భవిష్యనిధికి భద్రతేది..? | CM PF money in the share market of workers | Sakshi
Sakshi News home page

భవిష్యనిధికి భద్రతేది..?

Published Fri, Apr 8 2016 2:03 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

భవిష్యనిధికి భద్రతేది..? - Sakshi

భవిష్యనిధికి భద్రతేది..?

షేర్ మార్కెట్‌లో కార్మికుల సీఎంపీఎఫ్ సొమ్ము
లాభాలొస్తే సరి.. లేకుంటే హరి
స్పెషల్ ఆర్డినెన్స్ తెచ్చిన కేంద్రం
బొగ్గు బిడ్డల పీఎఫ్ చెల్లింపులకు  గడ్డుకాలమే

 
రామకృష్ణాపూర్(ఆదిలాబాద్) : గని కార్మికులకు రాబోవు కాలంలో పెన్షన్ చెల్లిం పులు కష్టతరంగా మారనున్నాయి. కార్మికులు జీవితకాంలో కష్టపడి సంపాదించిన వేతనం నుంచి దాచుకు న్న పెన్షన్ డబ్బును కేంద్రం ప్రభుత్వం స్పెషల్ ఆర్డినె న్స్ తీసుకువచ్చి షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టింది. లాభాలొస్తే సరేసరి.. లేదంటే పీఎఫ్ సొమ్ముకు గ్యారెంటీ ఎవరనేది స్పష్టత లేదు. దీంతో కార్మిక వర్గం తీవ్ర ఆందోళనకు గురవుతోంది.

తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి(ఎస్‌సీసీఎల్)తో పాటు వివిధ రాష్ట్రాల్లోని సీసీఎల్, ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్, మహానది కోల్‌ఫీల్డ్స్, నార్త్‌ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్, సౌత్ ఈస్ట్రన్ కోల్డ్‌ఫీల్డ్స్ కంపెనీలు బొగ్గు ఉత్పత్తి రంగంలో ఉన్నారుు. ఇవన్నీ కోలిండియూ సబ్సిడరీ కంపెనీలుగా కొనసాగుతున్నారుు. గతంలో ఆయా కంపెనీల్లో పనిచేసే వారికి ఉద్యోగ విరమణ చేసిన అనంతరం పెన్షన్ పథకం వర్తింపజేయడానికి ఆయూ కంపెనీలు పీఎఫ్ రికవరీ విధానాన్ని అమలు చేస్తున్నా యి. ఒకప్పుడు 7.5 లక్షల మంది కార్మికులు ఉండగా ఇప్పటి వరకు 3.5 లక్షల మంది తగ్గిపోయూరు. ఇందులో కొందరు ఉద్యోగ విరమణ చేయగా మరి కొందరు వీఆర్‌ఎస్ పొందారు. ఇంకొందరు గోల్డెన్ హ్యాండ్‌షేక్ పథకం కింద దిగిపోయూరు. ప్రస్తుతం ఆయూ కంపెనీల్లో 4 లక్షల మంది మాత్రమే పనిచేస్తున్నారు. సింగరేణిలో 54వేల మంది ఉన్నారు.


 పెన్షన్ ట్రస్ట్ బోర్డులో రూ.70వేల కోట్లు
కోలిండియాలోని గని కార్మికులకు పెన్షన్ చెల్లించేం దు కు ఏర్పాటు చేసిన భవిష్య నిధి(పెన్షన్ ట్రస్ట్ బోర్డు) రూ.50వేల కోట్ల వరకు ఉంది. వీటితోపాటు ఇప్పటికే చనిపోయిన, పెన్షన్ అమలు కాని కార్మికులకు చెందిన మరో రూ.20వేల కోట్లు ఉన్నాయి. దీనిని కార్మికుల వేతనాల నుంచి ఆయా బొగ్గు కంపెనీలు రికవరీ(పెన్ష న్ కోసం) చేశాయి. ఈ నిధులపై వివిధ సంస్థలు కన్నేశారుు. ప్రపంచబ్యాంకు సైతం తమ బ్యాంకులో పెట్టాలని ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. అలాగే ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) సైతం విశ్వయత్నం చేసినా ప్రయత్నాలు ఫలించ లేదు. అరుుతే ప్రస్తు తం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం బొగ్గుగని కార్మికుల పెన్షన్ నిధులను షేర్ మార్కెట్‌లోకి తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


చెల్లింపులపై ఆందోళన..
బొగ్గు కంపెనీల్లో కార్మికుల సంఖ్య తగ్గిపోతోంది. ఏడున్నర లక్షల నుంచి ప్రస్తుతం 4 లక్షలకు పడిపోయింది. సాధారణంగా బొగ్గు సంస్థల్లో కొత్త నియామకాలు చేపడితే ఎలాంటి గడ్డుపస్థితులు ఉండవు. కార్మికుల సంఖ్య నిలకడగా ఉన్నప్పుడే వారందరి వేతనాల్లోంచి పీఎఫ్ కోత విధించి దాన్ని ట్రస్టుకు మళ్లించడం రివాజు. అరుుతే కంపెనీల్లో కొత్త నియామకాలకు కాలం చెల్లిపోయింది. కార్మికుల సంఖ్య పడిపోరుు రికవరీ నిధి తగ్గిపోతోంది. సర్కారు తీసుకున్న నిర్ణయం ఫలితంగా ఉద్యోగ విరమణ పొందిన, పొందుతున్న వారికి పెన్షన్ చెల్లించే విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
 
 
 కార్మికుల సొమ్ముతో వ్యాపారం సరికాదు

 సీఎంపీఎఫ్ అనేది కార్మికుల సంక్షేమ నిధి. రిటైర్మెంట్ తర్వాత కార్మికుల సంక్షేమానికి వినియోగించాల్సింది. అటువంటి సొమ్మును షేర్‌మార్కెట్లో పెట్టడం సరికాదు. షేర్ మార్కెట్ అంటేనే జూదం లాంటిది. ఒకసారి డబ్బులు రావొచ్చు, పోవొచ్చు. కార్మికుల పెన్షన్ సొ మ్ము తో కేంద్రం వ్యాపారం చేయటం సరికాదు. దీనిని ఏఐటీయూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. త్వరలో దేశవ్యాప్త ఆందోళనలు చేపడతాం. - వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement