నిరుద్యోగులైన యువతీయువకులకు ఆశలు చూపించి దోపిడీ పర్వానికి చంద్రబాబు తెరలేపారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ ఎలా వెలుగులోకి వచ్చింది.? ఇందులో బాబు పాత్ర ఏంటీ.? తీగలాగితే.. డొంక ఎలా కదిలింది.. కేసు విచారణలో బయటపడ్డ వాస్తవాలను పరిశీలిస్తే..
♦జీవో నెంబర్-47లోని పారాగ్రాఫ్ నెంబర్-35లో అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఏర్పాటుపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా క్యాబినెట్ అనుమతి లేకుండా ఎలాంటి కార్పోరేషన్ ఏర్పాటు చేయకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు.
♦జీవో నెంబర్-2452లోని పారాగ్రాఫ్ నెంబర్-153లో పైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ చాలా స్పష్టంగా నిధుల విడుదలకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇందులో అప్పటి చీఫ్ సెక్రెటరీ ఐవైఆర్ కృష్ణారావు పారాగ్రాఫ్ నెంబర్-27లో నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు ♦తెలిపారు.
♦ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నిధులు విడుదల చేయాల్సినందిగా చీఫ్ సెక్రెటరీ ఐవైఆర్ కృష్ణారావు చెప్పినట్లు అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ స్పష్టంగా నోట్ఫైల్ రాశారు. ఈ ప్రాజెక్టులో నిధుల విడుదలపై మరోసారి పరిశీలించాల్సిందిగా జీవోనెంబర్-2452లో పారాగ్రాఫ్ నెంబర్-160లో అప్పటి ఆర్ధిక శాఖ కార్యదర్శి శ్రీమతి సునీత చాలా స్పష్టంగా అప్పటి ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరికీ నివేదించింది.
♦దీనిపై మరోసారి ఆలోచించిన ఆర్ధికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పారాగ్రాఫ్ నెంబర్-161, 162లో చీఫ్ సెక్రెటరీగా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు వెంటనే నిధులు విడుదల చేయాల్సిందిగా తనతో మాట్లాడినట్లు నోట్ ఫైల్‌లో రాశారు. సుబ్బారావు తనతో కలిసి నిధులు వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు జీవోలోని 46వ పేజీ ,పారాగ్రాఫ్-31లో ఉన్నట్లు అప్పటి సీఎస్ ఐవైఆర్ చెప్పడం వల్ల దానిన అమలు చేసినట్లు ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి పివిరమేష్ స్పష్టంగా రాశారు.
♦2015లో వివిధ దఫాలుగా రూ.371 కోట్ల రూపాయల బడ్జెట్ ఆర్డర్లు రిలీజ్ అయ్యాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన యంత్రాలపై అప్పటి ఆర్ధికశాఖ సెక్రెటరీ సునీత అభ్యంతరాలు చెప్పినప్పటికీ చంద్రబాబు ఆదేశాలతో నిధులు విడుదల చేశారు. ఈ స్కాంకు సంబంధించి 14.05.2018లో తొలిసారిగా పూనేలోని జీఎస్టీ కార్యాలయానికి ఫిర్యాదు అందింది.
♦దీనికి సంబంధించి జీఎస్టీ అధికారులు ఏపీ అవినీతి నిరోధక శాఖకు ఈ ఫిర్యాదును బదిలీ చేశారు. డిజైన్టెక్ సంస్థ ఫేక్ ఇన్వాయిస్లతో సర్వీస్ టాక్స్ ఎగ్గొట్టిందని ఫిర్యాదు సారాంశం. దీనికి సంబందించి చంద్రబాబుతో సహా అందరికి సమాచారం ఉన్నా ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డిజైన్ టెక్ వ్యవహారం బయటకు రావడంతో చంద్రబాబు అండ్ కో సాక్ష్యాధారాలను మాయం చేసింది. ఏకంగా 30.06.2016న విడుదలైన జీవో నెంబర్-4కు సంబంధించిన ఒరిజినల్ నోట్ ఫైల్.. సుబ్బారావు ఓఎస్డీ ఎన్వీకే ప్రసాద్(ఏ-5) ద్వారా మాయం చేశారు.
చదవండి: ఏమో.. తెలియదు.. గుర్తు లేదు.. సీఐడీ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు
Comments
Please login to add a commentAdd a comment