ఏఎన్‌యూ ఖ్యాతి విశ్వవ్యాపితం
ఏఎన్‌యూ ఖ్యాతి విశ్వవ్యాపితం
Published Fri, Sep 30 2016 11:07 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
గుంటూరు (ఏఎన్‌యూ) : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గత ఏడాది నిర్వహించాల్సిన 39వ వ్యవస్థాపక దినోత్సవం, ఈ ఏడాది 40వ వ్యవస్థాపక దినోత్సవాలను కలిపి చేశారు. వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఏఎన్‌యూని ప్రపంచ స్థాయి యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామని వీసీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఏడాదిలో సాధించిన అభివద్ధి, రానున్న కాలంలో చేపట్టనున్న చర్యలను వివరించారు.
పురస్కారాలు అందుకుంది వీరే....
వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన జి.రాధాకష్ణమూర్తి (సామాజిక సేవ), ఎంవీఆర్‌కే ముత్యాలు (సామాజిక సేవ/ విద్యారంగం), బి.శ్రీనివాసరావు ( వ్యవసాయ రంగం), డాక్టర్ టీవీ రామారావు (సైన్స్ అండ్ టెక్నాలజీ), ఎంపీ జాన్, డాక్టర్ బి.వెంకటేశ్వర్లు (సాహిత్యం), సీహెచ్ విన్సెంట్ పాల్ (ఆరోగ్య శాస్త్రం), డాక్టర్ డీఎన్ రావు (యోగా), టి.విజయకాంత్ (మ్యూజిక్/ సింగింగ్), సీహెచ్ వీఎస్ విజయ భాస్కరరావు (ఫొటోగ్రఫీ), సీహెచ్ బీఎస్‌ఎస్ ప్రసాద్ (వ్యవసాయరంగం), చల్లా బాల త్రిపుర సుందరి (డ్యాన్స్), డాక్టర్ రాజు ఎస్.ఐయ్యర్ (వైద్యరంగం), డాక్టర్ పి.సాంబశివరావు ( విద్య/సాహిత్యం), టి.సత్యనారాయణ రెడ్డి (కళా రంగం), తుర్లపాటి పట్టాభిరామ్ (సాహిత్యం), డాక్టర్ గాలి సుబ్బారావు (సాహిత్యం/ సామాజిక సేవ), డాక్టర్ వి.నాగరాజ్యలక్ష్మి (సాహిత్యం) కాసుల కష్ణం రాజు (మిమిక్రీ), టీవీ కష్ణ సుబ్బారావు (శిల్పకళా రంగం), డి.వసంత కుమారి (పీస్ అండ్ కమ్యూనిటీ సర్వీస్)లకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. పలువురు అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులకు వివిధ కేటగిరీల్లో బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కేఆర్‌ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య కె.జాన్‌పాల్, మాజీ వీసీ ఆచార్య కె.వియన్నారావు, వ్యవస్థాపక దినోత్సవం కన్వీనర్ ఆచార్య ఎం.కోటేశ్వరరావు, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధికారులు పాల్గొన్నారు.
Advertisement