన్యప్రాణులను వేటాడారన్నది అభి యోగం. అందుకు సంబంధించి మూడు కేసులు దాఖలు కాగా రెండు కేసుల్ని లోగడ న్యాయస్థానాలు కొట్టేశాయి. ఇందులో ఒకటి సుప్రీంకోర్టు ముందు అప్పీ ల్కు వెళ్లింది. రెండు కృష్ణజింకలను వేటాడటానికి సంబంధించిన కేసులో ప్రస్తుతం జైలు శిక్ష పడింది. పెండింగ్ కేసుల విషయంలో మనం ప్రపంచ రికార్డు నెల కొల్పాం. న్యాయం కోసం కోర్టు మెట్లెక్కితే ఏళ్లూ పూళ్లూ గడుస్తున్నా అది అందడం గగనమవుతోంది. దర్యాప్తు ప్రక్రియ, విచారణ అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంటాయి. జనాభాకు తగ్గట్టుగా న్యాయస్థానాల సంఖ్య పెంచాలని, న్యాయ మూర్తుల నియామకాలు పెరగాలని న్యాయవ్యవస్థ నుంచి వినతులు వస్తున్నా ఏ ప్రభుత్వమూ సరిగా పట్టించుకోదు. పర్యవసానంగా కక్షిదారులు తమకెప్పుడు న్యాయం దక్కుతుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటారు. కేసుల్లో ఇరుక్కుని జైళ్ల పాలైనవారిది కూడా ఇదే పరిస్థితి. సల్మాన్ ఖాన్‌పై పెట్టిన కేసుల్లో సంక్లిష్టత ఏమీ లేదు. ఏళ్ల తరబడి దర్యాప్తు చేయడానికి అవి అంతర్రాష్ట్ర సంబంధాలున్న కేసులు కాదు...విదేశాల నుంచి ఎవరినో రప్పించి తేల్చవలసింది ఏమీ లేదు. అయినా అభియోగాలు రుజువై శిక్ష పడటానికి ఇరవైయ్యేళ్లు పట్టింది. వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వా లేదు... ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడే స్థితి ఉండరాదన్నది న్యాయ శాస్త్ర సిద్ధాంతం. ఆ పేరిట ఇలా ఏళ్ల తరబడి దర్యాప్తు, విచారణ కొనసాగుతూపోతే అసలు చట్టాలను రూపొందించడంలోని మౌలిక ఉద్దేశమే దెబ్బతింటుంది. తప్పు చేయ డానికి జనం భయపడే పరిస్థితి ఉండాలని, సమాజం సజావుగా సాగడానికి ఇది అవసరమని భావించి చట్టాలు ఏర్పరుస్తారు. దర్యాప్తు చకచకా సాగి, అవసరమైన సాక్ష్యాధారాలు సేకరించి సకాలంలో న్యాయస్థానాల్లో కేసులు దాఖలు చేయ గలిగితే... అక్కడ చురుగ్గా విచారణ సాగేందుకు అనువైన పరిస్థితులుంటే నింది తులకు శిక్ష వెనువెంటనే పడుతుంది. అప్పుడు చట్టాలంటే భయం ఉంటుంది. కానీ మన దేశంలో అందుకు విరుద్ధమైన పరిస్థితులున్నాయి. కేసులు ఎడతెగకుండా సాగుతున్నకొద్దీ సాక్షుల్లో నిరాశ ఏర్పడుతుంది. వారిపై ఒత్తిళ్లు బయల్దేరతాయి. బెదిరింపులొస్తాయి. ఈ ఉదంతానికి సంబంధించే దాఖలైన చింకారాల వేట కేసులో సల్మాన్‌కు 2006లో కింది కోర్టు అయిదున్నరేళ్ల శిక్ష విధించింది. దాన్ని సవాలు చేస్తూ ఆయన రాజస్తాన్ హైకోర్టును ఆశ్రయించగా...ఆ శిక్ష నిడివిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసింది. పదేళ్ల తర్వాత 2016లో ఆ కేసులో హైకోర్టు సల్మాన్‌ను నిర్దోషిగా విడిచిపెట్టింది. దానిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అప్పీల్ ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. చింకారాల వేటకు సంబంధించి ఆయుధాల చట్టంకింద నమోదైన మరో కేసు నిరుడు జనవరిలో కింది కోర్టులో వీగిపోయింది. ఇప్పుడు శిక్షపడిన కృష్ణ జింకల వేట కేసు ఆ పరంపరలో చివరిది. జో«ద్‌పూర్ అడవికి సమీపంలోని కంకాణి గ్రామంలోని బిష్ణోయ్ తెగ పౌరులు వన్యప్రాణులను ప్రాణప్రదంగా చూసుకుంటారు. సంపన్నవర్గాలవారు వేటకోసమని వస్తే వారికి చుక్కలు చూపిస్తారు. సల్మాన్ తదితరులంతా అర్ధరాత్రి వేటాడుతుంటే తుపాకి పేలుళ్ల శబ్దం విని బయటికొచ్చిన గ్రామస్తులకు అక్కడ కృష్ణజింకల కళేబరాలు కనబడటంతో ఆగ్రహోదగ్రులయ్యారు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. గ్రామస్తులను తుపాకులతో బెదిరించి నటీనటులంతా వాహనంలో పరారయ్యారని ఆరోపణలొచ్చాయి. ఆ తర్వాత వారంతా అటవీశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మొత్తం 28మంది సాక్షులుండగా 2013లో విచారణ ప్రారంభమైంది. సాక్షుల విచారణ, నిందితుల వాంగ్మూలాల నమోదు వగైరాలు పూర్తికావడానికి అయిదేళ్లు పట్టింది. గత నెలాఖరున వాదప్రతివాదాలు పూర్తయ్యాయి. మద్యం సేవించి కారు నడిపి ఒకరి ప్రాణం తీసి, మరో నలుగురిని గాయపరిచిన కేసు నుంచి మూడేళ్లక్రితం బొంబాయి హైకోర్టు తీర్పుతో ఆయన విముక్తుడయ్యారు. సల్మాన్‌ఖాన్ సినీ రంగ దిగ్గజం కనుక, ఆయన సినిమాలు కోట్లాది రూపా యల వ్యాపారంతో ముడిపడి ఉంటాయి గనుక ఈ కేసుకు ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. నిజానికి అందువల్లనే ఇది సత్వరమే కొలిక్కి వచ్చి ఉంటే వన్యప్రాణుల వేటకు సంబంధించిన చట్టాలు కఠినంగా ఉంటాయని, అందులో ఇరుక్కుంటే తప్పించుకోవడం కష్టమన్న భావన అందరిలో కలిగేది. లక్ష్యం నెరవేరేది. అమెరికా పరిస్థితి ఇందుకు భిన్నం. అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణ లొచ్చిన వ్యాపార దిగ్గజాలు రాజరత్నం, రజత్గుప్తాలపై అరెస్టయిన రెండేళ్ల వ్యవధిలోనే శిక్షలు విధిస్తూ తీర్పులు వెలువడ్డాయి. మన దేశంలో పెండింగ్ కేసులను సాధ్యమైనంత త్వరగా కొలిక్కి తీసుకురావాలని అనుకోవడమేగానీ అది ఆచరణసాధ్యం కావడం లేదు. లోక్ అదాలత్‌ల ఏర్పాటు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు వగైరాలు అందులో భాగమే. దేశంలో వేయికి పైగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులుంటే... అందులో 32 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 23 హైకోర్టుల్లో దాదాపు 38 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అంటే ఒక్కో హైకోర్టులో సగటున 1.65 లక్షల కేసులు ఎటూ తేలకుండా ఉన్నాయన్నమాట! కిందికోర్టుల్లో 2 కోట్ల 60 లక్షల కేసులు అతీగతీ లేకుండా పడి ఉన్నాయి. కాలం గడుస్తున్నకొద్దీ ఇవి మరింతగా పెరుగుతున్నాయి. పెండింగ్ కేసుల తీరుతెన్నులెలా ఉంటున్నాయో సల్మాన్ కేసుతో అందరికీ మరింతగా తెలిసివచ్చింది. ఇది అంతిమంగా ఆ సమస్య పరిష్కారానికి ఎంతో కొంత దోహదపడితే మంచిదే. -
సెల్లో సల్మాన్.. ఖైదీ నెంబర్ 106
సాక్షి, జైపూర్ : కృష్ణజింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌కు ఖైదీ నెంబర్, వార్డులు కేటాయించారు. దీనిపై జైళ్ల విభాగం డీఐజీ విక్రమ్ సింగ్ జోధ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడారు. సల్మాన్‌కు ఖైదీ నెంబర్ 106 కేటాయించినట్లు తెలిపారు. వార్డు నెంబర్ 2లో సల్మాన్‌ను ఉంచామని, జైలు యూనిఫాంను శుక్రవారం అందించనున్నట్లు వెల్లడించారు. సల్మాన్‌కు మెడికల్ టెస్టులు నిర్వహించినట్లు చెప్పారు. ఆరోగ్య పరంగా నటుడికి ఎలాంటి సమస్యలు లేవని డాక్టర్లు నిర్ధారించారని తెలిపారు. తనకు పలానా కావాలంటూ సల్మాన్ ఏదీ కోరలేదని.. పటిష్టమైన భద్రత ఉండేలా ఏర్పాట్లు చేశామని డీఐజీ విక్రమ్ సింగ్ వివరించారు. కాగా, కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ల శిక్ష విధించడంతో పోలీసులు నటుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సల్మాన్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలీ బ్రిందే, టబు, నీలంలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 1998లో వచ్చిన ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రీకరణ సమయంలో రాజస్థాన్ అడవుల్లో సల్మాన్ కృష్ణ జింకలను వేటాడినట్లు కేసు నమోదు కాగా 20 ఏళ్లుగా విచారణ కొనసాగుతోంది. -
సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష
-
ఆ కృష్ణజింక మళ్లీ పుట్టిందా?
సాక్షి, న్యూఢిల్లీ: రెండు దశాబ్దాలనాటి కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ జోధ్‌పూర్ కోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై సర్వత్రా భిన్నస్పందనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో నెటిజన్లు భాయ్(సల్మాన్‌ఖాన్) పై కోర్టు తీర్పుపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ట్రయల్ కోర్టు తీర్పుపై సల్మాన్ ఖాన్ పై కోర్టుకు అప్పీల్‌కు వెళతాడని...దీనిపై తుదితీర్పు రావడానికి మరో ఇరవై సంవత్సరాలు పడుతుందంటూ కమెంట్ చేశారు. ఈలోపు ఆయన సంతోషంగా తన నటనను కొనసాగిస్తాడు..2038లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసంటూ ట్వీట్ ద్వారా చురకలంటించారు. కృష్ణ జింక ఇప్పటికే చనిపోయి....మళ్లీ పుట్టి ఉంటుంది. తీర్పు విన్న తరువాత మన న్యాయవ్యవస్థ తీరును అభినందిస్తుందంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. అంతేనా సల్మాన్‌కు బెయిల్రావడానికి ఎంత సమయం పడుతుందో చూద్దాం అంటూ సెటైర్ వేశారు. ఆశారాం బాపూ సల్మాన్కోసం జైల్లో ఎదురు చూస్తున్నారంటూ మరొకరు ట్వీట్ చేయడం విశేషం. కాగా 1988నాటి కేసులో గురువారం( ఏప్రిల్ 5) సల్మాన్ ఖాన్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. వైల్డ్‌లైఫ్ (ప్రొటెక్షన్) చట్టం 1972 లోని సెక్షన్ 51 క్రింద ఐదు సంవత్సరాల జైలు శిక్షను, జరిమానాను విధించింది. అయితే ఈ కేసులో సహనిందితులు, నటులు సైఫ్ అలీ ఖాన్, టబు, సొనాలి బింద్రేలను నిర్దోషులుగా విడుదల చేసింది. After 20 years, #Jodhpur court convicts #SalmanKhan in #BlackBuckPoachingCase. Buck killed in 1998, There is a possibility that by now Buck might've taken a rebirth. He/She too read this verdict and praise our Judiciary System. Now, let's see in how much time Salman will get bail — Anshul Saxena (@AskAnshul) April 5, 2018 Job Opening for Lead Actor - - Race 3 - Kick 2 - Dabangg 3 - Bharat - Wanted 2 - Partner 2 - Sher Khan Qualifications - Unmarried, 50+ yrs, Fair, Minimum 10 FIRs against you, Shirt removing habit, Look like Salman Khan #BlackBuckPoachingCase #Jodhpur — Ankesh Sagar (@ankeshsagar) April 5, 2018 I don't know why everyone is going crazy over the verdict of "Salman Khan" 's case. He is going to appeal in higher courts and continue acting happily and that verdict will take another 20 years to come and who knows what happens in 2038! — V Gopalan (@TheGopalan) April 5, 2018 Pic 1 :- Salman Khan before Verdict Pic 2 :- Salman Khan after Verdict pic.twitter.com/KkRNy0OXjx — शाहरुख मोदी भक्त !! (@BeBachani) April 5, 2018 -
సల్మాన్ ఖాన్ అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ల శిక్ష విధించడంతో సల్మాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ కు జైలుశిక్షతో పాటు 10వేల రూపాయల జరిమానా విధించింది. కాగా జోధ్‌పూర్ కోర్టు తీర్పు నేపథ్యంలో కండలవీరుడికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో సల్మాన్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలీ బ్రిందే, టబు, నీలంలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 1998లో వచ్చిన ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రీకరణ సమయంలో రాజస్థాన్ అడవుల్లో సల్మాన్ కృష్ణ జింకలను వేటాడినట్లు కేసు నమోదైంది. మూగజీవుల ప్రాణాలను బలిగొన్నందుకు వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 లోని 9/51 ప్రకారం సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధించారు. జింకలను క్రూరంగా వేటాడిన సల్మాన్‌కు గరిష్టంగా శిక్ష విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో వాదనలు వినిపించారు. కాగా, జోధ్‌పూర్ కోర్టు తీర్పును సల్మాన్ ఖాన్ హైకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. సల్మాన్ దోషిగా తేలడంతో ప్రస్తుతం షూటింగ్లో ఉన్న ఆయన సినిమాల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. -
కృష్ణజింకకు బిస్కెట్లు తినిపించా: సల్మాన్ ఖాన్
సాక్షి, ముంబై : రాజస్తాన్‌లో కృష్ణజింకలను వేటాడిన కేసు సుదీర్ఘకాలం నుంచి బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్‌ను వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో తన సహ నటులు సైఫ్ అలీఖాన్, సోనాలి బింద్రే, టబు, నీలమ్‌ను నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు.. సల్మాన్‌ను మాత్రం దోషిగా తేల్చింది. హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ సందర్భంగా రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో రెండు కృష్ణజింకలను సల్మాన్ ఖాన్ వేటాడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత కొన్నిరోజులకు ఆయన చింకారాలను (దుప్పిలను) కూడా వేటాడినట్టు, సెప్టెంబర్ 28, 1998 నాడు ఘోడా ఫార్మ్స్‌లో ఓ కృష్ణజింకను వెటాడినట్టు అభియోగాలు ఎదుర్కొన్నారు. 1998 అక్టోబర్ 2న బిష్ణోయ్ ప్రజలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతరించిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్న కృష్ణజింకలను వెటాడటం నేరం. ఇందుకు గరిష్టంగా ఆరేళ్ల జైలుశిక్ష పడే అవకాశుమంది. ఈ కేసులో 1998 అక్టోబర్‌లో అరెస్టైన సల్మాన్ ఆ తర్వాత ఐదు రోజులకు బెయిల్‌పై విడుదల అయ్యారు. జింకలను వెటాడిన ఒక కేసులో సల్మాన్‌కు ఇప్పటికే కిందికోర్టు శిక్ష విధించింది. అయితే, అదృష్టం ఆయన పక్షాన ఉండటంతో రాజస్థాన్ హైకోర్టు ఆ కేసును కొట్టివేసింది. కృష్ణజింకలను వేటాడిన మరో కేసులోనూ సల్మాన్ తాజాగా దోషిగా తేలడంతో ఆయనకు ఎంతకాలం శిక్షపడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ కేసు నేపథ్యంలో 2009లో ఎన్డీటీవీతో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ చెప్పిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ కేసులో తమ పక్షం వాదనను ఆయన మీడియాతో పంచుకున్నారు. హమ్ సాత్ సాథ్ హై సినిమా షూటింగ్ ముగించుకొని ఆ రోజు తాను, తన సహనటులు త్వరగా బయలుదేరామని, తాము వెళ్తుండగా కృష్ణజింకల గుంపు ఎదురుపడిందని, అందులోని ఒక దానికి తాము బిస్కెట్లు తినిపించామని ఆయన చెప్పారు. ‘ఒక జింక పొదలో ఇరుక్కోవడం మేం చూశాం. పెద్ద జింకల గుంపు అక్కడ ఉంది. పొదలో చిన్న జింక చిక్కుకుంది. అది కదల్లేక తీవ్రంగా భయపడుతోంది. నేను అక్కడి నుంచి దానిని బయటకు తీశాను. మేం దానికి కొంచెం నీళ్లు తాగించాం. జింక కొన్ని బిస్కెట్లను తిన్న తర్వాత అడవిలోకి పారిపోయింది’ అని సల్మాన్ వివరించారు. ఈ ఘటననే చిలువలు, పలువులు చేసి వివాదాన్ని ఇంతదాక తీసుకొచ్చారని ఆయన పేర్కొన్నారు. -
సల్మాన్ నిర్మాతల్లో గుబులు
సాక్షి, ముంబయి : కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను జోథ్‌పూర్ కోర్టు దోషిగా నిర్ధారించడంతో బాలీవుడ్లో దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. సల్మాన్ హీరోగా రూ వందల కోట్లతో పలు సినిమాలు రూపొందుతుండటంతో ఆయా చిత్ర నిర్మాతల్లో ఉత్కంఠ నెలకొంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద సల్మాన్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించారు. బాలీవుడ్ కండలవీరుడు ప్రస్తుతం రెమోడిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రేస్ 3 దుబాయ్ షెడ్యూల్‌ను ఇటీవల పూర్తి చేశారు. ఈద్ సందర్భంగా ఈ మూవీ జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. రేస్ 3తో పాటు అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో అతుల్ అగ్నిహోత్రి నిర్మిస్తున్న భరత్ మూవీకి పనిచేయాల్సి ఉంది. భరత్ తర్వాత సోనాక్షి సిన్హాతో కలిసి దబాంగ్ 3 సెట్స్‌లో అడుగుపెడతారు. కిక్ 2లో కూడా సల్మాన్ నటించేందుకు రంగం సిద్ధమైంది. ఇంతవరకూ షూటింగ్‌కు వెళ్లని ఈ మూవీని 2019 క్రిస్మస్కు రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు మరికొద్ది నెలల్లో ప్రసారమయ్యే టెలివిజన్ సో దస్ కా దమ్‌ను సల్మాన్ నిర్వహిస్తున్నారు. ఇక రియాల్టీ షో బిగ్ బాస్‌లో తిరిగి సల్మాన్‌ను ప్రవేశపెట్టాలని మేకర్లు భావిస్తున్నారు. కృష్ణజింకల కేసులో సల్మాన్‌ను జోధ్‌పూర్ కోర్టు దోషిగా నిర్ధారించడంతో ఈ ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకమైంది. -
సల్మాన్ ఖాన్‌కు వ్యతిరేకం కాదు: రేణుక
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు తాను వ్యతిరేకం కాదని నటి రేణుకా సహాని స్పష్టం చేసింది. సల్మాన్ కు వ్యతిరేకంగా తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, న్యాయవ్యవస్థలోని లొసుగులనే ఎత్తిచూపానని తెలిపారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ను కోర్టు నిర్దోషిగా ప్రకటించిన తర్వాత ఫేస్బుక్ లో రేణుక పోస్ట్ చేసిన కామెంట్స్ పై 'సుల్తాన్' అభిమానులు మండిపడ్డారు. దీంతో తన వ్యాఖ్యలపై ఆమె వివరణయిచ్చింది. 'సల్మాన్ ఖాన్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేశానని భావించి అతడి అభిమానులు నాపై విమర్శలు చేస్తున్నారు. నేను పోస్టు చేసిన దాన్ని పూర్తిగా చదవలేదు. నేనేం చెప్పాలనుకున్నానో అర్థం చేసుకోలేదు. సల్మాన్ ఖాన్‌కు నేను వ్యతిరేకం కాదు. అతడికి వ్యతిరేకంగా ఈ పోస్టు చేయలేదు. సల్మాన్ తో నాకు సుహృద్భావ సంబంధాలున్నాయ'ని రేణుకా సహాని పేర్కొంది. న్యాయం కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురు చూడాల్సిన దుస్థితి ఎందుకు వస్తుందో అన్న ప్రశ్న తన మదిలో ఎప్పటినుంచో ఉందన్నారు. నిర్దేశిత సమయంలోగా కోర్టులు తీర్పులు వచ్చేలా చేయలేమా అని ప్రశ్నించారు. ఇలాంటి విషయాల్లో అభిప్రాయాలను వ్యక్తం చేస్తే ప్రచారం కోసం చేస్తున్నామని అనడడం భావ్యం కాదని అంది. 'హమ్ ఆప్ కే హై కౌన్' సినిమాలో సల్మాన్ కు వదినగా రేణుకా సహాని నటించిన సంగతి తెలిసిందే. -
సల్మాన్ 'కృష్ణజింక' కేసులో విచారణ 4కి వాయిదా
జోధ్‌పూర్ : కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బుధవారం జోధ్‌పూర్ కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణను న్యాయస్థానం మే 4వ తేదీకి వాయిదా వేసింది. అంతకు ముందు సల్మాన్ స్టేట్ మెంట్ ను న్యాయస్థానం రికార్డు చేసింది. 1998 సంవత్సరం 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా నిర్మాణ సమయంలో సల్మాన్ ఖాన్, సోనాలి బింద్రె, టబు, నీలమ్ తదితరులు రక్షిత జంతువైన కృష్ణజింకను వేటాడారంటూ అప్పట్లో కేసు నమోదైంది. 2006లో ఈ కేసులో సల్మాన్‌ఖాన్‌కు శిక్ష పడింది. హైకోర్టు ఆ శిక్షపై స్టే విధించిన విషయం తెలిసిందే. -
సల్మాన్ 'కృష్ణజింక' కేసులో విచారణ 4కి వాయిదా
-
సల్మాన్ 'కృష్ణజింక' కేసులో తీర్పు వాయిదా
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 'కృష్ణ జింక' కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును వాయిదా వేసింది. ఈ కేసులో సల్మాన్‌కు విధించిన శిక్ష అమలుపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించడాన్ని రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. బ్రిటన్ వెళ్లేందుకు వీలుగా హైకోర్టు ఈ స్టే ఇచ్చింది. రాజస్థాన్ ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.జె. ముఖోపాధ్యాయ, జస్టిస్ ఏకే గోయల్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. తన తీర్పును వాయిదా వేసింది. 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా నిర్మాణ సమయంలో సల్మాన్ ఖాన్, సోనాలి బెంద్రె, టబు, నీలమ్ తదితరులు రక్షిత జంతువైన కృష్ణజింకను వేటాడారంటూ అప్పట్లో కేసు నమోదైంది. 2006లో ఈ కేసులో సల్మాన్‌ఖాన్‌కు శిక్ష పడింది. హైకోర్టు గత సంవత్సరం ఆ శిక్షపై స్టే విధించింది.