జోధ్పూర్ : కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బుధవారం జోధ్పూర్ కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణను న్యాయస్థానం మే 4వ తేదీకి వాయిదా వేసింది. అంతకు ముందు సల్మాన్ స్టేట్ మెంట్ ను న్యాయస్థానం రికార్డు చేసింది. 1998 సంవత్సరం 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా నిర్మాణ సమయంలో సల్మాన్ ఖాన్, సోనాలి బింద్రె, టబు, నీలమ్ తదితరులు రక్షిత జంతువైన కృష్ణజింకను వేటాడారంటూ అప్పట్లో కేసు నమోదైంది. 2006లో ఈ కేసులో సల్మాన్ఖాన్కు శిక్ష పడింది. హైకోర్టు ఆ శిక్షపై స్టే విధించిన విషయం తెలిసిందే.