తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వెల్లడించిన సల్మాన్ న్యాయవాది మహేష్ బోరా
సాక్షి, జోధ్‌పూర్ : కృష్ణజింకను వేటాడిన కేసులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల శిక్ష విధించిన క్రమంలో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును సెషన్స్ కోర్టు శుక్రవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభమయ్యేందుకు కొద్ది నిమిషాల ముందు సల్మాన్ న్యాయవాది మహేష్ బోరా తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వెల్లడించారు. ‘ సల్మాన్ ఖాన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణకు హాజరుకారాదని హెచ్చరిస్తూ నిన్న (గురువారం) తనకు పలు ఎస్‌ఎంఎస్‌లు, ఇంటర్‌నెట్ కాల్స్ వచ్చాయ’ని ఆయన తెలిపారు. ఈ కేసు నుంచి విరమించుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు.
కాగా, సల్మాన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును సెషన్స్ కోర్టు రిజర్వ్‌లో ఉంచడంతో ఆయన శుక్రవారం వరుసగా రెండో రోజు రాత్రి సెంట్రల్ జైల్లో గడపనున్నారు. బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో సల్మాన్ సోదరిలు అల్విర, అర్పిత, బాడీగార్డ్ షేరా సెషన్స్ కోర్టుకు వచ్చారు. మరోవైపు సల్మాన్ సోదరులు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ త్వరలోనే జోధ్‌పూర్‌కు రానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment