సాక్షి,ముంబై: కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ దోషిగా ఖరారు కావడంతో ఆ ప్రభావం మందనా రిటైల్‌పై భారీగా పడింది. ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ జోధ్పూర్ కోర్టు వెలువరించడంతో మంధనా రీటైల్ భారీగా నష్టపోయింది. సల్మాన్ బ్రాండ్ ఎంబాసిడర్‌గా వ్యవహరిస్తున‍్న నేపథ్యంలోఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు మొగ్గుచూపారు. దాదాపు 15 శాతం నష్టాలతో ముగిసింది. ఇదే బాటలో బీయింగ్ హ్యూమన్ (మంధనా ఇండస్ట్రీస్) షేర్ కూడా నిలిచింది. ముఖ్యంగా ఇవాల్టి బుల్ మార్కెట్‌లో దాదాపు అన్ని సెక్టార్లు లాభాలను గడించగా ఈ షేర్లు నెగిటివ్‌గా ట్రేడ్ అయ్యాయి. అయితే దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో దాదాపు 600పాయింట్లు పుంజుకోగా..చివర్లో ఈరెండు షేర్లు కోలుకున్నాయి.
ఉదయం లాభాలతో ప్రారంభమైన మంధనా రిటైల్ వెంచర్ షేర్లులో ఒక్కసారిగా అమ్మకాల సెగ రేగింది. ఇంట్రాడేలో రూ.136 స్థాయి నుంచి ఈ స్టాక్ రూ. 115 స్థాయికి దిగొచ్చింది. ఏకంగా 15 శాతం నష్టపోయింది. సల్మాన్‌కు చెందిన ఛారిటబుల్ సంస్థ బీయింగ్ హ్యూమన్‌తో మంధనా ఒప్పందం కుదుర్చుకున్నసంగతి తెలిసిందే. 2012 నుంచి మంధానా రిటైల్ వెంచర్స్‌తో బీయింగ్ హ్యూమన్ ఒప్పందాన్ని కొనసాగిస్తోంది. 15 దేశాల్లో 600 పాయింట్ ఆఫ్ సేల్ స్టోర్స్ ఈ సంస్థకు ఉన్నాయి. మరోవైపు డిసెంబర్ 31వ తేదీ వరకూ ఉన్న వివరాల ప్రకారం ఈ కంపెనీలో ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలాకు 12.74 శాతం వాటా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment