హైదరాబాద్: చట్టాన్ని అమలు చేస్తారా లేదా అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. ఏపీలో సంక్రాంతి సందర్భంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలను అడ్డుకోవాలన్న పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోడి పందేలకు మంత్రులు అనుకూల ప్రకటనలు చేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటి నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పశ్చిమ గోదావరిజిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment