ఖాన్‌ కాబట్టే ఈ శిక్ష : మంత్రి వ్యాఖ్యలు | Salman Jailed Because He Is Muslim Says Pakistan Minister | Sakshi
Sakshi News home page

ఖాన్‌ కాబట్టే ఈ శిక్ష : మంత్రి వ్యాఖ్యలు

Published Fri, Apr 6 2018 11:46 AM | Last Updated on Sat, Mar 23 2019 8:28 PM

Salman Jailed Because He Is Muslim Says Pakistan Minister - Sakshi

బాలీవుడు నటుడు సల్మాన్‌ ఖాన్‌, పాకిస్తాన్‌ మంత్రి ఖవాజా అసిఫ్‌

ఇస్లామాబాద్‌ : బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌కు కోర్టు విధించిన ఐదు సంవత్సరాల జైలు శిక్షపై పాకిస్తాన్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఖవాజా అసిఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో జోధ్‌పూర్‌ సెషన్స్‌ కోర్టు సల్మాన్‌ను దోషిగా తేల్చి ఈ శిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. గురువారం మీడియా సమావేశంలో కోర్టు తీర్పుపై పాక్‌ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

భారత్‌లో మైనార్టీలపై వివక్ష ఉంటుందని, వారికి ఆ దేశంలో రక్షణ ఉండదని మరోసారి రుజువైందని ఆసిఫ్‌ అన్నారు. సల్మాన్‌ పేరు చివర ఖాన్‌ లేకుంటే తీర్పు వేరేలా వచ్చి ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్‌లోని అధికార పార్టీ మతాన్ని సల్మాన్‌ కలిగి ఉంటే ఈ శిక్షకు అనర్హుడై ఉండేవాడని ఆరోపించారు.

పాక్‌ మంత్రి వ్యాఖ్యలపై ట్విటర్‌ వేదికగా నెటిజన్లు మండిపడ్డారు. సల్మాన్‌ ఖాన్‌, అతని మతంపై మీకు అంతలా ప్రేమ ఉంటే ఆ హీరో సినిమాలు (ఏక్తా టైగర్‌, టైగర్‌ జిందాహై) పాక్‌లోని థియేటర్లలో ఎందుకు ఆడనివ్వలేదని ప్రశ్నించారు. ఇదే కేసులో నిర్ధోషిగా బయటపడ్డ సైఫ్‌ అలీఖాన్‌ది ఏ మతమో మంత్రి చెప్పాలంటూ మరొకరు ప్రశ్నించారు. భారత్‌లో అందరూ సమానమే అని అక్రమ ఆయుధాల కేసులో బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌ను శిక్షించిన విషయం గుర్తుంచుకోవాలని వివరించారు. ఓ నీచ దేశానికి మంత్రిగా పనిచేస్తున్నావ్‌, పిచ్చి వాడిలా మాట్లాడుతున్నావ్‌, ముందు పాక్‌లో ఉన్న సమస్యలను తీర్చు, ఆ తర్వాతే పక్క దేశాల గురించు ఆలోచించు అని మరికొంత మంది సలహాలు ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement