నాయికా ప్రాధాన్యంగా సాగే చిత్రాలు చేయడం అంటే అంత ఈజీ కాదు. కథానుసారం ఫైట్లు చేయాలి.. పవర్‌ఫుల్ డైలాగులు చెప్పాలి.. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకన్నా కాస్త ఎక్కువగానే ఎమోషన్ పండించాలి.. అవసరమైతే క్యారెక్టర్‌కి తగ్గట్టు సన్నబడాలి లేదా బరువు పెరగాలి లేదా నల్లటి మేకప్ వేసుకోవాలి. అన్నింటికీ మించి సినిమా మొత్తం ఆ నాయిక తన భుజాల మీద మోయాలి. ‘లేడీ ఓరియంటెడ్’ మూవీ అంటే పెద్ద సవాల్. అలాంటి సవాల్ వస్తే కాదనకుండా ఒప్పేసుకుంటారు కథానాయికలు. ప్రస్తుతం ముగ్గురు నాయికలు తొలిసారి ‘హాయ్ హాయ్ నాయికా’ అంటూ లేడీ ఒరియంటెడ్ మూవీకి సై అన్నారు.
ఎమోషనల్ రెయిన్ బో
రష్మికా మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ బ్యూటీ ఇప్పటివరకూ ఎక్కవగా కమర్షియల్ చిత్రాలే చేశారు. ‘రెయిన్ బో’ చిత్రంతో తొలిసారి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు రష్మికా మందన్నా. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు శాంత రూబన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ప్రధానంగా ఎమోషన్స్‌తో సాగుతుందట. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ మరో లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. ఈ చిత్రం వచ్చే ఏడాదిప్రారంభంలో రిలీజ్ కానుంది.
రోడ్ ట్రిప్
మనాలి, లడఖ్ లొకేషన్స్‌తో ΄ాటు నార్త్‌లోని మరికొన్నిప్రాంతాల్లో రోడ్ ట్రిప్ చేస్తున్నారట హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్. ఇది పర్సనల్ ట్రిప్ కాదు... ్ర΄÷ఫెషనల్ ట్రిప్ అని తెలిసింది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ దర్శకత్వంలో రోడ్ ట్రిప్ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ లేడీ ఓరియంటెడ్ మూవీలో అనుపమా పరమేశ్వరన్ మెయిన్ లీడ్ రోల్ చేస్తుండగా, మలయాళ యంగ్ బ్యూటీ దర్శన, సీనియర్ నటి సంగీత లీడ్ రోల్స్ చేస్తున్నారు. ముగ్గురు మహిళల జీవితాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని టాక్. మరోవైపు ఈ సినిమా కంటే ముందే ‘బటర్ ఫ్లై’ అనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ చేశారు అనుపమా పరమేశ్వరన్. అయితే ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు అనుపమ చేస్తున్న చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. సో.. వెండితెరపై అనుపమ కనిపించనున్న తొలి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ఇదే అవుతుందనుకోవచ్చు.
వచ్చె నెలలో ఆరంభం
‘సమ్మోహనం, వి, అంతరిక్షం, మహాసముద్రం’ వంటి తెలుగు సినిమాలతో నటిగా ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకున్నారు హీరోయిన్ అదితీరావ్ హైదరి. ఈ బ్యూటీ సౌత్‌లో ఫస్ట్‌టైమ్ ఓ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. దర్శక– నటుడు రాజేష్ ఎమ్. సెల్వ ఓ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ΄్లాన్ చేస్తున్నారని, ఈ చిత్రంలోని మెయిన్ లీడ్ క్యారెక్టర్‌కు అదితీరావ్‌ని ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే నెలలో చిత్రీకరణప్రారంభించుకోనున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదల కానుంది.
త్రిష, అనుష్క, కాజల్ అగర్వాల్, తమన్నా, నయనతార, సమంత వంటి తారలు ఇప్పటికే పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు మరికొందరు ఈ తరహా చిత్రాలపై మొగ్గు చూ΄ారు. వీరి స్ఫూర్తితో కొందరు యువకథానాయికలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు సైన్ చేయడానికి రెడీ అవుతున్నారు.
∙
Comments
Please login to add a commentAdd a comment