Subsidiary Company
-
చైనాలోకి అదానీ అడుగు
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ చైనాలోకి అడుగుపెట్టింది. సప్లయ్ చైన్ సొల్యూషన్లు, ప్రాజెక్టు నిర్వహణ సేవలను ఆఫర్ చేసేందుకు వీలుగా ఓ సబ్సిడరీ కంపెనీని ఏర్పాటు చేసింది. సింగపూర్ కేంద్రంగా పనిచేసే తన సబ్సిడరీ కంపెనీ అదానీ గ్లోబల్ పీటీఈ (ఏజీపీటీఈ) షాంఘై కేంద్రంగా ‘అదానీ ఎనర్జీ రీసోర్సెస్ (షాంఘై) కో’ (ఏఈఆర్సీఎల్)ను ఏర్పాటు చేసినట్టు అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం ఇచి్చంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కంపెనీల చట్టం కింద ఏఈఆర్సీఎల్ను సెపె్టంబర్ 2న ఏర్పాటు చేశామని, ఇది ఇంకా వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉందని తెలిపింది. ఎయిర్‌పోర్ట్‌లు, మైనింగ్, రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణం, నీటి ప్రాజెక్టులు, గ్రీన్ ఎనర్జీ తదితర రంగాల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కెన్యాలోని నైరోబీలో జోమో కెన్యట్టా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి గాను ఆ దేశ ప్రభుత్వంతో చర్చలు కూడా నిర్వహిస్తోంది. ఇది సఫలమైతే ఆ సంస్థకు భారత్ వెలుపల ఇది మొదటి ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ అవుతుంది. -
టాటా గ్రూప్ ‘దశావతారం’!
న్యూఢిల్లీ: టాటా గ్రూపునకు నూతన జవసత్వాలు తీసుకొచ్చే దిశగా కసరత్తు జరుగుతోంది. గ్రూపు పరిధిలో 100 వరకు కంపెనీలుండగా, వీటిల్లో 30 మాత్రమే లిస్టయి ఉన్నాయి. వీటికి అదనంగా 1,000 వరకు సబ్సిడరీ కంపెనీలు కూడా ఉన్నాయి. భారీ సంఖ్యలో కంపెనీలు ఉండటంతో ఏవో కొన్ని మినహాయిస్తే మిగిలినవి అంతగా రాణించడం లేదు. దీంతో చైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో గ్రూపు కంపెనీలను 10 వెర్టికల్స్‌గా వర్గీకరించే ప్రయత్నం జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది. ఒకే తరహా వ్యాపారాల్లో ఉన్న వాటిని ఓ విభాగం కిందకు తీసుకురావాలని, తద్వారా వాటి మధ్య మంచి సమన్వయం కల్పించడం ద్వారా ఖర్చులను ఆదా చేసుకోవడంతో పాటు సమర్థతను పెంచొచ్చని యాజమాన్యం భావిస్తోంది. హోల్డింగ్ కంపెనీల ప్రతినిధులు ఆయా వెర్టికల్స్‌గా అధిపతిగా వ్యవహరిస్తారు. తద్వారా కంపెనీల మధ్య సమన్వయం పెరిగేలా, కార్యకలాపాలు సాఫీగా నడిచేలా చూస్తారు. టాటా మోటార్స్ ఇటీవలే జాగ్వార్ ల్యాండ్ రోవర్‌కు సంబంధించి రూ.3.1 బిలియన్ డాలర్లను నష్టం కింద ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చర్యను చురుకైన, శక్తిమంతమైన ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసి, వేగవంతమైన వృద్ధిని అందుకునేందుకు చేపట్టినదిగా చంద్రశేఖరన్ ఆ సందర్భంలో పేర్కొన్నారు. ప్రతీ వెర్టికల్‌కు హెడ్‌గా వ్యవహరించే వ్యక్తి ఆ విభాగంలోని కంపెనీల మధ్య సమన్వయ కర్త పాత్రను పోషించనున్నారు. ఈ వ్యక్తి టాటా సన్స్ బోర్డు సభ్యుడై ఉండనక్కర్లేదని ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ఫలితమిచ్చేనా..? ‘‘వెర్టికల్‌గా వర్గీకరించడం అనేది సమర్థతలను తీసుకొస్తుంది. ఒకే తరహా వ్యాపారాల మధ్య సహకారం, సమన్వయానికి వీలు కల్పిస్తుంది. దీంతో నిర్వహణ మెరుగవుతుంది. అయితే, ఈ స్థిరీకరణ అనేది విడిగా కంపెనీలకున్న నిర్వహణ పరమైన స్వేచ్ఛకు భంగం కలిగించేదిగా ఉండకూడదు’’ అని బిర్లా సన్‌లైఫ్ అస్సెట్ మేనేజ్మెంట్ సీఈవో ఎ.బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. ఈ పునర్నిర్మాణ పై కసరత్తు జరుగుతున్నట్లు టాటా గ్రూపు ఎగ్జిక్యూటివ్ ఒకరు ధ్రువీకరించారు. ఈ అంశాలు వేగంగా పరిష్కారమయ్యేవి కావని, కొన్నింటి పరిష్కారానికి కొన్ని నెలలు లేదా ఏడాది పట్టొచ్చన్నారు. ‘‘కొన్ని వ్యాపార సులభతరం కోసం దృష్టి పెట్టినవి. మరికొన్ని వాటి పరిధి విస్తరణ కోసం. 2018లో రుణ భారం తగ్గించుకునేందుకు, టాటా కంపెనీల పునర్నిర్మాణానికి, ఒక కంపెనీల్లో మరో కంపెనీకి ఉన్న వాటాల స్థిరీకరణకు, కీలక ఆస్తుల కొనుగోలుకు రూ.70,000 కోట్లు ఖర్చు చేశాం’’ అని టాటా గ్రూపు ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. నూతన నిర్మాణం కీలక వ్యాపారాలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు సాయపడుతుందన్నారు. -
వేతన భారం మోయలేం..!
► జేబీసీసీఐ నుంచి సింగరేణిని తప్పించాలి..? ► కేంద్రానికి తెలంగాణ సర్కారు ప్రతిపాదన ► కోలిండియాకు లేఖ రాసిన కేంద్ర ప్రభుత్వం..? గోదావరిఖని(కరీంనగర్) : కోలిండియాలోని తొమ్మిది సబ్సిడరీ సంస్థలలో సింగరేణి ఒకటి. వేతన ఒప్పందం, కరువు భత్యం, ప్రాఫిట్ లింక్డ్ రివార్డు బోనస్ మినహా కోలిండియూతో ఎలాంటి సంబంధాలు ఉండవు. బొగ్గుగని కార్మికులకు తొమ్మిదవ వేతన ఒప్పంద కాల పరిమితి జూన్ 30తో ముగియనుంది. జూలై 1 నుంచి 10వ వేతన ఒప్పందం అమలులోకి వస్తుంది. కార్మిక సంఘాల డిమాండ్ మేరకు వేతనాలు భారీగా పెరిగే అవకాశం ఉం ది. ఈ భారమంతా సింగరేణిపైనే పడుతుంది. ప్రస్తుతం కంపెనీ వద్ద అంతగా నిధులు లేవు. కాబట్టి కోలిండియూ పరిధి జేబీసీసీఐ(జాయింట్ బైపార్టియేటెడ్ కమిటీ ఫర్ కోలిండియా) కమిటీ నుంచి సింగరేణిని తప్పించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపినట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర సర్కారు సైతం కోలిండియూకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఒక వేళ జేబీసీసీఐ కమిటీ నుంచి సింగరేణిని మినహారుుస్తే వేతన సవరణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. ఇక ఎప్పుడైనా సవరిం చుకోవచ్చనే ఆలోచనతో టీఆర్ఎస్ సర్కార్ ఈ ప్రతిపాద న చేసిందని, దీని వల్ల కార్మికులకు వేతనాల పెరుగుదలతోపాటు కరువు భత్యం, ప్రాఫిట్ లింక్డ్ రివార్డు బోనస్ కోల్పోతారని పేర్కొంటున్నాయి. 50 శాతం పెంపుదలకు సంఘాల డిమాండ కోలిండియా సబ్సిడరీ కంపెనీల్లో ఒకటైన సింగరేణిలో 1973 నుంచి వేతన ఒప్పందం అమలవుతోంది. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి వేతనాలు పెంచుకోవడానికి జేబీసీసీఐని 1972లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న తొమ్మిదవ వేతన ఒప్పందం(2011 నుంచి 2016 జూన్ 31 వరకు)లో 25 శాతం వేతనాలు పెరిగారుు. రాబోయే 10వ వేతన ఒప్పందంలో కార్మిక సంఘాలు 50 శాతం వరకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు జేబీసీసీఐలో సభ్యత్వం ఉన్న ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ జాతీ య సంఘాలు కోల్ఇండియా యాజమాన్యానికి, కేంద్ర ప్రభుత్వానికి ఉమ్మడి నివేదిక అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల సాకుతో.. అరుుతే ఇప్పటికే సింగరేణి సంస్థ జైపూర్‌లో థర్మల్ విద్యు త్ ప్రాజెక్టు నిర్మాణం కోసం పారిశ్రామిక బ్యాంకు వద్ద అప్పులు చేయాల్సి వచ్చింది. కర్ణాటక విద్యుత్ సంస్థతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జెన్కోల నుంచి సింగరేణి కి సుమారు ఆరువేల కోట్ల బకారుులు రావాలి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 66 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడానికి 9 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి నిధు లు సమకూర్చు కోవాల్సి ఉంది. ఈ తరుణంలో 10వ వేజ్‌బోర్డు ఒప్పందంలో వేతనాలను పెంచితే అందుకు అనుగుణంగా సింగరేణి చెల్లింపులు చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని భావించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవించినట్టు తెలిసింది. ఆ మేరకు కేంద్రం కూడా సింగరేణి లేకుండా జేబీసీసీఐ కమిటీని నిర్మాణం చేయాలని కోల్‌ఇండియాకు లేఖ రాసినట్టు సమాచారం. ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం సింగరేణి సంస్థను కోల్‌ఇండియాకు చెందిన జేబీసీసీఐ కమిటీ నుంచి తప్పించాలనే కుట్ర చేస్తున్నారు. ఇదే జరిగితే సింగరేణి కార్మికులు చాలా నష్టపోతారు. వేతనాల పెరుగుదలతో పాటు కరువు భత్యం, ప్రాఫిట్ లింక్డ్ రివార్డు బోనస్‌ను కోల్పోతారు. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న టీడీపీ ప్రభుత్వ హయాంలో కోల్ఇండియా నుంచి సింగరేణిని తప్పించాలని చూస్తే కార్మిక సంఘాలన్నీ పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని విరమించుకున్నది. ప్రస్తుతం కూడా కోల్‌ఇండియాలోని హెచ్ఎంఎస్ ప్రతినిధుల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం. - రియాజ్‌అహ్మద్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి -
గతవారం బిజినెస్
విస్తరణ దిశగా వాల్‌మార్ట్ ఇండియా అమెరికాకు చెందిన వాల్‌మార్ట్ సంస్థ అనుబంధ కంపెనీ వాల్‌మార్ట్ ఇండియా మార్కెట్ విస్తరణపై దృష్టి కేంద్రీకరించింది. వచ్చే 4-5 ఏళ్లలో భారత్‌లో కొత్తగా 50కి పైగా స్టోర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం వాల్‌మార్ట్‌కు భారత్‌లో 20 స్టోర్లు ఉన్నాయి. 16% కుప్పకూలిన గ్రీస్ స్టాక్ మార్కెట్ గ్రీస్ స్టాక్ మార్కెట్ గత సోమవారం భారీగా పతనమైంది. ఐదు వారాల తర్వాత ఆరంభమైన ఏథెన్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ప్రధాన సూచీ ఒక దశలో 22 శాతం వరకూ క్షీణించింది. చివరకు 16 శాతం నష్టంతో ముగిసింది. 1985 తర్వాత ఇదే అత్యంత అధ్వానమైన ఒక రోజు నష్టం. బ్యాంక్, ఆర్థిక సేవల సంస్థల షేర్లు దాదాపు 30 శాతం వరకూ నష్టపోయాయి. 50 కోట్ల డాలర్ల సమీకరణలో స్నాప్‌డీల్ స్నాప్‌డీల్ తాజాగా ఆలీబాబా, సాఫ్ట్‌బ్యాంక్, ఫాక్స్‌కాన్ తదితర సంస్థల నుంచి 50 కోట్ల డాలర్లు (రూ. 3,000 కోట్లకుపైగా) సమీకరించనుంది. ఇందుకోసం వాటితో చర్చలు జరుగుతున్నాయని, మరికొద్ది వారాల్లో ఫండింగ్ వివరాలు వెల్లడి కావొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెలలో 4 కంపెనీలు ఐపీఓకు ఈ నెలలో నాలుగు కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. దిలిప్ బిల్డ్‌కాన్(రూ.650 కోట్లు), నవ్కార్ కార్పొ(రూ.510 కోట్లు), పవర్ మెక్ ప్రాజెక్ట్స్(రూ.270 కోట్లు), ప్రభాత్ డెయిరీ (రూ.300 కోట్లు)..ఈ నాలుగు కంపెనీలు కలసి దాదాపు రూ.1,820 కోట్ల మేర నిధులు సమీకరించనున్నాయి. ఈ నెల 7న ప్రారంభమైన పవర్ మెక్ ఐపీఓ 11న ముగుస్తుంది. మిగిలిన మూడు కంపెనీల ఐపీఓలు ఆ తర్వాత మొదలవుతాయి. మళ్లీ దేశీ మార్కెట్లోకి థామ్సన్ బ్రాండ్ సుమారు పదేళ్ల విరామం అనంతరం థామ్సన్ బ్రాండ్ దేశీయ మార్కెట్లోకి అడుగు పెడుతోంది. ఇందుకోసం హైదరాబాద్ సమీపంలో రూ. 300 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. కేవలం థామ్సన్ బ్రాండ్ ఉత్పత్తులను తయారు చేసే విధంగా రిసెల్యూట్ ఎలక్ట్రానిక్స్‌తో కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. మరో కంపెనీగా బీఎస్ఎన్ఎల్ టవర్ల విభాగం ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ టవర్ల వ్యాపార విభాగాన్ని విడగొట్టి, ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేం ద్ర కేబినెట్ బుధవారం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. త్వరలో ఐడీఎఫ్సీ బ్యాంక్ కార్యకలాపాలు కొత్తగా బ్యాంకింగ్ లెసైన్సు పొందిన ఐడీఎఫ్సీ బ్యాంక్ ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఆర్బీఐ నుంచి నిర్వహణ పరమైన లెసైన్సులు కూడా వచ్చాక డీమెర్జర్ స్కీమ్ అమలవుతుందని బీఎస్ఈకి ఐడీఎఫ్సీ తెలిపింది. జూలై 23న ఐడీఎఫ్సీ బ్యాంకుకు ఆర్బీఐ లెసైన్సు మంజూరు చేసింది. 20 శాఖలు, రూ. 55,000 కోట్ల రుణ ఖాతాలతో కార్యకలాపాలు ప్రారంభించాలని ఐడీఎఫ్సీ బ్యాంకు యోచిస్తోంది. ఆస్ట్రేలియాలో అదానీ ప్రాజెక్ట్‌కు ఎదురుదెబ్బ ఆస్ట్రేలియాలో తలపెట్టిన బొగ్గు గనుల ప్రాజెక్టు విషయంలో అదానీ గ్రూప్‌నకు ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఈ ప్రాజెక్టుకు లభించిన పర్యావరణ అనుమతులను ఆస్ట్రేలియా కోర్టు పక్కన పెట్టింది. దాదాపు 16.5 బిలియన్ డాలర్ల ఈ వివాదాస్పద ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు, స్థానికులు కేసు దాఖలు చేయడంతో కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. స్టాక్ మార్కెట్లో పీఎఫ్ పెట్టుబడులు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తొలిసారిగా స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ద్వారా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం తెలిపారు. ప్రస్తుతం ఏటా రూ. 5,000 కోట్ల మేర పెట్టుబడులు ఉంటాయని, వచ్చే ఏడాది నుంచి దీన్ని 15 శాతానికి పెంచే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్‌కి చెందిన రెండు ఇండెక్స్ ఆధారిత ఈటీఎఫ్‌ల ద్వారా ఈ పెట్టుబడులు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. చైనా మార్కెట్లకు ప్రభుత్వం బూస్ట్ స్టాక్ మార్కెట్ల పతనాన్ని నిలువరించే దిశగా షేర్ల ధరలకు ఊతమిచ్చేందుకు చైనా ప్రభుత్వం గత రెండు నెలల్లో ఏకంగా 900 బిలియన్ యువాన్లు (147 బిలియన్ డాలర్లు, దాదాపు రూ. 9 లక్షల కోట్లు) వెచ్చించింది. మార్కెట్లకు సహాయక ప్యాకేజీ కింద.. స్టాక్స్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ రంగ చైనా సెక్యూరిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (సీఎస్ఎఫ్) తదితర సంస్థలకు నిధులు అందించింది. దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ 4జీ సేవలు దేశంలో తొలి 4జీ సేవలను ప్రారంభించిన టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ఆ సేవలను మరిన్ని పట్టణాలకు విస్తరించింది. దేశవ్యాప్తంగా దాదాపు 296 పట్టణాల్లో 4జీ సేవలను ఆవిష్కరించినట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. అలాగే 4జీ సేవల ఆవిష్కరణతో పాటు ‘వింక్ మూవీస్’ అనే మొబైల్ యాప్‌ను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. 4జీ హ్యాండ్సెట్ల తయారీ, విక్రయాల కోసం శామ్సంగ్, ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీలతో జతకడుతున్నట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.14,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. డీల్స్.. - భారతీ ఎయిర్టెల్ సంస్థ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ అందించే వైటీఎస్ సొల్యూషన్స్‌ను కొనుగోలు చేసింది. - అదానీ గ్రూప్ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్, ప్రపంచ అతిపెద్ద కాంట్రాక్ట్ తయారీదారు ఫాక్స్‌కాన్‌తో కలసి ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతోంది. - టాటా సన్స్ తన పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో పునర్వ్యస్థీ కరణలో భాగంగా టైటాన్ కంపెనీలో 2.18 శాతం వాటాను దాదాపు రూ.680 కోట్లకు టాటా స్టీల్ నుంచి కొనుగోలు చేయనున్నది. ఈ వాటా కొనుగోలుతో టైటాన్లో టాటా సన్స్ వాటా 17.40 శాతం నుంచి 19.59 శాతానికి పెరుగుతుంది. - అమెరికాకు చెందిన బయో టెక్నాలజీ సంస్థ అమ్జెన్తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకుంది.