mandhana
-
శ్రీలంకపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
పల్లెకెలె వేదికగా శ్రీలంక మహిళలతో జరిగిన రెండో వన్డేలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక సరిగ్గా 50 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో రేణుక సింగ్ నాలుగు వికెట్లతో అదరగొట్టగా.. మేఘనా సింగ్,దీప్తి శర్మలు చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో కాంచన 47 పరుగలతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 25.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా చేధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన(94),షఫాలీ వర్మ (71) పరుగులతో చెలరేగారు. ఇక ఇరు జట్లు మధ్య అఖరి వన్డే గురువారం జరగనుంది. చదవండి: Rishabh Pant: టెస్టుల్లో పంత్ అరుదైన రికార్డు.. 49 ఏళ్ల తర్వాత..! -
కెప్టెన్లుగా స్మృతి, హర్మన్‌ప్రీత్
న్యూఢిల్లీ: మహిళా క్రికెటర్ల కోసం ఈనెల 22న ప్రత్యేకంగా నిర్వహించే ఏకైక టి20 చాలెంజ్ మ్యాచ్‌లో పాల్గొనే రెండు జట్లకు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహిస్తారు. ముంబైలో ఈనెల 22న జరిగే ఐపీఎల్ తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌కు ముందు ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ‘ఈ మ్యాచ్‌లో పాల్గొనేందుకు ఆయా జట్ల క్రికెట్ బోర్డులతో సంప్రదింపులు చేశాం. న్యూజిలాండ్ కెప్టెన్ సుజీ బేట్స్, సోఫీ డివైన్, ఆసీస్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ, వికెట్ కీపర్ అలీసా హీలీ, మెగాన్ షుట్, బెథ్ మూనీ, ఇంగ్లండ్ అమ్మాయిలు వ్యాట్, హేజెల్ ఈ మ్యాచ్‌లో ఆడేందుకు సిద్ధమని తెలిపారు’ అని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా వివరించారు. గతేడాది భారత జట్టు వన్డే వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన తర్వాత... మహిళల క్రికెట్‌కు మరింత ప్రాచుర్యం కల్పించే చర్యల్లో భాగంగా ఐపీఎల్ తరహాలో మహిళా క్రికెటర్లకు ఓ లీగ్ నిర్వహించాలని పలువురు బీసీసీఐని కోరారు. ఫలితంగా ఈ ఐపీఎల్లో భారత్‌తోపాటు అంతర్జాతీయ మహిళా క్రికెటర్ల మధ్య ప్రయోగాత్మకంగా మ్యాచ్ నిర్వహించాలని ఐపీఎల్ కౌన్సిల్ నిర్ణయించింది. -
భారత్‌ను గెలిపించిన పూనమ్, ఏక్తా
నాగ్‌పూర్: గత ఏడాది ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఓటమికి భారత మహిళల జట్టు బదులు తీర్చుకుంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 49.3 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. పూనమ్ (4/30), ఏక్తా (3/49) ఇంగ్లండ్‌ను దెబ్బతీశారు. అనంతరం భారత్ 49.1 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ స్మృతి మంధాన (86; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. 190/9తో ఓటమి అంచుల్లో ఉన్న భారత్‌ను ఏక్తా బిష్త్ (12 నాటౌట్), పూనమ్ యాదవ్ (7 నాటౌట్) గట్టెక్కించారు. మిథాలీ రికార్డు: ఈ మ్యాచ్‌తో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డేలు (192) ఆడిన క్రీడాకారిణిగా ఘనత సాధించింది. ఈ రికార్డు గతంలో ఇంగ్లండ్‌కు చెందిన చార్లోటి ఎడ్వర్ట్స్ (191) పేరిట ఉంది. -
మంధనాకు సల్మాన్ షాక్
సాక్షి,ముంబై: కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ దోషిగా ఖరారు కావడంతో ఆ ప్రభావం మందనా రిటైల్‌పై భారీగా పడింది. ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ జోధ్‌పూర్ కోర్టు వెలువరించడంతో మంధనా రీటైల్ భారీగా నష్టపోయింది. సల్మాన్ బ్రాండ్ ఎంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న నేపథ్యంలోఈ కౌంటర్లో ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు మొగ్గుచూపారు. దాదాపు 15 శాతం నష్టాలతో ముగిసింది. ఇదే బాటలో బీయింగ్ హ్యూమన్ (మంధనా ఇండస్ట్రీస్) షేర్ కూడా నిలిచింది. ముఖ్యంగా ఇవాల్టి బుల్ మార్కెట్లో దాదాపు అన్ని సెక్టార్లు లాభాలను గడించగా ఈ షేర్లు నెగిటివ్‌గా ట్రేడ్ అయ్యాయి. అయితే దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో దాదాపు 600పాయింట్లు పుంజుకోగా..చివర్లో ఈరెండు షేర్లు కోలుకున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మంధనా రిటైల్ వెంచర్ షేర్లులో ఒక్కసారిగా అమ్మకాల సెగ రేగింది. ఇంట్రాడేలో రూ.136 స్థాయి నుంచి ఈ స్టాక్ రూ. 115 స్థాయికి దిగొచ్చింది. ఏకంగా 15 శాతం నష్టపోయింది. సల్మాన్‌కు చెందిన ఛారిటబుల్ సంస్థ బీయింగ్ హ్యూమన్తో మంధనా ఒప్పందం కుదుర్చుకున్నసంగతి తెలిసిందే. 2012 నుంచి మంధానా రిటైల్ వెంచర్స్‌తో బీయింగ్ హ్యూమన్ ఒప్పందాన్ని కొనసాగిస్తోంది. 15 దేశాల్లో 600 పాయింట్ ఆఫ్ సేల్ స్టోర్స్ ఈ సంస్థకు ఉన్నాయి. మరోవైపు డిసెంబర్ 31వ తేదీ వరకూ ఉన్న వివరాల ప్రకారం ఈ కంపెనీలో ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలాకు 12.74 శాతం వాటా ఉంది. -
సఫారీలపై భారత్ ఘనవిజయం
ఈస్ట్ లండన్: దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు ట్వంటీ20 సిరీస్‌లోనూ తమ సత్తా చాటుతోంది. శుక్రవారం జరిగిన రెండో టీ20లోనూ సఫారీలపై హర్మన్ ప్రీత్ కౌర్ సేన 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈస్ట్ లండన్‌లో బఫెలో పార్క్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓపెనర్లు స్మృతీ మంధాన(57), మిథాలీ రాజ్ (76 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ విజయం నల్లేరు మీద నడకగా మారింది. రెండో టీ20 విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో 2-0తో భారత్ ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్ సేన నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. లూస్ (32 బంతుల్లో 33), డే క్లెర్క్ (28 బంతుల్లో 26) మాత్రమే రాణించడంతో సఫారీ మహిళల జట్టు ఓ మోస్తరు స్కోరు చేసింది. కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్(15) నిరాశ పరిచింది. చివర్లో ట్రయాన్ (11 బంతుల్లో 15), ఇస్మాయిల్ (9 బంతుల్లో 16) వేగం పెంచడంతో సఫారీ టీమ్ 142 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పూనం యాదవ్, పాటిల్ చెరో 2 వికెట్లు తీశారు. శిఖా పాండే, వస్త్రాకర్ లకు చెరో వికెట్ దక్కింది. 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మహిళా ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. స్మృతీ మంధాన (42 బంతుల్లో 57: 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫె సెంచరీ అనంతరం జట్టు స్కోరు 106 వద్ద తొలి వికెట్‌గా నిష్క్రమించింది. ఆపై మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ (61 బంతుల్లో 76: 8 ఫోర్లు) అజేయ భారీ అర్ధశతకం చేసి, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (7 నాటౌట్)తో కలిసి మరో ఐదు బంతులుండగానే జట్టును విజయతీర్చాలకు చేర్చింది. సిరీస్‌లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ చేసిన మిథాలీకి టి20ల్లో ఇది 12వ అర్ధసెంచరీ. తొలి టీ20లోనూ మిథాలీ రాజ్ (54 నాటౌట్) అజేయంగా నిలవడంతో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. -
కన్నీరు పెట్టుకున్న క్రికెటర్!
బ్రిస్టల్: ఇటీవల ప్రపంచ క్రికెట్ ను బాగా ఆకర్షించిన మహిళా క్రికెటర్ స్మృతీ మంధన. భారత్ కు చెందిన మంధన కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. తన ఆటతో పాటు అందంతో కూడా మంధన క్రికెట్ ప్రేమికుల్ని బాగా ఆకట్టుకుంది. ప్రధానంగా మహిళల వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లండ్ తో మ్యాచ్ లో 90 పరుగులు, వెస్టిండీస్ తో మ్యాచ్ లో సెంచరీ చేసిన మంధన ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది. అయితే ఈ రెండు మ్యాచ్ లు తరువాత చూస్తే వరుసగా జరిగిన నాలుగు మ్యాచ్ ల్లో మంధన ఘోరంగా వైఫల్యం చెందింది. కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితమై అభిమానుల్ని నిరాశపరిచింది. కాగా, మూడు రోజుల క్రిత ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా మూడు పరుగులు మాత్రమే చేసిన మంధన ఏడ్చేసింది. తాను అవుటైన తరువాత డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిన మంధన కన్నీరు పెట్టుకుందట. ప్రస్తుతం మంధన కన్నీరు కారుస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటివరకూ మంధన ఆటను ఆస్వాదించిన అభిమానులు..ఆమె కన్నీరు పెట్టుకోవడంపై తెగబాధపడిపోతున్నారు. 'మంధన నీ ముఖంపై కన్నీరు వద్దు.. నీకు చిరునవ్వే ముద్దు'అని ఒక అభిమాని ట్వీట్ చేశారు. Heartbroken Can't watch Tears in her eyes. It's just a game. We all want you to smile @mandhana_smriti #WWC17 pic.twitter.com/HEw4SybO3W — Mayanti Langer (@Langer_Mayanti) 12 July 2017