వేతన భారం మోయలేం..! | Kolindiya letter to Central government? | Sakshi
Sakshi News home page

వేతన భారం మోయలేం..!

Published Sat, May 28 2016 2:44 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

వేతన భారం మోయలేం..! - Sakshi

వేతన భారం మోయలేం..!

జేబీసీసీఐ నుంచి సింగరేణిని తప్పించాలి..?
కేంద్రానికి తెలంగాణ సర్కారు ప్రతిపాదన
►  కోలిండియాకు లేఖ రాసిన కేంద్ర ప్రభుత్వం..?

 
గోదావరిఖని(కరీంనగర్) : కోలిండియాలోని తొమ్మిది సబ్సిడరీ సంస్థలలో సింగరేణి ఒకటి. వేతన ఒప్పందం, కరువు భత్యం, ప్రాఫిట్ లింక్డ్ రివార్డు బోనస్ మినహా కోలిండియూతో ఎలాంటి సంబంధాలు ఉండవు. బొగ్గుగని కార్మికులకు తొమ్మిదవ వేతన ఒప్పంద కాల పరిమితి జూన్ 30తో ముగియనుంది. జూలై 1 నుంచి 10వ వేతన ఒప్పందం అమలులోకి వస్తుంది. కార్మిక సంఘాల డిమాండ్ మేరకు వేతనాలు భారీగా పెరిగే అవకాశం ఉం ది. ఈ భారమంతా సింగరేణిపైనే పడుతుంది. ప్రస్తుతం కంపెనీ వద్ద అంతగా నిధులు లేవు. కాబట్టి కోలిండియూ పరిధి జేబీసీసీఐ(జాయింట్ బైపార్టియేటెడ్ కమిటీ ఫర్ కోలిండియా) కమిటీ నుంచి సింగరేణిని తప్పించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపినట్లు సమాచారం.

ఈ మేరకు కేంద్ర సర్కారు సైతం కోలిండియూకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఒక వేళ జేబీసీసీఐ కమిటీ నుంచి సింగరేణిని మినహారుుస్తే వేతన సవరణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. ఇక ఎప్పుడైనా సవరిం చుకోవచ్చనే ఆలోచనతో టీఆర్‌ఎస్ సర్కార్ ఈ ప్రతిపాద న చేసిందని, దీని వల్ల కార్మికులకు వేతనాల పెరుగుదలతోపాటు కరువు భత్యం, ప్రాఫిట్ లింక్డ్ రివార్డు బోనస్ కోల్పోతారని పేర్కొంటున్నాయి.


 50 శాతం పెంపుదలకు సంఘాల డిమాండ
కోలిండియా సబ్సిడరీ కంపెనీల్లో ఒకటైన సింగరేణిలో 1973 నుంచి వేతన ఒప్పందం అమలవుతోంది. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి వేతనాలు పెంచుకోవడానికి జేబీసీసీఐని 1972లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న తొమ్మిదవ వేతన ఒప్పందం(2011 నుంచి 2016 జూన్ 31 వరకు)లో 25 శాతం వేతనాలు పెరిగారుు. రాబోయే 10వ వేతన ఒప్పందంలో కార్మిక సంఘాలు 50 శాతం వరకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు జేబీసీసీఐలో సభ్యత్వం ఉన్న ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ జాతీ య సంఘాలు కోల్‌ఇండియా యాజమాన్యానికి, కేంద్ర ప్రభుత్వానికి ఉమ్మడి నివేదిక అందజేశారు.


 ఆర్థిక ఇబ్బందుల సాకుతో..
 అరుుతే ఇప్పటికే సింగరేణి సంస్థ జైపూర్‌లో థర్మల్ విద్యు త్ ప్రాజెక్టు నిర్మాణం కోసం పారిశ్రామిక బ్యాంకు వద్ద అప్పులు చేయాల్సి వచ్చింది. కర్ణాటక విద్యుత్ సంస్థతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జెన్‌కోల నుంచి సింగరేణి కి సుమారు ఆరువేల కోట్ల బకారుులు రావాలి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 66 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడానికి 9 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి నిధు లు సమకూర్చు కోవాల్సి ఉంది. ఈ తరుణంలో 10వ వేజ్‌బోర్డు ఒప్పందంలో వేతనాలను పెంచితే అందుకు అనుగుణంగా సింగరేణి చెల్లింపులు చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని భావించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవించినట్టు తెలిసింది. ఆ మేరకు కేంద్రం కూడా సింగరేణి లేకుండా జేబీసీసీఐ కమిటీని నిర్మాణం చేయాలని కోల్‌ఇండియాకు లేఖ రాసినట్టు సమాచారం.
 
 
 ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం  
 సింగరేణి సంస్థను కోల్‌ఇండియాకు చెందిన జేబీసీసీఐ కమిటీ నుంచి తప్పించాలనే కుట్ర చేస్తున్నారు. ఇదే జరిగితే సింగరేణి కార్మికులు చాలా నష్టపోతారు. వేతనాల పెరుగుదలతో పాటు కరువు భత్యం, ప్రాఫిట్ లింక్డ్ రివార్డు బోనస్‌ను కోల్పోతారు. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న టీడీపీ ప్రభుత్వ హయాంలో కోల్‌ఇండియా నుంచి సింగరేణిని తప్పించాలని చూస్తే కార్మిక సంఘాలన్నీ పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని విరమించుకున్నది. ప్రస్తుతం కూడా కోల్‌ఇండియాలోని హెచ్‌ఎంఎస్ ప్రతినిధుల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం.      - రియాజ్‌అహ్మద్, హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement