జోధ్పూర్ : కృష్ణజింకలను వేటాడి చంపిన కేసులో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ భవితవ్యం నేడు తేలనుంది. ఈ కేసుకు సంబంధించి జోధ్పూర్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. కృష్ణజింకలను వేటాడిన కేసులో 16 ఏళ్ల తర్వాత తీర్పు నేడు రానుంది. అక్టోబర్, 1998లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా నిర్మాణ సమయంలో సల్మాన్ ఖాన్, సోనాలి బెంద్రె, టబు, నీలమ్ తదితరులు రక్షిత జంతువైన కృష్ణజింకను వేటాడారంటూ అప్పట్లో కేసు నమోదైంది. సల్మాన్‌ఖాన్‌పై రెండు వేర్వేలు కేసులు నమోదైయ్యాయి. ఈ రెండు కేసుల్లో ఒక దాంట్లో సంవత్సరం, మరో కేసులో ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో ఖైదీ నం. 210 గా సల్మాన్ జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. అనంతరం బెయిల్పై విడుదైన విషయం తెలిసిందే.
కాగా జోధ్పూర్ కోర్టు ఈ కేసు తుది విచారణను ఈ ఏడాది ఫిబ్రవరి 5న పూర్తి చేసింది. తుది తీర్పులో కండలవీరుడికి మూడు నుండి ఏడేళ్ళ వరకు శిక్ష పడవచ్చనే సమాచారం. అయితే వెనువెంటనే సల్మాన్కు బెయిల్ లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు సల్మాన్ చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలు ఉన్నాయి. 2017 దాకా అతడి డైరీ ఖాళీ లేదు. ప్రస్తుతం 'భజరంగీ భాయీ జాన్' సినిమా షూటింగ్ లో తలమునకలై వున్న ఈ బిజీ స్టార్పై ఈ తీర్పు ప్రభావం ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
సల్మాన్ కేసులో తుది తీర్పు నేడే
Published Wed, Feb 25 2015 11:11 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM
Advertisement