సాధారణంగా నాయకులు కథలను నడిపిస్తారు.. ఆ కథల్లో నాయికలు ఆటాపాటలకు పరిమితం అవుతారు. కొన్నిసార్లు నాయికలే కథలను నడిపిస్తారు. ఆ కథల్లో ఆటాపాటలు కాదు.. ఫైట్లు ఎక్కువ ఉంటాయి. నాయికలు పవర్‌ఫుల్‌గా కనిపిస్తారు. ఇప్పుడు కొందరు కథానాయికలు లీడ్ రోల్స్‌లో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రాల గురించి తెలుసుకుందాం.
లేడీ సూపర్ స్టార్ @ 75
స్టార్ హీరోల సరసన రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూ మరోవైపు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్‌తో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు నయనతార. ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలపైనే దృష్టి సారిస్తుంటారామె. అందులో భాగంగా ప్రస్తుతం నూతన దర్శకుడు నీలేష్ కృష్ణతో ఓ మూవీ చేస్తున్నారామె.నయనతార కెరీర్‌లో ఇది 75వ చిత్రం. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ సినిమా ప్రేక్షకులకు ఓ సందేశం కూడా ఇవ్వనుంది. ఇప్పటివరకూ నయనతార నటించిన చిత్రాల్లోకెల్లా భారీ బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందుతోంది.
నాలుగు లీడ్ రోల్స్‌లో...
తెలుగు, తమిళ భాషల్లో అరడజనుకుపైగా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు హన్సిక. వాటిల్లో నాలుగు చిత్రాల్లో లీడ్ రోల్స్ చేస్తున్నారీ బ్యూటీ. తెలుగులో ఆమె నటించిన ‘105 మినిట్స్’ (రాజు దుస్సా దర్శకుడు), ‘మై నేమ్ ఈజ్ శృతి’ (శ్రీనివాస్ ఓంకార్ డైరెక్టర్) సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అటు తమిళంలో జేఎం రాజా శరవణన్ దర్శకత్వంలో ‘రౌడీ బేబీ’, ఇగోర్ డైరెక్షన్‌లో ‘మాన్’ అనే సినిమాలు చేస్తున్నారు హన్సిక.
నేనేనా..
హీరోయిన్ రెజీనా పురావస్తు శాస్త్రవేత్తగా లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘నేనేనా’. కార్తీక్ రాజు దర్శకత్వంలో రాజశేఖర్ వర్మ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ (తమిళంలో ‘సూర్పనగై’) భాషల్లో విడుదల కానుంది. ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో రెజీనా ఒక హత్య కేసు విచారణ చేస్తుండగా అది దాదాపు వందేళ్ల క్రితం జరిగిన ఘటన అని తెలుస్తుంది. 1920, ప్రస్తుతం.. ఇలా రెండు కాలాల్లో సాగే ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది.
రెండు చిత్రాల్లో..
ఓ వైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తున్న కీర్తీ సురేశ్ మరోవైపు ఫీమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్‌కి గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆమె తమిళంలో ‘రఘు తాత’, ‘రివాల్వర్ రీటా’ అనే చిత్రాల్లో లీడ్ రోల్స్ చేస్తున్నారు. సుమన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘రఘు తాత’ చిత్రంతో హోంబలే ఫిలింస్ (కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార) తమిళంలో అడుగుపెడుతోంది. ఈ చిత్రంలో విప్లవ భావాలున్న అమ్మాయి పాత్రలో కీర్తి నటిస్తున్నారు. అదే విధంగా కీర్తి లీడ్ రోల్ చేస్తున్న మరో చిత్రం ‘రివాల్వర్ రీటా’. కె. చంద్రు దర్శకత్వంలో కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులోనూ విడుదలయ్యే చాన్స్ ఉంది.
రెయిన్‌బోలో కొత్తగా...
దక్షిణాదిలోని స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్న రష్మికా మందన్న తొలిసారి ‘రెయిన్‌బో’ అనే లేడీ ఓరియంటెండ్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మికకు జోడీగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఇందులో రష్మిక వినూత్న పాత్రలో కనిపిస్తారు.
అప్‌కమింగ్ లేడీ ఓరియంటెడ్ సినిమాలివే!
Published Sat, May 13 2023 3:50 AM | Last Updated on Sat, May 13 2023 9:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment