కార్మిక వ్యతిరేక విధానాలు అవలబిస్తున్న కేంద్రం
Published Sat, Aug 13 2016 10:06 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
నిర్మల్‌అర్బన్ : కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఏఐటీయూసీ జిల్లా ముఖ్య కార్యదర్శి విలాస్ పేర్కొన్నారు. పట్టణంలోని ఎస్టీయూ సంఘ భవనంలో శనివారం సార్వత్రిక సమ్మె పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనం రూ. 18వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఔట్‌సోర్సింVŠ , కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి రెగ్యూలర్ విధానంలో పోస్టులను భర్తీ చేయాలని పేర్కొన్నారు.
అసంఘటిత, వ్యవసాయ రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక వి«ధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 2వ తేదీన దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేపడుతున్నట్లు చెప్పారు. సమ్మెలో కార్మికులంతా పాల్గొనాలని కోరారు. ఇందులో నాయకులు ఎస్‌ఎన్‌రెడ్డి, శ్రీనివాస్‌చారి, ఫయాజ్, సతీష్, బాపురావు, సలాం, బాబులాల్, పద్మకుమారి తదితరులున్నారు.
Advertisement