సబ్సిడరీ ఏర్పాటు
సప్లయ్‌చైన్, ప్రాజెక్ట్ నిర్వహణ సేవలు
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ చైనాలోకి అడుగుపెట్టింది. సప్లయ్ చైన్ సొల్యూషన్లు, ప్రాజెక్టు నిర్వహణ సేవలను ఆఫర్ చేసేందుకు వీలుగా ఓ సబ్సిడరీ కంపెనీని ఏర్పాటు చేసింది. సింగపూర్ కేంద్రంగా పనిచేసే తన సబ్సిడరీ కంపెనీ అదానీ గ్లోబల్ పీటీఈ (ఏజీపీటీఈ) షాంఘై కేంద్రంగా ‘అదానీ ఎనర్జీ రీసోర్సెస్ (షాంఘై) కో’ (ఏఈఆర్‌సీఎల్)ను ఏర్పాటు చేసినట్టు అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం ఇచి్చంది.
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కంపెనీల చట్టం కింద ఏఈఆర్‌సీఎల్‌ను సెపె్టంబర్ 2న ఏర్పాటు చేశామని, ఇది ఇంకా వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉందని తెలిపింది. ఎయిర్‌పోర్ట్‌లు, మైనింగ్, రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణం, నీటి ప్రాజెక్టులు, గ్రీన్ ఎనర్జీ తదితర రంగాల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కెన్యాలోని నైరోబీలో జోమో కెన్యట్టా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి గాను ఆ దేశ ప్రభుత్వంతో చర్చలు కూడా నిర్వహిస్తోంది. ఇది సఫలమైతే ఆ సంస్థకు భారత్ వెలుపల ఇది మొదటి ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment