10 పాయింట్లలో బీహార్‌ గొప్పతనం! | Here's The List Of 10 Surprising And Interesting Facts About Bihar In Telugu - Sakshi
Sakshi News home page

Interesting Facts About Bihar: 10 పాయింట్లలో బీహార్‌ గొప్పతనం!

Published Tue, Mar 19 2024 12:19 PM | Last Updated on Tue, Mar 19 2024 1:32 PM

Interesting Facts About Bihar - Sakshi

ప్రతియేటా మార్చి 22న బీహార్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రాష్ట్రం పేరు వినగానే ఇదొక వెనుకబడిన ప్రాంతమనే భావన అందరిలో కలుగుతుంది. అయితే బీహార్‌కు చెందిన కొన్ని విషయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి.  అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

  • ప్రపంచంలోనే అతిపెద్ద వైఫై జోన్ బీహార్ రాజధాని పట్నాలో ఉంది. ఇది దాదాపు 20 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీని సాయంతో పాట్నా నిట్‌ నుండి దానాపూర్ వరకు జనం ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుకోవచ్చు.

     
  • పేదరికపు కొలిమిలో శ్రమించిన మనుషులు మహనీయులు అవుతారని ఎవరో చెప్పినది బీహార్‌ను చూస్తే నిజమనిపిస్తుంది. బీహార్‌లో పేదరికం తాండవిస్తున్నప్పటికీ, ఈ రాష్ట్రం నుండి చాలా మంది ఉన్నతాధికారులుగా మారారు. దేశంలోని  పలువురు ఐఏఎస్‌లు, బ్యాంకు పీవోలు బీహార్ నుండి వచ్చినవారే కావడం విశేషం.
     
  • ప్రాచీన కాలంలో బీహార్‌ను మగధ అని పిలిచేవారు. అలాగే రాజధాని పట్నాను పాటలీపుత్ర పేరుతో పిలిచేవారు.
     
  • బ్రిటిష్ కాలంలో క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్రాలలో బీహార్ ఒకటి. అదే సమయంలో మహాత్మా గాంధీ బీహార్‌లోని చంపారణ్‌ నుండి స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రారంభించారు. దీనిని చంపారణ్‌ ఉద్యమం అని పిలుస్తారు.
     
  • సున్నా లేని గణితానికి విలువ లేదు. ఈ సంగతి ప్రపంచమంతటికీ తెలుసు. సున్నాను కనిపెట్టిన ఆర్యభట్ట బీహార్‌లోనే జన్మించారు.
     
  • బాలీవుడ్‌కు గర్వకారణంగా నిలిచిన నటుడు పంకజ్ త్రిపాఠి బీహార్‌కు చెందినవారే. అలాగే దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా బీహార్‌కు చెందినవారే.
     
  • బీహార్‌కి చెందిన తినుబండారం లిట్టీ చోఖా ఎంతో ఫేమస్ అయ్యింది. వెజ్ మొదలుకొని నాన్ వెజ్ వరకు బీహార్‌లో చాలా వంటకాలు అందుబాటులో ఉంటాయి. 

     
  • బీహార్‌లో జరిగే ఛత్ పండుగ యావత్‌ దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రపంచంలో అస్తమించే సూర్యుణ్ణి కూడా ఆరాధించే ఏకైక పండుగ ఇదే.
     
  • బీహార్‌కు చెందిన మిథిల పెయింటింగ్  ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందింది.

     
  • దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బీహార్‌లోనే  జన్మించారు.
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement