great
-
Tata Family Tree: టాటా వంశవృక్షం ఇదే..
టాటా గ్రూప్ దేశంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థగా గుర్తింపు పొందింది. టాటా గ్రూప్‌లో దాదాపు 100 కంపెనీలు ఉన్నాయి. టాటా గ్రూప్ ఉత్పత్తులు ప్రపంచంలోని దాదాపు 150 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. టాటా గ్రూప్ 1868లో ట్రేడింగ్ కంపెనీగా ప్రారంభమైంది. ఈ కంపెనీ అధిపతి రతన్ టాటా ఇప్పుడు మన మధ్య లేరు.టాటా గ్రూప్ వంశవృక్షాన్ని పరిశీలిస్తే ఈ కుటుంబంలో పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు. టాటా కుటుంబ వ్యాపారానికి రతన్ దొరబ్ టాటా పునాది వేశారు. ఆయనకు ఇద్దరు సంతానం. వారు బాయి నవాజ్‌బాయి రతన్ టాటా, నుస్సర్వాన్జీ రతన్ టాటా. నుస్సర్వాన్జీ ఒక పార్సీ పండితుడు. ఈ కుటుంబం నుంచి వ్యాపారంలోకి అడుగుపెట్టిన మొదటి వ్యక్తి. అతను 1822లో జన్మించి 1886లో మరణించారు. జంషెడ్జీ టాటానుస్సర్వాన్జీ టాటాకు ఐదుగురు సంతానం. వారిలో ప్రముఖ వ్యాపారవేత్త జంషెడ్జీ టాటా ఒకరు. అతను టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు. టాటా గ్రూప్‌లోని స్టీల్ (టాటా స్టీల్), హోటళ్లు (తాజ్ మహల్) వంటి ప్రధాన వ్యాపారాలకు పునాది వేశారు. ఆయనను భారతీయ పరిశ్రమ పితామహునిగా పిలుస్తారు. అతని జీవిత కాలం 1839 నుండి 1904.దొరాబ్జీ టాటాదొరాబ్జీ టాటా జంషెడ్జీ టాటా పెద్ద కుమారుడు. జంషెడ్జీ టాటా తర్వాత టాటా గ్రూప్ వ్యాపారాన్ని ఆయనే చేపట్టారు. అతని జీవిత కాలం 1859-1932. టాటా పవర్ వంటి వ్యాపారాలను నెలకొల్పడంలో దొరాబ్జీ కీలక పాత్ర పోషించారు.రతన్ జీ టాటారతన్జీ టాటా జంషెడ్జీ టాటా చిన్న కుమారుడు. అతని జీవితకాలం 1871 నుండి 1918. అతను టాటా గ్రూప్‌నకు పత్తి- వస్త్ర పరిశ్రమల వంటి వ్యాపారాలను జోడించారు.జేఆర్డీ టాటాజేఆర్డీ టాటా పూర్తి పేరు జహంగీర్ రతన్ జీ దాదాభాయ్ టాటా. అతని జీవితకాలం 1904-1993. ఇతను రతన్జీ టాటా, సుజానే బ్రియర్ల కుమారుడు. 50 ఏళ్లకు పైగా టాటా గ్రూప్ ఛైర్మన్‌గా ఉన్నారు. టాటా ఎయిర్‌లైన్స్‌ను జెఆర్‌డి టాటా స్థాపించారు. ఈ విమానయాన సంస్థ పేరు ఎయిర్ ఇండియా.నావల్ టాటానావల్ టాటా జీవిత కాలం 1904- 1989. ఇతను రతన్జీ టాటా దత్తపుత్రుడు. రతన్ నావల్ టాటా 1991 నుండి 2012 వరకు టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా, 2016-17మధ్యలో తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్నారు. జాగ్వార్ ల్యాండ్ రోవర్ , టెట్లీ వంటి అంతర్జాతీయ బ్రాండ్ల కొనుగోలులో నావల్ టాటా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈయన టాటా ఇంటర్నేషనల్‌కు చైర్మన్‌గా కూడా ఉన్నారు.రతన్ టాటారతన్ టాటా జీవిత కాలం 1937 నుండి 2024. ఈయన నావల్ టాటా, సునీ కమిషరియట్ల కుమారుడు. రతన్ టాటా భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు.నోయల్ టాటాకు ముగ్గురు కుమారులురతన్ టాటా వరుస సోదరుడు నోయెల్ టాటా ముగ్గురు సంతానం. వారు మాయా టాటా, నెవిల్లే టాటా, లియా టాటా. ఈ ముగ్గురూ టాటా గ్రూప్‌లో వేర్వేరు వ్యాపారాలను పర్యవేక్షిస్తున్నారు. ఇది కూడా చదవండి: టాటా గ్రూప్ వ్యాపార వివరాలు తెలిపే వీడియో -
10 పాయింట్లలో బీహార్ గొప్పతనం!
ప్రతియేటా మార్చి 22న బీహార్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రాష్ట్రం పేరు వినగానే ఇదొక వెనుకబడిన ప్రాంతమనే భావన అందరిలో కలుగుతుంది. అయితే బీహార్‌కు చెందిన కొన్ని విషయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద వైఫై జోన్ బీహార్ రాజధాని పట్నాలో ఉంది. ఇది దాదాపు 20 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీని సాయంతో పాట్నా నిట్ నుండి దానాపూర్ వరకు జనం ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుకోవచ్చు. పేదరికపు కొలిమిలో శ్రమించిన మనుషులు మహనీయులు అవుతారని ఎవరో చెప్పినది బీహార్‌ను చూస్తే నిజమనిపిస్తుంది. బీహార్‌లో పేదరికం తాండవిస్తున్నప్పటికీ, ఈ రాష్ట్రం నుండి చాలా మంది ఉన్నతాధికారులుగా మారారు. దేశంలోని పలువురు ఐఏఎస్‌లు, బ్యాంకు పీవోలు బీహార్ నుండి వచ్చినవారే కావడం విశేషం. ప్రాచీన కాలంలో బీహార్‌ను మగధ అని పిలిచేవారు. అలాగే రాజధాని పట్నాను పాటలీపుత్ర పేరుతో పిలిచేవారు. బ్రిటిష్ కాలంలో క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్రాలలో బీహార్ ఒకటి. అదే సమయంలో మహాత్మా గాంధీ బీహార్‌లోని చంపారణ్ నుండి స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రారంభించారు. దీనిని చంపారణ్ ఉద్యమం అని పిలుస్తారు. సున్నా లేని గణితానికి విలువ లేదు. ఈ సంగతి ప్రపంచమంతటికీ తెలుసు. సున్నాను కనిపెట్టిన ఆర్యభట్ట బీహార్లోనే జన్మించారు. బాలీవుడ్‌కు గర్వకారణంగా నిలిచిన నటుడు పంకజ్ త్రిపాఠి బీహార్‌కు చెందినవారే. అలాగే దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా బీహార్‌కు చెందినవారే. బీహార్‌కి చెందిన తినుబండారం లిట్టీ చోఖా ఎంతో ఫేమస్ అయ్యింది. వెజ్ మొదలుకొని నాన్ వెజ్ వరకు బీహార్‌లో చాలా వంటకాలు అందుబాటులో ఉంటాయి. బీహార్‌లో జరిగే ఛత్ పండుగ యావత్ దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రపంచంలో అస్తమించే సూర్యుణ్ణి కూడా ఆరాధించే ఏకైక పండుగ ఇదే. బీహార్‌కు చెందిన మిథిల పెయింటింగ్ ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందింది. దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బీహార్లోనే జన్మించారు. -
ఏది గొప్పది... స్వర్గమా! కాశీనా!!!
ముత్తుస్వామి దీక్షితార్ గొప్ప వాగ్గేయకారులు. పుస్తకం పట్టి శాస్త్రాధ్యయనం చేయక పోయినా గంగానదీతీరాన గురు శుశ్రూష చేస్తూ చాలా ధర్మసూక్ష్మాలను తెలుసుకున్నారు. తదనంతర కాలంలో ఆయన గంగాదేవి గొప్పదనాన్ని కీర్తిస్తూ చేసిన కీర్తనలో ఆయన విషయగాఢత మనకు బోధపడుతుంది. ‘‘...అక్రూర పూజితే అఖిల జనానందే/సకలతీర్థమూలే...’’ అన్నారు. అన్ని తీర్థాలూ గంగానదిలోనే ఉన్నాయన్నారు. ఎందుకలా...!!! తీర్థయాత్ర చేసివచ్చాం అంటారు గానీ భగవత్ దర్శన యాత్ర చేసివచ్చాం అనరు. తీర్థయాత్ర అంటే.. మజ్జనం అంటే.. స్నానం. తీర్థంలో స్నానం చేస్తారు. వేదాలకు భాష్యం చెబుతూ పెద్దలు ఒక మాటన్నారు. అంగీరసాది మహర్షులు ఊర్థ్వలోకాలకు వెడుతూ... వెళ్ళేముందు తమ తమ నియమాలను, తపోదీక్షను, తపఃఫలితాన్ని నీటిలో కొన్నిచోట్ల నిక్షేపించి వెళ్ళారు. అవి ఎక్కడ నిక్షేపింపబడ్డాయో అవి తీర్థములు. అటువంటి తీర్థాల్లోకెల్లా గొప్ప తీర్థమేది... అంటే మణికర్ణిక. అది ఎక్కడుంది... గంగానదిలో! మణికర్ణికా వైభవం అంతా ఇంతా కాదు. ‘మణికర్ణికాష్టకమ్’ అని శంకరాచార్యులవారు ఒక అష్టకం చేశారు. ఆయన ఒక నదిని గురించి చెప్పడమే చాలా గొప్ప. సాధారణంగా ఆయన క్షేత్ర ప్రసక్తి తీసుకురారు. అటువంటిది గంగాష్టకమ్, నర్మదాష్టకమ్, యమునాష్టకమ్ చేశారు. ఒక్క మణికర్ణిక మీద ఒక అష్టకమ్ చేశారు. తీర్థం ఎంత గొప్పదో చెప్పడానికి ఆయన ఒక శ్లోకంలో అద్భుతమైన వర్ణన చేశారు. ‘‘కాశీ ధన్యతమా విముక్తనగరీ సాలంకృతా గంగయా/ తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ / స్వర్లోకస్తులితః సహైవ విబుధైః కాశ్యా సమం బ్రహ్మణా/ కాశీ క్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః’’. కాశీ చాలా చాలా గొప్ప నగరం. అసలు కాశీ ఒకసారి వెడితే చాలు.. అనుకుంటాం. కాశీ అంటేనే ప్రకాశం. కాశీ విముక్తనగరి. అంత గొప్పది కాశీ .... ఆ కాశీకి మళ్ళీ అలంకారం గంగానది. తత్రేయం మణికర్ణికా. అక్కడ మణికర్ణికా తీర్థం కూడా ఉంది. దీనికున్న గొప్పదనం ఏమిటంటే – ‘‘మధ్యాహ్నే మణికర్ణికాస్నపనజం పుణ్యం న వక్తుం క్షమః/ స్వీయైరబ్ధ శతైశ్చతుర్ముఖధరో వేదార్థ దీక్షాగురుః/యోగాభ్యాసబలేన చంద్రశిఖరస్తత్పుణ్య పారంగత/స్త్వత్తీరే ప్రకరోతి సుప్తపురుషం నారాయణం వా శివమ్’’... మధ్యాహ్నం 12 గంటలవేళ మణికర్ణికాతీర్థంలో స్నానం చేస్తున్న వారికోసం శివకేశవ రూపాల్లో పరబ్రహ్మం పోట్లాడుకుంటుందట... నే తీసుకువెడతా అంటే నే తీసుకువెడతా అని.. ‘నీయందు ఎవరయినా స్నానం చేస్తే వారికి మోక్షం ఇస్తాను’ అని ముక్తిదేవత ఒక సేవకురాలిలాగా చేతులు కట్టుకుని నిలబడి ఉంటుందట. ఇంతమంది దేవతలతో కూడుకున్న స్వర్గలోకం గొప్పదా? కాశీపట్టణం గొప్పదా ? అని ఒకప్పుడు బ్రహ్మగారికి సందేహం వచ్చిందట. పెద్ద త్రాసు సృష్టించి ఒక పళ్ళెంలో స్వర్గలోకాన్ని మరో పళ్ళెంలో కాశీపట్టణాన్ని, గంగానదిని, మణికర్ణికా తీర్థాన్ని ఉంచాడట...‘‘ కాశీ క్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః’’ కాశీ బరువుకు అది ఉంచిన పళ్ళెం కిందికి దిగితే.. స్వర్గలోకం ఉన్న పళ్ళెం పైకి తేలిపోయిందట. అటువంటి కాశీ పట్టణం ఉన్న ఈ దేశం గొప్పది, ఇక్కడ పుట్టడం కూడా గొప్ప అదృష్టం కదూ! బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఖాయం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఖాయమని, డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుందని టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అదే రోజు ఎల్బీ స్టేడియంలో ఆరు గ్యారంటీలపై సంతకం పెట్టడం ఖాయమన్నారు. పరిగి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కుమారుడు, మాజీ డీసీసీబీ చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి, తాండూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సునీత సంపత్, మాజీ డీసీసీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి కుమారుడు మహిపాల్ రెడ్డి, మానకొండూర్ నియోజకవర్గానికి చెందిన ఇల్లంతకుంట, మానకొండూర్ ఎంపీపీలు, ఇతర నేతలు గాంధీభవన్‌లో రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను కేసీఆర్ తాగుబోతుల అడ్డాగా మార్చారని విమర్శించారు. డీజీపీని తొలగించాలని డిమాండ్ కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని రేవంత్ హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వేధించిన అధికారులకు మిత్తితో సహా చెల్లిస్తామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర డీజీపీని తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ప్రభాకర్ రావు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారిపై, కాంగ్రెస్ నాయకుల ఫోన్ లపై నిఘా పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకు సాయం చేస్తున్న 75 మంది జాబితాను కేటీఆర్ తయారు చేసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఇచ్చారని, కొంతమందిని కేటీఆరే స్వయంగా బెదిరిస్తున్నారని నిందించారు. అర్వింద్ కుమార్, జయేశ్ రంజన్, సోమేశ్ కుమార్ లాంటి అధికారులు చందాలు ఇవ్వాలని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అక్బరుద్దీన్ ఓవైసీ కూడా మోదీ, కిషన్ రెడ్డి, రాజాసింగ్‌లా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో చేరిన గాజర్ల అశోక్ సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ మాజీ నేత గాజర్ల అశోక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన ఆయన గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా రు. ఉద్యమపంథా వీడి సాధారణ జనజీవనం గడుపుతున్న అశోక్ ప్రజలకు తనవంతు సేవ చేసేందుకు ఏ రాజకీయ పార్టీలో చేరాలన్న దానిపై కొంతకాలంగా సన్నిహితులు, అభిమా నులతో చర్చలు జరుపుతున్నారు. అందరి అభీష్టం మేరకు ఆయన కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. అశోక్ చేరిక అటు ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పరకాల అసెంబ్లీ టికెట్ అశోక్‌కు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
మనసుకు హత్తుకునేలా...
గొప్ప వాక్కును కొందరు మహాత్ములు పద్యరూపంలో చెప్పారు. మరి కొందరు గద్యరూపంలో చెప్పారు, ఇంకొందరు గీతం రూపంలో చెప్పారు. పోతన భాగవతాన్ని పద్య, గద్యరూపంలో చెప్పారు. ప్రధానంగా పద్య రూపంలో చెప్పారు. పద్యానికి ఉన్న లక్షణం –అది ఛందోబద్దం. నాలుగుసార్లు చదివితే అది నోటికొచ్చేస్తుంది. జ్ఞాపకంలో ఉండిపోతుంది. జీవితంలో ఏది ప్రధానంగా జ్ఞాపకం ఉంచుకోవాలో, అలా ఉంచుకుని సందర్భాన్నిబట్టి గుర్తు తెచ్చుకుని సానుకూలంగా ఆచరణలో పెట్టుకోగలిగిన వాటిని ఛందోబద్దంగా ఇస్తే అవి మనసుకు హత్తుకుని మనకు అవసరాన్నిబట్టి ప్రయోజనం కలిగిస్తాయి. కానీ అంత జ్ఞాపకం పెట్టుకోవలసిన అవసరం లేని వాటిని గద్యరూపంలో(వచనంగా) అందించాడు పోతన, పద్యం, గద్యం కలిసి రాసినప్పుడు. తెలుగులో పద్యరూపంలో చెప్పినట్టుగానే, సంస్కృతంలో శ్లోకరూపంలో చెప్పారు. ఒక పద్యాన్ని చదవడంకన్నా, ఒక శ్లోకాన్ని చదవడంకన్నా, మేము వాక్యరూపంలో ఉన్న వచనాన్ని(గద్యాన్ని) చదువుకుని ప్రయోజనం పొందుతామని ఇష్టపడేవారికి గద్యంలో కూడా అందుబాటులో ఉంచారు. మరికొందరు చాలా తేలికగా అవతలివారికి బోధ చేయడానికి గీతం రూపంలో అందించారు. గీతం అంటే పాట. పాట మనసును రంజింప చేస్తుంది. సహజంగా పుట్టుకచేత క్రౌర్యం ఉన్నవి కూడా సంగీతం వినబడేటప్పటికి అవి వాటి క్రూరత్వాన్ని ఆ కాసేపు పక్కనబెట్టేస్తాయి. అలాగే గాఢమైన అజ్ఞానంతో ఏమీ తెలియనివారు కూడా సంగీతంతో కూడిన గీతం వినేటప్పటికి గొప్ప శాంతిని పొందుతారు. పశువులు కావచ్చు, పసిబిడ్డలు కావచ్చు .. పాటవినేటప్పటికి ఒక తన్మయావస్థకు లోనుకావడం జరుగుతుంది. ఏడుస్తున్న వాళ్ళు కూడా ఆ కాసేపు ఏడుపు ఆపేస్తారు. మనసు శాంతిని పొందుతుంది. సమాజ హితం కోసం పద్యరూపంలోగానీ, గద్య, గీత రూపాల్లో కానీ ఎవరు ఏమీ ఆశించకుండా వాక్కులుగా వెచ్చించారో వారు శాశ్వత్వాన్ని పొందారు. ‘ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్/ సొమ్ములు? గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము? బాసి కాలుచే/ సమ్మెట పోటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ/ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్.’ అంటాడు పోతన. నేను సమాజహితాన్ని కోరి పలుకుతున్నాను తప్ప నేనేమీ ఆశించడంలేదన్నాడు.. అదే శాశ్వతమైనది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
టాప్ లేపేస్తున్న ‘పాప్’ సింగర్స్
-
నికోబార్ వద్ద భారీ ట్రాన్స్షిప్మెంట్ కార్గో ప్రాజెక్ట్
న్యూఢిల్లీ: గ్రేట్ నికోరాబ్ ఐలాండ్ వద్ద బంగాళాఖాతంలో ‘ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ప్రాజెక్ట్’కు కేంద్ర షిప్పింగ్ శాఖ ఆసక్తి వ్యక్తీకరణలను (ఈవోఐ) ఆహ్వానించింది. పీపీపీ కాంట్రాక్ట్ సంస్థ, ప్రభుత్వ పెట్టుబడులు కలసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.41,000 కోట్ల వ్యయం చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ప్రతిపాదిత పోర్ట్ ప్రాజెక్ట్ వార్షికంగా 16 మిలియన్ కంటెయినర్ల నిర్వహణ సామర్థ్యంతో ఉంటుందని తెలిపింది. మొదటి దశ రూ.18,000 కోట్లతో 2028 నాటికి పూర్తవుతుందని, 4 మిలియన్ టన్నులకు పైగా కంటెయినర్లను ఇది నిర్వహించగలదని వివరించింది. ఈ రవాణా పోర్ట్‌కు అనుబంధంగా ఎయిర్పోర్ట్, టౌన్షిప్, పవర్ ప్లాంట్ కూడా నిర్మించాలనేది ప్రణాళికగా షిప్పింగ్ శాఖ తెలిపింది. అంతర్జాతీయ జల రవాణా మార్గంలో ఈ పోర్ట్ ఏర్పాటు కానుందని, ఇదే మార్గంలో ప్రస్తుతం సింగపూర్, క్లాంగ్, కొలంబో పోర్ట్‌లు ఉన్నట్టు పేర్కొంది. -
Heeraben Modi: తల్లి చెప్పిన మాటలు తల్చుకుంటూ..
ప్రతీ వ్యక్తి జీవితంలో అమ్మ ఒక మధురమైన పదం. కానీ, అమ్మ అంటే పదం మాత్రమే కాదు.. ఎన్నో భావోద్వేగాల సంగ్రహం అంటారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. మాతృవియోగం తర్వాత తన తల్లితో పెనవేసుకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ.. అద్భుతమైన శతాబ్ది(తల్లి హీరాబెన్ మోదీని ఉద్దేశించి..) భగవంతుని పాదాల చెంత ఉంది అని సోషల్ మీడియాలో మోదీ చేసిన వ్యాఖ్య చేశారు. సన్యాసి ప్రయాణం, నిస్వార్థ కర్మయోగి, విలువలకు కట్టుబడి జీవించడం.. ఈ త్రిమూర్తులను అమ్మ ద్వారా అనుభూతి చెందాను అని పేర్కొన్నారు. తెలివితో పని చేయండి.. స్వచ్ఛమైన జీవితాన్ని గడపండి అంటూ తన వందవ పుట్టినరోజున ఆమె తనకు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నారు ఆయన. తన అమ్మ సాధారణంగా కనిపించినప్పటికీ ఆమె అసాధారణమైన మహిళ అని అంటారు నరేంద్ర మోదీ. చాలా చిన్న వయసులోనే తన తల్లి ఆమె మాతృమూర్తిని కోల్పోయిందని, జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించిందని, అయినప్పటికీ బలంగా నిలబడిందని పేర్కొన్నారు. शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है। pic.twitter.com/yE5xwRogJi — Narendra Modi (@narendramodi) December 30, 2022 1922, జూన్ 18న గుజరాత్ మెహ్సనా వద్‌నగర్‌లో జన్మించారు హీరాబెన్. చిన్నతనంలోనే ఆమె తల్లి స్పానిష్ ఫ్లూతో కన్నుమూసింది. ఫొటోలు కూడా లేకపోవడంతో.. ఆమె ముఖం కూడా హీరాబెన్‌కు గుర్తు లేదట. అలా తల్లి లేకుండానే హీరాబెన్ బాల్యం గడిచింది. తల్లి ఒడిలో సేద తీరని పరిస్థితి.. తన పిల్లలకు రాకూడదని ఆమె ఎంతో తాపత్రయపడింది. బడికి పోయి రాయడం, చదవడం నేర్వలేదు. పేదరికం, కష్టాలతోనే గడిచిపోయింది ఆమె జీవితం. అందుకేనేమో బాధ్యతగా తన ఐదుగురు పిల్లలను పెంచింది. అదే బాధ్యతను బిడ్డలకు ప్రబోధించింది. బాధ్యతాయుతంగా ఉండాలని పిల్లలకు చెప్పడమే కాదు.. ఆరోగ్యం సహకరించకున్న ఆమె ఓటేసి తన బాధ్యతను నేరవేర్చారు కూడా. టీ అమ్ముకునే దామోదరదాస్ ముల్చంద్ మోదీని వివాహాం చేసుకున్నారు హీరాబెన్. ఆ ఇంటికి పెద్ద కోడలిగా వెళ్లిన ఆమె.. అంతే బాధ్యతాయుతంగా ఇంటిని నడిపించే యత్నం చేశారు. సోమ భాయ్ మోదీ, అమృత్ భాయ్ మోదీ, నరేంద్ర మోదీ, ప్రహ్లాద్ మోదీ, వసంతి బెన్, పంకజ్ మోదీ.. ఇలా నలుగురు కొడుకులు, ఒక కూతురిని కనిపెంచారామె. గాంధీనగర్‌లో రేసన్ గ్రామంలో చిన్న కొడుకు పంకజ్ మోదీ దగ్గర చివరిరోజుల్లో గడిపారామె. తన పెరుగుదల కోసం , ఎదుగుదల కోసం తన తల్లి ఎన్నో త్యాగాలను చేసిందని మోదీ గుర్తు చేసుకున్నారు. తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి, తనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఎంతో ప్రేరణ ఇచ్చిందని తరచూ చెప్తుంటారు. నా తల్లి కష్టాలను కళ్లారా చూశా. ఇంట్లో పనులన్నీ ఆమె ఒక్కతే చేసుకునేది. ఇంటి పోషణ కోసం కూడా తన వంతు ప్రయత్నించేది. ఇతరుల ఇళ్లల్లో వంటపాత్రలు కడిగి, చరఖా తిప్పి వచ్చిన ఆదాయంతో కుటుంబ ఖర్చులకు సాయంగా నిలిచింది. చిన్న ఇల్లు.. బురద మట్టి గోడలు.. వర్షానికి ఇల్లంతా కురిసినా, వర్షం నీరు పడుతున్న చోట బకెట్లు, గిన్నెలు పెట్టేదని, ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, తన తల్లి ఎంతో దృఢంగా నిలిచిందని మోదీ తన బ్లాగులో రాసుకొచ్చారు. కష్టాలను ఆమె ధైర్యంగా ఎదుర్కొనే వారు. ఆమె పేరిట ఎలాంటి ఆస్తులు లేవు. ఒంటిపై ఆమె బంగారం ధరించింది ఏనాడూ చూడలేదు. అసలు ఆమెకు ఆసక్తి కూడా ఉండేది కాదు. ఆ తర్వాత కూడా అతి సాధారణ జీవితాన్ని, ఒక చిన్న గదిలో కొనసాగించినట్లు గుర్తు చేసుకున్నారు. అమ్మతో కలిసి ప్రజల సమక్షంలో ఆయన కనిపించింది అరుదు. ఏక్తా యాత్ర పూర్తి చేసుకుని శ్రీనగర్ లాల్ చౌక్‌లో జాతీయ జెండా ఎగరేసి.. తిరిగి అహ్మదాబాద్‌కు చేరుకున్నప్పుడు తికలం దిద్దింది ఆ తల్లి. మళ్లీ.. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు ఆమె కొడుకు వెంట ఉంది. తల్లి చేసిన కర్తవ్య బోధ వల్లనేమో.. ఆమె అంత్యక్రియలు పూర్తి చేశాక బాధను దిగమింగుకుని తిరిగి విధుల్లోకి దిగి పోయారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. తన తల్లి నూరవ పుట్టిన రోజు సందర్భంగా తనకు జన్మనిచ్చిన తల్లికి కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తూ రాసిన ‘మదర్’ బ్లాగ్ నుంచి సంగ్రహణ -
గురువాణి: అమ్మ ప్రేమకన్నా...
పసిపిల్లలకు లోకంలో తల్లికన్నా ప్రియమైనది ఏదీ ఉండదు. అమ్మతో మాట్లాడడం, అమ్మని ముట్టుకోవడం, అమ్మతో ఆడుకోవడం, అమ్మ పాట వినడం, అమ్మ స్పర్శ... వీటికన్నా ప్రియమైనవి లోకంలో ఉండవు. సమస్త జీవకోటినీ సష్టించే పరబ్రహ్మ స్వరూపం అమ్మే. ఈ లోకంలోకి రాగానే పాలిచ్చి, ఆహారమిచ్చి పోషించే మొట్టమొదటి విష్ణు స్వరూపం అమ్మయే. అన్ని ప్రాణులను తన వెచ్చటి స్పర్శతో నిద్రపుచ్చే ప్రేమైకమూర్తి అయిన హర స్వరూపం కూడా అమ్మయే. అందుకే అమ్మ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త సమాహార స్వరూపం. అటువంటి అమ్మకన్నా ప్రియమైనది ప్రపంచంలో మరేముంటుంది? అయితే ఒకటి గమనించాలి. అమ్మకడుపులోంచి వచ్చిన వాడు మళ్లీ అమ్మ కడుపులోకి పోలేడు. కానీ ఈ దేశం మట్టిలో పుట్టి... మళ్ళీ చిట్ట చివర ఈదేశం మట్టిలో కలిసిపోతాం. అందువల్ల జన్మభూమి తల్లికన్నా గొప్పది. తల్లికన్నా ప్రియమైనది. అందునా భారత దేశం. ఇంత గొప్పదేశంలో పుట్టినవాళ్ళం...భరతమాత బిడ్డలం. ఇది సామాన్యమైన భూమినా..!!! ఇది వేదభూమి, ఇది కర్మ భూమి(వేద సంబంధమైన క్రతువులు జరుపుకోవడానికి అర్హమైన భూమి)... ఎన్ని పుణ్యనదులు ప్రవహిస్తున్నాయో ఇక్కడ ఈ భావనలతో ఉప్పొంగిన ఓ మహాకవి పరవశించిపోయి ........ జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ జయ సశ్యామల సు శ్యామచలా చేలాంచల జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పద యుగళా జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ.... ... ఇలా అల్లి ఓ పాట రాసేసాడు. ఆయనే దేవులపల్లి కృష్ణ శాస్త్రి.. ఈ అమ్మకు పుట్టిన బిడ్డలు అనంతం. వారందరికీ అమ్మ పోలికలే వచ్చాయట... ఏమిటా పోలికలు... త్యాగం, పదిమందికీ పెట్టడం, పరోపకారం, కృతజ్ఞత, ఆతిథ్యం...ఉపకారం చేసినవాడికి ఉపకారం చేయడమే కాదు, అపకారికి కూడా ఉపకారం చేయగల విశాల హృదయం... వీటన్నింటికీ మించి ఓర్పు... ఓర్పును మించిన ధర్మం, ఓర్పును మించిన సత్యం, ఓర్పును మించిన యజ్ఞం ఉండవు... అంత గొప్ప ఓర్పు కలిగి ఉండడం, అరిషడ్వర్గాలను జయించడం, తనలో ఉన్న పరబ్రహ్మాన్ని తెలుసుకోవడం.. అమ్మకున్న ఈ లక్షణాలన్నీ బిడ్డలకొచ్చాయి. అందుకే వారి హృదయాలలో ఆమె ఎప్పుడూ పచ్చని చీర కట్టుకుని వెలిగిపోతూ కన్పిస్తూంటుంది. పరమ పవిత్రమైన ఆమె పాదాలు.. ఈ సృష్టిలో ఆమె పాదాలను ముద్దాడడం పసిపిల్లవాడి పారవశ్యం. కవిగా దేవులపల్లి ఎంత పరవశించిపోయారంటే ‘‘అక్షరమక్షరం నా మనసు కరిగితే ఈ పాటయిందమ్మా..’’.అని చెప్పుకుని ఆమె పాదపద్మాలకు సమర్పించుకున్నారు. అత్యంత పవిత్రమైన ఈ అమృతోత్సవాల సందర్భంగా ఇంత మధురమైన దేశభక్తి గేయాన్ని రాసిన దేవులపల్లి కృష్ణశాస్త్రిగారిని స్మరించుకుంటే... మనం కూడా ఆయనలా చిన్నపిల్లలమై ఆమె పాదాలను ముద్దాడే అనుభూతిని పొందుదాం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
శతక నీతి – సుమతి: వాడు దుందుభిలా ఉన్నాడే!
‘ఏం తినాలనుకుంటున్నావో అవి తినేసెయ్.. ఏది నీకిష్టమో అది ఇప్పుడే చేసేస్కో... ఎవరెవరితో ఏవేం మాట్లాడాలనుకుంటున్నావో అది ఇవ్వాళే మాట్లాడేసుకో... ఈ రాత్రికి హాయిగా నిద్రపో... రేప్పొద్దున యుద్ధానికి రా.. ఎందుకంటే మళ్ళీ ఇంటికెళ్ళవు..’ ...పొగరు మాటలు ఇవి.. రామాయణంలో కనబడతారు.. వాలి, రావణాసురుడు. వాళ్ళిద్దరి ప్రవృత్తి ఒక్కలాగే ఉంటుంది. ప్రతిరోజూ ఎవరో ఒకరి దగ్గరకి పోవడం, నువ్వు యుద్ధానికి రావాలని రెచ్చగొడుతూ ఇలా మాట్లాడుతుంటారు. వాలి దగ్గరకు వెళ్ళి దుందుభి మాట్లాడిన మాటలివి. వాలి ‘ఎవడ్రా అది’ అని బయటకు వచ్చాడు. ఫలితం– దుందుభి చచ్చిపోయాడు. ఇలాటి వాళ్ళు ఇప్పుడూ మనకు కనిపిస్తూంటారు. వీళ్ళను లోకులు దుందుభితో పోలుస్తుంటారు. వదరి మాట్లాడడం..ఎందుకలా ? అందుకే బద్దెనగారు సుమతీ శతకంలో..‘బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ !’ అంటారు. రామాయణం అదే చెబుతుంది. మన పురాణాలు, నీతి శాస్త్రాలూ అవే చెబుతాయి. అలా ప్రవర్తించకు. జీవితంలో అటువంటి అలవాట్లు చేసుకోకు. రావణాసురుడు కూడా ఇలాగే .. సముద్రుడి దగ్గరకు వెళ్ళి బెదిరించాడు. యమధర్మరాజును కూడా వదిలిపెట్టలేదు. కొందరు వీరి దాష్టీకానికి భయపడి పారిపోతే మరికొందరు వీరిని ఓడిస్తుంటారు..ఒకప్పుడు కార్తవీర్యార్జునుడి చేతిలో ఇలాగే ఓడిపోయాడు. అయినా బుద్ధిరాదు. సిగ్గుండదు, మారరు. అలా అతిశయంతో ప్రవర్తించినందుకు చిట్టచివరకు ఏమయింది ... రావణుడు ఒక్కడే పోలేదు, బంధుమిత్రకళత్రాదులందరూ పోయారు, లంకాపట్టణంలో ఉన్న రాక్షసులందరూ పోయారు. .ధర్మం వైపునిలబడ్డ విభీషణుడు తప్ప. ఒకప్పుడు ఒక గణిత శాస్త్రజ్ఞుడు ఒకాయన ఉండేవాడు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ సభకు వెళ్ళినా ఒక మాట అంటుండేవాడు...నాకు తెలిసినన్ని అంకెలు, సంఖ్యలు ఎవరికీ తెలియవు. ఎంతవరకయినా లెక్కపెట్టగలను... అని. ఒకసారి సముద్రపు ఒడ్డుకు వెళ్ళాడు.. ఒడ్డున ఇసుక బాగా ఉంటుంది కదా... అక్కడ కూర్చుని చేత్తో గుప్పెడు ఇసుక తీసుకొన్నాడు. ఉన్నట్లుండి.. తత్త్వం బోధపడింది. నేను నిజంగా ఇక్కడ ఉన్న ఇసుక రేణువులన్నింటినీ లెక్కపెట్టి చెప్పగలిగే అంకెలు, సంఖ్యలు నాకు తెలుసా.... ఎదురుగా ఉండే అలలు ఎగిసిపడుతుంటే నీటిబిందువులను చూసాడు... వీటిని లెక్కపెట్టి చెప్పగలిగే సంఖ్య నాకు తెలుసా.. ఇలా ఆలోచిస్తుంటే.. నేను ఎంత పెద్ద సంఖ్యయినా లెక్కపెట్టగలను అనుకున్నాను. కానీ కాదు. నాకు తెలిసినదేపాటి? వాటిని సృష్టించినవాడు గొప్ప... అని చేతులెత్తి నమస్కరించుకున్నాడు. ఇక ఆ పై ఎప్పడూ ఇటువంటి అతిశయోక్తి మాటలు మాట్లాడలేదు. ఇతరులకంటే మనకు ఏవయినా కొన్ని విషయాలు కానీ వాటిలో నైపుణ్యాలు కానీ ఎక్కువ తెలిసి ఉండడం తప్పుకాదు. కించిత్ గర్వ కారణం కూడా. కానీ నాకే అన్నీ తెలుసు, నేనే సర్వజ్ఞుణ్ణి అని వదరడం మాత్ర తప్పు. మనం ఎంతటి గొప్పవారమయినా మనకంటే గొప్పవారు కూడా ఉంటారనే ఎరుక ఉండాలి. అప్పుడు వినయం దానంతటే అదే వస్తుంది. శంకర భగవత్పాదులవంటి మహాపురుషుడు ఒక చోట...‘‘పశుం మాం సర్వజ్ఞ ప్రథిత్ కృపయా పాలయ విభో’’ అంటారు. శంకరా, నేను పశువుతో సమానం– అల్పజ్ఞుణ్ణి. నీవు పశుపతివి.. అంటాడు. అంతటివాడు అంత వినయం ప్రదర్శిస్తే అరాకొరా తెలిసిన మనం ఎలా ప్రవర్తించాలి? -
శభాష్.. పోలీస్.. 30నిమిషాల వ్యవధిలోనే
మంచిర్యాలక్రైం: 100డైల్ కాల్స్ ఫిర్యాదుతో స్పందించిన బ్లూ కోల్ట్స్ పోలీసులు వెంటనే స్పందించి 30నిమిషాల వ్యవధిలో తప్పిపోయిన బాలున్ని కుటుంబ సభ్యులకు అప్పగించి శభాష్ బ్లూ కోల్ట్స్ అనిపించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే... జన్నారం మండలం గంగవ్వకు చెందిన బంధువులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని చూసేందుకు గంగవ్వ తన 7సంవత్సరాల కుమారుడితో కలిసి మంగళవారం ఆసుపత్రికి వచ్చింది. గంగవ్వ ఆసుపత్రిలో బంధువులతో మాట్లాడుతుండగా బాలుడు అక్కడి నుంచి కనిపించకుండా పోయాడు. ఖంగు తిన్న గంగవ్వ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి స్థానికుల సలహాలు, సూచనల మేరకు 100డైల్కు ఫోన్ చేసి చెప్పడంతో క్షణంలోనే స్పందించిన సీఐ నారాయణ్‌నాయక్ బ్లూ కోల్ట్స్ పోలీసులను అప్రమత్తం చేసి గాలించారు. రంగంలోకి దిగిన బ్లూ కోల్ట్స్ సిబ్బంది ఉస్మాన్పాష, తిరుపతి ఐబీ ప్రాంతం నుంచి ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పరిశీలించగా ఐబీ వైపు నుంచి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వైపు ఏడుస్తూ వెళ్తున్న బాలున్ని గమనించి, అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలున్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో బ్లూ కోల్ట్స్ సిబ్బందిని స్థానికులు, అధికారులు అభినందించారు. -
మైనార్టీల శ్రేయోభిలాషి వైఎస్సార్: అక్బరుద్దీన్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో సోమవారం మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. వైఎస్సార్ లాంటి నేతను తన జీవితంలో చూడలేదని అన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రజల పక్షపాతి, ముస్లింల శ్రేయోభిలాషిగా అభివర్ణించారు. వైఎస్సార్‌ను మైనార్టీ ప్రజలు తమ జీవితంలో మరచిపోరని అన్నారు. సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగానే తక్షణం పరిష్కరించిన గొప్ప మనసున్న నాయకుడిగా.. దివంగత నేత చేసిన సేవలను అక్బరుద్దీన్ గుర్తుచేసుకున్నారు. గతంలో.. కబ్జాలకు గురైన 85 ఎకరాల బాబా షర్ఫోద్దిన్ దర్గా స్థలాలను .. ఒక జీవోతో తిరిగి వక్ఫ్‌బోర్డుకు వైఎస్సార్ అప్పగించారని అక్బరుద్దీన్ అన్నారు. చదవండి: రాష్ట్రంలో ప్రతి మహిళ సెల్ఫోన్లో ‘దిశ’ యాప్ ఉండాలి: సీఎం జగన్ -
వర్జీనియా వుల్ఫ్
తన పదమూడో ఏట వాళ్లమ్మ చనిపోయినప్పుడు తొలిసారి మానసికంగా కుంగిపోయింది వర్జీనియా వుల్ఫ్(1882–1941). తర్వాత రెండేళ్లకు ఆమె సోదరి మరణించింది. అదే సమయంలో ఆమె మారుతల్లి పోయింది. బాగా చదువుకున్న కుటుంబంలో పుట్టిన వర్జీనియా తన పద్దెనిమిదో ఏట తండ్రి ప్రోత్సాహంతో రాయడానికి ఉపక్రమించింది. అత్యంత ప్రభావశీలిగా నిలవబోయే ఇరవయ్యో శతాబ్దపు ఆధునిక రచయిత్రి ఆ మనో వ్యాకులతల మధ్య కలం పట్టింది. పైగా, ఆడపిల్ల రాయడాన్నీ, చిత్రించడాన్నీ అంత గణించదగినదిగా పరిగణించని ఛాందస ఇంగ్లిష్ సమాజానికి ఎదురీదుతూ లండన్‌లోని కళాకారులు, రచయితలతో జట్టుగా సాహిత్యంలో మునిగి తేలింది. వరుస విపత్తులతో కుంగిపోయివున్న వుల్ఫ్ వెన్వెంటనే తండ్రిని కూడా కోల్పోవడం ఆమెను మానసిక దౌర్బల్యానికి గురిచేసింది. ఒక్కోసారి తీవ్ర నైరాశ్యంలోకీ, అప్పుడే ఎగసిపడే ఉత్సాహంలోకీ ఆమె ఉద్వేగాలు మారిపోయేవి. ఈ మానసిక అనారోగ్యానికిగానూ ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసింది. చివరకు, 59వ ఏట నదిలో మునిగి చనిపోయింది. ఒక మనిషిని శూన్యం చేయకుండా వదలని విధి ఆటల నడుమే ‘మిసెస్ డాలోవే’, ‘టు ద లైట్‌హౌజ్’, ‘ఓర్లాండో’ లాంటి ప్రసిద్ధ నవలలు రాసింది. చైతన్య స్రవంతి రచనా విధానాన్ని ఉపయోగించిన మార్గదర్శుల్లో ఒకరిగా నిలిచింది. వ్యాస రచయిత్రిగా కూడా వుల్ఫ్ ప్రసిద్ధురాలు. స్త్రీవాద ఉద్యమానికి ఆమె రచనలు ప్రేరణ నిచ్చాయి. -
గ్రేట్ రైటర్
ఫ్రాన్స్ దేశీయుడైన రోమా రోలో రచనలకు మనిషి కేంద్ర బిందువు. ఆయన మానవతావాది. యుద్ధాన్నీ, ఫాసిజాన్నీ వ్యతిరేకించాడు. ఆయన ఉద్గ్రంథం ‘జాన్ క్రిస్టఫె’ పది సంపుటాల నవల. ఫ్రాన్స్‌ను తన రెండో ఇల్లుగా మలుచుకున్న ఒక జర్మన్ సంగీత మేధావి రూపంలో తన ఆదర్శాలు, ఆసక్తులు, దేశాల మధ్య అవగాహనలు విశదంగా వ్యక్తం చేశాడు. నాటకం, నవల, చరిత్ర, వ్యాసం ప్రక్రియల్లోనూ కృషి చేశాడు. నాటకరంగాన్ని ప్రజాస్వామీకరించడానికి నడుం బిగించాడు. తూర్పు దేశాల తత్వశాస్త్రం, ముఖ్యంగా భారత్ వేదాంతం ఆయన్ని ఆకర్షించింది. టాగూర్, గాంధీజీలతో సంభాషించాడు. గాంధీ మీద పుస్తకం రాశాడు. వయసులో పెద్దవాడైనప్పటికీ సిగ్మండ్ ఫ్రాయిడ్ మీద ఆయన ప్రభావం ఉంది. వారిరువురూ ఉత్తర ప్రత్యుత్తరాలు నెరిపారు. ఈ విశ్వంలో తానూ ఒకడిగా ఉన్నాననే మనిషి సంవేదనను వ్యక్తపరిచే ‘ఓషియానిక్ ఫీలింగ్’ పదబంధాన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్‌కు రాసిన ఓ లేఖలో సృష్టించాడు. ఈ మానవతావాదిని 1915లో నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది. 1866–1944 ఆయన జీవనకాలం. రోమా స్నేహితుడు, రోమా జీవిత చరిత్ర రాసిన స్టెఫాన్ త్సైక్ ఆయన్ని ‘ఐరోపా నైతిక చేతన’గా అభివర్ణించాడు. -
గ్రేట్ రైటర్
వాస్తవానికీ కల్పనకూ మధ్యన అంతరాన్ని చెరిపేసిన రచయితగా ఫిలిప్ రాత్‌కు పేరు. బలమైన ఆత్మకథాత్మక పాత్రలు ఆయన రచనల్లో కనబడతాయి. రాజకీయాలపై వ్యంగ్యం, సామాజిక వ్యాఖ్యానం, లైంగికతపై ముసుగులేని ఆలోచనలు చేస్తాడు. జీవితం తాలూకు సిగ్గులేని కల్మషాన్ని వ్యక్తపరుస్తాడు. నాథన్ జుకెర్మాన్ పాత్రే మళ్లీ మళ్లీ అతడి రచనల్లో ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ‘నా జీవితపు అసలైన డ్రామా నుంచి ఒక నకిలీ ఆత్మకథని, బూటకపు చరిత్రని, అర్ధ కల్పిత అస్తిత్వాన్ని పుట్టించటమే నా జీవితం’ అంటాడు. ఒక నవలను శ్రద్ధగా చదవాలంటే అది పాఠకుడినుంచి కొన్ని గుణాలు డిమాండ్ చేస్తుందనీ, అవి ఉన్నవాళ్లు చాలా తక్కువమంది అనీ, అందుకే భవిష్యత్తులో చదవడం అనేది కొద్దిమందికే పరిమితం కాబోయే కార్యక్రమమనీ నిరాశ పడతాడు. ‘గుడ్‌బై, కొలంబస్’, ‘ఎమెరికన్ పాస్టరల్’, ‘ద హ్యూమన్ స్టెయిన్’, ‘పోర్ట్‌నోయ్స్ కంప్లెయింట్’, ‘మేరీడ్ ఎ కమ్యూనిస్ట్’, ‘ఎవ్రీమేన్’, ‘వెన్ షి వజ్ గుడ్’, ‘ద ఘోస్ట్ రైటర్’ ఆయన ప్రసిద్ధ నవలల్లో కొన్ని. తనను తాను నాస్తికుడిగా ప్రకటించుకున్నాడు రాత్. అమెరికాలో ఒక యూదుడిగా తన అనుభవాల్ని రాసినప్పటికీ తనను తాను యూదుడు అనుకోవడానికి ఇష్టపడలేదు. అమెరికా పౌరుడిగానే భావించాడు. 1933లో జన్మించిన ఫిలిప్ రాత్ తన ఎనభై అయిదో ఏట గత నెల మే 22న కన్నుముశాడు. -
ఏఎన్‌యూ ఖ్యాతి విశ్వవ్యాపితం
గుంటూరు (ఏఎన్‌యూ) : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గత ఏడాది నిర్వహించాల్సిన 39వ వ్యవస్థాపక దినోత్సవం, ఈ ఏడాది 40వ వ్యవస్థాపక దినోత్సవాలను కలిపి చేశారు. వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఏఎన్‌యూని ప్రపంచ స్థాయి యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామని వీసీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఏడాదిలో సాధించిన అభివద్ధి, రానున్న కాలంలో చేపట్టనున్న చర్యలను వివరించారు. పురస్కారాలు అందుకుంది వీరే.... వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన జి.రాధాకష్ణమూర్తి (సామాజిక సేవ), ఎంవీఆర్‌కే ముత్యాలు (సామాజిక సేవ/ విద్యారంగం), బి.శ్రీనివాసరావు ( వ్యవసాయ రంగం), డాక్టర్ టీవీ రామారావు (సైన్స్ అండ్ టెక్నాలజీ), ఎంపీ జాన్, డాక్టర్ బి.వెంకటేశ్వర్లు (సాహిత్యం), సీహెచ్ విన్సెంట్ పాల్ (ఆరోగ్య శాస్త్రం), డాక్టర్ డీఎన్ రావు (యోగా), టి.విజయకాంత్ (మ్యూజిక్/ సింగింగ్), సీహెచ్ వీఎస్ విజయ భాస్కరరావు (ఫొటోగ్రఫీ), సీహెచ్ బీఎస్ఎస్ ప్రసాద్ (వ్యవసాయరంగం), చల్లా బాల త్రిపుర సుందరి (డ్యాన్స్), డాక్టర్ రాజు ఎస్.ఐయ్యర్ (వైద్యరంగం), డాక్టర్ పి.సాంబశివరావు ( విద్య/సాహిత్యం), టి.సత్యనారాయణ రెడ్డి (కళా రంగం), తుర్లపాటి పట్టాభిరామ్ (సాహిత్యం), డాక్టర్ గాలి సుబ్బారావు (సాహిత్యం/ సామాజిక సేవ), డాక్టర్ వి.నాగరాజ్యలక్ష్మి (సాహిత్యం) కాసుల కష్ణం రాజు (మిమిక్రీ), టీవీ కష్ణ సుబ్బారావు (శిల్పకళా రంగం), డి.వసంత కుమారి (పీస్ అండ్ కమ్యూనిటీ సర్వీస్)లకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. పలువురు అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులకు వివిధ కేటగిరీల్లో బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య కె.జాన్‌పాల్, మాజీ వీసీ ఆచార్య కె.వియన్నారావు, వ్యవస్థాపక దినోత్సవం కన్వీనర్ ఆచార్య ఎం.కోటేశ్వరరావు, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధికారులు పాల్గొన్నారు. -
‘మహా’ ఒప్పందంతో తెలంగాణకు అన్యాయం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి వరంగల్ : గోదావరిపై నిర్మించనున్న బ్యారేజ్‌ల కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పం దం కారణంగా తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యా యం జరగనుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. హన్మకొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1954నుంచి గోదావరి జలాల వివాదం ప్రారంభం కాగా అప్పటి సీఎం వెంగళరావు, మ హారాష్ట్ర సీఎం ఎస్బీ.చవాన్ మధ్య జరిగిన చర్చ ల్లో భాగంగా రాష్ట్రంలో లెండి, లోయన్ పెన్‌గంగ, ప్రాణహిత ప్రాజెక్టుల నిర్మాణానికి నిర్ణయం తీసుకుని టెక్నికల్ కమిటీని నియమించారని తెలిపా రు. అయితే, పలుకారణాలతో నిర్మాణాలు ఆల స్యమయ్యాయన్నారు. 2012లో ఇరు రాష్ట్రాల సీఎంలు కిరణ్‌కుమార్‌రెడ్డి, పృథ్వీరాజ్‌చవాన్ సమావేశమై 152 మీటర్ల ఎత్తుకు బ్యారేజీ నిర్మిం చాలని అంగీకారం కుదుర్చుకున్నారని ప్రకాష్‌రెడ్డి తెలిపారు. కానీ ఇప్పుడు ప్రాజెక్టుల రీడిజైన్ పేరు తో 148మీటర్లకు కేసీఆర్ ఒప్పుకోవడం వల్ల తె లంగాణకు తీదని అన్యాయం జరగనుందన్నారు. కాగా, ఒ ప్పందంపై సీఎం కేసీఆర్ వైఖ రిని నిరసిస్తూ ఈనెల 29న హైదరాబాద్‌లో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అప్పుల్లోకి నెట్టారు.. తెలంగాణ ఏర్పాటు సమయం లో రూ.8వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉండగా కేసీఆర్ అప్పుల ఊబిలోకి లాగారని టీడీపీ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి సీతక్క విమర్శించారు. పార్టీ ప్ర ధాన కార్యదర్శి ఈగ మల్లేశం మాట్లాడుతూ తన పాలనపై ప్రజలు ఆలోచన చేయకుండా ఉండేం దుకు సీఎం మైండ్ గేమ్ ఆడుతున్నారన్నారు. 30న బంద్‌కు మద్దతు చారిత్రక వరంగల్‌ను రెండు జిల్లాలుగా చేసేం దు కు ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదాను రద్దు చేసుకోవాలనే డిమాండ్‌తో అఖిలపక్షం ఈనెల 30 న చేపట్టిన బంద్‌కు టీడీపీ మద్దతు ప్రకటిస్తోందని జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ తెలిపారు. ఈమేరకు శనివారం జరిగిన పార్టీ సమావేశంలో తీర్మానం చేశామన్నారు. అలాగే, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 31న కలెక్టరేట్ ఎదు ట ధర్నా చేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు గట్టు ప్రసాద్, పుల్లూరు అశోక్‌కుమార్, మార్గం సారంగం, రహీం, సంతోష్, సాంబయ్య, విజయ్ పాల్గొన్నారు. -
చే‘నేత’లో గొప్ప నైపుణ్యం
దరీలకు కేరాఫ్ కొత్తవాడ రేపు జాతీయ చేనేత దినోత్సవం పోచమ్మమైదాన్ : దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్నది చేనేత వృత్తిపైనే. చేనేతల పనిలో గొప్ప నైపుణ్యం ఉం టుంది. అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన ఘనత వారి కే దక్కుతుంది. చేనేత దినోత్సవాన్ని ప్రకటించి, అధికారికంగా నిర్వహించాలని చేనేత కార్మికు లు పలుమార్లు ప్రధానమంత్రికి చేసిన వినతుల ను పరిగణనలోకి తీసుకొని ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రధాని నరేంద్రమోదీ గత ఏడాది ప్రకటించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఉత్తమ చేనేత కార్మికులకు జాతీయ అవార్డులను సైతం ఇస్తున్నారు. కొత్తవాడలో దరీల తయారీ వరంగల్ నగరంలోని కొత్తవాడలో అద్భుతమై న చేనేత దరీలు తయారవుతుంటాయి. దేశం న లుమూలల నుంచే కాకుండా ఇతర దేశాల వా రు సైతం ఇక్కడి హ్యాండ్లూమ్స్పై అమితమైన ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రపంచంలోని పలుచోట్లకు ఎగుమతి అవుతుండటం విశేషం. కొత్తవాడలో సుమారు 1800 మంది చేనేత కార్మికులు రకరకాల హ్యాండ్ మేడ్ వస్తువులు తయారు చేస్తుంటారు. ఎర్రతివాచి పుట్టిం ది కూడా ఇక్కడే. ఢిల్లీలోని పార్లమెంట్లో వాడే తివాచీలు కొత్తవాడవే. హ్యాండ్లూమ్స్.. అనేక రకాలు కొత్తవాడలో అనేక రకాల హ్యాండ్లూమ్స్ తయారవుతున్నాయి. చేనేత మగ్గం, జనపనార, కాటన్ వినియోగించి డోర్ మ్యాట్స్, ఫ్లోర్ దగ్స్, జూట్ దరీస్, కార్పెట్లు, టెంట్‌హౌస్ సామగ్రి తదితర హోమ్‌నీడ్ దరీలు నేస్తున్నారు. వీటిని ఇంటర్‌లాక్, కలంకారి ప్రింటింగ్ కస్టమర్ కోరుకున్న రంగులో కోరుకున్న డిజైన్‌లో తయారు చేసి ఇస్తున్నారు. ఇతర దేశాలకు ఎగుమతి కొత్తవాడలో తయారు చేసిన చేనేత దరీలకు దేశంలోని పలు ప్రాంతాల్లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ డిమాండ్ ఉంది. ఢిల్లీ, హైదరాబాద్, కోల్కత్తా, చెన్నై, బెంగుళూరు, ఇండోర్ ప్రాంతాలతోపాటు కెనడా, యూఎన్ఏ, జర్మనీ, సింగపూర్ తదితర దేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. పలు కార్పొరేట్ కంపెనీలు కొనుగోలు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కొన్ని దేశాల నుంచి నేరుగా కొత్తవాడ చేనేత కార్మికులకు ఆర్డర్లు వస్తున్నాయి. దరీల తయారీ విధానం కొత్తవాడ ప్రాంతంలో అనేక రకాల హ్యాండ్లూమ్(చేనేత) దరీలు తయారవుతున్నాయి. ఇందుకు తొలుత చేనేత కార్మికులు నేషనల్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ నుంచి సామగ్రిని కొనుగోలు చేస్తారు. ఈ సామగ్రి అధికంగా కోయంబత్తూరు నుంచి దిగుమతి అవుతుంది. వీటిని ఒక పద్ధతిలో అమర్చిన వాటిని ప్రింటింగ్ వేసి విక్రయిస్తున్నారు. కలంకారి ప్రింటింగ్ కలంకారి ప్రింటింగ్ పద్ధతిలో రూపొందించిన దరీలను అధికంగా ఇళ్లలో వినియోగిస్తారు. తొలుత కొత్తవాడలో చేనేత దరీలు తయారు చేస్తారు. తర్వాత వాటిని మచిలీపట్నం పంపించి వివిధ డిజైన్లు ప్రింటింగ్ వేయిస్తారు. అక్కడ వేజిటేబుల్ డైయింగ్‌లో (సహజ సిద్ధమైన) దరీలను ప్రింట్ చేస్తారు. ఈ తరహాలో దరీలను అత్యంత డిమాండ్ ఉంటుంది. డోర్ కర్టన్లకు, టెంట్లకు, వాల్ బ్యానర్లకు తదితర కలంకారి ప్రింటింగ్లనే అధికశాతం ఇష్టపడుతుంటారు. జ కోట్ (జూట్ పద్ధతి) జకోట్ దరీలను జనపనారతో తయారు చేస్తారు. దరీలు తయారు చేసిన అనంతరం కాళ్లతో తొక్కుతూ డిజైన్‌ను రూపొందిస్తారు. ఇందులో కూడా నచ్చిన డిజైన్‌ను రుపొందిస్తారు. ఈ తరహా దరీలను అధికంగా ఫ్లోర్‌కు వినియోగిస్తారు. రాములుకు జాతీయ ఉత్తమ చేనేత అవార్డు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న వారాణాసిలో జాతీయ ఉత్తమ చేనేత కార్మికుడి అవార్డును కొత్తవాడకు చెందిన పిట్ట రాములు అందుకోనున్నారు. కొన్నేళ్లుగా చేనేత వృ త్తిలో కొనసాగుతూ ఎంతో అందమైన దరీలను తయారుచేస్తున్నారు. మెుఘల్ హంటింగ్ కళాఖండాన్ని దరీపై రూపొందించి ఔరా అనిపించారు. తెలుగు రాష్ట్రాల్లో చేనేత రంగంలో దరీ వి భాగంలో ఉత్తమ చేనేత కార్మికుడు అవార్డును అందుకోవ డం ఇదే తొలిసారి. రాములు తయారు చేసిన దరీలు ఇతర దేశాలకు సైతం పంపిస్తున్నారు. ఇతర దేశాల నుంచి ఆర్డర్లు తీసుకొని ఎంతో అందమైన డిజైన్లు రూపొందిస్తున్నారు. దేశం లో జరిగే అన్ని చేనేత ఎగ్జిబిషన్లలో ఆయన తయారుచేసిన వాటిని అమ్మకాలకు పెడుతున్నారు. ఇంటర్ లాకింగ్ సిస్టమ్ దరీల తయారీలో ఇంటర్ లాకింగ్కు ప్రత్యేక స్థానం ఉంది. దరీల తయారు చేసి వాటిపై చేతితో పలు రకాల డిజైన్లు వేసే పద్ధతినే ఇంటర్ లాకింగ్ అంటారు. ఈ పద్ధతిలో దరీలపై ఫొటోలు, డిజైన్ వస్తాయి. -
ఓయూ..ది గ్రేట్!
ఐదుగురు కొత్త వీసీలు ఓయూకు చెందినవారే... సాక్షి, సిటీబ్యూరో: విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకాల్లో ప్రఖ్యాత ఉస్మానియా యూనివర్సిటీకి పెద్దపీట దక్కింది. రాష్ట్రంలో తొమ్మిది యూనివర్సిటీలకు నియమితులైన వీసీల్లో.. ఐదుగురు ఓయూకే చెందినవారు కావడం విశేషం. ఓయూ వీసీగా నియమితులైన ప్రొఫెసర్ రామచంద్రం, జేఎన్టీయూహెచ్ వీసీగా విశ్రాంత అధ్యాపకులు డాక్టర్ ఏ. వేణుగోపాల్‌రెడ్డి, తెలుగు వర్సిటీ వీసీగా ఎస్వీ సత్యనారాయణ, కాకతీయ వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఆర్.సాయన్న, పాలమూరు వర్సిటికీ వీసీగా సికింద్రాబాద్ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ.రాజరత్నం బాధ్యతలు తీసుకున్నారు. తెలంగాణలోనేకాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ సింహభాగం వర్సిటీలకు ఓయూ ఆచార్యులే నియమితులవుతూ వస్తుండడం విశేషం. ఉన్నత విద్యా వ్యాప్తిలోనే కాదు.. ఉన్నత పదవులు అలంకరించడంలోనూ ఓయూ తన మార్కు ప్రదర్శిస్తోంది. 98 ఏళ్ల చరిత్ర కలిగిన ఓయూ నుంచి 70 మందికిపైగా ఆయా వర్సిటీలకు వీసీలుగా పనిచేశారని తెలుస్తోంది. ముఖ్యంగా 2006 తర్వాత జిల్లాకో వర్సిటీ ఏర్పాౖటెన విషయం తెలిసిందే. ఒకటి రెండు తప్ప మిగిలిన వర్సిటీ పాలనా పగ్గాలు వీరే చేపట్టడం ఓయూ ఘనతకు నిదర్శనంగా చెప్పవచ్చు. జాతీయ స్థాయి వర్సిటీలను కూడా ఓయూ ఆచార్యులు ముందుండి నడిపించారు. -
‘ఉప్పో’ద్ఘాతం...!
నవ్వింత: ‘‘నాన్నా... ఉప్పు అమృతానికి చెల్లెలు కదా. అది చాలా గ్రేట్ కదా’’ అన్నాడు మా బుజ్జిగాడు. వాడన్న మాటతో నేను కాస్త ఉప్పందుకుని ఇక విజృంభించా. ‘‘నిజమేరా... ఉప్పు ఒక్క అమృతానికే కాదు... విషానికీ చెల్లి. సముద్రాన్ని చిలికినప్పుడే కదా... అమృతం, హాలాహలం వరసగా పుట్టింది. ఇక ఉప్పు కూడా సముద్రం నుంచే పుడుతుంది కాబట్టి అది రెంటికీ చెల్లెలన్న మాట’’ అంటూ రెచ్చిపోయా. దీనికో కారణం ఉంది. గత ఇరవై రోజులుగా ప్రయత్నిస్తున్నా మా బుజ్జిగాడి చేత పదో ఎక్కం కూడా చదివించలేకపోయా. దాంతో ఈ ఉప్పు ఆధారంగానైనా కాసేపు వాడికి తెలుగు సబ్జెక్టు చెబుదామన్నది నా కోరిక. ‘‘అదెలా? పాల సముద్రం చిలికితేనే కదా... అమృతం, విషం పుట్టింది. మరి ఉప్పు వచ్చేది నీళ్ల సముద్రం నుంచి కదా’’ అంటూ అడిగాడు వాడు. ‘‘కరెక్టే... తల్లులు వేరైనా వీళ్లంతా ఒక్క తండ్రికే పుట్టారన్నమాట. అటు అమృతానికీ, విషానికీ ఇటు ఉప్పుకూ కూడా తండ్రి సముద్రుడే. కాబట్టే... ఉప్పు చిటికెడంత వేస్తే వంట కాస్తా అమృతమవుతుంది. అదే కాస్త ఎక్కువైతే విషంలా, ఉప్పుకశంలా మారుతుందన్నమాట. ఉప్పు గొప్పదనం గుర్తించాడు కాబట్టే వేమన పద్యాల్లో మనమంతా ఉప్పు కప్పురంబు పద్యాన్నే మొదట చదువుతామన్నమాట...’’ అంటూ చాకచక్యంగా తెలుగుపాఠం చెప్పడం మొదలుపెట్టా. ‘‘ఉప్పు బీపీని పెంచేస్తుందనీ, దాంతో ఆరోగ్యం దెబ్బతింటుందని డాక్టర్ నీతో చెప్పారు కదా. అన్నట్టు మా సోషల్ పుస్తకంలో సముద్రానికి ఆటూపోటూ వస్తాయని రాసుంది. ఇప్పుడు తెలిసింది... ఆటూ, పోటూ ఎందుకు వస్తాయో?’’ సడెన్‌గా వాడు తెలుగుపాఠం నుంచి వైద్యవిద్యకీ... అక్కడ్నుంచి మళ్లీ నేరుగా తన సోషల్ స్టడీస్లోకి జంప్ చేసేటప్పటికి నేను అయోమయంలో పడిపోయా! ‘‘సముద్రంలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కదా. అందుకే సముద్రుడికి కూడా బీపీ పెరుగుతుందన్నమాట. ఉప్పుతో నీకు రక్తపోటు పెరిగినట్టే, సముద్రానికీ పోటు పెరుగుతుందన్నమాట’’ అన్నాడు వాడు. ఎలాగూ వాడు సోషల్ లోకి దూకాడు కదాని... నేనూ ఆ సబ్జెక్టులోకి దిగక తప్పలేదు. ‘‘అవున్రా... కొందరికి డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలు, బీపీ లేకున్నా వాళ్లను చూసిన ఆందోళనతో అది పెరిగేస్తుందట. దీన్నే వైట్ కోట్ సిండ్రోమ్ అంటారట. ఇక పౌర్ణమి రోజున చంద్రుడు వైట్ కోట్ వేసుకున్నట్టుగా వెండిరంగులో ఎదురుగా కనిపిస్తుంటాడు కదా. అందుకే ఆ రోజున సముద్రానికి పోటు ఎక్కువన్నమాట. అంటే... ఇది సముద్రుడికి వచ్చే వైట్ కోట్ సిండ్రోమ్ లాంటిదన్న మాట’’ అంటూ ఇటు సోషల్ స్టడీస్‌లోని జాగ్రఫీనీ, అటు మెడిసిన్‌నూ మిక్స్ చేసి కొట్టా. ‘‘అవున్నాన్నా... ఎంతైనా ఉప్పు గ్రేటే. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా గాంధీ గారు కూడా ఉప్పు సత్యాగ్రహం చేశారట. దాంతో తెల్లదొరలు బెదిరిపోయార్ట’’ అన్నాడు వాడు మళ్లీ జాగ్రఫీ నుంచి హిస్టరీలోకి దూకేస్తూ. ‘‘అవున్రా... ఉప్పులో బీపీ పెంచే గుణం ఉండటం వల్ల గాంధీగారు స్వాతంత్య్రం కోసం ఉప్పును ఎంచుకున్నారు. అలా ఆయన ఉప్పు తయారు చేయగానే తెల్లదొరలకు బీపీ పెరిగిపోయిందన్నమాట. దాంతో ఇండియా మన ఆరోగ్యానికి మంచిది కాదులే అని దేశం వదిలిపోయారన్నమాట’’ అన్నాన్నేను. మావాడికి ఏకకాలంలో తెలుగు, మెడిసిన్, జాగ్రఫీ, హిస్టరీ బోధిస్తున్నాననే గర్వం నాలో పెరిగిపోయింది. ‘‘అవును నాన్నా... ఉప్పు గ్రేటే. మా ఆటల్లో కూడా ఉప్పుబస్తా అంటూ పిల్లల్ని వీపున మోసుకుపోతాం’’ అన్నాడు వాడు. హమ్మయ్య... పనిలో పనిగా ఇతర సబ్జెక్టులతో పాటు ఉప్పు దయ వల్ల ఇక మేం పీఈటీ పీరియడ్‌ను కూడా కవర్ చేశామన్న తృప్తి కూడా నాలో కలిగింది. ఈలోపు మా ఆవిడ ‘‘రాత్రి ఎంత పొద్దుపోయిందో చూడండి... భోజనం చేస్తూ మాట్లాడుకోండి’’ అంటూ మా ఇద్దర్నీ అదిలించింది. ఈలోపు పనిలో పనిగా కంచాల్లో భోజనం వడ్డించి తెచ్చింది. ఇక పెరుగులోకి వచ్చాక కాస్తంత ఉప్పు వేసుకుందామంటే ససేమిరా అంటూ అస్సలు కుదరనివ్వలేదు మా ఆవిడ. ఈసారి ఆమె ఉప్పు వేయనందుకు నాలో బీపీ పెరిగిపోయింది. ఛీ... మా బుడ్డోడికి తెలియకుండా ఏకకాలంలో ఎన్నో సబ్టెక్టులు బోధించినందుకైనా రుచి కోసం పెరుగులో కాస్త ఉప్పు వేయవచ్చు కదా అనిపించింది. కానీ నా ఆలోచనలు గ్రహించినట్లుగా చివరగా ఒక్కమాట అంది. ‘‘మీ ఉప్పు తిన్న విశ్వాసంతోనే మీకు ఉప్పు వేయడం లేదండీ’’ అంది తన మంగళసూత్రాలు తీసి జాగ్రత్తగా కళ్లకద్దుకుంటూ, మా జీవనపాత్రలో సెంటిమెంట్ అనే ఉప్పును చిటికెడంత చిమ్ముతూ.అన్నట్టు పెరుగులో ఉప్పువేయకుండా మా ఆవిడ నన్ను శిక్షించిందా? నా ఆరోగ్యం కోసం జాగ్రత్త పడుతూ నన్ను రక్షించిందా అన్నది నాకింకా తెలియరాలేదుగానీ... ఉక్రోశంతోనో, ఆక్రోశంతోనో చెంపల మీద నా కన్నీళ్లు నాకే ఉప్పగా తగిలాయి. ఆమె అలా పుస్తెలు తడుముకోగానే ఇక నేనేమాత్రం తడుముకోకుండా ఓ ఉప్పాడ చీర కొందామని నిర్ణయించుకున్నా. నేను ఇప్పటివరకూ మా బుడ్డోడికి తెలియకుండానే ఎన్నో సబ్జెక్టులు చెబుతున్నానన్న గర్వం నాకు ఏదైనా ఉంటే... మా ఆవిడ సెంటిమెంటల్ సబ్జెక్టుతో అది కాస్తా ఉప్పేసి కడిగినట్లుగా ‘ఉఫ్ఫ్’మంటూ పటాపంచల్ అయిపోయింది. ఏం చేస్తాం! అది టీచింగైనా, టీజింగైనా ఆడవాళ్లదే గ్రేట్‌నెస్ కదా! - యాసీన్ -
భారతీయ సంస్కృతి గొప్పది
పొందూరు, న్యూస్‌లైన్ : భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు చాలా గొప్పవని ఆస్ట్రేలియాకు చెందిన మెల్బోర్న్ యూనివర్సిటి స్కాలర్స్ కొనియాడారు. భారతీయుల స్నేహస్వభావం తమకు నచ్చిందన్నారు. భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించేందుకు జిల్లాలో పర్యటిస్తున్న బృందం మంగళవారం పొందూరు వచ్చింది. ఈ సందర్భంగా స్కాలర్స్ ఫి జేమ్స్, సారా మార్షల్, సారా జోర్డాన్, బామ్‌బ్రిడ్జి, బెర్నార్డ్ పియర్స్ మాట్లాడుతూ, ఇండియాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి ఆస్ట్రేలియా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. తాము ఇప్పటివరకు ఒడిశా, చెన్నై, బెంగళూరు, ఢిల్లీతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించామన్నారు. చివరగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నామని అన్నారు. నిరక్షరాస్య నిర్మూలనకు సాక్షరభారత్ ద్వారా చేస్తున్న కృషి తెలుసుకుని ప్రశంసించారు. పీఎంఆర్‌డీఎఫ్ బాలయ్య మాట్లాడుతూ సాక్షరభారత్లో సభ్యులుగా ఉండి రూ. 2.47 లక్షలు మంది అక్షరాస్యులుగా మారారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉమాకుమారి, తదితరులు పాల్గొన్నారు. ‘ఇందిరమ్మ పచ్చతోరణం’ పరిశీలన రణస్థలం రూరల్ : ఉపాధి హామీ పథకం కింద మండలంలో అమలవుతున్న ఇందిరమ్మ పచ్చతోరణం కార్యక్రమాన్ని ఆస్ట్రేలియా దేశానికి చెందిన సోషల్ వర్క స్కాలర్ బృందం మంగళవారం పరిశీలించింది. పచ్చతోరణం కార్యక్రమంలో బాగంగా మండలంలో కమ్మశిగడాం గ్రామంలో కోనేరు గట్టుపై పెంపకం చేపడుతున్న కొబ్బరి మొక్కలను బృంద సభ్యులు బోనెట్, ఫై, వె స్లీ, షరాలు పరిశీలించారు. ఇందిరమ్మ పచ్చతోరణం కార్యక్రమం కింద భూమిలేని షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందినవారిని ఎంపిక చేసి ఒక్కొక్కరికీ 100 కొబ్బరి మొక్కలు చొప్పున అందించినట్లు బృంద సభ్యులకు ఉపాధి పథకం ఏపీడీ ఎల్.అప్పలసూరి వివరించారు. ఐదేళ్ల పాటు మొక్కల పెంపకానికి, ఎరువులకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అనంతరం కొబ్బరి మొక్కల నుండి వచ్చిన ఆదాయాన్ని నిరుపేద రైతులే అనుభవించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. భూమిలేని నిరుపేదలను కుటుంబాలను ఆదుకునేందుకే ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా బృంద సభ్యుల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. కార్యక్రమంలో కెపాసిటీ బిల్డింగ్ ఏపీడీ ఎల్.రామారావు, బాలయ్య, స్థానిక ఏపీఓ జి.త్రినాథరావుతో పాటు పలువురు సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.