గ్లామర్ పాత్రలతో మెరిసిన నయనతార ‘గ్లామర్’కు మాత్రమే పరిమితం కాలేదు. ‘శ్రీరామరాజ్యం’ ‘అనామిక’ ‘గాడ్‌ఫాదర్’లాంటి సినిమాలతో నటిగా మెప్పించింది. ఫిమేల్ – సెంట్రిక్ ఫిల్మ్ అనగానే తన పేరు గుర్తుకు వచ్చేలా చేసుకుంది. ‘లేడీ అమితాబ్’గా పేరు తెచ్చుకుంది. సినిమా ఫీల్డ్‌కి రాక ముందు నయనతార మోడలింగ్, టీవీ షోలు చేసేది. ఒక టీవీలో ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ షో ‘చమయం’ చేసేది.
నయనతార అసలు పేరు డయాన మరియం కురియన్. ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ చేసిన డయాన(నయన) కాలేజీ రోజుల్లోనే పార్ట్–టైమ్‌గా మోడలింగ్, టీవి యాంకరింగ్ చేసేది. ఆమె మోడలింగ్ స్కిల్స్ చూసిన మలయాళం డైరెక్టర్ సత్యన్ ‘మనసినక్కరే’ సినిమాతో వెండితెరకు పరిచయం చేశాడు. ఆ సినిమాలో ‘గౌరి’ పాత్రలో నటించిన నయనతార నిన్నా మొన్నటి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘జవాన్’లోని ‘నర్మదా రాయ్’ పాత్ర వరకు నటనలో ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకుంటూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment