
సాక్షి, నిజామాబాద్ : కామారెడ్డి ఆర్డీఓ రాజేంద్ర కుమార్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ అందింది. పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వకపోతే అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డికి పట్టిన గతే తనకు పడుతుందని హెచ్చరించారు. దీంతో కంగారుపడ్డ ఆర్డీఓ పోలీసులకు ఫిర్యాదు చేయగా..రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశంపై విచారణ చేపట్టారు. ఒక ఏఆర్ కానిస్టేబుల్ కాల్ చేసినట్లు గుర్తించిన పోలీసులు విషయాన్ని ఎవరికి తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నారు. అయితే ఈ అంశంపై ఇంకా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment