Warning calls
-
గోదావరి డేంజర్ బెల్స్.. ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, భద్రాచలం: తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఇక, ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.వాయుగుండం ఎఫెక్ట్‌తో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు.. వర్షాల నేపథ్యంలో గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం 43 అడుగులకు చేరుకుంది. వరద నీరు పెరగడంతో అలర్ట్ అయిన అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.ఇదిలా ఉండగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గోదావరి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక, ఇప్పటికే తాజాగా కురిసిన వర్షం కారణంగా ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. గోదావరి వరద కూడా పెరుగుతున్న క్రమంలో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.ఇక, తూర్పుగోదావరి జిల్లాలో గోదావరిలో వరద పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 9.3 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. దీంతో, ఆరు లక్షల 61వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో విడుదలవుతోంది. 1800 క్యూసెక్కుల నీరు డెల్టా కాలువలకు సరఫరా అవుతోంది. వర్షాల కారణంగా వరద నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్.. 10లక్షలు ఇవ్వకపోతే..
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ రావడం కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తి నితిన్ గడ్కరీ కార్యాలయానికి మూడుసార్లు బెదిరింపు కాల్స్ చేశాడు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు గడ్కరీ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, బెదిరింపు కాల్లో నిందితుడు.. గడ్కరీని రూ. 10కోట్లు డిమాండ్ చేసినట్టు సమాచారం. డబ్బు ఇవ్వకపోతే ఆయన్ను చంపేస్తామని వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అయితే, గడ్కరీ మంగళవారం సాయంత్రం నాగపూర్‌కు వస్తున్న క్రమంలో ఇలా జరగడం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై నాగపూర్ రెండో జోన్ డిప్యూటీ సీపీ రాహు మాడన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఉన్న నితిన్ గడ్కరీ ఆఫీసుకు గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేశాడు. సదరు వ్యక్తి మూడుసార్లు కాల్ చేసి తనని తాను జయేశ్ పూజారిగా చెప్పుకున్నాడు. అనంతరం.. ఫోన్‌కాల్‌లో రూ. 10 కోట్లు డిమాండ్ చేశాడని.. ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. ఆ కాల్స్ చేసిన వ్యక్తి ఎవరు అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో గడ్కరీ ఆఫీసు, ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. మరోవైపు.. నిందితుడు కాల్ చేసిన నంబర్‌ను పోలీసులు ట్రేస్ చేయగా మంగళూరులోని ఓ మహిళకు చెందినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బెదిరింపు కాల్‌పై ఉత్కంఠ నెలకొంది. కాల్ సదరు మహిళ చేసిందా? లేక పూజారి జయేశ్ చేశాడా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. అంతుకుముందు కూడా గడ్కరీకి ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. అప్పుడు కూడా నిందితుడు.. ఇలాగే రూ.10కోట్లు డిమాండ్ చేయడం గమనార్హం. -
ఎమ్మెల్యేల ఎపిసోడ్లో షాకింగ్ ట్విస్ట్.. రోహిత్ రెడ్డికి ఊహించని ఫోన్ కాల్స్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. కాగా, కేసులో ఇప్పటికే నిందితులను సిట్ విచారణ వేగవంతం చేసింది. ఇదిలా ఉండగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలిపారు. ఈ క్రమంలో మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రోహిత్ రెడ్డి. తనకు యూపీ, గుజరాత్‌కు చెందిన 11 నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను హత్య చేస్తామంటూ బెదిరించనట్టు రోహిత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. ముగ్గురు ఎమ్మెల్యేల స్టేట్మెంట్స్ రికార్డు చేసింది సిట్ బృందం. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసానికి వెళ్లి స్టేట్మెంట్ రికార్డు చేశారు. నిందితులు ఎలా సంప్రదించారనే కోణంలో సిట్ విచారణ చేపట్టింది. రూ. 100 కోట్ల డీల్‌పై ఫాంహౌస్‌లో ఏం మాట్లాడారనే అంశంపై విచారణ జరిపింది. -
వల్లభనేని, కొడాలి పేర్లు చెప్పాలి.. లేకపోతే సుపారీ ఇచ్చి చంపేస్తామంటూ బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: క్యాసినో వ్యవహారంలో, ఈడీ విచారణలో ఏపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్లు చెప్పాలని పదేపదే బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని చీకోటి ప్రవీణ్ కుమార్ తెలిపారు. వారి పేర్లు చెప్పకపోతే ఓ ప్రమాదకరమైన వెబ్సైట్ ద్వారా తనని చంపేందుకు సుపారీ ఇస్తున్నట్టు బెదిరిస్తున్నారని చీకోటి ప్రవీణ్ ‘సాక్షి’కి చెప్పారు. బెదిరింపుల వెనక అక్కడి ప్రతిపక్ష పార్టీ ఉందా లేదా ఆ పార్టీ ముసుగులో ఎవరైనా చేస్తున్నారా అన్నది పోలీసుల విచారణలో తేలుతుందన్నారు. తాను రాష్ట్రంలో కాకుండా లీగల్‌గా క్యాసినో ఎక్కడ నడుస్తుందో అక్కడే వ్యాపారం చేస్తున్నట్టు వెల్లడించారు. తనకు వ్యక్తిగతంగా రెండు రాష్ట్రాల్లో చాలామంది రాజకీయ నాయకుల్లో స్నేహితులున్నారని, అలా ఉండటంలో తప్పేంటన్నారు. స్నేహితులుగా ఉన్నంత మాత్రాన వారికి సంబంధంలేని వ్యవహారాల్లో వాళ్ల పేర్లు చెప్పడం పద్ధతి కాదంటూ చీకోటి చెప్పుకొచ్చారు. అదేవిధంగా నేపాల్ క్యాసినో వ్యవహారంలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు తప్ప పెద్దగా ఎవరు రాలేదని, పలువురు సినీ ప్రముఖులకు తాను కోట్ల రూపాయలు చెల్లించినట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టంచేశారు. ఈ లెక్కల వ్యవహారాలు పూర్తిగా ఈడీకి వివరించినట్టు తెలిపారు. తాను చిన్ననాటి నుంచి జంతు ప్రేమికుడినని, కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకునే పలు జంతువులు, పక్షులను పెంచుతున్నట్టు చెప్పారు. ఈడీ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తున్నట్టు తెలిపారు. తన భద్రత విషయంలో హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టాలని, లేకపోతే మరోసారి హైకోర్టుకు వెళతానని చెప్పారు. -
వారి పేర్లు బయటకు చెప్పలేను: చికోటీ ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహరం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. చికోటి ప్రవీణ్‌పై ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో చికోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రవీణ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. నేను ఏ తప్పు చేయలేదు. క్యాసినో లీగల్‌గానే చేశాను. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. రాజకీయ స్వార్థం కోసమే నా భుజంపై తుపాకీ పెట్టారు. విదేశాల నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. విచారణలో రాజకీయ నేతల పేర్లు చెప్పాలని బెదిరిస్తున్నారు. మా ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. నేను ఎలాంటి హవాలా వ్యాపారాలకు పాల్పడలేదు అని స్పష్టం చేశారు. సినీ ప్రముఖుల ప్రమోషన్లకు చెల్లింపులు నిబంధనల ప్రకారమే జరిగాయి. వీఐపీలు, వీవీఐపీలు క్యాసినోలకి వచ్చింది వాస్తవం. వారి పేర్లు చెప్పలేను. నాకు అన్ని పార్టీల నేతలతో పరిచయాలు ఉన్నాయి. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఈడీ ఎప్పుడూ పిలిచినా వెళ్తాను’’ అని వెల్లడించారు. ఇది కూడా చదవండి: 40 ఏళ్ల పొలిటికల్ లైఫ్‌లో ఇలా ఎన్నడూ జరగలేదు.. మర్రి శశిధర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ -
మోదీ ఇలాకాలో నూపుర్ శర్మ పోస్టు కలకలం.. బెదిరింపు కాల్స్
మహ్మాద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపర్ శర్మ వ్యాఖ్యలు పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనల కారణంగా హింసాత్మక ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. కాగా, తాజాగా నూపుర్ శర్మ విషయంలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన ఇన్‌స్టాగ్రామ్‌లో నూపుర్ శర్మ ఫొటోను పోస్టు చేశాడు. ఈ క్రమంలో సదరు వ్యాపారికి ఏడుగురు వ్యక్తులు కాల్ చేసి చంపేస్తామని బెదిరించారు. సూరత్‌లో ఉండాలనుకుంటున్నావా లేదా.. చంపేస్తామంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో బాధితుడు పోలీసులకు ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు ఉమ్రా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జేఆర్ చౌదరి తెలిపారు. ఇక, అదుపులోకి తీసుకున్న వారిలో మహ్మద్ అయాన్ అటాష్బాజివాలా, రషీద్ భురా, అలియా మహ్మద్ అనే మహిళ ఉన్నారు. ఇక, వీరంతా సూరత్ నివాసితులుగా గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. అనంతరం.. సదరు వ్యాపారవేత్త వెంటనే సోషల్ మీడియా ఖాతా నుంచి నూపుర్ శర్మ ఫొటోను తొలగించి, క్షమాపణలు చెప్పాడు. #Gujarat: नूपुर शर्मा के समर्थन में इंस्टाग्राम पर पोस्ट डालने वाले सूरत के व्यापारी को मिली थी जान से मारने की धमकी, धमकी देने वाले 6 में से 3 आरोपी गिरफ्तार।#Surat #NupurSharma #NupurSharmaControversy #BJP #InstagramPost pic.twitter.com/7Ty4VDm7m8 — India Voice (@indiavoicenews) July 16, 2022 ఇది కూడా చదవండి: తమిళనాట రాజకీయ చదరంగం: పన్నీరు సెల్వానికి షాకిచ్చిన పళనిస్వామి -
ప్రవక్తపై వ్యాఖ్యలు: భారత్‌లో ఆత్మాహుతి బాంబు దాడుల వార్నింగ్
మహమ్మద్ ప్రవక్తపై మాజీ బీజేపీ నేతలు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్.. చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా చల్చారలేదు. వారి వ్యాఖ్యల కారణంగా దేశంలో ఇంకా పలు చోట్ల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయంపై నూపుర్ శర్మను హెచ్చరిస్తూ ఉగ్రవాద సంస్థలు ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నూపర్ శర్మ వ్యాఖ్యలకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఐసీస్ వార్నింగ్ ఇచ్చింది. భారత్ అంతటా దాడులు చేస్తామంటూ ఐసీస్ ఖొరాసాన్ హెచ్చరించారు. ఇక గత వారం.. మహమ్మద్ ప్రవక్తను అవమానించినందుకు ప్రతీకారంగా భారత్‌లోని వివిధ నగరాల్లో ఆత్మాహుతి బాంబు దాడులు జరుపుతామంటూ వార్నింగ్ ఇస్తూ అల్-ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ (AQIS) ఒక లేఖను జారీ చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు కూడా ఉగ్ర సంస్థ ఎంజీహెచ్ నూపుర్ శర్మకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల చేసినందుకుగానూ బేషరతుగా ప్రపంచానికి క్షమాపణ చెప్పాలని ఒక బెదిరింపు ప్రకటన విడుదల చేసింది. ‘‘నూపుర్ శర్మ తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. మొత్తం ప్రపంచానికి క్షమాపణలు చెప్పాలి. లేకుంటే.. ప్రవక్తను అగౌరవపరిచినందుకు ఏం చేయాలో అది చేస్తాం’’ అంటూ టెలిగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్లో క్రియాశీలకంగా వ్యవహరించే ఈ ఉగ్రసంస్థ.. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ ఘాజీపూర్ పూల మార్కెట్లో ఐఈడీ పేలుడుకు పాల్పడింది. Prophet row: After AQIS, Islamic State wing threatens attacks in India over remarks by Nupur Sharma https://t.co/PQgxW7AAoK — Vinu Mahanthesh G (@iam_mahanthesh) June 15, 2022 ఇది కూడా చదవండి: నేషనల్ హెరాల్డ్ కేసు: మూడో రోజు ఈడీ ముందుకు రాహుల్.. -
మీకూ విజయారెడ్డి గతే!
కామారెడ్డి క్రైం: భూమి పాసు పుస్తకాలు జారీ చేయకపోతే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డికి పట్టిన గతే మీకూ పడుతుందంటూ కామారెడ్డి ఆర్డీవో రాజేంద్రకుమార్‌కు ఓ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈ ఘటన అధికార వర్గాల్లో కలకలం రేపింది. ఆర్డీవోను బెదిరించిన వ్యక్తిని పోలీస్ శాఖలోని ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసే ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌రెడ్డిగా గుర్తించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సోమారం శివారులో సదరు కానిస్టేబుల్ కుటుంబానికి చెందిన 9.12 ఎకరాల భూమి వివాదంలో ఉంది. దీనికి సంబంధించిన పాసు పుస్తకాలు తమ పేరిట మంజూరు చేయాలని ఈ నెల 5న శ్రీనివాస్‌రెడ్డి ఆర్డీవోకు ఫోన్ చేసి చెప్పాడు. లేకపోతే విజయారెడ్డికి పట్టిన గతే మీకూ పడుతుందని బెదిరించినట్లు ఆర్డీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదు చేశారు. శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలిసింది. కానిస్టేబుల్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. -
కామారెడ్డి ఆర్డీఓకు బెదిరింపు కాల్?
సాక్షి, నిజామాబాద్ : కామారెడ్డి ఆర్డీఓ రాజేంద్ర కుమార్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ అందింది. పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వకపోతే అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డికి పట్టిన గతే తనకు పడుతుందని హెచ్చరించారు. దీంతో కంగారుపడ్డ ఆర్డీఓ పోలీసులకు ఫిర్యాదు చేయగా..రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశంపై విచారణ చేపట్టారు. ఒక ఏఆర్ కానిస్టేబుల్ కాల్ చేసినట్లు గుర్తించిన పోలీసులు విషయాన్ని ఎవరికి తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నారు. అయితే ఈ అంశంపై ఇంకా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. -
మంత్రికి ఆగంతకుడి ఫోన్ : రూ 5 కోట్లు డిమాండ్
లక్నో : ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి రూ 5 కోట్లు ముట్టచెప్పాలని తనకు బెదిరింపు కాల్ వచ్చిందని యూపీ మంత్రి నంద్ గోపాల్ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. యోగి ఆదిత్యానాథ్ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా వ్యవహరిస్తున్న గుప్తాకు ఈనెల 12న ఓ గుర్తుతెలియని వ్యక్తి కాల్ చేసి తనకు రూ 5 కోట్లు ఇవ్వాలని, అంత మొత్తం ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించినట్టు మంత్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, దుండగుడు తన గురించిన ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదని, మంత్రిని దూషిస్తూ ఆయన కుటుంబ సభ్యులు అందరినీ హతమానుస్తానని బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని కాలర్‌పై మంత్రి తన న్యాయవాదితో కలిసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలహాబాద్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నిందితుడు ఫోన్ చేసిన నెంబర్‌పై నిఘా పెట్టిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ నెంబర్ ఆధారంగా మంత్రిని బెదిరించిన ఆగంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
3డీ ముప్పు తప్పదా..?
కార్మికులు బండరాళ్లను పగలగొట్టేందుకు చెమటోడుస్తుంటే.. దాన్ని గమనించిన ఓ శాస్త్రవేత్త బాంబును కనిపెట్టాడట. మానవుడి శ్రమను తగ్గించడానికి కనిపెట్టిన అవే బాంబులు ఇప్పుడు మనిషి వినాశనానికి కారణమవుతున్నాయి. ఇలా ఎన్నో మంచి ఆవిష్కరణలు కూడా çసద్వినియోగం కంటే ఎక్కువగా దుర్వినియోగమవుతున్నాయి. తాజాగా ఆ జాబితాలో 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ కూడా చేరుతుందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. సాక్షి, ప్రత్యేకం : పెరుగుట.. విరుగుట కొరకేనన్న మాట ఇక్కడ సరిగ్గా సరిపోతుందేమో. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతాలను సృష్టిస్తున్న శాస్త్రవేత్తలు.. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో ఎన్నో అసాధ్యాలను సుసాధ్యాలుగా మారుస్తున్నారు. యంత్ర సామగ్రిని, మానవ అవయవాలను, చివరికి ఆహార పదార్థాలను కూడా 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో తయారుచేస్తున్నారు. ఫలితంగా ఎంతో సమయం ఆదా కావడంతోపాటు ఎన్నో ప్రాణాలు నిలబడుతున్నాయి. అయితే ఈ టెక్నాలజీని మానవాళి సంక్షేమానికి ఉపయోగించినన్ని రోజులూ ఏ ముప్పూ లేదని.. ఆలోచనలు పక్కదారి పడితే మాత్రం అది మానవ వినాశనానికే దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఆయుధాల తయారీతో ముప్పే.. ఆటబొమ్మలు, యంత్ర సామగ్రి, కృత్రిమ అవయవాలు, రకరకాల ఆకారాల్లో ఆహార పదార్థాలు.. ఇలా ఎన్నింటినో తయారుచేస్తున్న 3డీ ప్రింటర్‌కు ఆయుధాలను తయారు చేయడం పెద్ద లెక్కకాదు. ఆయుధాల కోసం ఇతర దేశాల మీద ఆధారపడే దేశాలకు ఈ టెక్నాలజీ ఓ వరంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. వేల కోట్ల రూపాయలను విదేశాలకు చెల్లించాల్సిన అవసరం లేకుండా సొంతంగానే ఆయుధాలను తయారుచేసుకోవచ్చని చెబుతున్నారు. దీనివల్ల మిగిలే ప్రజాధనాన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ టెక్నాలజీ అక్రమార్కుల చేతిలో పడితే.. చిన్న చిన్న దేశాలు కూడా విచ్చలవిడిగా ఆయుధాలు తయారు చేసుకుంటే.. ఉగ్రవాదులు, తీవ్రవాదులు కూడా సొంతంగా ఓ 3డీ యంత్రాన్ని కొనుక్కొని తమ ఆయుధాలను తామే తయారు చేసుకుంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. వినాశనమే తప్ప మిగిలేదేమీ ఉండదు.. పెద్దగా ఆయుధాలు అందుబాటులో లేని రెండో ప్రపంచ యుద్ధం సమయంలోనే ఎంతగా వినాశనం జరిగిందో మనకు తెలుసు. ఇప్పటికే ప్రపంచ దేశాలు తమ ఆయుధ సంపత్తిని ఇబ్బడిముబ్బడిగా పెంచేసుకున్నాయి. ఇక చిన్న చిన్న దేశాలు కూడా ఆయుధాలను సమకూర్చుకొని, యుద్ధాలకు కాలు దువ్వితే.. ఊహకందని నష్టం జరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. బూడిదే తప్ప మనుషులెవరూ మిగలరంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
సల్మాన్ న్యాయవాదికి బెదిరింపులు
సాక్షి, జోధ్‌పూర్ : కృష్ణజింకను వేటాడిన కేసులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల శిక్ష విధించిన క్రమంలో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును సెషన్స్ కోర్టు శుక్రవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభమయ్యేందుకు కొద్ది నిమిషాల ముందు సల్మాన్ న్యాయవాది మహేష్ బోరా తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వెల్లడించారు. ‘ సల్మాన్ ఖాన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణకు హాజరుకారాదని హెచ్చరిస్తూ నిన్న (గురువారం) తనకు పలు ఎస్ఎంఎస్లు, ఇంటర్నెట్ కాల్స్ వచ్చాయ’ని ఆయన తెలిపారు. ఈ కేసు నుంచి విరమించుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. కాగా, సల్మాన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును సెషన్స్ కోర్టు రిజర్వ్‌లో ఉంచడంతో ఆయన శుక్రవారం వరుసగా రెండో రోజు రాత్రి సెంట్రల్ జైల్లో గడపనున్నారు. బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో సల్మాన్ సోదరిలు అల్విర, అర్పిత, బాడీగార్డ్ షేరా సెషన్స్ కోర్టుకు వచ్చారు. మరోవైపు సల్మాన్ సోదరులు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ త్వరలోనే జోధ్‌పూర్‌కు రానున్నారు. -
'బెదిరింపులకు భయపడేది లేదు'
హైదరాబాద్: ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే తనను చంపుతామని బెదిరిస్తున్నారని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. వారి బెదిరింపులకు భయపడేది లేదని ఆయన అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటానని చెప్పారు. కొమరయ్య అనే రైతు అడిగితే ఆయనను జైల్లో పెట్టారన్నారు. నిన్నసీఎం కేసీఆర్, పంచాయతీ రాజ్ శాఖ, ఐటీ శాఖ మంత్రి, కేటీఆర్‌లపై మాట్లాడినందుకే తనను చంపుతామని కాల్స్ వస్తున్నాయని తెలిపారు. బెదిరింపు కాల్స్‌పై ఫిర్యాదుచేస్తే ఏ ఒక్క పోలీస్ మమ్మల్ని అడగలేదని విమర్శించారు. దీన్నిబట్టి బెదిరింపు కాల్స్ వెనుక ఉన్నది ఎవరో ప్రజలే అర్థం చేసుకోవాలని షబ్బీర్ అలీ చెప్పారు. -
'ఆ బెదిరింపులకు కాంగ్రెస్ భయపడదు'
హైదరాబాద్: శాశనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్అలీకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె. జానారెడ్డి పేర్కొన్నారు. ఆ అగంతకులను టీఆర్ఎస్ ప్రభుత్వం శిక్షించాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీఆర్ఎస్కు కూడా ప్రమేయం ఉందని భావించాల్సి ఉంటుందన్నారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీల గెలుపు కోసం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లను బెదరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలన్నదే టీఆర్ఎస్ అజెండాగా ఉందని విమర్శించారు. టీఆర్ఎస్ అప్రజాస్వామిక విధానాలు పరాకాష్టకు చేరాయని దుయ్యబట్టారు. ఇప్పటికే టీఆర్ఎస్ ఆగడాలపై కోర్టులను ఆశ్రయించామని ఉత్తమ్, జానా తెలిపారు. టీఆర్ఎస్ బెదిరింపులకు కాంగ్రెస్ కేడర్ భయపడదని ఘాటుగా సమాధానమిచ్చారు. టీఆర్ఎస్ ఫిరాయింపు రాజకీయాలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ కేడర్ సిద్ధంగా ఉండాలని ఉత్తమ్, జానారెడ్డి పిలుపునిచ్చారు. కాగా, తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయనీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లడితే చంపుతామని ఫోన్లో బెదరిస్తున్నట్టు శుక్రవారం షబ్బీర్‌అలీ జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
ప్రధాని పేరుతో మ్యూజిక్ కంపెనీకి బెదిరింపు కాల్స్
న్యూఢిల్లీ: ప్రధాని పేరుతో ఒక మ్యూజిక్ కంపెనీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఢిల్లీలోని గ్రేటర్ కైలాస్-2 ప్రాంతానికి చెందిన సూపర్ కేసెట్స్ ఇండస్ట్రీస్ యజమాని వేదప్రకాశ్ చనానా ఈ మేరకు ఫిర్యాదు చేసినట్లు ఢిల్లీ క్రైంబ్రాంచి పోలీసులు బుధవారం చెప్పారు. ప్రధాని మన్మోహన్‌తో పాటు బీజేపీ నేత శతృఘ్న సిన్హా, ఆర్జేడీ అధినేత లాలూ తదితరుల పేరుతో కూడా తమ సిబ్బందికి కాల్స్ వచ్చాయని వేదప్రకాశ్ తన ఫిర్యాదులో తెలిపారు. సూపర్ కేసెట్స్ కంపెనీకి లయాజన్ కన్సల్టంట్గా పనిచేస్తున్న కిషన్ కుమార్ అనే వ్యక్తికి చెందిన బిల్లులను క్లియర్ చేయకుంటే కంపెనీని మూయించేయడంతోపాటు, కంపెనీ సిబ్బందిని హతమారుస్తామని బెదిరించినట్లు వేదప్రకాశ్ ఆరోపించారు.