jodhpur Court
-
కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా నిర్దోషులు
'కాఫీ విత్ కరణ్' షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీమిండియా స్టార్ క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలకు ఊరట లభించింది. వీరితో పాటు షో హోస్ట్, ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్‌కు కూడా ఈ కేసు నుంచి విముక్తి లభించింది. ఈ ముగ్గురిని నిర్దోషులుగా తేలుస్తూ జోధ్‌పూర్ హైకోర్టు మంగళవారం తీర్పును వెల్లడించింది. 2018లో కాఫీ విత్ కరణ్ సీజన్ 6 సందర్భంగా షో హోస్ట్ కరణ్ జోహర్ అడిగిన అభ్యంతరకర ప్రశ్నలకు (సెక్స్ లైఫ్) రాహుల్, పాండ్యాలు వ్యంగ్యమైన సమాధానాలు చెప్పారు. ఇందుకు గాను వీరు తగిన మూల్యమే చెల్లించుకున్నారు. అప్పట్లో వీరిద్దరు తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొన్నారు. బీసీసీఐ ఈ ఇద్దరిని అర్ధంతరంగా ఆసీస్ పర్యటన నుంచి వెనక్కు పంపించేసింది. అంతటితోనే ఆగకుండా వీరిద్దరిపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది. ఈ విషయమై డాక్టర్ మేఘ్వాల్.. రాహుల్, హార్థిక్ సహా కరణ్ జోహర్‌లపై జోధ్‌పూర్‌లోని లునీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాదాపు మూడేళ్ల పాటు సాగిన ఈ కేసులో తాజాగా తీర్పు వెలువడింది. ఆ ముగ్గురు ఉద్దేశపూర్వకంగా మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదని కోర్టు ఈ కేసును కొట్టేసింది. కాగా, ప్రస్తుతం కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలు టీమిండియాలో కీలక సభ్యులుగా కొనసాగుతున్నారు. పాండ్యా ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్న టీమిండియాలో భాగంగా ఉంటే, ఇటీవలే గాయం నుంచి కోలుకుని రాహుల్ ఆసియా కప్‌కు సిద్ధంగా ఉన్నాడు. చదవండి: IND vs WI: విండీస్‌తో మూడో టీ20.. శ్రేయస్ అవుట్! హుడాకు ఛాన్స్! -
‘ఆశారాంకు జైలులోనే ఆయుర్వేద చికిత్స అందించండి’
న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం తిరస్కరించింది. కాగా, ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని.. దీనికోసం ఉత్తర ఖండ్ వెళ్లి చికిత్స తీసుకోవడానికి రెండు నెలల పాటు మధ్యంతర బెయిల్‌ను కోరుతూ ఆశారాం బాపూ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ఆయన బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తూనే ఆయనకు జైలులోనే ఆయుర్వేద చికిత్సను అందించాలని జైలు అధికారులను ఆదేశించింది.. ఆశారాం బాపూ 2013 తన ఆశ్రమంలో 16 ఏళ్ల మైనర్ బాలికను అత్యాచారం చేశారు. ఈ ఘటన రుజువు కావడంతో ఆయనకు జోధ్‌పూర్ కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరో ఇద్దరు నిందితులకు జోధ్‌పూర్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. గతంలో.. ఆశారాం బాపూకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన 9 మందిపై ఆయన అనుచరులు దాడిచేశారు. దీనిలో ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. ఆయన గతంలో కూడా పలుసార్లు ఆరోగ్యం నిలకడగా లేదని బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు కోరారు. అయితే, దీనిపై గతంలో సుప్రీంకోర్టు ఆయన ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించడానికి ప్రత్యేక వైద్యులను నియమించింది. కాగా, ఆశారాం బాపూను పరీక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సుప్రీం కోర్టుకు తెలియజేశారు. చదవండి: అన్నీ తెరిచాక ఇంకేం... డ్రామా మాత్రమే -
కోర్టుకు హాజరుకాని సల్మాన్
జోధ్‌పూర్ : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ శుక్రవారం కోర్టుకు గైర్హాజరయ్యారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో జోధ్‌పూర్ కోర్టు ముందు ఆయన నేడు హాజరు కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే సల్మాన్ మాత్రం కోర్టుకు రాలేదు. సల్మాన్ గైర్హాజరు గల కారణాలను అతని లాయర్లు కోర్టుకు వివరించారు. సల్మాన్‌ను చంపేస్తామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చిన విషయాన్ని వారు కోర్టుకు తెలిపారు. సల్మాన్ కోర్టుకు హాజరయ్యే సమయంలో అక్కడి పరసరాల్లో శాంతి భద్రతలను అదుపులో ఉంచాలని కోరారు. దీంతో కోర్టు విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేశారు. 1998లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఓ రోజు రాత్రి సల్మాన్‌తో పాటు మరికొందరు నటులు జోద్పూర్ పరిసరాల్లోని అడవిలో కృష్ణ జింకలను వేటాడినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అప్పట్లోనే సల్మాన్‌తో పాటు మరికొందరు నటులపై జోద్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో సల్మాన్ ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ గతేడాది ఎప్రిల్లో కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఆయన కోర్టు తీర్పును సవాలు చేసి బెయిల్ పొందారు. ఆ సమయంలో సల్మాన్ రెండు రోజుల పాటు జోధ్‌పూర్ జైలులో ఉన్నారు. అయితే బెయిల్ పొందినప్పటి నుంచి సల్మాన్ న్యాయస్థానం ముందు హాజరు కాలేదు. కాగా, ఈ ఏడాది జూలై 4వ తేదీన కేసు విచారణ సమయంలో.. సల్మాన్ సెప్టెంబర్ 27వ తేదీన కోర్టుకు హాజరు కాని పక్షంలో బెయిల్‌ను రద్దు చేస్తామని జస్టిస్ చంద్రకుమార్ ఆదేశించిన సంగతి తెలిసిందే. -
ఆశారాం బాపూకు చుక్కెదురు
జోధ్‌పుర్: మైనర్ బాలికపై లైంగికదాడి కేసులో విధించిన జీవితఖైదును సవాలు చేస్తూ.. ఆశారాం బాపూ దాఖలు చేసిన పిటిషన్‌ను జోధ్‌పుర్ హైకోర్టు సోమవారం కొట్టిపారేసింది. బాధిత బాలిక మేజర్ అని, పోస్కో చట్టం నిబంధనల ప్రకారం ఆశారామ్‌కు శిక్ష వర్తించదని ఆయన తరపు న్యాయవాదులు శిరీష్ గుప్తే, ప్రదీప్ చౌదరి వాదించారు. జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ వినీత్ కుమార్ మాధుర్‌లతో కూడిన స్పెషల్ బెంచ్ వీరి వాదనను తోసిపుచ్చింది. నేరం జరిగిన సమయంలో బాలిక మైనర్ అని ట్రయల్ కోర్టులో అభియోగాలు రుజువైన విషయాన్ని ప్రస్తావించింది. కాగా తన ఆశ్రమంలో చదువుతున్న మైనర్ బాలికను జోధ్‌పూర్‌కు దగ్గరలోని మనాయ్ గ్రామంలో 2013 ఆగస్ట్‌లో అత్యాచారం చేశానని ఆశారాం అంగీకరించారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో జోధ్‌పూర్ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆశారాం బాపూకు జీవితఖైదు విధించింది. తనను తాను దైవదూతగా చెప్పుకునే ఆశారాం ప్రస్తుతం జోధ్‌పూర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇదే కేసులో దోషులుగా తేలిన మరో ఇద్దరికి 20 సంవత్సరాల చొప్పున శిక్షను కోర్టు విధించింది. -
సల్మాన్ ఖాన్‌కు కోర్టు స్ట్రాంగ్ వార్నింగ్
జోథ్‌పూర్: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు జోథ్‌కోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కృష్ణజింకను వేటాడిన కేసులో తదుపరి కోర్టు విచారణకు హాజరుకాకపోతే.. ఆయన బెయిల్‌ను రద్దు చేస్తామని తేల్చి చెప్పింది. కృష్ణజింకను వేటాడిన కేసులో సల్మాన్‌కు జోథ్‌పూర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు. జోథ్‌పూర్ కోర్టు గురువారం ఈ కేసు విచారణను చేపట్టింది. ఈ విచారణకు సల్మాన్ హాజరు కావాల్సి ఉండగా.. ఆయన కోర్టుకు రాలేదు. దీంతో కోర్టు సల్మాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 1998లో హమ్ సాథ్ సాథ్ హై చిత్ర షూటింగ్ సందర్భంగా రాజస్థాన్ జోథ్‌పూర్‌లో కృష్ణజింకలను వేటాడి చంపినట్టు సల్మాన్ ఖాన్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో గత ఏడాది సల్మాన్‌ను దోషిగా నిర్ధారిస్తూ.. జోథ్‌పూర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. -
బాలీవుడ్ స్టార్స్‌కు షాకిచ్చిన కోర్టు
జైపూర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణజింక వేట కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ కేసులో గతంలో కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన బాలీవుడ్ నటులు టబు, సోనాలి బింద్రే, సైఫ్ అలీ ఖాన్, దుష్యంత్ సింగ్, నీలమ్ కొఠారిలకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 1998 అక్టోబర్‌లో 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రీకరణ సమయంలో సల్మాన్ ఖాన్‌తో కలిసి వీరంతా కృష్ణ జింకలను వేటాడారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. జోధ్‌పూర్ కోర్టు గతేడాది ఈ కేసుకు సంబంధించిన తీర్పును వెలువరిస్తూ సల్మాన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. మిగతావారిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే.. ఈ కేసులో సల్మాన్‌ది ఎంత తప్పు ఉందో అతనితో పాటు ఉన్న వారిది కూడా అంతే తప్పు ఉందని భావిస్తూ జోధ్‌పూర్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రేలకు నోటీసులు జారీ చేసింది. 1998 నాటి ఈ కేసులో జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు సల్మాన్‌ని దోషిగా నిర్ధారిస్తూ ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే. శిక్షపడిన తర్వాత సల్మాన్ జోధ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. (చదవండి : టబు, సోనాలీలు తప్పించుకోవడానికి కారణమిదే!) -
జోధ్‌పూర్ కోర్టులో సల్మాన్‌ఖాన్‌కి ఎదురుదెబ్బ
-
ప్రతీ విదేశీయానానికి అనుమతి తప్పనిసరి
జోధ్‌పూర్: షూటింగ్ నిమిత్తం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మాల్టా, సౌదీ అరేబియాలకు వెళ్లడానికి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు అనుమతినిచ్చింది. విదేశాలకు వెళ్లాలనుకున్న ప్రతిసారి తప్పనిసరిగా తమ అనుమతి తీసుకోవాలని సూచించింది. అనుమతి నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా జిల్లా సెషన్స్ కోర్టుకు పెట్టుకున్న విజ్ఞప్తిపై జడ్జి చంద్రకుమార్ శనివారం విచారణ చేపట్టారు. కోర్టు అనుమతి తీసుకోవటంలో ఇబ్బందులేంటని సల్మాన్ తరఫు లాయర్లను జడ్జి ప్రశ్నించారు. జింకలను వేటాడిన కేసులో వాదనలు కొనసాగుతున్నందున అనుమతి ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. -
కోర్టు ఆదేశాలు : సల్మాన్ ఆశలు ఆవిరి!
జోధ్‌పూర్ : కృష్ణజింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌ను రాజస్థాన్ జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు హెచ్చరించింది. ఏ పని నిమిత్తమైనా సరే విదేశాలకు వెళ్లాలంటే కండలవీరుడు సల్మాన్ కచ్చితంగా కోర్టు అనుమతి తీసుకోవాలని కోర్టు సూచించింది. విదేశాలకు వెళ్లాల్సినప్పుడు కచ్చితంగా అనుమతి అనే నిబంధన నుంచి తనకు విముక్తి కల్పించాలంటూ సల్మాన్ తన లాయర్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. శనివారం, ఆ పిటిషన్ విచారణకు రాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుడు సల్మాన్ అనుమతి తీసుకోకుండా విదేశాలకు వెళ్లకూడదని కోర్టు తీర్పిచ్చింది. దీంతో పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్లాలనుకున్న సల్మాన్ ఆశలు ఆవిరయ్యాయి. ఆగస్ట్ 10 నుంచి 26 తేదీల మధ్య విదేశాల్లో పర్యటించాల్సి ఉందని సల్మాన్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. షూటింగ్ పూర్తి చేసుకునేందుకు సల్మాన్ అబుదాబి, మాల్టాలకు వెళ్లాల్సి ఉందని నటుడి లాయర్ కోర్టుకు విన్నవించారు. భరత్ మూవీ షూటింగ్ పనుల్లో సల్మాన్ బిజీగా ఉన్నాడు. కానీ అనుమతి ఉంటేనే విదేశాలకు వెళ్లాలని జోధ్‌పూర్ కోర్టు తెలిపింది. ఈ ఏప్రిల్‌లో జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు జడ్జి తీర్పు ప్రకారం.. రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తు, అదే మొత్తానికి మరో ఇద్దరి పూచీకత్తులు సమర్పించిన అనంతరం సల్మాన్ బెయిల్‌పై విడుదలయ్యారు. (సెల్లో సల్మాన్.. ఖైదీ నెంబర్ 106) కాగా, కృష్ణజింకలను వేటాడిన కేసులో ఈ ఏడాది ఏప్రిల్ 5న సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ల శిక్ష విధించింది. 1998 అక్టోబర్ 1న ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రీకరణ సమయంలో రాజస్థాన్ అడవుల్లో సల్మాన్ రెండు కృష్ణ జింకలను వేటాడి చంపినట్లు నమోదైన కేసులో దోషిగా రుజువైంది. రెండు రోజుల పాటు జోధ్‌పూర్ జైల్లో గడిపిని సల్మాన్ బెయిల్ రాగానే ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లిపోయారు. కాగా, ఈ కేసులో సల్మాన్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలీ బ్రిందే, టబు, నీలం, జోధ్‌పూర్ వాసి దుష్యంత్ సింగ్‌లను కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చిన విషయం విదితమే. -
‘బ్రహ్మజ్ఞాని’ రేప్ చేయటం పాపం కాదట!
జోధ్‌పూర్: బాలికలను తనలాంటి బ్రహ్మజ్ఞాని రేప్చేయడం పాపం కాదని ఆసారాం బాపు చెప్పేవాడని అతని మాజీ శిష్యుడు రాహుల్ కె.సచార్ జోధ్‌పూర్ కోర్టుకు వెల్లడించారు. ఐదేళ్ల క్రితం ఓ బాలికను రేప్‌చేసిన కేసులో ఆసారాంకు యావజ్జీవ జైలు శిక్ష పడటం తెల్సిందే. కోర్టు తన తీర్పులో ప్రత్యక్ష సాక్షి రాహుల్ సచార్ చెప్పిన విషయాలను వెల్లడించింది. పుష్కర్(రాజస్తాన్), భివానీ (హర్యానా), అహ్మదాబాద్ (గుజరాత్)లోని ఆశ్రమాల్లో 2003లో ఆసారాం బాలికలను వేధించటం చూశానని సచార్ చెప్పాడు. ‘ఆశ్రమంలో ఆసారాం వెంటే ముగ్గురు బాలికలుండేవారు. వారితో ఆశ్రమంలో కలియ దిరుగుతూ టార్చిలైట్‌తో సైగలు చేసేవాడు. అలా ఎంపిక చేసిన బాలికను ఆ ముగ్గురూ బాబా నివాసంలోకి పంపేవారు. ఈ ముగ్గురు బాలికలే ఆసారాం పాపానికి బలైన బాధితులకు గర్భస్రావం చేయించేవారు. అహ్మదాబాద్‌లో బాబా ఓ బాలికను వేధిస్తుంటే ప్రత్యక్షంగా చూశా. బాబాను నిలదీశా. బ్రహ్మజ్ఞాని అలాంటివి చేయటం పాపం కాదని ఆసారాం బదులిచ్చాడు. ప్రశ్నించినందుకు నన్ను బయటకు గెంటించాడు. లైంగిక సామర్థ్యం పెంపు కోసం నల్లమందుతోపాటు ఇతర మందులను వాడే వాడు’ అని సచార్ తెలిపారు. ఆశ్రమం నుంచి బయటకొచ్చాకా దాడికి పాల్పడ్డారన్నారు. -
ఆసారాం.. ఆ ముగ్గురు.. ఓ టార్చ్‌లైట్
జోధ్‌పూర్ : 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో స్వయం ప్రకటిత బాబా ఆసారాం బాపును దోషిగా తేల్చుతూ జోధ్‌పూర్ ట్రయిల్ కోర్టు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ సందర్భంగా సాక్షి, ఆసారాం అనుచరుడు రాహుల్ సచార్ పలు సంచలనాత్మక విషయాలు కోర్టుకు వెల్లడించాడు. ఆసారాం ఎంతో అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడటం తాను స్వయంగా చూశానని తెలిపాడు. మీరిలా ఎందుకు చేస్తున్నారంటూ ఆసారాంకు లేఖలు రాయగా.. అమ్మాయిలను లోబరచుకోవడం, వారిపై అత్యాచారం చేయడం వల్ల బ్రహ్మయోగులకు పాపం అంటుకోదంటూ ఆసారాం తన నోరు మూయించే ప్రయత్నం చేశాడని పేర్కొన్నాడు. ఆ సిగ్నల్ వారి ముగ్గురికీ తెలుసు.. ముగ్గురు అమ్మాయిలతో కలిసి ఆసారాం ఆశ్రమమంతా తిరిగేవాడని.. తనకు నచ్చిన అమ్మాయి కనపడగానే.. ఆ అమ్మాయిపై టార్చ్‌లైట్ వేయడం ద్వారా వారికి సిగ్నల్ ఇచ్చేవాడని రాహుల్ పేర్కొన్నాడు. వెంటనే ఆ ముగ్గురు అమ్మాయిలు ఆసారాంకు నచ్చిన అమ్మాయిని ఎలాగోలా మభ్యపెట్టి కుటియా(ఆశ్రమంలోని గది)కి తీసుకు వచ్చేవారని తెలిపాడు. అదే విధంగా ఒకరోజు సాయంత్రం వీరి కదలికల్ని గమనించిన తాను గోడపైకి ఎక్కి చూడగా ఆసారాం నిజ స్వరూపం తెలుసుకున్నానని రాహుల్ వాపోయాడు. తను చూసింది నిజం కాదని భావించానని.. అందుకే స్వామీజీ దగ్గరికి వెళ్లి.. మీలాంటి వారికి ఇలాంటి కోరికలు ఉండవు కదా అని అడిగానన్నాడు. తన ప్రశ్నలతో విసుగెత్తిన ఆసారాం చివరకు తనను బయటికి గెంటేశాడని రాహుల్ సచార్ పేర్కొన్నాడు. ఆసారాంకు డ్రగ్స్ తీసుకునే అలవాటు కూడా ఉందని రాహుల్ కోర్టుకు తెలిపాడు. అంతేకాదు ఈ కేసులో సాక్షులపైన ఆసారాం బాపూ ప్రైవేట్ సైన్యం బెదిరింపులు, దాడులకు దిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. -
ఆసారాంకు జీవిత ఖైదు: కారణం ఇదే
జోధ్‌పూర్ : సంచలనం సృష్టించిన 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో వివాదాస్పద స్వామీజీ ఆసారాం(77)కు జోధ్‌పూర్ ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షతో పాటుగా రూ. లక్ష జరిమానాను విధించిన సంగతి తెలిసింది. జోధ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఏర్పాటుచేసిన తాత్కాలిక కోర్టులో న్యాయమూర్తి మధుసూదన్ శర్మ ఈ తీర్పు వెలువరించారు. కాగా ఆసారం బాధితురాలు స్వామీజీ తనను లొంగిపోమ్మని ఆదేశించాడని అందుకు తగ్గట్టుగానే సీనియర్ అధికారులు అతడికి పాదాభివందనం చేసి వత్తాసు పలికారని తెలిపింది. ప్రత్యేక న్యాయస్థానంలో బాధాతురాలు చెప్పిన కొన్ని వ్యాక్యలను కోర్టు పరిగణలోకి తీసుకుని ఆసారాంకు జీవిత ఖైదు శిక్ష విధించింది. కోర్టులో బాధితురాలు.. ఆసారాం తనను సీఏ చదవాలని ఎందుకు అనుకుంటున్నావు? ఎంత పెద్ద అధికారి అయినా నా ముందు మోకరిల్లాల్సిందే...కాబట్టి నువ్వు సీఏ బదులు బీఈడీ చదువు. అప్పుడు నిన్నుతొలుత నా గురుకులంలో ఉపాధ్యాయురాలిగా నియమించి అనంతరం నిన్ను గురుకులానికి ప్రధానోపాధ్యాయురాలిని చేస్తానని చెప్పి తనను మభ్యపెట్టే ప్రయత్నం చేసినట్లు తెలిపింది. కోర్టు ఈ వ్యాక్యలను పరిగణలోకి తీసుకుని ఆసారాంకు జీవిత ఖైదు విధించింది. బాధితురాలు ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ నివాసి. ఆమె మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారలో ఆసారాం నెలకొల్పన ఆశ్రమంలో ఉండి చదువుకుంటుంది. 2013 సంవత్సరం ఆగస్టులో బాధితురాలికి దెయ్యం పట్టిందని, దాన్ని వదిలించాల్సిందిగా బాలిక తల్లిదండ్రులు ఆమెను ఆసారాం వద్దకు తీసుకువచ్చారు. ఆ సమయంలో ఆసారాం బాధితురాలితో మాట్లాడుతూ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటని ఆమెను అడిగాడు. దానికి సమాధానంగా బాలిక సీఏ చదివి గొప్ప ఆఫీసర్ కావాలనుకుంటున్నాని చెప్పగా ఆసారాం సీఏ చదవడం ఎందుకు? ఎంత పెద్ద అధికారి అయినా నా కాళ్ల మీద పడి నమస్కరిస్తాడు. అందుకే నువ్వు సీఏ బదులు బీఈడీ చదువు. అప్పుడు నిన్ను గురుకులానికి ప్రధానోపాధ్యాయురాలిని చేస్తానని చెప్పాడని బాలిక తెలిపింది. అనంతరం ఆమెకు నయం చేసే నెపంతో ఆమెను ఒంటరిగా తన గదికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం గురించి బయట ఎవరికి చెప్పవద్దని బెదిరించాడు. కానీ బాధితురాలు జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆసారాం మీద ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ కేసును జోధ్‌పూర్‌కు బదిలీ చేశారు. బాలికతో ఆసారాం ప్రవర్తించిన తీరు సిగ్గుచేటని.. తనపై భక్తులు పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేశారని తీర్పు సందర్భంగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మధుసూదన్ శర్మ వ్యాఖ్యానించారు. -
ఆసారాంకు యావజ్జీవ కారాగార శిక్ష
-
ఆసారాంకు జీవిత ఖైదు
జోధ్‌పూర్: 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో వివాదాస్పద స్వామీజీ ఆసారాం (77)కు జోధ్‌పూర్ ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. దీంతోపాటుగా రూ. లక్ష జరిమానాను విధించింది. జోధ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఏర్పాటుచేసిన తాత్కాలిక కోర్టులో న్యాయమూర్తి మధుసూదన్ శర్మ ఈ తీర్పు వెలువరించారు. ఆసారాంకు జీవిత ఖైదు, ఆయన అనుచరులు శరత్, శిల్పిలకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించి.. మరో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేశారు. 2013 నాటి ఈ కేసులో చార్జిషీటు దాఖలైనప్పటి నుంచి దాదాపు ఐదేళ్లుగా ఆసారాం జోధ్‌పూర్ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉంటున్న సంగతి తెలిసిందే. చనిపోయేంతవరకు ఆయన జైల్లో ఉండాల్సిందేనని తీర్పు వెలువడిన అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోకర్ రామ్ బిష్ణోయ్ వెల్లడించారు. రాజస్తాన్ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ప్రత్యేక కోర్టు ఈ తీర్పును వెలువరించింది. కాగా, ఈ తీర్పుతో తమకు న్యాయం జరిగిందని ఈ కేసు వేసిన బాలిక కుటుంబం పేర్కొంది. తీర్పు తర్వాత ఆసారాం ఉద్వేగానికి గురయ్యారు. కాగా, ఆసారాంకు బెయిల్ కోసం ఆయన న్యాయవాదులు గురువారం రాజస్తాన్ హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. ఆసారాం తీరు సిగ్గుచేటు బాలికతో ఆసారాం ప్రవర్తించిన తీరు సిగ్గుచేటని.. తనపై భక్తులు పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన వమ్ము చేశారని తీర్పు సందర్భంగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మధుసూదన్ శర్మ వ్యాఖ్యానించారు. ‘ఆసారాంకు దేశ విదేశాల్లో లక్షల మంది భక్తులున్నారు. ఆయన పేరుతో 400 ఆశ్రమాలున్నాయి. బాధితురాలి కుటుంబం ఆసారాంను విశ్వసించింది. షాజహాన్పూర్లో ఆశ్రమ నిర్మాణంలో బాధితురాలి తండ్రి కీలకంగా వ్యవహరించారు. అలాంటిది.. సిగ్గుచేటు చర్య ద్వారా తనపై భక్తులు పెట్టుకున్న నమ్మకాన్ని ఆసారాం వమ్ముచేశారు. జపం చేద్దామని తన గదికి పిలిచి లైంగిక వేధింపులకు దిగారు’ అంటూ 453 పేజీల తీర్పులో జడ్జి పేర్కొన్నారు. ‘దేవుడిగా తనను నమ్మిన బాలిక విశ్వాసానికి ఆసారాం ద్రోహం చేశారు. వదిలిపెట్టమని పదే విజ్ఞప్తి చేసినా కనికరించకుండా అత్యాచారం చేశారు. ఇలాంటి వ్యక్తిపై జాలి చూపించటం, బాధిత బాలికకు న్యాయం చేయకపోవటం మొత్తం వ్యవస్థకే చేటు. ప్రజల్లో వ్యవస్థపై నమ్మకం పోయేలా చేస్తుంది’ అని ఆయన తీర్పులో వెల్లడించారు. దేశంలో పేదలు కూడా న్యాయాన్ని అందుకోగలరని ఈ తీర్పు మరోసారి వెల్లడించిందని ఈ కేసు విచారణను పర్యవేక్షించిన ఐపీఎస్ అధికారి అజయ్‌పాల్ లాంబా అన్నారు. ‘చివరకు నిజమే గెలిచింది. భారత న్యాయచరిత్రలోనే ఇదో గొప్ప తీర్పుగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు. భద్రత కట్టుదిట్టం డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ కేసు తీర్పు సమయంలో తలెత్తిన విధ్వంసం నేపథ్యంలో.. ఆసారాం ఆశ్రమంతోపాటుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జోధ్‌పూర్ కోర్టు, సెంట్రల్ జైలు పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమల్లోకి తీసుకొచ్చారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు రాజస్తాన్‌తోపాటు, ఆసారాం భక్తులు భారీగా ఉన్న గుజరాత్, హరియాణా, మధ్యప్రదేశ్‌లలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని రాజస్తాన్ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. న్యాయం జరిగింది: బాలిక తండ్రి ఆసారాం బాపుకు శిక్ష పడటంపై.. బాధిత బాలిక తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తమ కూతురికి సరైన న్యాయం జరిగిందని బాలిక తండ్రి ఉద్వేగంగా పేర్కొన్నారు. ‘కోర్టు ఇచ్చిన తీర్పుతో సంతోషంగా ఉన్నాం. ప్రభుత్వం, కోర్టులు మాతోనే ఉన్నాయన్న నమ్మకం కుదిరింది. మేం భయపడాల్సిన పనిలేదు. నేను చనిపోయినా బాధలేదు. నా కూతురికి న్యాయం జరిగింది’ అని నాటి మైనర్ బాలిక తండ్రి పేర్కొన్నారు. ‘నా కూతురు ధైర్యవంతురాలు. ఆమె ధైర్యం కారణంగానే తప్పుడు పనులుచేస్తున్న ఈ దొంగబాబాకు శిక్షపడేలా చేయగలిగాం. నాలుగేళ్లుగా మా కుటుంబం ఇంటినుంచి బయటకు రాలేదు. మా బంధువులను బెదిరించారు. ఆసారాం ఇక జైలు నుంచి బయటకు రారు. ఈ పోటీలో మేమే గెలిచాం’ అని ఆయనన్నారు. సర్వత్రా హర్షం జోధ్‌పూర్ తీర్పును రాజకీయ నాయకులు, హక్కుల కార్యకర్తలు స్వాగతించారు. ‘గురువంటే అందరినీ కాపాడాలి. కానీ వారిపై లైంగిక దాడులకు పాల్పడటం కాదు. ఉన్నత స్థానంలో ఉండి నమ్మిన వారిపైనే నేరాలకు పాల్పడిన ఆసారాంకు ఇది సరైన శిక్ష. బాలలపై నేరాలను తగ్గించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పురోగమన చర్యే అవుతుంది’ అని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ స్తుతి కేకర్ పేర్కొన్నారు. ‘ఇలాంటి బాధితులందరి విజయమిది. ఆసారాంలాగా క్రూరమైన లైంగిక నేరాలకు పాల్పడే వారంతా.. చట్టం నుంచి తప్పించుకోలేరనే సందేశాన్నిచ్చిన తీర్పు ఇది. బాధితురాలు, ఆమె తండ్రి ధైర్యాన్ని ప్రశంసించకుండా ఉండలేం’ అని బాధితురాలి తరపు న్యాయవాది ఉత్సవ్ బైన్స్ పేర్కొన్నారు. ఆసారాం సాధు వేశంలో ఉన్న రాక్షసుడని.. జోధ్‌పూర్ కోర్టు ద్వారా బాధితురాలికి సరైన న్యాయం జరిగిందని నిర్భయ (ఢిల్లీ హత్యాచార ఘటన బాధితురాలు) తాత తెలిపారు. రేపిస్టు అనొద్దు: వంజారా ఆసారాం చేసింది తప్పే అయినా ఆయన్ను రేపిస్టు అనటం సరికాదని.. గుజరాత్ మాజీ పోలీసు ఉన్నతాధికారి వంజారా అభిప్రాయపడ్డారు. బాధితురాలు తన ఎఫ్ఐఆర్లోనూ ఆసారాం తనపై అత్యాచారం చేసినట్లు పేర్కొనలేదని.. అసభ్యంగా ప్రవర్తించాడని మాత్రమే పేర్కొందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన మెడికల్ పరీక్షల్లోనూ ఈ విషయం వెల్లడైందని వంజారా గుర్తుచేశారు. రేప్ చేయకపోయినా.. ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించటమూ నేరమేనన్నారు. అసలు కేసేంటి? ఆగస్టు 15, 2013 నాటి 16 ఏళ్ల అమ్మాయిపై రేప్ కేసులో సెప్టెంబర్ 1న ఇండోర్‌లో ఆసారాంను పోలీసులు అరెస్టు చేశారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 8, భారతీయ శిక్షాస్మృతిలోని 342, 376, 354(ఏ), 506, 509/34, జువెనైల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్లు 23,26 కింద కేసు నమోదు చేశారు. కేసు మొదట జోధ్‌పూర్ జిల్లా కోర్టులో విచారించినప్పటికీ.. ఆ తర్వాత 2016, డిసెంబర్16న ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టుకు మార్చారు. ఈ మధ్యలో ఆయన 12సార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ వివిధ కోర్టులు తిరస్కరించాయి. ఏప్రిల్ 7నే వాదనలు పూర్తవగా.. న్యాయస్థానం తుది తీర్పును ఏప్రిల్ 25కు రిజర్వ్ చేసింది. 1997 నుంచి 2006 మధ్య అహ్మదాబాద్, సూరత్ ఆశ్రమాల్లో చదువుకున్న సమయంలో ఆసారాంతోపాటు ఆయన కుమారుడు నారాయణ్ సాయి తమపై అత్యాచారానికి పాల్పడ్డారని సూరత్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఫిర్యాదు చేశారు. బెయిల్ ఇవ్వాలంటూ న్యాయమూర్తులను, విచారణకు వచ్చిన పోలీసులను కూడా బెదిరించడంతో ఆసారాంకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టులు నిరాకరించాయి. గుడిసె నుంచి రూ.10,000 కోట్లకు.. అహ్మదాబాద్: జోధ్‌పూర్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించిన ఆసారాం బాపు ప్రయాణం సబర్మతి నదీ తీరాన ఓ చిన్న గుడిసె నుంచి ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా 400 ఆశ్రమాలు, రెండు కోట్ల మంది అనుచరులు ఉన్న ఆసారాం సంపద కూడా రూ.10,000 కోట్లకు పైమాటే. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న సింధ్ ప్రావిన్సులోని బెరానీ గ్రామంలో 1941, ఏప్రిల్ 17న ఆసారాం జన్మించాడు. అసలు పేరు అసుమల్ తౌమల్ హర్పలాని. 1947లో దేశ విభజన తర్వాత ఆసారాం కుటుంబం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వలసవచ్చింది. అక్కడే ఓ పాఠశాలలో ఆయన నాలుగో తరగతి వరకూ చదువుకున్నాడు. కొద్దికాలానికే తండ్రి చనిపోవడంతో కుటుంబ పోషణ కోసం గుర్రపు బగ్గీలు నడపటం, సైకిళ్లు రిపేర్ చేయడంతో పాటు టీ, మద్యం అమ్మడం వంటి పనులు చేశాడు. చివరికి పెళ్లికి 8 రోజుల ముందు 15 ఏళ్ల ప్రాయంలో ఇల్లు వదిలి పారిపోయాడు. బెహరూచ్లోని ఆధ్యాత్మిక గురువు లీలాషా బాపు వద్ద శిష్యుడిగా చేరాడు. లీలాషా బాపునే ఆయన పేరును ఆసారాంగా మార్చారు. అనంతరం గుజరాత్‌లోని మొతెరాలో సబర్మతి నదీతీరాన ‘మోక్ష కుటీర్’ పేరుతో చిన్న గుడిసెలో ఆశ్రమాన్ని ఆసారాం ప్రారంభించాడు. కాలక్రమేణా ఆశ్రమాల కోసం ఆసారాంకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విరివిగా భూములిచ్చాయి. అయితే ఆసారాం తమ భూమిని కబ్జా చేశారని పలువురు ప్రజలు కోర్టుల్ని ఆశ్రయించారు. కేవలం ఆశ్రమాలే కాకుండా ఆయుర్వేద మందులు, ఆధ్యాత్మిక పుస్తకాల అమ్మకాలతో ఆసారాం భారీగా ఆదాయాన్ని గడించాడు. ఆసారాంకు భార్య లక్ష్మీ దేవి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన కుమారుడు నారాయణ సాయి ఓ రేప్ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నాడు. గుజరాత్‌లోని మొతెరా ఆశ్రమం సమీపంలో 2008లో దీపేశ్, అభిషేక్ అనే పిల్లలు విగతజీవులై కన్పించడంతో ఆసారాంకు కష్టాలు ప్రారంభమయ్యాయి. వీరిద్దరినీ బలిచ్చారని వారి కుటుంబసభ్యులు ఆరోపించడంతో సీఐడీ పోలీసులు ఏడుగురు ఆసారాం అనుచరుల్ని అరెస్ట్ చేశారు. 2013లో ఓ మైనర్ బాలిక తనపై ఆసారాం అత్యాచారం చేశారని ఫిర్యాదు చేయడంతో ఆయన ప్రతిష్ట మసకబారింది. ఈ ఘటన జరిగిన వెనువెంటనే సూరత్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు తమపై కూడా ఆసారాం, ఆయన కుమారుడు సాయి అత్యాచారం చేశారని బయటికొచ్చారు. తర్వాత ఆశ్రమాలపై దాడిచేసిన పోలీసులకు వేలాది ఎకరాల భూముల డాక్యుమెంట్లు, భారీ సంఖ్యలో షేర్ల పత్రాలు లభ్యమయ్యాయి. అహ్మదాబాద్‌లోని ఆసారాం ఆశ్రమం ఆసారాంతో మోదీ ఆసారాం దోషిగా తేలడంతో ప్రధాని మోదీ గతంలో ఆసారాంతో కలసి ఉన్న ఫొటోలు, వీడియోలను పలువురు నెటిజన్లతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా ట్వీటర్లో పోస్ట్ చేసింది. ‘నీ స్నేహితులను బట్టి నీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు’ అనే అర్థం వచ్చేలా ఉన్న క్యాప్షన్‌ను ఓ ఫొటోకు కాంగ్రెస్ పెట్టింది. ఆ తర్వాత స్త్రీలపై గతంలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన అనేకమంది బీజేపీ నేతల పేర్లతో ఓ జాబితాను కూడా కాంగ్రెస్ పోస్ట్ చేసింది. కొందరు మరో ఫొటోతో కాంగ్రెస్‌కు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ సింగ్ గతంలో మధ్యప్రదేశ్ సీఎంగా ఉండగా ఆసారాంకు దండం పెడుతున్న ఫొటోలను పోస్ట్ చేశారు. -
పురుషుడు మిగిలాడు!
ఆదర్శాలు మారకూడదు. ఆదర్శాలు‘మారడం’ అంటే మునుపు ఏర్పరచిన అభిప్రాయాలకు భంగం కలిగించేలా ప్రవర్తించడం. ఒక ఆదర్శ పురుషుడిపై పదేళ్ల క్రితం ఉన్న అభిప్రాయాలు ఈ పదేళ్లలో మారకూడదనేం లేదు. అయితే ఏ కారణం చేతనైతే అతడు ఆదర్శప్రాయుడిగా ఉన్నారో అదే ఆదర్శం నిన్నటికి, నేటికీ, రేపటికీ మారిపోకూడదనే ఆశిస్తాం. అభిప్రాయాలు మారొచ్చు. ఆదర్శాలు మారకూడదు. ఆదర్శాలు ‘మారడం’ అంటే మునుపు ఏర్పడిన అభిప్రాయాలకు భంగం కలగడం. ఆదర్శం మారినప్పుడు ఆ ఆదర్శం నుంచి రూపుదాల్చిన అభిప్రాయాలు మారిపోవడం సహజమే అయినా ఆసారాం బాపూజీపై ఇప్పటికీ ఆయన అనుచరుల అభిప్రాయాలు మారలేదు! నిన్న జోథ్‌పూర్ కోర్టు ఆసారాంపై తుది తీర్పుకు సిద్ధమవుతూ, అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందనుకున్న నాలుగు రాష్ట్రాల్లో ముందు జాగ్రత్తగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించడాన్ని బట్టి ఆయనకు నేటికీ బలమైన అనుచరులు, ఆ అనుచరులకు బలమైన అభిప్రాయాలు ఉన్నాయని అర్థమవుతోంది. పదేళ్ల క్రితం అటల్ బిహారీ వాజపేయి, మరో మాజీ ప్రధాని చంద్రశేఖర్, కె.ఆర్.నారాయణన్, కమల్‌నాథ్, కపిల్ సిబాల్, అశోక్ సింఘాల్, ఉద్ధవ్ ఠాక్రే, పవన్ గుప్తా వంటి వాళ్లకు సైతం ఆసారాం తనపై ఒక అభిప్రాయాన్ని ఏర్పరచగలిగారు. అది ఆయన నేరుగా వాళ్లను కూర్చోబెట్టి ఏర్పరచినది కాకపోవచ్చు. ప్రాపంచిక అజ్ఞానపు పొరల్ని తొలగించారని, ఆయనకు యావత్ భారత జాతీ రుణపడి ఉందని, ఆయనొక శాంతి దూత అని, దేవజ్ఞాన జ్యోతి అని, నేటి తరానికి ఆధ్యాత్మిక విలువల్ని ప్రసాదించారని, సత్ప్రవర్తనను ప్రబోధించారనీ ఆయనపై ఒక గొప్ప భక్తిభావంతో కూడిన అభిప్రాయం విశ్వవ్యాప్తం అయిందంటే ఆసారాం ఆదర్శాలే కారణం. ఆయనకు రెండు కోట్ల మంది అనుచరులు ఉన్నారు. ఇప్పటికీ వారు (కోర్టు తీర్పు తర్వాత కూడా) తమ అభిప్రాయాలపై తాము నిలబడే ఉన్నారు! ఆసారాం కూడా తన ఆదర్శంపై నిలబడి ఉంటే బాగుండేది. ఆదర్శపురుషుడు ఇప్పుడు పురుషుడిగా మాత్రమే మిగిలిపోయారు. – మాధవ్ శింగరాజు -
ఆశారాం బాపు కేసు..పది నిజాలు
జోధ్‌పూర్ : మైనర్ బాలిక రేప్ కేసులో తనను తాను దైవదూతగా, ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకునే ఆశారాం బాపు అరెస్ట్ అయిన ఐదు సంవత్సరాల తర్వాత కోర్టు ఆయనకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించిన తీర్పు ఈ రోజు జోధ్‌పూర్ జైలులో న్యాయమూర్తి వెలువరించారు. తీర్పు సందర్భంగా రాజస్తాన్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్లో ఆయన అనుచరులు ఎలాంటి గొడవ చేయకుండా ముందస్తుగా భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన పది నిజాలు 1. ప్రపంచ వ్యాప్తంగా ఆశారాం బాపుకు సుమారు నాలుగు వందల ఆశ్రమాలు ఉన్నాయి. ఆశారాం బాపు కుమారుడు నారాయణ్ సాయి కూడా మరో రేప్ కేసులో నిందితుడే. గుజరాత్‌లోని సూరత్‌లో 2002-04 సమయంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరిపిన కేసులో నారాయణ్ సాయి నిందితుడు. 2.ఇటీవలే సుప్రీం కోర్టు ఈ కేసుకు సంబంధించి సూరత్ ట్రయల్ కోర్టుకు ఐదు వారాల్లో కేసు తేల్చాయాలని డెడ్‌లైన్ విధించింది. 3. రేప్ కేసులో ఆశారాంకు జీవిత ఖైదుతో పాటు రూ. లక్ష జరిమానా కోర్టు విధించింది. 4. రేప్ కేసుకు సంబంధించి ఆశారాం బాపును మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం జోధ్‌పూర్‌కు తరలించారు. బెయిల్ కోసం 12 సార్లు అప్పీల్ చేసుకున్నా ప్రతీసారి బెయిల్ తిరస్కరణకు గురైంది. 5. ‘ మాకు న్యాయం దక్కింది. ఈ పోరాటంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. సరైన శిక్ష ఆశారం బాపుకు పడింది. విచారణ సమయంలో హత్యకు గురైన సాక్షులకు కూడా న్యాయం దక్కుతుందని ఆశిస్తున్నాను’ అని రేప్‌కు గురైన బాలిక తండ్రి చెప్పారు. 6. కేసు విచారణలో ఉండగా 9 మంది సాక్షులు దాడులకు గురయ్యారు. వీరిలో ముగ్గురు హత్య కాబడ్డారు. 7. ఆశారాం బాపుపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్-375తో పాటు పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. 8.బాలిక ఒంట్లోకి దెయ్యాలు ప్రవేశించాయని, ఆమె నుంచి దెయ్యాలను ఆశారం బాపు తరిమేస్తాడని ఆశారం సహాయకులు చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు బాలికను ఆశ్రమానికి తీసుకువచ్చారు. అత్యాచారం జరిపాక ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది. 9. ఆశారాం సహాయకుల్లో ఇద్దరికి శిక్ష పడింది. మరో ఇద్దరు నిర్దోషులుగా విడుదలయ్యారు. 10. ఈ తీర్పు వెలువడగానే ఆశారాం ప్రతినిథి నీలం దూబే మాట్లాడుతూ..న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం, గౌరవం ఉందని, తీర్పుపై మా లాయర్లతో చర్చించి పైకోర్టులో అప్పీలు చేస్తామని తెలిపారు. -
మొదట నవ్వాడు..ఆ తర్వాత ఏడ్చాడు
జోథ్‌పూర్ : మైనర్ బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు శిక్ష పడిన ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు బుధవారం మొదట కోర్టులో హాలులోకి రాగానే న్యాయమూర్తిని చూసి నవ్వాడని, ఆ తర్వాత న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు వినగానే ఘొల్లుమని ఏడ్చాడని, ఆ పిమ్మట శిక్ష తగ్గించాలని వేడుకున్నట్లు తెలిసింది. కోర్టు తీర్పు వెలువరిచే సమయంలో మతపరమైన పాటలను పాడటం ప్రారంభించాడని తెలిసింది. ఆ తర్వాత అతని లాయర్ వైపు చూసి అతనేమైనా తీర్పు విషయంలో తనకు అనుకూలంగా చేయగలడా అన్నట్లు చూశాడని తెలిసింది. తీర్పు వెలువడిన వెంటనే తన చేతులతో నెత్తిని కొట్టుకుంటూ ఏడ్చాడని కోర్టులో ఉన్నవారి ద్వారా తెలిసింది. తన ఆశ్రమంలో16 ఏళ్ల బాలికపై 2013లో ఆశారాం అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు ఆశారాం బాపుపై ఐపీసీ సెక్షన్-376, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆశారాంపై నేరం నిరూపితం కావడంతో జోథ్‌పూర్ షెడ్యూల్ కాస్ట్ అండ్ ట్రైబల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. ఆశారాంకు సహకరించినందుకు గానూ శరత చంద్ర, శిల్పి అనే ఇద్దరు అనుచరులకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించారు. మరో ఇద్దరు నిందితులు శివ, ప్రకాశ్‌లను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ తీర్పు వెలువడగానే ఆశారాం ప్రతినిథి నీలం దూబే మాట్లాడుతూ..న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం, గౌరవం ఉందని, తీర్పుపై పైకోర్టులో అప్పీలు చేస్తామని తెలిపారు. డేరా బాబా కేసు విషయంలో తీర్పు వెలువరిచే సమయంలో గొడవలు జరగడంతో దాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు జోథ్‌పూర్ సెంట్రల్ జైలు ఆవరణలోనే న్యాయమూర్తి విచారణ ప్రారంభించి ఈ తీర్పు వెలువరించారు. -
ఆశారాం బాపుకు జీవిత ఖైదు
-
2వేల బెదిరింపు లేఖలు, వందల ఫోన్ కాల్స్
జోథ్‌పూర్ : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుపై నమోదైన రేప్ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో సీనియర్ ఐపీఎస్ అధకారి అజయ్ పాల్ లంబా ఎదుర్కొన్న సవాళ్లివి. ఆశారాంపై రేప్ కేసును విచారిస్తున్న సమయంలో ఆయన మద్దతుదారులు, శిష్యులు తననకు బెదిరింపులు వెల్లువెత్తాయని, బెదిరింపు లేఖలు, ఫోన్‌కాల్స్‌తో తనను భయపెట్టాలని ప్రయత్నించారని ఆయన తెలిపారు. మైనర్‌పై అత్యాచారం జరిపిన కేసులో జోథ్‌పూర్‌లోని ప్రత్యేక కోర్టు బుధవారం ఆశారాంను దోషిగా తేల్చి.. ఆయనకు జీవితఖైదు విధించింది. తన కెరీర్లోనే అత్యంత హైప్రొఫైల్ కేసు ఇదని ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు జరిపిన ఐపీఎస్ అధికారి అజయ్‌పాల్ లంబా తెలిపారు. 2013 ఆగస్టు 20న తనకు ఈ కేసును అప్పగించారని, అప్పటికే ఈ కేసుపై మీడియా ఫోకస్ తీవ్రంగా ఉందని, పలువురు సాక్షులు హత్యకు గురయ్యారని, దీనికి తోడు ఆశారాం శిష్యుల నుంచి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు బెదిరింపులు వచ్చేవని ఆయన గుర్తుచేసుకున్నారు. అప్పట్లో అజయ్‌పాల్ జోథ్‌పూర్ వెస్ట్ డీసీపీగా ఉండేవారు. ‘లేఖల్లో తీవ్రమైన దూషణలు ఉండేవి. ఆశారాంకు ఏమైనా జరిగితే మీ కుటుంబాన్ని అంతం చేస్తామని హెచ్చరించేవారు. నా ఫోన్ నిరంతరం మోగుతూనే ఉండేది. దీంతో గుర్తుతెలియని నంబర్ల నుంచి కాల్స్ వస్తే ఎత్తేవాడిని కాదు. నేను ఉదయ్‌పూర్‌కు మారిన తర్వాత బెదిరింపు లేఖలు ఆగిపోయాయి’ అని 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో తన కూతుర్ని కొంతకాలం పాఠశాలకు పంపలేదని, తన భార్య కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లేది కాదని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆయన ఏసీబీ ఎస్పీగా జోథ్‌పూర్‌లో నివాసముంటున్నారు. ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తే.. కేసుకు సంబంధించిన సాక్షిని తానే చంపానని ఒప్పుకున్నాడని, అంతేకాకుండా మరో అప్పడి జోథ్‌పూర్ డీఎస్పీ చంచల్ మిశ్రాను కూడా చంపేందుకు టార్గెట్ చేసినట్టు వెల్లడించాడని తెలిపారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన పదివారాల్లోనే మొదటి చార్జ్‌షీట్ దాఖలు చేశామని, ఈ కేసులో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని, అయితే, కేసులోని చిక్కుముడుల వల్లే దర్యాప్తు కొంత జాప్యమైందని ఆయన తెలిపారు. -
ఆశారాం బాపుకు శిక్ష ఖరారు
జోధ్‌పూర్ : 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు జోధ్‌పూర్ ట్రయిల్ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరికి 20 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. కాగా 2013 సంవత్సరం నుంచి జైలు ఊచలు లెక్కిస్తున్న ఆశారాం బాపూపై మూడు అత్యాచార కేసులు నమోదై ఉన్నాయి. 2013 సంవత్సరం ఆగస్టులో పదహారేళ్ల అమ్మాయి జోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో ఆశారాం తనపై లైంగిక దాడి చేశారంటూ ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ అమ్మాయికి పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానని మభ్యపెట్టిన ఆశారాం ఆమెపై అత్యాచారం జరిపినట్టు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైనప్పటికీ ఆశారాం బాపూ పోలీసుల ఎదుట హాజరు కాలేదు. అందరి కళ్లు గప్పి ఇండోర్‌లోని తన ఆశ్రమంలో దాక్కున్నాడు. నాన్‌బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసినప్పటికీ అతను బయటకి రాలేదు. అతనిని అరెస్ట్ చేయడం కూడా ఒక ప్రహసనంగానే మారింది. ఈ సందర్భంగా పోలీసులకు, ఆశారాం అనుచరులకు మధ్య తీవ్రమైన ఘర్షణలు కూడా జరిగాయి. చివరికి 2013 సెప్టెంబర్ 1న ఆశారాంను రాజస్థాన్ జోధ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసులో సాక్షులపైన ఆశారాం బాపూ ప్రైవేట్ సైన్యం బెదిరింపులు, దాడులకు దిగింది. తన కండబలం ప్రదర్శించింది. ఆశారాంకు బెయిల్ ఇవ్వకపోతే చంపేస్తామంటూ కేసును విచారించిన న్యాయమూర్తిని కూడా బెదిరించారు. దీంతో సుప్రీంకోర్టులో కూడా అతనికి బెయిల్ లభించలేదు. ఈ కేసులో ఆశారాంపై ఆరోపణలు రుజువు కావడంతో ఆయనకు న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడిచింది. దోషిగా తేల్చింది. బాపుతో పాటు కేసులోని ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని దోషులుగా పేర్కొన్న కోర్టు మరో ఇద్దరిని నిర్దోషులుగా పేర్కొంది. దోషులుగా తేలిన ఇద్దరికి ఇరవై ఏళ్లు జైలు శిక్ష విధించింది. -
‘ఆశ’గా ఎదురుచూసి.. కంగుతిన్నారు!
జోధ్‌పూర్: తాము నమ్మిన భగవత్స్వరూపం కడిగిన ముత్యంలా తిరిగొస్తుందని ఆశగా ఎదరుచూసిన భక్తులు కంగుతిన్నారు. బాలికపై అత్యాచారం కేసులో ప్రముఖ ఆథ్యాత్మిక గురువు ఆశారాం బాపు దోషిగా తేలడంతో ఆయన అభిమానులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తమ గురువు నిర్దోషిగా విడుదలవుతారని దండలు కూడా తీసుకొచ్చిన అభిమానులు కోర్టు తీర్పుతో షాక్‌కు గురయ్యారు. ఉత్తరభారతంలోని పలు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం కనిపించిన దృశ్యాలివి! ఆథ్యాత్మిక గురువుగా ఒక వెలుగు వెలిగిన ఆశారాం.. దేశవ్యాప్తంగా 400కుపైగా ఆశ్రమాలు స్థాపించారు. 2013లో సహారన్‌పూర్‌లోని తన ఆశ్రమంలోనే ఆయన మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదయింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఆశారాం దోషే అంటూ జోధ్‌పూర్ ఎస్సీ, ఎస్టీ ట్రయల్ కోర్టు తీర్పు చెప్పింది. బాపుతో పాటు కేసులోని ఐదుగురు నిందితుల్లో ఇద్దరు మాత్రం నిర్దోషులుగా బయటపడ్డారు. బాపూజీ నిర్దోషిగా బయటికొస్తారని దండలతో వచ్చి జోధ్‌పూర్ జైలు వద్ద హడావిడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీర్పు నేపథ్యంలో ఆశారాం అనుచరులు విధ్వంసానికి పాల్పడే అవకాశాలున్న దరిమిలా రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలోని కీలక పట్టణాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. న్యాయం దక్కింది: బాధితురాలి తండ్రి ‘‘ఆశారాం దోషిగా తేలడంతో మాకు న్యాయం దక్కింది. ఈ కేసులో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన సాక్షుల కుటుంబాలకు కూడా న్యాయం జరగాలని కోరుతున్నాను. దోషికి కఠిన శిక్ష పడుతుందని భావిస్తున్నా. సుదీర్ఘంగా సాగిన న్యాయ పోరాటంలో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ తీర్పుపై అప్పీలు! అత్యాచారం కేసులో ఆశారాంను దోషిగా తేల్చిన జోధ్‌పూర్ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు ఆశారాం ఆశ్రమ అధికార ప్రతినిధి నీలమ్ దుబే మీడియాకు చెప్పారు. తీర్పు కాపీని క్షుణ్నంగా చదివి, నిపుణులతో చర్చించిన మీదట తుది నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు. దొంగ బాబాలకు చెంపపెట్టు: కాంగ్రెస్ ‘నిజమైన సాధువులకు, దొంగ బాబాలకు మధ్య తేడాలను ప్రజలు పసిగట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ తీర్పు ఖచ్చితంగా చాలా మార్పులకు దారితీస్తుంది. ముఖ్యంగా బాబాలు, సాధువుల పట్ల అంతర్జాతీయంగా నెలకొన్న అభిప్రాయాల్లో మార్పు వస్తుంది’’ అని కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ అన్నారు. -
ముంబైకి చేరుకున్న సల్మాన్‌ఖాన్
-
సల్మాన్‌కు బెయిల్
జోధ్‌పూర్: బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు ఊరట లభించింది. కృష్ణ జింకల్ని చంపిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష ఎదుర్కొంటున్న సల్మాన్‌కు జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. గురువారం ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించడంతో రెండ్రోజులు జోధ్‌పూర్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవించిన కండల వీరుడు బెయిల్‌పై విడుదల కాగానే నేరుగా ముంబైకి ప్రత్యేక విమానంలో వెళ్లిపోయారు. అయితే బెయిల్ మంజూరును రాజస్తాన్ హైకోర్టులో సవాలు చేస్తామని బిష్ణోయ్ తెగ ప్రతినిధి రామ్ నివాస్ తెలిపారు. సల్మాన్ పెట్టుకున్న బెయిల్ దరఖాస్తుపై శుక్రవారమే వాదనలు పూర్తి కాగా తీర్పును సెషన్స్ కోర్టు జడ్జి శనివారానికి వాయిదావేశారు. ఉదయం బెయిల్ పిటిషన్‌పై డిఫెన్స్, ప్రాసిక్యూషన్ న్యాయవాదులు మరోసారి వాదనలు వినిపించారు. తీర్పును న్యాయమూర్తి మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అనంతరం 3 గంటల సమయంలో జడ్జి తీర్పు వెలువరిస్తూ.. బెయిల్ కోసం రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తు, అదే మొత్తానికి మరో ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని డిఫెన్స్ న్యాయవాదుల్ని ఆదేశించారు. బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో సల్మాన్ చెల్లెళ్లు అల్విరా, అర్పితలు కోర్టులోనే ఉన్నారు. కోర్టు నుంచి బెయిల్ పత్రాలు అందగానే జైలు అధికారులు సాయంత్రం 5.30 గంటల సమయంలో సల్మాన్‌ను విడుదల చేశారని.. అనంతరం పోలీసు పహారా మధ్య వ్యక్తిగత బాడీగార్డు షేరా వెంటరాగా జోధ్‌పూర్ ఎయిర్‌పోర్టుకు వెళ్లారని పోలీసు అధికారి చెప్పారు. కొంతమంది అభిమానులు ఆయన కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. ట్రయల్ కోర్టు తీర్పును నిలుపుదల చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను మే 7న విచారిస్తామని, అప్పుడు సల్మాన్ కోర్టుకు హాజరుకావాలని జడ్జి రవీంద్ర కుమార్ జోషి ఆదేశించారు. కాగా ఆయనను సిరోహి కోర్టుకు బదిలీ చేస్తూ శనివారం సాయంత్రం రాజస్తాన్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నుంచి ఉత్తర్వులు అందాయి. సాధారణ బదిలీల్లో భాగంగా మొత్తం 134 జడ్జీల్ని ట్రాన్స్ఫర్ చేయగా అందులో రవీంద్ర కుమార్ జోషి కూడా ఉన్నారు. 1998 అక్టోబర్‌లో ‘హమ్ సాథ్ సాథ్ ’హై సినిమా షూటింగ్ సమయంలో రెండు కృష్ణ జింకల్ని చంపిన నేరంపై గురువారం ట్రయల్ కోర్టు సల్మాన్‌ను దోషిగా నిర్ధారించి ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. బెయిల్‌పై బాలీవుడ్లో హర్షం బెయిల్ మంజూరైన విషయం తెలియగానే సల్మాన్ స్నేహితులు, సన్నిహితులు, బాలీవుడ్ వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. సల్మాన్ నటిస్తున్న ‘రేస్ 3’ చిత్ర దర్శకుడు రెమో డిసౌజా మాట్లాడుతూ.. ‘సల్మాన్‌కు బెయిల్ దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. నటుడుగా, మానవత్వమున్న వ్యక్తిగా సల్మాన్‌ను అభిమానిస్తా’ అని చెప్పారు. ఆ చిత్ర నిర్మాత రమేష్ తౌరానీ మాట్లాడుతూ.. ‘సల్మాన్ విడుదల కావడం మాకు చాలా ముఖ్యం. మా ప్రార్థనలకు సమాధానం లభించింది. రేస్ 3 సినిమా నిర్మాణం దాదాపుగా పూర్తయింది’ అని చెప్పారు. హీరోయిన్ సోనాక్షి సిన్హా, నటులు సోనూ సూద్, నీల్ నితిన్ ముకేశ్, దర్శకుడు అనీస్ బజ్మీ తదితరులు సల్మాన్‌కు బెయిల్ రావడాన్ని స్వాగతించారు. సల్మాన్ విడుదలతో అహ్మదాబాద్‌లో సంబరాలు చేసుకుంటున్న విద్యార్థినులు -
ఆశారాం బాపు కేసులో తీర్పు వాయిదా
జోధ్‌పూర్ : అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుపై తీర్పును రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ కోర్టు రిజర్వ్ చేసింది. శనివారం ఈ కేసును విచారించిన కోర్టు తీర్పును ఈ నెల 25న వెలువరించనుంది. మైనర్ బాలికపై కొన్నేళ్లపాటు లైంగి దాడులకు పాల్పడ్డారన్న కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆశారం బాపు జోధ్‌పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఇదే జైలులో సల్మాన్ ఖాన్ రెండు రోజులు ఉన్న తర్వాత శనివారం బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ కేసులో దోషిగా తేలితే ఆశారం బాపునకు పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 2013 ఆగస్ట్ 3వ తేదీన ఈ ఆధ్యాత్మిక గురువును జోధ్‌పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో బెయిల్ కోసం ఆయన పలుమార్లు పిటిషన్లు దాఖలు చేసుకున్నా కోర్టులు అందుకు నిరాకరించాయి. 1997-2006 మధ్యకాలంలో అహ్మదాబాద్ శివార్లలోని ఆశ్రమంలో ఉన్న సమయంలో ఆశారాం బాపు పలుమార్లు తనపై లైంగిక దాడులకు పాల్పడ్డాడని బాలిక 2013లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. జోధ్‌పూర్ జైల్లో ఉన్న ఆశారాం బాపు భవితవ్యం కోర్టు తీర్పుతో మరికొన్ని రోజుల్లో తేలనుంది. -
ప్రత్యేక విమానంలో ముంబైకి సల్మాన్..
జోధ్‌పూర్ : కృష్ణ జింకల వేట కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ పోలీసుల పటిష్ట భద్రత మధ్య జోధ్‌పూర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. గత రెండు రోజులుగా జరుగుతున్న నాటకీయ పరిణామాల మధ్య 50 వేల రూపాయల పూచీకత్తుపై, కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను సల్మాన్‌కు మంజూరు చేస్తున్నట్లు జోధ్‌పూర్ కోర్టు శనివారం మధ్యాహ్నం వెల్లడించిన విషయం తెలిసిందే. కోర్టు ఉత్తర్వుల కాపీ అందుకున్న పోలీసులు సల్మాన్‌ను పటిష్ట భద్రతతో జైలు నుంచి విడుదల చేశారు. సల్మాన్‌ను తీసుకెళ్లేందుకు కొందరు సన్నిహితులు జోధ్‌పూర్ జైలుకు వచ్చారు. జైలునుంచి విడుదలైన సల్మాన్‌ను పోలీసులు జోధ్‌పూర్ ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సల్మాన్ ముంబైకి బయలుదేరారు. ఒకరిద్దరు వ్యక్తిగత సిబ్బంది, సన్నిహితులు సల్మాన్‌తో ఉన్నారు. మరోవైపు కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ కేసు తదుపరి విచారణ మే7న చేపట్టనున్నారు. 20 ఏళ్ల కిందటి కేసులో దోషిగా తేలిన సల్మాన్‌కు జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించగా.. రూ.25 వేల విలువైన రెండు బాండ్లతో పాటు కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లొద్దన్న నిబంధనలపై సల్మాన్‌కు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. బెయిల్ అనంతరం ఎయిర్ పోర్టుకు బయలుదేరుతున్న సల్మాన్