Courtesy: UNITED NATIONS
ప్రతి ఏడాది ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవా(మార్చి 8)న్ని ఘనంగా జరుపుకోవడానికి ప్రపంచమంతా కలిసి ఒక్కతాటిపైకి రావడం విశేషం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మహిళలు చేస్తున్న అద్భుతమైన పనులను గుర్తించే చర్చించే రోజు. సామాజిక న్యాయయోధుల నుంచి శాస్త్రవేత్తలు, కళాకారులు, రాజకీయ నాయకులు వరకు మహిళలు ప్రతి రంగంలో శరవేగంగా దూసుకుపోతున్నారు. ఈ రోజు గతం గురించి మాట్లాడటం కంటే భవిష్యత్తు వైపుకే దృష్టిసారించాలి.
ఎందుకంటే? స్త్రీలు కొన్ని విషయాల్లో సవాళ్లు ఎదుర్కుంటూనే ఉన్నారు. ఎంతలా స్త్రీలు ఉద్యోగాల్లో రాణిస్తున్నా పురుషులతో సమానంగా జీతాన్ని మాత్రం పొందలేకపోతున్నారు. అలాగే మంచి విద్యను అందుకోలేకపోతున్నారు. ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి "మహిళల కోసం పెట్టుబడి పెట్టండి: పురోగతిని వేగవంతం చేయండి" అని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తోంది. మహిళలకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్కరికీ ప్రపంచం ఆమోదయోగ్యమైనదిగా అనిపిస్తుంది.
సమిష్టిగా పని చేయాల్సిన ఐదు కీలక విభాగాలు..
- లింగ సమానత్వం అనేది గొప్ప మానవ హక్కుల సమస్యగా ఉంది. అందువల్ల మహిళల కోసం పెట్టుబడులు పెట్టండి అని పిలుపునిస్తోంది ఐక్యరాజ్యసమితి. దీన అర్థ స్త్రీ పురుష లింగ సమానత్వం కోసం పెట్టుబడులు పెట్టమని ఘంటా పథంగా చెబుతోంది.
- పేదరికాన్ని అంతం చేయడం!: కోవిడ్ మహమ్మారి సమయంలో దాదాపు 75 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలో పడిపోయారు. అందువల్ల 2030 నాటికి సుమారు 342 మిలియన్లకు పైగా మహిళలు, బాలికలు పేదరికంలో పడకుండా నిరోధించేలా తక్షణ చర్య తీసుకోవడం కీలకం.
- లింగ సమానంగా ఫైనాన్సింగ్ అమలు చేయడం: పెరుగుతున్న ధరల కారణంగా 2025 నాటికి దేశాలు ప్రజలపై ఖర్చు చేయడం 75% మేర తగ్గించొచ్చు. ఆ ప్రభావం మహిళలు వారి అవసరమైన సేవలపై ప్రతికూల ప్రభావం ఏర్పడవచ్చు
- హరిత ఆర్థిక వ్యవస్థగా, సురక్షిత సమాజంగా మార్చడం!: ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ మహిళలను అసమానంగా ఉంది. ముఖ్యంగా న్యాయవాద మహిళల గొంతులు విస్తరించేలా గ్రీన్ ఎకనామీగా సురక్షిత సమాజంగా మారాలని ప్రతిపాదించారు
- ఫెమినిస్ట్ మార్పు మేకర్లకు మద్దతు ఇవ్వడం: ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ స్త్రీవాద సంస్థలు అధికారిక అభివృద్ధి సహాయంలో 0.13% మాత్రమే పొందుతున్నాయి.
(చదవండి: ఇల్లాలిగా, బిజినెస్ విమెన్‌గా సరిలేరామెకు! దటీజ్ నీతా!)
Comments
Please login to add a commentAdd a comment