Salman Khan case
-
స్టార్ హీరోకు మరోసారి బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ ఖాన్‌కు గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ నుంచి బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. తాజాగా వచ్చిన బెదిరింపులపై సల్మాన్ ఖాన్ బృందం ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి ప్రస్తావించిన సల్మాన్ ఖాన్ సన్నిహితుడు ప్రశాంత్ గుంజాల్కర్‌కు శనివారం బెదిరింపు మెయిల్ వచ్చింది. అందులో నటుడిని చంపడమే తన జీవిత లక్ష్యమని గ్యాంగ్‌స్టర్ పేర్కొన్నాడు. ఈ-మెయిల్‌కు సంబంధించిన బెదిరింపులపై గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ-మెయిల్లో ఏముంది? సల్మాన్ ఖాన్ సన్నిహితుడు ప్రశాంత్ గుంజాల్కర్‌కు బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తి రోహిత్ గార్గ్ అని తేలింది. తాజా బెదిరింపులతో గార్గ్, గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్‌లపై సల్మాన్ ఖాన్ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సల్మాన్ ఖాన్‌తో మాట్లాడాలనుకుంటున్నాడని ఈ-మెయిల్లో పేర్కొన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అందులో సల్మాన్ ఖాన్‌ను చంపడమే తన జీవిత లక్ష్యమని చెప్పారని ప్రస్తావించారు. గతంలోనూ బెదిరింపుల లేఖ గతంలో సల్మాన్ ఖాన్‌కు ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలా హత్య కేసులో ప్రధాన నిందితుడైన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. అప్పట్లో మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో సల్మాన్ భద్రతను కూడా పెంచింది. తాజాగా బెదిరింపులతో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. కృష్ణజింకల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్‌ఖాన్‌ని హత్య చేస్తానంటూ 2018లో కోర్టు ఆవరణలోనే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రకటించాడు. గతంలో సల్మాన్ హత్యకు కుట్ర పన్నారని వార్తలు కూడా వచ్చాయి. సింగర్ సిద్ధూ హత్య తర్వాత కొందరు దుండగులు సల్మాన్ ఖాన్‌తోపాటు ఆయన తండ్రి సలీం ఖాన్‌ను చంపేస్తామని లేఖ ద్వారా బెదిరించారు. -
అటవీ సంరక్షణలో బిష్ణోయ్ ఆదర్శం
1972 వన్యమృగ సంరక్షణకు చట్టం అమల్లోకి వచ్చింది. అభయారణ్యాలలోకి అడుగు పెట్టడం, వన్యమృగాల వేట చట్టవిరుద్ధమైంది. అయినా ఈ చట్టం మాఫియాను ఆపలేకపోయింది. అటవీ అధికా రులకు ఆయుధాలిచ్చినా వేట మాత్రం ఆగలేదు. కొన్ని ముఠాలు అక్రమంగా వనంలోకి ప్రవేశించి వన్యప్రాణులను వేటాడటం వలన కొన్ని జాతులు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడ్డది. అంతెందుకు ఆదిలాబాద్ జిల్లాలో 2012లో కవ్వాల్ అభయార ణ్యాన్ని పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తించిన తరువాత కూడా వేట ఆగలేదు. మహారాష్ట్ర నుంచి వేటగాళ్లు తుపాకులతో పులులను వేటాడారు. అదే జిల్లా వెంచపల్లి జింకల అభయారణ్యంలో 1980లో వందల సంఖ్యలో కృష్ణ జింకలు ఉన్నట్లు అటవీ శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ ఇప్పుడక్కడ పదంటే పది కృష్ణ జింకలు కూడా కన్పించవు. సంపన్న కుటుంబాల్లో వేట ఒక వినోదం. సల్మాన్ ఖాన్ వేట అటువంటిదే. రాజస్తాన్‌లో కంకణీ గ్రామంలో రెండు కృష్ణజింకలను వేటాడిన సల్మాన్ ఖాన్ అక్కడి బిష్ణోయ్ తెగ యువకుల కంటపడ్డారు. తుపాకీ కాల్పుల శబ్దం వినగానే అప్రమత్తమైన యువకులు వాహనం వెంట పడి వివరాలు సేక రించి, ఫిర్యాదు చేశారు. సంపన్న వర్గాలు, పలుకు బడి వర్గాలు ఒక్కటైనా బిష్ణోయ్ యువకులు చివరి వరకు నిలబడి కేసు గెలిచారు. పులుల సంరక్షణ అనే కుట్రతో పాలకులు, పారి శ్రామిక వర్గాలు సంయుక్తంగా చెంచు, ఆదివాసి, ఆటవిక తెగలను అడవినుంచి వెళ్లగొట్ట టానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆదివాసీలు అడవిలో అంతర్భాగమే. అడ విని అక్కడి జంతువులను, పక్షులను ఆదివాసీ గిరిజనులను వేరుగా చూడలేం. అటవీ ఆవరణ అంతస్థులో ఒక్కొక్క జాతిది ఒక్కో అంతస్థు. ఏ ఒక్క అంతస్థు దెబ్బతిన్నా... పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. అడవిలో సాయంత్రం ఐదుగంటలకే చీకటి తెరలు కమ్ముకుం టాయి. చీకటి పడక ముందే గుడిసెలకు చేరు కుంటారు. సరిగ్గా ఈ సమయంలో అడవిలో జీవ రాశులు బయటికి వస్తాయి. ఆహార ఆన్వేషణ పూర్తి చేసుకొని సూర్యోదయం వేళకు తావుకు చేరుకుం టాయి. సూర్యోదయం తరువాతే ఆదివాసీ దిన చర్య మొదలవుతుంది. ఆదివాసుల జీవన చర్యలు జీవ రాశుల జీవన విధానంపై జోక్యం చేసుకోవు. ప్రకృతే ఆదివాసీలకు, అటవీ జంతువులకు మధ్య అలాంటి సర్దుబాటు చేసింది. కానీ, అభయారణ్యాల్లోంచి ఆదివాసులను బయటకు పంపడం అన్యాయం. ‘చెంచులపై పరిశోధనకు వెళ్లి రాత్రి వేళ కుమ్మనిపెంటలోని అర్తి అంజన్న గుడిసెలో నిద్ర పోతుంటే ఏగిళ్లుబారే వేళ నిద్ర లేపి గుడిసెనుక నుంచి పోతున్న పులిని పిల్లిని చూపినట్టు చూపాడు’ అని ‘మరణం అంచున’ పుస్తకంలో రచయిత తన అనుభవాన్ని చెప్పారు. నిజానికి నల్లమలలో చెంచులు, పులులు కలిసే జీవనం చేస్తారు. వందల ఏళ్లుగా ఈ తంతు అలానే సాగుతోంది. ఇప్పుడేదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టు చెంచు జాతులను అడవి దాటించే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక నూతన ఆర్థిక విధానాల పర్యవసానం, అటవీ వన రులు, ఖనిజసంపద మీద పెట్టుబడి దారుల కన్ను, దానికి ఏ మిన హాయింపు లేకుండా కేంద్ర ప్రభుత్వాల దన్ను ఉండి ఉండవచ్చు. ఆటమిక్ మిన రల్ డైరెక్టర్ ఫర్ ఎక్స్‌ఫ్లోరేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ చేసిన ఏరియల్ సర్వేలో నల్లమల అటవీ ప్రాంతంలో వజ్రాలు, బంగారంతో పాటు 24 రకాల ఖనిజాలు ఉన్నాయని, వీటిలో వజ్రాలు, బంగారం, గ్రానైట్ వెలికితీత లాభదాయకంగా ఉంటుందని నిర్ధారణ అయింది. ఈ నివేదిక ఆధా రంగానే దక్షిణాఫ్రికాకు చెందిన డిబీర్స్ అనే మల్టీ నేషనల్ వజ్రాల కంపెనీకి నల్లమలలో వజ్రాల అన్వేషణకు 2009 నవంబర్‌లో అప్పటి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అప్పటినుంచే చెంచుల తరలింపు ముమ్మరం అయింది. అడవిని నాశనం చేసి, వన్య ప్రాణులను (ఆదివాసులతో సహా) సంహ రించి ఖనిజాల సంపదను దోచుకొనిపోయే విస్తాపన నుంచి అడవిని, చెంచు, ఆదివాసులను రాజస్తాన్‌లోని బిష్ణోయ్ తెగ యువత స్ఫూర్తితో కాపాడు కుందాం. వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక శాసన సభ్యులు ‘ మొబైల్ : 94403 80141 -
సల్మాన్ న్యాయవాదికి బెదిరింపులు
సాక్షి, జోధ్‌పూర్ : కృష్ణజింకను వేటాడిన కేసులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల శిక్ష విధించిన క్రమంలో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును సెషన్స్ కోర్టు శుక్రవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభమయ్యేందుకు కొద్ది నిమిషాల ముందు సల్మాన్ న్యాయవాది మహేష్ బోరా తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వెల్లడించారు. ‘ సల్మాన్ ఖాన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణకు హాజరుకారాదని హెచ్చరిస్తూ నిన్న (గురువారం) తనకు పలు ఎస్ఎంఎస్లు, ఇంటర్నెట్ కాల్స్ వచ్చాయ’ని ఆయన తెలిపారు. ఈ కేసు నుంచి విరమించుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. కాగా, సల్మాన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును సెషన్స్ కోర్టు రిజర్వ్‌లో ఉంచడంతో ఆయన శుక్రవారం వరుసగా రెండో రోజు రాత్రి సెంట్రల్ జైల్లో గడపనున్నారు. బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో సల్మాన్ సోదరిలు అల్విర, అర్పిత, బాడీగార్డ్ షేరా సెషన్స్ కోర్టుకు వచ్చారు. మరోవైపు సల్మాన్ సోదరులు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ త్వరలోనే జోధ్‌పూర్‌కు రానున్నారు. -
మంధనాకు సల్మాన్ షాక్
సాక్షి,ముంబై: కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ దోషిగా ఖరారు కావడంతో ఆ ప్రభావం మందనా రిటైల్‌పై భారీగా పడింది. ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ జోధ్‌పూర్ కోర్టు వెలువరించడంతో మంధనా రీటైల్ భారీగా నష్టపోయింది. సల్మాన్ బ్రాండ్ ఎంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న నేపథ్యంలోఈ కౌంటర్లో ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు మొగ్గుచూపారు. దాదాపు 15 శాతం నష్టాలతో ముగిసింది. ఇదే బాటలో బీయింగ్ హ్యూమన్ (మంధనా ఇండస్ట్రీస్) షేర్ కూడా నిలిచింది. ముఖ్యంగా ఇవాల్టి బుల్ మార్కెట్లో దాదాపు అన్ని సెక్టార్లు లాభాలను గడించగా ఈ షేర్లు నెగిటివ్‌గా ట్రేడ్ అయ్యాయి. అయితే దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో దాదాపు 600పాయింట్లు పుంజుకోగా..చివర్లో ఈరెండు షేర్లు కోలుకున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మంధనా రిటైల్ వెంచర్ షేర్లులో ఒక్కసారిగా అమ్మకాల సెగ రేగింది. ఇంట్రాడేలో రూ.136 స్థాయి నుంచి ఈ స్టాక్ రూ. 115 స్థాయికి దిగొచ్చింది. ఏకంగా 15 శాతం నష్టపోయింది. సల్మాన్‌కు చెందిన ఛారిటబుల్ సంస్థ బీయింగ్ హ్యూమన్తో మంధనా ఒప్పందం కుదుర్చుకున్నసంగతి తెలిసిందే. 2012 నుంచి మంధానా రిటైల్ వెంచర్స్‌తో బీయింగ్ హ్యూమన్ ఒప్పందాన్ని కొనసాగిస్తోంది. 15 దేశాల్లో 600 పాయింట్ ఆఫ్ సేల్ స్టోర్స్ ఈ సంస్థకు ఉన్నాయి. మరోవైపు డిసెంబర్ 31వ తేదీ వరకూ ఉన్న వివరాల ప్రకారం ఈ కంపెనీలో ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలాకు 12.74 శాతం వాటా ఉంది. -
సల్మాన్ కేసులో తీర్పు 3కి వాయిదా
జోధ్‌పూర్: ఆయుధ చట్టం కింద బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్(49) ఎదుర్కొంటున్న కృష్ణ జింకల వేట కేసులో తీర్పును జోధ్‌పూర్ స్థానిక కోర్టు మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. దాదాపు 16 ఏళ్ల కిందటి ఈ కేసుకు సంబంధించి వాదనలు ఈ నెల 10నే ముగిశాయి. అయితే ప్రాసిక్యూషన్ తరఫున మరో 4 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్న విషయం కోర్టు దృష్టికి వచ్చింది. దీంతో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అనుపమ బిజ్లానీ తీర్పును వాయిదా వేశారు. కాగా, సల్మాన్ కేసు వాయిదా పడడంతో దాదాపు రూ.200 కోట్ల ప్రాజెక్టుతో నిర్మిస్తున్న చిత్రాలకు కొంతమేరకు ఆటంకం తొలిగినట్టేనని వాణిజ్య విశ్లేషకుడు ఒకరు అన్నారు. -
సల్మాన్ కేసు తీర్పు.. మార్చి 3కు వాయిదా!
-
సల్మాన్ అక్రమ ఆయుధ కేసులో తుదితీర్పు వాయిదా
జోధ్‌పూర్ : అక్రమ ఆయుధం కలిగి ఉన్నారన్న కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌పై తీర్పును జోధ్‌పూర్ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసు తీర్పును న్యాయస్థానం మార్చి 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు బుధవారం పేర్కొంది. కాగా ఈ కేసు విచారణ నిమిత్తం వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని సల్మాన్ తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. 1998లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా నిర్మాణ సమయంలో సల్మాన్ ఖాన్, సోనాలి బెంద్రె, టబు, నీలమ్ తదితరులు రక్షిత జంతువైన కృష్ణజింకను వేటాడారంటూ అప్పట్లో కేసు నమోదైంది. కృష్ణ జింకల వేటతో పాటు అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నారంటూ సల్మాన్‌ఖాన్‌పై రెండు వేర్వేలు కేసులు నమోదైయ్యాయి. ఈ రెండు కేసుల్లో ఒక దాంట్లో సంవత్సరం, మరో కేసులో ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. -
సల్మాన్ కేసులో తుది తీర్పు నేడే
జోధ్‌పూర్ : కృష్ణజింకలను వేటాడి చంపిన కేసులో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ భవితవ్యం నేడు తేలనుంది. ఈ కేసుకు సంబంధించి జోధ్‌పూర్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. కృష్ణజింకలను వేటాడిన కేసులో 16 ఏళ్ల తర్వాత తీర్పు నేడు రానుంది. అక్టోబర్, 1998లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా నిర్మాణ సమయంలో సల్మాన్ ఖాన్, సోనాలి బెంద్రె, టబు, నీలమ్ తదితరులు రక్షిత జంతువైన కృష్ణజింకను వేటాడారంటూ అప్పట్లో కేసు నమోదైంది. సల్మాన్‌ఖాన్‌పై రెండు వేర్వేలు కేసులు నమోదైయ్యాయి. ఈ రెండు కేసుల్లో ఒక దాంట్లో సంవత్సరం, మరో కేసులో ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో ఖైదీ నం. 210 గా సల్మాన్ జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. అనంతరం బెయిల్‌పై విడుదైన విషయం తెలిసిందే. కాగా జోధ్‌పూర్ కోర్టు ఈ కేసు తుది విచారణను ఈ ఏడాది ఫిబ్రవరి 5న పూర్తి చేసింది. తుది తీర్పులో కండలవీరుడికి మూడు నుండి ఏడేళ్ళ వరకు శిక్ష పడవచ్చనే సమాచారం. అయితే వెనువెంటనే సల్మాన్‌కు బెయిల్ లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు సల్మాన్ చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలు ఉన్నాయి. 2017 దాకా అతడి డైరీ ఖాళీ లేదు. ప్రస్తుతం 'భజరంగీ భాయీ జాన్' సినిమా షూటింగ్ లో తలమునకలై వున్న ఈ బిజీ స్టార్‌పై ఈ తీర్పు ప్రభావం ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.