సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్(ఏపీఏటీ) న్యాయ పరిధిపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై వాదనలు బుధవారం ముగిశాయి. అనంతరం తీర్పునువాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ప్రకటించింది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగుల వివాదాలను విచారించే న్యాయ పరిధి ఏపీఏటీకి లేదంటూ ఆర్‌అండ్‌బీ సూపరింటెండెంట్ ఇంజనీర్ బి.లక్ష్మయ్య, మరొకరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు ఏపీఏటీని యథాతథం గా కొనసాగించేలా ఆదేశాలివ్వాలంటూ న్యాయవాది పి.వి.కృష్ణయ్య ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనల అనంతరం తీర్పును ధర్మాసనం వాయిదా వేసింది.