ప్రపంచంలోనే అత్యంత పొడవైన మెట్రో రైల్ నెట్‌వర్క్‌ను కలిగిన నగరంగా చైనాలోని షాంఘై అవతరించింది. తాజాగా రెండు డ్రైవర్‌లెస్ మెట్రో లైన్‌లు.. లైన్14, ఫేజ్ వన్ ఆఫ్ లైన్18ను ప్రారంభించడంతో ప్రపంచంలో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా నిలిచింది.
షాంఘై మెట్రో నెట్‌వర్క్ ప్రత్యేకతలు..
తాజాగా కొత్త మెట్రో లైన్ల ప్రారంభోత్సవంతో షాంఘై సబ్‌వే నెట్‌వర్క్ 831కిలో మీటర్ల పొడవు విస్తరించింది. అదేవిధంగా ఆటోమేటిక్ లేదా డ్రైవర్‌లెస్ మెట్రో లైన్ల సంఖ్య 5కు చేరింది. పలు మెట్రో మార్గాలకు అనధికారిక మారుపేర్లు ప్రచారంలో ఉన్నాయి. లైన్10ను ‘గోల్డెన్ లైన్’గా స్థానికులు పిలుస్తారు. ఇది యుయువాన్ గార్డెన్, జింటియాండి, ఈస్ట్ నాన్జింగ్ రోడ్‌లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల గుండా ప్రయాణిస్తుంది. లైన్6 గులాబీ రంగులో ఉన్నందున ‘హలో కిట్టి లేన్’ అని ప్రయాణికులు పిలుచుకుంటారు. షాంఘై మెట్రో నెట్‌వర్క్‌లో 508 స్టేషన్లు ఉన్నాయి.
చైనాలోని బీజింగ్ మెట్రో నెట్‌వర్క్.. రెండో అతిపెద్ద సబ్‌వే వ్యవస్థను కలిగి ఉంది. బీజింగ్ మెట్రో ట్రాక్ పొడవు 780కిలో మీటర్లు విస్తరించింది. 2021లో సుమారు 53 కిలోమీటర్ల లైన్లను నిర్మించారు. బీజింగ్ డైలీ నివేదికల ప్రకారం.. బీజింగ్ మెట్రో నెట్‌వర్క్‌లో 450 స్టేషన్లు ఉన్నట్లు తెలుస్తోంది. మెట్రో ప్రయాణానికి అన్ని సౌకర్యాలు కల్పించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment