ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ : ఏపీ సర్కార్‌కు సోమవారం హైకోర్టు అల్టిమేటం జారీ చేసింది. రైతు కూలీలకు పునరావసం కల్పించే విషయంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..600 ప్రాంతాల్లో భూసేకరణ విషయంలో 448 చోట్ల రైతుకూలీలు లేరన్న ఏపీ సర్కార్ వాదనలను తప్పుపట్టింది. డోర్ టూ డోర్ సర్వే నిర్వహించారా అని ప్రభుత్వానికి సూటిగా ప్రశ్న వేసింది. హైకోర్ట్ సూక్ష్మ పరిశీలన చేస్తుందని ప్రభుత్వానికి తెలిపింది.
వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వానికి కోర్టు ఒక్క అవకాశమిచ్చింది. బుధవారం సమగ్ర వివరాలతో రావాలని ఆదేశింది. పూర్తి నిజాలు లేని పక్షంలో రాష్ట్రమంతటా భూసేకరణపై స్టే విధిస్తామని హెచ్చరికలు చేసింది. ఏపీ వ్యవసాయ కార్మికుల సంఘం నాయకులు భూసేకరణ ద్వారా ఉపాధి కోల్పోయిన వారికి పునరావాసం కల్పించాలని హైకోర్టును గతంలో ఆశ్రయించిన సంగతి తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment