జోధ్పూర్ : అక్రమ ఆయుధం కలిగి ఉన్నారన్న కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్పై తీర్పును జోధ్పూర్ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసు తీర్పును న్యాయస్థానం మార్చి 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు బుధవారం పేర్కొంది. కాగా ఈ కేసు విచారణ నిమిత్తం వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని సల్మాన్ తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు.
1998లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా నిర్మాణ సమయంలో సల్మాన్ ఖాన్, సోనాలి బెంద్రె, టబు, నీలమ్ తదితరులు రక్షిత జంతువైన కృష్ణజింకను వేటాడారంటూ అప్పట్లో కేసు నమోదైంది. కృష్ణ జింకల వేటతో పాటు అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నారంటూ సల్మాన్‌ఖాన్‌పై రెండు వేర్వేలు కేసులు నమోదైయ్యాయి. ఈ రెండు కేసుల్లో ఒక దాంట్లో సంవత్సరం, మరో కేసులో ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.