Three Famous Heroes In Guest Roles For Trisha Film - Sakshi
Sakshi News home page

Trisha : అదృష్టం అంటే త్రిషదే.. ఏకంగా ముగ్గురు స్టార్‌ హీరోలు

Published Tue, May 30 2023 7:16 AM | Last Updated on Tue, May 30 2023 10:52 AM

Three Famous Heros In Guest Roles For Trisha Film - Sakshi

అదృష్టం అంటే నటి త్రిషదనే చెప్పాలి. ఈమె కెరీర్‌ డౌన్‌ అయినప్పుడల్లా ఒక సూపర్‌ హిట్‌ చిత్రం వచ్చి ఆమెను సేవ్‌ చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు విన్నైతాండి వరువాయా చిత్రం త్రిష కెరియర్‌కు టర్నింగ్‌ పాయింట్‌ అయ్యింది. ఆ తర్వాత మళ్లీ ఆమె డౌన్‌ ఫాల్‌ అయినప్పుడు 96 చిత్రం వచ్చి మరోసారి పైకి లేపింది. అదేవిధంగా ఇటీవల పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రం త్రిషకు నటిగా పునర్జన్మను ఇచ్చిందనే చెప్పాలి. దీంతో త్రిష మళ్లీ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది.

ప్రస్తుతం ఆమె ది రోడ్‌ అనే లేడీ ఓరియంటెడ్‌ కథా చిత్రంలో నటిస్తోంది. అదేవిధంగా లియో చిత్రంలో విజయ్‌తో రొమాన్స్‌ చేస్తోంది. ఇవి కాకుండా నటుడు అజిత్‌ నూతన చిత్రం విడా ముయర్చి లోనూ, మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్‌ నటించనున్న 234వ చిత్రంలోనూ నటించే అవకాశం ఈ సంచలన నాటికే దక్కనున్నట్లు సమాచారం.

ఇకపోతే మరోసారి హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రంలో నటించడానికి త్రిష సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఈ క్రేజీ చిత్రాన్ని వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై ఐసరి గణేష్‌ నిర్మించనున్నారు. దీనికి గౌరవ్‌ నారాయణన్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో ముగ్గురు ప్రముఖ నటులు గెస్ట్‌ రోల్స్‌ పోషించనున్నట్లు తాజా సమాచారం. వారు ఎవరన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement