‘‘నేను ఏ సినిమా చేసినా మంచి సినిమా చేస్తున్నాననే తృప్తి నాకు మిగలాలి. అంతకుమించి నాకు వేరే ఏ అంచనాలూ ఉండవు. ‘పాగల్’ చేస్తున్నప్పుడు మంచి సినిమా, మంచి పాత్ర చేస్తున్నాననే ఫీల్ కలిగింది’’ అన్నారు నివేదా పేతురాజ్. విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా ‘దిల్’ రాజు – బెక్కెం వేణుగోపాల్ నిర్మాణంలో వస్తోన్న చిత్రం ‘పాగల్’. నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలతోంది. ఈ సందర్భంగా నివేదా పేతురాజ్ మాట్లాడుతూ – ‘‘రెండేళ్ల క్రితం నరేశ్‌గారు ఈ సినిమా కథ చెప్పారు. ఒక్కసారి కాదు.. ఐదు సార్లు కథ చెప్పారు. వింటున్నప్పుడే ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. కథ విన్న ప్రతిసారీ కన్నీళ్లు పెట్టుకున్నాను. నరేశ్‌గారు కథ చెప్పినప్పుడల్లా బెక్కెం వేణుగోపాల్‌గారు కూడా ఉన్నారు.
ఈ కథను ‘దిల్’ రాజుగారు కూడా బాగా నమ్మారు. నరేశ్ ఎంత ఎమోషనల్‌గా కథ చెప్పారో అంతే బాగా తీశారు. ప్రేమలో ఉన్నవారందరూ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. ఇందులో నా క్యారెక్టర్ సీరియస్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల.. వైకుంఠపురములో’ వంటి చిత్రాల్లో దాదాపు సీరియస్ క్యారెక్టర్సే చేశారు.. మళ్లీ ‘పాగల్’లోనూ అలాంటి క్యారెక్టరే చేయడానికి కారణం? అనే ప్రశ్న నివేద ముందుంచితే– ‘‘కారణం నాకూ తెలియదు. బహుశా నా లుక్స్, ప్రవర్తన చూసి నాకు సీరియస్ క్యారెక్టర్స్ బాగా సూట్ అవుతాయని ఇస్తున్నారేమో! నేను చూడటానికి సీరియస్ అమ్మాయిలా కనపడతాను. కానీ నిజానికి నేనలా ఉండను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘వేరే ఫీల్డ్‌లో అవగాహన పెంచుకోవాలని రీసెంట్‌గా రేసింగ్‌లో ఫస్ట్ లెవల్ పూర్తి చేశాను. రేసింగ్ ట్రైనింగ్ అప్పుడే కొత్త సినిమాలు కమిట్ అయ్యాను. తెలుగులో ఒకటి, తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను’’ అని నివేదా పేతురాజ్ అన్నారు.
నిజానికి నేను అలాంటిదాన్ని కాదు!
Published Mon, Aug 9 2021 11:39 PM | Last Updated on Tue, Aug 10 2021 1:45 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment