గ్లామర్‌, డ్యాన్స్‌లకు మాత్రమే పరిమితం కాదని నిరూపించిన హీరోయిన్లు | Heroines are fighting over problems in the Action movies | Sakshi
Sakshi News home page

గ్లామర్‌, డ్యాన్స్‌లకు మాత్రమే పరిమితం కాదని నిరూపించిన హీరోయిన్లు

Published Fri, Mar 8 2024 4:22 AM | Last Updated on Fri, Mar 8 2024 6:57 AM

Heroines are fighting over problems in the Action movies - Sakshi

డ్యాన్స్‌ మాత్రమే వచ్చా? అలా అంటారేంటీ.. ఫైట్స్‌ కూడా చేస్తారు. కాకపోతే ఆ ఒక్క చాన్స్‌ రావాలి. ఆ చాన్స్‌ వచ్చినప్పుడు హీరోయిన్లు యాక్షన్‌లోకి దిగుతారు. అలా కొందరు కథానాయికలు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు ఉమెన్‌ సెంట్రిక్‌ సినిమాలు పెరిగాయి. ఈ మహిళా దినోత్సవానికి కథానాయికల పరంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఇక సినిమాలో సమస్యలపై పోరాడుతున్న హీరో‘యిన్‌ యాక్షన్‌’ గురించి తెలుసుకుందాం.

యువతి పోరాటం
‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’.. ఇలా ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్స్‌లో అనుష్కా శెట్టి సూపర్‌ హిట్‌. తాజాగా ఆమె మరో లేడీ ఓరియంటెడ్‌ ఫిల్మ్‌ సైన్‌ చేశారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు క్రిష్‌ దర్శకుడు. ఆంధ్రా – ఒడిస్సా సరిహద్దు లొకేషన్స్‌లో ఇటీవల షూటింగ్‌ జరి΄ారు. ఓ యువతి పోరాటంతో సాగే ఈ సినిమాకు ‘శీలవతి’ టైటిల్‌ను అనుకుంటున్నారట.  

సత్యభామ
పోలీసాఫీసర్‌ సత్యభామగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’. ఓ అమ్మాయి హత్య కేసులో నిజమైన దోషులను పోలీస్‌ ఆఫీసర్‌ సత్యభామ ఏ విధంగా పట్టుకుంది?  అనే అంశంతో ఈ సినిమా సాగుతుంది. సుమన్‌ చిక్కాల దర్శకత్వంలో బాబీ తిక్క, శ్రీనివాసరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే హిందీలో కాజల్‌ అగర్వాల్‌ టైటిల్‌ రోల్‌ చేసిన ‘ఉమ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.  

డిటెక్టివ్‌ అను
ఓ కొత్త చిత్రం కోసం చెన్నైలో డిటెక్టివ్‌ ఏజెన్సీ ఆరంభించనున్నారు శ్రుతీహాసన్‌. ఈ సినిమాకు ఫిలిప్‌ జాన్‌ దర్శకుడు. ఇందులో డిటెక్టివ్‌ అను ΄ాత్రలో కనిపిస్తారు శ్రుతీహాసన్‌. ఈ సినిమాకు ‘ది చెన్నై స్టోరీ’ అనే టైటిల్‌ అనుకుంటున్నారట. తన నాన్న ఆచూకీ తెలుసుకోవాల్సిందిగా ఓ ఇంగ్లిష్‌ కుర్రాడు చెన్నైకి వచ్చి, డిటెక్టివ్‌ అనుని కలిశాక ఏం జరిగింది? అనే అంశం చుట్టూ ఈ సినిమా ఉంటుంది. అలాగే శ్రుతీహాసన్‌  నటించిన ఇంగ్లిష్‌ చిత్రం ‘ది ఐ’. చనిపోయిన భర్త అస్తికలను సముద్రంలో కలిపేందుకు మరో చోటుకు వెళ్లిన ఓ మహిళ ఎలాంటి నిజాలు తెలుసుకుంది? ఎవరెవర్ని హత్య చేయాలనుకుంటుంది? అనే కోణంలో ఈ సినిమా సాగుతుందట.  

కాలేజ్‌ స్టూడెంట్‌
రష్మికా మందన్నా తొలిసారి రెండు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ‘చిలసౌ’ (2018)తో దర్శకుడిగా హిట్టైన నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ ఇటీవల ‘ది గాళ్‌ ఫ్రెండ్‌’ కోసం మళ్లీ మెగాఫోన్‌ పట్టారు. ఈ సినిమాలో రష్మికా మందన్నా లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో విద్యా కొప్పినీడి, ధీరజ్‌ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఇందులో రష్మిక కాలేజ్‌ స్టూడెంట్‌ రోల్‌ చేస్తున్నారని తెలిసింది. ఓ కాలేజ్‌ స్టూడెంట్‌ ప్రేమ, సంఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందన్నట్లుగా తెలుస్తోంది. రష్మిక నటిస్తున్న మరో ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘రెయిన్‌ బో’. ఈ సినిమాకు శాంతరూబన్‌ దర్శకుడు. ఓ మనిషి తన జీవితంలో ఎదుర్కొనే వివిధ దశల పరిస్థితులను ‘రెయిన్‌ బో’లో చెబుతున్నారట.

హక్కుల కోసం పోరాటం
‘మహానటి’ (2018) సినిమాతో నటిగా తనలో ఎంత ప్రతిభ ఉందో నిరూపించుకున్నారు కీర్తీ సురేష్‌. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ‘రఘు తాతా’, ‘రివాల్వర్‌ రీటా’, ‘కన్నె వెడి’ వంటి మూడు ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్స్‌ ఉన్నాయి. ‘రఘు తాతా’కు సుమన్‌కుమార్‌ దర్శకుడు.  బలవంతంగా హిందీ భాష నేర్చుకోవాలన్నప్పుడు ఓ యువతి ఏ విధంగా పోరాటం చేసింది? అనే కోణంలో ఈ సినిమా ఉంటుందట. అలాగే కీర్తి మరో ఫిల్మ్‌ ‘రివాల్వర్‌ రీటా’ కూడా పోరాటం నేపథ్యంలో సాగే సినిమాయే. ‘కన్నె వెడి’ సినిమాకు గణేశ్‌ రాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక హీరోయిన్‌గా ‘బేబీ జాన్‌’ చిత్రంతో హిందీకి పరిచయం అవుతున్నారు కీర్తి.

గీతాంజలి మళ్లీ వచ్చింది
తెలుగు హీరోయిన్‌ అంజలి నటించిన తొలి ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘గీతాంజలి’. 2014లో విడుదలైన ఈ హారర్‌ కామెడీ ఫిల్మ్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ వస్తోంది. అంజలి మెయిన్‌ లీడ్‌ రోల్‌ చేశారు. ఏప్రిల్‌ 11న విడుదల కానుంది. శివ తుర్ల΄ాటి దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్‌ నిర్మించిన ‘గీతాంజలి 2’ అంజలి కెరీర్‌లో 50వ చిత్రం కావడం విశేషం. ఓ ఇంట్లో చోటు చేసుకునే హారర్‌ ఎలిమెంట్స్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.   

రోడ్‌ ట్రిప్‌
హీరోయిన్లు అనుపమా పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్, సంగీత కలిసి రోడ్‌ ట్రిప్‌కు వెళ్లారు. వెకేషన్‌ కోసం కాదు.. సినిమా కోసమే. రోడ్‌ ట్రిప్‌ నేపథ్యంలో ‘సినిమా బండి’ ఫేమ్‌ దర్శకుడు ప్రవీణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, దర్శన, సంగీత లీడ్‌ రోల్స్‌ చేస్తున్నారు.   

సెల్ఫ్‌ డిఫెన్స్‌
వరుసగా ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్స్‌ చేస్తున్నారు హన్సిక. గత ఏడాది హన్సిక మెయిన్‌ లీడ్‌ రోల్‌ చేసిన ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’, ‘105 మినిట్స్‌’ చిత్రాలు రిలీజ్‌ అయ్యాయి. ఈ ఏడాది మరో రెండు రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి. తమిళ ‘గార్డియన్‌’ చిత్రం నేడు విడుదల అవుతోంది. కాగా హన్సిక సైన్‌ చేసిన ‘రౌడీ బేబి’ చిత్రం ఈ ఏడాదే రిలీజ్‌ కానున్నట్లు తెలుస్తోంది. జేఏమ్‌ రాజశరవణన్‌ ఈ మూవీకి దర్శకుడు. ఇవి కాకుండా హన్సిక చేతిలో మరో రెండో ఉమెన్‌ సెంట్రిక్‌ చిత్రాలు ఉన్నాయి. ఇలా మరికొందరు హీరోయిన్లు ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్స్‌కి సై అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement