world wide
-
పుష్పరాజ్ ఆల్ టైమ్ రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
'పుష్ప 2' తొలిరోజు నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుని.. ఇప్పటివరకు ఉన్న రికార్డులన్ని తుడిచిపెట్టేసింది. అలా దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. తొలిరోజు రూ.294 కోట్లు కలెక్షన్స్ సాధించిన 'పుష్ప 2'.. రెండో రోజు కాస్త తగ్గింది. రూ.155 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. అలా రెండు రోజులకు కలిపి రూ.449 కోట్లు రాబట్టింది. తాజాగా మూడు రోజుల్లోనే ఏకంగా రూ.621 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ విషయాన్ని నిర్మాణసంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది.హిందీలో తొలిరోజు రికార్డ్ బ్రేక్అయితే పుష్ప -2 హిందీలో ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. తొలి రోజు రూ.72 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన పుష్ప-2 మరో రికార్డ్ క్రియేట్ చేసింది. మూడో రోజు ఏకంగా రూ.74 కోట్లతో ఆ రికార్డ్‌ను తిరగరాసింది. దీంతో కేవలం హిందీలోనే మూడు రోజుల్లో రూ.205 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. ఇక ముందుముందు మరెన్ని రికార్డులు కొల్లగొడుతందో ప్రస్తుత కలెక్షన్స్ చూస్తేనే తెలుస్తోంది. నార్త్‌లోనూ పుష్ప-2 రప్పా రప్పా అంటూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. The box office is witnessing history with #Pushpa2TheRule ❤🔥The WILDFIRE BLOCKBUSTER collects a gross of 621 CRORES WORLDWIDE in just 3 days, shattering many records 💥💥💥Book your tickets now!🎟️ https://t.co/tHogUVEOs1#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun… pic.twitter.com/CQ1SBTAnV4— Mythri Movie Makers (@MythriOfficial) December 8, 2024 -
వీక్ డేస్‌లోనూ తగ్గేదేలే.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంంబోలో వచ్చిన చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే పలు రికార్డులను తన పేరున లిఖించుకుంది. మొదటి రోజు నుంచే కాసుల వర్షం కురిపిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్లో వచ్చిన ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.తాజాగా కల్కి ఆరు రోజుల్లో అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. కేవలం విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.680 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మంగళవారం ఒక్కరోజే రూ.55 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో రూ.700 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఓవర్సీస్లో పలు రికార్డులు సృష్టించిన కల్కి.. మరికొద్ది రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. -
అత్యంత వరస్ట్ కర్రీగా చోటు దక్కించుకున్న భారతీయ వంటకం ఇదే..!
అందరూ అన్ని కూరగాయలు తినరు. చాలావరకు ఎక్కవ మంది కాకరకాయ, వంకాయ తినని చెబుతుంటారు. వంకాయల్లో తెల్ల వాటినే ఇష్టంగా ఎక్కువ మంది తినడం విశేషం. కానీ ఊదారంగులో ఉండే వంకాయలంటే చాలామంది నచ్చదు. దీంతో ప్రముఖ చెఫ్‌లు చాలా రకాల వంటకాలు కూడా చేస్తుంటారు. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఈ ఊదారంగు వంకాయతో చేసే భారతీయ వంటకమే అత్యంత వరస్ట్ కర్రీగా చెత్త ఆహారాల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఎందువల్లా అనే కదా? ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ పోర్టల్ 'టేస్ట్ అట్లాస్' ప్రతి ఏడాది ప్రపంచంలోనే టాప్ వంద చెత్త ఆహారాల జాబితాలను విడుదల చేస్తుంది. అలానే ఈసారి కూడా విడుదల చేయగా.. మనదేశం నుంచి తక్కువ రేటింగ్స్ పొందిన ఆలు భైంగైన్ ఆ జాబితా స్థానం దక్కించుకుంది. ఇది దాదాపు వంద వంటకాల్లో 60వ స్థానాన్ని దక్కించుకుంది. దీన్ని బంగాళదుంప, వంకాయ, ఉల్లిపాయ, టమాటాలు, అల్లం వెల్లులి పేస్టు వేసి చేస్తారు. ఇది గ్రేవీ వంటకం. దీన్ని ఇష్టపడే వారు మన దేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే దీనికి తక్కువ రేటింగ్ వచ్చింది. చెప్పాలంటే ఈ రకమైన వంటకాన్ని ఉత్తర భారతదేశంలోనే ఎక్కువగా తింటారట. ప్రపంచంలో అత్యంత వరస్ట్ కర్రీ అత్యంత తక్కువ రేటింగ్‌తో తొలి స్థానం దక్కించుకున్న వంటకంగా హాక్లర్ నిలిచింది. ఇది ఐస్లాండ్కి చెందిన వంటకం. దీన్ని షార్క్ మాంసంతో మూడు నెలల పాటు పులియబెట్టి చేస్తారట. ఇది చాలా ఘాటైన రుచిన కలిగి ఉండటంతో అంత తేలిగ్గా ఎవరికీ నచ్చదట. పైగా తినేవారి సంఖ్య కూడా తక్కువ. ముఖ్యంగా ఐస్లాండ్లో ఉండే స్థానిక ప్రజలే దీన్ని ఇష్టంగా తింటారట. పర్యాటకులు మాత్రం ఆ కూర జోలికి పోనేపోరట. ఇక రెండో స్థానంలో అమెరికాకు చెందని రామన్ బర్గర్ నిలిచింది. దీన్ని రామన్ న్యూడిల్స్‌తో చేసే బర్గర్ ఇది. మధ్యలో మాంసాన్ని నింపి తయారుచేస్తారు. చాలా తక్కువ మందికి మాత్రమే ఇది నచ్చుతుంది. కాగా, ఈ టేస్టీ అట్లాస్ పోర్టల్‌లో ఎవరికీ ఏ ఆహారం నచ్చలేదో ప్రతి దేశానికి చెందిన ప్రజలు పాల్గొని చెప్పొచ్చు. అయితే ఏ వంటకాలు బాగోవని తక్కువ రేటింగ్ ఇస్తారో వాటన్నంటిని వంద చెత్త వంటకాలలో ఎంపిక చేస్తారు. అలా మన దేశం నుంచి ఆలు భైంగైన్ ఈసారి చోటు దక్కించుకుంది. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: బొటానికల్ వండర్! మానవ పెదవులు పోలిన మొక్క! ఎక్కడుందంటే..?) -
ఈ ఏడాది అక్కడికి వెళ్లేందుకు తెగ ఎగబడ్డారు,అంత స్పెషల్ ఏముందంటే..
2023 మరికొన్ని రోజుల్లోనే పూర్తికానుంది. మరి ఈ ఏడాదిలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించిన టూరిస్ట్ ప్లేస్ ఏంటి? గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది లిస్ట్‌లో ఏమైనా మార్పులు ఉన్నాయా? 2023లో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఎక్కువగా సందర్శించిన టూరిస్ట్ ప్రాంతమేంటి?అన్నదానిపై స్పెషల్ స్టోరీ. ప్రతి ఏడాది ప్రజలు ఎక్కువగా సందర్శించే టూరిస్ట్ ప్రాంతాలను ట్రావెల్ ఏజెన్సీలు రిలీజ్ చేస్తుంటాయి. అలా ఈ ఏడాది కూడా లిస్ట్‌ను విడుదల చేశాయి. గ్లోబల్ డెస్టినేషన్ సిటీ ఇండెక్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం 2023లో ఎక్కువ మంది ప్రజలు హాంకాంగ్ వెళ్లేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపించారు. అలా టాప్ టూరిస్ట్ ప్లేస్‌లో హాంకాంగ్ మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది బ్యాంకాక్ నెంబర్ వన్ స్థానంలో ఉండగా, 2023లో మాత్రం హాంకాంగ్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. హాంకాంగ్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది సుమారు 29.2మిలియన్ల మంది అంటే 2 కోట్ల 92లక్షల మంది హాంకాంగ్‌ను సందర్శించారు. ఆగ్గేయ చైనాను ఆనుకొని ఉన్న ఈ నగరంలో ప్రతి ఏడాది సుమారు 5మిలియన్లకు తగ్గకుండా ప్రజలు విజిట్ చేస్తుంటారట. అంతలా ఎక్కడ ఏముందబ్బా అని పరిశీలిస్తే.. హాంకాంగ్‌లో అనేక టూరిస్టు ప్రాంతాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డిస్నీల్యాండ్, విక్టోరియాస్ పీక్, మేడమ్ టుస్సాడ్స్ మైనపు మ్యూజియం, ఓషియన్ పార్క్,రిపల్స్ బే,లాంటూ ఐస్‌ల్యాండ్, స్టార్ ఫెర్రీ సహా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 2025 నాటికి సుమారు 44 మిలియన్లకు పైగా ప్రజలు హాంకాంగ్‌ను సందర్శిస్తారని సమాచారం. బ్యాంకాక్ హాంకాంగ్ తర్వాత ఎక్కువమంది పర్యాటకులు సందర్శించిన ప్రదేశం బ్యాంకాక్. ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే నగరాల్లో బ్యాంకాక్ నగరం రెండోదిగా నిలిచింది. 2023 నాటికి 24 మిలియన్ల మంది అంటే సుమారు 2 కోట్ల 44 లక్షల మంది ప్రజలు బ్యాంకాక్‌ను సందర్శించారు. ఇక్కడి ప్రసిద్ధ బౌద్ధ దేవాలయాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఆహ్లాదకరమైన వాతావరణం, వెరైటీ వంటలతో బ్యాంకాక్ పర్యాటకులను విపరీతంగా అట్రాక్ట్ చేస్తుంది. లండన్ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ జాబితాలో లండన్ మూడవ స్థానంలో ఉంది. ఈ ఏడాది 19.2 మిలియన్లు(కోటి 2 లక్షల మంది) ప్రజలు లండన్‌ను సందర్శించారు. టూరిస్టులే కాకుండా పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు కూడా 2023లో ఎక్కువగా లండన్‌ను విజిట్ చేశారు. ఆ తర్వాత ఈ ఏడాది ఎక్కువగా సింగపూర్,చైనా,దుబాయ్, ప్యారిస్, న్యూయార్క్ ప్రాంతాలను పర్యాటకులు ఎక్కువగా సందర్శించారు. -
మ్యూజిక్ లవర్స్ ని రాక్ చేస్తున్న ఖుషి మూవీ ఫస్ట్ సింగల్
-
ప్రపంచ వ్యాప్తంగా జోస్ అలుక్కాస్ భారీ విస్తరణ
హైదరాబాద్: ప్రముఖ జ్యువెలరీ రిటైల్ చైన్ జోస్ అలుక్కాస్ రూ.5,500 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా భారీ విస్తరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 100 కొత్త షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దేశంలోని ఒక జ్యువెల్లరీ రిటైల్ బ్రాండ్ రానున్న 8 సంవత్సరాల్లో చేపడుతున్న భారీ విస్తరణ కార్యక్రమం ఇదని వివరించింది. నిధులు, రియల్టీ సమకూరితే 4 సంవత్సరాల్లోనే తమ విస్తరణ కార్యక్రమం పూర్తవుతుందని వివరించింది. సంస్థ విస్తరణ ప్రణాళికకు సంబంధించి చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో జోస్ అలుక్కాస్ మేనేజింగ్ డైరెక్టర్లు జాన్ అలుక్కా, వర్గీస్ అలుక్కా, చైర్మన్ జోస్ అలుక్కా, నటుడు ఆర్ మాధవన్, కంపెనీ ఎండీ పాల్ అలుక్కా పాల్గొన్నారు. (చిత్రంలో ఎడమ నుంచి). ప్రస్తుతం 50 స్టోర్లను కలిగిన జ్యువెల్లరీ గ్రూప్ గ్లోబల్ అంబాసిడర్‌గా నటుడు మాధవన్ ఉన్నారు. నటి కీర్తి సురేశ్‌ను కూడా సంస్థ ప్రచారకర్తగా నియమించుకుంది. -
ఊహించని లాభాలలో విరుపాక్ష మూవీ ప్రాఫిట్ ఎన్ని కొట్లో తెలిస్తే బిత్రరాపోతారు..
-
ప్రపంచంలోని గొప్ప నేతల జాబితాలో 77 శాతం రేటింగ్‌తో మోదీ టాప్
-
4 సెకన్లకో ఆకలి చావు..
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా 45 దేశాల్లోని 34.5 కోట్ల మంది ప్రజలు తీవ్ర క్షుద్బాధతో తనువు చాలిస్తున్నారని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్(ఎన్జీవోలు) పేర్కొన్నాయి. రోజుకు 19,700 మంది వంతున ప్రతి సెకనుకు నలుగురు చొప్పున ఆకలితో చనిపోతున్నట్లు అందులో పేర్కొన్నాయి. 2019తో పోలిస్తే ఆకలి చావులు రెట్టింపయ్యాయని తెలిపాయి. 75 దేశాలకు చెందిన ఆక్స్‌ఫామ్, సేవ్ ది చిల్డ్రన్, ప్లాన్ ఇంటర్నేషనల్ వంటి 238 ఎన్జీవోలు ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశాలకు హాజరయ్యే ప్రపంచ దేశాల నేతల నుద్దేశించి లేఖ రాశాయి. ‘‘21వ శతాబ్దంలో కరువు పరిస్థితులను రానివ్వబోమంటూ ప్రపంచ నేతలు ప్రతినబూనినప్పటికీ సొమాలియాలో మరోసారి తీవ్ర కరువు తాండవిస్తోంది. 45 దేశాల్లోని మరో 5 కోట్ల మంది ప్రజలు కరువుకు చేరువులో ఉన్నారు’’ అని ఆ ప్రకటనలో తెలిపాయి. ‘కేవలం ఒక దేశం లేదా ఖండానికి సంబంధించింది కాదు. మొత్తం మానవాళికే జరుగుతున్న అన్యాయమిది’’ అని పేర్కొన్నాయి. ప్రపంచవ్యాప్త ఆకలి సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వాలు నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవాలని కోరాయి. ‘‘21వ శతాబ్దంలో కూడా కరువు గురించి మాట్లాడుకోవాల్సి రావడం దారుణం. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు తక్షణమే ఆహారంతోపాటు దీర్ఘకాలం పాటు వారికి సాయం కొనసాగించడంలో ఏమాత్రం ఆలస్యం తగదు’’ అని పేర్కొన్నాయి. -
కోవిడ్ మరణాలు.. డబ్ల్యూహెచ్‌వో వర్సెస్ భారత్
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా ప్రత్యక్షంగా లేదంటే.. పరోక్షంగా 1.49 కోట్లమంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం ప్రకటించింది. భారత్‌లో కరోనా మరణాలు 47 లక్షలని తెలిపింది. అయితే సంస్థ ప్రకటనను భారత్ అంగీకరించలేదు. మరణాల లెక్కింపునకు సంస్థ అనుసరించిన పద్ధతులపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తమ లెక్కల ప్రకారం ప్రపంచంలో జనవరి 2020 ఆరంభం నుంచి 2021 డిసెంబర్ చివరకు మరణించినవారి సంఖ్య 1.33– 1. 66 కోట్లు ఉంటుందని, సరాసరిన తీసుకుంటే ఈ సంఖ్య 1.49 కోట్లని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ చెబుతున్నారు. ఈ గణాంకాలు ప్రభుత్వాలకు ఆరోగ్యవ్యవస్థ మెరుగుపరచాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయన్నారు. ఈ లెక్కలో కరోనా సోకి చనిపోయినవారితో పాటు ఆరోగ్యవ్యవస్థ, సమాజంపై కరోనా ప్రభావం వల్ల మరణించినవారు కూడా ఉన్నారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఈ పరోక్ష మరణాలు దక్షిణాసియా, యూరప్, అమెరికాలో అధికమని సంస్థ తెలిపింది. భారత్‌లో ఈ లెక్క 47, 40,894 పైనే ఉంటుందని సంస్థ ప్రకటించింది. తమ గణాంకాలు భారత అధికారిక గణాంకాలతో భిన్నంగా ఉండొచ్చని తెలిపింది. కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా మరణాల లెక్కింపు కోసం వాడిన పద్ధతులు సరైనవి కావని, ఈ లెక్కపై తమ అభ్యంతరాలను సంస్థకు తెలియజేస్తామని భారత ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్‌లో కేంద్రం వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం.. ఇప్పటిదాకా కరోనాతో చనిపోయిన వాళ్ల సంఖ్య 5, 23, 000 కు పైనే ఉంది. అంటే.. డబ్ల్యూహెచ్‌వో ఇస్తున్న గణాంకాలు అధికారిక గణాంకాల కంటే పది రెట్లు దాకా ఎక్కువన్నమాట. కరోనానే కారణం కాదు! భారత దేశంలో అధికారికంగా 2019లో 76.4 లక్షల మరణాలు(అన్నిరకాల మరణాలు) రికార్డు కాగా, 2020లో 6.2 శాతం పెరిగి 81.2 లక్షలకు చేరాయి. ఈ పెరుగుదలకు కేవలం కరోనా మాత్రమే కారణం కాదని నీతిఆయోగ్ సభ్యుడు పాల్ చెప్తున్నారు. ఇక మన అధికారిక లెక్కల ప్రకారం ఒక్క 2020లో భారత్‌లో లక్షన్నర కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. కానీ ప్రపంచ కోవిడ్ మరణాల్లో.. మూడింట ఒకవంతు భారత్‌లో సంభవించినట్లు డబ్ల్యూహెచ్‌వో సంస్థ గణాంకాలు చూపుతున్నాయి. -
ప్రపంచంలోనే పొడవైన మెట్రో లైన్.. ప్రత్యేకతలు ఇవే!
ప్రపంచంలోనే అత్యంత పొడవైన మెట్రో రైల్ నెట్‌వర్క్‌ను కలిగిన నగరంగా చైనాలోని షాంఘై అవతరించింది. తాజాగా రెండు డ్రైవర్‌లెస్ మెట్రో లైన్లు.. లైన్14, ఫేజ్ వన్ ఆఫ్ లైన్18ను ప్రారంభించడంతో ప్రపంచంలో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా నిలిచింది. షాంఘై మెట్రో నెట్వర్క్ ప్రత్యేకతలు.. తాజాగా కొత్త మెట్రో లైన్ల ప్రారంభోత్సవంతో షాంఘై సబ్వే నెట్వర్క్ 831కిలో మీటర్ల పొడవు విస్తరించింది. అదేవిధంగా ఆటోమేటిక్ లేదా డ్రైవర్‌లెస్ మెట్రో లైన్ల సంఖ్య 5కు చేరింది. పలు మెట్రో మార్గాలకు అనధికారిక మారుపేర్లు ప్రచారంలో ఉన్నాయి. లైన్10ను ‘గోల్డెన్ లైన్’గా స్థానికులు పిలుస్తారు. ఇది యుయువాన్ గార్డెన్, జింటియాండి, ఈస్ట్ నాన్జింగ్ రోడ్‌లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల గుండా ప్రయాణిస్తుంది. లైన్6 గులాబీ రంగులో ఉన్నందున ‘హలో కిట్టి లేన్’ అని ప్రయాణికులు పిలుచుకుంటారు. షాంఘై మెట్రో నెట్‌వర్క్‌లో 508 స్టేషన్లు ఉన్నాయి. చైనాలోని బీజింగ్ మెట్రో నెట్వర్క్.. రెండో అతిపెద్ద సబ్వే వ్యవస్థను కలిగి ఉంది. బీజింగ్ మెట్రో ట్రాక్ పొడవు 780కిలో మీటర్లు విస్తరించింది. 2021లో సుమారు 53 కిలోమీటర్ల లైన్లను నిర్మించారు. బీజింగ్ డైలీ నివేదికల ప్రకారం.. బీజింగ్ మెట్రో నెట్‌వర్క్‌లో 450 స్టేషన్లు ఉన్నట్లు తెలుస్తోంది. మెట్రో ప్రయాణానికి అన్ని సౌకర్యాలు కల్పించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రపంచం పై మళ్లీ పంజా విసురుతోన్న కరోన
-
రెండేళ్లలోపే 25 కోట్లు దాటేశాయి..!
కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది.. బ్రిటన్ మాత్రల్ని కూడా మార్కెట్లోకి తెచ్చేసింది.. కోవిడ్–19 నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెరిగింది. అయినా కొన్ని దేశాలు కరోనా థర్డ్‌వేవ్, ఫోర్త్‌వేవ్‌తో అల్లాడిపోతున్నాయ్ వైరస్ బయల్పడిన రెండేళ్లలో 25 కోట్లకు కేసులు చేరుకొని ప్రపంచ దేశాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. రెండేళ్లలోపే ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 25 కోట్లు దాటేసింది. అన్ని దేశాలు రవాణా ఆంక్షల్ని సడలిస్తున్న నేపథ్యంలో తాజాగా పలుచోట్ల కేసులు మళ్లీ పెరగడం ఆందోళన పుట్టిస్తోంది. రష్యా, యూరప్ దేశాల్లో కరోనా కేసులు ఈ మధ్య కాలంలో విజృంభిస్తున్నాయి. జాన్హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం ఇప్పటిదాకా మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య దాదాపుగా 25.5 కోట్లకు చేరుకుంది. కోవిడ్ బాధితుల మరణాలు 50.05 లక్షలు దాటేశాయి. చైనాలోని వూహాన్లో 2019 డిసెంబర్లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ వాయువేగంతో వ్యాప్తి చెంది రెండేళ్లు గడవకుండానే 25 కోట్ల మందికి సోకింది. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్, గ్రీస్, జర్మనీ కరోనా హాట్స్పాట్లుగా మారాయి. రష్యాలో రోజుకి 35 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఉక్రెయిన్‌లో 24 గంట్లోనే 833 మంది మృత్యువాతపడ్డారు. అయితే తాజా కేసుల్లో అత్యధిక మందిలో లక్షణాలు లేకపోవడం, వైరస్ లోడు తక్కువగా ఉండడం, ఆస్పత్రి అవసరం లేకుండానే తగ్గిపోవడం కాస్త ఊరటనిస్తోంది. వ్యాక్సినే బ్రహ్మాస్త్రం కరోనాని కట్టడి చేయడానికి వ్యాక్సిన్‌కి మించిన బ్రహ్మాస్త్రం లేదు. అయినా పలు దేశాల్లో టీకా కార్యక్రమం మందకొడిగా సాగుతూ ఉండటంతో కేసులు ఎగబాకుతున్నాయి. వరల్డ్ ఇన్ డేటా ప్రకారం ప్రపంచ జనాభాలో సగం మందికి పైగా ఒక్క డోస్ కూడా ఇవ్వలేదు.. ఒక డోసు తీసుకున్న వారు 310 కోట్లు ఉంటారు. అమెరికా, యూరప్ దేశాల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రాకపోవడంతో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. నిరుపేద దేశాల్లో టీకా అందుబాటులో లేకపోవడంతో 5% కంటే తక్కువ మందే ఒక్క డోసు తీసుకున్నారు. కోవిడ్–19 టీకా తీసుకోకపోతే ఐసీయూలో చేరడం, లేదంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం 16 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఇటీవల ఆస్ట్రేలియా చేసిన అధ్యయనంలో వెల్లడైంది. సింగపూర్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, చైనా వంటి దేశాల్లో కనీసం ఒక్క టీకా డోసు తీసుకున్న వారు 70 శాతానికి పైగా ఉన్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి ప్రభావం ఎలా ఉందంటే.. ►55 దేశాల్లో కేసులు బాగా పెరుగుతున్నాయి. ►ప్రపంచంలో నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా కేసులు యూరప్ దేశాల నుంచే వస్తున్నాయి. గత నాలుగు రోజుల్లోనే 10 లక్షల కేసులు యూరప్‌లో నమోదయ్యాయి. ►అమెరికా కరోనా కేసుల పట్టికలో టాప్‌లో ఉంది. ఆ దేశంలో ప్రతీ అయిదు మందిలో ఒకరికి కరోనా సోకింది. ఇప్పటివరకు మొత్తం 4.65 కోట్ల కేసులు నమోదయ్యాయి. ►మొదటి 5 కోట్ల కేసులు నమోదవడానికి ఏడాది సమయం పడితే అప్పట్నుంచి ప్రతీ మూడు నెలలకి 5 కోట్ల కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ►కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇంకా కేసులు తగ్గకపోవడానికి డెల్టా వేరియెంట్ విజృంభణే కారణం ►తూర్పు యూరప్‌లో అతి తక్కువగా వ్యాక్సినేషన్ జరగడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ►గత ఏప్రిల్ వరకు ప్రపంచవ్యాప్తంగా సగటున రోజుకి 8,26,000 కేసులు నమోదవుతే ప్రస్తుతం 4లక్షల కేసులు వస్తున్నాయి. -
ప్రపంచ వ్యాప్తంగా తగ్గిన కరోనా వైరస్ ఉధృతి
-
తెలుగు ఖ్యాతి ప్రపంచవ్యాప్తి
తెలుగు ప్రపంచం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఖండఖండాంతరాల వరకు విస్తరించిన ఘనత గలది మన తెలుగుజాతి. తొలి తరాల్లో విదేశాలకు వెళ్లిన తెలుగు ప్రముఖులు ఖండాంతరాలలో మన ఖ్యాతిపతాకాన్ని ఎగురవేశారు. విదేశాల్లో స్థిరపడ్డ మన తెలుగువారు ఇప్పుడు కూడా అదే పరంపరను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అమెరికాలోని తెలుగువాళ్లు సొంత విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఐదేళ్ల కిందట ప్రారంభమైన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం శాన్వాకిన్ జిల్లా పరిధిలోని ట్రేసీ పట్టణానికి చేరువలో అరవైఏడు ఎకరాల సువిశాల స్థలంలో ప్రపంచస్థాయి విద్యాప్రాంగణ నిర్మాణాన్ని తలపెట్టింది. దీనికి సీనియర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ కమిషన్ గుర్తింపు లభించడం విశేషం. తెలుగు ప్రజలు గర్వించదగిన పరిణామం ఇది. ఖండాంతరాలలో తెలుగువారి కీర్తపతాక రెపరెపలకు దోహదపడిన తొలితరం ప్రముఖులను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. ముఖ్యంగా తెలుగునేలకు వెలుపలి నుంచి కృషి కొనసాగించిన మహానుభావులను తలచుకోవాలి. రష్యాలో పనిచేస్తూ ఉప్పల లక్ష్మణరావు, ఇంగ్లండ్‌లో పనిచేస్తూ గూటాల కృష్ణమూర్తి గత శతాబ్దిలోనే తెలుగు వెలుగులను విదేశాలకు విస్తరించారు. వృక్షశాస్త్రవేత్తగా జగదీశ్చంద్ర బోస్ వద్ద పరిశోధనలు కొనసాగించిన ఉప్పల లక్ష్మణరావు, కమ్యూనిజం వైపు ఆకర్షితులై రష్యా వెళ్లారు. రష్యన్ నుంచి తెలుగులోకి దాదాపు నలభైకి పైగా పుస్తకాలను అనువదించారు. రష్యన్–తెలుగు నిఘంటువును నిర్మించారు. స్వాతంత్య్రోద్యమ నేపథ్యంలో రాసిన ‘అతడు–ఆమె’ నవల, ‘బతుకు పుస్తకం’ ఆత్మకథ సహా పలు రచనలు ఉప్పల స్థానాన్ని తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిపాయి. ఇక ఇంగ్లిష్ సాహిత్యం చదువుకున్న గూటాల కృష్ణమూర్తి ‘లండన్ టైమ్స్’ పత్రికలో గుమస్తా ఉద్యోగం కోసం లండన్ చేరుకున్నారు. అక్కడే పీహెచ్డీ పూర్తి చేసి, ఇన్నర్ లండన్ ఎడ్యుకేషనల్ అథారిటీ సర్వీస్‌లో చేరి, వివిధ కళాశాలల్లో అధ్యాపకుడిగా పనిచేశారు. మహాకవి శ్రీశ్రీ చేతిరాతతో ‘మహాప్రస్థానం’ ముద్రించడమే కాకుండా, ఆయన స్వయంగా చదివిన ‘మహాప్రస్థానం’ ఆడియో టేపును రికార్డు చేశారు. ఉప్పల, గూటాల ఇద్దరూ తెలుగునేలకు వెలుపల ఒడిశాలో పుట్టి పెరిగిన వారే! ఉప్పల లక్ష్మణరావు బరంపురంలో, గూటాల కృష్ణమూర్తి పర్లాకిమిడిలో పుట్టారు. ఒడిశాలోని ఈ రెండు పట్టణాలూ అప్పట్లో ఒకే జిల్లాలో–గంజాం జిల్లాలో ఉండేవి. పర్లాకిమిడి ఇప్పుడు గజపతి జిల్లా కేంద్రమైంది. తెలుగునేలకు వెలుపల ఉన్న ఈ రెండు పట్టణాలూ ఆధునిక తెలుగు భాషా సాహిత్యాల్లోని కీలకమైన మలుపులకు కేంద్రస్థావరాలుగా నిలిచాయి. వ్యావహారిక భాషోద్యమ సారథి గిడుగు రామమూర్తి పర్లాకిమిడి కేంద్రంగానే తన ఉద్యమాన్ని కొనసాగించారు. తెలుగు పత్రికారంగంలో వాడుక భాషను ప్రవేశపెట్టిన ఘనత గిడుగువారి శిష్యుడు తాపీ ధర్మారావుకు దక్కుతుంది. తాపీవారు బరంపురంలోని ఖల్లికోట కళాశాలలో గణితశాస్త్ర అధ్యాపకుడిగా కొన్నాళ్లు పనిచేశారు. తన మిత్రుడు దేవరాజు వెంకట కృష్ణారావుతో కలసి బరంపురంలో ‘వేగుచుక్క గ్రంథమాల’ను స్థాపించారు. దేవరాజు వెంకట కృష్ణారావు తెలుగులో తొలి డిటెక్టివ్ నవల ‘వాడే వీడు’ రచించారు. తెలుగునేలకు వెలుపల పురుడు పోసుకున్న వ్యావహారిక భాషోద్యమం, డిటెక్టివ్ సాహిత్యం తర్వాతికాలంలో తెలుగు భాషా సాహిత్యాలపై చూపిన ప్రభావం సామాన్యమైనది కాదు. తెలుగులో తొలి డిటెక్టివ్ నవలా రచయితగా మాత్రమే కాదు, గళ్లనుడికట్టు పదప్రహేళిక సృష్టికర్తగా కూడా దేవరాజు వెంకట కృష్ణారావు సాధించిన ఘనత చిరస్మరణీయం. తెలుగునేలకు వెలుపల దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ, వివిధ దేశాల్లోనూ తెలుగువాళ్లు భాషా సాంస్కృతిక సంఘాలను ఏర్పాటు చేసుకుని, భాషా సాంస్కృతిక పరిరక్షణ కోసం ఇతోధికంగా కృషి చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో తెలుగు భాషా సాంస్కృతిక సంస్థలు నేటికీ క్రియాశీలకంగానే పనిచేస్తున్నాయి. అమెరికా, యూరోప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, గల్ఫ్, తూర్పు, ఆగ్నేయాసియా దేశాల్లోనూ తెలుగువారు తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. మయన్మార్‌లో కొద్ది దశాబ్దాలుగా పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి గానీ, బ్రిటిష్ హయాంలో తెలుగువాళ్లు గణనీయమైన సంఖ్యలోనే అక్కడకు వలస వెళ్లేవారు. అప్పట్లో అది బర్మా. దాని రాజధాని రంగూన్. తెలుగువాళ్లు రంగూన్నే ‘రంగం’గా పిలుచుకునేవారు. ఇప్పటికీ వ్యాప్తిలో ఉన్న ఆనాటి జానపద గేయాల్లోనూ, సామెతల్లోనూ వినిపించే ‘రంగం’ రంగూనే! అప్పట్లో బర్మాలో మూడు తెలుగు దినపత్రికలు నడిచేవంటే ఇప్పటి తరానికి నమ్మశక్యం కాదు గానీ, అది వాస్తవ చరిత్ర. తెలుగు రాష్ట్రాలకు దూరంగా మనుగడ సాగిస్తున్న తెలుగు ప్రజలు, తమ ప్రాంతాల్లోని ప్రభుత్వాల సహకారం ఉన్నా, లేకున్నా, తమ భాషా సంస్కృతులను కాపాడుకోవడానికి తమ శాయశక్తులా కృషిని కొనసాగిస్తూనే ఉన్నారు. తెలుగు భాషలో విద్యాబోధనకు అవకాశాలు లేని ప్రాంతాల్లో తమ పిల్లలు కనీసం తెలుగు మాటలనైనా మరచిపోకుండా ఉండేందుకు స్వచ్ఛందంగా తెలుగు బడులు సైతం నిర్వహిస్తున్నారు. మన దేశంలోని పలు రాష్ట్రాల్లోనే కాకుండా, తెలుగువారు ఉండే కొన్ని దేశాల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటే, మరికొన్ని దేశాల్లోని విశ్వవిద్యాలయాలు ఎంతో ఉదారంగా తెలుగు బోధన, పరిశోధనలకు ఆస్కారం కల్పిస్తుండటం విశేషం. విదేశాల్లో సొంత విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకున్న ఘనతను తమిళులు మనవాళ్ల కంటే ముందే సాధించారు. ఏదేమైతేనేం, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణం ద్వారా తెలుగు అంతర్జాతీయ భాషగా వెలుగొందగలదని ఆశించవచ్చు. -
ఆ ఫోన్ దూకుడు మామూలుగా లేదుగా.. 40కోట్లు దాటిన యూజర్లు
హైదరాబాద్: అంతర్జాతీయంగా స్మార్ట్ఫోన్ల షిప్‌మెంట్‌పై కేనలిస్ డేటా విడుదల చేసింది. ఆ డేటా ప్రకారం వరల్డ్ వైడ్ గా స్మార్ట్ఫోన్ల వినియోగం 12శాతం పెరిగాయి. వాటిలో శాంసంగ్ 19శాతం స్మార్ట్ ఫోన్ల వినియోగంతో తొలిస్థానాన్ని దక్కించుకుంది. షియోమి17శాతంతో రెండో స్థానంలో ఉండగా.. 14శాతంతో యాపిల్ సైతం మూడో స్థానంలో నిలిచింది. వివో,ఒప్పో స్మార్ట్ఫోన్లు ఐదోస్థానంలో నిలిచింది. తొలి క్వార్టర్లో 10 శాతం మార్కెట్ వాటాతో ఐదో స్థానంలో ఉంది. గతేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 27 శాతం అధికంగా స్మార్ట్ఫోన్లను షిప్మెంట్ చేసినట్టు కేనలిస్ డేటా తెలియజేస్తోంది. గతేడాది కూడా వివో ఐదో స్థానంలో నిలవడం గమనార్హం. 50కు పైగా దేశాల్లో వివోకు విక్రయ నెట్వర్క్ ఉండగా.. 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారని కేనలిస్ డేటాలో పేర్కొంది. చదవండి: 'పెగసెస్' మీ స్మార్ట్‌ఫోన్ పై దాడి చేసిందో లేదో తెలుసుకోండిలా?! -
ఉరుము లేని పిడుగులా కరోనా కల్లోలం
కరోనా ఒక ఉత్పాతం... ఉరుము లేని పిడుగులా ఆకస్మికంగా ప్రపంచం నెత్తిపై పడింది.. ఇదేదో చిన్న క్రిమి కాదు ప్రజల ప్రాణాలని నిర్దాక్షిణ్యంగా తీసే అతి పెద్ద మహమ్మారని త్వరలోనే అర్థమైంది. అయినా దానిని కట్టడి చేయలేకపోతున్నాం ఎన్నో ప్రకృతి విలయాలు, ప్రాణాంతక వ్యాధుల్ని మించి కరోనా చెలరేగిపోతోంది.... సునామీలు, భూకంపాలు, వరదలు, తుపానులు, హరికేన్లు.. ఒకటేమిటి ఎన్నో ప్రకృతి విలయాలు చేసే విధ్వంసాన్ని మనం చూస్తూనే ఉన్నాం. మానవాళి మరెన్నో భయంకరమైన మహమ్మారుల్ని ఎదుర్కొంది. వాటి కంటే కొన్ని ప్రాణాంతక వ్యాధుల్ని మించి కరోనా మనల్ని పీడిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ వచ్చాక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఏప్రిల్ 17, 2021 నాటికి 219 దేశాల్లో కరోనాతో 30 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో సగం 7 దేశాల్లోనే నమోదయ్యాయి. 20 ఏళ్లలో సంభవించిన ప్రకృతి విలయాల్లో మరణాల కంటే కరోనాయే ఎక్కువ ఉసురు తీసింది. ►2000–2019 మధ్య సంభవించిన ప్రకృతి విలయాలతో మరణించిన వారు 9.4 లక్షల మంది అని ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ (యూఎన్‌ఏడీఆర్‌ఆర్) వెల్లడించింది. ►2004లో ఇండియా, ఇండోనేసియా తదితర దేశాలను ముంచిన సునామీ, 2008లో మయన్మార్‌ని ముంచేసిన నర్గీస్ తుపాన్, 2010లో హైతిలో వచ్చిన భూకంపం వంటివి ఉన్నాయి. ►ఇక ప్రపంచవ్యాప్తంగా 2017–2019 మధ్య మూడేళ్లలో అక్వయిర్డ్ ఇమ్యూనో డెఫిసీయన్సీ సిండ్రోమ్ 24 లక్షల మంది ప్రాణాలు తీస్తే, కరోనా 16 నెలల్లోనే 30 లక్షల మంది ప్రాణాలను మింగేసింది. ►క్షయ వ్యాధి రెండేళ్లలో 29 లక్షల ప్రాణాలను తీసింది. ►2000–19 మధ్య కాలంలో భారత్‌లో సంభవించిన 320 ప్రకృతి వైపరీత్యాల్లో 79,732 మంది ప్రాణాలు కోల్పోతే, కరోనాతో ఏడాది కాలంలోనే 1.86 లక్షల మంది మరణించారు. అమెరికాలో వాషింగ్టన్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యూయేషన్ (ఐహెచ్ఎంఈ) అంచనాల ప్రకారం ఏప్రిల్ రెండో వారంలో వివిధ రకాల వ్యాధులు విజృంభణలో కోవిడ్–19 మూడో ర్యాంకులో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా మరణాలు, లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆకలి మరణాలు అన్నింటినీ తీసుకొని, గత 20 ఏళ్లలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలతో పోల్చి చూసింది. జీవించాల్సిన దాని కంటే ముందుగా ఎంత మంది మరణించారో లెక్కలు వేసింది. గత ఏడాదిలో, ప్రకృతి వైపరీత్యాల కారణంగా మరణించిన వారి కంటే కోవిడ్ బారిన పడి ముందస్తుగా మరణించిన వారు ఆసియాలో మూడు రెట్లు ఎక్కువగా ఉంటే, యూరప్‌లో 30 రెట్లు ఎక్కువగా ఉంది. -
ప్రపంచంపై రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
న్యూఢిల్లీ: కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ప్రపంచదేశాల్లో పరిమితంగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. సాధారణ రోజుల్లో కన్నులపండువగా జరిగే ఈ వేడుకలపై ఈసారి కరోనా ప్రభావం పడింది. ఆయా దేశాల్లో స్థిరపడిన భారతీయులు ఈ సంబరాల్లో పాల్గొని జాతీయభావం చాటి చెప్పారు. చైనా, సింగపూర్, ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్తాన్ తదితర దేశాల్లో భారత 72వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు జరిగాయి. చైనా, సింగపూర్, ఆస్ట్రేలియాల్లోని ప్రవాస భారతీయులు పరిమితంగా జరుపుకున్నారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఆన్లైన్లో వీక్షించారు. చైనా రాజధాని బీజింగ్‌లో భారత గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా భారత రాయబార కార్యాలయంపై భారత రాయబారి విక్రమ్ మిశ్రి జాతీయ పతాకం ఎగురవేశారు. బీజింగ్‌లోనూ, పరిసర ప్రాంతాల్లో కోవిడ్‌ని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని అధికారులు, వారి కుటుంబాలకు మాత్రమే పరిమితం చేశారు. భారత జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేసిన ప్రసంగాన్ని మిశ్రి చదివి వినిపించారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో తాము గణతంత్ర వేడుకలను ఎంతో ఉత్సాహంగా చేసుకున్నట్లు భారత హై కమిషన్ ట్విటర్లో తెలిపింది. చార్జ్ డి అఫైర్స్ సురేశ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, రాష్ట్రపతి సందేశంలోని కొన్ని భాగాలను వినిపించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా దేశభక్తి గీతాలను ఆలపించినట్లు వెల్లడించింది. కోవిడ్ ఆంక్షలు పాటిస్తూ బంగ్లాదేశ్‌లో భారతీయులంతా గణతంత్ర దినోత్సవాలను చేసుకున్నట్లు ఢాకా హై కమిషన్ ట్వీట్ చేసింది. హై కమిషనర్ విక్రం దొరైస్వామి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. శ్రీలంక రాజధాని కొలంబోలోని భారత హై కమిషన్‌లో హై కమిషనర్ గోపాల్ బాగ్లే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా హై కమిషనర్ గీతేష్ శర్మ మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ సందేశాన్ని చదివి వినిపించారు. సింగపూర్‌లో భారత హై కమిషనర్ పి.కుమారన్ గణత్రంత ఉత్సవాలకు సారథ్యం వహించారు. రాష్ట్రపతి ఉపన్యాసాన్ని లైవ్‌లో ప్రసారం చేశారు. -
ప్రపంచదేశాలపై కరోనా విశ్వరూపం
-
ఒక్క కరోనా కేసు నమోదు కాని దేశాలివే..
ప్రపంచదేశాలను కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. అతి తక్కువ కాలంలోనే వందలాది దేశాలకు విస్తరించింది. లక్షలాది మంది ప్రాణాలను కూడా హరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా కరోనా కేసులే నమోదుకాని దేశాలు ఉన్నాయంటే నమ్మగలమా..? కానీ ఇది నిజం. ప్రపంచ వ్యాప్తంగా యూఎన్ఓ 193 దేశాలను అధికారికంగా గుర్తించింది. అందులోని 12 దేశాల్లో జూలై 19,2020 నాటికి ఎటువంటి కోవిడ్ కేసులు నిర్ధారించబడలేదు. ఈ దేశాలలో చాలా వరకు ఓషియానియాలోని పసిఫిక్ మహాసముద్ర ద్వీపదేశాలే ఉన్నాయి. వివరాలు: ఉత్తరకొరియా, పలావు, సమోవా, వనాటు, టువాలు, మార్షల్ దీవులు, పలావు, నౌరు, కిరిబాటి, మైక్రోనేషియా, సోలమన్ దీవులు, టోంగా దేశాలలో ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. (24 గంటల్లో 2.6 లక్షల మందికి) -
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి
-
28.27 లక్షలు దాటిన కరోనా కేసులు
-
నగరం మేల్కోవలసిన వేళ
-
ప్రపంచ వ్యాప్తంగా 24 లక్షల చేరువలో కరోనా కేసులు
-
లాక్డౌన్ బాట