Lady oriented movies
-
గ్లామర్, డ్యాన్స్‌లకు మాత్రమే పరిమితం కాదని నిరూపించిన హీరోయిన్లు
డ్యాన్స్ మాత్రమే వచ్చా? అలా అంటారేంటీ.. ఫైట్స్ కూడా చేస్తారు. కాకపోతే ఆ ఒక్క చాన్స్ రావాలి. ఆ చాన్స్ వచ్చినప్పుడు హీరోయిన్లు యాక్షన్‌లోకి దిగుతారు. అలా కొందరు కథానాయికలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు ఉమెన్ సెంట్రిక్ సినిమాలు పెరిగాయి. ఈ మహిళా దినోత్సవానికి కథానాయికల పరంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఇక సినిమాలో సమస్యలపై పోరాడుతున్న హీరో‘యిన్ యాక్షన్’ గురించి తెలుసుకుందాం. యువతి పోరాటం ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’.. ఇలా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో అనుష్కా శెట్టి సూపర్ హిట్. తాజాగా ఆమె మరో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ సైన్ చేశారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. ఆంధ్రా – ఒడిస్సా సరిహద్దు లొకేషన్స్‌లో ఇటీవల షూటింగ్ జరి΄ారు. ఓ యువతి పోరాటంతో సాగే ఈ సినిమాకు ‘శీలవతి’ టైటిల్‌ను అనుకుంటున్నారట. సత్యభామ పోలీసాఫీసర్ సత్యభామగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’. ఓ అమ్మాయి హత్య కేసులో నిజమైన దోషులను పోలీస్ ఆఫీసర్ సత్యభామ ఏ విధంగా పట్టుకుంది? అనే అంశంతో ఈ సినిమా సాగుతుంది. సుమన్ చిక్కాల దర్శకత్వంలో బాబీ తిక్క, శ్రీనివాసరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే హిందీలో కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ చేసిన ‘ఉమ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. డిటెక్టివ్ అను ఓ కొత్త చిత్రం కోసం చెన్నైలో డిటెక్టివ్ ఏజెన్సీ ఆరంభించనున్నారు శ్రుతీహాసన్. ఈ సినిమాకు ఫిలిప్ జాన్ దర్శకుడు. ఇందులో డిటెక్టివ్ అను ΄ాత్రలో కనిపిస్తారు శ్రుతీహాసన్. ఈ సినిమాకు ‘ది చెన్నై స్టోరీ’ అనే టైటిల్ అనుకుంటున్నారట. తన నాన్న ఆచూకీ తెలుసుకోవాల్సిందిగా ఓ ఇంగ్లిష్ కుర్రాడు చెన్నైకి వచ్చి, డిటెక్టివ్ అనుని కలిశాక ఏం జరిగింది? అనే అంశం చుట్టూ ఈ సినిమా ఉంటుంది. అలాగే శ్రుతీహాసన్ నటించిన ఇంగ్లిష్ చిత్రం ‘ది ఐ’. చనిపోయిన భర్త అస్తికలను సముద్రంలో కలిపేందుకు మరో చోటుకు వెళ్లిన ఓ మహిళ ఎలాంటి నిజాలు తెలుసుకుంది? ఎవరెవర్ని హత్య చేయాలనుకుంటుంది? అనే కోణంలో ఈ సినిమా సాగుతుందట. కాలేజ్ స్టూడెంట్ రష్మికా మందన్నా తొలిసారి రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘చిలసౌ’ (2018)తో దర్శకుడిగా హిట్టైన నటుడు రాహుల్ రవీంద్రన్ ఇటీవల ‘ది గాళ్ ఫ్రెండ్’ కోసం మళ్లీ మెగాఫోన్ పట్టారు. ఈ సినిమాలో రష్మికా మందన్నా లీడ్ రోల్ చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఇందులో రష్మిక కాలేజ్ స్టూడెంట్ రోల్ చేస్తున్నారని తెలిసింది. ఓ కాలేజ్ స్టూడెంట్ ప్రేమ, సంఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందన్నట్లుగా తెలుస్తోంది. రష్మిక నటిస్తున్న మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రెయిన్ బో’. ఈ సినిమాకు శాంతరూబన్ దర్శకుడు. ఓ మనిషి తన జీవితంలో ఎదుర్కొనే వివిధ దశల పరిస్థితులను ‘రెయిన్ బో’లో చెబుతున్నారట. హక్కుల కోసం పోరాటం ‘మహానటి’ (2018) సినిమాతో నటిగా తనలో ఎంత ప్రతిభ ఉందో నిరూపించుకున్నారు కీర్తీ సురేష్. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ‘రఘు తాతా’, ‘రివాల్వర్ రీటా’, ‘కన్నె వెడి’ వంటి మూడు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఉన్నాయి. ‘రఘు తాతా’కు సుమన్‌కుమార్ దర్శకుడు. బలవంతంగా హిందీ భాష నేర్చుకోవాలన్నప్పుడు ఓ యువతి ఏ విధంగా పోరాటం చేసింది? అనే కోణంలో ఈ సినిమా ఉంటుందట. అలాగే కీర్తి మరో ఫిల్మ్ ‘రివాల్వర్ రీటా’ కూడా పోరాటం నేపథ్యంలో సాగే సినిమాయే. ‘కన్నె వెడి’ సినిమాకు గణేశ్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక హీరోయిన్గా ‘బేబీ జాన్’ చిత్రంతో హిందీకి పరిచయం అవుతున్నారు కీర్తి. గీతాంజలి మళ్లీ వచ్చింది తెలుగు హీరోయిన్ అంజలి నటించిన తొలి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘గీతాంజలి’. 2014లో విడుదలైన ఈ హారర్ కామెడీ ఫిల్మ్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ వస్తోంది. అంజలి మెయిన్ లీడ్ రోల్ చేశారు. ఏప్రిల్ 11న విడుదల కానుంది. శివ తుర్ల΄ాటి దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్ నిర్మించిన ‘గీతాంజలి 2’ అంజలి కెరీర్లో 50వ చిత్రం కావడం విశేషం. ఓ ఇంట్లో చోటు చేసుకునే హారర్ ఎలిమెంట్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. రోడ్ ట్రిప్ హీరోయిన్లు అనుపమా పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్, సంగీత కలిసి రోడ్ ట్రిప్‌కు వెళ్లారు. వెకేషన్ కోసం కాదు.. సినిమా కోసమే. రోడ్ ట్రిప్ నేపథ్యంలో ‘సినిమా బండి’ ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, దర్శన, సంగీత లీడ్ రోల్స్ చేస్తున్నారు. సెల్ఫ్ డిఫెన్స్ వరుసగా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తున్నారు హన్సిక. గత ఏడాది హన్సిక మెయిన్ లీడ్ రోల్ చేసిన ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’, ‘105 మినిట్స్’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఈ ఏడాది మరో రెండు రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి. తమిళ ‘గార్డియన్’ చిత్రం నేడు విడుదల అవుతోంది. కాగా హన్సిక సైన్ చేసిన ‘రౌడీ బేబి’ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. జేఏమ్ రాజశరవణన్ ఈ మూవీకి దర్శకుడు. ఇవి కాకుండా హన్సిక చేతిలో మరో రెండో ఉమెన్ సెంట్రిక్ చిత్రాలు ఉన్నాయి. ఇలా మరికొందరు హీరోయిన్లు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌కి సై అన్నారు. -
సీన్ మారింది
పెళ్లయిన కథానాయికలు సినిమాల్లో కొనసాగాలంటే ‘కీ’ రోల్స్‌తో సరిపెట్టుకోవాల్సిందే అనే సీన్ మారిపోయింది. పెళ్లయినా, తల్లయినా ‘లీడ్’ రోల్స్ చేయొచ్చనే సీన్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఫార్టీకి దగ్గర్లో, ఫార్టీ ప్లస్ తారలు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ లీడ్ లేడీస్‌గా, రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూ దూసుకెళుతున్నారు. హాలీవుడ్లో ఫార్టీ, ఫిఫ్టీ ప్లస్ తారలు కూడా లీడ్ రోల్స్ చేస్తున్నట్లు ఇండియన్ హీరోయిన్లు చేయడం ఓ శుభ పరిణామం. ఇక ఆ కథానాయికలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. ►లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న నయనతార చేతిలో ఎప్పుడూ మూడు నాలుగు సినిమాలు ఉంటాయి. వాటిలో లేడీ ఓరి యంటెడ్ మూవీస్ మినిమమ్ మూడు అయినా ఉంటాయి. ప్రస్తుతం ఆమె కథానాయికప్రాధాన్యంగా చేస్తున్న చిత్రాల్లో ‘అన్నపూరణి’ (అన్నపూర్ణ), ‘టెస్ట్’ ఉన్నాయి. ‘అన్నపూరణి’ నయనకి 75వ చిత్రం. డిసెంబరు 1న విడుదల కానున్న ఈ చిత్రంలో బ్రాహ్మణ యువతిగా నటించారు నయన. ఈ చిత్రం టీజర్లో మాంసాహారానికి సంబంధించిన బుక్ చదువుతూ కనిపించారామె. ఇక మరో చిత్రం ‘టెస్ట్’. ఇందులో మాధవన్, సిద్ధార్థ్, నయనతార లీడ్ రోల్స్‌లో కనిపిస్తారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ముగ్గురి జీవితాలు క్రికెట్‌తో ఎలా ముడిపడ్డాయనేది ఈ చిత్రం కథాంశం. ► హీరో సూర్యను పెళ్లి (2006) చేసుకుని సుమారు పదేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన జ్యోతిక 2015 నుంచి ఇప్పటివరకూ దాదాపు డజను కథానాయికప్రాధాన్యంగా సాగే చిత్రాల్లో నటించారు. ఆ తరహా చిత్రాలు మరిన్ని చేయడానికి కథలు వింటున్న జ్యోతిక ఇరవయ్యేళ్ల తర్వాత ఇటీవల హిందీలో ‘శ్రీ’, ‘బ్లాక్ మ్యాజిక్’ చిత్రాల్లో లీడ్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే మలయాళంలో ‘కాదల్–ది కోర్’ అనే చిత్రంలో ముమ్ముట్టితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. పదేళ్ల తర్వాత జ్యోతిక మలయాళంలో చేస్తున్న చిత్రమిది. ఇరవయ్యేళ్ల తర్వాత హిందీలో, పదేళ్ల తర్వాత మలయాళంలో సినిమాలు ఒప్పుకున్నారంటే నటిగా తన కెరీర్‌ని ఇంకా విస్తరించేలా జ్యోతిక ప్లాన్ చేసుకుంటున్నారని ఊహించవచ్చు. ►హీరో ఉపేంద్ర భార్య, నటి ప్రియాంక ఓ ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సింగిల్ లెన్స్‌తో తీసిన తొలి చిత్రం ‘క్యాప్చర్’లో ఆమె లీడ్ రోల్ చేశారు. ఒక నటి లీడ్ రోల్ చేసిన ఈ చిత్రానికి లీడ్ రోల్స్ చేస్తూ దూసుకెళుతున్న మరో నటి రాధికా కుమారస్వామి సమర్పకురాలిగా వ్యవహరించడం విశేషం. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఇలా ఏజ్‌తో సంబంధం లేకుండా తగ్గేదే లే అంటూ లీడ్ రోల్స్ చేస్తున్న తారలు ఇంకొందరు ఉన్నారు. ►కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భార్య, నటి రాధికా కుమారస్వామి ఒకేసారి రెండు ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలు ‘అజాగ్రత్త’, ‘భైరా దేవి’లో నటిస్తున్నారు. ‘భైరా దేవి’ సినిమాలో ఆమె అఘోరాగా కనిపించనున్నారు. ఇక ‘అజాగ్రత్త’ ఏడు భాషల్లో విడుదల కానుంది. మామూలుగా స్టార్ హీరోల చిత్రాలు పాన్ ఇండియాగా పలు భాషల్లో విడుదలవు తుంటాయి. కథానాయికప్రాధాన్యంగా సాగే ఓ సినిమా ఏడు భాషల్లో పాన్ ఇండియాగా రిలీజ్ కావడం అంటే చిన్న విషయం కాదు. ►నలభయ్యేళ్ల వయసులో ఉన్న తారల్లో త్రిష ఒకరు. ఈ బ్యూటీ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాల్లో కన్నా రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం అజిత్ సరసన తమిళంలో ‘విడా ముయర్చి’, మోహన్‌లాల్‌తో మలయాళంలో ‘రామ్’ చిత్రాల్లో నటిస్తున్నారు త్రిష. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘పొన్నియిన్ సెల్వన్ 2’లో యువరాణిగా కనిపించిన త్రిష గత నెల విజయ్ సరసన ‘లియో’తో పాటు ‘ది రోడ్’ అనే ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలో కనిపించారు. -
మరియం కురియన్ మరియు నయనతార
గ్లామర్ పాత్రలతో మెరిసిన నయనతార ‘గ్లామర్’కు మాత్రమే పరిమితం కాలేదు. ‘శ్రీరామరాజ్యం’ ‘అనామిక’ ‘గాడ్‌ఫాదర్’లాంటి సినిమాలతో నటిగా మెప్పించింది. ఫిమేల్ – సెంట్రిక్ ఫిల్మ్ అనగానే తన పేరు గుర్తుకు వచ్చేలా చేసుకుంది. ‘లేడీ అమితాబ్’గా పేరు తెచ్చుకుంది. సినిమా ఫీల్డ్కి రాక ముందు నయనతార మోడలింగ్, టీవీ షోలు చేసేది. ఒక టీవీలో ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ షో ‘చమయం’ చేసేది. నయనతార అసలు పేరు డయాన మరియం కురియన్. ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ చేసిన డయాన(నయన) కాలేజీ రోజుల్లోనే పార్ట్–టైమ్‌గా మోడలింగ్, టీవి యాంకరింగ్ చేసేది. ఆమె మోడలింగ్ స్కిల్స్ చూసిన మలయాళం డైరెక్టర్ సత్యన్ ‘మనసినక్కరే’ సినిమాతో వెండితెరకు పరిచయం చేశాడు. ఆ సినిమాలో ‘గౌరి’ పాత్రలో నటించిన నయనతార నిన్నా మొన్నటి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘జవాన్’లోని ‘నర్మదా రాయ్’ పాత్ర వరకు నటనలో ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకుంటూనే ఉంది. -
హీరోయిన్లా మజాకా.. యాక్షన్ తగ్గేదే లే!
ఒకరు తుపాకీ పట్టుకున్నారు.. ఇంకొకరు ఫ్లయిట్ ఎక్కారు... ఫైట్ చేయడానికి రెడీ అయ్యారు. ‘యాక్షన్‌కి సై’ అంటూ బరిలోకి దిగారు. ప్రత్యర్థులను రఫ్ఫాడారు. సుకుమారంగా కనిపించే కథానాయికలు రఫ్‌గా మారిపోయి, విలన్లను ఇరగదీశారు. సమంత, త్రిష, కీర్తీ సురేశ్, దీపికా పదుకోన్, కత్రినా కైఫ్, ఆలియా భట్, కృతీ సనన్ వంటి నాయికలు సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో యాక్షన్ రోల్స్ చేస్తున్నారు. ఆ విశేషాలు తెలుసుకుందాం. పవర్ఫుల్ రీటా ఓ వైపు హీరోయిన్గా అగ్రహీరోల సరసన నటిస్తూనే మరోవైపు కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో మెప్పిస్తున్నారు కీర్తీ సురేశ్. ప్రస్తుతం ఆమె లీడ్ రోల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘రివాల్వర్ రీటా’. చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ, థ్రిల్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ యాక్షన్ సీన్స్ చేస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌లో రెండు చేతుల్లో రెండు రివాల్వర్స్ పట్టుకుని ఉన్న కీర్తి పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా తెలుగులోనూ విడుదలకానుంది. కాగా ‘సైరన్, రఘు తాత, కన్ని వెడి’ వంటి చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు కీర్తీ సురేశ్. వీటిలో ‘కన్ని వెడి’ లేడీ ఓరియంటెడ్ మూవీ. ‘రఘు తాత’ కూడా దాదాపు ఇలాంటి సినిమానే. ఇక చిరంజీవి చెల్లెలిగా కీర్తి నటించిన ‘భోళా శంకర్’ ఈ 11న విడుదల కానున్న విషయం తెలిసిందే. బాలీ టు హాలీవుడ్ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ ఈ మధ్య ఎక్కువగా యాక్షన్ సినిమాలకు పచ్చజెండా ఊపుతున్నారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన షారుక్ ఖాన్ ‘పఠాన్’ మూవీలో యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టిన దీపిక ప్రస్తుతం ‘ఫైటర్’, ‘సింగం 3’ వంటి చిత్రాల్లో యాక్షన్ రోల్స్‌కి సై అన్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ‘ఫైటర్’ కోసం ప్రత్యేకంగా స్టంట్స్‌లో శిక్షణ తీసుకున్నారు దీపిక. అలాగే ‘సింగం’ ఫ్రాంచైజీలో భాగంగా ‘సింగం 3’ రూపొందనుంది. ‘సింగం’, ‘సింగం 2’ చిత్రాలు తెరకెక్కించిన రోహిత్ శెట్టి దర్శకత్వంలోనే ‘సింగం 3’ తెరకెక్కనుంది. ఈ మూడో భాగం హీరోయిన్ ఓరియంటెడ్‌గా సాగనుందట. ఇందులో దీపికా పవర్ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అలాగే ఓ హాలీవుడ్ మూవీలో ఏజెంట్‌గా కనిపించనున్నారట దీపిక. ఈ చిత్రంలోనూ ఆమె యాక్షన్ సీన్స్ చేయనున్నారని భోగట్టా. ఇలా బాలీవుడ్ టు హాలీవుడ్ యాక్షన్ రోల్స్ సైన్ చేసి జోరుగా దూçసుకెళుతున్నారు దీపికా పదుకోన్. టైగర్‌తో యాక్షన్ సల్మాన్ ఖాన్‌కి సమానంగా కాకపోయినా తనదైన శైలిలో ఫైట్స్ చేశారు కత్రినా కైఫ్. ‘టైగర్’ ఫ్రాంచైజీలో భాగంగా సల్మాన్ ఖాన్ టైటిల్ రోల్లో దర్శకుడు మనీష్ శర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘టైగర్ 3’. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్. హీరో హీరోయిన్లు ఇద్దరూ గూఢ చారుల పాత్రల్లో నటిస్తున్నారట. ఐఎస్ఐ ఏజెంట్ జోయా పాత్రలో కత్రినా కనిపించనున్నారని సమాచారం. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీలో జోయాగా కత్రినా చేసిన ఫైట్స్ హైలైట్‌గా ఉంటాయని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఈ ఫైట్స్ కోసం ప్రత్యేకించి సౌత్ కొరియాకు చెందిన స్టంట్ మాస్టర్ల దగ్గర 14 రోజులు శిక్షణ తీసుకున్నారట కత్రినా. ఈ చిత్రం నవంబర్ 10న రిలీజ్ కానుంది. యుద్ధ విమానం ఎక్కి.. దాదాపు లేడీ ఓరియంటెండ్ సినిమాలకే పరిమితమయ్యారు కంగనా రనౌత్. సర్వేష్ మేవారా దర్శకత్వంలో ఆమె లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘తేజస్’. ఈ చిత్రంలో ఆమె యుద్ధ విమానాలు నడిపే పైలెట్ పాత్ర చేశారు. కంప్లీట్ యాక్షన్ ఓరియంటెడ్‌గా రూపొందిన ఈ చిత్రం కోసం పలు యుద్ధ విద్యలు కూడా నేర్చుకున్నారు కంగన. ఇందుకోసం దాదాపు నాలుగు నెలల పాటు ఆమె శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంచితే.. కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’ చిత్రం నిర్మించారు. భారత ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ (1975–1977) ఎందుకు విధించారు? ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అనే అంశంతో ‘ఎమర్జెన్సీ’ని తెరకెక్కించారు. ఇందిరా గాంధీగా కంగన నటించిన ఈ చిత్రం నవంబరు 24న విడుదల కానుంది. అలాగే పి. వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా కంగన టైటిల్ రోల్లో రూపొందిన ‘చంద్రముఖి 2’ సెప్టెంబరు 19న విడుదల కానుంది. హాలీవుడ్లో యాక్షన్ అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్ ఆలియా భట్ కూడా యాక్షన్‌కి సై అన్నారు. టామ్ హార్పర్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ చిత్రం ‘హార్ట్ ఆఫ్ స్టోన్’లో ఆలియా కీలక పాత్ర చేశారు. స్పై యాక్షన్ మూవీగా రూపొందిన ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు ఆలియా భట్. ఈ నెల 11న ఈ సినిమా విడుదల కానుంది. బైక్‌పై దూసుకెళుతూ... ఇటీవల విడుదలైన ‘ఆది పురుష్’లో సుకుమారి సీతగా కనిపించిన కృతీ సనన్ ఇప్పుడు అందుకు పూర్తి విభిన్నంగా రూడ్‌గా మారిపోయారు. వికాస్ బాల్ దర్శకత్వం వహించిన ‘గణ్పథ్: పార్ట్ 1’లో ఆమె పవర్ఫుల్ రోల్ చేశారు. ఈ సినిమా కోసం కృతి అద్భుతమైన బైక్ స్టంట్స్ చేశారు. ఇందుకోసం బైక్ స్టంట్స్ నేర్చుకున్నారామె. అమితాబ్ బచ్చన్, టైగర్ ష్రాఫ్ నటించిన ఈ చిత్రం అక్టోబర్ 20న విడుదల కానుంది. ఇంతేనా.. ఇంకొందరు కథానాయికలు యాక్షన్ రోల్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, తామేంటో నిరూపించుకోవడానికి రెడీ అవుతున్నారు. వెబ్‌లో యాక్షన్ కొందరు కథానాయికలు వెండితెరపై యాక్షన్ రోల్స్ చేస్తుంటే త్రిష, సమంత వంటి తారలు వెబ్ సిరీస్‌లో ఈ తరహా పాత్రలు చేస్తున్నారు. రెండు దశాబ్దాల కెరీర్లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను పోషించిన త్రిష తొలిసారి ‘బృందా’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. సూర్య వంగల్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌లో త్రిష ఓ పవర్ పోలీసాఫీసర్ పాత్ర చేశారు. త్రిషలోని మాస్ ఇమేజ్‌ని బలంగా చూపించే పాత్ర ఇది. త్వరలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ఆ మధ్య వరుసగా హీరోల సరసన నటించిన సమంత ఇటీవల లేడీ ఓరియంటెడ్ చిత్రాలు ఎక్కువగా చేస్తున్నారు. ఈ బ్యూటీ నటించిన తొలి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మేన్ 2’. దర్శక ద్వయం రాజ్–డీకే తెరకెక్కించిన ఈ సిరీస్‌లో సమంత యాక్షన్ రోల్లో అదరగొట్టారు. ప్రస్తుతం సమంతతోనే ఈ దర్శక–ద్వయం ‘సిటాడెల్’ అనే మరో వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ప్రియాంకా చో్రపా నటించిన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ హిట్ డ్రామా ‘సిటాడెల్’ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. గూఢచారి సాహసాల నేపథ్యంలో పూర్తి స్థాయి యాక్షన్ సిరీస్‌గా రూపొందుతోంది. ఇందులో సమంత యాక్షన్ సీన్స్‌లో అలరించనున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. -
హీరో అక్కర్లేదు.. యంగ్ హీరోయిన్స్ దానికి సై
నాయికా ప్రాధాన్యంగా సాగే చిత్రాలు చేయడం అంటే అంత ఈజీ కాదు. కథానుసారం ఫైట్లు చేయాలి.. పవర్ఫుల్ డైలాగులు చెప్పాలి.. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకన్నా కాస్త ఎక్కువగానే ఎమోషన్ పండించాలి.. అవసరమైతే క్యారెక్టర్‌కి తగ్గట్టు సన్నబడాలి లేదా బరువు పెరగాలి లేదా నల్లటి మేకప్ వేసుకోవాలి. అన్నింటికీ మించి సినిమా మొత్తం ఆ నాయిక తన భుజాల మీద మోయాలి. ‘లేడీ ఓరియంటెడ్’ మూవీ అంటే పెద్ద సవాల్. అలాంటి సవాల్ వస్తే కాదనకుండా ఒప్పేసుకుంటారు కథానాయికలు. ప్రస్తుతం ముగ్గురు నాయికలు తొలిసారి ‘హాయ్ హాయ్ నాయికా’ అంటూ లేడీ ఒరియంటెడ్ మూవీకి సై అన్నారు. ఎమోషనల్ రెయిన్ బో రష్మికా మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ బ్యూటీ ఇప్పటివరకూ ఎక్కవగా కమర్షియల్ చిత్రాలే చేశారు. ‘రెయిన్ బో’ చిత్రంతో తొలిసారి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు రష్మికా మందన్నా. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని దర్శకుడు శాంత రూబన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ప్రధానంగా ఎమోషన్స్‌తో సాగుతుందట. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ మరో లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. ఈ చిత్రం వచ్చే ఏడాదిప్రారంభంలో రిలీజ్ కానుంది. రోడ్ ట్రిప్ మనాలి, లడఖ్ లొకేషన్స్‌తో ΄ాటు నార్త్‌లోని మరికొన్నిప్రాంతాల్లో రోడ్ ట్రిప్ చేస్తున్నారట హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్. ఇది పర్సనల్ ట్రిప్ కాదు... ్ర΄÷ఫెషనల్ ట్రిప్ అని తెలిసింది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ దర్శకత్వంలో రోడ్ ట్రిప్ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ లేడీ ఓరియంటెడ్ మూవీలో అనుపమా పరమేశ్వరన్ మెయిన్ లీడ్ రోల్ చేస్తుండగా, మలయాళ యంగ్ బ్యూటీ దర్శన, సీనియర్ నటి సంగీత లీడ్ రోల్స్ చేస్తున్నారు. ముగ్గురు మహిళల జీవితాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని టాక్. మరోవైపు ఈ సినిమా కంటే ముందే ‘బటర్ ఫ్లై’ అనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ చేశారు అనుపమా పరమేశ్వరన్. అయితే ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు అనుపమ చేస్తున్న చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. సో.. వెండితెరపై అనుపమ కనిపించనున్న తొలి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ఇదే అవుతుందనుకోవచ్చు. వచ్చె నెలలో ఆరంభం ‘సమ్మోహనం, వి, అంతరిక్షం, మహాసముద్రం’ వంటి తెలుగు సినిమాలతో నటిగా ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకున్నారు హీరోయిన్ అదితీరావ్ హైదరి. ఈ బ్యూటీ సౌత్‌లో ఫస్ట్‌టైమ్ ఓ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. దర్శక– నటుడు రాజేష్ ఎమ్. సెల్వ ఓ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ΄్లాన్ చేస్తున్నారని, ఈ చిత్రంలోని మెయిన్ లీడ్ క్యారెక్టర్‌కు అదితీరావ్ని ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే నెలలో చిత్రీకరణప్రారంభించుకోనున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. త్రిష, అనుష్క, కాజల్ అగర్వాల్, తమన్నా, నయనతార, సమంత వంటి తారలు ఇప్పటికే పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు మరికొందరు ఈ తరహా చిత్రాలపై మొగ్గు చూ΄ారు. వీరి స్ఫూర్తితో కొందరు యువకథానాయికలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు సైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. ∙ -
అదృష్టం అంటే త్రిషదే.. ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలు
అదృష్టం అంటే నటి త్రిషదనే చెప్పాలి. ఈమె కెరీర్ డౌన్ అయినప్పుడల్లా ఒక సూపర్ హిట్ చిత్రం వచ్చి ఆమెను సేవ్ చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు విన్నైతాండి వరువాయా చిత్రం త్రిష కెరియర్‌కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఆ తర్వాత మళ్లీ ఆమె డౌన్ ఫాల్ అయినప్పుడు 96 చిత్రం వచ్చి మరోసారి పైకి లేపింది. అదేవిధంగా ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రం త్రిషకు నటిగా పునర్జన్మను ఇచ్చిందనే చెప్పాలి. దీంతో త్రిష మళ్లీ బిజీ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ది రోడ్ అనే లేడీ ఓరియంటెడ్ కథా చిత్రంలో నటిస్తోంది. అదేవిధంగా లియో చిత్రంలో విజయ్‌తో రొమాన్స్ చేస్తోంది. ఇవి కాకుండా నటుడు అజిత్ నూతన చిత్రం విడా ముయర్చి లోనూ, మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ నటించనున్న 234వ చిత్రంలోనూ నటించే అవకాశం ఈ సంచలన నాటికే దక్కనున్నట్లు సమాచారం. ఇకపోతే మరోసారి హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంలో నటించడానికి త్రిష సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఈ క్రేజీ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మించనున్నారు. దీనికి గౌరవ్ నారాయణన్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో ముగ్గురు ప్రముఖ నటులు గెస్ట్ రోల్స్ పోషించనున్నట్లు తాజా సమాచారం. వారు ఎవరన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
లేడీ ఓరియంటెడ్ సినిమాలపై హీరోయిన్ల స్పెషల్ ఫోకస్!
సాధారణంగా నాయకులు కథలను నడిపిస్తారు.. ఆ కథల్లో నాయికలు ఆటాపాటలకు పరిమితం అవుతారు. కొన్నిసార్లు నాయికలే కథలను నడిపిస్తారు. ఆ కథల్లో ఆటాపాటలు కాదు.. ఫైట్లు ఎక్కువ ఉంటాయి. నాయికలు పవర్‌ఫుల్‌గా కనిపిస్తారు. ఇప్పుడు కొందరు కథానాయికలు లీడ్ రోల్స్‌లో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రాల గురించి తెలుసుకుందాం. లేడీ సూపర్ స్టార్ @ 75 స్టార్ హీరోల సరసన రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూ మరోవైపు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్‌తో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు నయనతార. ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలపైనే దృష్టి సారిస్తుంటారామె. అందులో భాగంగా ప్రస్తుతం నూతన దర్శకుడు నీలేష్ కృష్ణతో ఓ మూవీ చేస్తున్నారామె.నయనతార కెరీర్లో ఇది 75వ చిత్రం. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సాగే ఈ సినిమా ప్రేక్షకులకు ఓ సందేశం కూడా ఇవ్వనుంది. ఇప్పటివరకూ నయనతార నటించిన చిత్రాల్లోకెల్లా భారీ బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందుతోంది. నాలుగు లీడ్ రోల్స్‌లో... తెలుగు, తమిళ భాషల్లో అరడజనుకుపైగా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు హన్సిక. వాటిల్లో నాలుగు చిత్రాల్లో లీడ్ రోల్స్ చేస్తున్నారీ బ్యూటీ. తెలుగులో ఆమె నటించిన ‘105 మినిట్స్’ (రాజు దుస్సా దర్శకుడు), ‘మై నేమ్ ఈజ్ శృతి’ (శ్రీనివాస్ ఓంకార్ డైరెక్టర్) సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అటు తమిళంలో జేఎం రాజా శరవణన్ దర్శకత్వంలో ‘రౌడీ బేబీ’, ఇగోర్ డైరెక్షన్లో ‘మాన్’ అనే సినిమాలు చేస్తున్నారు హన్సిక. నేనేనా.. హీరోయిన్ రెజీనా పురావస్తు శాస్త్రవేత్తగా లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘నేనేనా’. కార్తీక్ రాజు దర్శకత్వంలో రాజశేఖర్ వర్మ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ (తమిళంలో ‘సూర్పనగై’) భాషల్లో విడుదల కానుంది. ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో రెజీనా ఒక హత్య కేసు విచారణ చేస్తుండగా అది దాదాపు వందేళ్ల క్రితం జరిగిన ఘటన అని తెలుస్తుంది. 1920, ప్రస్తుతం.. ఇలా రెండు కాలాల్లో సాగే ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. రెండు చిత్రాల్లో.. ఓ వైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తున్న కీర్తీ సురేశ్ మరోవైపు ఫీమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్‌కి గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆమె తమిళంలో ‘రఘు తాత’, ‘రివాల్వర్ రీటా’ అనే చిత్రాల్లో లీడ్ రోల్స్ చేస్తున్నారు. సుమన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘రఘు తాత’ చిత్రంతో హోంబలే ఫిలింస్ (కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార) తమిళంలో అడుగుపెడుతోంది. ఈ చిత్రంలో విప్లవ భావాలున్న అమ్మాయి పాత్రలో కీర్తి నటిస్తున్నారు. అదే విధంగా కీర్తి లీడ్ రోల్ చేస్తున్న మరో చిత్రం ‘రివాల్వర్ రీటా’. కె. చంద్రు దర్శకత్వంలో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులోనూ విడుదలయ్యే చాన్స్ ఉంది. రెయిన్బోలో కొత్తగా... దక్షిణాదిలోని స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్న రష్మికా మందన్న తొలిసారి ‘రెయిన్బో’ అనే లేడీ ఓరియంటెండ్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మికకు జోడీగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఇందులో రష్మిక వినూత్న పాత్రలో కనిపిస్తారు. -
హీరోలు లేకపోయినా.. సినిమాను నడిపించిన హీరోయిన్స్
సినిమాలో గ్లామర్ కావాలి.. అందుకేగా హీరోయిన్... స్పెషల్ సాంగ్ అదిరిపోవాలి... ఉన్నారుగా హీరోయిన్లు.. స్పెషల్ సాంగ్ చేసే తారలు.. ‘ఫీమేల్ స్టార్స్’ అంటే.. ఇంతకు మించి పెద్దగా ఆలోచించరు. హీరోయిన్లు కూడా గ్లామరస్ క్యారెక్టర్స్‌కి సై అంటారు. అయితే గ్లామర్‌కి అతీతంగా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ వస్తే వెంటనే ఒప్పేసుకుంటారు. సవాల్‌గా తీసుకుని ఆ పాత్రలను చేస్తారు. రిస్కీ ఫైట్స్ చేయడానికి కూడా వెనకాడరు. 2022 ఇలాంటి పాత్రలను చాలానే చూపించింది. హీరోయినే హీరోగా వచ్చిన లేడీ ఓరియంటెడ్ చిత్రాల గురిం తెలుసుకుందాం. ‘మహానటి’ (2018) చిత్రంలో సావిత్రి పాత్రలో అద్భుతంగా అభినయిం, లేడీ ఓరియంటెడ్ ఫిలింస్‌కి ఓ మంచి చాయిస్ అయ్యారు కీర్తీ సురేశ్. ఆ తర్వాత ఆమె ‘పెంగ్విన్ మిస్ ఇండియా వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేశారు. ఇక ఈ ఏడాది ‘గుడ్‌లక్ సఖి’, ‘సాని కాయిదమ్’ (తెలుగులో ‘చిన్ని’) వంటి కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నగేశ్ కుకునూరు దర్శకత్వంలో వచ్చిన ‘గుడ్‌లక్ సఖి’ జనవరి 28న థియేటర్స్‌లో విడుదలకాగా, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కింన ‘సాని కాయిదమ్’ మే 6 నుంచి డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ గ్రామీణ యువతి జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో ఎలా బంగారు పతకం సాధింంది? అన్నది ‘గుడ్‌లక్ సఖి’ కథ. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకునే ఓ కానిస్టేబుల్ ఆవేదన నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘చిన్ని’. ఇక ఇప్పటికే పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసిన ప్రియమణి ఈ ఏడాది ‘భామాకలాపం’ చేశారు. అభిమన్యు దర్శకత్వంలో రపొందిన ఈ సినివ ఫిబ్రవరి 11 నుం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో పక్కింటి విషయాలపై ఆసక్తి చూపిస్తూ, ఓ కుకింగ్ యూట్యూబ్ చానెల్‌ను రన్ చేసే అనుపమ ఇరుకుల్లో పడుతుంది. ఓ వ్యక్తి హత్యకి సంబంధింన మిస్టరీ నుంచి తనను కాపాడుకునే అనుపమ పాత్రను ప్రియమణి చేశారు. మరోవైపు ఐదారేళ్లుగా బాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ సినివలు చేస్తున్న తాప్సీ 2019లో వచ్చిన ‘గేమ్ ఓవర్’ తర్వాత తెలుగులో ఈ ఏడాది ‘మిషన్ ఇంపాజిబుల్’లో నటించారు. చైల్డ్ ట్రాఫికింగ్ (న్నారుల అక్రమ రవాణా) నేపథ్యంలో రపొందిన ఈ చిత్రానికి ఆర్ఎస్ స్వరప్ దర్శకుడు. చిన్నారులను చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా బారి నుం రక్షించే శైలజ పాత్రను తనదైన శైలిలో చేసి, మెప్పించారు తాప్సీ. ఏప్రిల్ 1న ఈ త్రం విడుదలైంది. ఇంకోవైపు నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలో నటింన ‘బ్లడీ మేరీ’ త్రం ఏప్రిల్ 15 నుం ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హ్యమన్ ట్రాఫికింగ్ ముఠా నేరాలకు మర్డర్, రివెంజ్ అంశాల టచ్ ఇచ్చి ఈ సినివను తెరకెక్కించారు చందు మొండేటి. అనాథ నర్సు మేరీ పాత్రలో నటించారు నివేదా పేతురాజ్. ఇక ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ (1996) తర్వాత ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఓ లీడ్ రోల్ చేసిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్‌కుమార్ దర్శకత్వంలో రపొందిన ఈ సినివలో టైటిల్ రోల్ చేశారు సుమ. అడిగినవారికి సాయం చేస్తూ, శుభ కార్యాలప్పుడు గ్రామస్తులకు ఈడ్లు (చదివింపులు) ఇచ్చే మంచి మనసు ఉన్న మనిషి జయమ్మ. హఠాత్తుగా జయమ్మ భర్తకు గుండెపోటు వస్తుంది. కానీ ఆ సమయంలో గ్రామస్తులు జయమ్మకు సహాయం చేయకపోగా, కొందరు విమర్శిస్తారు. ఆ తర్వాత జయమ్మ ఏం చేసింది? కుటుంబాన్ని ఎలా చక్క దిద్దుకుంది? అన్నదే కథాంశం. మే 6న ఈ సినిమా రిలీజైంది. ఇంకోవైపు పదేళ్ల తర్వాత అంటే 2012లో వచ్చిన ‘అందాల రాక్షసి’ చిత్రం తర్వాత హీరోయిన్ లావణ్యా త్రిపాఠి చేసిన మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌గా ‘హ్యాపీ బర్త్‌డే’అని చెప్పుకోవచ్చు. రితేష్ రానా తెరకెక్కింన ఈ చిత్రం జూలై 8న రిలీజైంది. దేశంలో గన్ కల్చర్‌ను ప్రోత్సహించే విధంగా ఓ కేంద్రమంత్రి గన్ బిల్లు ప్రతిపాదనను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఫ్యాంటసీ జానర్లో సాగే ఈ చిత్రంలో గన్ కల్చర్‌కు, హ్యాపీ అనే అమ్మాయి బర్త్‌డేకి ఉన్న సంబంధం ఏంటి? అనేది ప్రధానాంశం. ఇక ఈ ఏడాది వచ్చిన చిత్రాల్లో సౌత్ కొరియన్ ఫిల్మ్ ‘మిడ్నైట్ రన్నర్స్’ ఆధారంగా రీమేక్ అయిన చిత్రం ‘శాకినీ డాకినీ’. రెజీనా, నివేదా థామస్ టైటిల్ రోల్స్‌లో ఈ చిత్రాన్ని దర్శకుడు సుదీర్ వర్మ తెరకెక్కించారు. అమ్మాయిలను కిడ్నాప్ చేసి, అక్రమాలకు పాల్పడే ఓ ముఠా ఆట కట్టించే ఇద్దరు ఉమెన్ ట్రైనీ పోలీసాఫీసర్ల సాహసాల ఇతివృత్తంగా ఈ సినిమా సాగుతుంది. మరోవైపు సమంత తన కెరీర్లో దాదాపు యాభై సినివలు చేస్తే, వాటిలో ‘యూ టర్న్’, ‘ఓ బేబీ’... లాంటి లేడీ ఓరియంటెడ్ ఫిలింస్ కూడా ఉన్నాయి. ఈ జాబితాలో ఈ ఏడాది ‘యశోద’ చిత్రం చేరింది. సమంత టైటిల్ రోల్లో హరి–హరీష్ దర్శకత్వంలో రపొందిన ఈ చిత్రం నవంబరు 11న రిలీజైంది. సరోగసీ సాకుతో మహిళలపై అఫయిత్యాలకు పాల్పడే ఓ ముఠా గుట్టును పోలీస్ ఆఫీసర్ యశోద ఎలా బయటపెట్టింది? అనే నేపథ్యంలో ‘యశోద’ సినిమా సాగుతుంది. అలాగే సమంత టైటిల్ రోల్ చేసిన మరో చిత్రం ‘శాకుంతలం’ ఈ ఏడాదే విడుదల కావాల్సింది. అయితే వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఈ మైథలాజికల్ ఫిల్మ్‌కు గుణశేఖర్ దర్శకుడు. ఇక ఐదారేళ్లుగా ప్రతి ఏడాదీ నయనతార నటింన ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అయినా వీక్షకుల ముందుకు వస్తోంది. ఈ ఏడాది ఆమె నటింన ‘ఓ2’ త్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్లాట్ఫామ్లో జూన్ 17 నుం స్ట్రీమింగ్ అవుతోంది. జీఎస్ విఘ్నేష్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ కథలో పార్వతిని ట్రాప్ చేస్తారు. సడన్‌గా అక్కడ ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతాయి. ఆ పరిస్థితుల నుంచి పార్వతి ఎలా బయటపడింది? తన కొడుకును ఎలా కాపాడుకోగలిగింది? అన్నదే కథ. అలాగే నయనతార నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘కనెక్ట్’ ఈ నెల 22న రిలీజ్ కానుంది. ఇక అనుపమా పరమేశ్వరన్ నటింన తాజా చిత్రం ‘బటర్ ఫ్లై’. గంటా సతీష్ బాబు ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం ఈ 29 నుం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. వీరితో పాటు మరికొందరు హీరోయిన్లు ‘కథనాయిక ప్రాధాన్యం’గా సాగే చిత్రాల్లోనూ, వెబ్ సిరీస్‌లోనూ నటించారు. ఈ ప్రాజెక్ట్స్‌లో కొన్ని సక్సెస్ కాగా, కొన్ని ఫెయిల్ అయ్యాయి. అయితే నటనపరంగా మాత్రం హీరోయిన్లు హిట్టే. -
లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో ఇద్దరు హీరోయిన్లు, ఇప్పుడిదే ట్రెండ్!
లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. ఆ చిత్రాల్లో ఒకే ఒక్క హీరోయిన్ ఉంటారు. కానీ ఇప్పుడు ‘లేడీస్ ఓరియంటెడ్’ సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. ఒకే సినిమాలో ఇద్దరు ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. ఈ లేడీస్ ఓరియంటెడ్ సినిమాలపై ఓ లుక్కేద్దాం. బాలీవుడ్ అగ్ర తారలు ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్ ఓ రోడ్ ట్రిప్ ప్లాన్ చేశారు. నటుడు, దర్శకుడు, రచయిత ఫర్హాన్ అక్తర్ ఈ రోడ్ మ్యాప్‌కు డిజైనర్. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే.. ప్రియాంక, కత్రినా, ఆలియాలది పర్సనల్ ట్రిప్ కాదు.. ప్రొఫెషనల్ ట్రిప్. ఈ ముగ్గురూ కలిసి రోడ్ ట్రిప్ నేపథ్యంలో ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు ‘జీ లే జరా’ అనే టైటిల్ ఖరారు చేశారు. విశేషం ఏంటంటే.. పదేళ్ల తర్వాత ఫర్హాన్ అక్తర్ ‘జీ లే జరా’తో మళ్లీ దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ తర్వాత ఫర్హాన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదే. ఇక ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్ల రోడ్ ట్రిప్‌ను ఫర్హాన్ అక్తర్ ప్లాన్ చేస్తే.. హీరోయిన్లు దియా మిర్జా, సంజనా సాంఘీ, రత్నా పాఠక్ షాల రోడ్ ట్రిప్ మ్యాప్‌ను రైటర్ తరుణ్ దుడేజా రెడీ చేశారు. ఈ ట్రిప్‌కు ‘ధక్ ధక్’ అని టైటిల్ పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా బైక్స్‌పై ప్రయాణం చేయాలనుకునే ఈ ‘ధక్ ధక్’ టీమ్‌కు హీరోయిన్ తాప్సీ ఓ నిర్మాతగా సపోర్ట్ చేస్తుండటం విశేషం. భిన్న వ్యక్తిత్వాలు కలిగిన నలుగురు మహిళలు ఓ రోడ్ ట్రిప్‌లో కలుసుకున్నప్పుడు వారి ప్రయాణం ఏ విధంగా సాగింది? వారి అనుభవాలు ఏంటి? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ‘జీ లే జరా’, ‘ధక్ ధక్’ రోడ్ ట్రిప్ నేపథ్యంలో సాగే సినిమాలైతే.. ‘కరుంగాప్పియమ్’ సినిమా కథానాయికలు కాజల్ అగర్వాల్, రెజీనా, జనని, రైజా విల్సన్, ఇరాన్ దేశ అమ్మాయి నోయిరికాలు హారర్ స్టోరీతో ప్రయాణం చేస్తున్నారు. డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నలుగురు మహిళలు ఓ కామన్ పాయింట్‌తో కలుస్తారు. అయితే వారిలో ఒకరికి అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఒకరికి అతీంద్రియ శక్తులు ఉన్న విషయం మిగతావారికి తెలిసినప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? వారికి వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి ఈ శక్తులు ఎంత ఉపయోగపడ్డాయి? అనే అంశాల నేపథ్యంలో ‘కరుంగాప్పియమ్’ చిత్రకథ సాగుతుంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇంకోవైపు కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్లాన్ వేస్తున్నారు శాకిని అండ్ డాకిని. నివేదా థామస్, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శాకిని–డాకిని’. సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకుడు. సౌత్ కొరియన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ‘మిడ్నైట్ రన్నర్స్’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఇద్దరు లేడీ ట్రైనీ పోలీసాఫీసర్లు కిడ్నాపింగ్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా ఆటకట్టించడంలో ఎలా భాగస్వామ్యమయ్యారు అన్నదే కథ. ఇవే కాదు.. మరికొన్ని ‘లేడీస్ ఓరియంటెడ్’ చిత్రాలు సెట్స్‌పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాయి. చదవండి: కొడుకు ఫొటోను షేర్ చేసిన కాజల్.. ఈసారి ముఖం కనిపించేలా కోవిడ్‌కు ముందు 2020లో చివరిసారిగా కలిశాను: హీరోయిన్ -
లేడీస్ స్పెషల్ సినిమాలపై హీరోయిన్ల కన్ను!
బస్సుల్లో లేడీస్ స్పెషల్ బస్సులుంటాయి.. గుడిలో లేడీస్ స్పెషల్ క్యూలుంటాయి.. లేడీస్ స్పెషల్ టికెట్ కౌంటర్లుంటాయి... మరి సినిమాల్లో... ఇక్కడా లేడీస్ స్పెషల్స్ ఉంటాయి. స్పెషల్‌గా లేడీ ఓరియంటెడ్ సినిమాలు వస్తాయి. ఈ సినిమాలను కథానాయికలు సవాల్‌గా తీసుకుంటారు. ఆ ‘లేడీస్ స్పెషల్’ సినిమాల గురించి తెలుసుకుందాం. ‘అనామిక’, ‘మాయ’, ‘డోర’... ఇలా ఇప్పటికే కెరీర్లో పలు లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేసి, ప్రేక్షకులను మెప్పించారు నయనతార. ప్రస్తుతం ఆమె చేస్తున్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘కనెక్ట్’. 2015లో నయనతార నాయికగా ‘మాయ’ సినిమాను తెరకెక్కించిన అశ్విన్ శరవణన్ ఈ ‘కనెక్ట్’కు దర్శకుడు. ఇది థ్రిల్లర్ జానర్ మూవీ. ఈ చిత్రానికి నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మాతలు. ఇక 2007లో వచ్చిన ‘పరుత్తి వీరన్’లో అద్భుతంగా నటించి జాతీయ అవార్డు సాధించిన హీరోయిన్ ప్రియమణి లేడీ ఓరియంటెడ్ సినిమాలపై కూడా దృష్టి సారించారు. ఇటీవల హిట్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మేన్’లో ఓ లీడ్ రోల్ చేసి అందర్నీ మెప్పించిన ప్రియమణి చేతిలో ప్రస్తుతం ‘సైనైడ్’, ‘కొటేషన్ గ్యాంగ్’ అనే రెండు ఉమెన్ సెంట్రిక్ ఫిలింస్ ఉన్నాయి. ఈ రెండు చిత్రాలూ క్రైమ్ థ్రిల్లర్సే కావడం విశేషం. ‘సైనైడ్’ చిత్రానికి రాజేష్ టచ్‌రివర్ దర్శకుడు కాగా, ‘కొటేషన్ గ్యాంగ్’ చిత్రానికి వివేక్ దర్శకుడు. మరోవైపు ‘హ్యాపీ బర్త్‌డే’ అనే క్రైమ్ థ్రిల్లర్‌లో లావణ్యా త్రిపాఠి లీడ్ రోల్ చేస్తున్నారు. ‘మత్తువదలరా’ ఫేమ్ రితేష్ రాణా ఈ సినిమాకు దర్శకుడు. ఇక యాభై సినిమాలు చేసిన అనుభవం ఉన్న సమంత ఒక్కసారిగా లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్‌పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లున్నారు. మైథలాజికల్ ఫిల్మ్ ‘శాకుంతలం’, ‘యశోద’, ‘అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ చిత్రాలతో పాటు తెలుగు, తమిళ భాషల్లో శాంతరూబన్ అనే ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్‌లోనూ సమంత భాగమయ్యారు. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘శాకుంతలం’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో ఉంది. హరి అండ్ హరీష్ ద్వయం తెరకెక్కిస్తున్న ‘యశోద’ చిత్రం షూటింగ్ దశలో ఉండగా, మిగతా చిత్రాల రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కావాల్సి ఉంది. ‘శాకుంతలం’ చిత్రం ఈ ఏడాది వెండి తెరపైకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు డీకే దర్శకత్వంలో షూటింగ్ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్న తమిళ చిత్రం ‘కరుంగా ప్పియమ్’లో కాజల్ అగర్వాల్, రెజీనా ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఇక రెజీనా నటించిన మరో లేడీ ఓరియంటెడ్ సినిమా ‘శాకిని డాకిని’. ఇందులో నివేదా థామస్ మరో హీరోయిన్. సుధీర్‌వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్లో త్వరలో స్ట్రీమింగ్ కానుందని తెలిసింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలంటే కీర్తీ సురేష్ గుర్తు రాకుండా ఉండరు. దివంగత నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన ‘మహానటి’తో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌కు ఓ బెస్ట్ ఆప్షన్‌గా మారారు కీర్తి. ఈ చిత్రం తర్వాత కీర్తి ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ వంటి నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాలు చేశారు. తాజాగా చేసిన మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘గుడ్‌లక్ సఖి’. నగేశ్ కుకునూరు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఇటు దాదాపు తొమ్మిది ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న హన్సిక చేతిలో మూడు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఉన్నాయి. ‘మై నేమ్ శ్రుతి’, ‘105 మినిట్స్’, ‘రౌడీ బేబీ’.. హన్సిక చేస్తున్న ఉమెన్ సెంట్రిక్ మూవీస్ ఇవే. ఇంకోవైపు ఎప్పుడూ డిఫరెంట్ సినిమాలు చేయడానికి ముందు వరుసలో ఉండే సాయిపల్లవి ఇటీవల ఓ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ చేశారు. ఈ సినిమా వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక వీరితోపాటు మరికొందరు హీరోయిన్స్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌తో సెట్స్‌లో బిజీగా ఉన్నారు. కెరీర్ మొత్తంలో ఏ హీరోయిన్‌కి అయినా గ్లామర్ క్యారెక్టర్స్‌కే ఎక్కువగా అవకాశాలు వస్తుంటాయి. అందుకే కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు అవకాశం వస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. ఈ సినిమాలను ‘స్పెషల్’గా భావించి, హార్డ్ వర్క్ చేస్తారు. హిందీలో లేడీస్ స్పెషల్స్ బాలీవుడ్‌లోనూ లేడీ ఓరియంటెడ్ చిత్రాల హవా స్పష్టంగా కనిపిస్తోంది. బీ టౌన్ క్వీన్ కంగనా రనౌత్ చేతిలో ప్రస్తుతం మూడు (‘థాకడ్’, ‘ఎమర్జెన్సీ’, ‘తేజస్’) ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఉన్నాయి. అలాగే తాప్సీ చేతిలో ఐదు (శభాష్ మిథు’, దోబార’, లూప్ లపేట’, ‘బ్లర్’, ‘ఓ లడకీ హై కహాన్’) ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకా ‘ద్రౌపది’లో దీపికా పదుకోన్, ‘గుంగూబాయి కతియావాడి’లో ఆలియా భట్, ‘జీ లే జరా’లో ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్, ‘ది లేడీ కిల్లర్’లో భూమీ ఫడ్నేకర్, ‘ఉమ’లో కాజల్ అగర్వాల్, ‘చత్రీవాలీ’లో రకుల్‌ప్రీత్ సింగ్, ‘గుడ్‌లక్ జెర్రీ’లో జాన్వీ కపూర్... ఇలా మరికొందరు హీరోయిన్స్ ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే ఇలా లేడీ ఓరియంటెడ్ సినిమాలపైనా దృష్టి పెడుతున్నారు. -
సుమంగళి నుంచి ఫిదా వరకు
సాహిత్యానికి కొంత స్వేచ్ఛ ఉంది. సినిమా జనామోదానికి లోబడి ఉండాలి. జనం, అనగా పురుషులు, అనగా పురుష భావజాలం తమపై ఉందని తెలియని స్త్రీలు కూడా మెచ్చే సినిమాలు తీస్తేనే డబ్బులు వస్తాయి. తెలుగు సినిమా స్త్రీ పాత్రను పాపులర్ జనాభిప్రాయాల మేరకే చూపింది. అయినా కొన్నిసార్లు వెండి తెర మీద స్త్రీ పాత్రలు కాస్త వెలుతురు చూశాయి. కొన్ని మాటలు చెప్పాయి. తమ ముఖం చూపడానికి చిన్న అద్దాలు వద్దని చెప్పాయి. తెలుగు సినిమాల్లో స్త్రీలు ఏం చెప్పారు? తెలుగు సినిమాలు స్త్రీలకు ఏం చెప్పాయి. ప్రత్యేక కథనం. ‘సతీ’ అనే పదం ఉండాలి టైటిల్లో. సినిమాను మహిళా ప్రేక్షకులకు అలవాటు చేయడానికి సినిమా మొదలైన కొత్తల్లో సినిమా వారు చేసిన పని అది. ‘సతీ అనసూయ’,‘సతీ సావిత్రి’, ‘సతి సుమతి’... దేశ వ్యాప్తంగా ‘సతి‘ సినిమాలు వచ్చాయి. తెలుగులో ‘సతి తులసి’ కూడా తీశారు. ‘సతి’ ఏం చేయాలి? పతిని శిరసావహించాలి. కథలు సోషలైజ్ అయ్యాక కూడా ఇదే భావధారను తెలుగు సినిమా జనామోదం కోసం తీస్తూ వెళ్లారు. భర్త ప్రాణాల కోసం యమునితో పోరాడిన సతి ఉంది కాని భార్య ప్రాణాల కోసం పోరాడిన పతి లేడు. ∙∙∙ ‘శ్రీ లక్ష్మమ్మ కథ’ (1950) తెలుగు సినిమాల్లో స్త్రీలు ఎలా ఉండాలో గట్టిగా సుబోధ చేసిన చిత్రం. అక్కినేని, అంజలి దేవి నటించిన ఈ సినిమాలో అక్కినేని స్త్రీలోలుడిగా మారితే అంజలి దేవి అత్తారింటికి చేరి ఒక్కగానొక్క కూతురితో నానా బాధలు పడుతుంది. అయినా అక్కినేని మారడు. అయితే ఆమె సతి ధర్మాన్ని వీడదు. చివరకు ఆమెను బాధించినందుకు అక్కినేనికి కళ్లుపోతే ఆ కళ్లు తన ప్రార్థనా బలంతో రప్పించి ప్రాణాలు విడిచి దేవతలా కొలుపులు అందుకుంటుంది. శ్రీ లక్ష్మమ్మ మహిళా ప్రేక్షకులకు ఇలవేల్పు. చూడండి... భర్త తనకు దక్కకపోయినా భార్య భర్త కోసమే జీవించాలి. తన సుఖానికి పనికి రాకపోయినా భర్త కోసమే జీవించాలి. ‘సుమంగళి’ (1965) కథ ఇదే మాట చెబుతుంది. ఇందులో సావిత్రిని పెళ్లి చేసుకున్నాక అక్కినేనికి యాక్సిడెంట్ అవుతుంది. అతను వైవాహిక జీవితానికి పనికి రాడు. యోగ్యమైన వయసులో ఉన్న సావిత్రి భర్తనే సర్వస్వం అనుకుంటూ ఉంటుంది. ఆమె బాధ చూడలేక అక్కినేని అవస్థ పడతాడు. ఆమెకు మరో పెళ్లి చేయాలని ప్రయత్నిస్తాడు. భారతీయ వ్యవస్థలో స్త్రీ వివాహాన్ని ఎంత గౌరవించాలో చెబుతూ సుమంగళిగా వెళ్లిపోవడానికి సావిత్రి ఆత్మహత్య చేసుకుంటుంది. పై రెండు సినిమాల్లోనూ భార్యలు మరణించారు. భర్తలు జీవించారు. స్త్రీ సమస్యలను తెలుగు సినిమా పట్టించుకోలేదు. బహుశా కొద్దిపాటి బుద్ధులు, కొంచెం సంస్కారం నేర్పడం వరకు అది తన వంతు అనుకుంది. ‘మాలపిల్ల’ (1938) సినిమా వచ్చింది... అందులో బ్రాహ్మణ యువకుడు మాలపిల్లను వివాహం చేసుకుంటాడు నిజమే కాని అది సాంఘిక సంస్కరణ మాత్రమే పురుష సంస్కరణ కాదు. ‘వర విక్రయం’ (1939) సినిమా వచ్చింది. అందులో భానుమతి ‘స్వాతంత్య్రం లేదా స్త్రీలకు’ అని పాడింది. అయితే ఈ ధోరణి గట్టిగా కొనసాగలేదు. ఇంటి పట్టున ఉండటం స్త్రీ ధర్మం, సంపాదించుకు రావడం పురుషధర్మం కనుక ఇంటి పట్టున ఉన్న స్త్రీని శ్లాఘించి ఇంటి పట్టున ఉండటంలోని గొప్పతనం తెలియచేసే కథలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. ‘అర్థాంగి’ (1955), ‘మా ఇంటి మహాలక్ష్మి’ (1959), ‘దేవత’ (1965), ‘గృహలక్ష్మి’ (1967) ... ఇవి చాలా ఉన్నాయి. ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి’ అని పాటలు కట్టారు. అసలు ఇల్లాలు అంటే ఎలా ఉండాలో మోడల్ కూడా గట్టిగా చూపించారు. పాట సాగుతుండగా ఆమె తెల్లవారే లేస్తుంది.. ఎడ్లకు గడ్డి వేస్తుంది... స్నానం చేసొచ్చి కాఫీ తీసుకుని భర్త గదిలోకి వస్తుంది... అందాక భర్త నిద్రపోతూ ఉంటాడు. అతణ్ణి రెడీ చేసి టిఫిన్ పెట్టి.. బ్రీఫ్ కేస్ ఇచ్చి... ఇలా చేయడం వల్ల ఆమె దేవత. దీనిని రివర్స్ చేయడం మన సమాజంలో కాదు కదా సినిమాల్లోనూ అనూహ్యం. అమంగళకరం. ఆఫీసుకు వెళ్లే భార్య కోసం ఉదయాన్నే లేచి పాట పాడే భర్త లేడు. దాసరి తీసిన ‘సీతారాములు’ (1980)లో ‘ఏమండోయ్ శ్రీమతిగారు.. లేవండోయ్ పొద్దెక్కింది’ అని పాట ఉంటుంది... దానిని చూసి సమస్త లోకం కంగారు పడుతూ ఉండగా పాట చివరలో అది కల అని తెలుస్తుంది. ఆ సినిమాలో పెద్ద ఫ్యాక్టరీ యజమాని జయప్రద. కాని దర్శకుడు దాసరి చెప్పినట్టు బుద్ధిగా ఎర్లీ మార్నింగ్ లేచి కృష్ణంరాజుకు కాఫీ ఇస్తుంది. ‘గుండమ్మ కథ’ (1962) ‘స్త్రీల పొగరు అణచడం’ అనే సక్సెస్ ఫార్ములాను తెలుగు సినిమాకు ఇచ్చింది. ఈ సక్సెస్ఫుల్ సినిమా స్త్రీలకు బాగా అపకారం చేసిందని చెప్పవచ్చు. ఇందులో గుండమ్మ కూతురు జమున చేసిన తప్పు ఏమిటో ఎవరికీ తెలియదు. ఆమె కొంచెం పెంకిగా ఉంటుంది అంతే. గారాబంగా ఉంటుంది. ‘బాధ్యత తెలియకుండా’ ఉంటుంది. దాంతో ఎస్.వి.రంగారావు, ఎన్.టి.ఆర్, అక్కినేని వంటి మహామహులు కలిసి ఆమె ‘పొగరు’ అణచడానికి నాటకాలు ఆడతారు. ఏడ్పిస్తారు. మట్టి పని చేయిస్తారు. బెంబేలెత్తిస్తారు. ఇన్ని చేసేది ఆమె ‘భర్త పట్ల చూపాల్సిన అణకువ’ను అలవర్చుకోవడం కోసం. తెలుగు సినిమా అత్తలతో పందెం కాసే అల్లుళ్లతో, తల ఎగరేసే అలాంటి అత్తల కుమార్తెల ‘పీచమణిచే’ హీరోలతో నేటికీ వర్థిల్లుతోంది. తెలుగు హీరోకి ఏ స్త్రీ ఎదురు కారాదు... అయితే ఆమెను ‘దారికి తెస్తాడు’. ‘నరసింహ’లో రజనీకాంత్ రమ్యకృష్ణను తెచ్చినట్టు. అయితే తెలుగు సినిమా ఎప్పుడూ స్త్రీల పట్ల పూర్తి అసున్నితంగా లేదు. అప్పుడప్పుడు సదుద్దేశాల వల్ల కావచ్చు.. ట్రెండ్ కోసం కావచ్చు స్త్రీల సమస్యను పట్టించుకుంది. ‘కట్నం’ సమస్యను తెలుగు సినిమా చర్చించింది. ఎన్.టి.ఆర్ స్వయంగా ‘వరకట్నం’ (1969) తీశారు. ‘శుభలేఖ’ (1982), ‘శ్రీకట్నలీలలు’ (1985), ‘శ్రీవారికి ప్రేమలేఖ’ (1984), ‘రాఖీ’ (2008) తదితరం ఉన్నాయి. ప్రేమ పేరుతో మోసం చేసే కుర్రాళ్లకు బుద్ధి చెప్పే ‘న్యాయం కావాలి’ (1981), ‘మౌన పోరాటం’ (1989) సినిమాలు ఉన్నాయి. వ్యభిచార సమస్యను ‘పూజకు పనికి రాని పువ్వు’ (1986), ‘నేటి భారతం’ (1983)లో చూపారు. ‘అనుమానం’ను ‘డాక్టర్ చక్రవర్తి’ (1964), ‘ముత్యాల ముగ్గు’ (1975) తదితర సినిమాలలో, లైంగిక దోపిడిని ‘దాసి’ (1988), గృహహింసను ‘ఆడదే ఆధారం’ (1986), ఇంటి చాకిరీని ‘అమ్మ రాజీనామా’ (1991), రేప్‌ను ‘శ్రీకారం’ (1996) ... ఇవన్నీ తప్పక ప్రస్తావించాలి. అయితే పురుషులు పురుషులతో స్త్రీల తరఫున చేసిన సంభాషణలే ఇవన్నీ ఎక్కువగా. స్త్రీలు గట్టిగా చేసిన స్టేట్మెంట్ కాదు. స్త్రీలు గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చే సందర్భం ఇంకా తెలుగులో రాలేదు. స్త్రీలు లీడ్‌రోల్స్ చేయడానికి వెనుకాడతారు తెలుగులో. ఒక్కసారి వారు తమ భుజాల మీద సినిమా మోస్తారన్న ఇమేజ్ వస్తే వారి పక్కన హీరోలు చేయరు. గతంలో చాలామంది హీరోయిన్లు అలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడూ పడుతున్నారు. స్త్రీలు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులుగా, న్యాయవాదులుగా, కలెక్టర్లుగా, సంఘ సేవకులుగా కొన్ని అన్యాయాలను గొప్పగా ఎదిరించిన సినిమాలు తెలుగులో ఉన్నాయి. వాటితో సమాజానికి పేచీ లేదు. కాని స్త్రీల తరఫున స్త్రీలు మాట్లాడినప్పుడే పేచీ. అందుకు ఇంకా స్పేస్ రాలేదు. స్త్రీలు కుటుంబాలను గౌరవించం అనడం లేదు. స్త్రీలుగా తమ బాధ్యతలను విస్మరించం అనడం లేదు. పురుషులకు–స్త్రీలకు ఇల్లు సమానమే. కాని పెంపకంలో, చదువులో, ఉపాధి అవకాశాలలో, ఉద్యోగ స్థలాలలో, నిర్ణయాత్మక రాజకీయ పదవులలో, ఉనికిలో, అస్తిత్వంలో, అందచందాల నిర్వచనాలలో, గౌరవంలో సరి సమాన దృష్టికోణం, సరి సమాన వేదిక గురించి వారు మాట్లాడాల్సింది చాలా ఉంది సినిమాలలో. ‘చైల్డ్ అబ్యూజ్’, ‘మేరిటల్ రేప్’, ‘అంగీకార శృంగారం’, ‘జీవిత భాగస్వామి ఎంపిక’, ‘పిల్లల్ని కనే/వద్దనుకునే హక్కు’, ‘అబార్షన్’, ‘సెక్సువల్ హరాస్మెంట్’ వీటి గురించి తెలుగు సినిమా ఎంతో మాట్లాడాల్సి ఉంది. కాస్త ఆత్మవిశ్వాసం చూపి తమ టర్మ్స్ ప్రకారం తాము ఉంటూ అబ్బాయిలు గౌరవంగా, ప్రేమగా తమకు దగ్గరయ్యే అమ్మాయిల పాత్రలు ‘ఆనంద్’, ‘గోదావరి’, ‘పెళ్లిచూపులు’, ‘ఫిదా’ తదితర సినిమాలలో కనిపించాయి. ‘ఫిదా’లో అమ్మాయి కోసమే అబ్బాయి అమెరికా వదిలి వస్తాడు. ఇది అరుదైన జెస్చర్. అన్ని జీవన, సంఘిక సందర్భాలను స్త్రీ వైపు నుంచి తిరగేస్తే ఇలాంటి జెస్చర్స్ ఇవ్వాల్సిన కథలు ఎన్నో వస్తాయి. వాటిని తెలుగు తెర ఇంకా పట్టుకోవాల్సి ఉంది. – సాక్షి ఫ్యామిలీ -
హీరోయిన్స్; భ‘లేడీ విలన్లు’
హీరోయిన్స్ అంటే...? ఐ క్యాండీగా స్క్రీన్‌ను కలర్ఫుల్గా మార్చేవాళ్లు. బబ్లీనెస్‌తో హీరోను బబుల్‌గమ్‌లా చుట్టుకునేవాళ్లు. పాటల వరకూ కనిపించి వెళ్లిపోయేవాళ్లు. హీరోయిన్ల పాత్రల డిజైన్‌లో మనకు తరచూ వినిపించే కామెంట్స్ ఇవి. హీరోయిన్‌కి స్ట్రాంగ్ రోల్స్‌తో వస్తున్న సినిమాలు తక్కువే. మెల్లిగా ఈ ధోరణి మారుతున్నట్టు కనిపిస్తోంది. లేడీ ఓరియంటెడ్ సినిమాల ఆదరణ పెరుగుతోంది. హీరోయిన్లు పవర్ ఫుల్ రోల్స్ చేస్తున్నారు. నెగటివ్ రోల్స్‌లోనూ కనిపిస్తున్నారు. సీత మంచి అమ్మాయి అనే పాత్రలే కాకుండా నెగటివ్ సైడ్‌ని ఆవిష్కరించి భలేడీ విలన్లు అనిపించు కుంటున్నారు. విలన్ – నయన్ హిందీ చిత్రం ‘అంధాధూన్’ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. టబు, ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ఇది. ఇందులో టబు చేసిన నెగటివ్ షేడ్ ఉన్న పాత్రకు విశేష స్పందన లభించింది. ప్రస్తుతం ‘అంధాధూన్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. టబు పోషించిన పాత్రకు నయనతారను సంప్రదించినట్టు సమాచారం. నయన్ కూడా ఈ ప్రాజెక్ట్‌కి సుముఖంగానే ఉన్నట్టు సమాచారం. ఈ పాత్ర విషయానికి వస్తే.. తనకు ఇబ్బందిగా అనిపిస్తే చంపేయడానికి కూడా వెనకాడని పాత్ర తనది. సినిమా కథకు కీలకమైన పాత్ర ఇది. నయనతార టెర్రరిస్ట్ స్యామ్ సమంత తన కెరీర్లో ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు. కమర్షియల్ సక్సెస్‌తో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘ఓ బేబీ’తో మంచి ఫామ్‌లో ఉన్నారు. తాజాగా వెబ్స్పేస్లోకి అడుగుపెడుతున్నారు స్యామ్. వెబ్ ఎంట్రీ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేశారు. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన ‘ది ఫ్యామిలీ మేన్’ సిరీస్ రెండో పార్ట్‌లో సమంత కూడా జాయిన్ అయ్యారు. ఇందులో సమంత నెగటివ్ పాత్రలో నటించారు. టెర్రరిస్ట్‌గా కనిపిస్తారని సమాచారం. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ప్రసారం కానుంది. సమంత కనులతో దోచారు దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘కనులు కనులను దోచాయంటే’. ఫిబ్రవరిలో విడుదలయిన ఈ చిత్రం మంచి హిట్ అయింది. ఇందులో రీతూ అమాయకంగా కనిపించే దొంగ పాత్ర చేశారు. తెలివిగా ప్లాన్ చేసి మోసాలు చేశారు. ‘పెళ్లి చూపులు’తో ఒకలాంటి ఇమేజ్ ని సంపాదించుకొని ఇలాంటి పాత్ర చేయడంలో రీతు విభిన్నత కనిపిస్తుంది. ‘కనులు కనులను..’ చిత్రంతో తాను నెగటివ్ క్యారెక్టర్స్ చేయగలనని నిరూపించుకున్నారు రీతూ వర్మ. ‘కనులు కనులు దోచాయంటే’లో రీతూ వర్మ సీతతో వీజీ కాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ జంటగా నటించిన చిత్రం ‘సీత’. తేజ దర్శకుడు. ఈ సినిమాలో కాజల్ పాత్రలో కొంచెం నెగటివ్ యాంగిల్ ఉంది. తనది పక్కా ప్రాక్టికల్ బిజినెస్ ఉమెన్ పాత్ర. డబ్బు కోసం తెలివితేటలతో మోసం చేయడం తప్పు కాదని నమ్మే పాత్ర తనది. అందులో పెద్ద తప్పు కూడా లేదనుకుంటుంది ఆ పాత్ర. అప్పటివరకూ పాజిటివ్ క్యారెక్టర్స్ లో కనిపించిన కాజల్ ‘సీత’లో అందుకు భిన్నంగా కనిపించి, ప్రసంశలు దక్కించుకోగలిగారు. ‘సీత’లో కాజల్ అగర్వాల్ బోల్డ్ ఎంట్రీ తొలిసారి తెరపై కనబడినప్పుడే ప్రేక్షకుల ప్రేమను పొందాలనుకుంటారు ఎవరైనా. కానీ పాయల్ రాజ్‌పుత్ తొలి సినిమా ‘ఆర్ఎక్స్ 10’లో భిన్నమైన పాత్ర ఎంచుకున్నారు. ఈ సినిమాలో కొంచెం హాట్‌గా కనిపించారు. అలాగే సినిమాలో ఆమెది విలన్ పాత్ర. స్వార్థం కోసం ప్రేమించి మోసం చేయడానికి కూడా వెనకాడని పాత్ర తనది. మామూలుగా పాజిటివ్ క్యారెక్టర్స్ కన్నా నెగటివ్ క్యారెక్టర్స్ చేయడం కష్టం అంటారు. ఆ విధంగా తొలి సినిమాతోనే పాయల్ నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ‘ఆర్ఎక్స్ 100’లో పాయల్ నల్ల విలన్ తమిళ నటి వరలక్ష్మి హీరోయిన్గా, లేడీ విలన్‌గా తమిళ సినిమాల్లో తరచూ కనిపిస్తున్నారు. ‘నల్ల’ విలన్ (మంచి విలన్) అని పేరు తెచ్చుకున్నారు కూడా.. ఆ మధ్య ‘సర్కార్, పందెం కోడి 2, తెనాలి రామకష్ణ’ చిత్రాల్లో నెగటివ్ ఛాయలున్న పాత్రల్లో కనిపించారు. ‘సర్కార్, తెనాలి రామకృష్ణ’ సినిమాల్లో పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలిగా ఆమె వేసిన ఎత్తులకు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘క్రాక్’లోను పవర్ ఫుల్ నెగటివ్ పాత్రలో కనిపించనున్నారు వరలక్ష్మి. వరుసగా విలన్ క్యారెక్టర్స్ చేస్తూ ‘భలే’డీ విలన్ అనిపించుకుంటున్నారు వరలక్ష్మి. ‘పందెం కోడి 2’లో వరలక్ష్మీ మహా విలన్ అనిపించుకోవాలని... హీరోయిన్గా 49 సినిమాలు పూర్తి చేశారు హన్సిక. 50వ సినిమా మైలురాయి గుర్తుండిపోయేలా ఉండాలని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ‘మహా’ అనే చిత్రం చేస్తున్నారామె. ఇందులో హన్సిక పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. ‘హన్సిక మహా విలన్’ అని అందరితో అనిపించుకోవాలనే పట్టుదలతో నటనపరంగా చాలా కేర్ తీసుకున్నారట ఈ బ్యూటీ. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ‘మహా’లో హన్సిక ‘పాటల కోసం హీరోయిన్’ అనే గ్లామరస్ క్యారెక్టర్స్ కే పరిమితం కాకుండా వీలు కుదిరినప్పుడల్లా విలన్ పాత్రల్లో భ‘లేడీ విలన్లు’ అనిపించుకుంటున్న నాయికలను అభినందించాల్సిందే. -
రిస్క్ తీసుకున్నా
విక్రమ్‌ప్రభు హీరోగా నటించిన ‘ఇదు ఎన్న మాయమ్’ (2015) చిత్రంతో తమిళంలో, రామ్ హీరోగా నటించిన ‘నేను.. శైలజ’ (2016) చిత్రంతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు కీర్తీ సురేష్. ‘మహానటి’ చిత్రంతో తనలో అద్భుత నటి ఉందని నిరూపించుకున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఆమె కెరీర్ జోరుగా ఉంది. ఈ విషయం గురించి కీర్తీ సురేష్ మాట్లాడుతూ –‘‘నేనీ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాను. ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ కెరీర్లో రిస్క్ తీసుకుని ధైర్యంగా ముందడుగు వేశాను. నేను ఓవర్‌నైట్ స్టార్‌ని కాలేదు. కానీ ఊహించనదాన్ని కన్నా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో నాకు మంచి ఫేమ్ వచ్చిందని మాత్రం చెప్పగలను. అలాగే ఇంత తక్కువ సమయంలో జాతీయ అవార్డు (‘మహానటి’ చిత్రానికి) సాధిస్తానని కూడా ఊహించలేదు. నేను చేసిందల్లా శక్తివంచన లేకుండా నా పాత్రలకు న్యాయం చేయడమే’’ అన్నారు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘అన్నాత్తే’ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు కీర్తీ సురేష్. అలాగే ఇటు తెలుగు అటు తమిళంలో ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు ‘మిస్ ఇండియా, గుడ్‌లక్ సఖి, పెంగ్విన్ ’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. -
ఇప్పుడు డైలాగ్ ఆమెదే
థప్పడ్ అంటే చెంపదెబ్బ. భార్యను చెంపదెబ్బ కొట్టే హక్కు భర్తకు ఉందని సమాజం అనుకుంటుంది. కానీ, చెంపదెబ్బయినా సరే ఎందుకు కొట్టాలి? అని బాలీవుడ్లో ఇటీవల వచ్చిన ‘థప్పడ్’ సినిమా ప్రశ్నించింది. పురుషాహంకారం మీద చెంపదెబ్బ కొట్టిన సినిమా ఇది. స్త్రీల తరఫున వకాల్తా పుచ్చుకునే హిందీ సినిమాలు ఇప్పుడు గొప్పగా వస్తున్నాయి. బాలీవుడ్ మారింది. స్త్రీ ఆత్మగౌరవాన్ని గుర్తించింది. స్త్రీ, çపురుష సమానత్వ సాధనకు ఆలస్యంగానైనా తనవంతు పోరాటం, అవగాహన కల్పించే ప్రయత్నం మొదలుపెట్టింది. బాలీవుడ్లో గత రెండు దశాబ్దాలుగా వస్తున్న సినిమాలే ఇందుకు నిదర్శనం. ‘థప్పడ్’ తాజా ఉదాహరణ. చెంపదెబ్బతో తన పురుషాహంకారాన్ని చూపించిన భర్త నుంచి వేరు కావాలనుకుంటుంది ఈ సినిమాలోని కథానాయిక. ఆ ఒక్క చెంపదెబ్బతో తమ మధ్య ఉన్న అనుబంధాన్ని కథానాయిక ప్రశ్నించుకుంటుంది. భార్యాభర్తలు సమానంగా ఉండాల్సిన వివాహ బంధాన్ని చెంపదెబ్బతో కలుషితం చేయడం ఎందుకు? చెంపదెబ్బ కొట్టి భార్య స్థానాన్ని చులకన చేయడం ఎందుకు? ఇదేం కాపురం? తనతో సమానంగా చూడలేని భర్తతో ఒకే కప్పు కింద ఉండడం ఎందుకు? అని విడాకులు కోరుకుంటుంది తాప్సీ. అయితే మొగుడూ పెళ్లాలన్నాక కాపురమన్నాక ఇవన్నీ కామన్... మొగుడు కాకపోతే ఎవరంటారు.. అని ఆమె నిర్ణయం చూసి సమాజం ఆశ్చర్యపోతుంది. ‘కేవలం ఒక్క చెంపదెబ్బకు విడాకులా?’ అనే ప్రశ్నకు ‘అవును.. ఒక్క చెంపదెబ్బ కొట్టినా విడాకులే’ అని కథానాయిక తాప్సీ పాత్ర అంటుంది. గృహహింసకు ‘థప్పడ్’ ఒక తిరుగు జవాబు. మారిన ధోరణి ఇలా స్త్రీల తరఫున మాట్లాడే సినిమాలు పెరిగాయి బాలీవుడ్లో. నిన్న వచ్చిన ‘తుమ్హారీ సులూ’, మొన్న వచ్చిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ ఇల్లాలి ఆత్మగౌరవాన్ని సమాజానికి చూపించాయి. ‘తుమ్హారీ సులూ’లో గృహిణిగా సగటు జీవితం గడుపుతున్న కథానాయికను ఏమీ చేతకాదు అంటూ దెప్పిపొడుస్తుంటారు. ఆమె రేడియో జాకీగా మారి తనను తాను నిరూపించుకుంటుంది. ఉద్యోగం పోయిన భర్తకు అదే రేడియో స్టేషన్లో క్యాటరింగ్ బిజినెస్ పెట్టిస్తుంది. ఈ విజయం ఆమె ఆత్మసమ్మానం. శ్రీదేవి నటించిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ చెప్పిందీ అదే. ప్రేమ కన్నా స్త్రీకి ముఖ్యమైంది గౌరవమని. గౌరవం లేని ప్రేమ బానిసత్వానికి బంగారు సంకెలని. ఆ సినిమాలో ‘వంట తప్ప మీ అమ్మకేం తెలుసు?’ అంటూ పొద్దస్తమానం భర్త అవమానిస్తుంటే, కూతురు ‘పేరెంట్–టీచర్ మీటింగ్‌కి అమ్మ వద్దు నాన్నా, తనకు ఇంగ్లిష్ రాదు. మా టీచర్ల ముందు నాకు ఇన్సల్టింగ్గా ఉంటుంది’ అంటూ తనూ అమ్మను రెండు మెట్లు కిందకు తోసి నాన్నకు కిరీటం పెడుతుంది. దీన్ని భర్త ప్రేమ, కూతురి చనువుగా తేలిగ్గా తీసుకొని హాయిగా నవ్వుకోదు ఆమె. అవమానంగా ఫీలవుతుంది. ఆ ఇంట్లో తనకెలాంటి స్థానం కావాలో చెప్పాలనుకుంటుంది. చెప్తుంది.. ఇంగ్లిష్‌లోనే! ప్రపంచం వినాలి.. ‘ఏం కావాలి నీకు?’ అడుగుతుంది తల్లి తన బిడ్డను. ‘ఈ ప్రపంచమంతా నా పాట వినాలనుకుంటున్నానమ్మా’ సమాధానం ఇస్తుంది కూతురు. ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ సినిమాలోని డైలాగ్ అది. ఆడపిల్లకు లక్ష్యం ఏంటి.. తలవంచుకొని అనుసరించక? ఆడపిల్లకు సంగీతం, డాన్స్ ఏంటి.. ఇంటిపనులు చూసుకోక? వంటి మూస ఆలోచనలతో కొట్టుకుపోతున్న తండ్రికి ఆడపిల్లా మనిషే అని చెప్పే ఓ కూతురి కథ ఈ సినిమా. ఇక ప్రోత్సహించే తండ్రులు ఉంటే ఆడపిల్లలకు ఆకాశమే హద్దు అని చెప్పిన సినిమా ‘దంగల్’. ఆ సినిమాలో తండ్రి తన కుస్తీ ఆటను కుమార్తెలకు పంచి వస్తాదులుగా నిలబెడతాడు. అలాగే ప్యాషన్ ఉంటే క్రీడలలో కృషి చేయాలనుకునే మహిళలకు పెళ్లి, పిల్లలు అడ్డంకే కాదు అని నిరూపించాయి ‘మేరీ కామ్’, ‘పంగా’ సినిమాలు. ‘నో’ అంటే ‘ఎస్’ అని కాదు ఆడవాళ్లను సెక్సువల్ ఆబ్జెక్ట్స్‌గా చూపించిన ఒకప్పటి హిందీ సినిమాయే మహిళలకూ మెదడుంటుంది వాళ్ల అభిప్రాయాలకూ గౌరవమివ్వాలని గ్రహించింది నేడు. ‘పింక్’ లాంటి సినిమాలను నిర్మించింది. కట్టుబొట్టు తీరుతో స్త్రీని అంచనా వేయడం, జడ్జ్ చేయడం ఆపండి... ఆమె శరీరం మీద హక్కు ఆమెదే... భార్య అయినా, గర్ల్ ఫ్రెండ్ అయినా వేశ్య అయినా సరే.. ఒకసారి ఆమె ‘నో’ అన్నదంటే ‘నో’అనే అర్థం ..అని ‘పింక్’ సినిమా చెప్పింది! ఆడవాళ్ల మాటలకు వేరే అర్థాలు లేవు. కాదంటే అవునని కాదు.. స్పష్టంగా కాదు అనే.. అంటూ సమాజం మెడలు తిప్పి మరీ చూపించిన మూవీ ‘పింక్’. పరువు హత్య.. పరువు చేటు కులం, మతం, ఆస్తి, అంతస్తును లెక్క చేయకుండా పెళ్లి చేసుకుని ‘పరువు తక్కువ పని’ చేసిందని.. అందుకు ఆమెను చంపే హక్కు తమకు ఉందని భావించే పెద్దలను తీవ్రంగా నిలదీసిన సినిమా ‘ఎన్‌హెచ్ 10’. అలాగే చైల్డ్ అబ్యూజ్‌ని మన దేశం కడుపులో పెట్టుకొని ఎలా దాచుకుంటుందో చూపించిన సినిమా ‘హై వే’! ప్రయాణం ఆపొద్దు.. ఆడపిల్లకు పెళ్లే జీవిత పరమావధి కాదు. అది జీవితంలో ఒక భాగం మాత్రమే. ఒకవేళ పరిస్థితులు తలకిందులై అనుకున్నది జరక్కపోతే కుంగిపోయి నాలుగు గోడలకే పరిమితం కావాల్సిన పనిలేదు. కొత్త దారి వెదుక్కొని దర్జాగా ఆ దారెంట నడవచ్చు అని చూపిస్తుంది ‘క్వీన్’. ఆత్మవిశ్వాసం హ్యాండ్ బ్యాగ్‌లో కాదు మైండ్‌లో ఉంటుంది.. ఆలోచనలతో బయటకు వస్తుంది.. కార్యాచరణలో కనిపిస్తుంది...అని చెప్తుందీ సినిమా. అందుకే ప్రతి మహిళ జీవితంలో ఒక్కసారైనా సోలోగా ప్రయాణించాలి అని ఈ సినిమా గురించి రాసిన రివ్యూలో చెప్పాడు ఒక రైటర్. ప్రయాణాన్ని మించిన పుస్తకం ఉంటుందా లోకజ్ఞానానికి! ఇవి మారిన బాలీవుడ్ ట్రెండ్‌కు కొన్ని ట్రైలర్స్ మాత్రమే. పురుషుడు వంట చేస్తే ఆర్ట్.. స్త్రీకైతే బాధ్యత అని ఒక సినిమాలో డైలాగ్. ఆర్ట్ అయినా.. బాధ్యత అయినా స్త్రీ, పురుషులిద్దరికీ సమానమే అన్న ప్రాథమిక సూత్రాన్ని ఆమోదించదగ్గ నిజాన్ని చూపిస్తున్న బాలీవుడ్‌కు థ్యాంక్యూ. – సాక్షి ప్రతినిధి చపాక్... ఇంకొన్నిఇవి కాక స్త్రీ సాధికారతను ఫోకస్ చేసిన సినిమాలూ ఉన్నాయి. వారసత్వ వ్యాపారాలకు రబ్బర్‌స్టాంప్ యజమానులుగా కాక స్వంత శక్తితో అంట్రపెన్యూర్స్ కాగలరని ‘బాండ్ బాజా బారాత్’, నిశ్శబ్దాన్ని ఛేదించకపోతే నష్టపోయేది స్త్రీలే అని వర్క్ ప్లేస్ హెరాస్‌మెంట్‌ను ఎదుర్కోవడానికి మహిళలకున్న చట్టపరమైన ఆయుధాలను తెలియజెప్పిన ‘ఇన్కార్’, ‘సెక్షన్ 375’, మోసాన్ని మోసంతోనే జయించాలన్న ధైర్యాన్నిచ్చే ‘ఇష్కియా’, అవతలి వ్యక్తి యాసిడ్‌తో కసి తీర్చుకున్నా మనోనిబ్బరం మసి కాలేదని నిరూపించిన ‘చపాక్’, సైన్యంలోనూ, దేశరక్షణ కోసం చేసే స్పైలోనూ, దేశ ప్రతిష్టను పెంచే సైన్స్‌లోనూ మహిళలు ముందున్నారని ‘రాజీ’, ‘మంగళ్యాన్’ తో చెప్పింది బాలీవుడ్. -
నేనింకా ఆ స్థాయికి వెళ్లలేదు
ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. మరి మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో కనిపించాలనే ఆలోచన మీకు ఏమైనా ఉందా? అని హీరోయిన్ కళ్యాణీ ప్రియదర్శన్‌ని అడిగితే– ‘‘ఇప్పటి వరకూ నేను చేసింది కేవలం మూడు నాలుగు సినిమాలే. ప్రస్తుతం నటిగా నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నన్ను నమ్మి లేడీ ఓరియంటెడ్ సినిమాతో ఎవరైనా దర్శకులు వస్తే చేస్తానేమో? కానీ, నేను లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసినా ఎక్కువ మందిని ప్రభావితం చేయలేకపోవచ్చని నా భావన. దీపికా పదుకోన్‌లాంటి పెద్ద హీరోయిన్ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తే ఆ ప్రభావం వేరు.. ఆ సినిమా ఎక్కువ మంది ఆడియన్స్ దగ్గరకు వెళ్తుంది. కానీ, నేనింకా ఆ స్థాయికి వెళ్లలేదు. మా నాన్నగారు (మలయాళ దర్శకుడు ప్రియదర్శన్) స్టార్స్‌ని దృష్టిలో పెట్టుకొని కూడా కథలు రాసేవారు.. పాత్రల్ని డిజైన్ చేసేవారు. ఆ విధంగా ఎవరో ఒక రచయిత లేదా దర్శకుడు ఒక పాత్రకు కేవలం నన్ను మాత్రమే ఊహించుకొని కథ రాసే స్థాయి స్టార్‌గా ఎదగాలని కోరుకుంటున్నాను. నటిగా నా లక్ష్యం అదే’’ అన్నారు. -
అధికారం ఎప్పుడూ వాళ్లకేనా?
సినిమా ఇండస్ట్రీ మేల్ డామినేటెడ్ అంటారు కొందరు. పవర్ ఎప్పుడూ మగవాళ్ల దగ్గరే ఎందుకు ఉండాలి? అంటున్నారు నయనతార. ఒకవైపు టాప్ హీరోలతో యాక్ట్ చేస్తూ మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగారు నయనతార. తనకి సంబంధించిన పనులు తనకు నచ్చినట్టే జరగాలనుకుంటారట నయన. ఇండస్ట్రీలో అధికారం అనే టాపిక్ గురించి నయనతార మాట్లాడుతూ– ‘‘అధికారం ఎప్పుడూ మగవాళ్ల దగ్గరే ఎందుకు ఉండాలి? నేను సోలో హీరోయిన్గా చేసే సినిమాల్లో తుది నిర్ణయాలన్నీ నావే. సమస్య ఏంటంటే.. స్త్రీలు శాసించే స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఉండాల్సి నంత కాన్ఫిడెంట్‌గా ఉండరు. నాకు అది కావాలి, నేను ఇది చేస్తాను అని ధైర్యంగా నిలబడరు. నిలబడాలి. ఇది జెండర్‌తో సంబంధం లేనిది. నేను నీ మాట విన్నప్పుడు, నువ్వు కూడా నా మాట వినాలి కదా?’’ అన్నారు. -
సూపర్ లేడీ
త్రిషను ఇప్పుడు చాలామంది సూపర్ లేడీ అంటున్నారు. ఎందుకంటే ఆమె చేతిలో ఉన్నవన్నీ దాదాపు ‘లేడీ ఓరియంటెడ్’ సినిమాలే. మామూలుగా కథానాయిక ప్రాధాన్యం ఉన్న కథలంటే అందులో నటించే నాయికకు థియేటర్స్‌కి జనాలను రాబట్టగలిగే సత్తా ఉండాలి. అప్పుడే హీరోయిన్గా తీసుకుంటారు. త్రిష సూపర్ అని ఆమెను లేడీ ఓరియంటెడ్ సినిమాలకు తీసుకుంటున్నారు కోలీవుడ్ దర్శక–నిర్మాతలు. ఇటీవలే ‘పరమ పదమ్ విళయాట్టు’ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాని పూర్తి చేశారామె. ఇది రిలీజ్‌కు రెడీ అవుతోంది. అలాగే మరో లేడీ ఓరియంటెడ్ మూవీ చిత్రీకరణ జరుగుతోంది. సుమం రాధాకృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సిమ్రాన్ మరో నాయికగా నటిస్తున్నారు. తాజాగా మరో కథానాయికగా ప్రాధాన్యం ఉన్న చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు త్రిష. ‘ఎంగేయుమ్ ఎప్పోద్దుమ్’ (తెలుగులో ‘జర్నీ’) ఫేమ్ ఎమ్. శర్వణన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. అలాగే హిందీ హిట్ ‘బద్లా’ తమిళ రీమేక్‌లో త్రిష నటిస్తారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు త్రిష నటించిన చతురంగవేటై్ట 2, 1818 రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ విధంగా వరుస లేడీ ఓరియంటెడ్ సినిమాలకు సైన్ చేస్తూ త్రిష సూపర్ లేడీ అనిపించుకున్నారు. అంతేగా మరి... ఇండస్ట్రీకి వచ్చి 15ఏళ్లు దాటినప్పటికీ ఇన్ని సినిమాలు చేతిలో ఉండటం అంటే సూపరే మరి. -
సింగారాల సిద్ధమ్మ
సౌతిండియాలో స్టార్ హీరోయిన్గా, లేడీ సూపర్‌స్టార్‌గా నయనతార దూసుకెళ్తున్నారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలను, కమర్షియల్ సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఆమె ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తున్నారు. బ్రిటీష్ సైనికుల మీద వీరోచిత పోరాటం చేశారు స్వాతంత్య్ర సమరయోధుడు నరసింహారెడ్డి. ఆయన జీవితం ఆధారంగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్‌ను చిరంజీవి పోషిస్తున్నారు. ఆయన భార్య పాత్రలో నయనతార కనిపించనున్నారు. రామ్‌చరణ్ నిర్మిస్తున్న ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలో అమితాబ్ బచ్చన్, తమన్నా, జగపతి బాబు, విజయ్‌సేతుపతి, సుదీప్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నవంబర్ 18న నయనతార జన్మదినం. ఈ సందర్భంగా ‘సైరా’లో ఆమె పాత్ర లుక్‌ను ఆదివారం రివీల్ చేశారు చిత్రబృందం. ఇందులో ‘సిద్ధమ్మ’ అనే పాత్ర పోషిస్తున్నారు నయనతార. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది, కెమెరా: రత్నవేలు. హ్యాపీ బర్త్‌డే తంగమే నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ప్రేయసి పుట్టినరోజు నాడు విఘ్నేశ్ చిన్న బర్త్‌డే సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. హాల్ అంతా పువ్వులు, హ్యాపీ బర్త్‌డే నయన్, తంగమే అనే ప్లే కార్డ్స్‌తో డెకరేట్ చేసి, హ్యాపీ బర్త్‌డే లేడీ సూపర్ స్టార్ అని రాసి ఉన్న కేక్‌ను కట్ చేయించారు. ‘‘బర్త్‌డే విషెశ్ తంగమే (బంగారం)’’ అంటూ ఓ ఫొటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు విఘ్నేశ్. అంతేకాదండోయ్.. తన ట్వీటర్ ప్రొఫైల్‌లో కూడా నయనతార ఫొటో పెట్టారు విఘ్నేశ్. -
విజయశాంతి తరహాలో...
సాక్షి, చెన్నై : దక్షిణాదిలో ఇప్పుడు సంచలన నటి నయనతార రేంజే వేరు. ఆమె చిత్రాలు స్టార్ హీరోల చిత్రాలకు దీటుగా వసూళ్లను కొల్లగొడుతున్నాయి. యువ నటుల నుంచి, ప్రముఖ నటుల వరకూ నయనతార స్టార్‌డమ్‌ను ఉపయోగించుకోవడానికి తహతహ లాడుతున్నారనడం అతిశయోక్తి కాదు. నయనతార ప్రస్తుతం చిరంజీవికి జంటగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు తను నటిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలు కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. మరికొన్ని విడుదలకు సిద్ధం అవుతున్నాయి. త్వరలో అజిత్‌తో విశ్వాసం చిత్రంలో జత కట్టడానికి రెడీ అవుతున్నారు. అదే విధంగా యువ క్రేజీ నటుడు శివకార్తికేయన్‌తో రెండోసారి నటించనున్నారు. రాజేశ్.ఎం ఈ చిత్రానికి దర్శకుడు. చాలా కాలం క్రితం లేడీ సూపర్‌స్టార్‌గా రాణించిన నటి విజయశాంతి మన్నన్ చిత్రంలో రజనీకాంత్‌కు జంటగా నటించారు. పి.వాసు దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో విజయశాంతి పాత్ర రజనీకాంత్ పాత్రకు దీటుగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం, అహంకారం కలగలిపిన ఆ పాత్రలో విజయశాంతి నటన ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం నటి నయనతార కూడా లేడీసూపర్‌స్టార్ ఇమేజ్ను పొందారు. శివకార్తికేయన్‌కు జంటగా నటించనున్న చిత్రం వినోదానికి పెద్ద పీట వేసే కథ అయినా, నయనతార పాత్ర మాత్రం కోపం, పౌరుషం కలిగి చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. స్టూడియోగ్రీన్ పతాకంపై కేఈ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనుంది. -
సూపర్ గర్ల్స్!
ఊ.. ల.. లా.. ఊ.. ల.. లా...అంటూ కథానాయికలు చెట్లు చుట్టూ తిరుగుతూ పాడాల్సిందేనా? హీరోలతో రొమాంటిక్ సీన్స్...కామెడీ ట్రాక్‌లో ఎంతో కొంత పార్ట్...పాటల్లో గ్లామరస్‌గా కనిపించడం..ఇంతేనా? హీరోయిన్ల క్యారెక్టర్లు ఇంతేనా?ఇంతకు మించి యాక్టింగ్‌కి స్కోప్ ఉండదా? సినిమాలో ఇంపార్టెంట్ స్పేస్ ఉండదా? ఈ క్వొశ్చన్స్కి ఫుల్స్టాప్ పడిపోయినట్లే..ఇప్పుడు ‘లేడీ ఓరియంటెడ్ మూవీస్’ పెరిగాయి.కథానాయికలూ సినిమాని మోయగలుగుతున్నారు. ‘సూపర్ గర్ల్స్’ అని నిరూపించుకుంటున్నారు. ప్రస్తుతం సౌత్, నార్త్‌లో.. కథానాయిక ప్రాధాన్యంగా సాగే సినిమాల డజనుకు పైనే ఉన్నాయి. తెలుగులో రెగ్యులర్ కమర్షియల్ సినిమాల జోరు ఎక్కువ. స్టార్ హీరోతో మాంచి మసాలా సినిమా తీస్తే, ‘సేఫ్’. ఇది కొంతవరకూ నిజం. అయితే ఇప్పుడు ప్రేక్షకుల్లో మార్పొచ్చింది. బాగున్న ప్రతి సినిమానీ ఆదరిస్తున్నారు. అందుకే, దర్శక–నిర్మాతలు కొత్త ప్రయత్నాలు చేయడానికి వెనకాడటంలేదు. ఈ క్రమంలోనే లేడీ ఓరియంటెడ్ మూవీస్ పెరిగాయి. ఫ్రమ్ ‘అరుంధతి’ ఈ జోరు ఎక్కువైందనే చెప్పాలి. లేడీ ఓరియంటెడ్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్ ‘అరుంధతి’ (2009)లో అనుష్క అభినయం, ఆహార్యం చూశాక లేడీ ఓరియంటెడ్ మూవీస్ అంటే తనే చేయాలన్నంతగా చాలామంది ఫిక్సయ్యారు. గడచిన ఎనిమిదేళ్లల్లో ‘పంచాక్షరి’, ‘రుద్రమదేవి’, ‘సైజ్ జీరో’ వంటి కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేశారీ బొమ్మాళి. ప్రస్తుతం చేసిన మరో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ ‘భాగమతి’ విడుదలకు సిద్ధమవుతోంది. షాకిచ్చిన త్రిష అదేంటో కానీ... కొంతమంది ‘ఇక పనైపోయంది’ అనుకున్నప్పుడు ఎగిసి పడే అల అయిపోతారు. త్రిషను ఈ జాబితాలోకే చేర్చవచ్చు. దాదాపు పదిహేనేళ్లు దాటాయి త్రిష కథానాయిక అయి. కొత్త కథానాయికలు వచ్చేస్తున్నారు.. త్రిష వెనక్కి తగ్గాల్సిందేనని కొంతమంది అనుకుంటున్న సమయంలో ఐదారు సినిమాలు సైన్ చేసి, షాకిచ్చారు. వాటిలో ‘1818’, ‘పరమపదమ్’ అనే లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఉన్నాయి. కాజల్ – తమన్నా కూడా... దాదాపు గ్లామరస్ రోల్స్‌కి పరిమితమైన కాజల్ అగర్వాల్, తమన్నాలకు కూడా ఈ ఏడాది ‘క్వీన్’ రూపంలో మంచి చాన్స్ వచ్చింది. హిందీ ‘క్వీన్’ రీమేక్‌లో ఈ ఇద్దరూ నటిస్తోన్న విషయం తెలిసిందే. తెలుగు ‘క్వీన్’లో తమన్నా, తమిళంలో కాజల్ చేస్తున్నారు. ‘క్వీన్’ విడుదలయ్యాక ఈ ఇద్దరికీ మరిన్ని హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చేసే చాన్సులు వస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీస్‌లోనూ స్కోప్ ఉన్నంతవరకూ ఇద్దరూ బాగానే నటించారు. నయనతార.. ఓ సెన్సేషన్ ‘చంద్రముఖి’ నయనతారకూ ఇప్పుడు నయనతారకూ అస్సలు సంబంధం లేదు. స్లిమ్‌గా తయారై, అందర్నీ ఆశ్చర్యపరిచారు. సీన్ డిమాండ్ చేస్తే బికినీ వేసుకోవడానికి కూడా వెనకాడలేదు. తమిళ ‘బిల్లా’లో బికినీలో దర్శనమిచ్చిన అదే నయనతార ‘శ్రీరామరాజ్యం’లో సీతగా ‘భేష్’ అనిపించుకున్నారు. ఆ సినిమాతో లేడీ ఓరియంటెడ్ మూవీస్‌కి సూట్ అవుతానని నిరూపించుకున్నారు. ‘మాయ’తో నయన లేడీ ఓరియంటెడ్ మూవీస్ క్లబ్‌లోకి అడుగుపెట్టారు. అంతకుముందు మలయాళంలో ‘ఎలక్ట్రా’ అనే కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా చేసినా, ‘మాయ’ ఆమెను మరో ఎత్తుకి తీసుకెళ్లింది. ఆ సినిమా తర్వాత ‘డోర’ చేశారు. మరో లేడీ ఓరియంటెడ్ మూవీ ‘ఆరమ్’ విడుదలకు రెడీ అయింది. ఈ గ్యాప్‌లో తెలుగులో ‘అనామిక’ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు చేతిలో అరడజను సినిమాలు ఉంటే వాటిలో మూడు తమిళ సినిమాలు ‘కొలైయుదిర్ కాలమ్’, ‘కోలమావు కోకిల’, ‘ఇమైక్క నొడిగళ్’ కథానాయిక ప్రాధాన్యంగా సాగేవే. క్వీన్ హవా! ‘క్వీన్’ తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీస్‌కి సూట్ అవుతానని కంగనా రనౌత్ నిరూపించుకున్నారు. ప్రస్తుతం ‘మణికర్ణిక’ చేస్తున్నారామె. ‘ఏక్ నిరంజన్’ తర్వాత తెలుగులో కంగనా చేస్తోన్న సినిమా ఇది. హిందీలోనూ రూపొందుతోంది. ఈ సినిమా కోసం కంగనా కత్తి సాము నేర్చుకున్నారు. హార్స్ రైడింగ్ కూడా నేర్చేసుకున్నారు. దిశా.. ఫ్రమ్ మోడ్రన్ టు హిస్టారికల్ దిశా పాట్నీ.. చేసిన సినిమాల సంఖ్య జస్ట్ ఫోర్. పైగా.. అన్నీ మోడ్రన్ క్యారెక్టర్సే. ఏకంగా 200 కోట్ల భారీ బడ్జెట్ ‘సంఘమిత్ర’లో చాన్స్ కొట్టేశారు. పైగా హిస్టారికల్ మూవీ. మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్. ముందు ఈ సినిమాలో శ్రుతీహాసన్‌ని అనుకుని, ఆమె తప్పుకున్నాక దిశాని తీసుకున్నారు. ఈ సినిమా కోసం గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం నేర్చుకుంటున్నారు దిశా. అప్ కమింగ్ హీరోయిన్‌కి ఈ సినిమా కత్తి మీద సామే. కానీ, దిశా సవాల్‌గా తీసుకున్నారు. గెలుస్తారు కూడా. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే కదా. ఇంకా.. కథానాయికలే ‘హీరో’ అయి, చేసిన జాబితాలో అంజలి ఒకరు. ఆమె ‘గీతాంజలి’ చేసిన విషయం తెలిసిందే. సౌత్‌లో 50 సినిమాలు చేశాక రాయ్ లక్ష్మీకి బాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ మూవీ ‘జూలీ–2’లో చాన్స్ వచ్చింది. తాప్సీ కూడా అక్కడ ‘పింక్’, ‘నామ్ షబానా’ అనే సినిమా కూడా చేశారు. ఆ మాటకొస్తే.. బాలీవుడ్‌లోనూ లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువయ్యాయి. విద్యాబాలన్ ఎక్కువగా కథానాయిక ప్రాధాన్యంగా సాగే సినిమాలు చేస్తుంటారు. ఇప్పటివరకూ ‘ది డర్టీ పిక్చర్’, ‘కహానీ’, ‘బాబీ జాసూస్’, ‘కహానీ–2’, ‘బేగమ్’ జాన్ వంటి సినిమాలు చేశారు. ప్రస్తుతం ‘తుమ్హారీ సులు’ అనే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ చేస్తున్నారు. మరోవైపు దీపికా పదుకొనె ‘పద్మావతి’గా రాబోతున్నారు. అనుష్కా శర్మ ‘పరీ’ అనే సినిమా చేస్తున్నారు. ‘సాహో’తో తెలుగుకి పరిచయమం కానున్న శ్రద్ధాకపూర్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథతో రూపొందనున్న సినిమాలో నటించనున్నారు. కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వరా భాస్కర్, శిఖా తల్సానియా కాంబినేషన్లో ‘వీరీ ది వెడ్డింగ్’ అనే ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ రూపొందుతోంది. అటు కన్నడ వైపు వెళితే ‘క్వీన్’ రీమేక్‌లో పారుల్ యాదవ్, మలయాళం ‘క్వీన్’లో మంజిమా మోహన్ చేస్తున్నారు. ఇంకా సౌత్ టు నార్త్... లేడీ ఓరియంటెడ్ మూవీస్ కొన్ని సెట్స్‌లో ఉన్నాయి. తగ్గేది లేదంటున్న శ్రీదేవి యంగ్ హీరోయిన్స్ గురించి చెప్పాం.. సీనియర్ నటి శ్రీదేవిని కూడా లిస్ట్‌లో చేర్చాలి. ‘ఇంగ్లిష్–వింగ్లిష్’తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, ఇటీవల ‘మామ్’ చేశారామె. తగ్గేది లేదు. కథాబలమున్న లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయాలనుకుంటున్నారు. నాలుగేళ్లకే మహానటి! దాదాపు పదేళ్లు ఎక్స్పీరియన్స్ ఉన్న కథానాయికకు లేట్‌గా ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్‌కి చాన్స్ వస్తే.. జస్ట్ మూడు నాలుగేళ్ల కెరీర్ ఉన్న కీర్తీ సురేశ్‌కి ఆ అవకాశం రావడం విశేషం. అది కూడా అందాల అభినేత్రి సావిత్రి జీవిత కథలో నటించే చాన్స్ అంటే కీర్తీ సురేశ్ రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే. కానీ, అది పెద్ద బాధ్యత అండీ బాబు. ఇప్పుడు అందరి కళ్లూ ‘మహానటి’ పైనే. సావిత్రిగా కీర్తీ సురేశ్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి? టోటల్‌గా నటన ఎలా ఉంటుంది? అనేది చూడ్డానికి రెడీగా ఉన్నారు. కీర్తీ అందరి మనసు గెలుచుకుంటుందని ఊహించవచ్చు. ఎందుకంటే, ఆ మధ్య విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి ప్రశంసలు లభించాయి. అదీ బాస్.. చాన్స్ ఇచ్చి చూడండి.. హీరోయిన్లు తడాఖా చూపిస్తారు. – డి.జి. భవాని -
ఇక్కడ దేవసేన... అక్కడ కావ్యా మహాలింగం
సమ్మర్ ధమాకా ఆమె కవ్వించగలరు... అవసరమైతే కత్తి పట్టగలరు... రాజుల కథలు, చారిత్రక కథలకు ప్రాణం పోయగలరు. అవును... ఇవాళ గ్లామర్కైనా, చరిత్ర చెక్కిన శిల్పానికైనా కేరాఫ్ అడ్రస్... హీరోయిన్ అనుష్క. వృత్తి మీద బోలెడంత కమిట్మెంట్ చూపుతూ, పాత్రను మెప్పించడం కోసం ఏ కష్టానికైనా వెనుకాడదు కాబట్టే, ఇప్పుడు ఈ స్వీటీ తెలుగు, తమిళ సినీ దర్శక, నిర్మాతలకు అక్షరాలా స్వీటీ! వేర్ ఆర్ యూ.. యూ.. యూ... మొదటి సినిమా ‘సూపర్’ని ఏ ముహూర్తాన అంగీకరించారో కానీ, నిజంగానే అనుష్క కెరీర్ పదకొండేళ్లుగా సూపర్‌గా సాగుతోంది. ఒకవేళ ‘అరుంధతి’ చేయకపోయి ఉంటే.. ఆమె ఇప్పటికీ హీరోల సరసన డ్యుయెట్లు పాడుకునే పాత్రలకే పరిమితమయ్యేవారేమో! ఆ చిత్రంతో కథను తన భుజాల మీద నడిపించగలననీ, శక్తిమంతమైన పాత్రలను అద్భుతంగా చేయగలననీ నిరూపించుకున్నారామె. ఆటోవాలల నుంచి ఆడ ఫ్యాన్స్ వరకూ అందరూ ‘భేష్ జేజెమ్మా’ అన్నారు. ఫలితంగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ అంటే అనుష్క అన్నట్లుగా అయిపోయింది. అలాగే, రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకూ అవకాశాలు దక్కుతున్నాయి. మొత్తానికి ఈ బెంగళూరు బ్యూటీ కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలు. ప్రస్తుతం చేతిలో రెండు చిత్రాలో బిజీగా ఉన్నారామె. ఒకటి ‘బాహుబలి -2’, మరొకటి తమిళంలో ‘సింగమ్ 3’. ఈ రెండూ కాక మరో లేడీ ఓరియంటెడ్ చిత్రానికి కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అది ఇంకా పట్టాలెక్కాల్సి ఉంది. ప్రస్తుతం ‘బాహుబలి’ రెండో భాగం, ‘సింగమ్’ మూడో భాగం అయిన ‘ఎస్ 3’ చిత్రాలకు డేట్స్ కేటాయించి బిజీ బిజీగా షూటింగ్ చేసేస్తున్నారు అనుష్క. ‘బాహుబలి’ తొలి భాగంలో డీ-గ్లామరైజ్డ్ దేవసేనగా కనిపించిన ఆమె, మలి భాగంలో యువరాణి దేవసేనగా అలరించనున్నారు. ప్రస్తుతం ఈ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. ఆర్ఎఫ్సీలో కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఈ నెల 23 వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుందని భోగట్టా. ఒకవైపు యువరాణి దేవసేనగా భారీ పాత్రను పోషిస్తున్న అనుష్క ‘ఎస్ 3’లో కావ్యా మహాలింగంగా రెగ్యులర్ గర్ల్‌గా గ్లామర్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. ఈ పాత్ర ఓ రిలీఫ్ అనాలి. ఎందుకంటే, ఈ మధ్య దేవసేనగా, ‘రుద్రమదేవి’గా, ‘సైజ్ జీరో’లో బొద్దు పాపగా కనిపించిన అనుష్కను రెగ్యులర్ గ్లామరస్ రోల్లో చూడాలని ఆమె అభిమానులకు ఉంటుంది. ఆ మాటకొస్తే.. కత్తి తిప్పడాలు, గుర్రపు స్వారీ చేయడాలు.. వంటివన్నీ బాగానే ఉన్నా ఎలాంటి ఒత్తిడీ లేకుండా హాయిగా పాటలు పాడే క్యారెక్టర్ చేయాలని ఉందని ఆ మధ్య అనుష్క అన్నారు. శరీరానికి శ్రమ లేని ఈ పాత్రను ఆమె ఎంజాయ్ చేస్తున్నారనే అనాలి. ‘బాహుబలి 2’ వచ్చే ఏడాది వస్తుంది. ఈలోపే ‘ఎస్ 3’ విడుదలవుతుంది కాబట్టి కావ్యగా అభిమానులను మురిపిస్తారు అనుష్క. వచ్చే ఏడాది యువరాణి దేవసేనగా మెరుస్తారు. ఆ మెరుపు సంగతలా ఉంచితే.. యువరాణిగా అంటే మాటలు కాదు. వేసుకునే బట్టలు, పెట్టుకునే నగలు అన్నీ భారీగానే ఉంటాయ్. కేశాలంకరణ అయితే మెడ మోయలేనంత ఉంటుంది. మేకప్ కూడా భారీయే. మాంచి ఎండల్లో ఇలా తయారవ్వడం అంటే చిన్న విషయం కాదు. అందుకే బాస్.. అనుష్కను అభినందించాల్సిందే!