facts
-
అప్పులపై బాబు పిచ్చి కూతలు గుట్టు రట్టు చేసిన పయ్యావుల కేశవ్
-
దావోస్.. టైమ్ పాస్? నిజం ఒప్పుకున్న టీడీపీ
-
కోర్ట్ మూవీ హీరోయిన్ మన తెలుగమ్మాయే.. ఆమె సొంతూరు ఎక్కడో తెలుసా? (ఫోటోలు )
-
మొత్తం 12 కేసులు.. పక్కా ప్లాన్ తోనే అరెస్ట్ !
-
అందం అసూయపడుతుందని ఇలా మార్చేశారా?.. ఈమె ఎవరో గుర్తుపట్టారా? (ఫోటోలు)
-
కాల్ సెంటర్ జాబ్.. సల్మాన్ ఖాన్ సినిమాతో ఎంట్రీ.. చివరికీ వెంకటేశ్ హీరోయిన్‌తో!
-
వయసు చెప్పి టాలీవుడ్‌ని షేక్ చేసిన ఈ ‘స్పెషల్’ బ్యూటీ గుర్తుందా? (ఫోటోలు)
-
విమాన ప్రమాదాలు సంచలన నిజాలు
-
హీరోయిన్గా చేయమని నయనతార సలహా ఇచ్చిందన్న ధన్య బాలకృష్ణ (ఫోటోలు)
-
ఏడాదికి రూ.50 లక్షల సంపాదన.. ఆ ఒక్క పని వల్ల కెరీర్ ఖేల్‌కతం! (ఫోటోలు)
-
చిరంజీవితో తొలి సినిమా.. సుకుమార్ బర్త్‌డే విశేషాలు (ఫోటోలు)
-
పెళ్లై 20ఏళ్లు.. పిల్లలు ఎందుకు లేరంటే.. (ఫోటోలు)
-
గతేడాది విషాదం..! విడాకులైన వ్యక్తితో సోనియా పెళ్లి (ఫోటోలు)
-
పుష్ప 2: అల్లు అర్జున్‌తో స్టెప్పులేసిన బ్యూటీ.. ఎవరంటే? (ఫోటోలు)
-
జీవితంలో పెళ్లే చేసుకోనన్న హీరోయిన్.. కీర్తి సురేశ్ గురించి ఏమందంటే? (ఫోటోలు)
-
మెగా కోడలు లావణ్య త్రిపాఠి బర్త్ డే.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? (ఫొటోలు)
-
ఒక్క పాటతో స్టార్డమ్.. కొన్నాళ్లకు ప్రమాదకర క్యాన్సర్.. ఇప్పుడేమో! (ఫొటోలు)
-
సింగర్‌గా సీఎం భార్య.. భర్త కంటే ఎక్కువ సంపాదన.. ఆమె ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
Roshni Nadar: దిగ్గజ ఐటీ కంపెనీ వారసురాలు.. మోస్ట్ పవర్ఫుల్ మహిళ! (ఫొటోలు)
-
పుష్ప 2లో అరగుండు నటుడు.. అతని రెమ్యునరేషన్ అన్ని కోట్లా? (ఫోటోలు)
-
25 ఏళ్లకే పెళ్లి.. 20 ఏళ్లకే విడాకులు.. మరదలి బాయ్‌ప్రెండ్‌తో హీరోయిన్ డేటింగ్! (ఫొటోలు)
-
ఆరో తరగతి ఫెయిలైన అమ్మాయికి ‘ఐఏఎస్’ కలలు ఉంటాయా? (ఫొటోలు)
-
మూడేళ్ళ గ్యాప్ తర్వాత రీఎంట్రీ.. టాలీవుడ్ దూసుకెళ్తున్న ‘శనివారం’ బ్యూటీ (ఫొటోలు)
-
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దీవి.. కానీ ఇక్కడ ఒక్కరు కూడా..?
ప్రపంచంలోని చూడచక్కని దీవుల్లో ఇదొకటి. ఈ దీవి చుట్టూ అందమైన పగడపు దిబ్బలు కనువిందు చేస్తాయి. దీవి తీరం దాటి లోపలకు వెళితే, పచ్చని చెట్లు, రకరకాల అరుదైన పక్షులు ఆహ్లాదం కలిగిస్తాయి. ఇక్కడ ఎలాంటి కట్టడాలూ కనిపించవు. పసిఫిక్ సముద్రంలో ఉన్న ఈ దీవి పేరు ‘పామీరా’ దీవి.ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దీవి. అయితే, ఇది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో లేదు. ప్రస్తుతం ఇది అమెరికా అధీనంలో ఉంది. ఈ దీవి గురించి న్యాయపోరాటాలు కూడా జరిగాయి. చివరకు అమెరికా ప్రభుత్వం 2000 సంవత్సరంలో 27.26 మిలియన్ డాలర్లు (రూ.228.49 కోట్లు) చెల్లించి దీనిని సొంతం చేసుకుంది.ఈ దీవి అమెరికా ప్రభుత్వం అధీనంలోకి వచ్చినా, ఇక్కడ మనుషులెవరూ ఉండరు. దీనికి గల చీకటి చరిత్రే అందుకు కారణం. ఈ దీవి అందానికి ముగ్ధులైన కొందరు ఔత్సాహికులు ఇదివరకు అప్పుడప్పుడూ వచ్చేవారు. వారిలో కొందరు అంతుచిక్కని కారణాలతో మరణించారు. మరికొందరు ఎలాంటి ఆచూకీ లేకుండా గల్లంతైపోయారు. అందువల్ల ఈ దీవి ఎంత అందంగా ఉన్నా, ఇక్కడి వాతావరణం ఎంత ఆహ్లాదభరితంగా ఉన్నా ఇక్కడ అడుగుపెట్టాలంటేనే జనాలు భయంతో వణికిపోతారు. అయితే, అప్పుడప్పుడు కొందరు శాస్త్రవేత్తలు బృందాలుగా ఇక్కడకు వచ్చి, పరిశోధనలు జరిపి వెళుతుంటారు. వారు కూడా ఇక్కడ రాత్రివేళల్లో బస చేయరు.ఇది కిరీటం కాదు.. లైటర్!చూడటానికి కిరీటం పైభాగంలా కనిపిస్తోంది గాని, నిజానికి ఇది సిగార్ లైటర్. ఇందులో విశేషమేంటనేగా మీ అనుమానం? ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సిగార్ లైటర్. మిగిలిన లైటర్ల మాదిరిగా ఇదేమీ తేలికపాటి లైటర్ కాదు. దీని బరువు దాదాపు అరకిలో ఉంటుంది. దీని తయారీకి 400 గ్రాముల మేలిమి బంగారం, 41 కేరట్ల బరువు గల 152 అరుదైన నీలాలను ఉపయోగించారు.ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ ‘ఎస్.టి.డ్యూపాంట్’ ఈ సిగార్ లైటర్‌ను ‘లూయీ గీఐఐఐ ఫ్లర్ డి పార్మ్’ పేరుతో హాంకాంగ్ వ్యాపారవేత్త స్టీఫెన్ హంగ్ ఆర్డర్‌పై 2013లో ప్రత్యేకంగా తయారు చేసింది. దీని తయారీ కోసం ఎనబై మంది నిపుణులైన స్వర్ణకారులు ఆరునెలల పాటు అహర్నిశలు శ్రమించారు. దీని ధర 5 లక్షల డాలర్లు (సుమారు రూ.4.19 కోట్లు).అయితే, షోకేసులో అలంకరించుకోవడానికే తప్ప తేలికగా వాడుకోవడానికి అనువుగా లేకపోవడం దీని లోపం. అందుకే, ఇదే కంపెనీ వాడుకోవడానికి అనువుగా ఉండే పరిమాణంలో ఇదే నమూనాలో నీలాలు పొదిగిన బంగారంతో తయారు చేసిన చిన్న లైటర్లను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ఖరీదు ఒక్కొక్కటి 15,900 డాలర్లు (రూ.13.33 లక్షలు) -
అద్భుతమైన నటి.. బోలెడు వివాదాలు.. 'తంగలాన్' బ్యూటీ గురించి ఇవి తెలుసా? (ఫొటోలు)
-
కమలా హారిస్, ‘లవ్లీ స్టెప్ డాటర్’ ఎల్లా ఎమ్హాఫ్ గురించి తెలుసా? (ఫొటోలు)
-
ఐరన్ లెగ్ నుంచి గోల్డెన్ లెగ్ దాకా.. (ఫోటోలు)
-
అప్పుడు హీరో చెల్లెలు.. ఇప్పుడు యంగ్ హీరోయిన్.. ఎవరంటే? (ఫొటోలు)
-
వర్షాకాలంలో జాంపండు తినకూడదా? ఏమవుతుంది?
వర్షాకాలం, శీతాకాలం, వేసవి కాలం.. సీజన్ ఏదైనా కొన్ని ఆరోగ్య, ఆహార జాగ్రత్తలు తప్పని సరి. తీసుకునే ఆహారం పట్ల అవగాహన, అప్రమత్తత ఆరోగ్యానికి చాలా అవసరం. అలాగే అపోహలు, అవాస్తవాల పట్ల కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాంలో జాంపండు తినకూడదని, జలుబు చేస్తుందనే ఒక అపోహ ఉంది. మరి నిజం ఏంటో తెలుసు కుందామా..!సీజన్ ఏదైనా జామకాయను సులభంగా అందరూ తినవచ్చు. జామకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ, లైకోపీన్, కాల్షియం, మాంగనీస్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. ఇందులో కేలరీలు తక్కువ , ఫైబర్ ఎక్కువ. ఎదిగే పిల్లలనుంచి, పెద్దవాళ్ల దాకా ఎవరైనా ఈ పండు తినవచ్చు. అలాగే షుగర్ వ్యాధి గ్రస్తులుఈ పండ్లకు దూరంగా ఉండాలని కొంతమంది భావిస్తారు. జామపండు తినడానికి తియ్యగా ఉన్నప్పటికీ, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది మేలు చేస్తుంది. జామలో ఉండే పీచు రక్తంలోని చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.జామ పండులో లభించే విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు సహాయ పడుతుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేసి, శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారినుంచి కాపాడుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వర్షాకాలంలో ప్రతిరోజూ తినవచ్చు.జామకాయలో పొటాషియం, సోడియం పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. జామపండు తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ 8 శాతం పెరుగుతుంది. అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇక బరువు తగ్గడంలో కూడా జామ అద్భుతంగా పనిచేస్తుంది. క్యాలరీలు తక్కువ. ఇతర పండ్లతో పోలిస్తే జామలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కడుపు నిండుగా ఉంచుతుంది.నోట్ : అలెర్జీ ఉన్నవారు, జామ తిన్నతరువాత వికారం లేదా పొత్తికడుపులో అసౌకర్యం లాంటి లక్షణాలు కనిపించినా తినకూడదు. అలాగే తీవ్ర ఆరోగ్య సమస్యలున్నవారు ఆహారం విషయంలో వైద్యుల సలహాలను తు.చ. తప్పకుండా పాటించాలి. -
రెండో సినిమాకే రూ.100 కోట్లు.. ఎవరీ బ్యూటీ (ఫోటోలు)
-
దివాళా తీసిన ఈ కంపెనీ గుర్తుందా..? 3Gలో దీనిదే హవా!!
-
‘కలిసి ఉండలేరు..తోడులేక బతకలేరు’ : సింగర్ అల్కా ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ
ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్ బాలీవుడ్లో 90లలో ఒక సెన్సేషన్. అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రసిద్ధ గాయకులలో ఒకరిగా మెలోడీ క్వీన్‌గా సత్తా చాటుకున్నారు. మెలోడీ, పాప్ ఇలా వివిధ రకాల పాటల్లో రాణించి అభిమానుల మనసు దోచుకున్న సీనియర్-మోస్ట్ గాయని. అల్కా యాగ్నిక్ 14 ఏళ్ల వయస్సులో బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. 90ల నాటి ఆ మెలోడీ క్వీన్ 16కు పైగా భాషల్లో వేల పాటలను రికార్డ్ పాడింది.ఏడు సార్లు ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. చోళీ కే పీచే, ఏక్ దో తీన్, మేరీ మెహబూబా, తాల్ సే తాల్, దిల్ నే యే కహా హై దిల్ సే, ఓ రే చోరీ, హమ్ తుమ్, ఘూంగట్ కి ఆద్ సే, కుచ్ కుచ్ లాంటి సూపర్ డూపర్ సాంగ్స ఆమె ఖాతలో ఉన్నాయి. హోతా హై, కహో నా... ప్యార్ హై, సాన్ సాన్ సనా, కభీ అల్విదా నా కెహనా, అగర్ తుమ్ సాథ్ హో ఇలా చెప్పుకుంటూ పోతే...ఈ లిస్ట్ చాలా పెద్దది. ఇంకా టెలివిజన్ రియాలిటీ షోలు, స రే గ మ పా లిటిల్ చాంప్స్, ఇండియన్ ఐడల్, సూపర్ స్టార్ సింగర్, అనేక ఇతర వాటితో పాటు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారు. బాల్యం, ప్రేమ పెళ్లి1966 మార్చి 20, న కోల్‌కతాలో గుజరాతీ కుటుంబంలో ధర్మేంద్ర శంకర్ శుభ దంపతులకు జన్మించింది అల్కా యాగ్నిక్. తల్లి, భారతీయ శాస్త్రీయ గాయకురాలు శుభా నుంచే అల్కాకు సంగీతం అబ్బింది. ఆల్కాఆరేళ్ల వయసునుంచే ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో)లో భక్తి పాటలు, భజనలు పాడటం ప్రారంభించింది. కేవలం 14 సంవత్సరాల వయస్సులో, అల్కా యాగ్నిక్ ‘పాయల్ కి ఝంకార్’ చిత్రంలో తిర్కత్ అంగ్ పాటతో ప్రొఫెషనల్ సింగర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.రైలు ప్రయాణంలో షిల్లాంగ్‌కు చెందిన నీరజ్ కపూర్‌ని 1986లో తొలిసారి కలిసింది. ఢిల్లీలోని అల్కాను, ఆమెతల్లిని స్టేషన్లో వారిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. (నీరజ్ అల్కా తల్లి స్నేహితురాలి మేనల్లుడు) తొలిచూపులోనే ఇద్దరిలోనూ ప్రేమ పుట్టేసింది. ఆరేళ్లకు మాట కలిసింది. మొదట వీరి పెళ్లికి అల్కా ఇంట్లో ఒప్పుకోకపోయినప్పటికీ, రెండేళ్ల డేటింగ్ చేసిన తర్వాత 1989లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె సాయేషా కపూర్. ఈమె అమిత్ దేశాయ్‌ని వివాహం చేసుకుంది.అటు బాధ్యతల రీత్యా ఈ జంట ఒకరికొరు దూరంగా ఉండాల్సింది వచ్చింది.. కలిసి ఉండేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. నీరజ్ నిర్ణీత వ్యవధిలో ముంబైకి వెళ్లేవాడు, అల్కా కుటుంబంతో ప్రతీ ఏడాది షిల్లాంగ్‌లో ఒక నెల గడిపేది. అయితే, దీన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు. అల్కా యాగ్నిక్ కెరీర్ కారణంగా, ఆమె ముంబైలోనే ఉండిపోవాల్సి వచ్చేది. నీరజ్ షిల్లాంగ్‌లో వ్యాపారంలో రాణిస్తాడని అల్కా ఆశపడింది. కానీ దురదృష్టవశాత్తూ అతను వ్యాపారంలో మోసపోయాడు. నష్టాలెదుర్కొన్నాడు. మరోవైపు ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. కూతురి బాధ్యతలనుఒంటరిగానే స్వీకరించింది. దాదాపు అయిదారేళ్లు అస్సలు మాటలు కూడా లేవు. వీరు విడిపోతారని కూడా అందరూ అనుకున్నారు. కానీ మూడు దశాబ్దాలుగా వీరి ప్రేమ ప్రయాణం అసామాన్యంగా కొనసాగుతోంది.ఇద్దరి మధ్య దూరం ఎంతున్నా, ఒకరికొకరు లేకుండా జీవించలేరని ఇద్దరి మధ్య వచ్చిన ఎడబాటు ద్వారా గ్రహించారు. ఒకరి పట్ల ఒకరికి స్వచ్ఛమైన ప్రేమ, గౌరవం అలాగే ఉన్నాయని అర్థమైంది. తమది అంత ఈజీగా ఓడిపోయే ప్రేమ కాదని నిర్ధారించేసుకున్నారు. అల్కా ముంబైలో, నీరజ్ షిల్లాంగ్‌లో నివసిస్తూనే ఒకరి కలల్ని ఒకరు గౌరవించుకుంటూ, కష్టాలు, కన్నీళ్లలో ఒకరికొకరు తోడు నీడగా ఉంటూ గత 28 ఏళ్లుగా తమ జీవితాన్ని కొనసాగించారు. ఈ దంపతులే స్వయంగా చెప్పినట్టు, వీళ్లది విచిత్రమైన దాంపత్యం ‘కలిసి ఉండలేరు.. ఒకరికొకరు తోడు లేకుండా బతకలేరు’ -
రామసేతు రహస్యం పార్ట్1: రామసేతు గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు
సైన్స్‌కు, స్పిరిచ్యువాలిటీకి లంకె కుదరదు. లాజిక్కులు, ఆధారాలపై సైన్స్ ఆధారపడితే నమ్మకం పునాదిగా ఆధ్యాత్మికత వెల్లివిరిస్తుంది. ఆ విశ్వాసమే దైవం లాంటి శక్తిని, ఆ దైవత్వం ఉనికిని జీర్ణించుకుంటుంది. సైన్స్ మాత్రం ఇతిహాసాలు, పురాతాన గ్రంథాల్లో చెప్పినవాటిని ఒప్పుకోవడానికి ఇష్టపడదు. ఏది నమ్మాలన్నా సాక్ష్యాధారాలు కావాలంటుంది సైన్స్. ఐతే ఇంత అత్యాధునిక కాలంలోనూ, ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఎన్నో రహస్యాలను సైన్స్ ఛేదించలేకపోయిందని ఆధ్యాత్మిక వాదులు అంటారు. పిరమిడ్లు, బెర్ముడా ట్రయాంగిల్ నుంచి ఎన్నో మర్మాల గుట్టు ఇంకా బయటపడలేదు. వాటి విషయంలో శాస్త్రవేత్తలు, పరిశోధకుల మధ్యనే ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.ఆ కోవలోకే వస్తుందీ రామసేతు. శాస్త్ర-సాంకేతిక రంగంలో అమెరికా శాస్త్రవేత్తలకు మంచి పేరే ఉంది. అందులోనూ నాసా సైంటిస్టులంటే గురి కాస్త ఎక్కువ. ఏడేళ్ల క్రితం నాసా శాటిలైట్ కొన్ని చిత్రాలు పంపించింది. మనదేశాన్ని, శ్రీలంకను విడదీసే హిందూ మహాసముద్రం అంతర్భాగానికి సంబంధించిన ఫోటోలు అవి. భారత్, శ్రీలంక మధ్య హిందూమహాసముద్రం లోతు తక్కువ ఉన్న ప్రాంతంపై ప్రయాణిస్తున్న సమయంలో నాసా శాటిలైట్ ఒక ఆశ్చర్య కర పరిణామాన్ని గుర్తించింది. ఆ ప్రాంతంలో సముద్రంలో మునిగిపోయిన పెద్ద వస్తువుల కదలికలను ఆ ఉపగ్రహం గుర్తించింది. వెంటనే ఆ కదలికలకు సంబంధించి ఫోటోలు తీసి శాస్త్రవేత్తలకు పంపించింది.నాసా శాటిలైట్ పంపిన ఫోటోల్లో ఉన్న రాళ్లు మామూలు రాళ్లు కాదు. చాలా పెద్ద పెద్ద బండరాళ్లు అవి. దాంతో శాస్త్రవేత్తల్లో ఆసక్తి పెరిగి పోయింది. ఎందుకంటే ఆ ఫోటోల్లో ఉన్న రాళ్లు భారత్, శ్రీలంక మధ్య ఉన్న ఓ రాతివంతెనకు సంబంధించినవి. దాంతో ఇండియానా యూనివర్సిటీ నార్త్ వెస్ట్, యూనివర్సిటీ ఆప్ కొలరాడో బౌల్డర్, సదరన్ ఓరేగాన్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు, జియోలజిస్టులు రంగంలోకి దిగి పరిశోధనలు జరిపారు. ఆ పరిశీలనల్లో ఆ రాతి వంతెన 30 మైళ్ల పొడవుతో ఉన్నట్లుగా బయటపడింది. సైంటిస్టులు, జియోలజిస్టులు పరిశోధించిన రాతి వంతెన మరేదో కాదు. భారతీయ మూలాల్లో ఇమిడిపోయిన శ్రీరామసేతు అది. ఆడమ్ బ్రిడ్జ్‌గా, సేతుబంధనంగా పేర్కొనే రామవారధి నిర్మాణానికి చెందిన రాళ్లు అవి. దాంతో శాస్త్రజ్ఞుల దృష్టి ఆ రాళ్లు, వాటి కింద ఉన్న ఇసుక నిర్మాణంపై పడింది. భూగర్భశాస్త్రవేత్తలు, సముద్ర పరిశోధకులు ఇసుక, రాతి వంతెన నిర్మాణాలపై లోతుగా పరిశోధనలు జరిపారు. ఆ రీసెర్చ్‌లో విస్మయకర విషయాలు బయటపడ్డాయి. సైంటిస్టుల పరిశోధనలో ఇసుక నిర్మాణం సహజసిద్దంగా ఏర్పడినదే అని బయటపడింది. మరి రాతి వంతెన నిర్మాణం మాటేమిటి. అదే ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఇచ్చిన సమాధానమే ఇప్పుడు యావత్ ప్రపంచపు దృష్టిని మళ్లీ రామసేతుపై పడేలా చేసింది.నాసా శాటిలైట్ పంపిన చిత్రాల ఆధారంగా రాతి వంతెనపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు ఆ వంతెన సహజసిద్దంగా ఏర్పడింది కాదని తేల్చారు. అంటే ఆ స్టోన్ బ్రిడ్జ్ నిర్మాణం అకస్మాత్తుగానో, ప్రకృతి పరంగానో ఏర్పడింది కాదు. ఎవ్వరో ఆ రాళ్లను తీసుకొచ్చి ఆ ఇసుక నిర్మాణంపై పేర్చుకుంటూ పోయారన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇదే నిజమైతే ఆ రాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి..? ఎలా అక్కడికి చేరుకున్నాయి...?ఇసుక నిర్మాణం సహజసిద్ధంగా ఏర్పడిందని తేల్చిన శాస్త్రవేత్తలు రాళ్ల సంగతిని తేల్చే పనిలో పడ్డారు. జియోలజిస్టులు రంగంలోకి దిగి ఆ రాళ్లపై విస్తృతంగా పరిశోధనలు జరిపారు. ఈ రీసెర్చ్‌లో మరో విస్మయకర విషయం బయటపడింది. శాస్త్రీయ విశ్లేషణల ప్రకారం ఆ రాళ్లు 7వేల ఏళ్ల క్రితం నాటివి. కానీ ఆశ్చర్యకరంగా రాళ్లతో ఉన్న ఇసుక మాత్రం 4వేల ఏళ్ల క్రితం నాటిదే. ఇది క్రీస్తు పూర్వం ఏర్పడింది కాబట్టి ఆ లెక్కల ప్రకారం ఇసుక వయసు కంటే రాళ్ల వయసు తక్కువ. కార్బన్ డేటింగ్ప్రక్రియ ఆధారంగా రాళ్లు, ఇసుక వయసులను లెక్క కట్టిన సైంటిస్టులు రాతివంతెన నిర్మాణం సహజసిద్దంగా ఏర్పడింది కాదని తేల్చి చెప్పారు. ఆ వారధి మానవులు నిర్మించిందే అని స్పష్టం చేశారు. భారతీయ పరిశోధకుల అంచనా ప్రకారం సుమారు 5 వేల ఏళ్ల క్రితం భారత్, శ్రీలంక మధ్య ఓ వారధి నిర్మాణం జరిగింది. అప్పట్లో శ్రీరామునిగా మానవ రూపంలో అవతరించిన భగవానుడు ఆ వారధిని నిర్మించారన్నది హిందువుల విశ్వాసం. ఇప్పుడు విదేశీ సైంటిస్టులు చెబుతున్నది కూడా అదే. అంటే పరిశోధకులు చెబుతున్నదీ, పురాణాలు పేర్కొంటున్నదీ ఒక్కటే అన్నమాట. అంటే రామసేతు నిర్మాణం మానవ నిర్మిత అద్భుతమే అనుకోవాలి.హిందువుల విశ్వాసాలతో పెనవేసుకుపోయిన రామసేతు భారత్, శ్రీలంకను కలిపే వారధి. తమిళనాడులోని రామేశ్వరం దీవి సమీపంలో ఉన్న ధనుష్కోడి నుంచి శ్రీలంక సమీపంలో ఉన్న మన్నార్ద్వీపాన్ని కలుపుతూ ఈ వంతెన నిర్మాణం ఉంటుంది.ధనుష్కోడి నుంచి మన్నార్ ద్వీపం మధ్య అంతా సముద్రమే ఉన్నప్పటికీ లోతు మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ ఇప్పటికీ ఆ రాతి వంతెనకు సంబంధించిన రాళ్లు కనిపిస్తూ ఉంటాయి. స్థానిక ఆలయవర్గాల సమాచారం ప్రకారం 50 కిలో మీటర్ల పొడవైన ఈ వంతెన 15వ శతాబ్దం వరకు సముద్ర మట్టానికి పైనే ఉండేది. 1480లో సంభవించిన పెను తుపాను ధాటికి ఆ వంతెన కూలిపోయింది.ఇక రామసేతు నిర్మాణం మానవ నిర్మితమా కాదా అన్న అంశంపై చాలా వాదనలున్నాయి. ఇస్రోలోని స్పేస్ అప్లికేషన్ సెంటర్‌కు చెందిన మెరైన్ అండ్ వాటర్ రీసోర్సెస్గ్రూప్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్-ICHR, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తదితర సంస్థలతో పాటు దేశ, విదేశీ సైంటిస్టుల బృందాలు దశాబ్దాల పాటు సుదీర్ఘంగా పరిశోధననలు జరిపాయి. భారత్‌నుంచి శ్రీలంకను వేరు చేసే క్రమంలో సున్నితమైన సున్నపురాయి గుట్టలు ముక్కలు ముక్కలయ్యాయని, తర్వాత ఆ రాతి ముక్కలే వంతెనగా రూపాంతరం చెందాయని, కాబట్టి అది కృత్రిమ వంతెనే అని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు.దాదాపు 103 చిన్న చిన్న గుట్టల నిర్మాణమే ఆడమ్ బ్రిడ్జ్ అని మెరైన్ అండ్ వాటర్ రీసోర్సెస్గ్రూప్ పేర్కొంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాత్రం ఆ వంతెన లక్ష 25 వేల ఏళ్ల క్రితం నాటిదని అభిప్రాయపడింది. ఐతే రామేశ్వరం, తలైమన్నార్ మధ్య ఉన్న రాళ్ల శాంపిల్లను రేడియో కార్భన్ డేటింగ్లో పరిశోధిస్తే అవి 7 వేల నుంచి 18 వేల ఏళ్ల క్రితం నాటివని బయటపడింది. ప్రొఫెసర్ SM రామస్వామి ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ రిమోట్ సెన్సింగ్పరిశోధనలో ఆ రాళ్ల వయసు 3 వేల 5 వందల సంవత్సరాలుగా తేలింది. -
హోమ్ లోన్ కోసం చూస్తున్నారా.. తప్పకుండా ఇవి తెలుసుకోండి!
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి చాలామంది అహర్నిశలు కష్టపడుతుంటారు. సంపాదించిన డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసినా, బ్యాంకుల నుంచి వంటివి తీసుకున్నా.. అంతా ఇల్లు కోసమే. ఇల్లు కొనేందుకు లేదా కట్టుకోవడానికి బ్యాంక్స్ లోన్ మంజూరు చేస్తాయి. హోమ్ లోన్ పొందే వ్యక్తి తప్పకుండా కొన్ని అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.సిబిల్ స్కోర్ - ఒక బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే.. సదరు వ్యక్తికి తప్పకుండా మంచి సిబిల్ స్కోర్/క్రెడిట్ స్కోర్ కలిగి ఉండాలి. ఉన్న సిబిల్ స్కోరును బట్టి లోన్ ఇవ్వడం జరుగుతుంది. సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉంటే.. అలాంటి వారు సులభంగా కొంత తక్కువ వడ్డీకి లోన్ పొందవచ్చు.అవసరమైన డాక్యుమెంట్స్ - హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారు బ్యాంకులకు లేదా ఇతర ఏదైనా లోన్ ఇచ్చే సంస్థలకు కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆదాయ లేదా ఆస్తి పత్రాలు మాత్రమే కాకుండా పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ వంటివి కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగం చేసేవారైతే మూడు నెలల సాలరీ స్లిప్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.ప్రాసెసింగ్ ఫీజు - ఏ లోన్ తీసుకున్న దానికి కొంత ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు పర్సనల్ లోన్ తీసుకునే వారికి కొంత ఎక్కువగా ఉంటుంది. హోమ్ లోన్ లేదా వెహికల్ లోన్ తీసుకునే వారికి మాత్రం కొంత తక్కువగా ఉంటుంది. హోమ్ లోన్ తీసుకునేవారికి 0.5 నుంచి 1 శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. లోన్ తీసుకునే ముందే వివిధ చార్జీలు, ఫీజుల గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది.లోన్ డ్యూరేషన్ (కాల వ్యవధి) - లోన్ తీసుకునేవారు కాల వ్యవధిని కూడా నిర్ణయించుకోవాలి. ఒక వ్యక్తి అర్హతను బట్టి బ్యాంకులు గరిష్టంగా 30 సంవత్సరాల వరకు కాల వ్యవధిని అందిస్తాయి. అయితే వీలైనంత త్వరగా లోన్ పూర్తి చేసుకోవడానికి తక్కువ కాల వ్యవధిని ఎంచుకోవడం చాలా ఉత్తమం. డ్యూరేషన్ వ్యవధి ఎక్కువగా ఉంటే వడ్డీ భారం కూడా ఎక్కువగా ఉంటుంది.వడ్డీ రేటు - లోన్ తీసుకునే వ్యక్తి ప్రధానంగా వడ్డీ రేటును గురించి తెలుసుకోవాలి. ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే.. కొన్ని ప్రైవేట్ సంస్థలు భారీ వడ్డీలకు లోన్స్ అందిస్తాయి. కాబట్టి ఎక్కడైతే తక్కువ వడ్డీకి లోన్ లభిస్తుందో తెలుసుకుని లోన్ తీసుకోవడం ఉత్తమం. ఈ వడ్డీ రేటు రేపో రేటు మీద ఆధారపడి ఉంటుంది.ఈఎంఐ - లోన్ తీసుకునే వ్యక్తి.. తాను ఎంచుకునే కాల వ్యవధిని బట్టి ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. ఇది పూర్తిగా లోన్ తీసుకునే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. అంటే సంపాదన, ఖర్చులు వంటి వాటిని బేరీజు వేసుకుని ఈఎంఐ ఎంత కట్టాలనేది నిర్ణయించుకోవచ్చు. లోన్ ఈఎంఐ అనేది సంపాదనలో 45 శాతం కంటే ఎక్కువ కాకుండా ఉంటే ఉత్తమమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? తప్పకుండా ఇవి తెలుసుకోండిఇవి మాత్రమే కాకుండా హోమ్ లోన్ ప్రీ పేమెంట్, పన్ను రాయితీలు, హోమ్ లోన్ ఇన్సూరెన్స్, లోన్ డీఫాల్ట్ వంటి విషయాలను గురించి కూడా ముందుగా తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తరువాత హోమ్ లోన్ తీసుకోవాలి. బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి కదా ఎగబడి తీసుకున్నారంటే.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. -
చరిత్రలో అనేక ముఖ్యమైన సంఘటనలకు సాక్షి 'మే 31'!
మే 31వ తేదీ చారిత్రాత్మకంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజు. ప్రముఖులు పుట్టిన రోజు నుంచి ఐక్యత చిహ్నాలను స్వీకరించిన.. ఎన్నో గొప్ప ఘట్టాలకు నిలువెత్తు సాక్షి ఈ రోజు. సమానత్వాన్ని ప్రోత్సహించే చట్టాన్ని రూపొందించడం నుంచి కొత్తగా పుట్టుకొచ్చిన మ్యూజిక్ ట్యూన్ రికార్డు సృష్టించింది ఈరోజే. చరిత్రలో ఈ రోజున జరిగిన ఆసక్తికర విషయాలు ఏంటంటే..తొలి పోస్టల్ సర్వీస్(1774)ఈ రోజునే భారతదేశంలో 1774లో తన తొలి పోస్టల్ సర్వీస్ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కీలకమైన క్షణం విశాలమైన ఉపఖండాన్ని అనుసంధానించే వ్యవస్థకు పునాది వేయడమే గాక విభిన్న ప్రాంతాలలో కమ్యూనికేషన్‌ను సులభతరం చేసింది.మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ప్రారంభోత్సవం న్యూయార్క్ నగరంలోని ఒక ఐకానిక్ వేదిక మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ప్రారంభమయ్యింది ఈ రోజే. ఇది లెక్కలేనన్ని క్రీడలకు, మరుపురాని సంగీత వినోద కార్యక్రమాలను వేదికగా మారింది. భారత జాతీయ కాంగ్రెస్ జెండా స్వీకరణ (1921)భారత జాతీయ కాంగ్రెస్ జెండాను జాతీయ జెండాగా స్వీకరించింది మే 31, 1921న. ఇది స్వేచ్ఛ, ఐక్యత, చిహ్నం. పైగా వలస పాలన నుంచి విముక్తి కలిగేల స్వాతంత్ర్య పొరాటిన్ని ఉత్తేజపరిచింది. గంగమ్ స్టైల్దక్షిణ కొరియా కళాకారుడు రూపొందించిన గంగమ్ స్టైల్ ట్యూన్ యూట్యూబ్ వీడియోలో ఏకంగా రెండు బిలయన్ వ్యూస్ కలిగిన తొలి వీడియోగా మే 31న నిలిచింది. ఈ వైరల్ వీడియో సంచలన రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా ప్రపంచానికి అనేకమంది కళాకారులను పరిచయం చేసే వేదికగా సోషల్ మీడియా మారింది. దీని వల్లే దక్షిణ కొరియా పాటలు అంతర్జాతీయ ఖ్యాతీని ఆర్జించాయి కూడా. బొంబాయిలో ఎలక్ట్రిక్ ట్రామ్ ముగింపు (1964)బొంబాయి రవాణా వ్యవస్థలో ప్రధానమైన ఎలక్ట్రిక్ ట్రామ్ చివరిసారిగా మే 31, 1964న నడిచింది. ఇది ఒక శకానికి ముగింపు పలికింది. పట్టణ రవాణా సరికొత్త విధానాలకు నాంది పలికింది.రిజర్వేషన్ చట్టం రూపొందించబడింది (2010)భారతదేశంలో గుర్తింపు పొందిన ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు 25% సీట్లను రిజర్వ్ చేస్తూ మే 31, 2010న ఒక మైలురాయి చట్టం రూపొందించబడింది. ఈ చట్టం విద్యా సమానత్వాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది.క్లింట్ ఈస్ట్‌వుడ్ పుట్టినరోజు (1930)హాలివుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు క్లింట్ ఈస్ట్‌వుడ్ 1930లో ఈ రోజునే(మే31) జన్మించాడు. పాశ్చాత్య చిత్రాలలో దిగ్గజ పాత్రలకు పేరుగాంచిన ఈస్ట్‌వుడ్ కెరీర్ అనేక దశాబ్దాలుగా చలన చిత్ర సీమలో కొనసాగింది. అతనికి అనేక అవార్డులు, ప్రశంసలు లభించాయి.ఇందిరా గాంధీ విజ్ఞప్తి (1970)బంగ్లాదేశ్‌లో అంతర్యుద్ధం శరణార్థుల సంక్షోభానికి దారితీసినందున మే 31, 1970న ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అంతర్జాతీయ సహాయాన్ని కోరారు. ఆమె విజ్ఞప్తి భయంకరమైన పరిస్థితికి అవసరమైన ప్రపంచ మద్దతును హైలైట్ చేసింది.(చదవండి: దున్నపోతు మాట దేవుడెరుగు.. పోతావుపైకి!) -
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్.. నా భర్త అడిగేవాడన్న హీరోయిన్!(ఫొటోలు)
-
నేను బతికే ఉన్నా.. ఫోటోలతో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ (ఫొటోలు)
-
సాగని సంసారం.. రొమ్ము క్యాన్సర్‌తో పోరాటం.. తెలుగులో ఒకే ఒక్క మూవీ (ఫోటోలు)
-
ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
-
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు ఉంటాయి. ప్రకృతికి మించి అద్భుతమైనది మరోకటి లేదు. దానికి మించి మనిషి తాను ఏదో కనిపెట్టాలనుకుంటే విధి చేసే మరింత విచిత్రంగా ఉంటుంది. చివరికి మనిషిని సమస్యలో పెట్టి అతడి వాళ్ల నుంచి సమస్యకు పరిష్కరం దొరికేలా చేస్తుంది విధి. అలాంటి రెండు ఆసక్తికర విషయాలు చూద్దామా..!స్టార్ఫిష్లా ఉండే పూలునక్షత్రాకారంలో ఉండే ఈ పూలను స్టార్ఫిష్ కాక్టస్ ఫ్లవర్స్ అని, స్టార్ ఫ్లవర్స్ అని అంటారు. బ్రహ్మజెముడు జాతికి చెందిన ఒక ఎడారి మొక్కకు ఈ పూలు పూస్తాయి. ఇవి అరచేతి విస్తీర్ణాన్ని మించి చాలా పెద్దగా ఉంటాయి. ఇవి ఊదా, ముదురు ఎరుపు, లేత ఎరుపు, పసుపు, గోధమ రంగుల్లో ఉంటాయి. ఈ పూలు చూడటానికి అందంగానే ఉన్నా, వీటి నుంచి వెలువడే కుళ్లిన మాంసం వాసనను భరించడమే కష్టం. కనిపెట్టిన మెషిన్ గన్తోనేఅమెరికాలో జన్మించిన బ్రిటిష్ ఆవిష్కర్త హైరమ్ స్టీవన్ మాక్సిమ్ మొట్టమొదటి ఆటోమేటిక్ మెషిన్ గన్ను రూపొందించాడు. ఆ మెషిన్ గన్‌తో టెస్ట్ ఫైరింగ్ చేస్తున్నప్పుడు వచ్చిన శబ్దానికి ఆయన బధిరుడిగా మారాడు. ఆ తర్వాత ఆయన కొడుకు హైరమ్ పెర్సీ మాక్సిమ్ సైలెన్సర్‌ను కనిపెట్టాడు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?) -
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
-
ఈ బ్యూటీని గుర్తు పట్టారా? టీమిండియా స్టార్ భార్య.. రెండుసార్లు పెళ్లి! (ఫొటోలు)
-
టాలీవుడ్లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)
-
అబ్బాయిగా ఇండస్ట్రీ ఎంట్రీ.. హీరోయిన్గా సంచనలం, ఎవరీ బ్యూటీ? (ఫొటోలు)
-
నేను గట్టిగా ప్రయత్నించి ఉంటే IPS అయ్యేదాన్ని: స్టార్ హీరోయిన్ (ఫొటోలు)
-
Gayatri Reddy Bhatia Photos: ఇప్పుడు కావ్యా మారన్ ఫేమస్.. కానీ అప్పట్లో ఈమె క్రేజ్ వేరు! గుర్తుపట్టారా?
-
అంబేద్కర్ సాధించిన అద్భుత విజయాలు
నేడు అంబేద్కర్ జయంతి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న రాజ్యంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. అంబేద్కర్‌ను భారత రాజ్యాంగ పితామహుడు అని కూడా అంటారు. అంబేద్కర్ 1891, ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో ఒక దళిత మహర్ కుటుంబంలో జన్మించారు. స్వాతంత్ర్యం తరువాత దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకెళ్లడంలో అంబేద్కర్ కీలకపాత్ర పోషించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను తెలుసుకుందాం. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బి ఆర్ అంబేద్కర్ దేశానికి తొలి న్యాయ మంత్రి అయ్యారు. తన పదవీకాలంలో సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి వివిధ చట్టాలు, సంస్కరణలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 1947 ఆగస్టు 29న రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీకి అధ్యక్షునిగా డాక్టర్ అంబేద్కర్ నియమితులయ్యారు. కొత్త రాజ్యాంగాన్ని రూపొందించే బాధ్యత ఈ కమిటీదే. నిజానికి అంబేద్కర్ ఇంటిపేరు అంబావ్డేకర్ (మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని ఆయన స్వగ్రామం ‘అంబవాడే’ పేరు నుండి వచ్చింది). అయితే అతని గురువు మహదేవ్ అంబేద్కర్ ఇంటిపేరును ‘అంబావ్డేకర్’ నుండి ‘అంబేద్కర్’గా పాఠశాల రికార్డులలో మార్చారు. అంబేద్కర్ మన దేశంలో కార్మిక చట్టాలకు సంబంధించి అనేక మార్పులు చేశారు. 1942లో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ 7వ సెషన్లో పనివేళలను 12 గంటల నుంచి 8 గంటలకు తీసుకొచ్చారు. బాబా సాహెబ్ విదేశాల్లో ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పట్టా పొందిన మొదటి భారతీయుడు. అలాగే దక్షిణాసియాలో ఎకనామిక్స్‌లో తొలి డబుల్ డాక్టరేట్ హోల్డర్ కూడా. అతని తరంలో అత్యంత విద్యావంతులైన భారతీయులలో ఒకనిగా పేరుగాంచారు. పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లు కోసం అంబేద్కర్ పోరాటం సాగించారు. వివాహం, వారసత్వ విషయాలలో మహిళలకు సమాన హక్కులు కల్పించడం ఈ బిల్లు లక్ష్యం. బిల్లు ఆమోదం పొందకపోవడంతో న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. కొలంబియా యూనివర్శిటీలో ఉన్న మూడేళ్లలో, అంబేద్కర్ ఆర్థికశాస్త్రంలో 29, చరిత్రలో 11, సోషియాలజీలో ఆరు, ఫిలాసఫీలో ఐదు, హ్యుమానిటీస్‌లో నాలుగు, పాలిటిక్స్‌లో మూడు, ఎలిమెంటరీ ఫ్రెంచ్, జర్మన్లలో ఒక్కొక్కటి చొప్పున కోర్సులు అభ్యసించారు. 1995లో అంబేద్కర్ రాసిన ‘థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్’ పుస్తకంలో ఆయన మధ్యప్రదేశ్, బీహార్లను విభజించాలని సూచించారు. ఈ పుస్తకాన్ని రాసిన దాదాపు 45 సంవత్సరాల తరువాత 2000లో ఈ ప్రాంతాల విభజన జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64 సబ్జెక్టులలో మాస్టర్. హిందీ, పాళీ, సంస్కృతం, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, పర్షియన్, గుజరాతీ తదితన తొమ్మిది భాషల్లో అంబేద్కర్‌కు పరిజ్ఞానం ఉంది. ఇంతేకాదు ఆయన సుమారు 21 సంవత్సరాల పాటు ప్రపంచంలోని అన్ని మతాలను తులనాత్మక అధ్యయనం చేశాడు. బుద్ధ భగవానుడు కళ్లు తెరిచి చూస్తున్న మొదటి చిత్రాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించారు. అంతకు ముందు బుద్ధ భగవానునికి చెందిన పలు చిత్రాలు కళ్లు మూసుకున్న తీరులో ఉండేవి. -
Sunita Kejriwal: కేజ్రీవాల్ నిజాలన్నీ వెల్లడిస్తారు!
సాక్షి, న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో నిజాలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం కోర్టులో బయటపెట్టబోతున్నట్లు ఆయన భార్య సునీత కేజ్రీవాల్ చెప్పారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈడీ ఆయన్ను అరెస్టు చేసిందంటూ ఆమె బుధవారం వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘మంగళవారం కలిసినప్పుడు నా భర్త నాతో పలు విషయాలు పంచుకున్నారు. ఆయన ఆరోగ్యం సరిగా లేదు. డయాబెటిస్తో బాధపడుతున్నారు. కస్టడీలోనూ ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. ఢిల్లీలో తాగునీటి సమస్యను నివారించాలని లేఖ ద్వారా పంపిన ఉత్తర్వులను కూడా కేంద్రం వివాదాస్పదంగా మారుస్తోంది. ఢిల్లీ నాశనం కావాలని కోరుకుంటోంది. ఈడీ అధికారులు ఇప్పటిదాకా 250 సార్లు సోదాలు నిర్వహించారు. మా నివాసంలో సోదాలు చేసి కేవలం రూ.73 వేలు స్వా«దీనం చేసుకున్నారు. ఈ కుంభకోణంలో చేతులు మారిన సొమ్ము ఇంకా దొరకలేదని ఈడీ చెబుతోంది. మద్యం కుంభకోణంలో నిజనిజాలు, ఆ డబ్బు ఎక్కడుందో గురువారం కోర్టులో బయటపెడతానని కేజ్రీవాల్ నాతో చెప్పారు. అందుకు రుజువులు కూడా సమర్పిస్తారు’’ అని వీడియో సందేశంలో సునీత స్పష్టం చేశారు. క్షీణిస్తున్న కేజ్రీవాల్ ఆరోగ్యం ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు బుధవారం ఆందోళన వ్యక్తం చేశాయి. మధుమేహ బాధితుడైన కేజ్రీవాల్ రక్తంలో చక్కెరస్థాయిల్లో హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయని వెల్లడించాయి. కేజ్రీవాల్ బ్లడ్‌షుగర్ లెవెల్ ఒక దశలో 46 ఎంజీకి పడిపోయిందని డాక్టర్లు చెప్పారని, ఇది చాలా ప్రమాదరమని తెలియజేశాయి. హైకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో నిరాశే ఎదురైంది. ఆయన అరెస్టులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. తనను ఈడీ కస్టడీ నుంచి తక్షణమే విడుదల చేయాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై ఏప్రిల్ 2వ తేదీలోగా స్పందించాలని న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈడీకి సూచించారు. తదపరి విచారణను ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేశారు. -
Naila Grewal HD Photos: తమాషా అనుకుంది, కట్ చేస్తే ఓటీటీ స్టార్ అయిపోయింది! (ఫొటోలు)
-
చావుబతుకుల మధ్య పోరాటం.. వారం రోజులుగా ఐసీయూలో హీరోయిన్ (ఫోటోలు)
-
10 పాయింట్లలో బీహార్ గొప్పతనం!
ప్రతియేటా మార్చి 22న బీహార్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రాష్ట్రం పేరు వినగానే ఇదొక వెనుకబడిన ప్రాంతమనే భావన అందరిలో కలుగుతుంది. అయితే బీహార్‌కు చెందిన కొన్ని విషయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద వైఫై జోన్ బీహార్ రాజధాని పట్నాలో ఉంది. ఇది దాదాపు 20 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీని సాయంతో పాట్నా నిట్ నుండి దానాపూర్ వరకు జనం ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుకోవచ్చు. పేదరికపు కొలిమిలో శ్రమించిన మనుషులు మహనీయులు అవుతారని ఎవరో చెప్పినది బీహార్‌ను చూస్తే నిజమనిపిస్తుంది. బీహార్‌లో పేదరికం తాండవిస్తున్నప్పటికీ, ఈ రాష్ట్రం నుండి చాలా మంది ఉన్నతాధికారులుగా మారారు. దేశంలోని పలువురు ఐఏఎస్‌లు, బ్యాంకు పీవోలు బీహార్ నుండి వచ్చినవారే కావడం విశేషం. ప్రాచీన కాలంలో బీహార్‌ను మగధ అని పిలిచేవారు. అలాగే రాజధాని పట్నాను పాటలీపుత్ర పేరుతో పిలిచేవారు. బ్రిటిష్ కాలంలో క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్రాలలో బీహార్ ఒకటి. అదే సమయంలో మహాత్మా గాంధీ బీహార్‌లోని చంపారణ్ నుండి స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రారంభించారు. దీనిని చంపారణ్ ఉద్యమం అని పిలుస్తారు. సున్నా లేని గణితానికి విలువ లేదు. ఈ సంగతి ప్రపంచమంతటికీ తెలుసు. సున్నాను కనిపెట్టిన ఆర్యభట్ట బీహార్లోనే జన్మించారు. బాలీవుడ్‌కు గర్వకారణంగా నిలిచిన నటుడు పంకజ్ త్రిపాఠి బీహార్‌కు చెందినవారే. అలాగే దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా బీహార్‌కు చెందినవారే. బీహార్‌కి చెందిన తినుబండారం లిట్టీ చోఖా ఎంతో ఫేమస్ అయ్యింది. వెజ్ మొదలుకొని నాన్ వెజ్ వరకు బీహార్‌లో చాలా వంటకాలు అందుబాటులో ఉంటాయి. బీహార్‌లో జరిగే ఛత్ పండుగ యావత్ దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రపంచంలో అస్తమించే సూర్యుణ్ణి కూడా ఆరాధించే ఏకైక పండుగ ఇదే. బీహార్‌కు చెందిన మిథిల పెయింటింగ్ ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందింది. దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బీహార్లోనే జన్మించారు. -
దేశప్రధానికే లేఖ.. ఎన్నో హేళనలు, అవమానాలు.. దేనికీ బెదరని నటి (ఫోటోలు)
-
భూమి అంతానికి నాలుగు కారణాలు!
పుట్టిన ప్రతీదీ గిట్టక తప్పదని అంటారు. ఈ సృష్టిలో ఉద్భవించిన భూమి కూడా ఏదో ఒకరోజు అంతమవుతుందని చెబుతుంటారు. మరి భూమి ఎప్పుడు అంతమవుతుంది? ప్రస్తుతం భూమిపై నెలకొన్ని విపత్కర వాతావరణ పరిస్థితులు భూమి అంతానికి దారి తీస్తున్నాయా? దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ‘సూపర్ ఖండం’తో పెనుముప్పు గడచిన 500 మిలియన్ సంవత్సరాలలో మన గ్రహం లెక్కలేనన్నిసార్లు భారీ ప్రళయాలను చవిచూసింది. ఆయా ప్రళయకాలాల్లో భూమిపై ఉన్న జాతులలో 90 శాతం జాతులు అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఈ ప్రళయాలు ‘సూపర్ కాంటినెంట్’ ఏర్పడేందుకు దారితీస్తున్నాయి. రాబోయే 250 మిలియన్ సంవత్సరాలలో భూ ఖండాలు మళ్లీ కలిసి ‘పంగియా అల్టిమా’ అని పేరుతో ‘సూపర్ ఖండం’గా ఏర్పడతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది భూమధ్యరేఖకు సమీపంలో ఉంటుంది. అలాగే ఇది అత్యంత వేడి ఖండంగా ఉండబోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్‌లోని లీడ్స్ యూనివర్శిటీ, యూఎస్‌లోని నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీకి చెందిన పలువురు శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ప్రకారం ‘పాంగియా అల్టిమా’ పరిస్థితులు క్షీరదాల మనుగడకు ప్రతికూలంగా మారనున్నాయి. మనుగడ కోసం పోరాటంలో.. అమరత్వం అనేది కథల వరకే పరిమితం. అంతరించిపోవడం అనేది కాదనలేని సత్యం. జీవ పరిణామక్రమంలో వివిధ జాతుల మనుగడ కోసం ఒత్తిళ్లు పెరుగుతాయి. జన్యు ఉత్పరివర్తనలు సంభవించినప్పుడు పలు సమస్యలు తలెత్తుతాయి. కొన్ని ఉత్పరివర్తనలు ఒక నిర్దిష్ట సమయంలో జీవిపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నా, మనుగడ సాగించడానికి ప్రయోజనకరంగానే ఉంటాయి. ఆ జన్యువులు తరువాతి తరానికి తరలే అవకాశం ఉంది. వైవిధ్యం, అనుకూలత అనేవి జీవులు జీవించడానికి కావాల్సిన లక్షణాలు. తక్కువ వైవిధ్యం, అననకూల పరిస్థితులు ఉన్పప్పుడు మానవ జనాభా అంతరించిపోయే అవకాశం ఉంది. పరిమిత వనరుల మధ్య.. భూమిపై వనరులు పరిమితం అవుతుండటానికి తోడు అణు, రసాయన, జీవ ఆయుధాలు, అంతుచిక్కని వ్యాధులు మొదలైనవి మానవ మనుగడకు ముప్పుగా మారనున్నాయి. ఇదేవిధంగా భారీ గ్రహశకలాల దాడి కూడా భూమి అంతరించిపోయేందుకు కారణం కావచ్చు. అలాంటి సంఘటన సంభవించినా, సంభవించకున్నా ఏదో రూపంలో మానవాళికి ముప్పు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. భౌగోళిక, ఖగోళ పరిశోధన ఫలితాల ప్రకారం చూస్తే, ఈ విపత్తు సమీపంలోనే ఉందనే అంచనాలున్నాయి. వేడెక్కుతున్న మహాసముద్రాలు వేడెక్కుతున్న వాతావరణం కారణంగా మహాసముద్రాలు వేడెక్కుతున్నాయి. ఇవి భూమి మనుగడకు మప్పుగా పరిణమిస్తున్నాయి. అమెరికన్ శాస్త్రవేత్తల పరిశోధనలో 580 అమెరికన్, 216 సెంట్రల్ యూరోపియన్ నదుల డేటాతో వర్షపాతం, నేల రకం, సూర్యకాంతి తదితర అంశాలను పరిశీలించారు. భవిష్యత్తులో నదులలో ఆక్సిజన్ తగ్గే ఆక్సిజన్ రేటు జీవ వ్యవస్థకు ప్రమాదకరంగా పరిణమించనుంది. అధ్యయనంలోని శాంపిల్స్ రాబోయే 70 సంవత్సరాలను అంచనా వేశాయి. తక్కువ ఆక్సిజన్ కారణంగా కొన్ని జాతుల చేపలు పూర్తిగా అదృశ్యమవుతాయి. దీని వల్ల జల వైవిధ్యానికి భారీ నష్టం వాటిల్లుతుంది. మానవులతో సహా అనేక జాతుల మనుగడకు ఇది పెను ముప్పుగా పరిణమించనుంది. -
‘హషిమా’ దీవి.. ఈ చీకటి చరిత్రను తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది!
విమానంలో వెళుతూ పైనుంచి చూస్తే, ఈ దీవి యుద్ధనౌకలా కనిపిస్తుంది. అలాగని, ఇదేమీ పర్యాటకులను ఆకట్టుకునే ఆహ్లాదకరమైన దీవి కాదు. దీని వెనుకనున్న చీకటి చరిత్రను తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. ప్రస్తుతం జపాన్‌లోని నాగసాకి నగరం పరిధిలోనున్న ‘హషిమా’ అనే ఈ దీవిని ఒకప్పుడు యుద్ధఖైదీల బందిఖానాగా ఉపయోగించేవారు. వేలాదిమంది చైనీస్, కొరియన్ ఖైదీలను ఈ దీవిలో నిర్బంధించేవారు. ఇక్కడ బొగ్గు నిల్వలు బయటపడటంతో రెండో ప్రపంచయుద్ధం ముగిసిన కొన్నేళ్ల వరకు ఖైదీలతో వెట్టిచాకిరి చేయించుకుంటూ, బొగ్గు నిల్వలను వెలికితీసేవారు. బొగ్గు గనులు మొదలయ్యాక ఇక్కడ ఇళ్లు, స్కూళ్లు వెలిశాయి. వాటితో పాటే ఒక ఆలయం, షాపింగ్ సెంటర్ ఏర్పడ్డాయి. ఈ దీవిలో తొలిసారిగా 1887లో బొగ్గు నిల్వలను గుర్తించారు. వాహనాల తయారీ సంస్థ ‘మిత్సుబిషి’ ఈ దీవిని 1890లో కొనుగోలు చేసింది. జపాన్ ప్రభుత్వం ఇక్కడకు తరలించే యుద్ధఖైదీలనే కార్మికులుగా ఉపయోగించుకుని, వారితో వెట్టిచారికి చేయించుకుని, భారీగా లాభాలు గడించింది. మిత్సుబిషి సంస్థ 480 అడుగుల మీటర్ల పొడవు, 160 మీటర్ల వెడల్పు గల స్థావరంలో గని కార్మికులుగా పనిచేసే 5,300 మంది ఖైదీలను నిర్బంధంలో ఉంచేది. గని తవ్వకాల్లో జరిగే ప్రమాదాల వల్ల, పోషకాహార లోపం వల్ల, జపాన్ సైనికులు అమలు జరిపే మరణ శిక్షల వల్ల దాదాపు 1,700 మంది ఖైదీలు అర్ధాంతరంగా ఇక్కడే మరణించారు. ఇక్కడి బొగ్గు నిల్వలు 1974 నాటికి అంతరించిపోవడంతో, వెట్టిచాకిరి చేసే కార్మికులకు విముక్తి దొరికింది. వారు ఈ దీవిని ‘జైలు దీవి’ అని, ‘యుద్ధనౌక దీవి’ అని పేర్లు పెట్టారు. గడచిన ఐదు దశాబ్దాలుగా ఖాళీగా ఉన్న ఈ దీవిలోని కట్టడాలన్నీ ఇప్పుడు శిథిలమైపోయాయి. మిత్సుబిషి సంస్థ నుంచి నాగసాకి నగరపాలక సంస్థ 2005లో ఈ దీవిని స్వాధీనం చేసుకుంది. ఈ దీవిలోనే 2012లో జేమ్స్‌బాండ్ సినిమా ‘స్కై ఫాల్’ షూటింగ్ జరిగింది. యునెస్కో 2015లో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. నాగసాకి నగరపాలక సంస్థ ఈ దీవి అభివృద్ధికి ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. అయినా, కుతూహలం ఉన్న కొద్దిమంది పర్యాటకులు అరుదుగా ఇక్కడకు వచ్చి, ఫొటోలు దిగి వెళుతుంటారు. ఇవి చదవండి: పాతాళవనం కాదు! అదొక 'నేలమాళిగలో ఉద్యానవనం..!' -
వాలెంటైన్స్ డే వేళ... కొన్ని సరదా సంగతులు!
ఫిబ్రవరి 14... వాలెంటైన్స్ డే.. అంటే ప్రేమికుల రోజు. ఆ రోజున ప్రేమికులంతా ఆనంద డోలికల్లో మునిగితేలుతుంటారు. ప్రేమ ఊసులు చెప్పుకుంటారు. అయితే వాలెంటైన్స్ డేకు సంబంధించిన కొన్ని ఆసక్తికర సంగతులు చాలామందికి తెలియవు. వాటిపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం. మొదటి వాలెంటైన్ డే వేడుక 15వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో జరిగింది. మొదటి అధికారిక వాలెంటైన్స్ డే పారిస్‌లో జరిగిందని చెబుతారు. ఫిబ్రవరినాటి మధ్యస్థ రోజుల్లో పక్షుల సంభోగంలో పాల్గొంటాయట. అందుకే ఇది శృంగారాన్ని జరుపుకోవడానికి తగిన సమయమని అంటుంటారు. వాలెంటైన్స్ డే నాడు ప్రతి సంవత్సరం 145 మిలియన్ గ్రీటింగ్ కార్డ్‌లను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు. యునైటెడ్ స్టేట్స్లో అత్యధిక వాలెంటైన్స్ గ్రీటింగ్ కార్డులు పంచుకుంటారట. పెంపుడు జంతువుల యజమానులలో 25 శాతం మంది వాలెంటైన్స్ డే సందర్భంగా తమ పెంపుడు జంతువులకు వాలెంటైన్స్ డే బహుమతులు ఇస్తారు. అంటే వాలెంటైన్స్ డే.. కేవలం మనుషులకే కాదు కుక్కలు, పిల్లులు,పక్షులు, ఇతర పెంపుడు జంతువులకు సంబంధించినది కూడా. హృదయాకార మిఠాయిలను 1800లో తయారుచేశారట. బోస్టన్ ఫార్మసిస్ట్ ఆలివర్ చేజ్ వీటిని తయారుచేసే ప్రక్రియను సులభతరం చేయడానికి ఒక యంత్రాన్ని కనుగొన్నాడు. ప్రతి సంవత్సరం ఎనిమిది బిలియన్ల హృదయ సంభాషణలు రూపొందిస్తారట. వివిధ రకాల క్యాండీలపై క్లాసిక్ రొమాంటిక్ పదబంధాలలో ‘బి మైన్’, ‘క్యూటీ పై’ ‘ఐ యామ్ యువర్స్’ అనే అక్షరాలను ముద్రిస్తారు. వాలెంటైన్స్ డే నాడుప్రేమికులు 58 మిలియన్ పౌండ్ల విలువైన చాక్లెట్లు, మిఠాయిలను కొనుగోలు చేస్తారట. వాలెంటైన్స్ డే మిఠాయి అమ్మకాలలో గుండె ఆకారంలో ఉండే చాక్లెట్ బాక్స్‌లు దాదాపు 10శాతం ఉంటాయి. 1850లో క్యాడ్బరీ కంపెనీ చాక్లెట్లతో కూడిన బాక్స్ రూపొందించింది. దశాబ్ధకాలం తరువాత మొదటి గుండె ఆకారపు చాక్లెట్ బాక్స్‌ను తయారయ్యింది. మొదటి వాలెంటైన్స్ డే గ్రీటింగ్ కార్డు జైలు నుండి పంపించారు. డ్యూక్ ఆఫ్ ఓర్లీన్స్ 15వ శతాబ్దం ప్రారంభంలో ఖైదీగా మారినప్పుడు మొదటి వాలెంటైన్ లేఖ రాశాడు. దానిలో ఒక కవిత రాసి, తన రెండవ భార్యకు పంపాడు. అయితే అతను జైలులో ఉన్నందున ఆ కవితకు ఆమె నుంచి వచ్చిన స్పందనను అతను చూడలేదు. అత్యధికంగా టీచర్లు వాలెంటైన్డే గ్రీటింగులను అందుకుంటారు. వాలెంటైన్స్ డే కోసం 250 మిలియన్ల గులాబీలను పండిస్తారు! రోమన్ ప్రేమ దేవత వీనస్‌కు ఇష్టమైనవి ఎరుపు రంగు గులాబీలు. ఇవి శృంగారాన్ని, ప్రేమను సూచిస్తాయి. -
బీజేపీ ‘రథ యాత్రికుడు’ అద్వానీ!
భారత అత్యన్నత పౌర పురస్కారమైన భారతరత్నను మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ(96)కి అందజేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ నేపధ్యంలో అద్వానీ జీవితంలో చోటుచేసుకున్న ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం. లాల్ కృష్ణ అద్వానీ అసలు పేరు లాల్ కిషన్‌చంద్ అద్వానీ. అతని ప్రారంభ విద్య కరాచీలో సాగింది. తరువాత లాహోర్‌లో చదువుకున్నారు. అనంతరం ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యారు. బీజేపీని ఇప్పడున్న ఉన్నత స్థాయికి తీసుకువచ్చిన ఘనత లాల్ కృష్ణ అద్వానీకే దక్కుతుంది. ఇద్దరు ఎంపీల స్థాయి కలిగిన బీజేపీని 150 మంది ఎంపీలు ఉన్న పార్టీగా రూపొందించిన ఘనత అద్వానీకే దక్కుతుంది. అద్వానీ చదువుకునే సమయంలో ఆర్ఎస్ఎస్లో చేరారు. 1947లో కరాచీలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యదర్శిగా నియమితులయ్యారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 1951లో జన్ సంఘ్‌ను స్థాపించినప్పుడు, ప్రారంభ సభ్యులలో అద్వానీ కూడా ఒకరు. 1957 వరకు అద్వానీ సంఘ్ కార్యదర్శిగా కొనసాగారు. జన్ సంఘ్‌లో ముఖ్యమైన పదవుల్లో పనిచేసిన తర్వాత 1972లో అద్వానీ సంఘ్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. తరువాత ఆ పార్టీ జన్ సంఘ్ నుండి బీజేపీగా మారినప్పుడు.. అంటే 1980లో పార్టీ స్థాపించినప్పటి నుండి 1986 వరకు లాల్ కృష్ణ అద్వానీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అనంతరం 1986 నుంచి 1991 వరకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. 90వ దశకంలో లాల్ కృష్ణ అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి ద్వయం భారత రాజకీయాలలో కీలక వ్యక్తులుగా మారారు. రామాలయ ఉద్యమాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లారు. ఒకదాని తర్వాత ఒకటిగా అద్వానీ చేపట్టిన యాత్రల ఫలితం అతి తక్కువ వ్యవధిలోనే భారతీయ జనతా పార్టీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. అలాగే పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి జంట 1996 లోక్‌సభ ఎన్నికలలో భిన్నమైన చరిత్రను సృష్టించింది. 1996లో తొలిసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాజ్‌పేయి ప్రధానమంత్రిగా, అద్వానీ హోంమంత్రిగా పదవులు చేపట్టారు. ఆలయ ఉద్యమం తర్వాత, అద్వానీకి ప్రజాదరణ తారాస్థాయికి చేరింది. దీంతో అద్వానీని ప్రధానిని చేయాలనే ఆలోచన నాటి బీజేపీ నేతలలో కలిగింది. అయితే అద్వానీ స్వయంగా అటల్ బిహారీ వాజ్‌పేయి పేరును ప్రధాని పదవికి సూచించారని చెబుతారు. కాగా అద్వానీ అరడజనుకు పైగా రథయాత్రలు చేపట్టారు. వాటిలో ‘రామ రథ యాత్ర’, ‘జనదేశ్ యాత్ర’, ‘స్వర్ణ జయంతి రథయాత్ర’, ‘భారత్ ఉదయ్ యాత్ర’,‘భారత్ సురక్ష యాత్ర’ ముఖ్యమైనవి. -
చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో లాయర్ పొన్నవోలు సంచలన నిజాలు
-
ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమలు.. వాస్తవాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీఎం వైఎస్ జగన్ పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ 130 భారీ ప్రాజెక్టులు ప్రారంభించి రూ.69 వేల కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో 1,93,530 ఎంఎస్ఎంఈలు ఉండగా వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత 3.87 లక్షల ఎంఎస్ఎంఈలు కొత్తగా వచ్చాయి. వీటి ద్వారా కొత్తగా ఉపాధి పొందిన వారు 12.61 లక్షల మంది. ఎంఎస్ఎంఈలకు గత ప్రభుత్వం పెట్టిన రూ.1586 కోట్ల బకాయిలను సైతం సీఎం జగన్ తిరిగి చెల్లించారు. అంతేకాదు.. రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలు అందించారు. ఇక ఇటీవల జరిగిన విశాఖ జీఐఎస్ సదస్సులో రూ.13.11 లక్షల కోట్లకు ఒప్పందాలు కుదిరాయి. 386 విలువైన ఒప్పందాలు ద్వారా 6 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశముంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆంధ్రప్రదేశ్‌లో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా అడుగులేస్తున్నారు. విశాఖ పెట్టుబడుల సదస్సులో ఆయన ఈ మేరకు ప్రకటించారు. వాస్తవాలు ఇలా ఉంటే రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిపై కొందరు పనిగట్టుకుని వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు.. ఉన్న పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ అవాస్తవాలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ఉత్పత్తి ప్రారంభమైన కొన్ని ముఖ్యమైన యూనిట్లు, సీఎం జగన్ భూమి పూజ చేసిన పరిశ్రమలు, ఎన్ని పెట్టుబడులు, ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో చూద్దాం... ఉత్పత్తి ప్రారంభమైన కొన్ని ముఖ్యమైన యూనిట్లు కంపెనీ: గ్రాసిం ఇండస్ట్రీస్ పెట్టుబడి : రూ.861 కోట్లు ఉపాధి : 1,300 మంది రంగం : కాస్టిక్ సోడా కంపెనీ: ప్యానల్ ఆఫ్టో డిస్ ప్లే టెక్నాలజీస్ పెట్టుబడి: రూ.1,230 కోట్లు ఉపాధి: 2,200 మంది రంగం: టీవీ డిస్ ప్లే ప్యానల్స్ కంపెనీ: ఫాక్స్ లింక్ ఇండియా ఎలక్ట్రిక్ పెట్టుబడి: రూ.1,050 కోట్లు ఉపాధి: 2,000 మంది రంగం: ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ కంపెనీ: సన్నీ ఒప్పో టెక్ పెట్టుబడి: రూ.280 కోట్లు ఉపాధి: 1,200 మంది రంగం: కెమెరా మాడ్యూల్స్ కంపెనీ: ఏటీసీ టైర్స్ పెట్టుబడి: రూ.1250 కోట్లు ఉపాధి: 840 మంది రంగం: హాఫ్ హైవే టైర్స్ కంపెనీ: రాంకో సిమెంట్స్ పెట్టుబడి: రూ.1790 కోట్లు ఉపాధి: 1000 మంది రంగం: సిమెంట్ కంపెనీ: డిక్సన్ పెట్టుబడి: రూ.127 కోట్లు ఉపాధి: 1800 మంది రంగం: సీసీ కెమెరాలు కంపెనీ: గ్రీన్‌లామ్ సౌత్ పెట్టుబడి: రూ.800 కోట్లు ఉపాధి: 1050 మంది రంగం: లామినేషన్స్ కంపెనీ: ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టుబడి: రూ.35 కోట్లు ఉపాధి: 1000 మంది రంగం: ఐటీ డెవలప్మెంట్ సెంటర్ కంపెనీ: యుజియా స్టైరైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడి: రూ.500 కోట్లు ఉపాధి: 750 మంది రంగం: ఫార్మా కంపెనీ: లారస్ సింథటీస్ ల్యాబ్ పెట్టుబడి: రూ.191 కోట్లు ఉపాధి: 300 మంది రంగం: బల్క్ డ్రగ్ కంపెనీ: లారస్ ల్యాబ్ పెట్టుబడి: 440 కోట్లు ఉపాధి: 500 మంది రంగం: బల్క్ డ్రగ్ కంపెనీ: సెంచురీ ప్యానల్స్ పెట్టుబడి: రూ.1000 కోట్లు ఉపాధి: 2,266 మంది రంగం: ప్లై ఉడ్ భూమి పూజ చేసిన పరిశ్రమలు కంపెనీ: ఇంటెలిజెంట్ సెజ్ పెట్టుబడి: రూ.70 కోట్లు ఉపాధి: 2000 మంది రంగం: పాదరక్షల ఉపకరణాలు కంపెనీ: సెంచురీ ప్యానల్స్ పెట్టుబడి: రూ.1600 కోట్లు ఉపాధి: 2000 రంగం: ఫ్లై ఉడ్ ఫ్యానల్స్ కంపెనీ: ఆదిత్య బిర్లా గార్మెంట్స్ పెట్టుబడి: రూ.1,10,38 కోట్లు ఉపాధి: 2,112 రంగం: గార్మెంట్స్ కంపెనీ: హిల్ టాప్ సెజ్ ఫుట్ వేర్ పెట్టుబడి: రూ.700 కోట్లు ఉపాధి: 10,000 రంగం: పాదరక్షలు కంపెనీ: డిక్సన్ టెక్నాలజీస్ పెట్టుబడి: రూ.108 కోట్లు ఉపాధి: 830 రంగం: టెలివిజన్స్ కంపెనీ: ఫాక్స్ లింక్ ఇండియా విస్తరణ పెట్టుబడి: రూ.300 కోట్లు ఉపాధి: 1200 రంగం: స్యార్ట్ వాచీలు, ఇయర్ పాడ్స్ కంపెనీ: ఏటీసీ టైర్స్ ఫేజ్ -2 పెట్టుబడి: రూ.1000 కోట్లు ఉపాధి: 1160 రంగం: టైర్ల తయారీ కంపెనీ: పిడిలైవ్ ఇండస్ట్రీస్ పెట్టుబడి: రూ.202 కోట్లు ఉపాధి: 280 రంగం: వాటర్ ప్రూపింగ్ ఉత్పత్తులు కంపెనీ: మేఘా ఫ్రూట్ ప్రాసెసింగ్ పెట్టుబడి: రూ.186 కోట్లు ఉపాధి: 677 రంగం: ఆహార ఉత్పత్తులు కంపెనీ: ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ పెట్టుబడి: రూ.145 కోట్లు ఉపాధి: 70 రంగం: పారిశ్రామిక వాయువులు కంపెనీ: ఆప్టిమస్ డ్రగ్స్ పెట్టుబడి: రూ.125 కోట్లు ఉపాధి: 185 రంగం: ఫార్మా న్యూటికల్స్ కంపెనీ: విన్ విన్ స్పెషాలిటీ ఇన్సులేటర్స్ పెట్టుబడి: రూ.108 కోట్లు ఉపాధి: 382 రంగం: ఇన్సులేటర్స్ కంపెనీ: స్టేరాక్స్ లైఫ్ సైన్సెస్ పెట్టుబడి: రూ.88 కోట్లు ఉపాధి: 450 రంగం: బల్క్ డ్రగ్ కంపెనీ: సినాస్టిక్స్ ల్యాబ్స్ పెట్టుబడి: రూ.82 కోట్లు ఉపాధి: 300 రంగం: బల్క్ డ్రగ్ కంపెనీ: ఇషా రిసోర్సెస్ పెట్టుబడి: రూ.68 కోట్లు ఉపాధి: 220 రంగం: కోక్ అండ్ కోల్ స్క్రీనింగ్ కంపెనీ: ఆసాగో ఇండస్ట్రీస్ పెట్టుబడి: రూ.270 కోట్లు ఉపాధి: 500 రంగం: బయో ఇథనాల్ కంపెనీ: JSW స్టీల్ పెట్టుబడి: రూ.8,800 కోట్లు ఉపాధి: రూ.2,500 రంగం: ఉక్కు తయారీ కంపెనీ: క్రిభ్కో బయో ఇథనాల్ పెట్టుబడి: రూ.560 కోట్లు ఉపాధి: 400 రంగం: బయో ఇథనాల్ కంపెనీ: ఎకో స్టీల్ ఇండియా పెట్టుబడి: రూ.540 కోట్లు ఉపాధి: 500 రంగం: బయో ఇథనాల్ కంపెనీ: లారస్ సింథసిస్ ల్యాబ్ పెట్టుబడి: రూ.240 కోట్లు ఉపాధి: 450 రంగం: బల్క్ డ్రగ్ కంపెనీ: లారస్ ల్యాబ్ పెట్టుబడి: రూ.240 కోట్లు ఉపాధి: 450 రంగం: బల్క్ డ్రగ్ -
మీకు తెలుసా! వేడి నీళ్లలో నెయ్యి కలిపి తాగితే ఏమౌతుందో!?
'సాధారణంగా కొందరు ఉదయం నిద్రలేచిన వెంటనే వేడినీరు తాగుతారు. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. అయితే వేడినీటిలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థకు మరింత మేలు జరుగుతుందని మీకు తెలుసా!?' ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు చాలా మేలు చేస్తాయి. ఇది కాకుండా, కేలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు ఎ, ఇ మొదలైనవి నెయ్యిలో లభిస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. చర్మ సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు. చర్మం ఆరోగ్యంగా... ప్రకాశవంతంగా మారుతుంది. కొవ్వు కరిగిపోతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇది వెచ్చని నీటితో లేదా ఆహారంతో ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతోపాటు అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇవి కూడా చదవండి: రక్తహీనతతో బాధ పడుతున్నారా.. అయితే ఇవి తీసుకోండి! -
Swarved: ఆధ్యాత్మిక బలానికి అత్యాధునిక చిహ్నం
ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం(మెడిటేషన్ సెంటర్) మన భారతదేశంలోనే కొలువుదీరింది. ఈ భారీ నిర్మాణంతో భారత్ అధ్యాత్మకి వికాసానికి పెద్ద పీఠవేస్తూ శాంతియుతంగా ఉండేలా చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆ అతిపెద్ద ధ్యాన కేంద్రం ఎక్కడ ఉందంటే..? ఆ అతిపెద్ద ధ్యాన కేంద్రం(మెడిటేషన్ సెంటర్) ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ నియోజకవర్గమైన వారణాసిలో ఉంది. దీన్ని ప్రధాని మోదీ సోమవారమే ప్రారంభించారు. ఈ ధ్యాన కేంద్రం పేరు 'స్వర్వేద్ మహామందిర్'. ఆధ్యాత్మికంగా దైవత్వ వైభవానికి ఆ ధ్యాన కేంద్రం ప్రధాన ఆకర్షణ అని మోదీ పేర్కొన్నారు. ఇది భారతదేశ సామాజిక ఆధ్యాత్మిక బలానికి అత్యాధునిక చిహ్నం ఈ స్వర్వేద్ మహామందిర్. ఈ ప్రారంభోత్సవంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. ఈ మందిర్‌కి సంబంధించిన ఆసక్తికర విశేషాలు.. ఇది ఏడు అంతస్తుల నిలయం. దీన్ని సుమారు మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. దాదాపు 125 రేకుల తామర గోపురాల డిజైన్‌తో అత్యంత అద్దంగా తీర్చిదిద్దారు. అంతేగాదు ఒకేసారి 20 వేలమంది కూర్చొగలిగే సామర్థ్యం కలది. దీన్ని వారణాసి సిటీ సెంటర్‌కి దాదాపు 12 కి.మీ దూరంలో ఉమరహా ప్రాంతంలో నిర్మించారు. ఈ ఆలయం మకరతోరణంపై దాదాపు 3 వేలకు పైగా స్వర్వేద్ శ్లోకాలు చెక్కారు. ఈ గుడి గోడల చుట్టూ గులాబీరంగు ఇసుకరాయి మంచి అలంకరణగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తలుపులపై శిల్ప కళా నైపుణ్యం తెలియజేశాలా పలు శిల్పాలను చెక్కారు. పైగా ఇందులో దాదాపు 101 పౌంటైన్లు ఉన్నాయి. 2004లో ప్రారంభమైన ఈ మహామందిర్ నిర్మాణం 15 మంది ఇంజనీర్లు, సుమారు 600 మంది కార్మికులు కృషి ఫలితం. విహంగం యోగా వ్యవస్థాపకుడు సదాఫల్ డియోజీ మహారాజ్ రచించిన గ్రంథం స్వర్వేదానికి ఈ మహామందిరాన్ని అంకితం చేసినట్లు ఆలయ వెబ్సైట్ తెలిపింది. ఈ మహామందిర్ దాని అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రకాశంతో యావత్ మానవాళిని ప్రకాశవంతం చేయడమే గాక ఈ ప్రంపంచాన్ని సదా శాంతియుతంగా ఉండేలా అప్రమత్తం చేస్తుందని ఆలయ వెబ్సైట్ పేర్కొంది. (చదవండి: ఆ గుహలోకి వెళ్తే ..ఆత్మలను లైవ్‌లో చూడొచ్చట!) -
మీకు తెలుసా..?
-
ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా? (ఫోటోలు)
-
ఈ ఆరోగ్య విషయాలు గురించి మీకు తెలుసా? (ఫోటోలు)
-
ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?
-
ఇది మీకు తెలుసా? (ఫోటోలు)
-
ఈ విషయాలు మీకు తెలుసా?
-
జంతువుల గురించి మీకు తెలియని పది అద్భుతమైన విషయాలు
-
ప్రైమ్ మినిస్టరే కెప్టెన్‌గా క్రికెట్ మ్యాచ్ ఆడిన ఘటన..!
పంచభూతాలు కూడా ఫైనల్ మ్యాచ్ కోసం ఊపిరి బిగపట్టి ఎదురుచూస్తున్నాయి. మరి సోషల్ మీడియా గమ్మున ఉంటుందా? అక్కడ సందడే సందడీ. అందులో నుంచి కొంచెం.. సూపర్ హిట్ అందుకున్న క్రికెట్ సినిమాలు.. మన దేశంలో సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో క్రికెట్‌కు అంతే క్రేజ్ ఉంది. ఈ రెండు క్రేజ్‌లను కలిపితే సూపర్ హిట్టే అనుకుంటూ క్రికెట్ ప్రధానంగా, క్రికెటర్ల జీవితకథల ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని... 22 యార్డ్స్, 83, 1983, ఆల్ రౌండర్, బియాండ్ ఆల్ బౌండ్రీస్, లగాన్, ఇక్బాల్, దిల్ బోలే హడిప్పా, పాటియాల హౌజ్, ఫెరారీ కీ సవారీ, కై పో చే, ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ, అజార్, జెర్సీ, సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్ (డాక్యుమెంటరీ స్పోర్ట్స్ ఫిల్మ్), వరల్డ్ కప్ 2011, హాట్రిక్ (స్పోర్ట్స్ కామెడీ ఫిల్మ్), గాడ్ ఆఫ్ క్రికెట్ (బయోపిక్ స్పోర్ట్స్ ఫిల్మ్), గోల్కొండ హైస్కూల్. స్పోర్ట్స్ కామెడీ యాక్షన్ ఫిల్మ్ ఫెండ్షిప్ (2021)లో హర్బజన్ సింగ్ ‘భజ్జీ’ అనే పాత్రలో నటించాడు. వెంకటేష్ నటించిన ‘వసంతం’ సినిమాలో వీవీఎస్ లక్ష్మణ్ గెస్ట్‌రోల్‌లో కనిపిస్తాడు.కెప్టెన్ చాచా నెహ్రూ కెప్టెన్‌గా చాచా నెహ్రు.. మన దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రుకు ఆటలు అంటే అందులోనూ క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇష్టమే కాదు బ్రహ్మాండంగా ఆడతాడని పేరు కూడా. ప్రధాని అయిన తరువాత కూడా క్రికెట్‌పై ఆయన అభిమానం తగ్గలేదు. 1953లో బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ వరద బాధితుల కోసం దిల్లీలో ఛారిటీ క్రికెట్ మ్యాచ్ జరిగింది. ప్రైమ్ మినిస్టర్ వర్సెస్ వైస్–ప్రెసిడెంట్ క్రికెట్ మ్యాచ్ ఇది. నెహ్రూజీ ప్రైమ్‌మినిస్టర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. చాలా సంవత్సరాల తరువాత బ్యాట్ చేతుల్లోకి తీసుకోవడం ఒక విశేషం అయితే ప్రొఫెషనల్ ప్లేయర్‌లాగా ఆడడం మరో విశేషం. అబ్బే... కవిత్వం కాదండీ! దిలీప్ వెంగ్‌సర్కార్ నిక్‌నేమ్ కల్నల్. ఈ ఫొటోను చూస్తే కల్నల్ కవిత్వం రాసుకుంటున్నాడేమో అనిపిస్తుంది. అయితే అది నిజం కాదు. ప్లేయింగ్ డేస్‌లో వెంగ్‌సర్కార్ పత్రికలకు కాలమ్ రాసేవాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో కాలమ్ రాస్తున్నప్పుడు తీసిన ఫోటో ఇది. అట్లెట్లంటవయ్యా? ఇట్లెట్ల తింటవయ్యా! 1983 క్రికెట్ వరల్ కప్ సమయంలో ‘ఇండియా జట్టు గ్రూప్ స్టేజీ దాటి ముందుకు వెళ్లదు’ అని రాశాడు విజ్డన్ క్రికెట్ మంత్లీ ఎడిటర్ డేవిడ్ ఫ్రిత్. రాస్తే రాశాడుగానీ ఒక మంగయ్య శపథం కూడా చేస్తూ...‘ఈట్ మై వర్డ్స్’లాంటి ఇంగ్లిష్ ఎక్స్ప్రెషన్ ఏదో వాడాడు. ఇండియా ప్రపంచ కప్ గెలిచిన తరువాత ఒక పాఠకుడు ‘ఇప్పటికీ మీరు మాట మీదే నిలబడతారా?’ అని కవ్వించాడు. ‘ఏదో మాట వరుసకు అన్నాను లేవయ్యా’ అనకుండా మాట మీద నిలబడ్డాడు ఫ్రీత్. మ్యాగజైన్లో ప్రచురితమైన వ్యాసం కాగితాన్ని కెమెరా ముందు తిన్నాడు. యస్... ఏనుగే గెలిపించింది!‘.. మిత్రులారా ఈ పుస్తకం చదవండి. క్రికెట్‌కు సంబంధించి సకల వివరాలు, విశేషాలు, వినోదాలు, గణంకాలు... ఇలా ఎన్నో తెలుసుకోవచ్చు’ అని అభిషేక్ ముఖర్జీ, జాయ్ భట్టాచార్య రాసిన ‘గ్రేట్ ఇండియన్ క్రికెట్ సర్కస్’ పుస్తకం గురించి గత నెలలో రాజకీయ నాయకుడు, రచయిత శశి థరూర్ ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టాడు. దీని ప్రభావమేమో తెలియదుగానీ చాలామంది ఈ పుస్తకంలోని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అందులో కొన్ని... 1971లో భారత్, ఇంగ్లాండ్‌ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు వినాయక చవితి వచ్చింది. లండన్‌లోని స్థానిక భారతీయులు చెస్సింగ్టన్ జూ నుండి బెల్లా అనే మూడేళ్ళ ఏనుగును తీసుకువచ్చి స్టేడియం చుట్టూ తిప్పారు. మన జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. ఈ ఏనుగు ఆశీస్సుల వల్లే మన జట్టు గెలిచింది అని చాలామంది బలంగా నమ్మారు. వన్స్ అపాన్ ఏ టైమ్ ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కపిల్‌దేవ్ షాట్‌కు ఒక సీగల్ చనిపోయింది. (మనస్తాపానికి గురైన కపిల్ ఈ బాధ నుంచి కోలుకోవడానికి గ్లాసు నీళ్లు కావాలని కోరాడని, ఆస్ట్రేలియా కెప్టెన్ ఎలన్ బోర్డర్ తిరస్కరించాడని రచయితలు రాశారు). చండీగఢ్‌లో జరిగిన లోకల్ మ్యాచ్‌లో ఒక బ్యాట్స్‌మెన్ (పేరు రాయలేదు) సిక్సర్‌కు ఒక గుర్రం చనిపోయింది. తన తోటలో పండించిన హైబ్రీడ్ మ్యాంగోకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరు పెట్టాడు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఖలీముల్లా ఖాన్. ‘ప్రపంచంలో సచిన్‌లాంటి ప్లేయర్ మరొకరు లేరు. అందుకే హైబ్రీడ్ మ్యాంగోకు ఆయన పేరు పెట్టాను’ అంటాడు ఖాన్. తీహార్ జైలులోని ఒక బ్లాక్‌కు మనోజ్ ప్రభాకర్ పేరు ఉండేది. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో మనోజ్ పేరు వినిపించిన తరువాత బ్లాక్‌కు ఆయన పేరును తొలగించారు అధికారులు. (చదవండి: ఒక రోజు హోటల్ అద్దె లక్షన్నర) -
Interesting World Facts: ఆశ్చర్యం కలిగించే ప్రపంచ నిజాలు
-
యురేనస్ మీద ఐదు సెకెన్లు ఉండగలిగితే? వజ్రాల వానలో తడుస్తామా?
వరుణ గ్రహం... ఇంగ్లీషులో యురేనస్ అంటారు. ఈ గ్రహం పేరు మీరు ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. ఈ గ్రహాన్ని గ్యాస్ జెయింట్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ మట్టి, రాయికి బదులుగా గ్యాస్ అధికంగా ఉంటుంది. ఈ గ్రహం పరిమాణంలో చాలా పెద్దది. ఇటువంటి విచిత్ర వాతావరణం కలిగిన గ్రహంలో మనిషి కనీసం ఐదు నిముషాలైనా ఉండగలడా? ఉంటే ఏమి జరుగుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం. సౌర వ్యవస్థలో టెలిస్కోప్ సాయంతో కనుగొన్న మొదటి గ్రహం యురేనస్. ఇది సౌర వ్యవస్థలోని ఎనిమిది గ్రహాలలో సూర్యుని నుండి దూరం పరంగా చూస్తే ఏడవ సుదూర గ్రహం. యురేనస్ తన అక్షం మీద ఒక పరిభ్రమణాన్ని దాదాపు 17 గంటల్లో పూర్తి చేస్తుంది. అంటే యురేనస్‌పై ఒక రోజుకు 17 గంటలు మాత్రమే ఉంటుందని అర్థం. అంటే ఇక్కడ ఒక సంవత్సరం భూమిపై 84 సంవత్సరాలకు సమానం. యురేనస్‌పై రాత్రి 42 సంవత్సరాలు, పగలు 42 సంవత్సరాలు అని తెలిస్తే ఎవరైరా ఆశ్చర్యపోవాల్సిందే. యురేనస్‌పై రెండు ధృవాలలో ఒకటి సూర్యునికి అభిముఖంగా ఉండడం, మరొకటి 42 ఏళ్లు చీకటిలో ఉండడమే ఇందుకు కారణం. యురేనస్.. సూర్యుని నుండి సుమారు మూడు బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రహం చాలా చల్లగా ఉండటానికి కారణం కూడా ఇదే. ఇక్కడ సగటు ఉష్ణోగ్రత -197 డిగ్రీల సెల్సియస్. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం, యురేనస్‌పై కనిష్ట ఉష్ణోగ్రత -224 డిగ్రీల సెల్సియస్. ఇక భూమికి ఒకే చంద్రుడు ఉండగా, యురేనస్‌కు మొత్తం 27 సహజ ఉపగ్రహాలు అంటే చంద్రులు ఉన్నారు. అయితే ఈ చంద్రులు చాలా చిన్నవిగా, అసమతుల్యంగా ఉంటాయి. వాటి బరువు చాలా తక్కువ. యురేనస్ దాని అక్షం మీద 98 డిగ్రీలు వంగి ఉంటుంది. అందుకే ఇక్కడి వాతావరణం అసాధారణంగా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడూ తుఫాను లాంటి వాతావరణం ఉంటుంది. గాలులు చాలా వేగంగా వీస్తాయి. ఇవి గరిష్టంగా గంటకు 900 కిలోమీటర్ల వేగం కలిగి ఉంటాయి. యురేనస్ గ్రహంపై మేఘాల అనేక పొరలతో కూడి ఉంటాయి. పైభాగంలో మీథేన్ వాయువు ఉంటుంది. యురేనస్ గ్రహంపై మీథేన్ వాయువు, ఉష్ణోగ్రత, గాలి సమృద్ధిగా ఉండటం వల్ల ఇక్కడ వజ్రాల వర్షం కురుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సూర్యకిరణాలు ఈ గ్రహాన్ని చేరుకోవడానికి రెండు గంటల 40 నిమిషాల సమయం పడుతుంది. యురేనస్ భూమి కంటే దాదాపు 20 రెట్లు పెద్దది. మరి ఈ గ్రహం గురించి ఇన్ని వివరాలు తెలుసుకున్నాక.. మనిషి ఈ గ్రహంపై ఐదు నిముషాలైనా ఉండగలడా? ఉంటే ఏమవుతుందనేది ఇప్పటికే మీకు సమగ్రంగా అర్థమై ఉండాలి. ఇది కూడా చదవండి: బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం -
మరియం కురియన్ మరియు నయనతార
గ్లామర్ పాత్రలతో మెరిసిన నయనతార ‘గ్లామర్’కు మాత్రమే పరిమితం కాలేదు. ‘శ్రీరామరాజ్యం’ ‘అనామిక’ ‘గాడ్‌ఫాదర్’లాంటి సినిమాలతో నటిగా మెప్పించింది. ఫిమేల్ – సెంట్రిక్ ఫిల్మ్ అనగానే తన పేరు గుర్తుకు వచ్చేలా చేసుకుంది. ‘లేడీ అమితాబ్’గా పేరు తెచ్చుకుంది. సినిమా ఫీల్డ్కి రాక ముందు నయనతార మోడలింగ్, టీవీ షోలు చేసేది. ఒక టీవీలో ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ షో ‘చమయం’ చేసేది. నయనతార అసలు పేరు డయాన మరియం కురియన్. ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ చేసిన డయాన(నయన) కాలేజీ రోజుల్లోనే పార్ట్–టైమ్‌గా మోడలింగ్, టీవి యాంకరింగ్ చేసేది. ఆమె మోడలింగ్ స్కిల్స్ చూసిన మలయాళం డైరెక్టర్ సత్యన్ ‘మనసినక్కరే’ సినిమాతో వెండితెరకు పరిచయం చేశాడు. ఆ సినిమాలో ‘గౌరి’ పాత్రలో నటించిన నయనతార నిన్నా మొన్నటి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘జవాన్’లోని ‘నర్మదా రాయ్’ పాత్ర వరకు నటనలో ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకుంటూనే ఉంది. -
TS History:1948 పోలీస్ యాక్షన్ – మరో కోణం
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, అది సృష్టించిన సాహిత్యం మన రాజకీయాల్లో, సాహిత్యంలో చివరకు మన జీవితాల్లోనూ విడదీయరాని భాగం. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలకు రెండు తెలుగు రాష్ట్రాల చట్టసభల్లో ఒక్క ప్రతినిధి కూడా లేడు. అయినప్పటికీ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో వామపక్ష భావజాలమే ఇప్పటికీ బలంగా ఉంది. తెలుగు సాహిత్యంలో అత్యధిక భాగం ‘సామ్యవాద వాస్తవికత’ ప్రభావంలోనే ఉందంటే అతిశయోక్తి కాదు. భాషా ప్రయుక్త రాష్ట్రాల విధానం వచ్చాక 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రరాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేశారు. నిజాం సంస్థానం చాలా పెద్దది. అందులోని ఐదు ప్రధాన ప్రాంతాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణలోని నల్లగొండ, వరంగల్ రెండు జిల్లాల్లో ప్రధానంగానూ, మరో ఒకటి రెండు జిల్లాల్లో స్వల్పంగానూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగింది. ఆనాటి చారిత్రక సంఘటనల మీద తమ అనుభవాలను గ్రంథస్థం చేసిన ఆ పోరాట అగ్రనాయకులు అందరూ తెలంగాణకు పరిమితమయ్యారు. తమ పుస్తకాలకు నిజాయితీగా ‘తెలంగాణ’ అనే శీర్షికలే పెట్టారు. మిగిలిన నిజాం సంస్థానాన్ని వదిలేశారు. దానికి రెండు కారణాలు. మొదటిది ఉర్దూ భాషా సమస్య, రెండోదిముస్లిం మత సమస్య.నిజాం పాలన గురించి మనకు, ముఖ్యంగా, తెలుగు పాఠకులకు తెలిసింది చాలా తక్కువ. నిజాం సంస్థానంలో పెట్టుబడీదారీ అభివృద్ధి గురించి పరిశోధనలు చేసిన ప్రొఫెషనల్స్ కొందరు లేకపోలేదు. వారిలో ఒకడైన సివి సుబ్బారావు ఆ రోజుల్లో జవహర్ లాల్ నెహ్రూ వాగ్దానం చేసిన ఇండియాకన్నా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలోని నిజాం సంస్థానంలో కొనసాగుతున్న అభివృద్ధి మెరుగ్గా ఉందనే నిర్ధారణకు వచ్చాడు.ఇంతకీ తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా భారత కమ్యూనిస్టు పార్టీ సాధించిందేమిటి? వాదన కోసం; నిజాం రాచరిక పాలననో, జాగీర్దార్ల భూస్వామ్యాన్నో వాళ్ళు అంతం చేసేశారు అనుకుందాము. భూస్వామ్య వ్యవస్థను అంతం చేశాక పెట్టుబడీదారీ వ్యవస్థ ఏర్పడుతుందని సాక్షాత్తు ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో కార్ల్ మార్క్స్– ఫ్రెడరిక్ ఏంగిల్స్ చెప్పారు. అంతేకాని భూస్వామ్య వ్యవస్థను కూల్చేస్తే సమసమాజం వస్తుందనో, కమ్యూనిస్టు రాజ్యం వస్తుందనో, కనీసం ‘రైతు–కూలీ రాజ్యం’ వస్తుందనో వాళ్ళెక్కడా చెప్పలేదు.తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ రాచరిక – భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేసిన తరువాత అక్కడ అత్యంత సహజంగానే పెట్టుబడీదారీ వ్యవస్థ అభివృద్ధి చెందడాన్ని మనందరం చూస్తున్నాం. 1940ల చివర్లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీగానీ, 1980ల మొదట్లో నక్సలైట్ పార్టీలుగానీ ఉద్దేశ్యపూర్వకంగా కాకపోయినా పెట్టుబడిదారులు పెరగడానికి కారణమయ్యారు. సమాజానికి తనదైన ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది. ఒకరు అనుకున్నా అనుకోకపోయినా అదలా సాగిపోతుందంతే. ఒక కఠోర చారిత్రక వాస్తవం ఏమంటే ప్రపంచంలో ఇప్పటి వరకు పెట్టుబడీదారీ వ్యవస్థ అభివృద్ధి చెందిన ఏ దేశంలోనూ సోషలిస్టు విప్లవం విజయవంతం కాలేదు. 1948 నాటి పోలీస్ యాక్షన్ గురించి కమ్యూనిస్టు నాయకులు చెప్పని ఇంకో పెద్ద నిజం కూడా ఉంది. జె.ఎన్. చౌధరి నాయకత్వంలోని ‘పోలీసు యాక్షన్’ కమ్యూనిస్టు ప్రభావిత జిల్లాలకు చేరుకోవడానికి ముందే నిజాం సంస్థానంలో సాయుధపోరాటంలో మరణించిన 3 వేలకు ఓ పది రెట్లకు పైగా ముస్లింలను అతి క్రూరంగా చంపేశారు. వాళ్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపైన నెహ్రూ వేసిన సుందర్ లాల్ బహుగుణ కమిటీ మాత్రమేకాక, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి అప్పటి పార్లమెంటరీ రాజకీయాల వేదికగా ఉన్న ‘పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ’(పీడీఎఫ్) నాయకులు కూడ ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందచేశారు. సుందర్ లాల్ బహుగుణ నివేదికను జాతీయభద్రత దృష్ట్యా చాలాకాలం దాచిపెట్టారుగానీ ఇప్పుడు అది అందుబాటులో వుంది. ఇండో–అమెరికన్ రచయిత అఫ్సర్ మహమ్మద్ 1948 నాటి పోలీస్ యాక్షన్ బాధిత కుటుంబాల సంతతిని కలిసి వాళ్ళ అనుభవాలను నమోదు చేసే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఈ అంశం మీద ఓ దశాబ్దం పాటు విçస్తృత పరిశోధనలు చేసి ఇప్పుడు ‘రీమేకింగ్ హిస్టరీ –1948 పోలీస్ యాక్షన్ అండ్ ది ముస్లిమ్స్ ఆఫ్ హైదరాబాద్’ శీర్షికతో ఒక భారీ చారిత్రక డాక్యుమెంట్ ప్రచురించాడు. 2002 గుజరాత్ అల్లర్ల తరువాత తను ముస్లిం సమాజం మీద దృష్టి పెట్టాడు. మొహర్రం పండుగ సందర్భంగా తెలంగాణలో వెల్లివెరిసే మతసామరస్యం మీద పరిశోధన సాగించాడు. ఆ క్రమంలో 1948 పోలీస్ యాక్షన్ బాధితులు అతనికి తారసపడ్డారు. దాచేస్తే దాగని సత్యాలను వెళ్ళడించడానికి సిద్ధపడ్డాడు. దాని ఫలితమే ఈ పరిశోధనా గ్రంథం. ప్రపంచం అనేది చాలా పెద్దది. అందులో మనకు తెలిసింది చాలా తక్కువ, తెలియాల్సింది చాలా ఎక్కువ అనే స్పృహ చాలామందికి ఉండదు. ప్రపంచం మొత్తం తెలియకపోయినా మనదేశం గురించి, మన రాష్ట్రం గురించయినా తెలియాలి. హీనపక్షం మనతో వందల సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్న సమూహాల మనోభావాలనైనా తెలుసుకోవాలిగా. దానికి ఈ పుస్తకం తోడ్పడుతుందని ఆశిస్తాను. వ్యాసకర్త సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు మొబైల్: 9010757776 -
‘జో నెహ్రూ’ ఎవరు? ఇందిర, సోనియా, ప్రియాంకలకు ఏమి బహూకరించారు?
స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాజకీయ వారసత్వం అమితమైన ఆసక్తిని కలిగిస్తుంటుంది. ఆ మధ్య చరిత్రకారుడు రామచంద్ర గుహ మాట్లాడుతూ ‘జవహర్లాల్ నెహ్రూ ఎదుర్కొన్న సవాళ్లను ఆధునిక భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడూ ఎదుర్కోలేదనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. నెహ్రూ దేశానికి సారధ్యం వహించే సమయంలో దేశం ఒక జాతిగా దాని సొంత కాళ్లపై కూడా నిలబడలేని స్థితిలో ఉన్నదన్నారు. జవహర్లాల్ నెహ్రూ దేశ తొలి ప్రధానిగా అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రజాస్వామ్యం, నైతికత, లౌకికవాదం, సోషలిజం మొదలైనవాటిని దేశంలో పెంపొందించేదుకు నెహ్రూ కృషి చేశారని చెబుతారు. అయితే నెహ్రూ వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలు, వ్యక్తిగత సంబంధాలు, అభిరుచులు, ఇష్టాలు, అయిష్టాలు చాలావరకూ తెరమరుగునే ఉన్నాయి. నెహ్రూకు గాలిపటాలు ఎగురవేయడం అంటే చాలా ఇష్టం. ఈ అభిరుచి అతనికి ఇంగ్లాండ్‌లోని హారో, కేంబ్రిడ్జ్లలో ఉంటున్నప్పుడు ఏర్పడింది. అదేవిధంగా నెహ్రూకు న్యాయశాస్త్రం చదవడమంటే ఏ మాత్రం ఇష్టం లేకపోయినా, తండ్రి కోరిక మేరకు లా పూర్తిచేసి, న్యాయవాదిగా మారారు. జవహర్లాల్ నెహ్రూకి సంబంధించి బయటి ప్రపంచానికి అంతగా తెలియని కొన్ని అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జవహర్లాల్ నెహ్రూను కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజీలో అతని సహవిద్యార్థులు ‘జో నెహ్రూ’ అని పిలిచారు. దీనికి కారణం అలా పిలవడం చాలా సులభమని వారు భావించేవారు. నెహ్రూను పూర్తి పేరుతో పిలవడం వారికి కష్టంగా అనిపించేదట. హారో, కేంబ్రిడ్జ్‌లో చదువుతున్నప్పుడు నెహ్రూకు గాలిపటం ఎగురవేయడమనేది ఒక క్రీడగా పరిచయం అయ్యింది. గాలిపటాలపై నెహ్రూకు మక్కువ మరింతగా పెరిగి, వాటిని బాగా ఎగురవేయగలిగే నైపుణ్యం సంపాదించారు. ఈ నేపధ్యంలో నెహ్రూ భారతదేశం నుండి మంచి గాలిపటాలను తెప్పించుకుని, వాటి ఎగురవేస్తూ ఆనందం పొందేవారు. నెహ్రూ తన తండ్రి ఒత్తిడి మేరకు న్యాయశాస్త్రం చదివారు. నిజానికి నెహ్రూ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఆర్థిక శాస్త్రం చదువుకోవాలనుకున్నారు. తనను లాయర్‌గా మార్చినందుకు నెహ్రూ తన తండ్రిపై తరచూ పలు ఆరోపణలు చేసేవాడు. గాంధీజీ మరణానంతరం నెహ్రూ చేసిన ‘మన జీవితాల్లో వెలుగులు ఆరిపోయాయి’ అనే ప్రసంగం ఆయన చేసిన ప్రముఖ ప్రసంగాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ ప్రసంగాన్ని ఆయన ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా చేయడం విశేషం. జైలులో ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ తన కుమార్తె ఇందిర వివాహానికి లేత గులాబీ ఖాదీ చీరను నేశారు. ఆ తర్వాత సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ కూడా తమ తమ పెళ్లిళ్లలో అదే ధరించారు. నెహ్రూకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఆయన తన ఇంటిలో పెద్ద సంఖ్యలో వివిధ రకాల పెంపుడు జంతువులను పెంచేవారు. వీటిలో ఒక పాండా కూడా ఉండేది. జవహర్లాల్ నెహ్రూ తన వస్త్రధారణలో జాకెట్, షేర్వానీ, క్యాప్ ధరించి కనిపించేవారు. ఈ లుక్ నెహ్రూకు అపారమైన ప్రజాదరణను తెచ్చిపెట్టింది. ఈ లుక్ ఎంత పాపులర్ అయ్యిందంటే చివరికి అది నేషనల్ డ్రెస్ కోడ్లా మారింది. నెహ్రూ ప్రభావంతో ఘనా అధ్యక్షుడు క్వామే న్క్రుమా, ఇండోనేషియా అధ్యక్షుడు సుహార్తో, చైనా నేత మావో కూడా నెహ్రూ తరహాలో దుస్తులను ధరించేందుకు ఇష్టపడేవారట. 1963 అక్టోబర్‌లో ప్లేబాయ్ పత్రిక జవహర్లాల్ నెహ్రూను ఇంటర్వ్యూ చేసింది. ఈ పత్రికలో తన గురించి లోతైన కథనాలు ప్రచురితమయ్యాయని నెహ్రూ భావించారు. నెహ్రూ తన సోదరి విజయలక్ష్మి పండిట్‌ను నయన్ అని పిలిచేవారు. ఆమె అతనికి అత్యంత నమ్మకస్తురాలని చెబుతుంటారు. నెహ్రూ తన తల్లి, భార్య భార్యకు మించి విజయలక్ష్మి పండిట్‌తో ఓపెన్‌గా మాట్లాడేవారట. ఇది కూడా చదవండి: నేతాజీకి అండగా నిలిచిన మహిళా సేనాని ఎవరు? -
మీకు తెలుసా! ఆ ఫోబియా వస్తే.. సంతోషంగా ఉండాటానికే భయపడతారట!
ఈ ప్రపంచంలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. శాస్త్రవేతలు లేదా మేధావుల కారణంగానో ఆ కొంగొత్త విషయాలు వెలుగులోకి వస్తే ఇలాంటివి కూడా ఉన్నాయా!.. అని నోరెళ్లబెడతాం. అలాంటి కొన్ని ఆసక్తికర విషయాలు గురించి తెలుసుకుందాం. మంచి ఆసక్తికర విషయాలు.. ఇంతవరకు ఆంగ్లవర్ణమాలలోని అన్ని అక్షరాలు కనిపించే వాక్యం గురించి ఆలోచించారా. అస్సలు అలాంటి వెరైటీ వాక్యం ఒకటి ఉంటుందన్న ఆలోచన వచ్చిందా. తెలుసుకోకపోయిన ఏం ఫర్వాలేదు ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకోండి. ఇంతకీ ఆ వాక్యం ఏంటంటే.. ‘ది క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ వోవర్ ది లేజీ డాగ్’ అనే వాక్యాన్ని గమనిస్తే ఆంగ్ల వర్ణమాలలోని అన్ని అక్షరాలు కనిపిస్తాయట. నిశితంగా గమనిస్తే ఆ విషయం మీకే తెలుస్తుంది. అలానే ఎన్నో రకాల వింత వింత ఫోబియాలు గురించి వినుంటారు. సంతోషం అంటే భయపడే ఫోబియా గురించి విన్నారా. అస్సలు అలాంటిది ఒకటి ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. ఔను మీరు వింటుంది నిజమే! . అలాంటి విచిత్రమైన ఫోబియా ఉందంట..దాన్ని చెరోఫోబియా అని పిలుస్తారట. సంతోషంగా ఉండటం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే కొందరు మాత్రం సంతోషంగా ఉండేందుకు భయపడతారట. దీనికి కారణం సంతోషంగా కనిపిస్తే ఎక్కడ కీడు జరగుతుందోననే మూఢ నమ్మకంతో సంతోషంగా ఉండరట. ఇది రాను రాను సంతోషంగా ఉండాలంటేనే భయపడేంతగా మారుతుందట. అందుకే ఈ లక్షణాన్ని చెరోఫోబియా అంటారు. చాలామంది ఎందువల్ల తెలియదు కొన్ని దురలవాట్లు ఉంటాయి. దూరం చేసుకోవాలనుకున్న ఏదో బలహీనత మళ్లీ ఆ చెడ్డఅలవాటే దగ్గరికి వెళ్లేలా చేస్తుంది. ఈ అలవాట్ల నుంచి ఎలా బయటపడాల్రా బాబు అని తలపట్టుకుంటారు. అలాంటి వాళ్లు నిజంగా మారాలి అని గట్టిగా కోరుకుంటే మాత్రం ముందుగా ఆ దురలవాటు జోలికి వెళ్లకుండా ఓ 21 రోజులు ట్రై చేస్తే చాలట. ఇక వాళ్లకి తెలియకుండానే ఆ అలవాటు నుంచి బయటపడతారట. అధ్యయనంలో తేలిందని నిపుణులు చెబుతున్నారు. ఇక కొన్ని కొత్త పదాలు ఓ పట్టాన అర్థం కావు. ఆంగ్ల పదంలా ఉన్న వేరే భాష మాదిరిగా ఉంటాయి. ఎందకంటే ఆ పదం అర్థం కాక. అట్లాంటి పదమే ‘వోవర్ మారో’. ఐతే దీని అర్థం వింటే ఓస్ ఇంతేనా అనేస్తారు. దీని అర్థం ది డే ఆఫ్టర్ టుమారో అని అర్థమట అంటే ఎల్లుండి అని. (చదవండి: ఏకే ఫ్లవర్ కాదు ఫైర్ బోల్ట్! అతి పెద్ద స్మార్ట్ వాచ్ బ్రాండ్!) -
జైల్లో చంద్రబాబు.. ఆంధ్రజ్యోతి టెక్నికల్ మిస్టేక్
Skill Development Scam బోడి గుండుకు మోకాలికి ముడి పెట్టడం అంటే ఎంటో పచ్చమీడియా చూస్తే అర్ధమవుతుంది. స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టు అయి జైలుకు వెళితే.. పచ్చమీడియా దీనిపై మాత్రం మాట్లాడదు. కేసులో చంద్రబాబు పాత్రపై ఎల్లో మీడియా మాట్లాడదు. అయితే విచిత్ర వాదనలతో కేసును బలహీనపరిచేందుకు ఎల్లో మీడియా కుయుక్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ స్కామ్.. జగన్ స్కీమ్ అంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే దీని నిజానిజాలేంటో ఒకసారి చూద్దాం. స్కిల్ స్కాం కేసులో తీవ్రమైన అవినీతి జరిగిందని, ఆధారాలతో సహా బయటపడింది. అయితే ఆ ఆధారాలను తప్పు అని ప్రచారం చేసే బాధ్యతను టీడీపీ అనుకూల మీడియా భుజానికెత్తుకుంది. ఇందులో భాగంగానే కళ్లముందు వాస్తవాలు కనిపిస్తున్నా… అబద్ధాలను అసలు సిసలైన వాస్తవాలుగా ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతోంది. స్కిల్ స్కాం కేసులో తీవ్రమైన అవినీతి జరిగిందని… నిధులు దారి మళ్లించారని ఫొరెన్సిక్ ఆడిటింగ్‌లో తేలింది.ప్రఖ్యాత ఆడిటింగ్ సంస్థ శరత్ అండ్ అసోసియేట్స్ఈ ఫొరెన్సిక్ ఆడిటింగ్ పూర్తి చేసి దాదాపు 70షెల్ కంపెనీల ద్వారా ప్రభుత్వ నిధులు సుమారు 241 కోట్ల రూపాయలు దారి మళ్లాయని నివేదించింది. ఇదే విషయాన్ని సీఐడి తన విచారణ నివేదికలో స్పష్టంగా కోర్టుకు సమర్పించింది. అయితే కోట్ల రూపాయల ప్రజాధనం దారిమళ్లిన విషయంపై నోరు మెదపని పచ్చమీడియా… ఆడిటింగ్ సంస్థపై బురద జల్లుతోంది. శరత్ అండ్ అసోసియేట్స్ అనే సంస్థతో ఏపీ ముఖ్యమంత్రికి సంబంధం ఉందని కథలు అల్లుతోంది. ఈ కథనానికి ఆంధ్రజ్యోతి పత్రిక చెప్పిన కారణాలు చూస్తే.. బుర్ర ఉన్నవాళ్లేవరైన ఇది అబద్ధపు వార్త అని అర్ధం చేసుకుంటారు. శరత్ అండ్ అసోసియేట్స్ వెబ్‌సైట్‌తో పాటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కంపెనీలకు చెందిన ఆడిటర్స్ ఐవీఎస్ అండ్ అసోసియేట్స్ వెబ్ సైట్ ఒకే సర్వర్‌లో ఉందనేది ఆంధ్రజ్యోతి ఆరోపణ. అసలు సర్వర్లు ఎవరు హోస్ట్ చేస్తారు.. వాటికి ఐపీ అడ్రస్‌లు ఎలా కేటాయిస్తారు అనేది తెలిస్తే… ఆంధ్రజ్యోతివి పిచ్చిరాతలని స్పష్టమైపోతుంది. అసలు ఆంధ్రజ్యోతి రాసినట్లు శరత్ అండ్ అసోసియేట్స్, ఐవీఎస్ అసోసియేట్స్ వెబ్‌సైట్స్ ఒకే సర్వర్‌లో ఉన్నాయా అనేది పరిశీలిస్తే ఇది పూర్తి అవాస్తవం. ఆంధ్రజ్యోతి రాసిన వార్తలోనే చాలా స్పష్టంగా రెండు వేరు ఐపి అడ్రస్‌లు కనిపిస్తున్నాయి. ఇందులో శరత్ అండ్ అసోసియేట్స్ ఐపి అడ్రస్-115. 124. 126. 242. 80కాగా ఐవీఎస్ అండ్ అసోసియేట్స్ ఐపి అడ్రస్-115.124.126.216.80 అని ఆంధ్రజ్యోతే రాసింది. మరి రెండు వేరు ఐపి అడ్రస్‌లు ఉంటే ఒకే అడ్రస్‌లో ఉన్నాయని ఆంధ్రజ్యోతి రాయడం హాస్యాస్పదం. ESDSఅనేది కేవలం డొమైన్ ప్రొవైడర్ మాత్రమే చాలా కంపెనీలు డొమైన ఒక కంపెనీ ద్వారా హోస్ట్ ఇంకోచోట రిజిస్టర్ చేసుకుంటారు. ఇక ESDS అనేది కేవలం డొమైన్ ప్రొవైడర్ అయినంత మాత్రానా ఈ కంపెనీల డేటా వీరివద్దే ఉందనడానికి ఆధారాలు లేవు. ఒకసారి ఐపీ అడ్రస్‌లు వాటి వెనక ఉన్న టెక్నికల్ ఇష్యూస్ చూస్తే ఆంద్రజ్యోతి వార్త ఎంత పేలవమైందో అర్ధమైపోతుంది. వెబ్సైట్ హోస్ట్ చేయడం అనేది సాధారణంగా చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. అందుకే కంపెనీలు తమ వెబ్ సైట్ హోస్ట్ చేసేందుకు ఏదో ఒక సర్వీస్ ప్రొవైడర్ సహాయం తీసుకుంటాయి. ఇలాంటి సర్వీస్ ప్రొవైడర్లు ప్రపంచ వ్యాప్తంగా చాలా మందే ఉన్నారు. ఇందులో అమేజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్‌తో పాటు దేశీయ సర్వీస్ ప్రొవైడర్లు కూడా చాలా మందే ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం శరత్ అండ్ అసోసియేట్స్ , ఐవీఎస్ అండ్ అసోసియేట్స్ రెండు కంపెనీల వెబ్సైట్లు ESDS అనే సంస్థ హోస్ట్ చేస్తోంది. కాని ESDS హోస్ట్ చేస్తున్న కంపెనీల లిస్ట్ చూస్తే అసలు విషయం అర్ధం అవుతుంది. ESDS కంపెనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా కంపెనీల వెబ్సైట్లు హోస్ట్ చేస్తోంది. ఇందులో టాటా క్యాపిటల్, యూనియన్ బ్యాంక్, ముత్తూట్ ఫైనాన్స్ , సిడ్బి, యాక్సిస్ అస్సెట్ మేనేజ్మెంట్లాంటి కార్పోరేట్ సంస్థల వెబ్సైట్లు ESDSహోస్ట్ చేస్తోంది. దీంతో పాటు చెన్నై స్మార్ట్‌సిటి, ఎస్టిపీఐ, కేంద్ర గృహనిర్మాణశాఖలాంటి దాదాపు 200లకు పైగా ప్రభుత్వ వెబ్సైట్లు సైతం ESDSహోస్ట్ చేస్తోంది. ESDS క్లయింట్ లిస్ట్ చూస్తే ప్రెస్టీజ్ కుక్కర్, జేకే సిమెంట్, ఎస్సార్, ఎల్ అండ్ టీలాంటి దిగ్గజ కంపెనీలు సైతం ఉన్నాయి. అలాంటి సందర్భంలో కేవలం రెండు ఆడిటింగ్ కంపెనీలు మాత్రమే ఉన్నాయని ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు రాసింది. ఇక ఆంధ్రజ్యోతి రాసిన కథనం ప్రకారం.. రెండు కంపెనీల సర్వర్ ఒకటే అని చెబుతున్న మాటల్లో ఎలాంటి వాస్తవాలు లేవు. శరత్ అండ్ అసోసియేట్స్ ఐపి అడ్రస్-115. 124. 126. 242. 80కాగా ఐవీఎస్ అండ్ అసోసియేట్స్ ఐపి అడ్రస్-115.124.126.216.80 అని పచ్చ మీడియానే రాసింది. ఇందులో115.124.126 అనేది ESDS డొమైన్ పూల్ కాగా తరువాత వచ్చే నెంబర్లు ఆయా కంపెనీ ఐపి అడ్రస్‌ను ఇండికేట్ చేస్తుంది. అంటే ఒక పిన్‌కోడ్‌లో మొదటి మూడు నెంబర్లు ఎలా కామన్‌గా ఉంటాయో అలా హోస్ట్‌కు మొదటి మూడు నెంబర్లు కామన్‌గా ఉంటాయి. ఒక బ్యాంకు బ్రాంచిలో ఖాతా ఉంటే వారి అకౌంట్ నెంబర్‌కు సంబంధించి 11నెంబర్లలో మొదటి 7నుంచి 8నెంబర్లు సేమ్‌గా ఉంటాయి. ఇక ఫోన్ నెంబర్లలో మొదటి నాలుగైదు నెంబర్లు సేమ్ ఉంటే వారిద్దరు డేటా షేర్ చేసుకున్నట్లా. ఇక తెలుగుదేశం పార్టీ తన వెబ్‌సైట్‌ను మైక్రోసాఫ్ట్ ద్వారా హోస్ట్ చేస్తోంది. ఇదే మైక్రోసాఫ్ట్ ఎన్నో ఈ కామర్స్ వెబ్సైట్లను హోస్టు చేస్తోంది. ఇక రెండు కంపెనీలు ఒకే హోస్టు ప్రొవైడర్ ద్వారా డొమైన్ రిజిస్టర్ చేసుకున్నా వారి డేటా ఒకే చోటా ఉండాలని లేదు. కంపెనీలు డొమైన్ రిజిస్ట్రేషన్ ఒకచోట డేటా హోస్టింగ్ మరో చోట చేసుకోవచ్చు. ఇదీ ఆంద్రజ్యోతి రాసి అడ్డమైన రాతల వెనక ఉన్న అసలు వాస్తవం. ఇక అబద్దాలను ప్రచారం చేస్తే అసలు వాస్తవాలు మరుగున పడతాయనేది ఎల్లో మీడియా తాపత్రయం. అందుకే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అసలు విషయాలు మాట్లాడకుండా.. ఇలా తప్పుడు రాతలతో బయటపడాలనేది పచ్చమీడియా ఆలోచన. -
రిమాండ్ రిపోర్ట్ లో సంచలన నిజాలు..
-
చంద్రబాబు ‘స్కిల్’ స్కాం.. విచారణలో బయటపడ్డ వాస్తవాలు
నిరుద్యోగులైన యువతీయువకులకు ఆశలు చూపించి దోపిడీ పర్వానికి చంద్రబాబు తెరలేపారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎలా వెలుగులోకి వచ్చింది.? ఇందులో బాబు పాత్ర ఏంటీ.? తీగలాగితే.. డొంక ఎలా కదిలింది.. కేసు విచారణలో బయటపడ్డ వాస్తవాలను పరిశీలిస్తే.. ♦జీవో నెంబర్-47లోని పారాగ్రాఫ్ నెంబర్-35లో అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఏర్పాటుపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా క్యాబినెట్ అనుమతి లేకుండా ఎలాంటి కార్పోరేషన్ ఏర్పాటు చేయకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ♦జీవో నెంబర్-2452లోని పారాగ్రాఫ్ నెంబర్-153లో పైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ చాలా స్పష్టంగా నిధుల విడుదలకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇందులో అప్పటి చీఫ్ సెక్రెటరీ ఐవైఆర్ కృష్ణారావు పారాగ్రాఫ్ నెంబర్-27లో నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు ♦తెలిపారు. ♦ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నిధులు విడుదల చేయాల్సినందిగా చీఫ్ సెక్రెటరీ ఐవైఆర్ కృష్ణారావు చెప్పినట్లు అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ స్పష్టంగా నోట్‌ఫైల్ రాశారు. ఈ ప్రాజెక్టులో నిధుల విడుదలపై మరోసారి పరిశీలించాల్సిందిగా జీవోనెంబర్-2452లో పారాగ్రాఫ్ నెంబర్-160లో అప్పటి ఆర్ధిక శాఖ కార్యదర్శి శ్రీమతి సునీత చాలా స్పష్టంగా అప్పటి ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరికీ నివేదించింది. ♦దీనిపై మరోసారి ఆలోచించిన ఆర్ధికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పారాగ్రాఫ్ నెంబర్-161, 162లో చీఫ్ సెక్రెటరీగా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు వెంటనే నిధులు విడుదల చేయాల్సిందిగా తనతో మాట్లాడినట్లు నోట్ ఫైల్లో రాశారు. సుబ్బారావు తనతో కలిసి నిధులు వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు జీవోలోని 46వ పేజీ ,పారాగ్రాఫ్-31లో ఉన్నట్లు అప్పటి సీఎస్ ఐవైఆర్ చెప్పడం వల్ల దానిన అమలు చేసినట్లు ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి పివిరమేష్ స్పష్టంగా రాశారు. ♦2015లో వివిధ దఫాలుగా రూ.371 కోట్ల రూపాయల బడ్జెట్ ఆర్డర్లు రిలీజ్ అయ్యాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన యంత్రాలపై అప్పటి ఆర్ధికశాఖ సెక్రెటరీ సునీత అభ్యంతరాలు చెప్పినప్పటికీ చంద్రబాబు ఆదేశాలతో నిధులు విడుదల చేశారు. ఈ స్కాంకు సంబంధించి 14.05.2018లో తొలిసారిగా పూనేలోని జీఎస్టీ కార్యాలయానికి ఫిర్యాదు అందింది. ♦దీనికి సంబంధించి జీఎస్టీ అధికారులు ఏపీ అవినీతి నిరోధక శాఖకు ఈ ఫిర్యాదును బదిలీ చేశారు. డిజైన్‌టెక్ సంస్థ ఫేక్ ఇన్వాయిస్లతో సర్వీస్ టాక్స్ ఎగ్గొట్టిందని ఫిర్యాదు సారాంశం. దీనికి సంబందించి చంద్రబాబుతో సహా అందరికి సమాచారం ఉన్నా ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డిజైన్ టెక్ వ్యవహారం బయటకు రావడంతో చంద్రబాబు అండ్ కో సాక్ష్యాధారాలను మాయం చేసింది. ఏకంగా 30.06.2016న విడుదలైన జీవో నెంబర్-4కు సంబంధించిన ఒరిజినల్ నోట్ ఫైల్.. సుబ్బారావు ఓఎస్డీ ఎన్వీకే ప్రసాద్(ఏ-5) ద్వారా మాయం చేశారు. చదవండి: ఏమో.. తెలియదు.. గుర్తు లేదు.. సీఐడీ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు -
మ్యాన్ హోల్ లో పడిన బాలుడి ఘటనలో వెలుగులోకి వాస్తవాలు
-
పుంగనూరు ఘటన వెనుక అసలు నిజాలు..
-
టాయిలెట్ల వెనక చాలా కథ ఉంది.. ఈ వింతలు, విశేషాలు తెలుసా? (ఫోటోలు)
-
Intresting Facts: పేరుకు మాత్రమే చెట్లు.. కానీ అవి చెట్ల సమాధులు
నమ్మలేని నిజాలు.. ఇది మీకు తెలుసా? ► నమీబియాలోని ‘డెడ్ వ్లయ్’లో 900 ఏళ్ల వయసు ఉన్న చెట్లు ఉన్నాయి. అయితే అవి పేరుకు మాత్రమే చెట్లు. పచ్చదనం లేకుండా ఎండిపోయిన చెట్లు! అందుకే దీన్ని ‘చెట్ల ఎడారి’ ‘చెట్ల సమాధులు’ అని పిలుస్తారు. ► చిలకలలో ‘డ్రాకూన్ చిలకలు వేరయా’ అని చెప్పుకోవచ్చు. పపువా న్యూ గినియాలోని రెయిన్ ఫారెస్ట్‌లో కనిపించే డ్రాకూల ప్యారట్స్ నలుపు, చార్కోల్ గ్రే రంగుల్లో ఉండి కొంచెంచెం భయపెట్టేలా ఉంటాయి. ► నార్వేలో ‘హెల్’ పేరుతో ఒక విలేజ్ ఉంది. టూరిస్ట్ ఎట్రాక్షన్లో భాగంగా ఆ పేరు పెట్టారు! -
టీడీపీ నేతల జీఎస్టీ స్కాంలో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేతల జీఎస్టీ స్కాంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దేశ వ్యాప్తంగా 2600 బోగస్ కంపెనీలను జీఎస్టీ విజిలెన్స్ విభాగం గుర్తించింది.. ఢిల్లీ కేంద్రంగా 10వేల కోట్లకు పైగా స్కాం జరిగినట్లు బట్టబయలైంది. హైదరాబాద్‌లో 326పైగా బోగస్ కంపెనీలను అధికారులు గుర్తించారు. రాత్రికి రాత్రికి బోగస్ గోదాంలు సృష్టిస్తున్న జీఎస్టీ ఫేక్ బిల్లింగ్ మాఫియా.. ఇతరుల ఆధార్, పాన్ కార్డ్ లతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు పొందుతున్నారు. ఎలాంటి స్టాక్ లేకుండా 4 నుండి 6 శాతానికి బోగస్ కంపెనీల నుంచి వ్యాపారవేత్తలు బిల్స్ కొంటున్నారు. బోగస్ కంపెనీల నుంచి కొంటున్న బిల్స్‌ని 15 నుండి 18 శాతానికి వ్యాపారవేత్తలు అమ్ముతున్నారు. బిల్స్ లేకుంటే కంపెనీలు స్టాక్ రిజెక్ట్ చేస్తుండటంతో జీఎస్టీ మాఫియా.. బోగస్ కంపెనీలు సృష్టించి సొమ్ము చేసుకుంటున్నాయి. బోగస్ కంపెనీలపై దాడులకు జీఎస్టీ అధికారులు సిద్దమవుతున్నారు. చదవండి: జీఎస్టీ అధికారి కిడ్నాప్ కేసులో గుంటూరు టీడీపీ నేతలు కాగా, జీఎస్టీ సీనియర్ అధికారిని కిడ్నాప్ చేసిన కేసులో గుంటూరు టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గుంటూరు నగర టీడీపీ నేత సయ్యద్ ముజీబ్, ఆయన కుటుంబ సభ్యులు సయ్యద్ ఫిరోజ్, సయ్యద్ ఇంతియాజ్‌లకు హైదరాబాద్ సరూర్‌నగర్ పరిధిలోని క్రాంతినగర్ రోడ్ నంబర్ 2లో ఇనుము వ్యాపారం ఉంది. ప్రస్తుతం గుంటూరులోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. జీఎస్టీ చెల్లించకపోవటంతో బుధవారం జీఎస్టీ, ఇంటెలిజెన్స్ అధికారులు హైదరాబాద్‌లోని దుకాణాన్ని సీజ్‌చేసేందుకు వెళ్లారు. ఆ అధికారులపై ముజీబ్, ఫిరోజ్, ఇంతియాజ్, వారి కారు డ్రైవర్ షేక్ ముషీర్ దాడిచేశారు. గుంటూరు నుంచి తాము వెళ్లిన కారులోనే అధికారుల్ని కిడ్నాప్ చేశారు. అధికారుల డ్రైవర్ ద్వారా సమాచారం అందుకున్న సరూర్‌నగర్ పోలీసులు కిడ్నాప్‌నకు పాల్పడిన నలుగురిని అదుపులోకి తీసుకుని అధికారులను రక్షించారు. ముజీబ్ ప్రస్తుతం గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. లోకేశ్ పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. హైదరాబాద్‌లో కిడ్నాప్ వ్యవహారంలో గుంటూరు టీడీపీ నేతలు అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది. -
హనుమంతుడు గురించి 10 ఆసక్తికరమైన విషయాలు
-
మనిషి మృతితో యాక్టివ్‌గా మారే హార్మోన్.. ఏం చేస్తుందంటే...
ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు. అయితే ఏ మనిషికైనా మృత్యువు సమీపించినప్పుడు అతను ఎటువంటి అనుభూతికి గురవుతాడనేదానిపై లెక్కలేనన్ని పరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కాగా ఒక నిపుణుడు దీనిపై పలు వివరాలు వెల్లడించారు. లివర్ పూల్ యూనివర్శిటీకి పరిశోధకుడు సీమస్ కోయల్ అందించిన ఒక ఆర్టికల్‌లోని వివరాల ప్రకారం.. మనిషి మరణించే ప్రక్రియ అతనిలో రెండు వారాల ముందే మొదలవుతుంది. అతని ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. నిద్రించడం కూడా ఎంతో ఇబ్బందికరంగా మారుతుంది. జీవితపు చివరి రోజుల్లో మనిషి ఔషధాలు తీసుకోవడంలో, భోజనం చేయడంలో, ఏదైనా తాగడంలోనూ తగిన సామర్థ్యాన్ని కోల్పోతాడు. మరికొందరు పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం మెదడు నుంచి పలు రసాయనాలు విడుదలవుతాయి. వాటిలో ఒకటి ఎండోఫ్రిన్. ఈ రసాయనం మనిషి భావాలను అమితంగా ప్రభావితం చేస్తుంది. మనిషి తాను మరణించే సమయాన్ని అర్థం చేసుకోవడం ఎంతో కష్టం. అయితే ఇప్పటివరకూ అందిన పలు పరిశోధనల వివరాల ప్రకారం మనిషి మృత్యువుకు సమీపిస్తున్న కొద్దీ అతని శరీరంలో స్ట్రెస్ కెమికల్ వృద్ధి చెందుతూ ఉంటుంది. క్యాన్సర్ బాధితులకు మరణ సమయంలో శరీరం వాపునకు గురవుతుంది. మరణించే సమయంలో మనిషిలో శారీరక నొప్పులు తక్కువకావడం విశేషం. ఇలా ఎందుకు జరుగుతుందో పరిశోధకులకు కూడా ఇంతవరకూ అంతుచిక్కలేదు. అయితే ఇది ఎండోఫ్రిన్ కారణంగానే జరుగుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. కాగా ప్రతీ మనిషి మృతి ఒక్కో విధంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో మృత్యువుకు సంబంధించిన పలు విషయాలు పరిశోధకులకు సైతం అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయాయి. చదవండి: ఆ రోడ్డుపై ప్రయాణిస్తూ 14 దేశాలు దాటేయొచ్చు.. ఎక్కడుందో తెలుసా! -
ఆ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు ప్లాన్.. భోపాల్-హైదరాబాద్ ఉగ్ర కోణంలో సంచలన నిజాలు
సాక్షి, హైదరాబాద్: భోపాల్ ఉగ్రవాదుల కేసులో పలు కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. భోపాల్-హైదరాబాద్ ఉగ్ర కోణంలో నిజాలు బయటపడుతున్నాయి. కస్టడీలో నిందితుల నుంచి ఏటీఎస్ పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. హైదరాబాద్- భోపాల్ యువకులకు జిమ్ ట్రైనర్ యసిర్ ఉగ్ర శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. భోపాల్ శివార్లలో యువకులకు హెచ్‌యూటీ శిక్షణ ఇచ్చినట్టు గుర్తించారు. హెచ్‌యూటీ కోడ్ భాషలో ఫిదాయీ అంటే.. ఆత్మాహుతి దాడి అని ఏటీఎస్ గుర్తించింది. 16 మంది హిజ్బుత్ సభ్యులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం లోతుగా విచారిస్తోంది. భోపాల్‌లోని.. భోజ్‌పురా సమీపంలోని రైసన్ అడవుల్లో యువతకు ఉగ్ర కర్యకలాపాలపై శిక్షణ ఇచ్చినట్లు గుర్తించగా, అరెస్ట్ అయిన వారి వద్ద పలు వీడియోలు.. కోడ్ భాషలో వున్న 50కి పైగా ఆడియోలు స్వాధీనం చేసుకున్నారు. భోపాల్‌లోని శాంతి ద్వీపం పేల్చేయాలన్న కోడ్ భాషను ఏటీఎస్ డీకోడ్ చేసింది. శాంతి ద్వీపం పేల్చడం అంటే.. బాంబు పేలుళ్లు జరపడం అని ఏటీఎస్ గుర్తించింది. చదవండి: అవసరమైతే ఆత్మాహుతి దాడులు! భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్, మోతీలాల్ నెహ్రూ స్టేడియం, బరాసియా డ్యాం వద్ద బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు గుర్తించారు. ఉగ్ర కార్యకలాపాల కోసం విదేశాల నుండి హవాలా మార్గం లో నిధులు వచ్చినట్టు ఏటీఎస్ బృందం గుర్తించింది. -
నర్రెడ్డి సోదరులు చెప్పినట్టే చేశా: కృష్ణ రెడ్డి
-
వివేకా హంతకుల్ని నడిపిస్తున్నదెవరు.?
-
‘రామోజీ’ రహస్యాలు.. మరిన్ని సంచలనాలు వెలుగు చూస్తాయా?
ఈనాడు అధినేత రామోజీరావు బాధ అర్ధం చేసుకోదగిందే. తన కంపెనీల గుట్టు, మట్లు అన్ని అధికారులకు తెలిసిపోతాయన్న ఆయన ఆందోళన గమనించదగిందే. ఏపీ సీఐడి అధికారులు బ్రహ్మయ్య అండ్ కో ఆడిట్ కంపెనీ నుంచి మార్గదర్శి చిట్ ఫండ్‌కు సంబంధించిన సమాచారమే కాకుండా, డాల్ఫిన్స్ హోటల్స్, ఉషోదయ ఎంటర్ ప్రైజెస్, ఉషోదయ పబ్లికేషన్స్, ఈటివి, మార్గదర్శి ఇన్వెస్టెమెంట్ అండ్ లీజింగ్ కంపెనీ లిమిటెడ్, ఎల్.చిమన్ లాల్ ఇండస్ట్రీలకు చెందిన సమాచారం సీఐడీ తీసుకువెళ్లిందని బ్రహ్మయ్య అండ్ కంపెనీ తెలంగాణ హైకోర్టుకు సమర్పించిన అనుబంధ పిటిషన్లో తెలిపింది. చట్ట ప్రకారం కేసుతో సంబంధం ఉన్న సమాచారాన్నే సీఐడీ అధికారులు తీసుకువెళ్లాలని, దానికి విరుద్దంగా సంబంధం లేని వాటిని, ఇతర ఖాతాదారుల సమాచారాన్ని తీసుకువెళ్లారని ఈ సంస్థ తెలిపింది. ఇలా తీసుకువెళ్లిన సమాచారాన్ని కాపీ చేయకుండా తిరిగి ఇచ్చేలా ఆదేశించాలని ఈ సంస్థ కోరింది. లేనిపక్షంలో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కింది. నిజమే. ఒక్కోసారి ఆయా సంస్థలలో సమాచారం బయటకు వస్తే కొంత నష్టం జరగవచ్చు. అది ఎప్పుడు జరుగుతుంది? ఆ సంస్థల ఆర్దిక లావాదేవీలలో ఏవైనా అవకతవకలు ఉంటే, అవి అందరికి తెలిసిపోతే, ముఖ్యంగా ప్రభుత్వానికి తెలిస్తేనే కదా నష్టం జరిగేది. ఆర్ధిక విషయాలు కాకుండా ఏదైనా కెమికల్ ఫార్ములానో, మరో రహస్య సమాచారాన్నో లీక్ చేస్తే తప్పు అవుతుంది. ఆడిటింగ్ సంస్థ పని చేసేది ఆయా సంస్థలలో ఉన్న తప్పు, ఒప్పులను కనిపెట్టి వాటిని సంబంధిత కంపెనీలకు తెలియచేసి సరిచేయడానికే కదా! ఆ తర్వాత ప్రభుత్వానికి ఆ ఆడిట్ నివేదికలు సమర్పించడానికే కదా! మరి అలాంటప్పుడు ఇందులో ఉండే రహస్యాలేమిటన్నది అర్ధం కాదు. ఒక్కోసారి ప్రైవేటు కంపెనీలతో ఆడిట్ సంస్థలు కుమ్మక్కు అవుతుంటాయన్న అభియోగాలు ఉన్నాయి. సత్యం రామలింగరాజు కేసులో ఒక ఆడిట్ సంస్థపై కేంద్ర ప్రభుత్వం చర్యలు కూడా తీసుకున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. నిజానికి బ్రహ్మయ్య అండ్ కంపెనీ చాలాకాలంగా ఉన్న సంస్థే. పేరు, ప్రఖ్యాతులు ఎన్నదే. అయినా ఆ కంపెనీవారు రామోజీరావుకు చెందిన మార్గదర్శి కేసులో కాని, ఆయనకు చెందిన ఇతర కంపెనీల సమాచారం విషయంలో ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నది తెలియదు. మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో అవకతవకలు జరుగుతున్నాయన్నది సీఐడీ అధికారుల ఆరోపణ. అందులో వాస్తవం ఉందా?లేదా? అన్నదాని గురించి రామోజీరావు కాని, ఆయన కోడలు శైలజకాని, ఆయన తరపున లాయర్లు కాని ఎందుకు చెప్పడం లేదు. ఎంతసేపు ఎవరూ ఫిర్యాదు చేయలేదు కనుక తమ జోలికి రాకూడదని డిమాండ్ చేయడం సరైన చర్యేనా అన్న ప్రశ్న వస్తుంది. ఉదాహరణకు ఆదాయపన్ను శాఖకు ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా, చాలా పెద్ద,పెద్ద కంపెనీలపై దాడులు, సోదాలు జరుపుతుంటుంది. అదే విధంగా సీబిఐ, ఈడీ వంటి సంస్థలు కూడా తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంటాయి. తద్వారా ఆయా సంస్థలు అక్రమాలకు పాల్పడకుండా చూడడం వారి విధి. అదే విధంగా చిట్ ఫండ్ చట్టాన్ని పర్యవేక్షించే రిజిస్ట్రేషన్ అధికారులు కూడా తమ బాధ్యత నిర్వహిస్తుండాలి. నిజంగానే ఆ సోదాలలో ఎలాంటి అక్రమ లావాదేవీలు కనిపించలేదనుకోండి. అప్పుడు ఆ సంస్థ క్రెడిబిలిటి పెరుగుతుంది కదా!. గతంలో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఏ సహ పెట్టుబడిదారుడు ఫిర్యాదు చేయకపోయినా, రాజకీయంగా ఎవరో చేసిన ఆరోపణ ఆధారంగా విచారణకు హైకోర్టు ఎలా ఓకే చేసింది? ఆ తర్వాత ఇష్టారాజ్యంగా సీబిఐ ఈడీ వంటివి ఎలా సోదాలు, దాడులు నిర్వహించాయి. అయినా ఆ సందర్భంలో ఒక్క చోట కూడా వీరికి ఎలాంటి అక్రమ లావాదేవీల ఆధారాలు దొరకకపోబట్టే కదా క్విడ్ ప్రోకో అని కొత్తది కనిపెట్టి రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాల ఆధారంగా కేసులు పెట్టింది. దానివల్ల ఏపీకి పరిశ్రమలు రావడానికి భయపడే పరిస్థితిని కాంగ్రెస్, తెలుగుదేశంలు కలిసి సృష్టించాయన్న ఆరోపణ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే కదా! ఆ రోజుల్లో జగన్ గాని, ఆయన తరపు మనుషులు కాని తమ కంపెనీలలో సోదాలు చేయవద్దని ఎక్కడా చెప్పలేదు కదా! వారు పెట్టిన కేసులపై పోరాడుతున్నారే కాని ఏదో రహస్య సమాచారం తీసుకువెళ్లారని గగ్గోలు పెట్టలేదు కదా!. జగన్ కేసుల సమయంలో కాని, ఇతరత్రా ఆయా కేసుల విచారణలో కాని కూపీ లాగినట్లు, పరిశోధించి కనిపెట్టినట్లు రాసే ఈనాడు పత్రిక తనవరకు వచ్చేసరికి ఎందుకు ఇంతగా భయపడుతోంది. ప్రభుత్వపరంగా ఏ చిన్న విషయం దొరికినా, దానిని చిలవలు పలవలు చేసి బ్యానర్లు కట్టి కథనాలు ఇచ్చే ఈనాడు దినపత్రిక తను మాత్రం గోప్యంగా ఉండాలని అనుకుంటోంది. తన రహస్య సమాచారం ఎవరికి ఎందుకు తెలియకూడదని చెబుతోంది. ఇవన్ని కాదు. ఎంతసేపు తమపై ఫిర్యాదు చేయలేదనో, మరొకటనో వాదించే బదులు, తమ సంస్థలో ఏ ఒక్క అవకతవక జరగలేదని సవాల్ చేసి ఎందుకు చెప్పడం లేదు?తాజాగా సీఐడీ బ్రహ్మయ్య అండ్ కంపెనీలో సేకరించిన సమాచారం ప్రకారం కోట్లాది రూపాయల చెక్ లు ,నగదు కేవలం రికార్డులలోనే చూపారు తప్ప, వాటిని ఎక్కడ జమ చేసింది? అసలు నిజంగానే ఆ చెక్కులు ఉన్నాయా?లేవా? ఒకవేళ ఉంటే వాటిని ఏ ఇతర సంస్థలలోకి జమ చేశారు? అన్న వివరాలు లేవని వార్తలు వచ్చాయి. వీటికి సంబంధించి ఈనాడులో వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది కదా! అలాగే మార్గదర్శి బ్రాంచ్‌ల నుంచి చిట్స్ డబ్బును హైదరాబాద్ కేంద్ర కార్యాలయానికి తరలించవచ్చా?. అలా తరలించడం తప్పు అయితే దానికి రామోజీరావు లేదా ఆయన కోడలు శైలజ ఇచ్చే సమాధానం ఏమిటి?తప్పు కాకపోతే అదే విషయం చెప్పి ఉండవచ్చు. ఒకవేళ సీఐడీ తొందరపడితేనో, చట్ట విరుద్దంగా వ్యవహరిస్తేనో, ఆ అధికారులే చిక్కులలో పడతారు కదా?. రామోజీరావుకు ఆయా వ్యవస్థలలో, కేంద్ర స్థాయిలో ఉన్న పరపతి తెలియనిదా? పైగా ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్త ప్రచారం అయింది. రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు కుటుంబంలో జరిగిన ఒక ఫంక్షన్ కు న్యాయవ్యవస్థలోని అత్యున్నత అధికారితో సహా సుమారు పాతికమంది న్యాయమూర్తులు హాజరయ్యారట. అంత మాత్రాన వారికి తప్పు ఆపాదించజాలం. కాని ప్రజలలో ఒక అపోహ ఏర్పడే అవకాశం ఉంటుంది కదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏపీకి సంబంధించిన మార్గదర్శి కేసును తెలంగాణ హైకోర్టు విచారించడం కూడా న్యాయవర్గాలను ఆశ్చర్యపరచిందట. తనకు ఉన్న లాయర్ల శక్తితో వీరిపై ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశాలు సాధించగలిగారు కదా? అలాగే బ్రహ్మయ్య అండ్ కంపెనీ కేసు విషయంలో కూడా యధాతధ స్థితి ఆదేశాలు వచ్చాయి. కాకపోతే అప్పటికే సిఐడి తన పని ముగించుకుని తాను సేకరించిన ఆధారాలను కోర్టులో సబ్మిట్ చేసిందట. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ న్యాయవాది గోవింద రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. టైమ్ ముగిసిన తర్వాత కూడా మార్గదర్శి కేసును హైకోర్టు ఎలా విచారిస్తుందని, అదే ఒక సామాన్య మానవుడి కేసు అయితే ఇలా చేస్తారా అని అంటూ ,దీనివల్ల మార్గదర్శికో నీతి, సామాన్యుడికో నీతి అని ప్రజలు భావించే అవకాశం ఉందని అన్నారని వార్తలు వచ్చాయి. రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణకుమార్ అదే విషయం పదే, పదే చెబుతుంటారు. రామోజీరావు కేసుల్లో ప్రతివాదికి అవకాశం ఇవ్వకుండా కూడా కొన్నిసార్లు కోర్టులు కొట్టివేశాయట. రామోజీకి దేశంలో ఉన్న పలుకుబడి అటువంటిదని ఆయన అభిప్రాయపడుతుంటారు. అలాంటి రామోజీరావును ఎ 1గాను, ఆయన కోడలు శైలజను ఎ 2 గాను అంటే నిందితులుగా చేసి కేసు పెట్టడం అంటే ఏపీ ప్రభుత్వానికి ఎంత గట్స్ ఉండాలని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. చదవండి: తన్నారు.. తిన్నారు.. చంద్రబాబు, రామోజీరావు అసలు బండారం మరి ఇందులో సీఐడీ ఎంత పురోగతి సాధిస్తుంది? మార్గదర్శి కేసును లాజికల్ ముగింపునకు ఎలా తీసుకువెళుతుందన్నది అత్యంత ఆసక్తికరం అయిన ఘట్టం అవుతుంది. ఈ కేసులో బహుశా మరిన్ని సంచలనాలు వెలుగు చూడవచ్చని ప్రచారం జరుగుతోంది. నిత్యం ప్రభుత్వం, ఆయా సంస్థలు పారదర్శకంగా ఉండాలని నీతులు చెప్పే రామోజీరావు తన వరకు వచ్చే సరికి ఎందుకు ఇంత గోప్యం పాటిస్తున్నారా?. ఇందులో ఉన్న చిదంబర రహస్యం ఏమిటో? -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ -
అంతా ఆమె కోసమే చేశాడా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసులో వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హత్య చేసిన తర్వాత నిందితుడు హరిహర కృష్ణ బ్రాహ్మణపల్లిలోని స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లి, ఆ రోజు రాత్రి అక్కడే గడిపినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు హసన్‌ను విచారించారు. హత్యకు ముందు పెద్ద అంబర్‌పేటలో మద్యం తాగి.. అబ్దుల్లాపూర్‌మెట్ శివారు ప్రాంతాలకు వచ్చిన తర్వాత హరి యువతితో సహజీవనం విషయాన్ని నవీన్‌కు తెలిపాడని, ఈ విషయమై ఇద్దరి మధ్య తగాదా జరిగిందని హరే తనతో చెప్పాడని హసన్ పోలీసులకు వివరించినట్లు తెలిసింది. ‘‘దీంతో ఇద్దరి మధ్య తగువులాట జరిగింది, గొడవ పెద్దది కావటం, అప్పటికే నవీన్‌ను హతమార్చాలని నిర్ణయించుకున్న హరి మద్యం మత్తులో నవీన్ గొంతు నులుమి హత్య చేశాడు. నవీన్ మరణించాడని నిర్ధారించుకున్న తర్వాత హరి పైశాచికత్వంతో శరీర భాగాలను వేరు చేయాలని భావించాడు.. నవీన్ మృతదేహాన్ని ఎవరూ గుర్తించకూడదనే ఉద్దేశంతోనే చేతి వేళ్లు, పెదాలు, గుండె, మర్మాంగాలను కత్తితో కోసి, ధ్వంసం చేసినట్లు హరి తనతో వివరించాడని’’హసన్ పోలీసులకు తెలిపాడు. యువతి సెల్ఫోన్లో కీలక ఆధారాలు.. ఈ కిరాతక హత్య కేసులో యువతి పాత్రపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. యువతి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు పలు కీలక ఆధారాలను గుర్తించినట్లు సమాచారం. హత్య అనంతరం హరి.. నవీన్ శరీర భాగాలను వేరు చేసే వీడియో, ఫొటోలను యువతికి పంపించినట్లు పోలీసులు గుర్తించారు. ఆయా భయానక దృశ్యాలను చూసిన యువతి అస్వస్థతతకు గురైనట్లు సమాచారం. ఆయా వివరాలను తల్లిదండ్రులతో కూడా పంచుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. తొలుత నవీన్‌తో ప్రేమ వ్యవహారాన్ని నడిపిన యువతి.. కొన్నేళ్ల తర్వాత నవీన్‌ను దూరం పెట్టింది. ఆ తర్వాత నిందితుడు హరిహర కృష్ణతో రిలేషన్షిప్ కొనసాగించింది. అయితే ఈ వ్యవహారం నవీన్‌కు తెలియకపోవటంతో.. తరుచూ యువతికి ఫోన్ చేయడం, సందేశాలు పంపించేవాడని పోలీసుల విచారణలో బయటపడింది. నవీన్ వ్యవహారాన్ని హరితో యువతి చెప్పకుండా గోప్యంగా ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. ఎందుకు గోప్యత పాటించింది? దురుద్దేశం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే హరి, నవీన్‌లు అప్పటికే స్నేహితులు. యువతితో హరి కలిసి ఉన్న క్రమంలో అమ్మాయికి నవీన్ పదే పదే ఫోన్ చేస్తుండటాన్ని గమనించిన హరి.. నవీన్ బతికి ఉంటే ఎప్పటికైనా ఇబ్బందేనని, ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుందనే అక్కసుతోనే ఇంతటి దారుణానికి ఒడిగట్టి ఉంటాడని ఓ పోలీసు అధికారి తెలిపారు. హరిని కస్టడీకి కోరిన పోలీసులు రంగారెడ్డి కోర్టులు: కేసును లోతుగా విచారించేందుకు నిందితుడు హరిని ఎనిమిది రోజుల పోలీసు కస్టడీకి కోరుతూ మంగళవారం రంగారెడ్డి జిల్లా ఎస్సీఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం కేసుని బుధవారానికి వాయిదా వేసిందని ఏసీపీ శేరి ప్రతాప్ రెడ్డి తెలిపారు. నిందితుడితో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయవలసి ఉందని, హత్యకు సంబంధించి నిందితుడికి మరెవరైనా సహకరించారా అనే కోణంలో విచారణ జరపాల్సి ఉందని ఏసీపీ చెప్పారు. మృతుడి సెల్ ఫోన్ ఆచూకీ తెలుసుకోవడంతో పాటు నిందితుడి సెల్ ఫోన్‌ని కూడా స్వాధీనపర్చుకోవాల్సి ఉందని తెలిపారు. -
నవీన్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన హసన్
-
వీడు మామూలోడు కాదు.. నార్త్ కొరియాలో వింత చట్టాలు..
-
బ్రష్ చేయడం కూడా మరిచిపోతున్నారా?.. అయితే కారణం ఇదే..
సాక్షి, గుంటూరు మెడికల్: ఆధునిక జీవన శైలి వల్ల మతిమరుపు బాధితుల సంఖ్య ప్రతి ఏడాది పెరిగిపోతోంది. వయస్సు పెరుగుతున్న కొద్ది మతిమరుపు రావటం సహజంగా జరుగుతోంది. దీనినే అల్జీమర్స్ వ్యాధి అంటారు. ఆరోగ్య సంస్థల నివేదిక ప్రకారం ప్రతి 32 సెకన్లకు ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జబ్బు సోకిన వారికి సహాయకులుగా ఉండేవారికి అవగాహన కల్పించటం కోసం 1983 నుంచి ప్రతి ఏడాది నవంబర్ నెలను అల్జీమర్స్ అవగాహన నెలగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి ’ అందిస్తున్న ప్రత్యేక కథనం. నియంత్రణే తప్ప నివారణ లేని వ్యాధి.. ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తి కొంతదూరం వెళ్లాక ఇంటి అడ్రస్ మర్చిపోవడం, తన పేరు కూడా రోగి మర్చిపోయే స్థితికి చేరుకోవడం ఈ జబ్బు లక్షణం. ఆధునిక జీవనశైలి వల్ల ప్రతి విషయాన్ని కూడా స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్స్‌లో ఆన్లైన్లోనే వెతుకుతూ మెదడును ఏ మాత్రం వాడకుండా వదిలివేయడంతో వ్యాధి బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వ్యాధి వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందస్తుగా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవటం చాలా ఉత్తమం. నియంత్రణే తప్పా నివారణ లేనిది ఈ వ్యాధి. వ్యాధి లక్షణాలు.. అల్జీమర్స్ వ్యాధి సోకిన వారు తమ పేరు కూడా మర్చిపోతారు. బంధువులు, కుటుంబ సభ్యుల పేర్లు మర్చిపోవడంతో పాటుగా వారిని గుర్తించటం కూడా కష్టమే. ఈ వ్యాధి ఎక్కువగా 60 సంవత్సరాలు దాటిన వారిలో వస్తోంది. నేడు 40 ఏళ్ల వారిలో కూడా వ్యాధి లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. వ్యాధి రావటానికి కారణాలు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 4.6 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వ్యాధి రావడానికి జన్యుపరమైన కారణాలు, కుటుంబంలో ఒకరికి వ్యాధి ఉంటే వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. జీవనశైలిలో మార్పులు, నిద్రలేమి, ఒత్తిడికి గురవ్వడంతో పాటుగా బీపీ, షుగర్, గుండెజబ్బు వంటి దీర్ఘకాలిక వ్యాధి బాధితులు సైతం వ్యాధి బారిన పడుతున్నారు. రోజువారి పనులు సైతం మర్చిపోతారు.. వ్యాధిగ్రస్తులు రోజు వారి కార్యక్రమాలు మర్చిపోతారు. స్నానం చేయడం, బ్రష్ చేయడం, తిండితినటం కూడా మర్చిపోతారు. వస్తువులను ఎక్కడో పెట్టి ఆ విషయాన్ని మర్చిపోయి ఎవరో దొంగిలించినట్లుగా అనుమానించటం, చెప్పిన విషయాన్నే పదే పదే చెప్పడం, వస్తువుల పేర్లు మర్చిపోవడం, వాటిని ఏ విధంగా వినియోగించాలో, ఎందుకు కోసం వినియోగించాలో అనే అంశాలను సైతం మర్చిపోవడం రోగిలో కనిపిస్తాయి. ఇంటికి తాళాలు వేయడం, కూరలో ఉప్పువేయడం, పాలల్లో తోడు వేయటం వంటివి మర్చిపోవటం వ్యాధిగ్రస్తుల్లో కనిపిస్తాయి. జీజీహెచ్‌లో మెమరీ క్లినిక్.. అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు జీజీహెచ్ న్యూరాలజీ ఓపీ వైద్య విభాగంలో మంగళ, గురు, శనివారాల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతి రోజూ 10 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వ్యాధిని పెరగనీయకుండా చేయడం తప్పా పూర్తిగా తగ్గించేందుకు మందు లేదు. జిల్లాలో 25 మంది న్యూరాలజిస్టులు ఉండగా ప్రతి రోజూ ఒక్కొక్కరి వద్దకు ఇద్దరు అల్జీమర్స్ చికిత్స కోసం సంప్రదిస్తున్నారు. చదవండి: కృష్ణ బిలం వినిపించింది! వైరల్ వీడియో.. సముద్ర అలల ధ్వనిలా -
ప్రపంచ జనాభా 800 కోట్లకు: తిండి, నీళ్లు దొరకవా? ఏం చేయాలి?
మానవాళి హాయిగా సుఖంగా ఉండాలి. మనుషుల మధ్య అసమానతలు తగ్గి అందరూ సంతోషంగా ఉండాలి. కొందరి దగ్గరే సంపద అంతా పోగు పడిపోతే.. మెజారిటీ ప్రజలు డొక్కలు మాడ్చుకుంటూ ఆకలి కేకలే వేస్తోంటే ఆ సమాజం ఎలా మనుగడ సాగించగలుగుతుంది? ఎలా ఆనందంగా ఉండగలుగుతుంది. అన్నింటికన్నా ప్రమాదకరమైనవి అసమానతలు, వివక్షలు. వాటిని రూపు మాపుకుంటూ మానవ సంబంధాలు పెంపొందించుకుంటూ ఉజ్వల భవిష్యత్ దిశగా అడుగులు వేసేలా దేశాల ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుని పకడ్బందీగా అమలు చేయాలి. అప్పుడే మానవాళి మనుగడ సాగించగలుగుతుందని మేథావులు సూచిస్తున్నారు. ప్రపంచ జనాభా 800 కోట్లు అయిపోయిందని చాలా మంది కంగారు పడిపోతున్నారు. అది పెద్ద సమస్య కాదు. సమస్యల్లా పెరిగిన జనాభా చక్కటి మానవ సంబంధాలతో లోటు లేకుండా మనుగడ సాగించడమే. మన వ్యవస్థల్లోని సవాలక్ష అసమానతలు.. లింగ వివక్షలు పెను సవాళ్లను విసురుతున్నాయి. 300కోట్ల మంది పౌష్ఠికాహారం తినే స్థోమత లేక కడుపులు మాడ్చుకుంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. దానికి కారణం ఏంటో మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. జనాభాలో కేవలం 10 శాతం మంది వద్దే 80 శాతం సంపద పోగుపడ్డమే సమస్య. పేదలకు ఆ సంపద పంపిణీ కాకపోవడం వల్లనే అసమానతలు పెరుగుతున్నాయి. అవే ఆకలి కేకలు పెంచుతున్నాయి. అవే జీవితాలను దుర్భరం చేస్తున్నాయి.అందుకే ప్రపంచమంతా మనిషి మనిషిగా బతికే వీలు కల్పించడంపైనే దృష్టి సారించాల్సి ఉందంటున్నారు మేథావులు. నిన్న కాక మొన్ననే. ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంది బాబోయ్ అంటూ తెలిసో తెలీకో చాలా మంది గగ్గోలు పెట్టేశారు.జనాభా ఇలా పెరుగుతూ పోతే అందరికీ ఆహారం ఎలాగ? అని చాలా సీరియస్‌గా ఆందోళన వ్యక్తం చేసేశారు కూడా. జనాభాని నియంత్రిస్తే ఎలాంటి సమస్యా ఉండదని కొందరైతే చాలా అమాయకంగా సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు. ఇంకొందరైతే ఆహార ఉత్పత్తులు పెంచడంపై ప్రపంచం దృష్టి సారించాలని తోచిన సలహా ఇచ్చారు. ఉన్న ఆహారాన్ని వృధా చేయకుండా ఉంటే అదే పది వేలని కొందరు మేథావులు సూత్రీకరించేశారు. అసలు సమస్య ఎక్కడుంది? సమస్య ఏంటి? అన్నదానిపై ఎవరూ దృష్టి సారించడం లేదు. జనాభా పెరుగుతోంది. ఓకే. అది పెరుగుతుంది. అందులో ఆశ్చర్య పడాల్సింది కానీ ఆందోళన చెందాల్సింది కానీ ఏమీ లేదు కదా. ఒకప్పుడు సగటు జీవితకాలంతో పోలిస్తే ఇపుడు ప్రజల ఆయుష్షు బాగా పెరిగింది. దశాబ్ధాల క్రితం చాలా వ్యాధులకు, రుగ్మతలకు మందులే ఉండేవి కావు. ఏదన్నా సుస్తీ చేస్తేనే రోగనిరోధక శక్తి లేక చనిపోయే పరిస్థితులు ఉండేవి. ఇపుడు ప్రాణాధార ఔషథాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఒకప్పుడు పేరు చెప్పడానికే భయపడే క్యాన్సర్ వ్యాధి ఇపుడు ఎవరినీ కంగారు పెట్టడం లేదు. క్యాన్సరా? సరేలే..ఆసుపత్రికెళ్తే తగ్గిపోతుందిలే అనే ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే వైద్య రంగంలో ఊహించని విప్లవాత్మక ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయి కాబట్టి. అందు చేత జనాభా పెరుగుతూనే ఉంటుంది. ఇక పెరిగిన జనాభాకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులను పెంచినంత మాత్రాన ఆకలి కేకలు మాయం అయిపోతాయా? ఛస్తే కావు. ఎందుకంటే ఆహార ఉత్పత్తులు పెంచినంత మాత్రాన అవి పేదల చేతుల్లోకి రావు. పేదలు వాటిని వినియోగించు కోగలగాలంటే వాటిని కొనుగోలు చేసే శక్తి వారికి ఉండాలి. అది జరగాలంటే ప్రభుత్వాలు పథకాలు రూపొందించాలి. చాలా దేశాల్లో విచిత్రమైన పరిస్థితి ఉంది. దేశాలు చాలా సంపన్న దేశాలుగా పేరు గడిస్తున్నాయి. కానీ ఆ దేశాల్లో మెజారిటీ ప్రజలు మాత్రం గర్భ దారిద్య్రంలో ఉన్నారు. ఎక్కడో ఎందుకు మన దేశాన్నే తీసుకుంటే.. మన దేశంలోని 80 శాతం సంపద కేవలం పది శాతం మంది కుబేరుల వద్దే ఉంది. మిగతా 90శాతం మందిలో 80 శాతం మంది నిరుపేదలే. వీరిలో మెజారిటీ ప్రజలు పౌష్ఠికాహారం కొనుగోలు చేయగల స్థోమత ఉన్నవారు కారు. ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల మంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే పరిస్థితిలో లేరని తేలింది.సహజంగానే ఇందులో ఎక్కువ మంది ఆఫ్రికా దేశాల్లోనే ఉంటారు. మన దేశంలో అయితే 97 కోట్ల మంది పౌష్ఠికాహారం కొనగల స్థితిలో లేరు. ఎందుకంటే ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగిపోవడం జీవన ప్రమాణాలు పడిపోవడంతో మండే కడుపుకు కాలే బూడిదలా ఏదో ఒకటి తిని కడుపు నింపుకోవడమే గగనమైపోతోంది. ఇక పౌష్ఠికాహారాన్ని తీసుకోవాలంటే ఎక్కడి నుంచి కుదురుతుంది? ప్రతీ మనిషీ రోజూ కనీసం 400 గ్రాములు కూరగాయలు, పళ్లు తినాలట. ఇంటి మొత్తానికి అరకిలో కూరగాయలతో కాలక్షేపం చేసే దేశంలో ఒక్క మనిషిపై ఇంత పెట్టుబడి పెట్టగల స్థితిలో ప్రజలుంటారా? ఏటా ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతుంటే.. ప్రజల ఆదాయాలు తగ్గుతున్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు ప్రపంచంలోని ఆర్ధిక వ్యవస్థలన్నీ కుప్పకూలడంతో జీవన ప్రమాణాలు మరీ అధ్వాన్నంగా దిగజారాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? (ఇంకా వుంది) -సీఎన్ఎస్ యాజులు, కన్సల్టింగ్ ఎడిటర్, సాక్షి టీవీ -
పురుషులకే స్ట్రోక్ రిస్క్ ఎక్కువా? అపోహలు- వాస్తవాలు.. ఈ ఆహారం తీసుకుంటే
World Brain Stroke Day 2022: మెదుడుకు ఆక్సిజన్, పోషకాలను తీసుకువెళ్లే రక్తనాళాలు చిట్లిపోవడం లేదంటే మూసుకుపోవడం వల్ల రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో మెదడులోని ఆ భాగంలో కణ మరణానికి దారి తీసి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి ఇది మరణానికి దారి తీయవచ్చు. సాధారణంగా ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండానే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అక్టోబరు 29న వరల్డ్ స్ట్రోక్ డే. ఈ ఏడాది.. ప్రాణాన్ని కాపాడుకోవడంలో ప్రతి నిమిషం విలువైనదే అనే థీమ్‌తో(‘Minutes can save lives’ #Precioustime) అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పక్షవాతానికి దారితీసే పరిస్థితులు, దీని గురించి ప్రజల్లో ఉన్న అపోహలు, వాస్తవాలు, స్ట్రోక్‌కు గురైన పేషెంట్లు తీసుకోవాల్సిన ఆహారం గురించి ఈ కథనం. బ్రెయిన్ స్ట్రోక్- రిస్క్ ఫ్యాక్టర్స్ ►ఒబేసిటి ►జన్యుపరమైన లోపాల వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం ►అధిక రక్తపోటు ►శరీరంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉండటం ►మధుమేహం ►ఆహారపుటలవాట్లు, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ►పొగ తాగే అలవాటు ►శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం ►మోతాదుకు మించి ఆల్కహాల్ సేవించడం ►జీవనశైలి నివారణ ఎలా? ►జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. వాటిలో కొన్ని.. ►పొగతాగే అలవాటు మానుకోవడం ►ఆల్కహాల్ మానేయడం ►రోజూ కాసేపు వ్యాయామం చేయడం ►బరువు పెరగకుండా ఉండటం ►సమతుల్యమైన ఆహారం తీసుకోవడం అపోహలు- వాస్తవాలు అపోహ: 1. కేవలం నడివయస్కులు, వృద్ధులకు మాత్రమే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. వాస్తవం: వయసు పెరిగే కొద్దీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం రెట్టింపవుతుంది. ఒబేసిటీ, అధిక రక్తపోటుతో బాధ పడుతున్న 15- 65 ఏళ్ల ఏజ్ గ్రూప్‌లో ఎవరైనా దీని బారిన పడే అవకాశం ఉంది. అపోహ 2. బ్రెయిన్ స్ట్రోక్ చాలా అరుదుగా వస్తుంది. వాస్తవం: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్న వాళ్ల సంఖ్య దాదాపు 17 మిలియన్లు. అంతేకాదు ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న ఆరోగ్య సమస్యల్లో బ్రెయిన్ స్ట్రోక్‌ది రెండో స్థానం. అపోహ 3: బ్రెయిన్ స్ట్రోక్ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వాస్తవం: మెదుడుకు ఆక్సీజన్, పోషకాలను తీసుకువెళ్లే రక్తనాళాలు చిట్లిపోవడం, రక్తప్రసణకు అంతరాయం ఏర్పడటం వల్ల.. రక్తం గడ్డకట్టుకుపోయి మెదడులోని కణాలు చచ్చుబడిపోతాయి. అపోహ 4: పురుషులకే బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఎక్కువ వాస్తవం: పురుషులతో పోలిస్తే మహిళలే బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువని నిపుణులు అంటున్నారు. హార్మోన్ల అసమతుల్యం కారణంగా తీసుకునే థెరపీలు, గర్భనిరోధక మాత్రలు వాడటం, గర్భం ధరించిన సమయంలో మధుమేహం బారిన పడటం వంటివి ఇందుకు దారి తీసే అంతర్లీన కారణాలుగా చెప్పవచ్చు. అపోహ 5: ఒక్కసారి బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైతే జీవితాంతం జీవచ్ఛవంలా ఉండాల్సిందే! వాస్తవం: నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ నివేదిక ప్రకారం బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడిన వారిలో 10 శాతం మంది పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుంది. 25 శాతం మంది బాధితులు పాక్షిక ఉపశమనం పొందుతున్నారు. కొద్దిమంది మాత్రమే జీవితాంతం ఈ సమస్య వల్ల బాధపడుతున్నారు. అయితే, వారు కూడా సరైన థెరపీ తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. ఈ ఆహారం తీసుకోవడం మేలు పక్షవాతం బారిన పడిన వాళ్లు డైట్లో ఈ ఆహార పదార్థాలు చేర్చుకోవడం వల్ల మెరుగైన ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ►సాల్మన్ ఫిష్, అవిసె గింజలు(ఫ్లాక్స్ సీడ్స్), విటమిన్ ఈ కలిగి ఉండే విత్తనాలు, గింజలు, అవకాడోలు, కోడిగుడ్లు, ఆలివ్ ఆయిల్ వాడకం, క్వినోవా(చిరు ధాన్యం), కాల్షియం, ప్రొటిన్ అత్యధికంగా కలిగి ఉండే గ్రీక్ యోగర్ట్, గ్రీన్ టీ. ఈ పండ్ల వల్ల ►వీటితో పాటు బ్లూబెర్రీస్, దానిమ్మ పండ్లు, విటమిన్ సీ కలిగి ఉండే పండ్లు, ఆపిల్స్, టొమాటోలు వంటివి ఆహారంలో చేర్చుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. సాధారణంగా పక్షవాతం వచ్చిన నాలుగున్నర గంటల్లోపు ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకగలిగితే ప్రయోజనకరంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్న మాట. నోట్: ఆరోగ్యం గురించి అవగాహన కొరకు మాత్రమే ఈ కథనం. చదవండి: World Stroke Day: మెదడుకు ‘పోటు’.. బ్రెయిన్ స్ట్రోక్ నుంచి తప్పించుకోండి ఇలా.. Custard Apple: సీజనల్ ఫ్రూట్ సీతాఫలం.. తరచూ తింటున్నారా? ఇందులోని బయోయాక్టివ్ అణువుల వల్ల -
టీడీపీ స్పాన్సర్డ్.. ఫేక్ యాత్ర అసలు ‘లోగుట్టు’ ఇదే..
అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర పేరుతో ఇంతకాలం సాగిన డ్రామాలో అసలు విషయాలు బయటకు వచ్చాయి. ఆ నాటకం బహిర్గతం కావడంతో పాదయాత్రకు బ్రేక్ వేసుకోక తప్పలేదు. అది తాత్కాలికం అవుతుందా? లేక శాశ్వతం అవుతుందా అన్నది చెప్పలేకపోయినా, ఏ మాత్రం ఆలోచనపరులైనా ఈ ప్రహసనానికి పుల్ స్టాప్ పెట్టాలి. ఈ పాదయాత్ర అంతా తెలుగుదేశం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని, దానికి జనసేన మరికొన్ని పార్టీలు సహకరిస్తున్నాయని వెల్లడైంది. అసలు రైతులు ఎందరు? నకిలీ రైతులు ఎందరు అన్న విషయంపై కూడా క్లారిటీ వచ్చినట్లు అనిపిస్తుంది. చదవండి: అంతా పక్కా స్క్రిప్ట్.. అసలు కారణం ఇదన్న మాట.. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సరిగా అమలు చేయకపోతే ఏకిపారేసే ఈనాడు, తదితర టీడీపీ మీడియా సంస్థలు, హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తే మాత్రం ఆంక్షలు పెడతారా అంటూ గగ్గోలు పెట్టాయి. నిజానికి ఇలాంటి అంశాలపై పాదయాత్రలకు గౌరవ న్యాయ స్థానం అనుమతి ఇవ్వకుండా ఉంటే బాగుండేది. ఒకవేళ ఏ ఆలయానికి అయినా వెళ్లాలని అనుకుంటే ఏ బస్‌లోనే వెళ్లి రండని చెబితే సబబుగా ఉండేది. అలాకాకుండా ఈ పాదయాత్రకు అనుమతి ఇవ్వడంతో ఏపీ సమాజంలో ఒక రకమైన అశాంతి ఏర్పడడానికి ఆస్కారం ఏర్పడింది. అనవసరమైన శాంతిభద్రతల సమస్యకు అవకాశం ఇచ్చినట్లయిందనిపిస్తుంది. అయిన ఏపీ ప్రభుత్వం కాని, పోలీసులు కాని తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరించడంతో అలాంటి వివాదాలు ఏవీ పెద్దగా రాలేదు. ఇదే సమయంలో గౌరవ హైకోర్టు అమరావతి పాద యాత్రికులకు కొన్ని షరతులు విధించింది. అవి లేకుంటే మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడేది. 600 మించి రైతులకు అనుమతి ఇవ్వవద్దని, వారికి గుర్తింపు కార్డులు ఉండాలని, రాజకీయ నేతలకు అవకాశం ఇవ్వవద్దని, నాలుగు వాహనాలు మించి ఉండరాదని, ప్రభుత్వాన్ని విమర్శించరాదని, సంఘీభావం చెప్పాలనుకున్నవారు రోడ్డు పక్కనే నిలబడాలని.. ఇలా కండిషన్లు పెట్టింది. కాని వీటిలో ఏ ఒక్కటి కూడా ఈ పాదయాత్ర చేసేవారు పాటించలేదు. అయినా పోలీసులు ఈ నలభై రోజులూ చూసిచూడనట్లు వ్యవహరించారు. దానిని అలుసుగా తీసుకున్న పాద యాత్రికులు ఆయా చోట్ల రెచ్చి పోయి వ్యవహరించారు. ఇదే సమయంలో పాదయాత్రకు నిరసనలు చెప్పడం ఆరంభం అయింది. వీరు అమరావతిలోనే సమస్తం పెట్టాలని డిమాండ్ చేస్తూ యాత్ర చేస్తుంటే, దీనిని వ్యతిరేకిస్తూ ఆయా చోట్ల నిరసన ర్యాలీలు, ప్లెక్సీల ఏర్పాటు , వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా గర్జనలు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లు వంటివి జరిగాయి. కొన్ని చోట్ల వైసీపీ నేతలు కూడా నిరసనలలో పాల్గొన్నారు. ఆ క్రమంలో ఇరుపక్షాల మధ్య కొంత ఉద్రిక్తత ఏర్పడిన మాట నిజమే. తణుకు, రాజమండ్రి వంటి చోట్ల పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. కాగా కోనసీమ అంబేద్కర్ జిల్లా రామచంద్రాపురం వద్దకు యాత్ర వెళ్లేసరికి మొత్తం లోగుట్టు బయటకు వచ్చింది. అమరావతి జేఏసీ వారు కోర్టుకు వెళ్లి పోలీసులు తమను అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేయగా, హైకోర్టు వారు అన్నిటిని పరిశీలించి, తాము పెట్టిన షరతులు కచ్చితంగా పాటించాలని, పోలీసులు ఆ మేరకు చర్య తీసుకోవాలని స్పష్టం చేయడంతో ఈ జేఏసీ, పాద యాత్రికుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఇన్ని రోజులు తమకు తోచిన విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ నేతలు, లేదా వారు కిరాయికి తెచ్చుకున్నవారు ఈ యాత్రలో పాల్గొంటూ, అక్కడక్కడ తొడలు చరుచుకుంటూ, చెప్పులు చూపుతూ వైసీపీ వారిని రెచ్చగొడుతూ సాగించారు. హైకోర్టు తాజా ఉత్తర్వులతో రామచంద్రపురం వద్ద పోలీసులు పకడ్బందిగా వ్యవహరించారు. వారిని ఒకరకంగా అభినందించాలి. రైతుల గుర్తింపు కార్డులను చూపాల్సిందేనని పట్టుబట్టారు. ఎలాగొలా అలజడి సృష్టించి దీనిని డైవర్ట్ చేయాలని పాదయాత్రికులు కొందరు ప్రయత్నించారు. కాని పోలీసులు ససేమిరా అనడంతో గుర్తింపు కార్డులు లేనివారు జారుకున్నారు. దాంతో ఈ పాదయాత్రలో అసలు రైతులు కన్నా నకిలీ రైతులే ఎక్కువగా ఉన్నారన్న అంశం ప్రజలకు తెలిసిపోయింది. 600 మంది రైతులకు అవకాశం ఉంటే, కేవలం 75 మంది మాత్రమే గుర్తింపుకార్డు కలిగి ఉన్నారట. కొందరు వేరేవారి కార్డులు తెచ్చారట. అమరావతిలోని 29 గ్రామాలకు చెందిన రైతులు సుమారు 24 వేల మంది రాజధాని కోసం భూములు ఇచ్చారు. కాని వారిలో ఒక్క శాతం కూడా ఈ పాదయాత్రలో పాల్గొనలేదు. కేవలం ఈనాడు, తదితర టీడీపీ మీడియాలలో మాత్రమే వందల మంది నడుస్తున్నట్లు, వారికి వేల మంది స్వాగతం పలుకుతున్నట్లు దొంగ ప్రచారం చేశారని తేటతెల్లమైంది. ఎక్కడికక్కడ టీడీపీ, జనసేనకు చెందినవారు వీరితో కలిసిపోయి హడావుడి చేసే యత్నం చేశారు. పోలీసులు హైకోర్టు నిర్ణయాలను పాటిస్తే దానిని తప్పు పడుతూ ఈనాడు మీడియా ఆంక్షల అడ్డంకులు అని హెడింగ్ పెట్టింది. అంతే తప్ప హైకోర్టు ఉత్తర్వులు అమలు చేశారని చెప్పలేదు. పైగా ఈ పాదయాత్ర చేసేవారిని పోలీసులు హింసించారని, నేలకేసి కొట్టారని, ఇలా తప్పుడు ప్రచారం చేయడానికి టీడీపీ మీడియా నానా తంటాలు పడింది. రైతులు నిర్ణీత సంఖ్యలో పాల్గొనడం లేదని వెల్లడికాగానే తెలుగుదేశం వారు కొత్త అబద్దం సృష్టించారు. రైతుల గుర్తింపు కార్డులను పోలీసులు చించివేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తదితరులు ఆరోపించారు. దానిని వారి మీడియా ప్రముఖంగా ఇచ్చింది. నిజంగానే అలా జరిగి ఉంటే ఈపాటికి ఎంత రచ్చే చేసేవారు. ఎందుకంటే నిరంతరం ఈ మీడియా తన కెమెరాలను పాద యాత్రికుల వెంట తిప్పుతోంది. అలాంటప్పుడు వీరి కన్నుకప్పి పోలీసులు గుర్తింపు కార్డులను చించుతారా? కేవలం ఆ కార్డుల కోసం పోలీసులు పట్టుబడితే, అవి లేనివారు వెనకగుండానో, మరో మార్గంలోనో జారుకున్నారు. నిజంగానే ఈ రైతులకు చిత్తశుద్ది ఉంటే గుర్తింపు కార్డులు ఉన్న డెబ్బై ఐదు మంది అయినా పాదయాత్ర కొనసాగించి ఉండవచ్చు కదా?. మరి అలా ఎందుకు చేయలేదు. అతి తక్కువ మంది రైతులే ఈ యాత్రలో ఉన్నారన్న సంగతి మరింతగా ప్రచారం జరిగే అవకాశం ఉండడం, దీనివల్ల తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా మరింతగా నష్టపోతుందన్న ఆందోళన, ఉత్తరాంధ్రకు వెళ్లే కొద్దీ వీరికి నిరసన సెగ పెరుగుతుందన్న ఆందోళన, రోజూ లక్షల రూపాయల వ్యయం, వీటిని భరించే టీడీపీ స్థానిక నేతలు కొందరు చేతులు ఎత్తివేయడం వంటి కారణాల వల్లే చివరికి పాదయాత్రను వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించి వారి వాహనాలలో తిరుగు ముఖం పట్టారు. కాకపోతే భేషజానికి మాత్రం తాము తాత్కాలికంగానే వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించారు. బహుశా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ వీరిని ఉసికొల్పి యాత్ర కొనసాగించేలా చూస్తే తప్ప, ఇది ఆగిపోవచ్చు. ఇంతకాలం ఈ రైతులు ఐదుగురో పది మందో వంద మందో అమరావతి గ్రామాలలో శిబిరంలో కూర్చుని తమకు మద్దతు ఇచ్చే టివీల ముందు ప్రభుత్వాన్ని విమర్శించి తమ ఇళ్లకు వెళ్లిపోతుండేవారు. కాని న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తిరుపతి పాదయాత్ర ప్లాన్ చేశారు. దాని విషయంలో ప్రభుత్వం ఒక రకంగా సహకరించిందని చెప్పాలి. ఆ యాత్ర సజావుగా తిరుపతి చేరుకుంది. దాంతో చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉత్తరాంధ్రలోని అరసవల్లికి పాదయాత్రకు పురికొల్పారు. పోనీ అది అయినా నేరుగా వెళ్లారా అంటే అలాకాకుండా, టీడీపీకి కాస్త పట్టు ఉన్న గ్రామాలు, పట్టణ ప్రాంతాల గుండా , అడ్డదిడ్డమైన రూట్లలో యాత్ర సాగించారు. ఇదంతా చూసేవారికి నీ ముక్కు ఏది అంటే మొహం చుట్టూ తిప్పి చూపినట్లుగానే వీరు ప్రవర్తిస్తున్నట్లు అర్ధం అయింది. గుడివాడ వంటి చోట్ల టీడీపీ మహిళా కార్యకర్త ఒకరు తొడలు కొట్టడం, మాజీ ఎంపీ మాగంటి బాబు చెప్పు చూపడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఆ రకంగా సాగుతూ వచ్చిన ఈ యాత్రకు ఇప్పుడు బ్రేక్ పడింది. అసలు మూడు రాజధానుల చట్టాన్నే ఉపసంహరించుకున్నామని ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం అమరావతి జేఏసీ పేరుతో ఈ పాదయాత్ర నిర్వహించడం, అందులో అసలు రైతులు కన్నా, నకిలీ రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికంగా ఉండడంతో మొత్తం యాత్ర అప్రతిష్టపాలైంది. విశాఖ రాజధానికి వ్యతిరేకంగా వీరు పాదయాత్ర చేయడం వైసీపీకి కలిసివచ్చినట్లయింది. ఆ పార్టీ యాక్టివ్ అయి, ప్రజలలో దీనిపై చైతన్యం తెచ్చింది. దాంతో టీడీపీ అనుకున్నది ఒకటి అయిందొకటి అని చెప్పాలి. ఏతావాతా పాదయాత్ర ప్లాన్ ఎందుకు వేశామా అని టీడీపీ నేతలే తలపట్టుకునే పరిస్థితి ఏర్పడడం కొసమెరుపు గా భావించవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
ఇల్లు చూపి ఇల్లాలిని చేసుకునే ఓ ‘పిట్ట’ కథ
ఆత్మకూరు రూరల్(నంద్యాల జిల్లా): అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే అన్నాడో కవి.. ఆమె ఓర చూపే మోక్ష మార్గం అని కూడా వర్ణించాడు. ప్రేయసి కోసం మనుషులు ఇలా కవిత్వాన్ని ఆశ్రయిస్తే.. ఓ పక్షి మాత్రం గూడుకట్టి తన గుండె స్పందనను తెలుపుతోంది. ప్రేమ కోసం తన అద్భుత నైపుణ్యాన్ని ప్రదరిస్తున్న అందరికీ తెలిసిన ‘పిట్ట’ కథ ఇదీ.. చదవండి: రెస్టారెంట్లో బిర్యానీ తింటున్నారా?.. అయితే మీకో చేదు వార్త ఏటి ఒడ్డునో, చెరువు గట్టునో ఈత, తుమ్మ వంటి చెట్ల చిటారు కొమ్మలకు వేలాడుతూ గిజిగాళ్లు నిర్మించిన గూళ్లు కనపడుతుంటాయి. వీటి నిర్మాణ శైలి అద్భుతంగా ఉంటుంది. ఈతనారను జాగ్రత్తగా సేకరించే మగ పక్షులు అద్భుతమైన నైపుణ్యంతో గూళ్లు నిర్మిస్తాయి. తమకు ప్రమాదకరమైన పాములు, కాకులు వంటి వాటి నుంచి రక్షించుకునేందుకు ఏటినీళ్ల పైన వేలాడే విధంగా, గట్టుపైన ఉండే చెట్ల కొమ్మలు నీటిపై వేలాడే చోట గూళ్లు కడతాయి. తిరగవేసిన కిరోసిన్ దీపం చిమ్నిలా ఈ గూళ్లలో ప్రత్యేకమైన గదులు, మెత్తటి పాన్పులాంటి నిర్మాణాలుంటాయి. నల్లమల అటవీ సమీప గ్రామాలు, పరిసర ప్రాంతాల్లో గిజిగాడి గూళ్లు విరివిగా కనిపిస్తుంటాయి. ప్రేమకోసం.. ఆంగ్లంలో వీవర్ బర్డ్‌గా ఈ పక్షిని పిలుస్తారు. ఆత్మకూరు పరిసర ప్రాంతాల ప్రజలు వీటిని పిట్టలుగానే గుర్తిస్తారు. మగపక్షి గూడును నిర్మించి ఆడపక్షిని ఆకర్షిస్తుంది. గూడు చూపి ఆడపక్షితో జతకట్టేందుకు ఆహ్వానిస్తుంది. ఇల్లును చూసి ఇల్లాలి నైజం గ్రహించ వచ్చని పెద్దలు చెబుతుంటారు. అయితే గిజిగాడి పక్షుల్లో మాత్రం ఇల్లాలి కోసం మగ పక్షి ఇల్లు(గూడు) కడుతుంది. సగం గూడు నిర్మించే మగ పక్షి అటు వెళ్లే ఆడపక్షులకు తన గూడును చూడరమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా గూటిపై వాలి రెక్కలల్లారుస్తూ కువకువలాడుతుంది. ఈ దృశ్యం చూడముచ్చటగా ఉంటుంది. గూడు నచ్చితే ఆడపక్షి మగపక్షితో జతకట్టేందుకు అంగీకరిస్తుంది. గూడు నచ్చక ఆడపక్షి ‘నో ’ చెబితే అసంపూర్ణ నిర్మాణాన్ని (గూడు) వదలి మరోచోట మరో గూడు కట్టేందుకు మగ పక్షి సిద్ధమవుతుంది. ఆడపక్షి గూడు నచ్చి అంగీకారం వ్యక్తపరచగానే మగపక్షి మిగిలిన గూడు నిర్మాణం పూర్తి చేస్తుంది. ఆడపక్షి గూటిలో గుడ్లు పెడితే వాటి సంరక్షణ మగపక్షి చూసుకుంటుంది. పిల్లలు గుడ్లనుంచి బయటికి రాగానే వాటి పోషణ భారం మాత్రం ఆడపక్షే మోస్తుంది. ఒక్కో ప్రదేశంలో గిజిగాళ్లు రెండు వందల వరకు సామూహికంగా గూళ్లు నిర్మించుకుని సామాజిక జీవనం గడుపుతాయి. శత్రువులు దాడి చేసినపుడు మూకుమ్మడిగా పెద్దగా అరుస్తూ తమ పిల్లలను, గూళ్లలోని గుడ్లను రక్షించుకునే ప్రయత్నం చేస్తాయి. గిజిగాడిపై ఖండకావ్యం గిజిగాళ్లు జీవిత కాలం 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇవి కీటకాలు, వివిధ రకాల విత్తనాలను తిని బతుకుతుంటాయి. ఎంత వర్షం వచ్చినా, సుడిగాలి వీచినా గూడు చెదరకుండా, తడవకుండా బలంగా నిర్మించుకుంటాయి. గిజిగాడి నైపుణ్యానికి మెచ్చి మహాకవి గుర్రం జాషువా ఖండ కావ్యాన్ని రచించారు. ‘‘తేలిక గడ్డి పోచలను దెచ్చి, రచించెదవీవు తూగుటు య్యేల గృహంబు’’ అంటూ తన పద్యంలో ‘‘బంగారువన్నెగల దుస్తులు ధరించి, నీ భార్యా పిల్లలు నీ పొదిగిట నిద్రిస్తుండగా, హాయిగా వీచే పిల్లగాలులు మీరున్న ఊయల గృహాన్ని ఊపుతూ ఉండగా, ఏమాత్రం భయంలేకుండా ప్రశాంతంగా నిద్రిస్తుంటావు. నీకున్న ఆ గొప్ప సుఖం మాకెక్కడుందిరా గిజిగా! అసలు మాకేమిటిరా.. ఏ మహరాజుకైనా అంతటి సుఖం ఉంటుందంటావా?’’ అంటూ ఆ గిజిగాని వైభవాన్ని కీర్తించారు. -
‘చీకోటి’ కేసులో సంచలన విషయాలు.. సినీ హీరోయిన్లకు కళ్లు చెదిరే పారితోషికాలు
సాక్షి, హైదరాబాద్: చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో సినీ తారల పారితోషికాల లిస్ట్ బట్టబయలైంది. టాలీవుడ్, బాలీవుడ్ తారలకు ఇచ్చిన భారీ పారితోషికాలపై ఈడీ నోటీసులు సిద్ధం చేస్తోంది. నేపాల్‌లో నిర్వహించిన క్యాసినోకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన సినీ తారలపై ఈడీ అధికారుల దృష్టి పెట్టారు. మల్లికా షెరావత్కు రూ.కోటి, అమిషా పటేల్‌కు రూ.80 లక్షలు, గోవిందకు రూ.50 లక్షలు, ఈషా రెబ్బాకు రూ.40 లక్షలు, డింపుల్ హయతీకి రూ.40 లక్షలు, గణేష్ ఆచార్యకు రూ.20 లక్షలు ముమైత్‌ఖాన్‌కు రూ.15 లక్షలు పారితోషికాలను చీకోటి ఇచ్చినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. చదవండి: క్యాసినోవాలా... కోట్ల హవాలా! మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖ హీరోలు కస్టమర్లే.. చీకోటికి మంత్రులు, ఎమ్మెల్యేలు డీసీసీబి ఛైర్మన్లతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. చికోటితో విఐపీల లింకులు బయటపడుతున్నాయి. నేపాల్ వెళ్లిన కస్టమర్లలో 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈడీ కీలక ఆధారాలు సేకరిస్తోంది. ప్రవీణ్ ల్యాప్‌ట్యాప్‌లో వీఐపీల వివరాలు, చెల్లింపులు ఉన్నట్లు సమాచారం. చెన్నైకి చెందిన బంగారం వ్యాపారికి హవాలా ఏజెంట్‌గా చీకోటి ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో దేశానికి ఒక్కో రేటు వసూలు చేస్తున్న చీకోటి.. ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్ దేశాలను క్యాసినో అడ్డాలుగా మార్చుకున్నాడు. కోల్‌కతా మీదుగా నేపాల్‌కు కస్టమర్ల తరలిస్తూ.. ఒక్కో విమానానికి లక్షల రూపాయలు చెల్లింపు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో హోటల్‌కు లక్షలు చెల్లించి ఈవెంట్స్ నిర్వహణకు కస్టమర్ల నుంచి 5లక్షలు ఎంట్రీ ఫీజు ప్రవీణ్ వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రవీణ్ రెగ్యులర్ కస్టమర్లు 200 మంది ఉన్నట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
‘హష్’ రవాణాతో సిటీకి లింకులు!
సాక్షి, హైదరాబాద్: బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులకు ఇటీవల చిక్కిన హష్ ఆయిల్ అక్రమ రవాణా గ్యాంగ్ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఈ ముఠా విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి బెంగళూరుతో పాటు హైదరాబాద్, చెన్నై, కొచ్చి, ముంబైలకు సరఫరా చేస్తోందని గుర్తించారు. అయితే ఈ అక్రమ రవాణా మొత్తం నెల్లూరు కేంద్రంగా సాగుతున్నట్లు వెలుగులోకి రావడంతో కంగుతిన్నారు. ఈ గ్యాంగ్ అరెస్టుపై ఇక్కడి అధికారులకు సమాచారం ఇచి్చన సీసీబీ నెల్లూరు కోణంపై దృష్టి పెట్టాల్సిందిగా కోరింది. బెంగళూరులోని వివిధ పబ్బుల్లో పని చేసే డిస్కో జాకీలకు (డీజే) పెద్ద ఎత్తున గంజాయి, హష్ ఆయిల్ సరఫరా అవుతున్నాయి. వీళ్లే తమ పబ్స్‌కు వచ్చే కస్టమర్లకు వీటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై అక్కడి సీసీబీ అధికారులకు గత నెల్లో సమాచారం అందింది. దీంతో వరుసపెట్టి దాడులు చేసిన అధికారులు కొందరు డీజేలను అరెస్టు చేశారు. వీరికి ఈ మాదకద్రవాలు ఎక్కడ నుంచి వస్తున్నాయనే అంశంపై సీసీబీ దృష్టి పెట్టింది. తమ దర్యాప్తును కొనసాగించిన నేపథ్యంలో విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ముఠా అరకు లోయ నుంచి తీసుకువచ్చి అందిస్తున్నట్లు గుర్తించింది. దీంతో నిఘా కొనసాగించిన సీసీబీ పోలీసులు గత వారం నలుగురిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు పోలీసు రికార్డుల్లోకి ఎక్కని, తొలిసారిగా పోలీసులకు చిక్కిన ఈ గ్యాంగ్‌లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అరకు ప్రాంతానికి చెందిన వీరిని శ్రీనివాస్, ప్రహ్లాద్, సత్యవతి, మల్లీశ్వరిగా వీరిని గుర్తించారు. ఈ నలుగురినీ కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్న సీసీబీ లోతుగా విచారించింది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు కోణం వెలుగులోకి వచి్చంది. ఈ ముఠా ఏజెన్సీ ప్రాంతానికి చెందినదే. గంజాయి పండేది, హష్ ఆయిల్ ఉత్పత్తి అవుతున్నది సైతం ఆ ఏరియాలోనే. అయితే తమకు మాత్రం ఈ మాదకద్రవ్యాలను నెల్లూరులో ఓ వ్యక్తి అందించారంటూ ఈ నలుగురూ బయటపెట్టారు. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన రేగా అనే వ్యక్తి ఆదేశాల మేరకు తాము అక్కడకు వెళ్లామని సీసీబీ విచారణలో చెప్పారు. నెల్లూరులో ఓ వ్యక్తి గతంలోనూ తమకు గంజాయి, హష్ ఆయిల్ ఇచ్చాడని, వాటిని హైదరాబాద్‌తో పాటు ఇతర మెట్రో నగరాలకు తీసుకువెళ్లి డెలివరీ చేసి వచ్చాయని అంగీకరించారు. డెలివరీ ఎవరికి ఇవ్వాలనేది ముందుగా చెప్పరని ఆయా ప్రాంతాలకు చేరుకున్న తర్వాతే వాట్సాప్ కాల్ ద్వారా తమకు సమాచారం ఇస్తారని ఈ నలుగురూ సీసీబీ విచారణలో వెల్లడించారు. ఈ ముఠాకు హైదరాబాద్‌లోనూ పెడ్లర్లు ఉన్నారని తెలియడంతో సీసీబీ పోలీసులు ఇక్కడి అధికారులకు సమాచారం ఇచ్చారు. నలుగురి వివరాలు, ఫోన్ నెంబర్లు అందించి స్థానిక లింకులపై ఆరా తీయాల్సిందిగా కోరారు. ఈ ముఠాకు, నెల్లూరులోని సరఫరాదారుడికి ఉన్న సంబంధాన్నీ తెలుసుకున ప్రయత్నాలు చేయాలని కోరారు. దీంతో ఇక్కడి అధికారులు ఆ కోణంలో ఆరా తీయడం మొదలెట్టారు. (చదవండి: డిస్క్ంకు ఉరితాళ్లు!) -
అగ్నిపథ్ నిరసనలు: చాలా దేశాల్లో అమలు అవుతోంది ఇదే!
బీజేపీ పాలిత రాష్ట్రాలు సహా దేశంలో చాలా చోట్ల రెండో రోజు అగ్నిపథ్ వ్యతిరేక నిరసనలు హోరెత్తుతున్నాయి. బీహార్‌లో అయితే ప్రభుత్వ ఆస్తుల విధ్వంసంతో పాటు రైళ్లను సైతం తగలబెట్టారు. మరోవైపు ఎమ్మెల్యే అరుణా దేవీ తృటిలో దాడి నుంచి తప్పించుకున్నారు. బీజేపీ మాత్రం అగ్నిపథ్ యువత మంచి కోసమే అని, చాలా దేశాల్లో అమలు అవుతోంది ఇదేనని చెప్తోంది. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ ప్రోగ్రామ్‌పై నెలకొన్న అపోహలు, వాస్తవాలు పేరిట ఓ రిపోర్ట్ విడుదల చేసింది. ఈ మేరకు ఓ అనధికారిక ప్రకటనతో ప్రచారం నిర్వహిస్తోంది. ఇందులో మొదటిది.. అగ్నివీరుల భవిష్యత్తు పదిలంగా ఉండదు భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. దానికి వాస్తవం పేరిట.. సాయుధ బలగాల్లో 4 ఏళ్లు సర్వీస్ చేసిన వారు పారిశ్రామికవేత్తలు కావాలనుకుంటే కేంద్రం వారికి ఆర్థిక ప్యాకేజీ, బ్యాంకు రుణ పథకం అందజేస్తుంది. పైచదువులు చదవాలనుకునే వారికి 12 తరగతికి సమానమైన సర్టిఫికేట్ ప్రదానం చేస్తుంది. అంతేకాదు, తదుపరి చదువుల కోసం బ్రిడ్జింగ్ కోర్సును ఆఫర్ చేస్తుంది. ఉద్యోగాలు పొందాలనుకునే వారికి కూడా ఈ నాలుగేళ్ల సర్వీస్ చాలా హెల్ప్ అవుతుంది. ఈ సర్వీస్‌లో పాల్గొన్న యువతకు సీఏపీఎఫ్, రాష్ట్ర పోలీసుల నియామకాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదు. రెండోది.. అగ్నిపథ్ వల్ల యువతకు అవకాశాలు తగ్గుతాయి.. నిజానికి నాలుగేళ్లపాటు దేశానికి సేవలందించే యువతీ యువకులకు సాయుధ దళాలలో పనిచేసే అవకాశాలు మెరుగుపడతాయి. కొన్నేళ్లలో సాయుధ దళాలలో ప్రస్తుతం జరుగుతున్న రిక్రూట్మెంట్ల కంటే అగ్నివీరుల రిక్రూట్మెంట్లు మూడు రెట్లు పెరుగుతాయి. మూడోది.. అగ్నిపథ్ పథకం కారణంగా రెజిమెంటల్ బాండింగ్ పై ప్రభావం పడుతుంది. కానీ, అగ్నిపథ్ పథకం వల్ల రెజిమెంటల్ వ్యవస్థలో ఎలాంటి మార్పు ఉండదని, నిజానికి ఈ పథకం వల్ల అగ్నివీరులలో అత్యుత్తమమైన యువత ఎంపిక అవుతుందని కేంద్రం అంటోంది. నాలుగోది.. సాయుధ బలగాల సామర్థ్యం క్షీణిస్తుంది. ఈ తరహా స్వల్పకాలిక నియామక విధానం చాలా దేశాలలో ఉంది. ఈ విధానాన్ని ఇప్పటికే చాలాచోట్ల విజయవంతంగా పరీక్షించాయి. యువత, శక్తివంతమైన సైన్యాన్ని పెంచాలంటే ఈ విధానమే ఉత్తమంగా నిలుస్తుంది. మొదటి సంవత్సరంలో రిక్రూట్ అయ్యే అగ్నివీరుల సంఖ్య సాయుధ దళాలలో 3% మాత్రమే ఉంటుంది. నాలుగేళ్ల తర్వాత సైన్యంలోకి శాశ్వతంగా యువతను తీసుకునే ముందు అగ్నివీరుల పనితీరును పరీక్షిస్తారు. తద్వారా.. ఆర్మీ పర్యవేక్షక ర్యాంక్‌ల కోసం అనుభవం, అర్హత ఉన్న సిబ్బందిని పొందడం సాధ్యమవుతుంది. ఐదవది.. 21 ఏళ్ల యువతలో పరిపక్వత ఉండదు. వారిపై సైన్యం ఆధారపడటం అవివేకమే. అయితే ప్రపంచంలోని చాలా దేశాల సైన్యాలు తమ యువతపైనే ఆధారపడుతున్నాయి. అయితే ఏ సమయంలో చూసుకున్న ఎక్స్పీరియన్స్ అఫీషియల్స్ కంటే ఎక్కువ మంది యువకులు ఉండరు. ప్రస్తుత పథకం చాలా నెమ్మదిగా సుదీర్ఘ కాలంలో యువకులు, ఎక్స్పీరియన్స్డ్ పర్యవేక్షక ర్యాంక్‌ల అధికారులు వందకు సగం సగం ఉండేలా చేస్తుంది. ఆరవది.. అగ్నివీరులు సమాజానికి ప్రమాదకారులుగా మారతారు. ముఖ్యంగా వారు ఉగ్రవాదులతో చేతులు కలుపుతారు. ఇలాంటి ప్రచారం.. భారత సాయుధ బలగాల ధర్మాన్ని, విలువలను అవమానించడమే. నాలుగేళ్లుగా యూనిఫాం ధరించి భారత మాతకు సేవలందించిన యువకులు జీవితాంతం దేశం కోసమే పని చేస్తారు. కానీ దేశానికి ద్రోహం చేయరు. అంతెందుకు, ఏటా వేలాది మంది సాయుధ బలగాల నుంచి పదవీ విరమణ పొందుతున్నారు. కానీ వారిలో ఏ ఒక్కరూ దేశ వ్యతిరేక దళాలలో చేరిన దాఖలాలు లేవు. ఏడవది.. మాజీ సాయుధ దళాల అధికారులను సంప్రదించకుండా, వారి అభిప్రాయాలు తీసుకోకుండా పథకం ప్రకటించారు. దీంతో మాజీ అధికారులందరూ తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు అని. కానీ, కేంద్రం ఈ పథకం గురించి ప్రస్తుతం సేవలందిస్తున్న సాయుధ దళాల అధికారులతో గత రెండేళ్లుగా సంప్రదింపులు జరిపింది. మిలిటరీ అధికారులతో కూడిన డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ ఆఫీసర్స్ ఈ ప్రతిపాదనను రూపొందించారు. నిజానికి దాదాపు అందరూ మాజీ అధికారులందరూ అగ్నిపథ్ పథకం ప్రయోజనాలను గుర్తించి దానిని సంతోషంగా స్వాగతించారు కూడా. -
అత్యాచారయత్నం కేసు.. గాయత్రి భర్త చెప్పిన షాకింగ్ విషయాలు..
సాక్షి, హైదరాబాద్: కొండాపూర్‌లో యువతిపై అత్యాచారయత్నం కేసులో పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితురాలు గాయత్రి భర్త శ్రీకాంత్ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై గాయత్రి భర్త ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తన అత్త చేసే ఆరోపణలు అసత్యమని తెలిపారు. గాయత్రి తండ్రి మరణం అనంతరం వాళ్లు గాయత్రి మీద కక్ష కట్టారన్నారు. చదవండి: ఎంత పనిచేశావ్ నాన్నా! పుట్టింటికి నవ వధువు.. ప్రాణాలు తీసిన కన్నతండ్రి ఆస్తి పంపకాల్లో గాయత్రిని ఆమె తల్లి, సోదరే వేధించారన్నారు. గాయత్రి స్థలంలో తన తమ్ముడు ప్రదీప్ ఇళ్లు కట్టాలని చూశాడని.. దాన్ని గాయత్రి అడ్డుకుందని తెలిపారు. గాయత్రి కుటుంబంలో పరస్పరం అందరూ కేసులు వేసుకున్నారన్నారు. గాయత్రికి తాను సపోర్ట్‌గా ఉన్నందుకు తనపై కక్ష కట్టారని శ్రీకాంత్ తెలిపారు. గాయత్రి అరాచకాలపై తనకేమి తెలియదన్నారు. మీడియాలో వస్తున్న కథనాలపై తనకు సమాచారం లేదని శ్రీకాంత్ అన్నారు. కాగా, సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతిపట్ల అమానుషంగా ప్రవర్తించిన గాయత్రి ఇల్లును కబ్జా చేయడానికి ఆమె కుటుంబీకులు యత్నించారు. ఆమె భర్త శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు తల్లి కృష్ణవేణి, సోదరి సౌజన్యసహా మరికొందరిపై ఆదివారం కేసు నమోదు చేశారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తులకు సంబంధించి గాయత్రికి, ఆమె తల్లి కృష్ణవేణి, సోదరి సౌజన్య మధ్య కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. -
కాఫీ విత్ ఖతీక్!
సాక్షి, హైదరాబాద్: బాధితులు అంతా మధ్య, దిగువ మధ్య తరగతికి చెందిన వారు... ఒక్కో రూపాయి కూడగట్టుకుంటేనే తులం బంగారం చేకూరేది... స్నాచింగ్‌లో పోగొట్టుకున్నది సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న మంగళసూత్రాలు... సీరియల్ స్నాచర్ ఉమేష్ ఖతీక్‌ను కస్టడీలోకి తీసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులకు ఇవే కనిపించాయి. కేవలం తమ ఠాణా పరిధిలోని బాధితులే కాకుండా మూడు కమిషనరేట్లకు చెందిన వారికీ న్యా యం చేయాలని భావించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఉమేష్‌ను చాకచక్యంగా విచారించారు. చివరకు ‘కాఫీ విత్ ఖతీక్’తో అసలు గుట్టు బయటపెట్టేలా చేశారు. మూడు నేరాలు పేట్ బషీరాబాద్‌లోనే... హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో ఐదు స్నాచింగ్స్ సహా ఎనిమిది నేరాలు చేసిన సింగిల్... సీరియల్ స్నాచర్ ఉమేష్ ఖతీక్‌ను ఈ నెల రెండో వారంలో పేట్ బషీరాబాద్ పోలీసులు పీటీ వారెంట్‌పై తీసుకువచ్చారు. ఎనిమిదింటిలో మూడు నేరాలు ఈ ఠాణా పరిధిలోనివే కావడంతో ఈ అధికారులే ముందడుగు వేశారు. విచార ణ నిమిత్తం కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతి కోరు తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల పాటు కోర్టు అనుమతించడంతో ఈ నెల 20న కస్టడీలోకి తీసుకుని తమ పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. అతడి ఆరోగ్యం, గత చరిత్ర నేపథ్యంలో... ఉమేష్‌కు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దీనికి తోడు గతంలో పోలీసు కస్టడీ నుంచి పారిపోయిన చరిత్ర కూడా ఉంది. పేట్ బషీరాబాద్ పోలీసులు ప్రాథమికంగా ఈ రెండు అంశాలు దృష్టిలో పెట్టుకున్నారు. కస్టడీలోకి వచ్చిన తొలి రోజు ఉమేష్ పారిపోవడానికి ప్రయత్నాలు చేశాడు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న అధికారులు మరో రెండు రోజుల పాటు సాధారణంగా ప్రశ్నించారు. ఏమాత్రం తొణకని, బెణకని అతగాడు అహ్మదాబాద్ పోలీసులకు చెప్పినట్టే ‘తెంచినవన్నీ పడిపోయాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అధికారులు తమ శైలి మార్చాలని భావించారు. లాకప్‌లో కూర్చుని కాఫీ తాగుతూ... నేరాలు చేయడంతో ఆరి తేరిన, ఇప్పటికే అనేకసార్లు అరెస్టు అయిన, ఓ సందర్భంలో గురజాత్ పోలీసుల పైనే ఆరోపణలు చేసిన ఉమేష్ ఖతీక్‌ను రోటీన్‌కు భిన్నంగా ‘బ్రేక్’ చేయించాలని పేట్ బషీరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఓ నేరగాడి నుంచి నిజాలు రాబట్టడాన్ని పోలీసు పరిభాషలో బ్రేక్ చేయడం అంటారు. దీంతో ఒక రోజు అతడితో ప్రేమ పూర్వకంగా మెలిగిన అధికారులు ఎలాంటి హాని ఉండదనే నమ్మకం కలిగించారు. ఆపై అతడితో కలిసి లాకప్ గదిలోనే కూర్చుని కాఫీ కూడా తాగారు. ఈ పరిణామంతో ఉమేష్ వ్యవహారశైలిలో మార్పు రావడాన్ని అధికారులు గుర్తించారు. ఐదో రోజు నోరు విప్పాడు... పేట్ బషీరాబాద్ పోలీసుల తీరుతో ‘మంత్రముగ్ధుడైన’ ఉమేష్ ఖతీక్ ఐదో రోజు కస్టడీలో నోరు విప్పాడు. ఇక్కడ కొట్టేసిన బంగారం తన ఇంట్లోనే దాచానంటూ బయటపెట్టాడు. ఈ విషయం అహ్మదాబాద్ పోలీసులకు చెబితే అక్కడి కేసుల్లో రికవరీ చూపించేస్తారని, జైలు నుంచి వచ్చాక తనకు ఏమీ మిగలదనీ తప్పుడు వాంగ్మూలం ఇచ్చినట్లు బయటపెట్టాడు. సాధారణంగా స్నాచింగ్ చేసిన బంగారం వెంటనే అమ్మేసి సొమ్ము చేసుకుంటానని, అలాంటప్పుడు బయటపెట్టినా రిసీవర్ల నుంచి రివకరీ చేస్తారు కాబట్టి తనకు ఎలాంటి నష్టం ఉండదని అన్నాడు. ఈ బంగారం అమ్మని కారణంగానే అలా చెప్పానని వివరించాడు. ఇలా అసలు విషయం తెలిసి అహ్మదాబాద్ వెళ్లిన పేట్ బషీరాబాద్ పోలీసులు అతడి ఇంటి నుంచి 19 తులాలు రికవరీ చేసుకువచ్చారు. (చదవండి: ఆన్లైన్ గేమ్స్ వద్దన్నందుకు డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య) -
ఆమె.. అజయ్ దేవగణ్ బలహీనత.. ఎవరంటే ?
Unknown Facts About Ajay Devgn: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఇటీవల విడుదలైన దర్శక ధీరుడు తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'లో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్‌తో కలిసి రన్‌వే 34 సినిమాలో అలరించనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే అజయ్ దేవగణ్ మరో సంవత్సరం పెద్దవాడయ్యాడు. 1969, ఏప్రిల్ 2న జన్మించిన అజయ్ దేవగణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు బాలీవుడ్ సినీ తారలు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. అయితే 53వ పడిలోకి అడుగు పెడుతున్న ఈ బాలీవుడ్ హీరో 5 రహస్యాలు ఏంటో తెలుసుకుందామా ! 1. ట్రావెలర్ అజయ్ దేవగణ్ మంచి నటుడే కాకుండా ట్రావెల్ లవర్ కూడా. అతని కుటుంబంతో ప్రయాణించడం కంటే ఆయనకు ఏది గొప్ప ఆనందాన్ని ఇవ్వదట. అజయ్ తన తల్లిదండ్రులు, భార్యా పిల్లలు, ఇద్దరు సోదరీమణులు, వారి భర్తలు, పిల్లలతో కలిసి దూర ప్రయాణాలు చేస్తుంటాడని సమాచారం. సెలవుల్లో 25 మంది కుటుంబ సభ్యుల బృందం కలిసి టూర్‌కు వెళ్తాడట. ఇందుకోసం బిజినెస్ క్లాస్ లేదా ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించి స్టే చేసేందుకు సాధ్యమైతే ఏకంగా ఒక ఐలాండ్నే బుక్ చేస్తాడని సమాచారం. 2. శివ భక్తుడు అజయ్ దేవగణ్ గొప్ప శివ భక్తుడు. ఎంత గొప్ప భక్తుడు అంటే అతని ఛాతిపై శివుడి పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. అంతేకాకుండా ఆయన డైరెక్ట్ చేసిన 'శివాయ్' మూవీని శివుడికి అంకితం ఇచ్చాడు. 3. టాలెంటెడ్ కుక్ అద్భుతంగా వండటంలోనూ అజయ్ దేవగణ్ సిద్ధహస్తుడు. భారతీయ, కాంటినెంటల్ డిషెస్‌ను సూపర్‌గా చేయగలడని టాక్. 4. కుటుంబమంటే అమితమైన ప్రేమ యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టే అజయ్ దేవగణ్ మంచి ఫ్యామిలీ మ్యాన్ కూడా. ఆయనకు మొదటగా పుట్టిన కూతురు నైసా.. అజయ్ దేవగణ్ బలహీనత. కనీసం రోజులో కొన్నిసార్లు అయినా ఆమెతో మాట్లాడలేకపోతే అజయ్‌కు రోజు గడవదట. అలాగే కుమారుడు యుగ్ అన్న అజయ్‌కి అమితమైన ప్రేమ. 5. పోలో గ్రీన్ కొలోన్ అంటే ఇష్టం అజయ్ దేవగణ్ గత మూడు దశాబ్దాలుగా రాల్ఫ్ లారెన్ తయారు చేసిన పోలో గ్రీన్ అనే కొలోన్నే ధరిస్తున్నాడని సినీ వర్గాల నుంచి సమాచారం. -
ప్రాణం పోయినా సరే ‘తల’పెడితే.. తగ్గేదేలే!.. ఇతరులకు నో ఎంట్రీ!
చీమా.. చీమా.. ఏమిటలా కుట్టావ్ అంటే.. నా పుట్టలో వేలుపెడితే కుట్టనా? అంటుందట. కానీ ఈ చీమ కుట్టకున్నా.. తమ గూట్లో మాత్రం వేలు పెట్టనివ్వదు. తన తలను పణంగా పెట్టి మరీ గూడును కాపాడేస్తుంది. ప్రాణం పోయినా సరే.. తగ్గేదే లేదంటూ నిలబడుతుంది. ఏమిటీ.. ఓ చీమ గురించి ఇంత ఉపోద్ఘాతమేంటి అనిపిస్తోందా? దాని గురించి తెలిస్తే.. భలే ఉందిలే అనుకోకుండా ఉండలేరు. మరి ఆ చీమ ఏమిటి? దాని ప్రత్యేకతలేమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ గూటికి తగినట్టుగా తల.. సాధారణంగా ఇంటిని కాపాడటానికి గేట్లు, తలుపులు పెట్టుకుంటాం. అవసరమైతే తీసి, మళ్లీ వేసేస్తుంటాం. కానీ చెట్ల కాండంపై రంధ్రాల్లో జీవించే ‘డోర్ హెడ్’ చీమలు మాత్రం స్పెషల్. అవి తమ గూటిని కాపాడుకునేందుకు తలనే అడ్డుపెట్టి చేసే పోరు మరీ స్పెషల్.‘సెఫలోట్స్/సెరెబరా’ జాతికి చెందిన ఈ చీమల తలపై భాగం బల్లపరుపుగా, గుండ్రంగా ఉంటుంది. అంతేకాదు.. దాదాపుగా తమ గూడు రంధ్రానికి సరిపడే పరిమాణంలో ఉంటుంది. ఈ చీమలు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు.. గూటి లోపలికి వెళ్లి.. తమ తలను గూటి రంధ్రానికి అడ్డు పెట్టేస్తుంటాయి. అందుకే వీటిని ‘లివింగ్ డోర్స్’ అని కూడా పిలుస్తుంటారు. సాధారణంగా బీటిల్స్ (ఒకరకం చిన్నసైజు పురుగులు) చెట్ల కాండాలపై గుహల్లా రంధ్రాలు చేస్తుంటాయని.. వీటినే తమ గూడుగా చేసుకుని జీవిస్తుస్తున్న ఒకరకం చీమలు.. వాటిల్లోకి ప్రవేశించే రంధ్రాల వద్ద ‘డోర్‌హెడ్’ చీమలను కాపలాగా ఉంచుతాయని అమెరికాలోని లూయిస్విల్లే యూనివర్సిటీ పరిశోధకుడు స్టీవ్ యనోవిక్ తెలిపారు. ఈ చీమలపై ఆయన విస్తృత పరిశోధన చేశారు. ‘డోర్‌హెడ్’ చీమలు తమ చీమలనే లోనికి రానిస్తాయని.. చెట్లపై తిరిగే చిన్న పురుగులు, కీటకాలు వంటివి గూడులోకి వెళ్లకుండా అడ్డుకుంటాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల ఈ తరహా ‘డోర్ హెడ్’ చీమలు ఉన్నాయన్నారు. చెట్ల కాండాల్లో బీటిల్స్ చేసే రంధ్రాలకు సమాన సైజులో ‘డోర్ హెడ్’ చీమల తల సైజు ఉండటం విశేషమని.. లక్షల ఏళ్ల పరిణామ క్రమంలో ఇలా అభివృద్ధి చెంది ఉంటాయని పేర్కొన్నారు. ప్రాణం పోయినా.. తగ్గేదే లే.. చీమల్లో చాలా రకాలు కుడతాయి. ఇందుకోసం వాటికి ప్రత్యేకంగా గొట్టంవంటి నిర్మాణం (స్టింగ్) ఉంటుంది. కానీ ‘డోర్ హెడ్’ చీమలకు స్టింగ్ ఉండదు. దాంతో కుట్టలేవు. కానీ శత్రు పురుగులు, కీటకాలు గూడులోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రాణాలనైనా పణంగా పెడతాయని.. పురుగులు ఈ చీమల తలపై గట్టిగా దాడి చేసినా, కుట్టినా వెనక్కితగ్గవని స్టీవ్ యనోవిక్ చెప్పారు. తాము పరిశీలించిన ‘డోర్ హెడ్’ చీమల్లో చాలా వాటికి తలపై గాయాల గుర్తులు ఉన్నాయని వివరించారు. చీమల గూడు నిరంతరం మూసేసి ఉండదని.. ఏదైనా ప్రమాదం వస్తున్న సంకేతాలు కనబడగానే ‘డోర్‌హెడ్’ చీమలు ద్వారానికి తలుపులా తమ తలను అడ్డుపెట్టేస్తాయని తెలిపారు. -
Pushpa: చిత్తూరు యాసలో ఇరగదీశాడు.. అసలు ఎవరీ కేశవ?
టాలీవుడ్లో మోస్ట్ అవైటడ్ మూవీగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తోంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’. సుకుమార్ టేకింగ్, బన్నీ యాక్టింగ్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలవడంతో టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లలో కొత్త రికార్డు సాధించడం చూసి సినీ పండితులు కూడా షాక్‌కు గురవుతున్నారు. కరోనా తరువాత ఈ రేంజ్లో బాక్సాఫీస్‌ని షేక్ చేయడంతో బన్నీ ఫ్యాన్స్ ఇప్పటికే పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో నటన పరంగా చెప్పుకోదగిన మరో విషయం ఏంటంటే బన్నీ పక్కన కేశవ పాత్రలో చేసిన జగదీష్ ప్రతాప్ బండారి గురించే. ఇంత వరకు చిన్న క్యారెక్టర్లు చేస్తూ వస్తున్న జగదీష్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో సఫలమయ్యాడనే చెప్పాలి. పుష్ప లాంటి భారీ బడ్జెట్ సినిమాలో హీరో పక్కన నటించే పాత్రల కోసం డైరెక్టర్ కొత్త నటులను తీసుకుని రిస్క్ తీసుకోరు. ఎందుకంటే ఏ మాత్రం తేడా కొట్టిన అది సినిమాపై ప్రభావం చూపిస్తుంది. అందుకు అలాంటి పాత్రలకోసం దర్శకులు ఇండస్ట్రీలో పేరున్న నటులను ఎంపిక చేసుకుంటారు. అయితే దర్శకుడు సుకుమార్ మాత్రం పేరు కంటే ప్రతిభ ఉన్నవాళ్లకు తన సినిమాలలో అవకాశాలను ఇచ్చారు. కేశవ పాత్రలో నటించిన జగదీష్ ప్రతాప్ బండారి సినిమాలను చూస్తే.. అతను పలాస 1978, మల్లేశం సినిమాలలో నటించాడు. అది కూడా చిన్న పాత్ర మాత్రమే. అయినా అతను చేసిన ప్రాత పరిధిని కాకుండా తన నటన గుర్తించాడు సుకుమార్. సీమ యాసలో బాగా మాట్లాడే ఈ నటుడికి అదే యాసలో మాట్లాడే పాత్రను సుకుమార్ ఇవ్వడంతో పాత్ర న్యాయం చేశాడని సినిమా చూసిన వాళ్లు చెప్తున్నారు. మరో విషయం ఏంటంటే పుష్ప సినిమాకు నెరేషన్ ఇచ్చింది కూడా ప్రతాప్ బండారి కావడం గమనార్హం. పుష్ప సక్సెస్ తో ప్రతాప్ బండారి పేరు ప్రస్తుతం టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ఈ పేరుతో భవిష్యత్తులో మరిన్నీ అవకాశాలు వస్తాయో లేదో చూడాలి. చదవండి: Samantha-Pushpa Movie: ఎట్టకేలకు పుష్ప స్పెషల్ సాంగ్ ట్రోల్స్‌పై స్పందించిన సామ్ -
మొబైల్స్ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు
కాలం మారిపోయింది..సెల్‌ఫోన్ దేహంలో భాగమైపోయింది..ఫోన్ లేనిదే పొద్దు పోవడంలేదు..అత్యవసర పనుల నుంచి.. సరదా కబుర్లకు కూడా సెల్ ఉండాల్సిందే..! అంతెందుకు ఎక్కడో సప్త సముద్రాల అవతల ఉన్న కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఈ ఫోన్‌తో కమ్యూనికేట్ అవ్వొచ్చు. అలాంటి సెల్ ఫోన్‌కు ఓ హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ గురించి తెలుసా? ఉదాహరణకు పీసీ(personal computer)ల కంటే ప్రపంచంలోనే ఎక్కువ మొబైల్ ఫోన్లు ఉన్నాయని తెలుసా? చేతిలో ఫోన్ లేకపోతే పుట్టే భయాన్ని ఏమంటారో తెలుసా? అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ పేరేంటో తెలుసా? మొదటి మొబైల్ ఫోన్ బరువు ఎంతో తెలుసా? ఇలాంటి ఇంటస్ట్రింగ్ ఫ్యాక్స్ చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ►మనం వినియోగించే 'స్మార్ట్ ఫోన్' అసలు పేరు 'సిమోన్'. ఈ ఫోన్లో క్యాలండర్ యాప్స్, అడ్రస్ బుక్, వరల్డ్ క్లాక్, క్యాలిక్లేటర్, నోట్ ప్యాడ్, ఈమెయిల్, ఫ్యాక్స్, గేమ్స్ ఆడేవారు. టచ్ స్క్రీన్‌తో లభించే ఈ ఫోన్ ధర వెయ్యి డాలర్లు. ►ఫస్ట్ సెల్ ఫోన్ ను 1973లో తయారు చేశారు.ఆఫోన్ నుంచి 1992లో ఫస్ట్ మెసేజ్ పంపారు. ►ఫస్ట్ కెమెరా ఫోన్ 2002 జపాన్‌లో విడుదలైంది. ►టెక్ దిగ్గజం యాపిల్ విడుదల చేసిన అన్నీ ఫోన్లలో కంటే ఐఫోన్ 5ఎస్ ఎక్కువగా అమ్ముడు పోయింది. 2013 సెప్టెంబర్ 20న విడుదలైన ఈ ఫోన్ ఇప్పటి వరకు 70వేల మిలియన్ల యూనిట్లు అమ్ముడుపోయాయి. ►ప్రపంచంలో వాటర్ ఫ్రూఫ్ ఫోన్లు అమ్ముతున్న దేశం జపాన్. ►సైంటిస్ట్‌లు తొలిసారి యూరిన్ సాయంతో సెల్ ఫోన్ కు ఛార్జింగ్ పెట్టారు. ►2015లో ఆపిల్ సంస్థ పాత ఐఫోన్లను రీసైకిల్ చేసి టన్ను గోల్డ్‌ను వెలికి తీసింది. అలా వెలికి తీసిన ప్రస్తుతం గోల్డ్ ధర 40మిలియన్ల (ఇండియన్ కరెన్సీలో రూ.2,99,88,62,000.00) ఉంది. ► మొబైల్ ఫోన్లను విసిరేయడం ఫిన్‌ల్యాండ్‌లో అధికారిక క్రీడ ► టాయిలెట్ హ్యాండిల్ కు ఉన్న బ్యాక్టీరియా కంటే 18 టైమ్స్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా మన ఫోన్లో ఉంది.శాక్రమెంటో బీ రిపోర్ట్ ప్రకారం ఐఫోన్లు, ఐప్యాడ్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు, టచ్ స్క్రీన్లపై బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ►ప్రతిరోజు ఓ వ్యక్తి యావరేజ్‌గా 110 సార్లు తమ స్మార్ట్ ఫోన్లను అన్ లాక్ చేస్తుంటాడు. ►చేతిలో ఫోన్ లేకపోతే కలిగే భయాన్ని వైద్య పరిభాషలో నోమో ఫోబియా అంటారు. ►1999లో తొలిసారి బెనిఫాన్ ఈఎస్ఈ అనే ఫోన్లో జీపీఎస్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ► 2015లో వరల్డ్ వైడ్ గా 1.4 బిలియన్ల ఫోన్లు అమ్ముడయ్యాయి. ► హాంకాంగ్ పాపులేషన్ 7.2 మిలియన్ల మంది ఉండగా..యాక్టీవ్‌గా ఉన్న మొబైల్స్ సంఖ్య 17.4 మిలియన్లుగా ఉంది. ► 40శాతం స్మార్ట్ ఫోన్లు దొంగతనానికి గురయ్యే సమయం సాయంత్రం 5 గంటల సమయం లోపలే. ► 11శాతం మొబైల్స్ దొంగతనం పనిచేసే ప్రదేశాల్లో జరిగినట్లు తేలింది. ► తొలిసారి వాడుకలోకి వచ్చిన స్మార్ట్ ఫోన్ బరువు 2.5 పౌండ్లు.. అదే ఫోన్ ఇప్పుడు యావరేజ్‌గా 250 గ్రాములు. చదవండి: జర భద్రం! మీ ఫోన్ హ్యాక్ అయ్యిందేమో.. ఇలా చెక్ చేయండి -
నిజానికి నేను అలాంటిదాన్ని కాదు!
‘‘నేను ఏ సినిమా చేసినా మంచి సినిమా చేస్తున్నాననే తృప్తి నాకు మిగలాలి. అంతకుమించి నాకు వేరే ఏ అంచనాలూ ఉండవు. ‘పాగల్’ చేస్తున్నప్పుడు మంచి సినిమా, మంచి పాత్ర చేస్తున్నాననే ఫీల్ కలిగింది’’ అన్నారు నివేదా పేతురాజ్. విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా ‘దిల్’ రాజు – బెక్కెం వేణుగోపాల్ నిర్మాణంలో వస్తోన్న చిత్రం ‘పాగల్’. నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలతోంది. ఈ సందర్భంగా నివేదా పేతురాజ్ మాట్లాడుతూ – ‘‘రెండేళ్ల క్రితం నరేశ్‌గారు ఈ సినిమా కథ చెప్పారు. ఒక్కసారి కాదు.. ఐదు సార్లు కథ చెప్పారు. వింటున్నప్పుడే ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. కథ విన్న ప్రతిసారీ కన్నీళ్లు పెట్టుకున్నాను. నరేశ్‌గారు కథ చెప్పినప్పుడల్లా బెక్కెం వేణుగోపాల్‌గారు కూడా ఉన్నారు. ఈ కథను ‘దిల్’ రాజుగారు కూడా బాగా నమ్మారు. నరేశ్ ఎంత ఎమోషనల్‌గా కథ చెప్పారో అంతే బాగా తీశారు. ప్రేమలో ఉన్నవారందరూ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. ఇందులో నా క్యారెక్టర్ సీరియస్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల.. వైకుంఠపురములో’ వంటి చిత్రాల్లో దాదాపు సీరియస్ క్యారెక్టర్సే చేశారు.. మళ్లీ ‘పాగల్’లోనూ అలాంటి క్యారెక్టరే చేయడానికి కారణం? అనే ప్రశ్న నివేద ముందుంచితే– ‘‘కారణం నాకూ తెలియదు. బహుశా నా లుక్స్, ప్రవర్తన చూసి నాకు సీరియస్ క్యారెక్టర్స్ బాగా సూట్ అవుతాయని ఇస్తున్నారేమో! నేను చూడటానికి సీరియస్ అమ్మాయిలా కనపడతాను. కానీ నిజానికి నేనలా ఉండను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘వేరే ఫీల్డ్‌లో అవగాహన పెంచుకోవాలని రీసెంట్గా రేసింగ్‌లో ఫస్ట్ లెవల్ పూర్తి చేశాను. రేసింగ్ ట్రైనింగ్ అప్పుడే కొత్త సినిమాలు కమిట్ అయ్యాను. తెలుగులో ఒకటి, తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను’’ అని నివేదా పేతురాజ్ అన్నారు. -
యాక్టింగ్‌లో మేటి.. యాసలో ఒకటే!
వెబ్‌డెస్క్: ఏరంగంలోనైనా పురుషులతో సమానంగా మహిళలు రాణించాలంటే అదనపు నైపుణ్యాన్ని సొంతం చేసుకోవాల్సిందే. అలా తమదైన సొంత ప్రతిభతో పురుషులకు ధీటుగా తమ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నవారు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా సినీరంగంలో,అందులోనూ హాస్య పాత్రల్లో రాణించడమంటే కత్తిమీదే సామే. అలాంటి వారిలో అలనాటి సూర్యకాంతం, ఛాయాదేవి మొదలు, రమాప్రభ, శ్రీలక్ష్మి, 90ల దశకం నాటి తెలంగాణా శకుంతల, ఇంకా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న కోవై సరళ గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా పరభాషా నటి అయినా తెలుగులో అద్భుతంగా రాణించిన కోవై సరళ, ‘తెలంగాణా’నే తన ఇంటి పేరుగా మార్చుకున్న తెలంగాణ శకుంతల మధ్య ఉన్న వివిధ సారూప్యతల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలంగాణా శకుంతల, కోవై సరళ ఇద్దరూ తెలుగు తమిళ సినిమాల్లో క్యారెక్టర్‌గా ఆర్టిస్టులుగా రాణించారు. తెలుగు సినీరంగంలో వీరిద్దరి మధ్యా ఉన్న సారూప్యత కేవలం హాస్యాన్ని పండించడం ఒక్కటే కాదు. అద్భుతమైన నటన, విలక్షణమైన భాషతో వీరు తెరపైగా కనిపించిగానే థియేటర్లలో నవ్వులు పూయాల్సిందే. సీటీలు మారు మోగాల్సిందే. నటనా శైలి, భాష, యాస, పంచ్ డైలాగులు వీరికి తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. అపహాస్యం, అసభ్యత లేని కామెడీ వీరి సొంతం.కుటుంబంలో ఆడపిల్లగా కుటుంబ బాధ్యత తనపై వేసుకుని నిబద్దతతో కుటుంబాన్నిపైకి తీసుకు రావడం మరో సారూప్యత. కడియాల శంకుతల (తెలంగాణా శకుంతల) మహారాష్ట్రలో పుట్టి పెరిగిన కడియాల శంకుతల 250కి పైగా చిత్రాల్లో నటనతో అజరామరంగా నిలిచిపోయారు. ముఖ్యంగా టాలీవుడ్లో తెలంగాణ యాస, రాయలసీమ యాసతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒంటి కాలిపరుగుతో రంగస్థల నటిగా తన నటనాప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె ఆ తరువాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిరు. అది మొదలు ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ఒకదశలో తన కోసమే పాత్రలను సృష్టించే స్థాయికి ఎదిగిన గొప్ప నటి ఆమె. రవీంద్ర భారతిలో ప్రదర్శించిన నాటకం ద్వారా నటన మొదలు పెట్టిన ఆమె చాలా నాటకాల్లో కీలక పాత్రల్లో నటించారు. ఆ తరువాత. గౌతమ్ ఘోస్ దర్శకత్వం వహించిన 1979 నాటి చిత్రం ‘మా భూమి’ ద్వారా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నువ్వు నేను’ ‘నీ తల్లి..ఇంకోపాలి నా ఇలాకలో..’ డైలాగ్‌తో పాపులర్ అయిన ఆమె ఆ తరువాత ఎన్నో పంచ్ డైలాగులతో ప్రేక్షకుల మెప్పుపొందారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ ‘ఒక్కడు’లోని ఆమె నటన, ఆమె పలికన తీరు, నోట్లో లావుపాటి చుట్టతో ఆమె ఆహార్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. అంతేనా లక్ష్మి సినిమాలో, మరో హాస్యనటుడు వేణు మాధవ్‌తో కలిసి నటించిన కామెడీ సీన్ గుర్తొస్తే పగలబడి నవ్వాల్సిందే. ‘‘తమ్మీ పైసలు దెస్తివా..మరి ఏమే.. పోవే.. శక్కూ.. అంటివి గదరా’‘ లాంటి ఎన్నో విలక్షణ డైలాగులతో శకుంతల ఎంతో ప్రాచుర్యం పొందారు. పెళ్లాంతో పనేంటి సినిమాలో కొండవలసకు జోడిగా ఆమె అమాయకపు నటన, ఆ తరువాత చూపించిన నట విశ్వరూపం, ఒరిజినల్ కారెక్టర్‌ను ప్రదర్శించిన తీరు అద్భుతం. అలాగే దివంగత దర్శకుడు దాసరి నారాయణ దర్శకత్వంలోవచ్చిన చిత్రం ఒసేయ్ రాములమ్మతోపాటు, కొమురం భీం, ఎర్ర సైన్యం లాంటి చిత్రాలు ఆమె కరియర్లో భాగం. అంతేకాదు పురుషులతో పోటీ పడి మరీ విలనిజాన్ని పండించిన ఘనత శకుంతల సొంతం. కుక్క సినిమాలో నటనకు నంది అవార్డును సొంతం చేసుకున్నారు. భూదేవికి ఉన్నంత సహనం, ఓర్పు, కష్టపడే మనస్తత్వంతోనే మహిళలు రాణిస్తారని నమ్మి ఆచరించిన ధీర మహిళ శకుంతల. రవి తేజ నటించిన వీడే మూవీలో ఆమె ఒక పాట పాడటం విశేషం. ‘‘భయం అనేదే నాకు తెలియదు..అమ్మకు నేనే అబ్బాయిని. నన్ను మగరాయుడిలా పెంచారు..నలుగురి అక్క చెలెళ్లకు నేను అన్న..నేనే తమ్ముడిని. డేరింగ్ అండ్ డేషింగ్ మహిళను’’ అని స్వయంగా శకుంతలగారే చెప్పుకున్నారు. తండ్రి చనిపోవడంతో నటననే వృత్తిగా ఎంచుకుని కుటుంబ బాధ్యతలను నెత్తిన వేసుకున్నారు. అక్క, చెల్లెళ్లకు పెళ్లి చేసిన తరువాత మాత్రమే ఆమె పెళ్లి చేసుకున్నారు. రెండుసార్లు భయంకరమైన యాక్సిడెంట్లు, రెండుకాళ్లు విరిగిపోయినా మృత్యుంజయురాలై, ఫీనిక్స్ పక్షిలా పడిలేచిన కెరటం శకుంతల. కానీ 2014, జూన్ 14న తీవ్ర గుండెపోటుతో కన్నుమూయడం విషాదం. కోవై సరళ 1962 ఏప్రిల్ 7న తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జన్మించిన కోవై సరళ తమిళం తెలుగు భాషల్లో విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. రెంటిలోనూ ఇప్పటి దాకా సుమారు 750 సినిమాల్లో నటించారు. కామెడీనీ పండించడంలో ఈమెకు ఈమే సాటి. ముఖ్యంగా కమల్ హాసన్‌కు జోడీగా ‘సతీ లీలావతి’, స్టైలిష్‌స్టార్ అర్జున్ నటించిన దేశముదురుమూవీలో కోవై సరళ నటనను ఎలా మర్చిపోతాం. అంతేకాదు బ్రహ్మానందానికి తోడుగా తిరుమల తిరుపతి వెంకటేశా, 2002లో ముప్పలనేని శివ దర్శకత్వంలో విడుదలైన సినిమా సందడే సందడి మూవీలో ఆమె చేసిన కామెడీ హైలెట్‌గా చెప్పొచ్చు. అలాగే లారెన్స్ మూవీ కాంచనలో కోవై సరళ అమాయక నటనకు జేజేలు చెప్పాల్సిందే. నాగార్జున నుంచి మొదలు ఈ తరం యంగ్ హీరోలు అందరి సినిమాల్లోను ఆమె నటించారు. ముఖ్యంగా కిక్-2 , గ్రీకు వీరుడు, హీరో, మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు, ఎలా చెప్పను, శ్రీరామచంద్రులు, ఎంత బావుందో!, ఫూల్స్ , అక్కా బావెక్కడ సినిమాల్లోని పాత్రలతో తనదైన శైలితో ఆకట్టుకున్నారు. పదినేళ్ల వయసులోనే కేఆర్ విజయ సరసన వెల్లి రథం అనే తమిళ సినిమాలో నటించారు. ముంధనై ముడిచ్చు అనే సినిమాలో 32 ఏళ్ళ గర్భిణిగాను, మరో రెండు సంవత్సరాల తరువాత చిన్నవీడు అనే సినిమాలో భాగ్యరాజా పాత్రకు తల్లిగా 65 ఏళ్ళ మహిళ పాత్రలో నటించిన మెప్పించిన ఘనత ఆమె సొంతం. కోవై సరళ కుటుంబ బాధ్యతల నిమిత్తం అవివాహితగానే మిగిలిపోయారు. నలుగురు అక్కచెల్లెళ్లున్న కుటుంబంలో పెద్ద కుమార్తె సరళ. వారి చదువు సంధ్యా వివాహాల సందడిలో పడి పెళ్లి అన్న మాటనే మర్చిపోయారామె. తనకు ఒంటరిగా ఉండడం ఇష్టమని, అందుకే ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదని ఒక సందర్భంగా ఆమె చెప్పుకున్నారు. ఓరి నీప్రేమ బంగారం కానూ (2003) సినిమాకు ఉత్తమ హాస్యనటి నంది పురస్కారాన్ని, తమిళనాడు ప్రభుత్వం నుంచి మూడుసార్లు ఉత్తమ హాస్యనటి అవార్డును సొంతం చేసుకున్నారు. తరతరాలకి ఎవర్గ్రీన్ కామెడీ క్వీన్ కోవై సరళ అనడంలో ఎలాంటి సందేహం లేదు. -
దర్భంగా పేలుడు కేసు విచారణలో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: దర్భంగా పేలుడు కేసు విచారణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. హైదరాబాద్ నుంచి 35 కేజీల పార్సిల్‌ను పంపిన మాలిక్ బ్రదర్స్.. బట్టల మధ్యలో ఐఈడీ బాంబ్ పెట్టినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఎక్కడా తమ గుర్తింపు బయటపడకుండా మాలిక్ బ్రదర్స్ పార్సిల్ పంపినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. మహ్మద్ సూఫియాన్ పేరును పార్సిల్ సెండింగ్ రిసీవింగ్‌కు ఉగ్రవాదులు వాడారు. ఏఐబీపీఏ 9085సీ నంబర్‌తో ఉన్న పాన్‌కార్డ్‌ను మాలిక్ బ్రదర్స్ వాడారు. ఈ పాన్ కార్డ్ క్రియేషన్‌లో లష్కరే తొయిబా ముఖ్య నేత ఇక్బాల్ కీలకంగా ఉన్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. కాగా, దర్భంగ రైల్వే స్టేషన్లో జరిగిన విస్ఫోటనం కేసులో అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను ఎన్ఐఏ అధికారులు గురువారం బిహార్‌కు తరలించారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ సభ్యులు ఇమ్రాన్ మాలిక్ అలియాస్ ఇమ్రాన్ ఖాన్, మహ్మద్ నాసిర్ ఖాన్ అలియాస్ నాసిర్ మాలిక్‌లను గురువారం ఉదయం మల్లేపల్లిలోని భారత్ గ్రౌండ్స్ వద్ద ఉన్న వారి ఇంటిలో సోదాలు చేశారు. కొన్ని పత్రాలు, రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నాంపల్లిలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత బిహార్‌కు తీసుకెళ్లారు. -
Gijigadu : టాలెంట్ ఉంటేనే ఆడ పక్షుల ప్రేమ..
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: సృష్టిలో పశుపక్ష్యాదులు తమదైన శైలిలో ప్రత్యేకతను చాటుతాయి. పక్షిజాతుల్లో విభిన్నమైన, వైవిధ్యతను చాటే పక్షి గిజిగాడు. ఈ పక్షులు పాలమూరు యూనివర్సిటీలోని అడ్మిన్ భవనం వద్ద ఉన్న ఓ బావిలో ఇటీవల గూడు కట్టుకుంటున్నాయి. మగ, ఆడ పక్షుల మధ్య ఉండే సంబంధాల్లో కొన్ని ఆసక్తికర విషయాలను యూనివర్సిటీ జంతుశాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ‘సాక్షి’తో పంచుకున్నారు. లేత పసుపు రంగులో ఉండే మగపక్షి నాణ్యతగా గూడు కట్టి ఆడపక్షిని మెప్పించగలిగితే.. ఆ ఆడ పక్షి గూడు కట్టిన మగపక్షితో జత కడుతుంది. గాలి, వాన, చలి, వేడికి కూడా చెక్కు చెదరకుండా పక్షి పిల్లలకు ఆ గూడు రక్షణ ఇవ్వాలి. అలా మెప్పించలేని మగ పక్షులు ఏడాది పాటు ఒంటరిగా ఉండాల్సిందేనట. ప్రతిభ ఉన్న మగ పక్షులే ఆడ పక్షుల ప్రేమను పొందుతాయట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఎంతో ఆసక్తిగా అనిపిస్తుంది. చదవండి: పాముకే విషమిచ్చి చంపేస్తే!! -
సీరియల్స్ కంటే ముందు ‘వంటలక్క’ రియల్ ప్రొఫెషన్ ఇదే!
తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న సీరియల్ కార్తీక దీపం. స్టార్ మాలో ప్రసారం అయ్యే ఈ సీరియల్ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు మూడున్నరేళ్లుగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోన్న ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్‌లో నెంబర్1 స్థానంలో కొనసాగుతుంది. ఈ సీరియల్ వస్తుందంటే అన్ని పనులు పక్కనపెట్టి మరీ సీరియల్‌ను చూసే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. మలయాళంలో వచ్చిన ‘కరుతముత్తు' అనే సీరియల్ రీమేకే కార్తీకదీపం. ఈ ఒక్క సీరియల్‌తో కేరళలో బాగా పాపులర్ అయిన నటి ప్రేమీ విశ్వనాథ్. దీంతో రీమేక్‌లోనూ ఆమెనే తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వంటలక్కగా పాపులర్ అయిన ప్రేమీ విశ్వనాథ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1991 డిసెంబర్2న కేరళలలో జన్మించిన ప్రేమీ విశ్వనాథ్ తండ్రి పేరు విశ్వనాథ్ కాగా, తల్లి కాంచన. లా చదివిన ప్రేమీ విశ్వనాథ్ ఓ ప్రైవేటు సంస్థకు లీగల్ అడ్వైజర్‌గా పనిచేసింది. ఇక సీరియల్స్‌లో నటించేకంటే ముందే మోడల్‌గానూ రాణించిందని సమాచారం. అంతేకాకుండా సొలోమన్ 3డీ అనే ఓ సినిమాలోనూ నటించింది. ఈమె అన్నయ్య శివప్రసాద్ ఫేమస్ ఫోటోగ్రాఫర్. ఆయనకు ఎర్నాకుళంలో రెండు స్టూడియోలు ఉన్నాయి. ప్రేమీ విశ్వనాథ్ కూడా సోదరుడి లాగే ఫోటోగ్రఫీ మీద మక్కువతో కొన్ని పెళ్లిళ్లు, శుభకార్యాలకు పనిచేసిందట. ఇక ప్రేమీ విశ్వనాథ్ భర్త డా.వినీత్ భట్ ఆయన ఆస్ర్టాలజీ విభాగంలో పలు అంతర్జాతీయ అవార్డులు సైతం గెలుచుకున్నారు. ఈయన వద్దకు పలువురు రాజకీయ, సినీ రంగానికి చెందిన వాళ్లు వస్తుంటారట. వినీత్ భట్ సూచనలతో తమ పేర్లలో కొన్ని మార్పులు కూడా చేసుకున్నట్లు సమాచారం. ఇక ప్రేమీ విశ్వనాథ్-వినీత్ భట్ దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. కార్తీకదీపంతో బాగా పాపులర్ అయిన వంటలక్కకు తెలుగులో పలు సినీ అవకాశాలు వస్తున్నాయట. కానీ ఇప్పటివరకు ఆమె ఒక్క ప్రాజెక్టుకు కూడా సైన్ చేయలేదని తెలుస్తోంది. చదవండి : నటుడు ప్రియదర్శి భార్య ఎవరో తెలుసా ?ఆమె ప్రొఫెషన్ ఏంటంటే.. 'ఆట ఫేమ్ గీతిక ఎన్ని కష్టాలు పడుతుందో'.. ఆమె ఏం చెప్పిందంటే! -
కరోనా ప్రమాద ఘంటికలు.. తెలుసుకోవాల్సిన విషయాలు
సంవత్సర కాలంగా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు బలిగొంది. కరోనాకు టీకాలు కనుగొన్నా అన్ని దేశాల్లో ఇంకా హెర్డ్ ఇమ్యూనిటీ స్థాయిలు రాలేదు. మరోవైపు కరోనా సెకండ్‌వేవ్ పలు దేశాల్లో ఆరంభమై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా బయటపడినప్పటినుంచి ఈ వైరస్‌ను ఫలానా ఫలానా వాటితో నిర్మూలించవచ్చంటూ రకరకాలు అపోహలు బయలుదేరాయి. వీటిలో కొన్ని కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సాయపడినా, వైరస్‌ను పూర్తిగా నిర్మూలిస్తాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిపుణులు. కరోనాపై అపోహలు, వాస్తవాల గురించి ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.. అపోహ: విటమిన్ ‘సి’లేదా జింక్ కరోనా నుంచి రక్షిస్తుంది.. వాస్తవం: సిట్రస్ జాతి పండ్లయిన నిమ్మ, నారింజ, బత్తాయి వంటి వాటిని ఏ రూపంలో తీసుకున్నా వాటిలోని విటమిన్ ‘సి’ ప్రధానంగా శ్వాసకోశ సంబంధ వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. అలాగే జింక్‌ను తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కానీ వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కరోనా తగ్గుతుందని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. అపోహ: శరీర ఉష్ణోగ్రతను పెంచుకోవడం ద్వారా కరోనాను ఎదుర్కోవచ్చు. వాస్తవం: వేడి నీటిని తాగడం, పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు తినడంద్వారా శరీర ఉష్ణోగ్రతను పెంచుకొని తద్వారా కరోనాను ఎదుర్కోవచ్చనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే కరోనా వ్యాధి రాకుండా శరీర ఉష్ణోగ్రతను మార్చుకోవడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) అయితే ఈ అపోహపై కాస్త హాస్యాస్పదంగా స్పందించింది. ఇలా వేడినీటిని అధికంగా తాగడం వలన తమను తాము కాల్చుకునే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది. అపోహ: వెల్లుల్లిని తరచూ తింటే కరోనా వైరస్ నుంచి రక్షించుకోవచ్చు. వాస్తవం: వెల్లుల్లిలో శరీరానికి ఉష్ణాన్నిచ్చే కారకాలు ఉంటాయి. అలాగే కొన్ని యాంటిమైక్రోబియల్ గుణాలున్న కారకాలూ ఉంటాయని పరిశోధనల్లో తేలింది. లవంగంలోనూ ఇలాంటి యాంటీ ఇన్ఫెక్టివ్ లక్షణాలుంటాయి. కానీ ఇవి కరోనాను సంపూర్ణంగా ఎదుర్కొంటాయని చెప్పటానికి ఎలాంటి శాస్త్రీయ డేటా లేదు. అపోహ: సెలైన్‌తో ముక్కును కడిగితే కరోనా వైరస్‌ను బయటకు తీయొచ్చు. వాస్తవం: మన నాసికా రంధ్రాలను సెలైన్‌తో కడగడం వల్ల కరోనా వైరస్‌ను బయకు పారదోలవచ్చనేది మరికొంత మంది నమ్మే అపోహ. అయితే దీనికి ఎలాంటి ఆధారాలు లేవని, నిజానికి సెలైన్‌ను అధికంగా ఉపయోగిస్తే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని, శరీరంలో సహజంగా ఉండే వ్యాధి నిరోధక శక్తి దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అపోహ: శరీరంపై మందుల పిచికారీతో కరోనా దరిచేరదు! వాస్తవం: చేతులను తరచూ శానిటైజ్ చేసుకుంటే చాలు కరోనా దరి చేరదని చాలా మంది అనుకుంటున్నారు. అయితే, కేవలం చేతులనే కాదు.. శరీరం మొత్తం క్రిమిసంహారక మందులతో పిచికారీ చేసుకున్నా కరోనా సోకే ప్రమాదం ఉందన్నది నిపుణుల మాట. అంతేకాదు, ఈ క్రిమిసంహారక స్ప్రే, శానిటైజర్లను అతిగా వాడితే కరోనా కంటే ముందు వేరే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. అందుకే, ఇలాంటి క్రిమిసంహారక మందులను అధికంగా వాడే బదులుæ శుభ్రత, సామాజిక దూరంలాంటి జాగ్రత్తలు పాటించడం మంచిది. అపోహ: మినరల్స్ ప్రయోగాలతో కరోనా మాయం! వాస్తవం: యూట్యూబ్ పుణ్యమా అని ప్రతి ఒక్కరూ ఆహార నిపుణులుగా మారిపోతున్నారు. ‘ఫలానా వాటిలో ఫలానా.. వాటిని కలిపి తింటే మీ దగ్గరకు కరోనా దరిచేరదని’ కొంతమంది కల్లబొల్లి కబుర్లు చెబుతుంటారు. ఆహార పదార్థాలన్నింటిలోనూ విటమిన్స్, మినరల్స్ ఉండటం నిజమే. అయితే కొన్ని కొన్ని ఆహారపదార్థాల కలయిక ఔషధం కంటే విషాన్ని తయారు చేయగలదు. ఉదాహరణకు ఆపిల్ గింజల పొడి విషఫూరితమని శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే.. వివిధ మసాలా దినుసుల వాసన కూడా శ్యాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. తెలిసీ తెలియక చేసే ఇలాంటి మినరల్స్ ప్రయోగాలు ప్రాణాలకు ప్రమాదం. కాబట్టి, యాట్యూబ్ చానల్స్ చెప్పే అన్నింటినీ నమ్మొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అపోహ: వేడి వాతావరణం వైరస్‌ను చంపేస్తుంది! వాస్తవం: మనిషి శరీరం నీరు, నిప్పులకు స్పందించినట్లే ఈ కరోనా వైరస్ కూడా స్పందించగలదని చాలా మంది భావన. దీంతో, చాలా మంది ‘ఈ వేసవిలో మనుషులే ఎండదెబ్బ తగిలి చనిపోతుంటే.. వైరస్ ఎంత?’ అంటూ నిర్లక్ష్యం చేస్తున్నారు. నిజానికి వేడి, తేమతో సహా అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రదేశాల్లోనూ కరోనా కేసులను ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ నిర్ధారించింది. అంతేకాదు, ఈ స్థితిగతులకు కరోనా ఏ విధంగానూ స్పందించలేదని కూడా ప్రకటించింది. కాబట్టి, ఇలాంటి అపోహలు పెట్టుకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అపోహ: యాంటీ బయోటిక్స్‌తో కరోనా దూరం! వాస్తవం: సహజంగానే ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత వ్యాధినిరోధక శక్తి ఉంటుంది. ఫలితంగానే జలుబు వంటి కొన్ని చిన్న చిన్న వ్యాధులు ఎలాంటి మందులూ వాడకుండానే నయమవుతుంటాయి. ఇలాగే కొన్ని వ్యాధులను ఎదుర్కొనేందుకు మనలోని శక్తిని పెంపొందించేలా మార్కెట్లో వివిధ రకాల యాంటీబయోటిక్స్ లభ్యమవుతున్నాయి. అలాగని, ప్రతి వ్యాధికీ ఇవి పనిచేయవు. ఈ విషయం తెలియక చాలామంది కరోనాను ఎదురించేందుకు, వారిలోని శక్తిని కృత్తిమంగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా యాంటీబయోటిక్స్ మందులను వాడటం ద్వారా కరోనాను అరికట్టలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చేయాల్సిందేంటంటే.. కరోనా వైరస్ మహమ్మారి కథ ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకోవడం కంటే, మీ ఆరోగ్యాన్ని కాపాడే మార్గాలను తెలుసుకోవడం ముఖ్యం. ఇందుకు మూడు విధానాలు ఉన్నాయి. శక్తి : సహజంగా రోగనిరోధక వ్యవస్థను బాగా పనిచేసేలా చూసుకోవడం. దీనికోసం చక్కని ఆహార, జీవన అలవాట్లను పాటించడం అవసరం. ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకోవాలి. వ్యాయమం చేయాలి. అలాగే తగినంత నిద్ర పోవాలి, కాబట్టి ఎలాంటి ఒత్తిడికీ లోనుకాకుండా చూసుకోవాలి. శుభ్రత : రోజూ స్నానం చేయడం, తినే ముందు, తర్వాత చేతులను శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. వీటితో పాటు ఇతర వ్యక్తులను, వస్తువులను తాకినపుడు లేదా బయటకు వెళ్లి వచ్చినప్పుడు చేతులను, కాళ్లను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. కేవలం మిమ్మల్నే కాదు, చుట్టూ ఉండే పరిసరాలను, వస్తువులను కూడా శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. సామాజిక దూరం : కరోనా ఒక అంటువ్యాధి. అందుకే, వ్యక్తులతో తగినంత దూరం పాటించడం ముఖ్యం. అంతేకాదు, తినేటపుడు, తాగేటపుడు, మినహా అన్నివేళలా మాస్క్ ధరించాలి. అలాగే తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా ఈ మూడు దశలను చక్కగా పాటిస్తూ కరోనా బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
బట్టలు, బూట్లు వైరస్‌ను తెస్తే.. ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలు ఇలా
కరోనా సెకండ్‌వేవ్ ఆరంభమైంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక పక్క టీకా కార్యక్రమం కొనసాగుతున్నా సమాజంలో కేసులు పెరగడంపై ప్రభుత్వాలు ఆందోళన పడుతున్నాయి. టీకా తీసుకున్న వారిలో యాంటీబాడీలు డెవలప్ అయ్యేందుకు సమయం పడుతుంది, ఈలోపు వారు భౌతిక దూరం లాంటి నిబంధనలు పాటించక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కరోనా బారిన పడే ఛాన్సులు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక నష్టానికి భయపడి ప్రభుత్వాలు లాక్డౌన్ ఆలోచన చేయడం లేదు. ఈ నేపథ్యంలో సెకండ్ వేవ్ ప్రభావాన్ని తప్పించుకోవాలంటే మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పదని వైద్య, ఆరోగ్య నిపుణుల సూచన. కరోనా రూపుమార్చుకొని కొత్త స్ట్రెయిన్ల రూపంలో పంజా విసురుతుంది కాబట్టి తొలిదశ కన్నా మరింతగా అప్రమత్తత అవసరమంటున్నారు. కొత్త స్ట్రెయిన్లు, సెకండ్‌వేవ్ ఆరంభం సందర్భంగా కరోనా, దానిపై వినిపించే రూమర్లు, నిజాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు.. తదితర అంశాలపై పునరావలోకనం ఈవారం ప్రత్యేకం.... సంవత్సర కాలంగా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు బలిగొంది. కరోనాకు టీకాలు కనుగొన్నా అన్ని దేశాల్లో ఇంకా హెర్డ్ ఇమ్యూనిటీ స్థాయిలు రాలేదు. మరోవైపు కరోనా సెకండ్‌వేవ్ పలు దేశాల్లో ఆరంభమై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా బయటపడినప్పటినుంచి ఈ వైరస్‌ను ఫలానా ఫలానా వాటితో నిర్మూలించవచ్చంటూ రకరకాలు అపోహలు బయలుదేరాయి. వీటిలో కొన్ని కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సాయపడినా, వైరస్‌ను పూర్తిగా నిర్మూలిస్తాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిపుణులు. కరోనాపై అపోహలు, వాస్తవాల గురించి ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.. కరోనా విపత్కర కాలంలో ‘ఇందుగలదందు లేదని’ అన్నట్లు ఈ వైరస్ ఏ వస్తువుపై ఉందో... వాటి ద్వారా ఎప్పుడు? ఎలా? ఒంట్లోకి, ఇంట్లోకి చొరబడుతుందోనని జనంలో భయం... ఏదో ఒక పని మీద బయటకెళ్లి తిరిగి వచ్చినప్పుడు తమతోపాటే వైరస్‌ను మోసుకొచ్చామేమో అనే కలవరపాటు.. మాస్క్ వేసుకొని ఉన్నా, భౌతిక దూరం పాటించినా, చేతులను శానిటైజ్చేసినా, ఇంటికి రాగానే ముట్టుకున్న డోర్, తాళం వంటి వాటిని, మార్కెట్ నుంచి తెచ్చిన వస్తువులను రసాయనాలతో క్రిమిరహితం చేసినా ఇంకా ఎక్కడో ఏదో అనుమానం.. ఇందులో ఒక కారణం దుస్తులు, బూట్లు. వీటి ద్వారా వైరస్ ఇంట్లోకి వచ్చిందేమో అనే సందేహం. ఈ ఆందోళనలపై వైద్య నిపుణులు ఏమంటున్నారంటే.. వాహకాలే.. కానీ.. ప్లాస్టిక్, ఇనుము, రాగి వస్తువులు కొవిడ్ వైరస్‌కు వాహకాలుగా పనిచేస్తాయనే సంగతి తెలిసిందే. అలాగే దుస్తులు, బూట్లు సైతం ఈ వైరస్‌కు ఆశ్రయమిస్తాయి. కానీ వీటి ద్వారా వైరస్ వ్యాపించిందనడానికి సరైన ఆధారాలు లేవంటున్నారు వైద్య నిపుణులు. ‘ఈ వైరస్ గురించి ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం దుస్తులు, బూట్ల ద్వారా ఇతరులకు వ్యాపించినట్లు ఆధారాలు లేవు’ అని అమెరికాలోని ఓర్లాండోలో ఉన్న అడ్వాంట్హెల్త్ కేంద్రం నిపుణులు చెప్పారు. వాస్తవానికి వస్తువు ఉపరితలాన్ని బట్టి వైరస్ కొన్ని గంటల నుంచి రోజుల వరకు వాటిపై మనగలుగుతుంది. ఇందులో ఇనుము, ప్లాస్టిక్‌పై అత్యధికంగా 2 నుంచి 3 రోజుల వరకు ఉండగలుగుతుంది. అలాగే దుస్తులు, బూట్లపైనా కొన్ని గంటల పాటు జీవిస్తుంది. అంటే కఠిన ఉపరితలం ఉండే వస్తువులతో పోలిస్తే దుస్తులపై వైరస్ ఎక్కువ సేపు మనలేదు. కారణం.. వైరస్ ఎక్కువ రోజులు ఉండడంలో వాతావరణం, తేమ, ఆర్ధ్రతది కీలకపాత్ర. దుస్తుల స్వభావం దీనికి విరుద్ధం కాబట్టి ఎక్కువ సేపు బతకలేదు. తరచూ ఉతకడం.. దుస్తుల వల్ల వైరస్ వ్యాపించినట్లు ఆధారాలు లేకపోయినప్పటికీ, కచ్చితంగా రాదు అనీ చెప్పలేమంటున్నారు వైద్య నిపుణులు. అందువల్ల కొవిడ్ రోగులకు సేవలు చేసే వాళ్లు.. ముఖ్యంగా ఆరోగ్య సిబ్బంది తమ దుస్తులను తరచూ డిటర్జంట్లతో ఉతికి, ఇస్త్రీ చేసుకోవడం మేలంటున్నారు. అయితే, మార్కెట్‌కో, సరకుల దుకాణానికో వెళ్లి వచ్చిన ప్రతిసారి ఇలా చేయాల్సిన అవసరం లేదంటున్నారు. భౌతిక దూరం పాటించడం కష్టమైనప్పుడు, లేదా ఎవరైనా దుస్తుల మీద పడేలా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మాత్రం ఇంటికి రాగానే వాటిని ఉతికి, ఇస్త్రీ చేయాలని సూచిస్తున్నారు. షూ సంగతి? సాధారణంగా దుస్తులతో పోలిస్తే బూట్లపై ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందనేది మనకు తెలిసిన విషయమే. అలాగే వీటిపైనా కరోనా వైరస్ చేరుతుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) సర్వేలో తేలింది. దీనికోసం పరిశోధకులు చైనాలో కొవిడ్ వ్యాధిగ్రస్థులకు చికిత్స అందించిన కొంత మంది వైద్యుల బూట్లను పరిశీలించినప్పుడు వాటి కింది భాగంలో వైరస్ ఉండడాన్ని గుర్తించారు. అయితే, సాధారణంగా బూట్లను ఇంట్లోకి తీసుకురావడం అరుదు. ఇంటిబయట తలుపు వద్దనే వదులుతారు. ఒకవేళ వాటిని ఇంట్లోకి తీసుకురావాల్సి వస్తే బయటే మొదట డిజర్జంట్ నీళ్లు లేదా రసాయనాలతో శుభ్రం చేయాలి. లేదా వాటిని ఇంటి బయట ప్రత్యేక స్థలంలో వదలాలి. దుస్తులు, షూ ద్వారా వైరస్ రావడానికి చాలా తక్కువ అవకాశాలే ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. అయితే, అన్నింటికంటే ముఖ్యం మార్కెట్‌కు, జనసమ్మర్థ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం. వీటిని మాత్రం కచ్చితంగా పాటించాలనేది వైద్య నిపుణులు స్పష్టంగా చెప్పేమాట. -దుర్గరాజు శాయి ప్రమోద్ చదవండి: (కరోనా ప్రమాద ఘంటికలు.. తెలుసుకోవాల్సిన విషయాలు) -
సమ్మర్ లేని సంవత్సరం గురించి మీకు తెలుసా?
ఆల్రెడీ ఎండలు మొదలయ్యాయి.. ఈసారి హాట్‌హాట్‌గానే ఉండబోతోందని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించారు. అవునూ.. ఎండాకాలమంటే గుర్తొచ్చింది.. అసలు సమ్మరే లేని సంవత్సరం ఒకటుంది.. దాని గురించి మీకు తెలుసా? ఆ ఏడాది ఎండాకాలంలో మంచు కురిసింది! ఇంకా చాలాచాలా జరిగాయి.. వీటన్నిటికీ కారణం తంబోరా అనే అగ్నిపర్వతం.. ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే.. చలోఇండోనేషియా.. పేలడంలో ప్రపంచ రికార్డు.. 1816 ఏప్రిల్ 5న ఇండోనేషియాలోని మౌంట్ తంబోరా అగ్నిపర్వతం బద్దలైంది. ఏకంగా ఐదారు కిలోమీటర్ల ఎత్తున లావాను వెదజల్లింది. భారీ ఎత్తున వాయువులు, దుమ్ము, ధూళిని వాతావరణంలోకి వదిలింది. ఈ పేలుడుతో సుంబావా దీవిలో నివసిస్తున్న 10వేల మందిలో దాదాపు అందరూ చనిపోయారు. అగ్నిపర్వతం పేలుడుతో ఏర్పడిన ప్రకంపనలు, సముద్రంలో పడ్డ లావా వల్ల సునామీ ఏర్పడింది, వ్యాధులూ విజృంభించాయి. వీటితో చుట్టూ ఉన్న దీవుల్లో మరో 80– 90వేల మంది మరణించారు. అగ్నిపర్వతం నుంచి వెలువడిన దుమ్ము, ధూళి, వాయువులు వాతావరణంలో కొన్నికిలోమీటర్ల ఎత్తుకు (స్ట్రాటోస్ఫియర్ పొర వరకు) చేరాయి. వేల కిలోమీటర్ల మేర విస్తరించి.. కొద్దినెలల పాటు ఉండిపోయాయి. భూమిపై గత పది వేల ఏళ్లలో జరిగిన అతిపెద్ద అగ్నిపర్వత విస్ఫోటనం అదే కావడం గమనార్హం. బ్రిటన్‌కు చెందిన ఎడిన్బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై విస్తృతమైన పరిశోధన చేసి రిపోర్టు రూపొందించారు. 1816 బీభత్సానికి కారణమైన మౌంట్ తంబోరా అగ్నిపర్వతం ఇదే. నాటి పేలుడు ధాటికి.. అగ్ని పర్వతంపై ఏకంగా అర కిలోమీటర్ లోతు, తొమ్మిది కిలోమీటర్ల వెడల్పున బిలం ఏర్పడింది. సమ్మర్లో వింటర్.. మొత్తమ్మీద ఈ పేలుడు ఎఫెక్ట్‌కు ఆకాశంలో దుమ్ము, ధూళి, నల్లని వాయువుల కారణంగా సూర్య కిరణాలు భూమిని చేరడం తగ్గిపోయింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా మూడు డిగ్రీల మేర సగటు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆ ఏడాది ఎండాకాలమే లేకుండా పోయింది. యూరప్, ఉత్తర అమెరికాలలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వేసవి ఉంటుంది. కానీ 1816లో జూన్ నుంచి సెప్టెంబర్ దాకా.. ఆ తర్వాత కూడా మంచు కురుస్తూనే ఉంది. భూమ్మీద ఉష్ణోగ్రతలను అధికారికంగా రికార్డు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా 1816వ సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదుకావడం గమనార్హం. సమ్మర్ లేక.. సమస్యల రాక.. ఆ ఏడాది ఎండల్లేక పోవడంతో దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా పంటలన్నీ దెబ్బతిన్నాయి. ఉత్తర అమెరికా, యూరప్ దేశాలు, ఉత్తర ఆసియా దేశాల్లో నిత్యం మంచు కురుస్తూనే ఉండటంతో ఉన్న పంటలన్నీదెబ్బతిన్నాయి. మళ్లీ పంటలు వేసే పరిస్థితే లేకుండా పోయింది. చాలా దేశాల్లో తీవ్రమైన కరువు తలెత్తింది. దాంతో జనం గొర్రెలు, మేకలు, ఇతర పశువుల మాంసం తిని బతకాల్సి వచ్చింది. భారత్, చైనా దేశాల్లో రుతుపవనాలు అస్తవ్యస్తమయ్యాయి. ఎండాకాలంలోనూ కుండపోత వానలు కురిసి.. భారీ ఎత్తున వరదలు వచ్చాయి. చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. 1816లో ఏర్పడిన కరువుతో ఆహారం లేక, చలికారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చనిపోయినట్టు అంచనా. ఈ పరిస్థితి భారీ ఎత్తున వలసలకు కారణమైందని, వాతావరణం స్థిరంగా ఉండే ప్రాంతాలకు జనం తరలివెళ్లారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. అప్పట్లో ప్రధాన రవాణా సాధనమైన గుర్రాలకూ ఆ ఏడాది మేత కరువైంది. మనుషులు, సరుకు రవాణాకు చార్జీలూ పెరిగిపోయాయి. ఈ పరిస్థితులే.. కార్ల్ డ్రెయిస్ అనే జర్మన్ శాస్త్రవేత్త 1817 సంవత్సరంలో సైకిల్‌ను తయారు చేయడానికి ప్రధాన కారణమని చెబుతారు. తర్వాత ఇరవై ఏళ్లకు మాక్మిలన్ దానిని మరింత అభివృద్ధి చేసి.. ఇప్పుడున్న మోడల్ సైకిల్‌ను రూపొందించాడు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్?!
విద్య విజ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందినా ఇప్పటికీ కొన్ని వ్యాధులకు ఖచ్చితమైన పరిష్కారాన్ని కనుక్కోలేకపోతున్నాం. క్యాన్సర్ అని తెలియగానే ఎన్నో సందేహాలు, భయాలు మనల్ని వెంటాడుతుంటాయి. అవగాహన పెంపొందించుకుని తొలిదశలోనే గుర్తిస్తే చికిత్సకు లొంగే క్యాన్సర్ గురించి ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిగురుపాటి మోహనవంశీ గారు మీకందిస్తున్న వివరాలను తెలుసుకోండి. క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? క్యాన్సర్ సోకిన అవయవాన్ని బట్టి లక్షణాలు మారుతూ ఉంటాయి. అన్ని రకాల క్యాన్సర్లలో కనిపించే సాధారణ లక్షణాలు... తీవ్రమైన అలసట. జ్వరం, ఇమ్యూనిటీ తగ్గడం, ఆకలి తగ్గడం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం, రక్తహీనత. (ఇవన్నీ క్యాన్సర్ ముదిరాక కనిపించే కొన్ని లక్షణాలు). క్యాన్సర్ కణం శరీరంలో ఎక్కడైనా ఉందా అని ముందే తెలుసుకోవచ్చా? శరీరం మొత్తంలో క్యాన్సర్ కణం ఎక్కడైనా ఉందా అని ముందే తెలుసుకోడానికి నిర్దిష్టమైన పరీక్ష అయితే లేదు. ఎందుకంటే ఏ అవయవానికి క్యాన్సర్ వచ్చిందని అనుమానిస్తే... ఆ అవయవానికి సంబంధించిన పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. వీటిలో బయాప్సీ, ఎఫ్ఎన్ఏ టెస్ట్, బ్లడ్ మార్కర్స్, ఎక్స్–రే, సీటీ స్కాన్, ఎమ్మారై, పెట్ స్కాన్ ఇలా... అవసరాన్ని బట్టి రకరకాల పరీక్షలు చేస్తుంటారు. ఒక్క సర్వైకల్ క్యాన్సర్‌ను మాత్రమే పాప్‌స్మియర్ ద్వారా చాలా ముందుగా గుర్తించవచ్చు. క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ లేదా? గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్)కు కారణం హెచ్‌పీవీ వైరస్ అని తెలుసు కాబట్టి ఇది రాకుండా అమ్మాయిలకు వ్యాక్సిన్ ఉంది. తొమ్మిదేళ్ల నుంచి పెళ్లికాని అమ్మాయిలందరూ (అంటే శృంగార జీవితం ప్రారంభం కాకముందు) ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఈ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. (అండాశయం, గొంతుక్యాన్సర్ రాకుండా కూడా ఈ వ్యాక్సిన్ పనిచేయవచ్చని... 40 ఏళ్ల వరకు స్త్రీలు ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చని డాక్టర్స్ సలహా ఇస్తుంటారు). క్యాన్సర్ నివారణ మన చేతుల్లో లేదా? సర్వైకల్ క్యాన్సర్‌కు తప్పితే మిగతా ఏ క్యాన్సర్‌కూ ఖచ్చితమైన కారణం తెలియదు కాబట్టి నివారణ మన చేతుల్లో లేనట్టే. అయితే పీచు పదార్థాలు ఉండే ఆహారం, వ్యాయామం, కాలుష్యానికీ, రసాయనాలకూ దూరంగా ఉండటం, పొగతాగడం–ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండటం, తరచూ ఇన్ఫెక్షన్స్ గురికాకుండా చూసుకోవడం ద్వారా క్యాన్సర్ రాకుండా ప్రయత్నం చేసినవాళ్లమవుతాం. ఏదైనా క్యాన్సర్స్ వంశపారంపర్యమా? ఖచ్చితంగా చెప్పలేం గానీ... మిగతావారితో పోలిస్తే... రొమ్ముక్యాన్సర్ ఉన్నప్పుడు రక్తసంబంధీకుల్లో ఆ క్యాన్సర్ ముప్పు ఎక్కువ. బీఆర్సీఏ–1, బీఆర్సీఏ–2 వంటి జీన్ మ్యూటేషన్ పరీక్షల ద్వారా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పసిగట్టడచ్చు. రొమ్ము క్యాన్సర్ బాధితులు 80% వంశపారంపర్యంగా లేనివారే కాబట్టి ప్రతి మహిళా తన 20వ ఏటి నుంచే రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవాలి. నెలసరి అయిన ఏడో రోజున సబ్బు చేతులతో వేళ్ల మధ్యభాగంతో రొమ్ములను పరీక్షించుకుని, చిన్న చిన్న గడ్డలు ఏవైనా తగులుతున్నాయా అని గమనించుకోవాలి. 30 ఏళ్ల నుంచి ఇతర పరీక్షలు, 40 ఏళ్ల పైబడ్డాక మామోగ్రామ్ వంటివి ముప్పు ఉన్నవారు ఏడాదికి ఒకసారి లేదా ఇతరులు మూడేళ్లకు ఓసారి చేయించుకుంటే రొమ్ముక్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం సాధ్యం. క్యాన్సర్‌కు వయోభేదం లేదా? లేదు. ఏ వయసువారిలోనైనా కనిపించవచ్చు. అదృష్టవశాత్తు చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ చాలావరకు పూర్తిగా నయం చేయగలిగేవే. వయసు పెరిగేకొద్దీ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువ. పెద్ద వయసు వారిలో వచ్చే క్యాన్సర్స్ తీవ్రత చాలా ఎక్కువ. అందుకే క్యాన్సర్ చికిత్స అన్నది కూడా రోగి వయసును బట్టి మారుతూ ఉంటుంది. క్యాన్సర్‌ను అదుపులో మాత్రమే ఉంచగలమా? నయం చేయలేమా? చికిత్స సమయంలోనూ, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? పరిశోధకులు క్యాన్సర్ చికిత్సతో వచ్చే దుష్ప్రభావాలను (సైడ్‌ఎఫెక్ట్స్‌ను) చాలావరకు తగ్గించగలిగారు గానీ ఇప్పటికీ అవి ఎంతోకొంత ఉన్నాయి. వైద్యుల సలహాలు పాటించడం, అన్ని సదుపాయాలు ఉన్న అనుభవజ్ఞులైన డాక్టర్ దగ్గరికి వెళ్లడం, మనోధైర్యంతో యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఉండటం మంచిది. పథ్యాలు ఏవీ పాటించనక్కర్లేదు. మంచి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. క్యాన్సర్ కణాలమీదే పనిచేసే కీమోథెరపీ, రేడియోథెరపీలతో పాటు ల్యాపరోస్కోపిక్ పద్ధతిలో చేసే కీ–హోల్ సర్జరీలు కూడా నేడు క్యాన్సర్‌కు చేయగలుగుతున్నారు. సర్జరీ చేశాక రేడియోథెరపీ, కీమో, హార్మోన్ థెరపీ వంటివి ఇచ్చినా లేదా థెరపీ తర్వాత సర్జరీ చేసినా చికిత్స అంతటితో ముగిసిందని అనుకోడానికి లేదు. క్రమం తప్పకుండా చెకప్స్‌కు వెళ్లడం, పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. మొదటి ఐదేళ్లలో వ్యాధి తిరగబెట్టకపోతే అది మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. అయితే కొంతమందిలో పది, ఇరవై ఏళ్ల తర్వాత వ్యాధి వచ్చిన భాగంలో కాకుండా మరో అవయవంలో వచ్చిన సందర్భాలున్నాయి. కాబట్టి క్యాన్సర్ అదుపులో ఉంది అంటారుగానీ పూర్తిగా నయమైంది అని చెప్పలేరు. ఒక రొమ్ములో క్యాన్సర్ వచ్చిన వారిలో మరో రొమ్ములోనూ వచ్చే అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా కొన్ని రకాల క్యాన్సర్లు శరీరంలోని ఒక అవయవం నుంచి ఇంకో అవయవానికి విస్తరించి, మిగతా భాగాలకు వ్యాపించి, ఇతర అవయవాలకూ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని నిర్ధారణ చేసే పరీక్షలను చికిత్స ముగిశాక కూడా చేయించుకుంటూ ఉండాలి. -
యోగా డే జరుపుకోవడానికి అనేక కారణాలు..
-
జాన్ 21నే యోగా డే ఎందుకు?
నేడు (జాన్ 21) ప్రపంచవ్యాప్తంగా యోగా డేను జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి ఒకరోజు ముందే సెలబ్రేట్ చేసుకుంది. ఏడాది యోగా డేకి ఐక్యరాజ్యసమితి ఇతివృత్తం క్లైమెట్ యాక్షన్. దీన్ని మనం ఫాలో అవుతూనే, వేరుగా ‘యోగా ఫర్ హార్ట్’ అనే ఇంకో థీమ్‌తో యోగా డేని జరుపుకోవాలని కేంద్రం ప్రకటించింది. జూన్ 21నే యోగా డే జరుపుకోవడానికి అనేక కారణాలున్నాయి. జూన్ 21 ఉత్తరార్థ గోళంలో అత్యంత సుదీర్ఘమైన రోజు. ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి మారే రోజు జూన్ 21. ఈ రోజు ప్రకృతిలో ఉండే శక్తులు ఉత్తేజితమవుతాయి. ఇలాంటి సమయంలో యోగను ప్రారంభిస్తే అది సుదీర్ఘ సాధనకు ఉపకరిస్తుందని యోగ గురువులు అంటుంటారు. అందుకే ఈ రోజునే అంతర్జాతీయ యోగా డేగా జరుపుకోవడానికి భారత్ ప్రతిపాదించింది. మొదటి అంతర్జాతీయ దినోత్సవం రాజ్‌పథ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో మోదీతో సహా 36 వేల మంది యోగాసనాలు వేసి గిన్నిస్ రికార్డ్ సృష్టించారు. 84 దేశాలు ఒక కార్యక్రమంలో పాల్గొనడం మరో రికార్డు. యోగా డేకు సంబంధించిన ఆసక్తికర వివరాల కోసం ఈ కింది వీడియో చూడండి. -
సత్సంకల్పంతోనే సాఫల్యం
కాలాన్ని సాక్షిగా పెట్టి అనేక యదార్ధాలు చెప్పాడు దైవం. ఒక్కసారి మనం వెనక్కితిరిగి చూస్తే కాలం చెప్పిన అనేక వాస్తవాలు కళ్ళకు కనిపిస్తాయి. కాలం విలువను గుర్తించినవారు మాత్రమే వాటినుండి గుణపాఠం నేర్చుకుంటారు. అలా కాకుండా గతకాలాన్ని గాలికొదిలేసి, కొత్తసంవత్సరంలో చైతన్యరహిత చర్యలతో, అర్ధం పర్థం లేని కార్యకలాపాలతో కొత్తకాలాన్ని ప్రారంభిస్తే ప్రయోజనం శూన్యం. కాలం ఎవరికోసమూ ఆగదు. రాజులు రారాజులు, మాన్యులు, సామాన్యులు, పండితులు, పామరులు అంతా కాలగర్భంలో కలిసిపోయినవారే, కలిసి పోవలసినవారే. కొత్తసంవత్సరానికి స్వాగతం పలికేటప్పుడు ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. గతం నుండి గుణపాఠం గ్రహిస్తూ భవిష్యత్తు కాలానికి స్వాగతం పలకాలి. నిస్సందేహంగా కొత్తసంవత్సరాన్ని సంతోషంగా స్వాగతించాల్సిందే. కాని ఆ సంతోషంలో హద్దుల అతిక్రమణ జరగకుండా చూసుకోవాలి. నిషిద్ధకార్యాలతో నూతన సంవత్సరాన్ని ఆహ్వానించే చర్యలకు దూరంగా ఉండాలి.కాలం చెప్పే చారిత్రక వాస్తవాలనుండి గుణపాఠం గ్రహించకుండా లక్ష్యరహితంగా భవిష్యత్తును ప్రారంభిస్తే మిగిలేది నిరాశే. అందుకని గడచిన కాలంలో ఏం చేశామన్నది కొత్తసంవత్సర ప్రారంభాన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మంచిపనులు చేసి ఉంటే భవిష్యత్ కాలంలో వాటిని మరింతగా విస్తరిస్తామని, తప్పులు, పొరపాట్లు, పాపాలు జరిగి ఉంటే ఖచ్చితంగా వాటిని ఈ క్షణం నుండే విసర్జిస్తామని సంకల్పం చెప్పుకోవాలి.ఈ విధంగా అందరూ కాలం విలువను గుర్తించి, విశ్వాస బలిమితో సత్యంపై స్థిరంగా ఉంటూ, మంచి పనులు చేస్తూ, ప్రజలకు మంచిని, సత్యాన్ని, సహనాన్నిగురించి బోధిస్తూ, స్వయంగా ఆచరిస్తూ సాఫల్యం పొందడానికి ప్రయత్నించాలి. దైవం మనందరికీ గడచినకాలం నుండి గుణపాఠం గ్రహిస్తూ, భవిష్యకాలాన్ని దివ్యంగా మలచుకునే సద్బుద్ధిని ప్రసాదించాలని,సమస్తమానవాళికీ సన్మార్గభాగ్యం ప్రాప్తంకావాలని మనసారా కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఆశారాం బాపు కేసు..పది నిజాలు
జోధ్‌పూర్ : మైనర్ బాలిక రేప్ కేసులో తనను తాను దైవదూతగా, ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకునే ఆశారాం బాపు అరెస్ట్ అయిన ఐదు సంవత్సరాల తర్వాత కోర్టు ఆయనకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించిన తీర్పు ఈ రోజు జోధ్‌పూర్ జైలులో న్యాయమూర్తి వెలువరించారు. తీర్పు సందర్భంగా రాజస్తాన్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్లో ఆయన అనుచరులు ఎలాంటి గొడవ చేయకుండా ముందస్తుగా భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన పది నిజాలు 1. ప్రపంచ వ్యాప్తంగా ఆశారాం బాపుకు సుమారు నాలుగు వందల ఆశ్రమాలు ఉన్నాయి. ఆశారాం బాపు కుమారుడు నారాయణ్ సాయి కూడా మరో రేప్ కేసులో నిందితుడే. గుజరాత్‌లోని సూరత్‌లో 2002-04 సమయంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరిపిన కేసులో నారాయణ్ సాయి నిందితుడు. 2.ఇటీవలే సుప్రీం కోర్టు ఈ కేసుకు సంబంధించి సూరత్ ట్రయల్ కోర్టుకు ఐదు వారాల్లో కేసు తేల్చాయాలని డెడ్‌లైన్ విధించింది. 3. రేప్ కేసులో ఆశారాంకు జీవిత ఖైదుతో పాటు రూ. లక్ష జరిమానా కోర్టు విధించింది. 4. రేప్ కేసుకు సంబంధించి ఆశారాం బాపును మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం జోధ్‌పూర్‌కు తరలించారు. బెయిల్ కోసం 12 సార్లు అప్పీల్ చేసుకున్నా ప్రతీసారి బెయిల్ తిరస్కరణకు గురైంది. 5. ‘ మాకు న్యాయం దక్కింది. ఈ పోరాటంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. సరైన శిక్ష ఆశారం బాపుకు పడింది. విచారణ సమయంలో హత్యకు గురైన సాక్షులకు కూడా న్యాయం దక్కుతుందని ఆశిస్తున్నాను’ అని రేప్‌కు గురైన బాలిక తండ్రి చెప్పారు. 6. కేసు విచారణలో ఉండగా 9 మంది సాక్షులు దాడులకు గురయ్యారు. వీరిలో ముగ్గురు హత్య కాబడ్డారు. 7. ఆశారాం బాపుపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్-375తో పాటు పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. 8.బాలిక ఒంట్లోకి దెయ్యాలు ప్రవేశించాయని, ఆమె నుంచి దెయ్యాలను ఆశారం బాపు తరిమేస్తాడని ఆశారం సహాయకులు చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు బాలికను ఆశ్రమానికి తీసుకువచ్చారు. అత్యాచారం జరిపాక ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది. 9. ఆశారాం సహాయకుల్లో ఇద్దరికి శిక్ష పడింది. మరో ఇద్దరు నిర్దోషులుగా విడుదలయ్యారు. 10. ఈ తీర్పు వెలువడగానే ఆశారాం ప్రతినిథి నీలం దూబే మాట్లాడుతూ..న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం, గౌరవం ఉందని, తీర్పుపై మా లాయర్లతో చర్చించి పైకోర్టులో అప్పీలు చేస్తామని తెలిపారు. -
ఫీల్డ్ మార్షల్ మానెక్ షా జయంతి: 10 ఆసక్తికర అంశాలు
సాక్షి: భారత ఆర్మీ మొదటి ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్ షా జయంతి ఈరోజు(ఏప్రిల్ 3). భారత ఆర్మీ కమాండర్లలోని గొప్పవారిలో ఆయనకు ప్రథమ స్థానం దక్కుతుంది. ఈ రోజు ఆయన 104వ జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తి కరమైన అంశాలు.. 1. శామ్ మానెక్ షా పూర్తి పేరు శామ్ హర్మోస్‌జీ ప్రేమ్‌జీ జంషెడ్జీ మానెక్ షా. జననం ఏప్రిల్ 3, 1914. మరణం జూన్ 27, 2008. మానెక్ షా తల్లిదండ్రులు పార్శీ మతానికి చెందినవారు. ఆయన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించారు. 2. భారత ఆర్మీలో చేరతానని మానెక్ షా మొదట తండ్రికి చెప్పడంతో ఆయన నిరాకరించారు. దాంతో లండన్ వెళ్లి గైనకాలజిస్ట్ అవుదామని మానెక్ షా అనుకున్నారు. కానీ అదీ నెరవేరలేదు. చివరికి మళ్లీ ఇండియన్ మిలటరీ అకాడమీ ఎంట్రన్స్ పరీక్ష రాసి ఉత్తీర్ణుడవ్వడంతో ఆర్మీలో చేరారు. 3. మానెక్ షా 40 ఏళ్లు ఆర్మీలో సేవలందించారు. రెండో ప్రపంచ యుద్ధం, ఇండియా-పాకిస్థాన్ యుద్ధం(1947), చైనా-ఇండియా యుద్ధం(1962), ఇండియా-పాకిస్తాన్ యుద్ధం(1966), బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం(1971)ఈ ఐదు యుద్ధాల్లో పాల్గొన్న ఏకైక ఫీల్డ్ మార్షల్. 4. ఇండియా-పాకిస్తాన్ 1971 యుద్ధానికి ముందు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా అని మానెక్ షాను అడిగింది. అప్పుడు ఆయన ‘ ఐ యామ్ ఆల్వేస్ రెడీ స్వీటీ’ అని అన్నారు. ఇందిరా గాంధీ భర్త ఫిరోజ్ గాంధీ పార్శీ మతస్తుడన్న సాన్నిహిత్యంతో ఆమెను స్వీటీ అని మానెక్ షా సంబోంధించేవారు. 5. మానెక్ షా పలుమార్లు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బర్మాలో యువ కెప్టెన్‌గా జపాన్‌తో యుద్ధం చేయడానికి వెళ్లినపుడు తీవ్రంగా గాయపడ్డాడు. 9 బుల్లెట్లు అతని శరీరంలోకి దూసుకెళ్లాయి. సిపాయి శేర్ సింగ్ ఆయనను కాపాడటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. 6. ఒక మనిషి తాను భయపడటం లేదు అని చెబితే అతడు అబద్ధం చెబుతున్నాడు అని అయ్యిండాలి లేదా అతను గోర్ఖా అయినా కావాలి అని గొప్ప కొటేషన్ ఇచ్చాడు. 7. భారత దేశం విభజన జరిగిన సమయంలో మీరు పాకిస్తాన్ వెళ్లిపోయి ఉంటే ఏం జరిగి ఉండేది ఓ వ్యక్తి అడిగినపుడు ఆయన సమాధానం ఏంటంటే...అన్ని యుద్ధాల్లో భారత్‌కు బదులు పాకిస్తాన్ గెలిచి ఉండేదని సరదాగా అన్నాడు. 8. ఆర్మీలో నుంచి రిటైర్ అవుదామన్న సమయంలో ఇష్టం లేకపోయినా 1972లో అప్పటి రాష్ట్రపతి ఆయన పదవీకాలాన్నీ 6 నెలలు పొడిగించడంతో మరో ఆరు నెలలు సేవలు అందించారు. 9. ఆయన అందించిన సేవలకు గానూ 1942 మిలిటరీ క్రాస్ అవార్డు, 1968లో పద్మ భూషణ్ అవార్డు, 1972లో పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. 10. న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్లోని మిలిటరీ ఆసుపత్రిలో న్యూమోనియాతో 2008, జూన్ 27న మానెక్ షా కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలకు ఏ ఒక్క రాజకీయ నాయకుడూ హాజరుకాలేదు. కనీసం ఆయన చనిపోయిన రోజును జాతీయ సంతాప దినంగా కూడా ప్రకటించలేదు. -
చాలా నిజాలు బయటపెడతాం
సాక్షి, అమరావతి: అమిత్ షా లేఖ ద్వారా చెప్పిన విషయాలు మొదటి విడత మాత్రమేన ని, ఇంకా చాలా నిజాలను ప్రజల ముందు పెడతామని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసింద న్న వాదన ఒకవేళ నిజమైతే అందుకు సీఎం చంద్రబాబుతోపాటు టీడీపీ ప్రభుత్వ అసమర్థతే కారణమని స్పష్టం చేశారు. ఇచ్చిన నిధులను ఖర్చు పెట్టే సత్తా లేకపోవడం అసమర్థతేనని పేర్కొన్నారు. ఆయన మంగళ వారం విజయవాడలోని విలేకరులతో మాట్లాడారు. ‘‘నాలుగేళ్లు కేం ద్రంలో ఉన్న టీడీపీ మంత్రులు రాష్ట్రాన్ని ఎం దుకు అభివృద్ది చేసుకోలేకపోయారు? అంటే వాళ్లు రాష్ట్ర ప్రయోజనాల గురించి కేంద్రంతో మాట్లాడలేదా?’’ అని ప్రశ్నించారు. ప్రతిపక్షం లేని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు గంటల తరబడి అసత్యాలు చెప్తున్నారని ఆరోపించారు. -
శ్రీదేవి గురించి మనకు తెలియని నిజాలు!
ముంబై: ప్రఖ్యాత నటీమణి శ్రీదేవి హఠాన్మరణం యావత్ సినిమా ప్రపంచాన్నే కాదు ప్రేక్షకలోకాన్ని నివ్వెరపరిచింది. అసమాన నటనతో వెండితెరపై చెరగని ముద్ర వేసిన ఆమె అకాల మరణం అందరినీ కదిలించింది. అయితే నటనే కాదు ఇంకా పలు అంశాల్లో ఆమెకు ప్రవేశం ఉందని ప్రముఖ సినీ విమర్శకుడు, చిత్ర పరిశ్రమ నిపుణుడు సుభాష్ కే ఝా వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఫ్యాబులస్ కుక్ శ్రీదేవి వంట బాగా చేస్తుంది. బోనికపూర్‌తో పెళ్లైన తర్వాత ఆయన కోసం వంట నేర్చుకుంది. ఏ పని చేసినా అంకితభావం ప్రదర్శించే శ్రీదేవి కుకింగ్‌ను కూడా అంతే శ్రద్ధగా అలవరచుకుంది. తాను చేసిన వంటలను కుటుంబ సభ్యులతో పాటు, స్నేహితులకు వడ్డించి మురిసిపోయేది. కుంచె పట్టేది శ్రీదేవి మంచి చిత్రకారిణి అన్న విషయం చాలామందికి తెలియదు. షూటింగ్ లేని సమయంలో ఆమె పెయింటింగ్ వేసింది. శ్రీదేవి వేసిన ఓ పెయింటింగ్‌ను లండన్‌లోని క్రిస్టీ సంస్థ వేలం వేసింది. ఈ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వెచ్చించారు. జాన్వీ ఫ్యాషన్ టిప్స్ తనిద్దరి కుమార్తెలను ఎంతో ప్రేమించిన శ్రీదేవి వారితో స్నేహితురాలిగా మెలిగేది. పెద్ద కూతురు జాన్వీ నుంచి ఫ్యాషన్ టిప్స్ తెలుసుకునేది. దుబాయ్‌లో శ్రీదేవి చనిపోయినప్పడు జాన్వీ ఆమె ప్రక్కన లేకపోవడం విషాదకరం. ముందే చూస్తా తన పెద్ద కుమార్తె జాన్వీని వెండితెరపై చూసుకోవాలని శ్రీదేవి ఎంతో ఆరాటపడ్డారు. జాన్వీ హీరోయిన్గా పరిచయం అవుతున్న ‘ధడక్’ సినిమాపై అమితాసక్తి కనబరిచారు. తన కూతురి సినిమాను ముందుగా వీక్షించే వారిలో తాను కూడా ఉండాలని నిర్మాత కరణ్ జోహార్‌తో గట్టిగా చెప్పారు. లక్కీ ఛాన్స్ చాందిని సినిమా హిందీలో శ్రీదేవికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చింది. ఈ సినిమాను శ్రీదేవితో తీయాలని యశ్‌చోప్రా ముందు అనుకోలేదు. కొద్ది సంవత్సరాలకు ముందు రేఖతో ఈ సినిమాను తెరకెక్కించాలని ఆయన అనుకున్నారు. చివరకు శ్రీదేవికి అవకాశం దక్కడంతో బాలీవుడ్లో ఆమె అగ్రకథానాయికగా అవతరించారు. అప్పుడు కుదరలేదు సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్‌తో శ్రీదేవికి మాటల్లో చెప్పలేని అవినాభావ సంబంధం ఉంది. శ్రీదేవి మరణానికి కొద్ది గంటల ముందు ఎందుకో తెలియని అలజడిగా ఉందంటూ అమితాబ్ ట్వీట్ చేయడం గమనార్హం. ‘వీర్ జారా’ సినిమా అమితాబ్, శ్రీదేవి కాంబినేషన్లో తెరకెక్కించాలని యాశ్‌చోప్రా భావించారు. పిల్లల కోసం శ్రీదేవి ఈ అవకాశాన్ని వదులుకున్నారు. -
ఐఏఎఫ్: నమ్మలేని నిజాలు
ప్రపంచంలోని అత్యుత్తమ వాయుసేన దళాల్లో భారతీయ వాయుసేన ఒకటి. అత్యంత శక్తివంతమైన, నాణ్యమైన, నిపుణులైన పైలెట్లతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిండివుంది. భారతీయ వాయు సేన ఏర్పడి 85 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భారతీయ వాయుసేన గురించి ఆసక్తిర విషయాలు తెలుసుకుందాం. 1933లో భారతీయ వాయుసేన ఏర్పడే నాటికి అందులో కేవలం ఆరు మంది మాత్రమే సుశిక్షుతలైన సిబ్బంది. మరో 19 మంది ఎయిర్మెన్లుతో వాయుసేన ఏర్పడింది. మొదట ఐఏఎఫ్ వినియోగించిన ఎయిర్ క్రాఫ్ట్.. వెస్ట్‌ల్యాండ్ వాప్టి ఐఐఏ. ఇవి మొత్తం 4 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. అదే ఏడాది ఏప్రిల్ 1న ఐఏఎఫ్ మొదటి స్క్వాడ్రాన్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. రెండో ప్రపంచ యుద్ధం మొదలైన వెంటనే ఐఏఎఫ్‌ను మరింత బలోపేతం చేశారు. 16 మంది ఉన్నతాధికారులు, 662 మంది సిబ్బంది కీలక అధికారులతో కలిపి మొత్తం 28,500కు బలం చేరింది. 1945లో ఐఏఎఫ్‌కు రాయల్ అన్న పేరు వచ్చి చేరింది. 1950 నుంచి ఇప్పటివరకూ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నాలుగు యుద్ధాల్లో కీలక సేవలు అందించింది. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 3,4,7,8, 10 స్క్వాడ్రాన్ టీములు ఉన్నాయి. 1946లో ఎయిర్‌ఫోర్స్ ట్రాన్స్పోర్ట్ యూనిట్‌ను మొదలు పెట్టింది. ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ మేఘధూత్, ఆపరేషన్ కాక్టస్, ఆనపరేషన్ పూమాలైలను ఐఎఎఫ్ విజయవంతంగా పూర్తి చేసింది. భారతీయ వాయు సేన ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో పలు దేశాల్లో విజయవంతమైన ఆపరేషన్లు నిర్వహించింది. ప్రధానంగా కాంగో ఉద్యమాన్ని అణచడంలో ఐఏఎఫ్ పాత్ర అత్యంత కీలకమైంది. -
టెన్త్ పేపర్ లీకేజీ కేసులో నమ్మలేని నిజాలు
-
నిప్పులాంటి నిజం
-
చిన్నచిన్న నిజాలైనా చెప్పరా?
అక్షర తూణీరం ప్రజకు నిజాలు ఎలా తెలుస్తాయ్? ఎవరు చెబుతారన్నది పెద్ద ప్రశ్న. స్వచ్ఛ భారత్‌లో స్వచ్ఛత ఏ మేరకు వచ్చిందో కచ్చితంగా చెప్పేదెవరు? తెలుగు రాష్ట్రాలలో రైతుల రుణమాఫీ జరిగిందా, జరుగు తోందా, జరగనుందా? జరిగితే ఏ మేరకు? అనే సత్యాన్ని అంకెలతో చెప్పే హరిశ్చంద్రుడెవరు? ప్రజలకు అందుతున్న రకరకాల పింఛన్లు ముట్టచెబుతున్నది కేంద్రమా? లేక చంద్రన్నలా? స్పష్టంగా విశదపరిచేదెవరు? శరన్నవరాత్రి ఉత్సవాలలో వరంగల్ భద్రకాళి అమ్మవారికి కేసీఆర్ మొక్కులు, ముడుపులు చెల్లించారు. ఆయన మోయలేనంత బరువు బంగారు నగలు. ‘‘మొక్కిన మొక్కులు చల్లంగుండి తెలంగాణ నా చేతికి వస్తే- బంగారు తొడుగేయించెదనమ్మా అని ఆనాడాయన మొక్కారు. ఈనాడు తీర్చారు.’’ ఒక పెద్దావిడ ఆ నగల సమర్పణ దృశ్యం చూసి ఆనందబాష్పాలు రాల్చి, ఇవన్నీ ఎవరి పైసలతో చెల్లిస్తున్నాడని అడిగింది. ‘‘ఎవరివైతేనేమి అవ్వా’’ అంటిని. అది సరేలే, మా దొరకి మీ, మా వెత్తాసం లేదు గాని, పున్యంలో నాకు వాటా వస్తదో లేదో తేలాలి గదా అన్నది. అది పబ్లిక్ మనీతో చేయించారా, సొంత సొమ్ముతో కావించారా అనేది అవ్వ ధర్మసందేహం. అది సొంత మొక్కు కాబట్టి, జేబు డబ్బుల్లోంచే కైంకర్యం చేసి ఉంటారని కొందరం టున్నారు. ‘‘అసలీ చిన్న వ్యవహారానికి ఇంతగా జనం తర్జనభర్జన పడాలా, తేల్చి చెప్పవచ్చు గదా’’ అనేది అవ్వల నిశ్చితాభిప్రాయం. ‘‘ఇదిగో, తల్లీ! భద్రకాళీ ప్రజల అభీష్టం మేరకు నేకోరిన వరం ఇచ్చినందుకు ప్రజాధనంతో నీకు సొమ్ములు సమర్పిస్తున్నా’’ అని స్పష్టంగా చెప్పచ్చునేమో అని మరికొందరు నోళ్లు నొక్కు కుంటున్నారు. ఈమధ్య మనదేశంలో ప్రతిదీ సస్పెన్స్‌గానే ఉంటోంది. ఎందుకో తెలియదు. జయలలిత ఒంట్లో బాగాలేదన్నది మాత్రమే మనకి తెలుసు. ఎంత బాగాలేదో, ఎట్లా బాగాలేదో ఎవ్వరూ చెప్పరు. ఎందరో వస్తారు. ఆసుపత్రికి వెళ్లొస్తుంటారు. పరామర్శించా మంటారు. వైద్య నిపుణులను కలసి ట్రీట్మెంట్ వివరాలు చర్చించామంటారు. దాదాపు నాలుగు వారా లుగా ఇదే దృశ్యం నడుస్తోంది. కాకపోతే పాత్రలు మారుతున్నాయి. వైద్య నిపుణుల నుంచి కూడా అంద రికీ అర్థమయ్యే రీతిలో బులెటిన్ రానేలేదు, చిదంబర రహస్యంలా. వీఐపీలంతా వస్తున్నారు, తిలకించి వెళు తున్నారు. కొన్ని గోప్యంగా ఉంచడం మంచిదేగానీ వాటికి హద్దులుండాలి. సమాచార వ్యవస్థలు, వందలాది శాటిలైట్లు చిన్న గోడ వెనుక సత్యాన్ని చెప్ప లేకపోతున్నాయి. ప్రజా క్షేమం దృష్ట్యా, దేశ ఆరోగ్యం దృష్ట్యా కొన్ని సార్లు పారదర్శక సూత్రా లను పక్కన పెట్టాల్సిందే. ఇట్లాంటప్పుడు అన్ని వ్యవస్థలు ఎట్లా ఉన్నా సమాచార వ్యవస్థ సక్రమంగా పనిచెయ్యాలి. కొన్ని నిజాలను ప్రజకు చెప్పి, ఫోర్త్ ఎస్టేట్‌లో నిజాయితీ ఉందని నిరూపించుకోవాలి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
పుకార్లతో ‘వాస్తవాల’ తయారీ
జాతిహితం రంగీలా నుంచి రాజీవ్ వరకూ, మన్మోహన్ నుంచి నేటి మోదీ వరకు ఢిల్లీ దర్బారు సంస్కృతి భారత అధికారిక నిర్మాణాలలో వ్యవస్థాపరమైన కొనసాగింపును కాపాడింది. నన్నడిగితే ఏ ప్రభుత్వమైనా ఆరు నెలలు అధికారంలో ఉండేసరికి ‘‘ఒక’’ ప్రభుత్వంగా మారిపోతుంది. గుసగుసలపై ఆధారపడి నడిచే రాజధాని నగరాల శక్తి అలాంటిది. కాకపోతే ఆ గుసగుసలాడేవారు మారుతుంటారంతే. పుకార్లే సమాచారమైన చోట, కథలను మోసుకొచ్చే వారే చివరికి నిజమైన అధికారాన్ని నెరపుతారు, చరిత్రను సృష్టిస్తారు. మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా రంగీలా కాలంలో ఢిల్లీ దర్బారులోని అత్యంత విలువైన నెమలి సింహాసనాన్ని, కోహినూర్ వజ్రాన్ని పర్షియాకు చెందిన దండయాత్రికుడు నాదిర్ షా కొల్లగొట్టుకుపోయాడు. మహమ్మద్ షా (1710-48) గురించి ఆలోచనాపరులైన చరిత్రకారులెవరైనాగానీ ఆయన కళలను, సంగీతాన్ని, పండితులను పోషించేవాడని చెబుతారు. నిత్యోల్లాస పురుషుడినంటూ తనకు తానే ‘సదా రంగీలా’ (ఎప్పటికీ ఉల్లాసంగా/సకల వర్ణశోభితంగా) అనే బిరుదును ధరించాడు. కానీ ఆయన ప్రతిష్ట మాత్రం సుఖలోలుడైన భ్రష్ట సోమరి చక్రవర్తిగానే పాత ఢిల్లీ గోడలపై చెక్కి కని పిస్తుంది. నాదిర్ షా ఢిల్లీ దిశగా దండెత్తి వస్తుండగా... ఆయన రాజధాని లోని హిజ్రాలనందరినీ పోగుచేసి నాదిర్‌తో పోరాటానికి పంపాడని మౌఖిక గాథలు చెబుతాయి. అది నిజమేనా? అని ఆ కాలానికి చెందిన చరిత్రకారుడు విలియం డార్లింపుల్ను సంప్రదించాను. ఈ కథనానికి ఎలాంటి చారిత్రక ఆధారమూ లేదని ఆయన తెలిపారు. పైగా ‘‘రంగీలా గురించి చెప్పేదాని కంటే కూడా అతడు రాజకీయంగా చాలా ఎక్కువగా విజయవంతమ య్యాడు’’ అని ఆయన అన్నారు. మహమ్మద్ షా వాస్తవానికి శక్తివంతులైన కమాండర్ల నేతృత్వంలో బలమైన సైన్యాన్ని నిర్మించాడు. నాదిర్ షాకు వ్యతిరేకంగా కర్నాల్ వద్ద ఆ సైన్యం యుద్ధం సాగించాయి. అయితే, చిత్తుగా ఓడిపోయాయి (దగ్గర్లోనే పానిపట్ పట్టణంలో ఉంది). కాకపోతే, తన తలతోపాటూ, తన ముఖ్య సేనా నాయకులందరి తలలను నరికి నాదిర్ షా పుర్రెల పర్వతాన్ని తయారు చేయనివ్వకుండా అతనికి లొంగిపోయాడు. చివరికి తన అమూల్య సంపదలన్నిటినీ కోల్పోయాడు. అలాంటి చెప్పు కోదగిన పాలకుడు ఆయన ఎన్నడూ యుద్ధానికి పంపని హిజ్రాల కారణం గానే గుర్తుండిపోయాడు. ఆ కథను పదేపదే చెప్పగా చెప్పగా చివరికి వాస్త వంగా మారిపోయింది. అస్తమించిన సామ్రాజ్యాల రాజధానులు పనిచేసే తీరు ఇదే. ఢిల్లీ అలాంటి వాటిలో అత్యంత పురాతనమైనది. ‘సంబంధాల’ కోసం వేట వాషింగ్టన్ ఎలా పని చేస్తుందో చెబుతూ ‘న్యూయార్క్ టైమ్స్’ సీనియర్ పాత్రికేయుడు మార్క్ లీబోవిచ్ 2013లో ‘‘దిస్ టౌన్’’ను వెలువరించాడు. అధికార కేంద్రమైన ఆ నగరమూ, అందులోని అనుసంధానాల వ్యవస్థలు ఎలా పనిచేస్తాయనేదాన్ని ఆయన మొరటుగానూ సరదాగానూ, వాస్తవిక దృష్టితోనూ వర్ణించాడు. అమెరికన్లు ‘‘ఇన్సైడ్ ద బెల్ట్‌వే’’ అన్నా, మనం ‘‘ల్యూటియన్లు’’ అన్నా, మొఘలాయిలు ఢిల్లీ అన్నా ఒకటే... తెరవెనుక అధికార కేంద్రాల వ్యవహారాలే. కెన్నడీ సెంటర్లో అత్యంత శక్తివంతుడైన ఒక వ్యక్తి అంత్యక్రియల గురించి చెప్పిన లీబోవిచ్ పుస్తకంలోని ఈ భాగం గుర్తుండిపోతుంది. ‘‘వాషింగ్టన్లో జరుగుతున్న అతి ముఖ్యమైన ఈ సాగ నంపే తంతు సంబంధాలను నెలకొల్పుకోవడానికి గొప్ప అవకాశాన్ని కలుగ జేస్తుంది’’ అంటూ ఆ చనిపోయిన ప్రత్యర్థులు, మిత్రులూ అంతా అలాంటి సమయంలో సంబంధాలను విస్తరింపజేసుకోవడం కోసం విపరీతంగా ప్రయాసపడతారు, సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకునే వ్యాపారం జోరుగా సాగు తుంది. అధికారం, లాభాల బేరసారాలకు పనికొచ్చే కరెన్సీగా సమాచారాన్ని వాడతారు. ఆ తర్వాత ఆయన మీడియా-పరిశ్రమల సమ్మేళనం గురించి చెప్పుకొస్తాడు. వాషింగ్టన్ లేదా మరే ఇతర గొప్ప పురాతన నగరంలాగే ల్యూటియన్ ఢిల్లీలోనూ పుకార్లు, వదంతుల మీద ఆధారపడే దర్బారు సాగుతుంటుంది. కాకపోతే ఇక్కడ మీడియా-పరిశ్రమల సమ్మేళం మరింత ఆసక్తికరంగా ఉంటుందంటాను. నేను నీ వీపు గోకుతాను, నువ్వు నా వీపు గోకు... ఈలోగా ఇద్దరం ఒకరి గ్లాసు వైన్‌లో మరొకరం విషం కలుపుకుందాం అనే నీతిపై ఆధారపడే సాగుతుంది. కథలను మోసేవారే చక్రం తిప్పేది నా స్నేహితురాలు తవ్లీన్‌సింగ్ తన ‘‘దర్బార్’’ పుస్తకంలో సరిగ్గా ఇదే విష యాన్ని చెప్పడానికి ప్రయత్నించారు. ఆ పుస్తకానికి ఆమె ఆ పేరు పెట్టడంలో ఆశ్చర్యం లేదు. ఇక తవ్లీన్ తాజా పుస్తకం ‘‘ద బ్రోకెన్ ట్రిస్ట్’’లో ఆమె తన వాదనను మరిన్ని వర్తమాన ‘‘కథనాల’’తో కొనసాగించారు. అవన్నీ మళ్లీమళ్లీ చెప్పగా చెప్పగా, కొంత కాలానికి వాస్తవంగా మారిపోతాయి. రంగీలా నుంచి రాజీవ్ వరకూ, మన్మోహన్ నుంచి నేటి మోదీ వరకు ఢిల్లీ దర్బారు సంస్కృతి భారత అధికారిక నిర్మాణాలలో వ్యవస్థాపరమైన కొన సాగింపును కాపాడింది. నా దృష్టిలోనైతే ఏ ప్రభుత్వమైనాగానీ ఆరు నెలలు అధికారంలో ఉండేసరికి ‘‘ఒక’’ ప్రభుత్వంగా, ఏ పాలకుడైనా ‘‘ఒక’’ పాలకునిగా మారిపోతారు. గుసగుసలపై ఆధారపడి నడిచే రాజధాని నగరాల శక్తి అలాంటిది. కాకపోతే ఆ గుసగుసలాడేవారు మారుతుంటారంతే. అయితే, గుసగుసలు, వదంతులు, పుకార్లు బాగా అమ్ముడుకాగల సరుకు. పాశ్చాత్య తరహా రోజువారీ దుస్తుల్లో వచ్చిన ప్రకాశ్ జవ్దేకర్ను మరింత సాధారణమైన దుస్తులు ధరించి రమ్మని ఎయిర్‌పోర్టుకు తిప్పి పంపేశారన్న గుసగుస గుర్తుకొచ్చిందా? లేదా, అయితే రాజ్‌నాథ్‌సింగ్ తన ‘‘కుమారునికి అవినీతి కార్యకలాపాలు కట్టిపెట్టేయమని చెప్పిన’’ విషయమైనా గుర్తుకొ చ్చిందా? మళ్లీమళ్లీ తిరిగి చెప్పగా అవి ‘‘వాస్తవాలు’’గా మారిపోలేదా? గుసగుసలకున్న మహత్తరమైన శక్తిని తెలుసుకోవాలంటే.. ఔరంగజేబు తర్వాతి కాలపు విజయవంతమైన మొఘల్ చక్రవర్తులంతా తాగుబోతులు, అవినీతిపరులైన మూర్ఖులుగా మారిపోయిన వైనాన్ని చూడండి. పుకార్లే సమాచారమైన చోట, కథలను మోసుకొచ్చే వారే చివరికి నిజమైన అధికా రాన్ని నెరపుతారు, చరిత్రను సృష్టిస్తారు. ‘‘అందుబాటు’’ అనే తన మౌలిక సాధనాన్నే అనుమానాస్పదంగా చూసే ఈ వాతావరణంలో ఒక రాజకీయ పాత్రికేయురాలు ఎలా పని చేయాలి? ఒక పద్ధతి మీరు మీ కలుగులోకి తిరోగమించి, అక్కడ జమకూడి ఉండే మీకు ఆమోదయోగ్యులు, మీ మిత్రులు, కుటుంబ సభ్యులు, మీ కుక్కలు, పిల్లులతో కలసి ఈ ప్రపంచం తీరును తిట్టిపోయడం. లేదా బయటకు వెళ్లి ఎదుర్కోవడం. మీరు పరిహసించే ఈ ప్రపంచంలో మీరు కూడా భాగం కాదా? అని తనను పదే పదే అడుగుతుంటారని లీబోవిచ్ అన్నారు. ఈ విషయంలో ఆయన తన తప్పును అంగీకరించారు. అయితే ఆయన దాన్ని ‘‘ఈ నీటిని ఎవరు కనిపెట్టారు? నాకు తెలియదు, అయినా అప్పుడు నేను చేపను కాను’’ అని, అటు పిమ్మట ‘‘నేనూ’’ ఒక చేపనే అని అంగీకరిస్తాడు. నేను దీన్ని కబడ్డీగా పోలుస్తాను. ఢిల్లీ లేదా వాషింగ్టన్ డీసీ దర్బారు లోపలా, దాని చుట్టూ సాగే రాజకీయ జర్నలిజంలో మీరు కబడ్డీ ఆటలో లాగా అవతలి పక్షం కోర్టులోకి వెళ్లి, వారిని వేధించి, ఎవరో ఒకర్ని అంటుకుని, పాయింట్లు సంపాదించి పట్టుబడకుండా తిరిగిరావాలి. ఇదంతా మీరు ఊపిరి బిగబట్టే చేయాల్సి ఉంటుంది. అది తేలికేమీ కాదు, అలా అని అసాధ్యమూ కాదు, సరదా అయినది కూడా. ఇప్పటి కొత్త పరిస్థితిలో లీబోవిచ్ చేప కావడం అనైతికం అవుతుంది. మీరు అత్యంత వివేకవంతమైన మీ ఎలుక కలుగులోకి దూరి దాక్కోవడమే చేస్తారు. విభజన రేఖను దాటి, చెడ్డ వ్యక్తిని తాకి, చెక్కుచెదరకుండా తిరిగి రావాలని విశ్వసించడం ఇప్పుడు ఫ్యాషనేమీ కాదు. రెండేళ్ల క్రితం, యువ పాత్రికేయుడు... మీరు రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు కదా, మీకు సహాయం చేస్తున్నవారు ఎవరు? అని అడిగాడు. చురుగ్గా, విజయవంతంగా పనిచేస్తున్న ఒక పాత్రికేయుడు రాజ్యసభకు ఎందుకు వెళ్లాలి? అందుకేమీ ఇంతకంటే ఎక్కువ వేతనమూ రాదు, అతని అభిప్రాయాలను వెలిబుచ్చ డానికి ఇంతకంటే విశాలమైన వేదికనూ అది కల్పించదనేది నా వాదన. ఒక ప్రపంచ సుప్రసిద్ధ కళాశాల డిగ్రీని అందుకున్న రిపోర్టర్ సైతం ఒక పాత్రికే యుని జీవితంలోకెల్లా మకుటాయమానమైనది. రాజ్యసభకు నామినేషన్ పొందడమేనని భావించడం నాకు చికాకు కలిగించింది. చేయని యుద్ధానికి శౌర్య పతకం ఈ వారం మొద ట్లో తవ్లీన్ ‘‘ట్రిస్ట్’’ ఆవిష్కరణకు వెళ్లినప్పుడు.. ఒకరు నన్ను పట్టుకుని ‘‘అంటే మీరు తవ్లీన్ కాలమ్‌ను ఆపాలని సోనియా మీ మీద ఒత్తిడి తెచ్చారన్న మాట (అప్పట్లో నేను ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు సంపాద కుణ్ణి).. సుబన్ దుబే కూడా మిమ్మల్ని బెదిరించాడే... అయితే మీరేమీ లొంగలేదు, చివరకు రాజీనామా చేసేశారనుకోండి... వగైరా, వగైరా.’’ ఇదంతా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? నేను ఇంటికి వెళ్లి తవ్లీన్ పుస్తకంలోని ఇండెక్స్‌ను చూస్తే తొమ్మిది పేజీలలో నా పేరు ఉంది. అయితే ఆ సందర్భాలన్నీ, చాలా వరకు మన్ననా పూర్వకమైనవే. వాటిలో సోనియా, మా మాజీ సంపాదకుడు సుమన్ దుబేలు నాపై ఆమె కాలమ్‌ను ఆపేయాలని ఒత్తిడి తేవడం, నేను వాటిని తిప్పికొట్టడం కూడా ఉంది. కాకపోతే లేనిది ఒక్కటే... అసలు అలాంటిది ఏమీ జరగలేదనేదే. అయితే నేను తవ్లీన్తోనూ, ఇతరులతోనూ కూడా ఒక విషయం చెప్పాను. సోనియా నివాసానికి క్రమం తప్పకుండా వెళ్లి వచ్చేవారంతా ఆమె కాలమ్ కాల్పినికమైనదిగా, పునరావృతంగా, ఉంటుం దని వ్యాఖ్యానించేవారు. ఆమె రెచ్చగొట్టే విధంగా రాస్తారు, ప్రభుత్వ వ్యతి రేక(గాంధీ కుటుంబానికి)మైన, విశ్వసనీయమైన పాఠకులు ఆమెకు పెద్ద సంఖ్యలో ఉన్నారు. నా పట్ల సానుభూతిని చూపిన దుబాసీకి వీటిలో ఏదీ లేదు. అతను ‘‘మీది నిజమైన సాహసోపేత జర్నలిజం సార్’’ అన్నాడు. అసలెన్నడూ యుద్ధం చేయకుండానే మీకు శౌర్య పతకాన్ని ప్రదానం చేస్తుంటే ఎలా ఉంటుందో నాకూ అలాగే అనిపించింది. ఇంతకూ నేను తవ్లీన్కు థాంక్స్ చెప్పాలో, నో థాంక్స్ చెప్పాలో తేల్చుకోవాల్సి ఉంది. లేదా నేనెన్నడూ చేయని ఆ యుద్ధ చరిత్రను మొత్తంగా కనిపెట్టి తీరాలి. అది మహ్మద్ షా రంగీలా కాలంలో అయితే సులువుగా అయ్యేది. వ్యాసకర్త: శేఖర్ గుప్తా twitter@shekargupta -
పుష్కరంలోకి ఫేస్బుక్
ప్రపంచం మొత్తాన్ని ఒకే గొడుగుకిందికి తీసుకొచ్చిన ప్రముఖ సామాజిక అనుసంధాన వేదిక ఫేస్ బుక్. దీని గురించి చర్చించుకుంటుండగానే ఇప్పుడు పుష్కర కాలంలోకి అడుగుపెట్టింది. అవును ఫేస్ బుక్ కు ఇప్పుడు పన్నేండేళ్లు. 2004 ఫిబ్రవరి 4న మార్గ్ జుకర్ బర్గ్ దీనిని స్థాపించిన అనతి కాలంలోనే అనూహ్యంగా ప్రపంచాన్ని చుట్టేసింది. ప్రస్తుతం ఫేస్బుక్ వినిమోగదారుల సంఖ్య చైనా జనాభా కంటే ఎక్కువ. ఇక భారత్‌లో దీని వినియోగదారులు నేటికి 125 మిలియన్లు. ఇది 2016 చివరినాటికి 161 మిలియన్లకు చేరొచ్చని ఒక అంచనా. 2010లో ఫేస్బుక్ పై ‘‘ ఏ సోషల్ నెట్వర్క్’’ అనే హాలివుడ్ సినిమా విడుదలవగా దీనికి మూడు ఆస్కార్ అవార్డులు కూడా వచ్చాయి. ఇక, 2008లో ప్రపంచంలోనే ఎక్కువ మంది వాడే సోషల్ మీడియాగా ఫేస్బుక్ గుర్తింపు పొందింది. ఇందులో మొదట పెట్టుబడిపెట్టింది పేపాల్ కంపెని సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్. ఆయన పెట్టిన పెట్టుబడి మొత్తం 5 లక్షల డాలర్లు. ఇక ఐస్లాండ్ దేశమైతే ఏకంగా ఫేస్బుక్లో వచ్చిన సూచనలు, సలహాలతో తమ రాజ్యాంగంలో మార్పులు చేసుకొంది. ఇంకో ఆసక్తికరమైన అంశమేమిటంటే ఫేస్‌బుక్‌లోకి లాగిన్ కాకుండానే ఫెస్బుక్ యూఆర్‌ఎల్‌తోపాటు 4 అంకెను చేరిస్తే నేరుగా అది ఫేస్బుక్ సీఈవో జూకర్ బర్గ్ ప్రోఫైల్ ఓపెన్ చేసి చూపిస్తుంది. ఫేస్బుక్ నీలి రంగులో ఉండటానికి కారణం గురించి జూకర్ చెబుతూ తనకు ఎరుపు, ఆకు పచ్చ రంగులు సరిగా కనపడవని, నీలి రంగు మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుందని అందుకే దానిని ఎంచుకున్నట్లు గత ఇంటర్వ్యూలో చెప్పారు. వాట్సాప్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లను ఈ సంస్థే కొనుగోలుచేసింది. -
పుడమి తల్లి చల్లగా!
-
నేటి నిజాలకు గతంలోనే బీజాలు
మానవాళి ఎంత దూరం ప్రయాణించినా గతంతో మాటామంతీ జరుపుతూనే ఉంటుంది. వర్తమానం ఓ అడుగు ముందుకు వేయగలిగినా; సంక్షోభాలనూ, కల్లోలాలనూ ఎదుర్కొంటున్నా అందుకు సంబంధించిన చూపు, రూపు గతంలో తప్పక కనిపిస్తాయి. హైదరాబాద్ రాజ్యంలో కల్లోలాలకీ, రాయలసీమ పాలెగాళ్ల ప్రతాపాలకీ, అదే సమయంలో కోస్తాలో ఆనకట్టల నిర్మాణానికీ దోహద పడిన పరిస్థితులు ఏవి? హైదరాబాద్ సంస్థానం మిగిలిన ప్రపంచానికి దూరంగా ఉండిపోవడానికీ, ప్రజల భాషకు కూడా చోటులేని దుస్థితికీ హేతువులు ఏమిటి? అదే సమయంలో ఆధునిక విద్యలో కోస్తా ప్రాంతీయులు ముందడుగు వేయడానికి కారణం; సామాజిక సంక్షోభాలు ఉన్నా రాయలసీమలో కొంతమేర విద్యాగంధం విరియడానికి ఉన్న హేతువులు ఏమిటి? 18వ శతాబ్దపు చరిత్ర పరిణామాల అధ్యయనమే వీటికి సమాధానం ఇస్తుంది. నిజానికి దక్షిణ భారత చరిత్రను నిర్దేశించిన ఆ మూడు ప్రాంతాల చారిత్రక పరిణామాలు ఒకదానితో ఒకటి గాఢమైన అనుబంధం కలిగినవే. ఆ పరిణామాల విశ్లేషణే 'ఎర్లీ మోడరన్ ఆంధ్ర, హైదరాబాద్ అండ్ కంపెనీ రూల్- క్రీ.శ. 1724-1857' గ్రంథం. ఏపీ హిస్టరీ కాంగ్రెస్, తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందిస్తున్న తెలుగువారి చరిత్ర సంపుటాలలో ఆరవది ఈ పుస్తకం. మొగలుల పతనంతో భారత భూభాగంలో చిన్న రాజ్యాలు తలెత్తాయి. ఈ పరిణామానికి సమాంతరంగా జరిగినదే ఇంగ్లిష్ ఈస్టిండియా కంపెనీ విస్తరణ. నిజాం ఉత్థానపతనాలు ఈ ప్రయాణంలో చోటు చేసుకున్నవే. కలకత్తా నుంచి మద్రాసు వరకు కంపెనీ ఆధిపత్యం నెలకొల్పగలిగిందంటే ఆయా ప్రాంతాలను నిజాం కంపెనీకి ధారాదత్తం చేయడమే కారణం. నిజాం రాజ్యం, కంపెనీ-బ్రిటిష్ ఏలుబడిలోకి పోయిన ప్రాంతాలు వేర్వేరు రూపాలు సంతరించుకోవడమే అనేక చరిత్ర మలుపులకు కారణం. వర్తమానం మీద వాటి జాడ కూడా గాఢమైనదే. ఈ పరిణామ క్రమాన్ని ఈ గ్రంథంలోని మొదటి ఆరు అధ్యాయాలు ఆవిష్కరించాయి. అలాగే ఆంగ్లేయుల పాలనలో కోస్తాంధ్రలో ఆనకట్టలు వెలసిన తీరు, ఇంగ్లిష్ విద్య, వాణిజ్యం ఎలాంటివో 7 నుంచి 12 వరకు ఉన్న అధ్యాయాలు విశ్లేషించాయి. ఆచార్య బి. కేశవనారాయణ రాసిన 13వ అధ్యాయం 1773-1857 మధ్య ఉత్తర సర్కారు జిల్లాలలో జరిగిన తిరుగుబాట్లను చర్చించింది. ఇవన్నీ జమిందారీ వ్యవస్థ మీద నిరసనలే. వీటికి విశేష ప్రాధాన్యం ఉంది. తరువాతి అధ్యాయం 1800-1850 మధ్య రాయలసీమలో పాలెగాళ్ల చరిత్రను చర్చించింది. డాక్టర్ వై.ఎ. సుధాకరరెడ్డి ఈ వివరాలు అందించారు. 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం హైదరాబాద్ సంస్థానం మీద (వి. రామకృష్ణ), ఆంధ్ర ప్రాంతం మీద (వి. రాజగోపాల్) వేసిన ముద్రను గురించి కూడా ఈ పుస్తకం వివరించింది. ఇందులోని మొత్తం 26 అధ్యాయాలలో, 19వ అధ్యాయం మరీ ప్రత్యేకమైనది. తెలుగు భాష, సాహిత్యాలను ఐరోపా పండితులు వెలుగులోకి తేవడానికి చేసిన కృషిని ఇందులో పీటర్ ఎల్. షిమిథెనర్ లోతుగా చర్చించారు. తెలుగు ప్రాంతాలను సామాజిక, రాజకీయ కల్లోలాలలో ముంచెత్తిన 18వ శతాబ్దంలోనే భాషా సాహిత్యాల మీద కొందరు పాశ్చాత్యులు కొత్త వెలుగును ప్రసరింప చేయడం గొప్ప వైచిత్రి. సీపీ బ్రౌన్, బెంజిమన్ షుల్జ్, విలియం క్యారీ, జార్జి క్రాన్, కోలిన్ మెకంజీ, విలియం బ్రౌన్, వి.డి. క్యాంప్‌బెల్ వంటి వారు ఇందుకు చేసిన కృషిని రమణీయంగా వివరించే అధ్యాయం ఇది. హైదరాబాద్‌లో, కోస్తాంధ్రలో, రాయలసీమలో 18వ శతాబ్దంలో జరిగిన ఈ ఘటనలన్నీ చరిత్రాత్మకమే కాదు, అవి పరస్పర ప్రేరేపితాలు కూడా. ఇవన్నీ చదివిన తరువాత 2000 సంవత్సరం నాటి తరం చూసిన పరిణామాలకు అవే బీజాలు నాటాయన్న వాస్తవం అనుభవానికి రావడం గొప్ప అనుభూతి. ఆచార్య వకుళాభరణం రామకృష్ణ సంపాదక త్వంలో ఈ సంపు టాలు వెలువడుతున్నా, ఒక్కొక్క సంపుటానికి వేర్వేరు సంపాదకులు ఉన్నారు. ఈ సంపుటానికి ఆచార్య అడపా సత్యనారాయణ సంపా దకులు. హెచ్. రాజేంద్రప్రసాద్, ఏఆర్ రామ చంద్రారెడ్డి, తంగెళ్లపల్లి విజయకుమార్, గుంటూరి నాగశ్రీధర్, వి. రామకృష్ణారెడ్డి, చంద్ర మల్లంపల్లి, వి. లలిత, సల్మా అహ్మద్ ఫరూఖీ, బి. సుధారెడ్డి, బిఎస్. రోహిణీ అయ్యంగార్ ఇతర అధ్యాయాలు అందించారు. (డిసెంబర్ 1న హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఆరో సంపుటం ఆవిష్కరణోత్సవం సందర్భంగా) - కల్హణ -
రిషితేశ్వరి కేసులో షాకింగ్ నిజాలు
-
నెత్తురు చిందిన ప్రేమ
నిజాలు దేవుడికెరుక జూన్ 9, 2000... పంజాబ్‌లోని ఓ మారుమూల ప్రాంతం... ‘‘ఏంటో ఈ చాకిరీ. పొద్దున్న లేచింది మొదలు రాత్రి మంచమెక్కేవరకూ ఒకటే కష్టం. ఈ బాధలు ఎప్పుడు తీరతాయో తెలియడంలా’’... చంకన పెట్టుకుని వచ్చిన బట్టల మూటని నేలమీద పడేస్తూ విసుగ్గా అంది రజ్జీ. ఆమె విసుగు చూసి నవ్వింది మన్‌ప్రీత్. ‘‘వదినా... ఈ మాట అనకుండా నువ్వెప్పుడైనా పని మొదలుపెట్టావా? రోజూ వస్తావు. తిట్టుకుంటావు. తర్వాతే పని ప్రారంభిస్తావు. ఇవాళ కొత్తేముంది?’’ ఆ మాటలకి తనూ నవ్వేసింది రజ్జీ. రజకులు కావడంతో బట్టలు ఉతకడానికి రోజూ పొద్దున్నే కాలువ దగ్గరకు వస్తారు ఇద్దరూ. ప్రతిరోజూ తన కష్టాన్ని తలచు కుని రజ్జీ విసుక్కుంటూనే ఉంటుంది. మొగుడు తాగుబోతు. దమ్మిడీ పని చేయడు. అన్నీ తనే చక్కబెట్టాలి. అందుకే ఆమెకు అంత విసుగు! ‘‘అవునూ వదినా... అన్నయ్యతో తాగుడు మాన్పించడానికి ఎవరో స్వామీజీ మందు ఇస్తారన్నావ్ కదా! తీసుకెళ్లావా?’’ మన్‌ప్రీత్ ప్రశ్నకి తల అడ్డంగా ఊపింది రజ్జీ. ‘‘తీసుకెళ్తానంటే వచ్చేస్తాడా మీ అన్నయ్య! ఎడ్డెమంటే తెడ్డెమనడం అలవాటేగా... రాను పొమ్మన్నాడు. ఆ మనిషిని ఒప్పించడం నా వల్ల ఎప్పుడ య్యిందని! అందుకే వదిలేశాను’’ అంటూ కాలువలోకి దిగింది రజ్జీ. మన్‌ప్రీత్‌తో మాటా మంతీ చెబుతూనే బట్టలు జాడించసాగింది. అంతలో అనుకోకుండా ఆమె చూపులు మరోవైపు మళ్లాయి. ‘‘ఏయ్ మన్‌ప్రీత్... అటు చూడు’’ అంది కంగారుగా. అటువైపు చూసిన మన్‌ప్రీత్ ముఖంలో రంగులు మారాయి. ‘‘అమ్మో... అది శవమే కదా’’ అంది వణుకుతున్న గొంతుతో. అవునన్నట్టు తలూపింది రజ్జీ. ఇద్దరూ ముఖాలు చూసు కున్నారు. వెంటనే విషయం పోలీసుల చెవిని వేయడానికి స్టేషన్‌కు పరుగెత్తారు. వాళ్లు పోలీసుల్ని తీసుకుని వచ్చేసరికి ఆ శవం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. చుట్టూ కొంతమంది జనం కూడా గుమిగూడారు. వాళ్లందరినీ చెదరగొట్టి మృతదేహం దగ్గరకు వెళ్లాడు ఇన్స్పెక్టర్. ఎవరో అమ్మాయి. పాతికేళ్లుంటాయి. నీటిలో ఉబ్బిపోయినా కూడా ఆమె ఎంతో అందంగా ఉండేదన్న విషయం తెలు స్తోంది. ఖరీదైన బట్టలే వేసుకుంది. ఒంటి మీద నగలున్నాయి. వాటితో పాటు గాయాలు కూడా. పదునైన ఆయుధంతో కోయడంతో మెడ దాదాపు తెగిపోయింది. ఎవరో చిత్రహింసలు పెట్టి చంపారని చూడగానే అర్థమైపోతోంది. ‘‘ఈమె ఎవరో మీలో ఎవరికైనా తెలుసా?’’... అడిగాడు ఇన్స్పెక్టర్. ఎవరూ మాట్లాడలేదు. దాంతో బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించి ఏ కోణంలో విచారించాలా అని ఆలోచనలో పడ్డాడు. ‘‘సర్... ఇన్స్పెక్టర్గారు...’’ కానిస్టేబుల్స్‌తో కేసు గురించి డిస్కస్ చేస్తోన్న ఇన్స్పెక్టర్ చప్పున తల ఎత్తి చూశాడు. ఎదురుగా ఓ యువకుడు నిల బడి ఉన్నాడు. మంచి ఒడ్డూ పొడవూ... చక్కని రంగు... చూడటానికి బాగున్నాడు. కానీ కళ్లలో మాత్రం ఏదో భయం. ఎందుకో కంగారు. ‘‘నేనే... రండి, కూర్చోండి’’ అంటూ కుర్చీ చూపించాడు ఇన్స్పెక్టర్. ఆ యువకుడు కూర్చోలేదు. కాస్త ముందుకు వచ్చి ఇన్స్పెక్టర్కి ఎదురుగా నిలబడ్డాడు. మాట్లాడటం మొదలుపెట్టక ముందే కళ్ల నుంచి నీళ్లు జారడం మొదలైంది. ‘‘ఏంటి... ఏం జరిగింది?’’... అడిగాడు ఇన్స్పెక్టర్ అనునయంగా. ‘‘నా పేరు సుఖ్వీందర్ సర్. నా భార్య జస్వీందర్ వారం రోజుల్నుంచీ కనిపించడం లేదు’’... అతని గొంతు వణికింది. ‘‘వారం నుంచీ కనబడకపోతే ఇప్పటి వరకూ ఏం చేస్తున్నావ్?’’... సహజ సిద్ధమైన పోలీసు ఆలోచనలతో అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘హాస్పిటల్లో ఉన్నాను సర్. ఎవరో రౌడీలు... నన్ను చితక్కొట్టి రోడ్డు పక్కన పడేశారు. నా భార్యను కారులో ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. తనని ఏం చేశారోనని భయంగా ఉంది సర్. ఇన్ని రోజులూ ఆస్పత్రిలో స్పృహ లేకుండా పడివున్నాను. స్పృహలోకి రాగానే మీ దగ్గరికొచ్చాను’’... దుఃఖాన్ని అణచుకుంటూ చెప్పాడు. మాటల్లో తడబాటు లేదు. కళ్లలో నిజాయితీ కూడా కనిపిస్తోంది. దాంతో పెద్దగా సాగదీయలేదు ఇన్స్పెక్టర్. వివరాలు చెప్పమని అడిగాడు. సుఖ్వీందర్ చెబుతుంటే ఇన్స్పెక్టర్ భృకుటి ముడి వడింది. మెదడులో ఏదో ఆలోచన తళుక్కుమంది. వెంటనే అతడిని తనతో రమ్మని తీసుకెళ్లాడు. మార్చురీ అన్న బోర్డు చూడగానే సుఖ్వీందర్ కాళ్లకు బ్రేకులు పడ్డాయి. ‘‘ఇక్కడికెందుకు తీసుకొచ్చారు సర్’’ అన్నాడు భయపడుతూ. ‘‘సారీ సుఖ్వీందర్. వారం రోజుల క్రితం కాలువలో మాకు ఓ అమ్మాయి మృతదేహం దొరికింది. అది ఎవరిదో ఇప్పటివరకూ తెలియలేదు. ఇప్పుడు నువ్వు చెప్పిన వివరాలు వింటుంటే... ఆ అమ్మాయే నీ భార్యయేమోనని అనుమానంగా...’’ ఇన్స్పెక్టర్ మాట పూర్తి కాకముందే ‘‘లేదు’’ అంటూ అరిచాడు సుఖ్వీందర్. ‘‘అంత మాటనకండి. నా జస్వీందర్ చావదు. నన్ను వదిలిపెట్టి వెళ్లదు. ఎందుకంటే తను లేకుండా నేను బతకలేనని తనకు బాగా తెలుసు’’... వెక్కివెక్కి ఏడుస్తోన్న సుఖ్వీందర్ని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు ఇన్స్పెక్టర్కి. ధైర్యం చెబు తున్నట్టుగా భుజం తట్టి, చేయి పట్టుకుని లోనికి తీసుకెళ్లాడు. ఆ అమ్మాయి మృత దేహాన్ని చూపించమని అక్కడున్న వ్యక్తికి సైగ చేశాడు. అతడు మృతదేహాన్ని బయటకు తీశాడు. ఆమెను చూస్తూనే కుప్పకూలి పోయాడు సుఖ్వీందర్. ‘‘జస్సీ... నన్ను వదిలేసి వెళ్లిపోయావా’’ అంటూ గుండె లవిసేలా ఏడవసాగాడు. అతడి పరిస్థితి చూసి ఇన్స్పెక్టర్ సైతం కదిలిపోయాడు. వెంటనే తనని మార్చురీ బయటకు తీసు కొచ్చేశాడు. కాస్త తేరుకున్నాక అడిగాడు... ‘‘అసలేమైంది సుఖ్వీందర్? నిన్ను ఎందుకు కొట్టారు? జస్వీందర్ని ఎందుకు చంపారు? అసలిదంతా ఎవరు చేశారు?’’ దీనంగా ఇన్స్పెక్టర్ ముఖంలోకి చూశాడు సుఖ్వీందర్. గుండెల్ని పిండేసే తన కథ చెప్పడం మొదలుపెట్టాడు. మే 12, 2000. ఎయిర్‌పోర్ట్‌లో సుఖ్వీందర్ని చూస్తూనే పరిగెత్తుకుని వచ్చి అతణ్ని అల్లుకుపోయింది జస్వీందర్ కౌర్. ‘‘వచ్చేశావా జస్సీ. నువ్వు రావేమో, ఎంత కంగారు పడ్డానో తెలుసా’’ అంటూ ఆమెను గుండెలకు అదుముకున్నాడు సుఖ్వీందర్. ‘‘రాకుండా ఉండగలనా? ప్రపంచ మంతా ఒక్కటై ప్రయత్నించినా నన్ను నీ దగ్గరకు రాకుండా ఎవ్వరూ ఆపలేరు’’ అంటూ చిలిపిగా నవ్వింది జస్వీందర్. జస్సీ అలా నవ్వుతుంటే చూస్తూ ఈ ప్రపం చాన్నే మర్చిపోతాడతను. అసలు అతడిని ఆమెవైపు లాగిందే ఆ అందమైన నవ్వు! జస్వీందర్ పుట్టింది పంజాబ్‌లోనే. కానీ చదువుకుంది, సెటిలయ్యింది మాత్రం కెనడాలో. అక్కడామెకు బ్యూటీ షియన్‌గా మంచి పేరుంది. రెండు చేతులా సంపాదిస్తోంది. 1994లో ఓసారి కుటుంబ సభ్యులతో కలిసి లూధి యానాలో ఒక ఫంక్షన్‌కి వచ్చింది. అప్పుడే ఆమెకు ఆటో డ్రైవర్ సుఖ్వీందర్‌తో పరిచయమయ్యింది. అతడు ఆమెలా ఎక్కువ చదువుకోలేదు. ఆమెతో పోలిస్తే అంత అందగాడు కాదు. ఆమెలాగా బాగా సంపాదించడమూ లేదు. కానీ ఆమెలో చలనాన్ని కలిగించాడు. తొలి పరిచయంలోనే వాళ్ల మధ్య ప్రేమ పుట్టింది. కొద్ది రోజుల తర్వాత జస్వీందర్ వాళ్లు కెనడా వెళ్లిపోయినా ఆ ప్రేమ అలాగే నాలుగేళ్లు కొనసాగింది. అయితే జస్సీకి ఇంట్లోవాళ్లు మరొకరితో పెళ్లి సెటిల్ చేయడంతో వారి ప్రేమకథ కొత్త మలుపు తిరిగింది. సుఖ్వీందర్నే పెళ్లాడతానంది జస్సీ. ఇంట్లోవాళ్లు విరుచుకుపడ్డారు. ఆటో వాడితో ప్రేమేంటి అంటూ తిట్టారు, కొట్టారు, ఇంట్లో బంధించారు. అయినా ఆమె మనసును మాత్రం మార్చలేక పోయారు. సుఖ్వీందర్ కోసం పరితపిం చింది జస్సీ. ఫ్రెండ్స్ సాయంతో ఎలాగో తప్పించుకుని ఇండియా వచ్చేసింది. సుఖ్వీందర్‌తో తాళి కట్టించుకుని కొత్త జీవితం మొదలుపెట్టింది. ఇక తనకు ఏ కష్టమూ రాదనుకుంది. కానీ అన్నీ అనుకున్నట్టు జరిగితే జీవితం ఎందుకవు తుంది! నెల రోజులు తిరక్కుండానే సుఖ్వీందర్ని, జస్వీందర్ని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. సుఖ్వీందర్ని చితక్కొట్టి రోడ్డు పక్కన పడేశారు. జస్సీని కారులో దూరంగా తీసుకెళ్లి చంపేశారు. తర్వాత ఆమె మృతదేహాన్ని ఓ కాలువలో పడేశారు. ‘‘ఇది కచ్చితంగా వాళ్ల ఇంట్లోవాళ్ల పనే అయ్యుంటుంది సర్. వాళ్లు నన్ను అల్లుడిగా ఒప్పుకోలేదు. నన్ను పెళ్లి చేసుకుందన్న కోపంతో చివరికి తనని పొట్టన పెట్టుకున్నారు.’’ బాధేసింది ఇన్స్పెక్టర్కి. ఏం మనుషులు వీళ్లు! అల్లుడు నచ్చలేదని కూతుర్ని చంపేసుకుంటారా! కడుపు మండిపోయిందతనికి. విచారణ వేగవంతం చేశాడు. సుఖ్వీందర్ చెప్పిన గుర్తుల్ని బట్టి ఈ దారుణానికి పాల్పడిన ఏడుగురు దుండగుల్నీ అరెస్ట్ చేశాడు. వాళ్ల వాంగ్మూలం ఆధారంగా ఈ హత్య చేయిం చింది జస్సీ తల్లి మల్కిత్, మేనమామ సుర్జీత్ అని తేలింది. దాంతో వాళ్లమీద కూడా కేసు ఫైలు చేశాడు. కానీ వాళ్లు కెనడాలో ఉండటంతో కేసు త్వరగా ముందుకు సాగలేదు. వాళ్లని అరెస్ట్ చేయడానికి చాలాకాలం పట్టింది. తీరా అరెస్టయ్యాక వారి పలుకుబడి కేసును పక్కదారి పట్టించింది. వాంగ్మూలాలు మారిపోయాయి. సాక్ష్యాలు తారుమారు అయ్యాయి. వాద ప్రతివాదనలు జరిగాయి. కానీ కేసు మాత్రం ఓ కొలిక్కి రాలేదు. పదిహేనేళ్లుగా సాగుతూనే ఉంది. అయితే ఇప్పటికీ సుఖ్వీందర్లో మాత్రం ఆశ చావలేదు. తన ప్రాణానికి ప్రాణమైన జస్సీని చంపినవాళ్లు ఉరి కంబానికి వేళ్లాడటం ఏదో ఒక రోజు తాను చూస్తాననే అంటున్నాడు. పాపం... నేటికీ ఆమె జ్ఞాపకాల కొలిమిలో కాలిపోతున్నాడు ఆ పేద ప్రేమికుడు. ‘‘జస్సీని మొదటిసారి చూసినప్పుడే ప్రేమలో పడ్డాను. తను కూడా నన్ను మొదటి చూపులోనే ఇష్టపడింది. ఆరోజు తను నా ఆటో ఎక్కింది. దిగేటప్పుడు తన లిప్‌స్టిక్‌తో ఐ లవ్యూ అని సీటు మీద రాసింది. నేనెంతో అదృష్టవంతుడిని అనుకున్నాను. కానీ నాకు తెలియలేదు... ఆ భగవంతుడు మా తలరాత నెత్తుటితో రాశాడని’’ అంటాడు చెమ్మగిల్లిన కళ్లతో. ఆ చెమ్మ నిండా జెస్సీ జ్ఞాపకాలే! -
‘సమాచార హక్కు’ను వినియోగించుకోవాలి
- కేంద్ర సమాచార హక్కుచట్టం కమిషనర్, ప్రొఫెసర్ - శ్రీధరాచార్యులు కేయూక్యాంపస్ : సమాచారహక్కు చట్టాన్ని వినియోగించుకుని నిజాలను వెలికితీయూలని కేంద్ర సమాచార హక్కుచట్టం కమిషనర్ ప్రొఫెసర్ శీధరాచార్యులు సూ చించారు. కేయూలోని మైక్రో బయూలజీ విభాగం ఆధ్వర్యం లో ఎథిక్స్ ఇన్ మైక్రోబయాలజీ అనే అంశంపై పరిపాలనా భవనంలోని సేనేట్‌హాల్ శనివారం జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రాసిన పుస్తకాన్ని వేరే వారు పబ్లిష్ చేశారని, దాన్ని కాఫీ రైట్ కింద కేసు వేసి గెలిచానని ఈ సందర్భంగా ఆయన వివరించారు. యూనివర్సిటీల్లో పరిశోధన అనేది నేడు నిజారుుతీగా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశోధనలను నేరుగా చేయూలని సూచిం చారు. కేయూసీడీసీ డీన్ ప్రొఫెసర్ సింగరాయచార్య పరిశోధనలుచేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నందుకు ఆయనను అభినందించారు. ఆయన గౌరవార్థం జాతీయ సదస్సు ను నిర్వహించడం అభినందనీయమన్నారు. కేయూ మాజీ వీసీ విద్యావతి మాట్లాడుతూ విలువలు పాటించినప్పుడే సమాజం బాగుంటుందని సూచించారు. ఈ సదస్సులో కేయూ మైక్రోబయాలజీ విభాగం ప్రొఫెసర్ ఎస్ గిరీశం, విభాగం అధిపతి ఎం. శ్రీనివాస్, బోర్డు ఆప్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ పి. వెంకటయ్య, డాక్టర్ ఈ సుజాత మాట్లాడారు. ఐఐసీటీ ప్రొఫెసర్ ఆర్ఎస్ ప్రకాశం మైక్రోబ్స్‌పై ప్రసంగించారు. ఈ సదస్సుకు కేయూసీడీసీ డీన్ ప్రొఫెసర్ సింగరాయచార్య అధ్యక్షతవహించి మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీధరాచార్యులను మాజీవీసీ విద్యావతి, సీడీసీడీన్ ప్రొఫెసర్ సింగరాయచార్య శాలువా కప్పి, మెమొంటో అందజేశారు. -
వాస్తవాలతో భ్రమలకు చెల్లుచీటీ
జాతిహితం మీరు అర్థరహితంగా మాట్లాడుతున్నారూ అంటే, మీ బుర్రను పరీక్ష చేయిం చుకోవాల్సిందేనని ఎవరైనా చెబుతారు. అయితే అసలా అవసరమే రాని సమయాలూ ఉంటాయి. సబ్సిడీలు లేకుండా కూడా వ్యవసాయరంగం మన గలుగుతుందని మీరు విశ్వసించేట్టయితే పిచ్చివాడని ముందుగానే మీకు ఓ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఈ వారం జాతిహితంలో గణాంకాల ఆధారంగా కొన్ని భ్రమలను బద్ద లుకొడతామని వాగ్దానం చేశాం. వ్యవసాయానికి చాలా అధికంగా సబ్సిడీ ఇస్తున్నారనే విస్తృతాభిప్రాయాన్ని సవాలు చేయడానికి బదులుగా మనం దాన్ని ఎందుకు సమర్థిస్తున్నాం? బహుశా మన బుర్రలను పరీక్ష చేయించుకోవాల్సి ఉండి ఉంటుంది. అయితే వాస్తవాలను ముందు చూద్దాం. జపాన్‌లో మొత్తం వ్యవసాయ ఆదా యంలో వ్యవసాయ సబ్సిడీల వాటా 56 శాతంగా, యూరోపియన్ యూని యన్‌లో 19 శాతంగా, అమెరికాలో కేవలం 7.1 శాతంగా ఉంది. ఇవి ఆర్గనై జేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) గణాం కాలు. జపాన్ విషయం నిజానికి ప్రత్యేకమైనదే అయినా, అదే ఎక్కువ చర్చ నీయాంశంగా ఉంది. బియ్యం దిగుమతులపై 778 శాతం, గోధుమ దిగుమ తులపై 252 శాతం సుంకాలను విధించి జపాన్ కూడా తన రైతాంగాన్ని కాపాడుతోంది. కాబట్టి మీరు మీ రైతుల పరిరక్షణకు కూడా అడ్డు చెప్పొద్దు. ప్రతి దేశమూ ఆ పని చేయాల్సిందే. అయితే మన దేశంలోలాగా ఇతర మరే పెద్ద ఆర్థిక వ్యవస్థలోనైనా రైతు ఇలా ఆకలిగా అర్థనగ్నంగా ఉంటాడా? మన ఎరువుల సబ్సిడీలు రూ.70,000 కోట్లకు మించి పోయాయి. మన రాష్ట్రాలు వ్యవసాయ రంగానికి చెల్లించే మొత్తం విద్యుత్ సబ్సిడీ కూడా ఇంచు మంచు రూ.70,000 కోట్లుంటుంది. వీటికి విత్తనాలు, వ్యవసాయ సాధ నాలు, డీజిల్ (ఇటీవలి వరకు), ఉచిత నీరు, బోసస్ వగైరా ఉత్పత్తి కార కాలపై ప్రత్యక్ష సబ్సిడీలను కూడా కలుపుకుంటే.. మొత్తం వ్యవసాయ సబ్సిడీలు ఎంత తక్కువగా చూసినా రూ. 2,00,000 కోట్లకు దాటి పోతాయి. అయినా రైతు దయనీయ స్థితిలోనే ఉన్నాడు. మన ఆర్థిక వ్యవస్థలో వ్యవ సాయం నిరాదరణకు గురైనది, కాబట్టి దానికి మరిన్ని సబ్సిడీలను ఇవ్వాలనే గగ్గోలు ఎప్పుడూ ఉంటుంది. మేం సవాలు చేస్తున్నది ప్రధానంగా వ్యవసాయం దరిద్రపుగొట్టుదనే భ్రమను. మన దేశానికి కావాల్సింది ఇంకా ఎక్కువ వ్యవసాయ సబ్సిడీలు కావు, వివేచనాయుతమైన సబ్సిడీలు. సబ్సిడీలలో అత్యధిక భాగం బడా రైతులకే దక్కుతున్నాయనేది ప్రపంచవ్యాప్త వాస్తవం. మన దే శంలో అందుకు విరుద్ధంగా అవి బడా వ్యాపార రంగానికి చేరుతున్నాయి. మొత్తంగా ఎరు వుల పరిశ్రమే ఆ సబ్సిడీల చుట్టూ విస్తరించి ఉన్న సిగ్గు చేటైన వ్యవహారం. ఎరువుల శాఖ నేరుగా ఉత్పత్తిదారులకు రూ.70,000 కోట్ల సబ్సిడీని పంచి పెడుతోంది. అది వారికి ఒక పెద్ద ఏటీఎమ్‌గా మారింది. ఇదిలా ఉంటే, రైతు ఎరువుల కోసం బిచ్చగాడిలా దేబిరించాల్సి ఉంటుంది. సబ్సిడీల వల్ల ధరలు తగ్గి యూరియా అనే ఎరువు కోసం శాశ్వతంగా కొరత ఎలా ఏర్పడిందో, దాని కోసం ఎలా అల్లర్లు సైతం జరుగుతున్నాయో మరోసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. సబ్సిడీ వల్ల భారత్‌లో యూరియా ధర దాని అసలు ధరలో మూడో వంతుకంటే కూడా చౌకగా మారింది. దీంతో దాన్ని పొరుగు దేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. సబ్బులు, పేలుడు పదార్ధాలు మొదలు పాల కల్తీ వరకు ఇతర పరిశ్రమలకు యూరియాను మరలించేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏ చైనా నుండో యూరియాను ‘‘దిగుమతి’’ చేసుకొని మన ప్రాదేశిక జలాలకు ఆవలి అంతర్జాతీయ సముద్రం ద్వారా తిరిగి ఆ దేశానికే ‘‘ఎగుమతి చేయడం’’ సైతం జరుగుతోంది. సబ్సిడీని ఇరు పక్షాలూ పంచుకుంటాయి. ఈ చెడంతా చాలదన్నట్టు ఈ అధిక సబ్సిడీ ఆవశ్యకమైన ఎన్పీకే (నైట్రోజన్, ఫాస్పేట్, పొటాషియం) మిశ్రమంలో ఇతర రెండింటినీ వదిలి యూరియా లేదా నైట్రోజన్‌ను మన రైతులు ఎక్కువగా వాడే స్థితికి నెడుతోంది. ఫలితంగా కోట్ల హెక్టార్ల అత్యంత సారవంతమైన భూములు నాశనమైపోతున్నా యి. రైతులకు భూసార పరీక్ష కార్డులు ఇవ్వడం మంచి ఆలోచన. కానీ కుళ్లి కంపుకొడుతున్న ఎరువుల సబ్సిడీ ఆర్థికశాస్త్రం దాన్ని ఓడించేస్తుంది. బ్రహ్మాం డమైన స్వార్థ ప్రయోజనాలు, లాభాలు చేసుకునే మాఫియా ఈ ఎరువుల సబ్సిడీల చుట్టూ నిర్మితమై ఉంది. అనాలోచితమైన వ్యవసాయ సబ్సిడీలు, వివేకరహితమైన ఆహార ఆర్థిక వ్యవస్థతో కలసి భారత వ్యవసాయ రంగాన్ని గందరగోళంగా మార్చింది. కాబట్టి మేం కూల్చివేయనున్న రెండవ అతి పెద్ద భ్రమ నయా-ఉదారవాద సంబంధమైనది. అది, పన్ను మినహాయింపులున్న రైతుకు అధిక సేకరణ ధరలను చెల్లిస్తూ ప్రభుత్వం అతిగా గారం చేస్తోంది; తద్వారా అది పన్ను చెల్లింపుదారులకు నష్టం కలిగించడమే గాక, ఆహార ద్రవ్యోల్బణానికి కూడా దారితీస్తోందనే భ్రమ. వ్యవసాయరంగంపై శాంతా కుమార్ కమిటీ ఇటీవలే వీటిలో కొన్ని అంశాలను వివరంగా పరిశీలించింది. చాలా గణాంకాలకు గానూ నేను నా రచయితలకు కృతజ్ఞుడిని. మన దేశంలో గోధుమ సేకరణ, లేదా కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ) టన్నుకు 226 డాలర్లు. అదే పాకి స్తాన్‌లో 320 డాలర్లు, చైనాలో 385 డాలర్లు. వ్యవసాయం బాగా తెలిసిన ఏ రైతూ, ప్రపంచంలో ఎక్కడా తన సాగు ఏమీ బాగా లేదని అనడు. కానీ మనతో పోల్చి చూసుకునే దేశాలలో అత్యధికం మనకు భిన్నంగా తమ వ్యవసాయాన్ని సంస్కరించుకున్నాయనేది వాస్తవం. పాకిస్తాన్, చైనాలు రెండూ ఆదాయ మద్దతు రూపంలో ప్రత్యక్ష వ్యవసాయ సబ్సిడీలను అమలుచేస్తున్నాయి. రెండూ ప్రజా పంపిణీ వ్యవస్థను (పీడీఎస్) రద్దు చేశాయి. మనం మాత్రం మితవాద ధోరణితో రైతులకు ‘‘మద్దతు’’ను ఇస్తున్నాం. ఆ తక్కువ ధరకు సైతం ప్రభుత్వ సంస్థలకు తమ ఉత్పత్తులను అమ్ముకోగలిగేది. కేవలం 6 శాతం మంది రైతులు మాత్రమే. కన్నాల్లోంచి ఎక్కడికక్కడ కారిపోయే, తేలిగ్గా వచ్చి పడే డబ్బు రూపేణా వ్యవసాయ సబ్సి డీలను చెల్లాచెదురు చేసేస్తాం. ఆ మీదట ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా విని యోగదారులకు సబ్సిడీ ధరలకు అమ్మడం కోసం భారీగా ఆహార ధాన్యాల నిల్వలను పోగుచేస్తాం. ఈ పీడీఎస్‌ను నేను ప్రజా దౌర్భాగ్య వ్యవస్థ అని అం టాను. అందువలన మనం మన ఆహార/వ్యవసాయ ఆర్థికశాస్త్రాన్ని మొత్తం మూడు అంశాల్లోనూ వక్రీకరించాం. వికృతపరచాం: ఉత్పత్తికారకాలు (ఇన్ పుట్స్), ఉత్పత్తులను రైతే నేరుగా అమ్ముకోవడం, వినియోగం. విపరీతంగా విస్తరించిన ధరల హెచ్చు తగ్గులన్నింటి ప్రయోజనాలు చివరికి అవాంఛనీ యమైన జేబుల్లోకి, మధ్యవర్తులు, ఇన్స్పెక్టర్లు, ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) అనే బ్రహ్మాండమైన వ్యవస్థకు చేరుతాయి. అందువలన, మన దేశ ఆహార భద్రతకు మరీ మరీ ఎక్కువగా ఆహార ధాన్యాలు అవసరమేనేది తదుపరి మా హిట్‌లిస్ట్‌లో ఉన్న భ్రమ. క్షామ పరిస్థితులను స్థిరీకరించడం కోసం దేశానికి అవసరమయ్యే బఫర్ స్టాక్ కేవలం కోటి టన్నులు మాత్రమేనని, అందులో భౌతికంగానూ, మిగతా సగం అంతర్జాతీయ ఆహార ధాన్యాల ఫ్యూచర్స్, ఆప్షన్ల రూపంలోనూ ఉంటే సరిపో తుందని శాంతా కుమార్ కమిటీ తెలిపింది. కానీ వార్షిక ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 15-20 శాతం (3.2 కోట్ల టన్నులు) అనే కాలం చెల్లిన ప్రమాణం అమల్లో ఉన్న దేశంలో అలాంటి ఆలోచన మరీ విప్లవాత్మకమైనది. మన ఆహారధాన్యాల ఉత్పత్తి 2014-15లో 25.1, 2013-14లో రికార్డు స్థాయిలో 26.5 కోట్ల టన్నులు. ఆహార భద్రతా చట్టం వల్ల పీడీఎస్ అదనపు అవసరాలను కూడా చేర్చితే మన బఫర్ స్టాక్ 4.2 కోట్ల టన్నులకు చేరుతుంది. కానీ నేడు మనం 6 కోట్ల టన్నులకు పైగా నిల్వలను పెట్టుకున్నాం. వాస్తవానికి మనం అతి సులువుగా కోటి టన్నుల ఆహార ధాన్యాలను ఎగుమతి చేసుకోవచ్చు. అలా అని రెండేళ్ల క్రితం నిర్ణయించినా, నాటి కాగ్, సీవీసీ, సీబీఐల కాలంలో ఆహా రశాఖ అందుకు జంకింది. ఈ అదనపు నిల్వల వ్యయం రూ. 45,000 కోట్లకు పైగానే, ఫలితాలు మాత్రం శూన్యం. ఎఫ్‌సీఐ రైతులకు చెల్లింపులు చేసిన తర్వాత ధాన్యాన్ని తరలించడానికి టన్నుకు రూ. 4.75 ఖర్చవుతుంది. ఈ అదనపు ధాన్య నిల్వల రవాణాకే రూ.7,500 కోట్లు అదనపు ఖర్చు. ఈ అంకెలను దయచేసి గుర్తుంచుకోండి, మరో నిమిషంలో మనం వాటి వద్దకే మళ్లీ రానున్నాం. ఇది, విస్తృతంగా ప్రచారంలో ఉన్న మన ఆహారభద్రత ప్రమాదకర స్థితిలో ఉన్నదనే భ్రమను తుత్తునియలు చేస్తుంది. ఇది ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే క్రిస్టోఫ్ జఫర్లోట్ వంటి అత్యంత జాగరూకత గల అద్భుత విద్యావేత్త సైతం ఆ మాయలో పడిపోయారు. ఇటీవల ఓ పత్రిక కాలమ్‌లో ఆయన, గత ఏడాది మనం ‘‘80,000 టన్నుల’’ గోధుమలను దిగుమతి చేసుకోవడాన్ని ఆహార భద్రతకు తలెత్తనున్న ముప్పుగా అభివర్ణించారు. గంగా-జమునీ అలంకారిక భాషలో చెప్పాలంటే, 6 కోట్ల టన్నుల గోధుమ, బియ్యం నిల్వలు ఉండగా 80 వేల టన్నుల దిగుమతి ఒంటె నోట్లోని జీలకర్ర గింజంత. ఈ గోధుమ దిగుమతులపై పరిశోధనాత్మక దర్యాప్తు జరిపిన దరిమిలా అవి మాగీలాంటి కొన్ని బ్రాండెడ్ వస్తువుల తయారుదారులు విభిన్నమైన జిగురు, పీచు అవసరాల కోసం దిగుమతి చేసుకున్న కొద్ది మొత్తాలనీ, లేక పోతే ఉత్తర భారతంలోని ఎఫ్‌సీఐ గోడౌన్ల నుంచి తెచ్చుకునే కంటే ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకోవడమే చౌకనుకున్న కొన్ని పిండి మిల్లుల దిగుమతులనీ తేలింది. ఇలాంటి ముక్కలు చెక్కల అర్థశాస్త్రం మీకు పిచ్చి అనిపిస్తోందా? మీకు మరిన్ని విషయాలు చెబుతాను. ఎఫ్‌సీఐ కోసం ఆహార ధాన్యాల సేకరణను ఎక్కువగా చేసేవి పంజాబ్, హర్యానా రాష్ట్రాలే. అవి కనీస సేకరణ ధరపై 15 శాతం సెస్‌ను కేంద్రంపై విధిస్తాయి. ఆహారధాన్యాలను ఎక్కువగా పండిస్తున్నందుకు కేంద్రం వాటికి నేరుగా చెల్లిస్తున్న బహుమతే ఇది. ఇక మీరు హరిత విప్లవం సాధించిన రైతు విపత్కరమైన గోధుమ/వరి విషవలయంలో చిక్కుకుపోయాడని ఫిర్యాదు చేస్తారు. గోధుమ/వరి వల యం ఆ రాష్ట్రాల బడ్జెట్లకు డబ్బులు రాల్చేది అయినప్పుడు అవి రైతును క్యాబేజీ, బెండ, గోబి, క్యాలిఫ్లవర్ లేదా దోస వేయమని ఎందుకు ప్రోత్స హిస్తాయి? భారత వ్యవసాయాన్ని చక్కదిద్దాలంటే పంజాబ్, హర్యానాలు వ్యాపార పంటలకు, మద్దతు ధరతో మొక్కజొన్నకు మారమని చెప్పాలి. బాస్మతి వరి వేస్తే మామూలు వరితో పోలిస్తే టన్నుకు మూడు రెట్లు ఆదాయా న్నిస్తాయి, మూడో వంతు తక్కువ నీటిని వినియోగిస్తాయి. మామూలు వరిని ఈశాన్య రాష్ట్రాలకు, నర్మదా నదీ జలాలతో శక్తివంతమైన మధ్య ప్రదేశ్‌కు బదలాయించవచ్చు. ఎంపీ రైతులు దాదాపు 20 శాతం వృద్ధిని నమోదుచేస్తున్నారు. పరిశ్రమలు, పట్టణీకరణల కోసం భూమిని సేకరిస్తే దే శంలో సాగు భూమికి కొరత ఏర్పడి ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతోందనేది తదుపరి కూల్చి పారేయాల్సిన భ్రమ. మరో మారు వాస్తవాలనే చూద్దాం. మన దేశం దాదాపు 20 కోట్ల హెక్టార్ల సాగుయోగ్యమైన భూమిలో వ్యవ సాయం చేస్తోంది. ఇంచుమించు సాలీన 26 కోట్ల టన్నుల ఆహారధాన్యాలను ఉత్పత్తి చేస్తోంది. చైనా సాగుచేస్తున్నది 15.6 కోట్ల హెక్టార్లు. కాగా, ఉత్పత్తి చేస్తున్నది (ఊపిరి బిగబట్టి వినండి!) 60 కోట్ల టన్నులు. ఎందువల్ల? దానికి సాగునీరుంది. అక్కడి వరిలో 63 శాతం సంకర వంగడాలు. కాగా, మన దేశంలో అది కేవలం 3 శాతమే. ఎందుకు? ఆ విషయాన్ని మీరు వామపక్ష, మితవాద ‘‘సేంద్రియ వ్యవసాయ’’ లుడ్డైట్లను (19వ శతాబ్దపు యంత్ర విధ్వంసకులు-అను.) అడగండి. స్థూలంగా పైన ఇచ్చిన గణాంకాలన్నీ వ్యవ సాయ ఆర్థిక శాస్త్రవేత్త అశోక్ గులాతీ నుంచి సేకరించినవే. మీరు వ్యవసాయరంగాన్ని చక్కదిద్దగలగాలంటే ఏమేం చేయాలో స్వల్ప జాబితా ఇది. ఒకటి, సబ్సిడీల మొత్తానికంతటికీ సువ్యవస్థితం చేసి, వాటిని నేరుగా రైతుకే భూకమతం ఆధారంగా చెల్లించండి. రెండు, వ్యవ సాయ ఉత్పత్తుల ధరలను స్వేచ్ఛగా మార్కెట్లో నిర్ణయం కానివ్వండి. మూడు, మద్దతు ధరను నగదు రూపంలో చెల్లించి, విద్యుత్తు సహా అన్ని ఉత్పాదితాలకు మార్కెట్టు ధరలను వసూలు చేయాలి. నాలుగు, పొదుపులు, అదనపు మదుపులన్నీ నీటి పారుదల, సాంకేతికత ఉన్నతీకరణ, నూతన విత్తనాలు, జీఎమ్ సహా పరిశోధనపై పెట్టాలి. నీటిపారుదల మధ్యప్రదేశ్‌లో ఎలాంటి అద్భుతాన్ని చేసిందో చూడండి. అయితే, మహారాష్ట్రలో నీటిపారుదలపై 2000-01 నుంచి 2010-11 మధ్య రూ.81,206 కోట్లు ఖర్చు చేసినా నీటి వసతి ఉన్న పత్తి సాగు 5.1 శాతానికి మించలేదని కూడా విస్మరించరాదు. అందులో సగం ఖర్చుతో గుజ రాత్లో 67 శాతం సాగు అదనంగా పెరిగింది. దీన్ని మీరు విదర్భ, గుజరాత్ పత్తి రైతుల పరిస్థితులను పోల్చి చూడటం ద్వారా చూడవచ్చు. ఐదు, దుర్భిక్షం అనివార్యం అని, అలాగే వాతావరణ మార్పుల వల్ల విపరీత వాతావరణ పరిణామాలు చోటు చేసుకుంటాయని అంగీకరించాలి. భారత్‌లో ప్రతి నాలుగైదు ఏళ్లకు ఒకసారి దుర్భిక్షం ఏర్పడుతుందని గత వందేళ్ల గణాంక సమాచారం చెబుతోంది. కాబట్టి మనకు నిజమైన వ్యవ సాయ బీమా వ్యవస్థ, దేశంలోని 70 శాతం సాగుకంతటికీ పూర్తి బీమాను కల్పించే వ్యవస్థ. కానీ దానికి ఏటా రూ.15,000 కోట్లు అవసరం. ఎఫ్‌సీఐ ఆ మిగులు ఆహారధాన్యాల బరువు మోయకుండా ఉంటే చాలు అందులో సగం మొత్తం లభిస్తుంది. ఇంతకు ముందు చెప్పిన ఆ రూ.7,500 కోట్ల అంకెను గుర్తు తెచ్చుకోండి. ఎలాంటి బీమా? అందుకు అమలులో ఉన్న చాలా నమూనాలే ఉన్నాయి. నిజంగానే అద్భుతమైన నమూనా పీకే మిశ్రా (ప్రధాని కార్యాలయం ప్రస్తుత అదనపు ప్రధాన కార్యదర్శి) నేతృత్వంలోని పంటల బీమా పథకాల సమీక్ష, అమలు కమిటీ వద్ద సిద్ధంగా ఉంది. స్మార్ట్ ఫోన్లు, జీపీఎస్, ద్రోన్ల సమ్మేళనంతో సత్వర చెల్లింపులు చేయడంపై ఇతర నిపుణులు కూడా ఆ విష యంలో చాలా కృషే చేశారు. గులాతీ అన్నట్టు, కెన్యా చేయగా, మనం చేయ లేమా? అంతకంటే ముందుగా రైతును బిచ్చగాడిగా దిగజార్చి, అతనికి బిచ్చం వేస్తూ, దాన్ని కూడా ఆకలితో కాక దురాశతో నకనకలాడుతున్న వంచ కులు కాజేస్తున్నా బూటకపు సంతృప్తిని కలిగిస్తున్న ఈ భ్రమలను చెత్త బుట్టలో వేయాలి. - శేఖర్ గుప్తా shekhargupta653@gmail.com -
లాడెన్ పత్రాలు... నిజాలు
ప్రపంచవ్యాప్తంగా వేలాది ఉగ్రవాద ఘటనలకు కారకుడైన అల్ కాయిదా అగ్రనేత బిన్ లాడెన్‌ను హతమార్చి నాలుగేళ్లు కావస్తున్న సందర్భంగా అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన పత్రాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. నిజానికి ఆ పత్రాలు వెల్లడించిన అంశాల్లో చాలా భాగం అందరికీ తెలిసినవే. లాడెన్ గురించి ఇన్నాళ్లుగా అనుకుంటున్నవే... అంచనా వేస్తున్నవే. అయితే ఈ పత్రాలద్వారా వాటికి సాధికారత వచ్చింది. పరిమిత సంఖ్యలో విడుదలైన పత్రాలు గనుక ఇందులో లాడెన్ సంపూర్ణ చిత్రం ఆవిష్కృతం కాలేదు. అవన్నీ పూర్తిగా విడుదలైతే వివిధ అంశాల విషయంలో అతని ఆలోచనా ధోరణులెలా ఉన్నాయో...ఉగ్రవాదానికి తానే ఊపిరీ, ఊతం కావడానికి దారితీసిన పరిస్థితులేమిటో అంచనా వేయడానికి వీలవుతుంది. ఇప్పుడు విడుదలైన పత్రాల్లో రేఖామాత్రంగా లాడెన్ ఆలోచనలు తెలుస్తున్నాయి. అంతేకాదు...పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో అతనికీ, అతని సహచరులకూ ఉన్న సంబంధాలూ, చుట్టరికాలూ ప్రపంచానికి ‘సాధికారికంగా’ అర్థమవుతున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు సమీపంలోని అబ్తాబాద్లో ఉన్న లాడెన్ స్థావరంపై 2011 మే 2న అమెరికా దళాలు మెరుపుదాడి చేసి మట్టుబెట్టాయి. ఎక్కడో పాకిస్థాన్-అఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లో తోరాబోరా కొండల్లో అజ్ఞాతజీవితం సాగిస్తుంటాడని అందరూ అంచనా వేసిన లాడెన్ తమ గడ్డపైనే పట్టుబడటంతో పాకిస్థాన్ ఇరకాటంలో పడింది. లాడెన్ ‘చంపదగిన శత్రువే’ కావొచ్చు. పలు దేశాల్లో మారణహోమం సృష్టించిన అల్ కాయిదా సంస్థకు ఆద్యుడు కావొచ్చు. కానీ, వ్యక్తులుగా అలాంటి వారిని హతమార్చినంత మాత్రాన సాధారణ పరిస్థితులు ఏర్పడతాయనుకోవడం భ్రమే. లాడెన్ స్వయంగా యుద్ధంలో పాల్గొన్నవాడు కాదు. విధ్వంసక చర్యల్లో నేరుగా పాల్గొన్న అనుభవమైనా అతనికి ఉన్నట్టులేదు. కానీ, అతను నెలకొల్పిన సంస్థ వివిధ దేశాల్లో వ్యాప్తి చెందడమేకాక... దాన్ని స్ఫూర్తిగా తీసుకుని పుట్టి విస్తరించినవి ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఇతర సంస్థలతో సమన్వయం సాధించి ముందుకెళ్తుంటే, మరికొన్ని ఎక్కడికక్కడ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయి. వాటిల్లో చాలా సంస్థలు దెబ్బతిన్నట్టే తిని మళ్లీ మళ్లీ జీవం పోసుకుంటున్నాయి. కనుక లాడెన్ ఆలోచన లు, అభిప్రాయాలు ఏమిటో...అవి ఉగ్రవాద సంస్థలకు ఎలా తోడ్పడ్డాయో అధ్యయనం చేయడంవల్ల వాటి నియంత్రణకు ఒక దోవ దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బయటపెట్టిన పత్రాల్లోని కొన్ని అంశాలు ఆసక్తి కలిగిస్తాయి. ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాలను నాలుగేళ్లక్రితం ప్రజాస్వామిక విప్లవం ఊపేసినప్పుడు అందరూ దాన్ని కీర్తించారు. ఆ దేశాల్లో దశాబ్దాలుగా వేళ్లూనుకున్న నియంతలు మట్టికరిచి అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఆవిర్భవిస్తాయని అంచనావేశారు. కానీ, బిన్ లాడెన్ వేరేలా ఆలోచించాడు. అక్కడ సాగుతున్న ఆందోళనలు ఉగ్రవాద సంస్థల విస్తరణకు దొరికిన మంచి అవకాశంగా భావించాడు. ఇస్లామిస్టులు వాటిల్లో పాలుపంచుకుని, ఆ ఉద్యమాల తీరుతెన్నులను మార్చాలని సూచించాడు. ఇప్పుడు ఆ ప్రాంతాల్లోని చాలా దేశాలు ఉగ్రవాదంతో ఉసూరుమంటున్న తీరును గమనిస్తే చివరకు లాడెన్ కోరికే నెరవేరిందని అర్థమవుతుంది. సమస్త వనరులూ అందుబాటులో ఉన్న అమెరికా తదితర దేశాలకు ఇలాంటి ప్రమాదాన్ని ముందే పసిగట్టడం, జాగ్రత్తపడటం కష్టమేమీ కాదు. అవి బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి వేరొకలా ఉండేది. కానీ, కొన్నిచోట్ల ఆ ఉద్యమాలను సమర్థిస్తున్నట్టే నటించి వాటిని నట్టేట ముంచడం, తమ తైనాతీలు నియంతలుగా ఉన్నచోట వాటిని అణిచేందుకు తోడ్పడటం వంటి చర్యలకు పూనుకున్నాయి. పర్యవసానంగా ఆ దేశాల్లో ఉగ్రవాదం ఇప్పుడు బలంగా వేళ్లూనుకుంది. చివరిరోజుల్లో బిన్ లాడెన్‌ను ఎవరూ పట్టించుకోని స్థితి ఏర్పడిందని, అతను దాదాపు ఒంటరయ్యాడన్నది కూడా నిజం కాదని ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి. పశ్చిమాసియాలో పాలకులతో సంఘర్షిస్తున్న తీరు సరికాదని... ఇందువల్ల ప్రధాన శత్రువు అమెరికాను దెబ్బతీసే లక్ష్యానికి విఘాతం కలుగుతుందని హెచ్చరించడం...అందుకనుగుణంగా యెమెన్‌లో అల్‌కాయిదా సంస్థ తన ధోరణిని మార్చుకోవడం ఇందులో కనిపిస్తుంది. అల్ కాయిదా ఏ తరహా దాడులు నిర్వహించాలన్న విషయంలోనూ లాడెన్‌తో అబూ ముసబ్లాంటి నేతలు విభేదించిన సంగతి ఈ పత్రాల్లో వెల్లడైంది. భారీ దాడులు జరపాలని లాడెన్ భావిస్తే చిన్న తరహా దాడులతోనే పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీయగలమని అబూ ముసబ్ వాదించాడు. ఈ పత్రాల ద్వారా అల్ కాయిదా సంస్థకూ, పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకూ మధ్య ఉన్న సంబంధాలు వెల్లడయ్యాయి. పాక్ సైన్యం తమపై దాడులు విరమించు కుంటే... వారిపై తెహ్రీక్-ఎ-తాలిబన్(టీటీపీ) దాడులు చేయకుండా చూస్తామని అల్ కాయిదా నేత ఒకరు ఐఎస్ఐతో బేరసారాలాడటం ఇందులో కనబడుతుంది. ఉగ్రవాదం వేళ్లూనుకోవడానికీ, విస్తరించడానికీ దానికి ప్రభుత్వాలపరంగా అందు తున్న అండదండలే కారణమని లాడెన్ పత్రాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఒక దేశంలో ఉగ్రవాది మరోచోట దేశభక్తుడు కావొచ్చునని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషార్రఫ్ ఎప్పుడో అన్నారు. అలా అనుకోవడంవల్లే లష్కరే తొయిబావంటి సంస్థలకు ఆ దేశ పాలకులు అండగా నిలిచారు. చివరకు ఆ ఉగ్రవాదం వారినే కాటేసే స్థాయికి చేరింది. లిబియా, సిరియా వంటి దేశాల్లో తమ చర్యలవల్ల ఉగ్రవాద ముఠాలు లాభ పడుతున్నాయని...తమ ఆయుధాలు, డబ్బు ఆ ముఠాలకు చేరుతున్నదని తెలిసినా అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలూ తమ వైఖరిని మార్చుకోలేదు. ఫలితంగానే ఐఎస్ఐఎస్ ఇరాక్, సిరియావంటిచోట్ల మారణ హోమాన్ని సృష్టిస్తున్నది. లాడెన్ పత్రాలనుంచి గుణపాఠాన్ని గ్రహిస్తే...ఇకపై సరిగా వ్యవహరిస్తే ఉన్నంతలో పరిస్థితి మెరుగవుతుందని అమెరికా తదితర దేశాలు గుర్తించాలి. -
హిందూ జాతి మనుగడకు నలుగుర్ని కనాలి
⇒ తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ వ్యాఖ్య హైదరాబాద్: దేశంలో హిందూ జాతి మిగలాలంటే ఇంటికి నలుగురు పిల్లలను కనాలని, లేకపోతే జాతి మనుగడ సాగించదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ అన్నారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే స్మారక పోటీల విజేతల బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ సభలో స్వామిగౌడ్ మాట్లాడుతూ.. ఏ ఇజాలు లేని రోజుల్లోనే నిజాలు మాట్లాడిన మహాత్ముడు జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. శెట్టిబలిజ, గౌడ, కలాయి, కౌండిన్య తదితర గౌడ్ కులస్తులందరికీ ఒకే తీరు రిజర్వేషన్లు అమలుపై బీసీ కమిషన్‌కు పూర్తి వివరాలు అందజేశానని పేర్కొన్నారు. బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు డాక్టర్. కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. బహుజనులు తెచ్చుకున్న తెలంగాణలో వారిని విస్మరిస్తే మరో పోరాటం ప్రారంభమవుతుందన్నారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి ఎ. రామలింగేశ్వరరావు మాట్లాడుతూ దేశ చరిత్రను పాక్షికంగానే రాశారని అందులో మహాత్ముల చరిత్రలు ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంజుల అనగానిని ఘనంగా సన్మానించారు. వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. -
గమ్మత్తయిన నిజాలు
బీరు.... నీరు, తేనీరు తరువాత మనిషి నోరు తడుపుకోవడానికి ఎక్కువగా వాడే ద్రవపదార్థం. బీసీ కాలం నుంచి బీరు జీవులు మనుగడలోనే ఉన్నారు. మత్తెక్కించే బీరు గురించి కొన్ని గమ్మత్తై నిజాలు... 1814లో లండన్‌లో బీరు ఒలికిందట. ఒకటో, రెండో చుక్కలు కాదు... 3,88,000 గ్యాలన్లు! ఒక్కసారిగా లండన్‌లోని ఓ బారీ వాట్ (బీరుని నింపి వుంచే ట్యాంక్) పగలడంతో నిజంగానే బీరు ఏరులై పారింది. అకీలా అనే నక్షత్ర కూటమిలో ఒక భారీ మేఘం ఉంది. విచిత్రం ఏంటంటే, ఆ మేఘం మిథైల్ ఆల్కహాల్ (బీరులో ఉండే ముఖ్యమైన రసాయనం) తో నిండి ఉంది. దానితో 400 ట్రిలియన్ ట్రిలియన్ పైంట్స్ బీరుని తయారుచేయొచ్చు. బీరులో ఫ్యాట్ పర్సంటేజ్ జీరో. జపాన్ వాళ్లు అంతరిక్షంలో బార్లీని పండించి, ఆ గింజలతో బీరుని తయారుచేశారట! దానికి ‘స్పేస్ బార్లీ’ అని పేరు పెట్టి, లాటరీ ద్వారా విక్రయించారు. వచ్చిన ఆదాయాన్ని చారిటీ కోసం వినియోగించారు. మధ్యయుగంలో మంచినీళ్ల కన్నా బీరునే ఎక్కువ తాగేవారట. అందుకు కారణం అప్పటి మంచినీటిలో క్రిములు ఎక్కువగా ఉండడమే! బీరులోని ఆల్కహాల్ ఆ క్రిములని నశింపజేయడంతో ఆ నీరు శుద్ధి అయ్యేదట! చంద్రమండలం నుండి సేకరించబడిన శకలాలను పొడి చేసి ‘సెలెస్ట్ - జువెల్ - ఏల్’ అనే బీరుని ‘డాగ్‌ఫిష్ హెడ్’ అనే అమెరికన్ బీర్ కంపెనీ తయారుచేసింది! చేస్తోంది కూడా! సెనోసిల్లిసెఫోబియా (CENOSILLICEPHOBIA)ఖాళీ బీర్ గ్లాసుని చూస్తే కలిగే ఫోబియా. ఆటమిక్ మోడల్‌తో నోబెల్ ప్రైజ్ సంపాదించిన నీల్స్‌బోర్‌కి అందిన బహుమానం ఒక స్థానిక బీర్ కంపెనీ నుండి అతని ఇంటికి బీర్ పైప్‌లైన్! అతనింట్లో కుళాయి విప్పితే బీరు వస్తుందన్నమాట! ప్రపంచ వింతల్లో ఒకటైన గీజా పిరమిడ్ల నిర్మాణంలో సహాయం చేసిన కూలీలకు జీతం ఏంటో తెలుసా! నాలుగు లీటర్ల బీరు! స్వేదానికి మద్యం పథకం! మ్యాథ్యూ హాగ్ బాడీ... ఒక పెద్ద బీర్ ఫ్యాక్టరీ! అతని శరీరం అచ్చంగా బీరుని తయారుచేస్తుంది. ఆటో ఫెర్మంటేషన్ సిండ్రోమే దానికి కారణం. అతని పేగులలో ‘ఈస్ట్’ బ్యాక్టీరియా చిక్కుకుపోయి ఉండడంతో అతను బార్లీ, బ్రెడ్ లాంటివి తింటే, అవి ఈస్ట్‌తో కలిసి బీరులా మారుతుందట! దాని వల్ల 24 గంటలూ హ్యాంగోవర్లోనే ఉంటున్నాడట పాపం! -
భారీగా గంజాయి స్వాధీనం
వ్యాన్ సీజ్.. ఇద్దరు వ్యక్తులు అరెస్టు నర్సీపట్నం టౌన్, న్యూస్‌లైన్: చింతపల్లి నుంచి విశాఖపట్నం తరలిస్తున్న 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సీఐ జగన్మోహన్రావు తెలిపారు. గంజాయిని తరలించేందుకు ఉపయోగించిన వ్యాన్‌ను సీజ్ చేశారు. శనివారం సీఐ విలేకరులతో మాట్లాడుతూ చింతపల్లి నుంచి వ్యాన్‌లో గంజాయి తరలిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు తమ సిబ్బందితో దాడులు నిర్వహించామన్నారు. ఎక్సైజ్, పోలీసుల భయంతో సదరు వ్యాన్ దారి మళ్లించి పాకలపాడు గ్రామం మీదుగా వస్తుండగా మర్రిపాలెం వంతెన వద్ద పట్టుకున్నామన్నారు. వ్యాన్‌తో పాటు ఏటిగైరంపేటకు చెందిన కాళ్ల అప్పలనాయుడు(30), నాతవరం మండలం బెన్నవరం గ్రామానికి చెందిన దమ్ము రాజు(30) ఆదుపులోకి తీసుకున్నామన్నారు.వీరు కూలీ పని నిమిత్తం వెళ్లినట్టు విచారణలో తేలిందన్నారు. గంజాయి తరలించడానికి ప్రధాన కారుకుడు, వ్యాన్ యజమాని అయిన చింతపల్లి మండలం, ఎర్రబొమ్మలు గ్రామానికి చెందిన బన్నిపై కేసు నమోదు చేశామన్నారు. ఈ గంజాయిని విశాఖపట్నం షీలానగర్ తరలిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. దీని విలువ రూ.25 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై శ్రీనివాసరెడ్డి, కానిస్టేబుల్ బొంజన్న పాల్గొన్నారు. రోలుగుంట: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. సీఐ కృష్ణవర్మ, ఎస్సై కృష్ణారావు రత్నం పేట-బీబీ.పట్నం రూట్లో ఆదివారం ఉదయం జరిపిన సోదాల్లో 40 కిలోల గంజాయితో ఇద్దరు వ్యక్తులు దొరికిపోయారు. బి.పట్నం-రత్నంపేట రూటులో పోలీసులు పెట్రోలింగు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు గోనె సంచుల్లో నింపిన గంజాయి ప్యాకింగ్లతో వాహనంలో తరలించడానికి పక్షుల చెరువు వద్ద తారసపడ్డారు. అనుమానం వచ్చి పరిశీలించగా గంజాయి బయటపడింది. ఈ సందర్భంగా రత్నంపేటకు చెందిన బత్తిన శ్రీను(26) బుదిరెడ్ల చెల్లినాయుడు(25)అను అరెస్టు చేశామని పోలీసులు వివరించారు.