జైలు శిక్ష పడిన ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు
జోధ్‌పూర్ : మైనర్ బాలిక రేప్ కేసులో తనను తాను దైవదూతగా, ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకునే ఆశారాం బాపు అరెస్ట్ అయిన ఐదు సంవత్సరాల తర్వాత కోర్టు ఆయనకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించిన తీర్పు ఈ రోజు జోధ్‌పూర్ జైలులో న్యాయమూర్తి వెలువరించారు. తీర్పు సందర్భంగా రాజస్తాన్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్‌లో ఆయన అనుచరులు ఎలాంటి గొడవ చేయకుండా ముందస్తుగా భద్రత కట్టుదిట్టం చేశారు.
ఈ కేసుకు సంబంధించిన పది నిజాలు
1. ప్రపంచ వ్యాప్తంగా ఆశారాం బాపుకు సుమారు నాలుగు వందల ఆశ్రమాలు ఉన్నాయి. ఆశారాం బాపు కుమారుడు నారాయణ్ సాయి కూడా మరో రేప్ కేసులో నిందితుడే. గుజరాత్‌లోని సూరత్‌లో 2002-04 సమయంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరిపిన కేసులో నారాయణ్ సాయి నిందితుడు.
2.ఇటీవలే సుప్రీం కోర్టు ఈ కేసుకు సంబంధించి సూరత్ ట్రయల్ కోర్టుకు ఐదు వారాల్లో కేసు తేల్చాయాలని డెడ్‌లైన్ విధించింది.
3. రేప్ కేసులో ఆశారాంకు జీవిత ఖైదుతో పాటు రూ. లక్ష జరిమానా కోర్టు విధించింది.
4. రేప్ కేసుకు సంబంధించి ఆశారాం బాపును మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం జోధ్‌పూర్‌కు తరలించారు. బెయిల్ కోసం 12 సార్లు అప్పీల్ చేసుకున్నా ప్రతీసారి బెయిల్ తిరస్కరణకు గురైంది.
5. ‘ మాకు న్యాయం దక్కింది. ఈ పోరాటంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. సరైన శిక్ష ఆశారం బాపుకు పడింది. విచారణ సమయంలో హత్యకు గురైన సాక్షులకు కూడా న్యాయం దక్కుతుందని ఆశిస్తున్నాను’ అని రేప్‌కు గురైన బాలిక తండ్రి చెప్పారు.
6. కేసు విచారణలో ఉండగా 9 మంది సాక్షులు దాడులకు గురయ్యారు. వీరిలో ముగ్గురు హత్య కాబడ్డారు.
7. ఆశారాం బాపుపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్-375తో పాటు పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి.
8.బాలిక ఒంట్లోకి దెయ్యాలు ప్రవేశించాయని, ఆమె నుంచి దెయ్యాలను ఆశారం బాపు తరిమేస్తాడని ఆశారం సహాయకులు చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు బాలికను ఆశ్రమానికి తీసుకువచ్చారు. అత్యాచారం జరిపాక ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది.
9. ఆశారాం సహాయకుల్లో ఇద్దరికి శిక్ష పడింది. మరో ఇద్దరు నిర్దోషులుగా విడుదలయ్యారు.
10. ఈ తీర్పు వెలువడగానే ఆశారాం ప్రతినిథి నీలం దూబే మాట్లాడుతూ..న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం, గౌరవం ఉందని, తీర్పుపై మా లాయర్లతో చర్చించి పైకోర్టులో అప్పీలు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment