Case adjourned
-
Hyderabad: రాజాసింగ్‌కు షాక్..కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్ షాక్ తగిలింది. నగరంలోని కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్లో రాజాసింగ్‌పై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. మత విశ్వాసాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఐపీసీలోని 295ఏ సెక్షన్ కింద కేసు ఫైల్ చేసినట్టు వెల్లడించారు. ఇది కూడా చదవండి: బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్‌రావుపై కేసు నమోదు -
అంతా అబద్ధం.. అసలు నాకు మగతనం లేదు
నల్లగొండ: ‘అంతా అబద్ధం సార్.. హాజీపూర్‌లో జరిగిన హత్యలకు, నాకు ఎలాంటి సం బంధమూ లేదు. పోలీసులే నన్ను ఇరి కించా రు. ఆ హత్యలకు సంబంధించి సాక్ష్యాలన్నీ అబద్ధమే. మృతుల దుస్తులపై ఉన్న వీర్యకణాలకు నాకు సంబంధం లేదు. పోలీసులు సిరంజి ద్వారా నాదగ్గర నుంచి వీర్యం తీసుకెళ్లారు. నాకు ఆండ్రాయిడ్ ఫోనే లేదు. బూతు బొమ్మలు చూశాననడం అబద్ధం’అంటూ హాజీపూర్ వరుస హత్యల కేసు నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి.. జడ్జి ఎదుట చెప్పాడు. యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో జరిగిన శ్రావణి, కల్పన, మనీషాల అత్యాచారం, హత్యలపై శుక్రవారం నల్లగొండ జిల్లా ఫస్ట్ అడిషనల్ సెషన్ కోర్టులో న్యాయమూర్తి వి.విశ్వనాథరెడ్డి విచారణ నిర్వహించారు. 6 గంటల పాటు విచారణ సాగింది. ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాది చంద్రశేఖర్, నిందితుడి తరఫున న్యాయవాది ఎస్.ఆర్. ఠాగూర్‌లు హాజరయ్యారు. కాగా ఇదివరకే మనీషా హత్యకు సంబంధించి సాక్ష్యాలపై విచారణ జరిగింది. శుక్రవారం శ్రావణి, కల్పనలకు సంబంధించి 72 మంది సాక్షులు చెప్పిన వాంగ్మూలాలను న్యాయమూర్తి ఒక్కొక్కటి చదివి నిందితుడికి విని పించారు. అతనినుంచి ఒక్కో దానిపై సమాధానం తీసుకొని రికార్డు చేశారు. ‘సాక్షులు అందరూ శ్రీనివాస్‌రెడ్డే నిందితుడని సాక్ష్యం చెప్పారు. దీనిపై ఏమి చెబుతావు’అని న్యాయమూర్తి అడగగా ‘నాకూ ఆ హత్యలకు సంబంధంలేదు. కావాలనే నన్ను ఇరికించారు’అంటూ సమాధానం చెప్పాడు. నీ తరఫున సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని అడగ్గా, ‘మా అమ్మానాన్నలను పిలిపించండి’అంటూ సమాధానం చెప్పాడు. వారు ఎక్కడున్నారని అడగ్గా, వారి అడ్రెస్ కూడా తెలియదని తెలిపాడు. ‘నువ్వు ఇంతకుముందు పనిచేసిన వారి అడ్రస్ ఇవ్వు.. పిలిపిస్తాము’అని న్యాయమూర్తి అడగ్గా వారి అడ్రస్ కూడా లేదని చెప్పాడు. దీంతో న్యాయమూర్తి.. నువ్వు పని చేశానని చెప్పావు, పనిచేసే చోట అడ్రస్ తెలియకుండానే పనిచేశావా అని అడగ్గా, ‘తెలియదు, మా అమ్మానాన్ననే పిలిపించాలి ’అంటూ న్యాయమూర్తికి విన్నవించుకున్నాడు . వాదనలు విన్న న్యాయమూర్తి కేసు విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేశారు. అసలు నాకు మగతనం లేదు.. ‘నాలుగు సంవత్సరాల క్రితం కల్పన అనే అమ్మాయిని కూడా అత్యాచారం, హత్య చేసి బస్తాలో మూటకట్టి అదే మర్రిబావిలో పాతిపెట్టావు, అది కూడా అందరి ముందు నేనే పాతిపెట్టానని ఒప్పుకున్నావు’కదా అని న్యాయమూర్తి అడగ్గా ‘అంతా అబద్ధం.. నన్ను పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. బావి వద్దకు తీసుకెళ్లలేదు’అని నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి సమాధానం చెప్పాడు. ‘మృతుల బట్టలపై ఉన్న వీర్యం నీదేనని పరీక్షలో తేలింది. నువ్వే అత్యాచారం చేశావు’అన్నప్పుడు ‘నాకు మగతనం లేదు’అంటూ సమాధానం చెప్పాడు. వైద్యులు నువ్వు ఫిట్‌గానే ఉన్నావని ‘నువ్వు పని చేసే చోట ఒక వేశ్యని తీసుకొచ్చి చంపి నీటి ట్యాంక్‌లో వేశావని, అప్పట్లో నిన్ను కర్నూల్లో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేశారు కదా’అని అడగ్గా అది కూడా అబద్ధమేనని నిందితుడు సమాధానం చెప్పాడు. మర్రిబావి సమీపంలో ఓ చెట్టు దగ్గర ఉన్న బీరు సీసాలను ఫింగర్‌ప్రింట్స్ నిపుణులు పరీక్షలు చేస్తే ల్యాబ్‌లో నీ వేలిముద్రలేనని తేలిందని, దానికి నీ సమాధానం.. అంటూ జడ్జి అడగ్గా పోలీసులు బలవంతంగా బీరు సీసాను పట్టించారని చెప్పాడు. ‘నీకు నాలుగైదు ఫోన్ నంబర్లు ఉన్నాయి, నీ ఫోన్ లో చనిపోయిన శ్రావణి, కల్పన, మనీషాల ఫొటోలు ఉన్నాయి. నీఫోన్ సీజ్ చేసి డేటాను పరిశీలించగా నువ్వు బూతు బొమ్మలు చూసేవాడివని తేలింది, దానికి నీ సమాధానం ఏమిటి’అని అడగ్గా నిందితుడు ‘నాకు చిన్న ఫోన్ ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లేదు.’అని చెప్పాడు. భూమి అమ్మలేదని కేసు పెట్టారు.. పోలీసులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన 101 మంది సాక్ష్యాల విషయంలోనూ నిందితుడు.. అంతా అబద్ధం, పోలీసులు కావాలని చేశారని సమాధానం చెప్పాడు. , నీ మీద కేసు ఎందుకు పెట్టినట్లు’.. అని అడగ్గా ‘మా భూమి అమ్మలేదని కొందరు చేశారు. కావాలనే ఇరికించారు’అని చెప్పడం గమనార్హం. -
జస్టిస్ లోయా మృతిపై విచారణ వాయిదా
-
జస్టిస్ లోయా మృతిపై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : జస్టిస్ లోయా మృతికి దారితీసిన పరిస్థితులు అందరికీ తెలియాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. లోయా మృతి కేసుకు సంబంధించి విచారణ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం సీల్డ్ కవర్లో సుప్రీం కోర్టుకు డాక్యుమెంట్లను సమర్పించింది. వచ్చే వారానికి కేసును వాయిదా వేసిన కోర్టు పిటిషనర్లకు వివరాలు అందచేయాలని సూచించింది. ఈ కేసులో పూర్తి పారదర్శకత పాటించాలని ఆదేశించింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు. ముంబయికి చెందిన జర్నలిస్ట్ బీఆర్ లోన్, సామాజిక కార్యకర్త తెహసీన్ పూనావాల జస్టిస్ లోయా మృతిపై నిష్పక్షపాత విచారణ చేపట్టాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ చీఫ్ అమిత్ షా నిందితుడిగా ఉన్న సోహ్రబుద్దీన్ షేక్ బూటకపు ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న జస్టిస్ లోయా 2014, డిసెంబర్ 1న గుండెపోటుతో మరణించారు. కాగా సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు నుంచి అమిత్ షాను కోర్టు నిర్ధోషిగా నిర్ధారించింది. జస్టిస్ లోయా మృతిపై విచారణ చేపట్టాలని న్యాయవ్యవస్థ సహా రాజకీయ పార్టీల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. -
కోడి పందాలకు అనుకూల ప్రకటనలా?
హైదరాబాద్: చట్టాన్ని అమలు చేస్తారా లేదా అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. ఏపీలో సంక్రాంతి సందర్భంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలను అడ్డుకోవాలన్న పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోడి పందేలకు మంత్రులు అనుకూల ప్రకటనలు చేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటి నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పశ్చిమ గోదావరిజిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
సల్మాన్ కేసు తీర్పు.. మార్చి 3కు వాయిదా!
-
సల్మాన్ అక్రమ ఆయుధ కేసులో తుదితీర్పు వాయిదా
జోధ్‌పూర్ : అక్రమ ఆయుధం కలిగి ఉన్నారన్న కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌పై తీర్పును జోధ్‌పూర్ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసు తీర్పును న్యాయస్థానం మార్చి 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు బుధవారం పేర్కొంది. కాగా ఈ కేసు విచారణ నిమిత్తం వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని సల్మాన్ తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. 1998లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా నిర్మాణ సమయంలో సల్మాన్ ఖాన్, సోనాలి బెంద్రె, టబు, నీలమ్ తదితరులు రక్షిత జంతువైన కృష్ణజింకను వేటాడారంటూ అప్పట్లో కేసు నమోదైంది. కృష్ణ జింకల వేటతో పాటు అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నారంటూ సల్మాన్‌ఖాన్‌పై రెండు వేర్వేలు కేసులు నమోదైయ్యాయి. ఈ రెండు కేసుల్లో ఒక దాంట్లో సంవత్సరం, మరో కేసులో ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. -
‘ఏపీఏటీ’పై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్(ఏపీఏటీ) న్యాయ పరిధిపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై వాదనలు బుధవారం ముగిశాయి. అనంతరం తీర్పునువాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగుల వివాదాలను విచారించే న్యాయ పరిధి ఏపీఏటీకి లేదంటూ ఆర్అండ్బీ సూపరింటెండెంట్ ఇంజనీర్ బి.లక్ష్మయ్య, మరొకరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు ఏపీఏటీని యథాతథం గా కొనసాగించేలా ఆదేశాలివ్వాలంటూ న్యాయవాది పి.వి.కృష్ణయ్య ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనల అనంతరం తీర్పును ధర్మాసనం వాయిదా వేసింది.