సాక్షి, జైపూర్ : కృష్ణజింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌కు ఖైదీ నెంబర్, వార్డులు కేటాయించారు. దీనిపై జైళ్ల విభాగం డీఐజీ విక్రమ్ సింగ్ జోధ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడారు. సల్మాన్‌కు ఖైదీ నెంబర్ 106 కేటాయించినట్లు తెలిపారు. వార్డు నెంబర్ 2లో సల్మాన్‌ను ఉంచామని, జైలు యూనిఫాంను శుక్రవారం అందించనున్నట్లు వెల్లడించారు.
సల్మాన్‌కు మెడికల్ టెస్టులు నిర్వహించినట్లు చెప్పారు. ఆరోగ్య పరంగా నటుడికి ఎలాంటి సమస్యలు లేవని డాక్టర్లు నిర్ధారించారని తెలిపారు. తనకు పలానా కావాలంటూ సల్మాన్ ఏదీ కోరలేదని.. పటిష్టమైన భద్రత ఉండేలా ఏర్పాట్లు చేశామని డీఐజీ విక్రమ్ సింగ్ వివరించారు.
కాగా, కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ల శిక్ష విధించడంతో పోలీసులు నటుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సల్మాన్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలీ బ్రిందే, టబు, నీలంలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 1998లో వచ్చిన ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రీకరణ సమయంలో రాజస్థాన్ అడవుల్లో సల్మాన్ కృష్ణ జింకలను వేటాడినట్లు కేసు నమోదు కాగా 20 ఏళ్లుగా విచారణ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment