ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. మరి మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో కనిపించాలనే ఆలోచన మీకు ఏమైనా ఉందా? అని హీరోయిన్ కళ్యాణీ ప్రియదర్శన్‌ని అడిగితే– ‘‘ఇప్పటి వరకూ నేను చేసింది కేవలం మూడు నాలుగు సినిమాలే. ప్రస్తుతం నటిగా నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నన్ను నమ్మి లేడీ ఓరియంటెడ్ సినిమాతో ఎవరైనా దర్శకులు వస్తే చేస్తానేమో? కానీ, నేను లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసినా ఎక్కువ మందిని ప్రభావితం చేయలేకపోవచ్చని నా భావన.
దీపికా పదుకోన్‌లాంటి పెద్ద హీరోయిన్ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తే ఆ ప్రభావం వేరు.. ఆ సినిమా ఎక్కువ మంది ఆడియన్స్ దగ్గరకు వెళ్తుంది. కానీ, నేనింకా ఆ స్థాయికి వెళ్లలేదు. మా నాన్నగారు (మలయాళ దర్శకుడు ప్రియదర్శన్) స్టార్స్‌ని దృష్టిలో పెట్టుకొని కూడా కథలు రాసేవారు.. పాత్రల్ని డిజైన్ చేసేవారు. ఆ విధంగా ఎవరో ఒక రచయిత లేదా దర్శకుడు ఒక పాత్రకు కేవలం నన్ను మాత్రమే ఊహించుకొని కథ రాసే స్థాయి స్టార్‌గా ఎదగాలని కోరుకుంటున్నాను. నటిగా నా లక్ష్యం అదే’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment